Manchu Family
-
అజ్ఞాతంలో నటుడు మోహన్ బాబు?
జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో మోహన్ బాబుకు (Mohan Babu) తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఇప్పటివరకు పోలీసుల విచారణకు ఈయన అందుబాటులోకి రాలేదు. దీంతో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు (Hyd Police) సిద్ధమవుతున్నారు. కేసు నమోదైన ఫహడీ షరీఫ్ పోలీసులు.. ఈయన ఎక్కడున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. దీంతో ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.ఇంతకీ ఏం జరిగింది?మంచు మోహన్ బాబుని గత కొన్నిరోజులుగా కుటుంబ సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న కొడుకు మనోజ్ (Manchu Manoj) ఈయనపై దాడి చేశారనే రూమర్స్ తొలుత వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని.. మంచు కుటుంబంలో అంతా బాగానే ఉందని అన్నారు. కానీ తండ్రి-కొడుకు పరస్పరం హైదరాబాద్ ఫహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడంతో మంచు ఫ్యామిలీలో గొడవ బయటపడింది. ఈ వివాదం గురించి తెలుసుకునేందుకు మోహన్ బాబు ఇంటి దగ్గరకు కొన్నిరోజుల క్రితం తెలుగు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మాట్లాడే క్రమంలోనే జర్నలిస్ట్‌పై మోహన్ బాబు మైకుతో దాడి చేశారు. దీంతో అతడి తలకు గాయలయ్యాయి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)ఆ తర్వతా సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా.. దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.అనారోగ్య కారణాల దృష్ట్యా డిసెంబర్ 24వ తేదీ వరకు మోహన్ బాబుని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) ఆదేశించింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయినా సరే ఇప్పటికీ మోహన్ బాబు.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. తొలుత నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!) -
మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు
కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవనే దీనికి కారణం. ఈ వివాదంలో బోలెడన్ని టర్న్స్, ట్విస్టులు చోటుచేసుకున్నాయి. తండ్రి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారనే రూమర్స్, పరస్పరం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం.. మధ్యలో ఊహించని విధంగా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి, ఆపై పోలీసు కేసు.. ఇది కాదన్నట్లు అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరి, కొన్నిరోజులకు డిశ్చార్జ్ కావడం.. ఇలా ఒకటేమిటి ఇండస్ట్రీ మొత్తం ఈ వివాదం గురించే చర్చించుకున్నారు. ప్రస్తుతానికి ఇది కాస్త సద్దుమణిగినట్లే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?)జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబుపై కేసు ఓవైపు నడుస్తోంది. మరోవైపు తన ఫొటోలు, వాయిస్ రికార్డింగ్స్‌ని గూగూల్, సోషల్ మీడియాలో ఉపయోగించద్దని ఢిల్లీ హైకోర్ట్‌లో ఈయన పిటిషన్ వేశారు. దీనికి అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. మోహన్ బాబు కంటెంట్‌ని గూగుల్ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. దీంతో మంచు ఫ్యామిలీ వివాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్.. గూగుల్ నుంచి డిలీట్ అవుతాయి.(ఇదీ చదవండి: శ్రీదేవితో రెండో పెళ్లి.. నాన్నతో మంచి రిలేషన్ లేదు: యంగ్ హీరో) -
మంచు ఫ్యామిలీ గొడవపై RGV కామెంట్స్
-
మోహన్ బాబు పరారీలో ఉన్నాడా? ట్వీట్ వైరల్
ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మూడు రోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో ఈయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బాధితుడికి క్షమాపణ చెప్పినప్పటికీ.. కేసు ఇంకా న్యాయస్థానంలో ఉంది. తనపై నమోదైన కేసు దృష్ట్యా బెయిల్ కోసం ఈయన హైకోర్టుని ఆశ్రయించాడు. కానీ బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం కొట్టేసింది. అప్పటినుంచి మోహన్ బాబు.. పోలీసులకు కనిపించకుండా పోయాడని న్యూస్ వస్తోంది. వీటిపై ఇప్పుడు మోహన్ బాబు స్పందించారు.ఈ హంగామా అంతా నడుస్తున్న టైంలో మోహన్ బాబు ఇప్పుడు ట్వీట్ చేశాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)అయితే మోహన్ బాబు స్టేట్మెంట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. ఈయన అందుబాటులో లేకుండా పోయాడని న్యూస్ వచ్చింది. దీంతో ఐదు బృందాలుగా ఏర్పడి.. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడులో పోలీసులు గాలిస్తున్నారని అన్నారు. ఇప్పుడు మోహన్ బాబు స్వయంగా ట్వీట్ చేయడంతో రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టినట్లయింది.మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం చాలా హంగామా నడిచింది. అయితే విషయం తెలుసుకుందామని మీడియా వాళ్లు.. మోహన్ బాబు ఇంటికి వెళ్లగా ఒకరిపై ఈయన మైకుతో దాడి చేశాడు. దీంతో హత్యాయత్నం కేసు పెట్టారు. (ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)False propaganda is being circulated.! Anticipatory bail has NOT been rejected and currently. I am under medical care in my home. I request the media to get the facts right.— Mohan Babu M (@themohanbabu) December 14, 2024 -
మీడియాపై దాడికి క్షమాపణ చెప్పిన మోహన్ బాబు
ప్రముఖ నటుడు మోహన్ బాబు క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం ఈయన కుటుంబంలో ఆస్తి విషయమై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే మోహన్ బాబు, ఆయన చిన్న కొడుకు మనోజ్ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఆ తర్వాత తండ్రి ఇంటికెళ్లిన మనోజ్.. గేట్లు బద్ధలు కొట్టుకుని లోపలికెళ్లాడు. అయితే రీసెంట్గా మోహన్ బాబు ఇంటి దగ్గరకెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై ఈయన దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు.గత రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సి పొందిన మోహన్ బాబు.. గురువారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మీడియా ప్రతినిధిపై దాడి చేయడంపై క్షమాపణ చెప్పారు. తాను ఈ విషయమై పశ్చాత్తాప పడుతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ లెటర్ రిలీజ్ చేశారు. దాన్ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)'అనారోగ్య కారణాల దృష్ట్యా.. ఈ సంఘటనపై తక్షణమే స్పందించలేకపోయాను. ఆ టైంలో నా ఇంటి గేటు విరిగిపోయింది. 30-50 మంది మనుషులు తోసుకుంటూ లోపలికి వచ్చేశారు. నేను నియంత్రణ కోల్పోయాను. ఇదంతా జరుగుతున్న టైంలో మీడియా అక్కడికొచ్చింది. అప్పటికే నేను అలసిపోయి ఉన్నాను. దీంతో అనుకోని పరిస్థితుల్లో మీడియా ప్రతినిధికి నా వల్ల గాయమైంది. ఈ విషయమై పశ్చాత్తపడుతున్నాను. అతడికి, అతడి కుటుంబానికి కలిగిన ఇబ్బందికి తీవ్రంగా చింతిస్తున్నాను. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నా. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే మోహన్ బాబు ఆడియో సందేశం ఒకటి రిలీజ్ చేశాడు. మీడియాపై దాడి జరిగినందుకు ఎంతో చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. మా కుటుంబ సమస్యకు మధ్యవర్తులు అవసరం లేదని, తన కొడుకులతో కలిసి సమస్యని తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ')pic.twitter.com/PxcuHTxzbB— Mohan Babu M (@themohanbabu) December 13, 2024 -
మంచు ఫ్యామిలీ వివాదం లేటెస్ట్ న్యూస్
-
మంచు ఫ్యామిలీకి విధించిన షరతులు ఇవే!
-
మంచు ఫ్యామిలీ వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
వివాదంలో మంచు ఫ్యామిలీ.. రాజీకి మనోజ్, విష్ణు రెడీ?
క్రమశిక్షణకు మారుపేరైన మంచు కుటుంబంలో.. వివాదం రాజుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. పైగా మీడియా మీద మోహన్‌బాబు దాడి తర్వాత వివాదం మరింత ముదిరినట్లు కనిపిస్తోంది. -
'మంచు' ఫ్యామిలీలో గొడవ.. తొలిసారి స్పందించిన విష్ణు
ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయి. చిన్నకొడుకు మనోజ్.. తండ్రిపై కేసు పెట్టడం, మంగళవారం రాత్రి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి తలుపులు తోసుకుని మరీ లోపలికి వెళ్లడం.. ఈ క్రమంలో జర్నలిస్టులతో మోహన్ బాబు దురుసుగా ప్రవర్తించడం. కాసేపటికే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరడం.. ఇలా ఒకటి తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి.(ఇదీ చదవండి: నటుడు మోహన్ బాబు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?)ప్రస్తుతానికి మీడియాలో మనోజ్ కనిపిస్తున్నాడు. మరోవైపు మోహన్ బాబు మాత్రం ఓ ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు తమ కుటుంబంలో జరుగుతున్న రచ్చపై మంచు విష్ణు స్పందించాడు. తండ్రికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న ఆస్పత్రి నుంచే మీడియాతో మాట్లాడాడు. ఇలాంటి పరిస్థితి తన కుటుంబానికి వస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.(చదవండి: ఆ విషయంలో సీపీకి హామీ ఇచ్చా: మంచు మనోజ్)'ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందని ఊహించలేదు. మూడు తరాలుగా నాన్నగారు ఏంటనేది మీకు తెలుసు. ప్రతి ఇంట్లోనూ గొడవలు సాధారణమే. అవి పరిష్కారమవుతాయని పెద్దలు కోరుకుంటారు. నేను ఎమోషనల్ పెయిన్‌ఫుల్‌గా ఉన్నాను. మా నాన్న చేసిన తప్పు మమల్ని విపరీతంగా ప్రేమించటం. మీడియా వారు.. మీకు కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి. కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు''మా అమ్మ బాధలో ఉంది. నాన్నకు దెబ్బలు తగిలాయి. లాస్ ఏంజెల్స్‌లో 'కన్నప్ప' మూవీ పనుల్లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసింది. దీంతో అన్నీ వదిలి వచ్చేశాను. మీడియా వ్యకికి గాయాలు తగలటం బాధాకరం. అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. మీడియా వారికి నమస్కరిస్తూ వచ్చారు. మోహం మీద ఏదో పెట్టారని.. అలా జరిగిపోయింది. గాయమైన వ్యక్తి కుటుంబంతో టచ్‌లో ఉన్నాం. పోలీసులు మా కంటే ముందు మీడియాకు లీక్ ఇస్తున్నారు. నోటీసులు ఈ రోజు 9:30కి జారీ చేశారు. దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను'(ఇదీ చదవండి: మా నాన్న దేవుడు: మంచు మనోజ్)'మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు. నాకు కలవాల్సిన అవసరం లేదు. కానీ వారిని గౌరవించి కలుస్తాను. ప్రేమతో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు. మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేదేం లేదు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను. నేను ఇక్కడ ఉంటే ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. తమ్ముడు పెళ్లి శుభకార్యం.. బిడ్డను కన్నారు. దాని గురించి ఎవరు ఫీలవరు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయంకృషితో గొప్ప స్దాయికి ఎదిగారు. కుటుంబం పరంగా నాన్న ఏది అనుకుంటే అదే ఉండాలి''మీడియాలో కొందరు హద్దు మీరుతున్నారు. పబ్లిక్ ఫిగర్స్‌పై రిపోర్ట్ చేయటం మీడియా బాధ్యత. లోపల తండ్రి స్దాయి వ్యక్తి ఉంటే తలుపులు బద్దలు కొడతారా? మా కుటుంబంలో బయటి వ్యక్తులు ఇన్ వాల్వ్మెంట్ ఉంటే వారికి ఈవెనింగ్ దాకా సమయం ఇస్తున్నాం. లేదంటే అందరి పేర్లు నేనే బయడపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చెస్తాను. కానీ నా తమ్ముడిపై నేనిప్పుడు దాడులు చేయను. కాలమే అన్నింటికీ సమాధానాలు ఇస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఎడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు' అని విష్ణు తన ఆవేదనని బయటపెట్టారు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
నటుడు మోహన్ బాబు ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది?
మంచు ఫ్యామిలీలో గత రెండు రోజులుగా వివాదం నడుస్తోంది. తండ్రి కొడుకు.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడం దగ్గర నుంచి ఇప్పుడు మోహన్ బాబు ఆస్పత్రిలో చేరడం వరకు వచ్చింది. మంగళవారం రాత్రి ఇంటి దగ్గరకొచ్చి మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడిచేయడం పెద్ద వివాదమైంది. ఈ క్రమంలోనే 118 బీఎన్ఎస్ యాక్ట్ కింద ఈయనపై కేసు కూడా నమోదైంది. ఇదంతా పక్కనబెడితే రాత్రే మోహన్ బాబు ఆస్పత్రిలో కూడా చేరారు. ఇంతకీ ఈయన ఆరోగ్యం ఇప్పుడెలా ఉంది? డాక్టర్స్ ఏం చెబుతున్నారు?అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఏమైందా అని అందరూ అనుకున్నారు. వైద్యుల ఏం చెబుతున్నారంటే.. 'విపరీతమైన ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోయిన స్థితిలో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఎడమ కంటి కింద గాయమైంది. బీపీ, రక్తపోటు కూడా పెరిగాయి. నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి' అని చెప్పారు.(ఇదీ చదవండి: మా నాన్న దేవుడు: మంచు మనోజ్)మోహన్ బాబుకి ప్రస్తుతం చికిత్స చేస్తున్న డాక్టర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.మరోవైపు తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీస్‌ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ వేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు కోరారు. తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు. మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉండటంతో ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు) -
నాన్న తరఫున మీడియా మిత్రులకు క్షమాపణలు కోరుతున్నా: మంచు మనోజ్
-
మంచు ఫ్యామిలీ వివాదంపై మల్లాది విష్ణు రియాక్షన్
-
మనోజ్ వెనుక ఏపీ మాజీ మంత్రి..!
-
మంచువారి అమ్మాయిలు..అరీ & వివీ హ్యాపీ బర్త్‌డే: తాతను మించిపోతారా!(పోటోలు)
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య
మంచు ఫ్యామిలీలోకి మరో మెంబర్ వచ్చారు. హీరో మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే మనోజ్-మౌనిక దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. (ఇదీ చదవండి: పెంపుడు కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హీరోయిన్) మనోజ్, మౌనిక.. గతంలో వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ మనస్పర్థలు కారణంగా విడాకులు తీసుకున్నారు. గతేడాది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. బేబీ బంప్ ఫొటోలని షేర్ చేశారు. అలానే సీమంతం కూడా చేశారు. ఇప్పుడు పాప పుట్టిన విషయాన్ని బయటపెట్టారు. ఇకపోతే మంచు మనోజ్ కి పాప పుట్టిన విషయమై ఇన్ స్టాలో పోస్ట్ పెట్టిన మంచు లక్ష్మీ.. పాపకు 'ఎమ్ఎమ్ పులి' అని ముద్దు పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చింది. అలానే ధైరవ్ (మనోజ్ కొడుకు)కి చెల్లెలు వచ్చేసిందని లక్ష్మీ రాసుకొచ్చింది. చెప్పడం అయితే చెప్పారు గానీ పాపకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు రిలీజ్ చేయలేదు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
జనాలను పిచ్చోళ్లను చేసిన మంచు బ్రదర్స్.. ట్విస్ట్ ఇచ్చి షాకిచ్చారుగా!
మంచు ఫ్యామిలీలో కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా వినిపించింది. దీనికి తోడు మొన్నటికి మొన్న విష్ణు-మనోజ్‌లు బాహాటంగానే గొడవ పడిన వీడియో నెట్టింట ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచుమనోజ్ సోదరుడు సారథి ఇంట్లోకి చొరబడి అతనిపై విష్ణు చేయిచేసుకున్న వీడియో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ తర్వాత మోహన్ బాబు ఎంట్రీతో వీడియో డిలీట్ చేయడం, ఆ తర్వాత మనోజ్, విష్ణుల కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే విష్ణు-మనోజ్‌ల గొడవలో ఇప్పుడొక ట్విస్ట్ బయటకు వచ్చింది. ఏప్రిల్ నెల రాకుండానే జనాలను పిచ్చోళ్లను చేశారు మంచు బ్రదర్స్. అందరూ అనుకున్నట్లు వాళ్లేమీ గొడవపడలేదట. ఇదంతా ఓ రియాలిటీ షో కోసం చేస్తున్న ప్రాంక్ వీడియోనట. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు బయటపెట్టాడు. తమ సొంత బ్యానర్లో ఓ రియాలిటీ షోను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికి 'హౌస్ ఆఫ్ మంచూస్'(House Of Manchs)అని పేరు కూడా పెట్టారు. త్వరలోనే ఓటీటీ వేదికగా ఈ రియాలిటీ షోను స్ట్రీమింగ్ చేయనున్నట్లు విష్ణు తెలిపారు. దీంతో 'అన్నా ట్విస్ట్ అదిరింది.. మంచు ఫ్యామిలీ అంటే ఆమాత్రం ఉంటుంది' అంటూ నెటిజన్లు విస్తుపోతున్నారు. మరోవైపు నిజంగానే రియాలిటీ షో చేస్తున్నారా? లేక ఆల్రెడీ వీడియో వైరల్ అయ్యి పరువు బజారున పడటంతో ఇలా కవర్ డ్రైవ్ చేస్తున్నారా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
రెండేళ్లుగా మనస్పర్థలు.. పెళ్లి తర్వాత మరింత ముదిరిన వివాదం
మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చకెక్కాయి. మంచు విష్ణు-మనోజ్‌ల మధ్య చాలాకాలంగా ఉన్న వివాదం ఇప్పుడు రోడ్డునపడింది. కొన్నాళ్లుగా మనోజ్-విష్ణుకి మధ్య సరిగా మాటలు లేవని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో గట్టిగానే టాక్ వినిపించింది. విష్ణు బర్త్‌డే రోజు మనోజ్ ప్రత్యేకంగా విషెస్ చెప్పినా ఆయన స్పందించలేదు. దీనికి తోడు మనోజ్ పెళ్లిలో విష్ణు అంటీముట్టనట్లు వ్యవహరించడం, ఏదో అతిథిలాగా కాసేపు ఉండి వెంటనే వెళ్లిపోవడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. చదవండి: మనోజ్ పెళ్లి వేడుకలో విష్ణు చేసిన పనికి షాక్ అవుతున్న నెటిజన్లు రీసెంట్గా మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. మనోజ్-విష్ణులు ఒకే స్టేజ్‌పై ఉన్నా పలకరించుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తలకు మరింత బలం చేకూరిస్తూ తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మనోజ్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటున్న సారథి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి విష్ణు గొడవపడటం, ఆ వీడియోను స్వయంగా మనోజ్ షేర్ చేయడంతో ఇప్పుడీ విషయం రచ్చకెక్కింది. అప్పటినుంచే విబేధాలా? ఇక నిజానికి రెండేళ్ల క్రితం నుంచే అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. మనోజ్ రెండో పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరాయట. అప్పటి నుంచి అంటీముట్టనట్లుగా ఉన్న విష్ణు తాజాగా మనోజ్ అనుచరుడిపైనే దాడికి పాల్పడటంతో మనోజ్ ఈ వ్యవహారాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం మోహన్ బాబు ఈ గొడవకు ఫుల్స్టాప్ పెట్టేందుకు ఇద్దరినీ కలిపి మాట్లాడనున్నారట. చదవండి: వీడియో షేర్ చేసిన మనోజ్.. సీరియస్ అయిన మోహన్‌బాబు మనోజ్-విష్ణులు సొంత అన్నదమ్ములు కాదా? మంచు మనోజ్- మంచు విష్ణులు నిజానికి సొంత అన్నదమ్ములు కాదు. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవికి విష్ణు, లక్ష్మీలు సంతనం. అనారోగ్యంతో ఆమె కన్నుమూయడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయిన మోహన్‌బాబును కుటుంబసభ్యులు ఒప్పించి విద్యాదేవి సొంత చెల్లెలు నిర్మాలా దేవితో రెండో వివాహం జరిపించారు. వీరి సంతానమే మంచు మనోజ్. అయితే ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మంచు లక్ష్మీ-మనోజ్‌లు చాలా క్లోజ్‌గా ఉండేవారు. మనోజ్‌ను తమ్ముడిలా కాకుండా సొంత కొడుకులా చూసుకుంటానని స్వయంగా లక్ష్మీ పలు సందర్బాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. మనోజ్ పెళ్లి కూడా లక్ష్మీనే దగ్గరుండి జరిపించింది. మరి ఇప్పుడు రచ్చకెక్కిన అన్నదమ్ముల గొడవను లక్ష్మీ ఎలా పరిష్కరిస్తుందన్నది చూడాల్సి ఉంది. -
మనోజ్‌ను దూరం పెట్టారా? విభేదాలపై స్పందించిన మంచు లక్ష్మీ
మంచు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటారామె. ఈమధ్య మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయని, మనోజ్‌ను కుటుంబం దూరం పెట్టిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ తనపై వచ్చే ట్రోల్స్, కుటుంబంలో విభేదాలపై స్పందించింది. 'ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను మాట్లాడే విధానంపై చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఇంట్లో కూర్చొని ఏ పనీపాటా లేకుండా కామెంట్స్ చేసేవాళ్లని నేను పట్టించుకోను. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే.. అవన్నీ మా పర్సనల్. మా ఇంట్లో ఏం జరుగుతుందన్నది మా కుటుంబ విషయం. సమయం వచ్చినప్పుడు మేమంతా కలిసే కనిపిస్తాం. నేనూ, మనోజ్ ఎక్కువగా కలుస్తుంటాం. విష్ణు మా ఇద్దరి కంటే భిన్నమైన వ్యక్తి. తన పిల్లలు, బిజినెస్, వర్క్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడ్తాడు. అన్నీ సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు' అంటూ చెప్పుకొచ్చింది. -
ట్రోల్ల్స్ చేస్తున్న వారిపై మంచులక్ష్మీ ఫైర్
-
నా కుటుంబం జోలికోస్తే ఇకపై సహించను: మంచు విష్ణు
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో తనపై దారుణంగా ట్రోల్స్ చేశారని అన్నారు. మా ఫ్యామిలీని టార్గెట్ చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీని వెనకాల ఓ స్టార్ హీరో ఉన్నారని మంచు విష్ణు ఆరోపించారు. మా కుటుంబంపై ట్రోల్స్ చేసేందుకు ఏకంగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పారని తెలిపారు. (చదవండి: వెనక్కి తగ్గిన మంచు విష్ణు.. 'జిన్నా' వాయిదా?) తాజాగా జిన్నా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విష్ణు.. 'మా' ఎన్నికల నుంచి మా ఫ్యామిలీపై ట్రోల్స్ ఎక్కువయ్యాయని అన్నారు. నా ఫ్యామిలీపై ట్రోల్స్ చేసినవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు విష్ణు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఐపీ అడ్రస్‌లు పోలీసులకు అందజేస్తానని ఆయన వెల్లడించారు. ఇన్ని రోజులు అన్నీ భరించానని.. ఇకపై సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ 'ఓ హీరోకు చెందిన కంపెనీ నుంచే నా కుటుంబంపై ట్రోలింగ్. ఇకపై సహించేది లేదు. తనపైనా, తన కుటుంబంపైనా పనిగట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా. ఓ హీరో తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీలో తన కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌లను కూడా సేకరించాను. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు చేస్తా' అని అన్నారు. -
మాల్దీవులు: మంచు ఫ్యామిలీ..
-
తిరుమలలో సినీ ప్రముఖులు
తిరుమల: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు సినీ ప్రముఖులు వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంచు కుటుంబంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత, హీరోయిన్ కీర్తి సురేశ్ సోమవారం తిరుమలకు చేరుకున్నారు. మంచు మోహన్‌బాబు, తన భార్యతో పాటు కుమారుడు విష్ణు, కోడలు, మనమరాళ్లతో వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. అంతకుముందు నైవేద్య విరామ సమయంలో నటి కీర్తి సురేశ్ వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుని వచ్చారు. వారికి ఆలయ అధికారులు మర్యాదాలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రస్తుతం కీర్తి సురేశ్ తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. మోహన్‌బాబు దర్శనాంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలందరికీ నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గతేడాదిలాంటి పరిస్థితులు రావొద్దని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తాను సన్నాఫ్ ఇండియా సినిమా చేస్తున్నట్లు, ఫిబ్రవరిలో విడుదలవుతుందని మోహన్‌బాబు తెలిపారు. -
భారీ స్కాంపై మంచు వారి సినిమా
వరుస ఫెయిల్యూర్స్ ఎదురవుతుండటంతో మంచు ఫ్యామిలీ హీరోలు కథల ఎంపికలో కొత్త దనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎక్కువగా రొటీన్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న వచ్చిన మంచు ఫ్యామిలీ హీరోలు ప్రస్తుతం రియలిస్ట్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ స్కాం నేపధ్యంలో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మంచు ఫ్యామిలీ హీరోలు. అమెరికా వాళ్లను మోసం చేసి కోట్ల కొద్ది డబ్బును వేనకేసుకున్న మీరా రోడ్ కాల్ సెంటర్ స్కాంను సినిమాగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించిన పూర్తి స్థాయి విషయాలు తెలుసుకునేందుకు మంచు టీం థానే పోలీసులను సంప్రదించింది. అయితే ఈ విషయంలో మంచు ఫ్యామిలీ నుంచి తెలుగు మీడియాకు సమాచారం అందకపోయినా బాలీవుడ్ మీడియాలో ఈ మేరకు కథనాలు వచ్చాయి. మరి ఈ సినిమాలో మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు హీరోగా నటిస్తారో చూడాలి. -
'అక్కతో పాటు మేనకోడలికి గిప్ట్'
మంచు వారి ఫ్యామిలీలో రాఖీ పండుగ సందర్భంగా ఈసారి లక్ష్మీ ప్రసన్నతో పాటు ఆమె కూతురు విద్యా నిర్వాణకు కూడా బహుమతులు రెడీ అవుతున్నాయట. తమ ఇంట్లో జరిగే రాఖీ వేడుకల విశేషాలను హీరో మంచు విష్ణు తెలిపాడు. మామూలుగానే లక్ష్మి మా నుంచి గిప్ట్‌లు డిమాండ్ చేస్తుంది. ఇక రాఖీ పండుగకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ రాఖీ కట్టి రూ.3 లక్షలు డిమాండ్ వసూలు చేసింది. దాంతో ఆమె తనకు కాల్సినవి కొనుక్కుంది. ఒకవేళ మనోజ్ ఆ సమయంలో వేరే ప్రాంతంలో ఉంటే, అతని కోటా కూడా నా నుంచే వసూలు చేస్తుంది అని విష్ణు మురిపెంగా చెప్పటం విశేషం. చిన్నతనం నుంచి అక్కతో రాఖీ కట్టించుకునే అలవాటు ఉందన్న విష్ణు అప్పట్లో అక్క ఏ బహుమతి అడిగితే అది కొనిచ్చేవాళ్లమన్నాడు. అంతే కాదు చిన్నతనంలో తాను అడిగింది కొనివ్వకపోతే తమ మీద నాన్నకు ఫిర్యాదు చేసేదని అతడు చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు. అయితే పెద్దయ్యాక మాత్రం అక్కకు బ్లాక్ చెక్ ఇచ్చే వాళ్లమని, ఈ ఏడాది మాత్రం ఒకటి కాదు రెండు బహుమతులు ఇస్తున్నట్లు చెప్పాడు.. లక్ష్మీతో పాటు మేనకోడలు విద్యా నిర్వాణకు కూడా స్పెషల్ గిప్ట్ ప్రజెంట్ చేస్తున్నట్లు చెప్పాడీ యంగ్ డైనమైట్.