తెలుగు వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న నటుడు మోహన్ బాబు. హీరోగా, విలన్‌గా ప్రత్యేక పాత్రలతో తెలుగువారిని మెప్పించారు. అప్పటి స్టార్ హీరోల సినిమాల్లో తన విలనిజంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కథానాయకుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు. అలా తన కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచివాటిలో 1982లో వచ్చిన 'ప్రతిజ్ఞ' చిత్రం ఒకటిగా ఎప్పటికీ గుర్తుంటుంది. తాజాగా ఆ సినిమాలోని ఓ క్లిప్‌ను సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు మోహన్ బాబు.
(ఇది చదవండి: ‘మంచు’ ఫ్యామిలీ వార్.. కీలక విషయాలు బయటపెట్టిన పని మనిషి)
మోహన్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..' ఓ అందమైన గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో వచ్చిన ప్రతిజ్ఞ చిత్రం(1982) నా కెరీర్‌లో ఓ మైలురాయి. బోయని సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో నా పాత్రను అస్వాదించా. ఎంతో ఎనర్జిటిక్‌గా చేసిన ఈ పాత్ర నా కెరీర్‌లో ఓ మరిచిపోలేని కథ. ఈ సినిమాతోనే తొలిసారిగా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌తో నిర్మాతగా అడుగుపెట్టా. అందుకే ఈ చిత్రానికి నా గుండెల్లో ప్రత్యేకస్థానం ఎల్లప్పుడూ ఉంటుంది' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మోహన్ బాబు నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
A beautiful village-based drama and one of my cherished films 'Pratigna'(1982), directed by Sri. Boyani Subbarao, it became a super hit of its time! I thoroughly enjoyed playing an energetic role in this memorable story. My first film as a producer and launch of 'Sree Lakshmi… pic.twitter.com/xpDaUpWveM
— Mohan Babu M (@themohanbabu) December 10, 2024
Comments
Please login to add a commentAdd a comment