రంగంపేటలో ఓటు వేసిన మోహన్ బాబు, విష్ణు | Mohan babu cast hit vote in ramgampet | Sakshi
Sakshi News home page

రంగంపేటలో ఓటు వేసిన మోహన్ బాబు, విష్ణు

Published Wed, May 7 2014 10:44 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

రంగంపేటలో ఓటు వేసిన మోహన్ బాబు, విష్ణు - Sakshi

రంగంపేటలో ఓటు వేసిన మోహన్ బాబు, విష్ణు

చిత్తూరు : సినీనటుడు మోహన్ బాబు చిత్తూరు జిల్లా రంగంపేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన తన తల్లి, కుమారుడు విష్ణు, ఇతర కుటుంబ సభ్యులతో వచ్చి ఓటేశారు. మోహన్ బాబు క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. మరోవైపు నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోజా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే పుంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయరాం ఓటు వేశారు.

మరోవైపు పలమనేరు మండలం పొలమాసలపల్లిలో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ప్రారంభం కాలేదు. అలాగే రామచంద్రాపురం మండలం గణేష్పురంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడి చేసి పోలింగ్ ఏకపక్షంగా నిర్వహించేందుకు యత్నిస్తున్నారు. ఇక కుప్పం మండలం వెండుగాంపల్లిలో పోలింగ్ ప్రారంభం కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement