జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో మోహన్ బాబుకు (Mohan Babu) తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయింది. ఇప్పటివరకు పోలీసుల విచారణకు ఈయన అందుబాటులోకి రాలేదు. దీంతో మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు (Hyd Police) సిద్ధమవుతున్నారు. కేసు నమోదైన ఫహడీ షరీఫ్ పోలీసులు.. ఈయన ఎక్కడున్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు. దీంతో ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.
ఇంతకీ ఏం జరిగింది?
మంచు మోహన్ బాబుని గత కొన్నిరోజులుగా కుటుంబ సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్న కొడుకు మనోజ్ (Manchu Manoj) ఈయనపై దాడి చేశారనే రూమర్స్ తొలుత వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధాలని.. మంచు కుటుంబంలో అంతా బాగానే ఉందని అన్నారు. కానీ తండ్రి-కొడుకు పరస్పరం హైదరాబాద్ ఫహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకోవడంతో మంచు ఫ్యామిలీలో గొడవ బయటపడింది. ఈ వివాదం గురించి తెలుసుకునేందుకు మోహన్ బాబు ఇంటి దగ్గరకు కొన్నిరోజుల క్రితం తెలుగు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మాట్లాడే క్రమంలోనే జర్నలిస్ట్‌పై మోహన్ బాబు మైకుతో దాడి చేశారు. దీంతో అతడి తలకు గాయలయ్యాయి.
(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)
ఆ తర్వతా సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా.. దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.
అనారోగ్య కారణాల దృష్ట్యా డిసెంబర్ 24వ తేదీ వరకు మోహన్ బాబుని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్ట్ (Telangana High Court) ఆదేశించింది. నిన్నటితో ఆ గడువు ముగిసింది. అయినా సరే ఇప్పటికీ మోహన్ బాబు.. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో ఆయన అరెస్ట్ తప్పదని తెలుస్తోంది. తొలుత నోటీసులు ఇచ్చి, ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
(ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!)
Comments
Please login to add a commentAdd a comment