మోహన్ బాబు పరారీలో ఉన్నాడా? ‍ట్వీట్ వైరల్ | Actor Mohan Babu Absconding Police Search For Him | Sakshi
Sakshi News home page

Mohan Babu: హత్యాయత్నం కేసు.. మోహన్ బాబు ఎక్కడ?

Published Sat, Dec 14 2024 11:54 AM | Last Updated on Sat, Dec 14 2024 3:17 PM

Actor Mohan Babu Absconding Police Search For Him

ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మూడు రోజుల క్రితం జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో ఈయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలోనే బాధితుడికి క్షమాపణ చెప్పినప్పటికీ.. కేసు ఇంకా న్యాయస్థానంలో ఉంది. తనపై నమోదైన కేసు దృష్ట్యా బెయిల్ కోసం ఈయన హైకోర్టుని ఆశ్రయించాడు. కానీ బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం కొట్టేసింది. అప్పటినుంచి మోహన్ బాబు.. పోలీసులకు కనిపించకుండా పోయాడని న్యూస్ వస్తోంది. వీటిపై ఇప్పుడు మోహన్ బాబు స్పందించారు.

ఈ హంగామా అంతా నడుస్తున్న టైంలో మోహన్ బాబు ఇప్పుడు ట్వీట్ చేశాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)

అయితే మోహన్ బాబు స్టేట్‌మెంట్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. ఈయన అందుబాటులో లేకుండా పోయాడని న్యూస్ వచ్చింది. దీంతో ఐదు బృందాలుగా ఏర్పడి.. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడులో పోలీసులు గాలిస్తున్నారని అన్నారు. ఇప్పుడు మోహన్ బాబు స్వయంగా ట్వీట్ చేయడంతో రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టినట్లయింది.

మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం చాలా హంగామా నడిచింది. అయితే విషయం తెలుసుకుందామని మీడియా వాళ్లు.. మోహన్ బాబు ఇంటికి వెళ్లగా ఒకరిపై ఈయన మైకుతో దాడి చేశాడు. దీంతో హత్యాయత్నం కేసు పెట్టారు. 

Mohan Babu: గన్ సరెండర్ చేయాలని మోహన్ బాబును కోరిన పోలీసులు

(ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement