![Manchu Manoj Meet Mohan Babu University Restaurant Victims](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Manchu-Manoj.jpg.webp?itok=5JflpT1l)
మంచువారి ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. తాజాగా మరోసారి వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఓ రెస్టారెంట్‌పై దాడి జరగడంతో మంచు మనోజ్ బాధితులకు అండగా నిలిచారు. ఎవరూ కూడా భయపడవద్దని.. మీకు అండగా నేను ఉంటానని మంచు మనోజ్ వారికి భరోసానిచ్చారు. యూనివర్సీటీ దగ్గర్లో ఉన్న రెస్టారెంట్‌పై బౌన్సర్లు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
మనోజ్ మాట్లాడుతూ..'పెద్దాయనకు తెలియకుండా ఇక్కడ రౌడీయిజం చేస్తున్నారు. నాన్నకు, నాకు గ్యాప్ క్రియేట్ చేశారు. ఇది గత మూడేళ్లుగా జరుగుతోంది. కోట్లు వెచ్చించి, లోన్లు తీసుకుని హాస్టల్స్, హోటల్స్ పెట్టుకుని బతుకుతున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రశ్నించినవారిపై బౌన్సర్లు దాడికి పాల్పడుతున్నారు. మీరు ఎవరూ భయపడొద్దు. మీకు అండగా నేను ఉన్నా.' అని హామీ ఇచ్చారు.
అనంతరం మాట్లాడుతూ..' ఇలాంటి ఫిర్యాదులు నా దృష్టి రావడం, ప్రశ్నించడం మొదలైనప్పటి నుంచి నాపై అభాండాలు వేస్తున్నారు. మాట వినకుంటే భార్య, పిల్లలు, తల్లులను టార్గెట్ చేస్తున్నారు. నావైపు నిజం... వాళ్ల వైపు నిజం లేదు. ఇది ఆస్తి గొడవ కాదు.. ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరు చేస్తున్న పోరాటం. తెలంగాణాలో మీడియా, పోలీసులు సహకారంతో బౌన్సర్ల ఆగడాలు కట్టడి చేయగలిగాం. ఇక్కడ కొందరు బౌన్సర్లు మద్యం సేవించి గొడవలు చేస్తున్నారు. అనుభవం ఉన్న వారిని రిటైర్డ్ ఆర్మీ వారిని నియమించుకుంటే బాగుంటుంది. గొడవలు చేసి ఆధారాలు లేకుండా సీసీ కెమెరాలు లాక్కెళ్లి పోవడం ఆనవాయితీ అయిపోయింది. మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గర ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించాలని కోరుతున్నట్లు' వెల్లడించారు.
![మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు](https://www.sakshi.com/s3fs-public/inline-images/mom.jpg)
Comments
Please login to add a commentAdd a comment