rangampet
-
అనపర్తి నియోజకవర్గం రంగంపేటలో ఉద్రిక్తత
-
ఎండను, వానను లెక్కచేయం.. మాకు జగనన్నే ముఖ్యం
-
రంగంపేటలో జల్లికట్టు సంబరాలు
-
కూతురితో సహా తల్లి ఆత్మహత్య
మెదక్ : కూతురితో సహా రైలు కింద పడి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సదాశివనగర్ మండలం రంగంపేట శివారులో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం రైల్వే ట్రాక్‌పై మృతదేహాలకు గుమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా మృతులు హైమదీ (28), ముష్కాన్ (5)లుగా గుర్తించారు. -
రేషన్ రావడం లేదని అధికారుల నిర్బంధం
కొల్చారం: రేషన్ దుకాణంలో నిత్యవసర వస్తువులు ఇవ్వడం లేదంటూ అధికారులను నిర్బంధించారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో తదితరులను గ్రామస్తులు పంచాయతీరాజ్ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామానికి చెందిన 240 మంది లబ్ధిదారులకు నాలుగు నెలలుగా రేషన్ అందడం లేదు... అలాగే నాలుగు నెలల క్రితం ఉన్నట్టుండి లబ్ధిదారుల పేర్లు కీ రిజిస్టర్ నుంచి మాయం అయ్యాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఆ క్రమంలో ఈ రోజు సాదాబైనామల గురించి సదస్సులో భాగంగా డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, వీఆర్వో చంద్రయ్య, టెస్కో రాష్ట్ర డెరైక్టర్ అరిగె రమేష్ గ్రామానికి వచ్చారు. దీంతో బాధితులు ఆగ్రహంతో అధికారులను పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉంచి బయట గడియపెట్టారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వచ్చి ఆర్డీవోతో మాట్లాడారు. బుధవారం నాటికి సగం మందికి బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మిగిలిన వారి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
నటుడు మోహన్ బాబు తండ్రి విగ్రహావిష్కరణ
చిత్తూరు : సినీనటుడు మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా చంద్రగిరి మండలం రంగంపేట శ్రీ విద్యానికేతన్ కళాశాల ఆవరణలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన నారాయణస్వామి నాయుడు చివరి వరకూ విద్యానికేతన్‌లో ఉపాధ్యాయులుగా కొనసాగారు. 96వ ఏట ఆయన మృతి చెందారు. విలువలతో కూడిన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని తపన పడిన వ్యక్తి తన తండ్రి అని ఆయన గుర్తుగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజున విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు మోహన్ బాబు తెలిపారు. అలాగే తన తండ్రి పేరిట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మోహన్ బాబు నెలకొల్పారు. ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయుని ఎంపిక చేసి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. -
రంగంపేటలో ఓటేసిన మోహన్ బాబు
-
రంగంపేటలో ఓటు వేసిన మోహన్ బాబు, విష్ణు
చిత్తూరు : సినీనటుడు మోహన్ బాబు చిత్తూరు జిల్లా రంగంపేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన తన తల్లి, కుమారుడు విష్ణు, ఇతర కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు. మోహన్ బాబు క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. మరోవైపు నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే పుంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయరాం ఓటు వేశారు. మరోవైపు పలమనేరు మండలం పొలమాసలపల్లిలో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ప్రారంభం కాలేదు. అలాగే రామచంద్రాపురం మండలం గణేష్పురంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడి చేసి పోలింగ్ ఏకపక్షంగా నిర్వహించేందుకు యత్నిస్తున్నారు. ఇక కుప్పం మండలం వెండుగాంపల్లిలో పోలింగ్ ప్రారంభం కాలేదు.