
మంచు విష్ణు హీరో, నిర్మాతగా చేసిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. లెక్క ప్రకారం ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేస్తామని చాలారోజుల క్రితమే ప్రకటించారు. కొన్నిరోజుల క్రితం వరకు ప్రచారం చేశారు. కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల వాయిదా వేస్తున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. కానీ తాజాగా మూవీ ప్రీమియర్ వేశారనే రూమర్స్ రాగా.. టీమ్ దీనిపై స్పందించింది.
(ఇదీ చదవండి: హీరోయిన్ తమన్నా ఇంట్లో ప్రత్యేక పూజలు)
'మార్చి 31న కన్నప్ప ప్రీమియర్ వేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. 15 నిమిషాల వీఎఫ్ఎక్స్ ఫుటేజీ క్వాలిటీ మాత్రమే చెక్ చేశాం. మూవీ ఫస్ట్ కాపీని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాం. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దు. త్వరలోనే ఇతర వివరాలు ప్రకటిస్తాం' అని కన్నప్ప టీమ్ చెప్పుకొచ్చింది.
ప్రసాద్ ల్యాబ్ నుంచి మంచు ఫ్యామిలీ నడిచొస్తున్న విజువల్స్ కొన్ని బయటకు రావడంతోనే ఈ ప్రీమియర్ వార్తలు వచ్చాయి. ఇకపోతే కన్నప్ప మూవీలో మంచు ఫ్యామిలీకి చెందిన విష్ణు, ఇతడి కూతుళ్లు-కొడుకు నటించారు. తండ్రి మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)
Official Clarification from Team Kannappa
Contrary to rumours spreading online, there was NO premiere or screening of the full movie yesterday. The Kannappa team only reviewed a 15-minute VFX segment for quality assessment and corrections.
The film’s first cut is still under…— Kannappa The Movie (@kannappamovie) April 1, 2025