అరెస్ట్ అయి దాదాపు రోజంతా జైల్లో ఉన్న అల్లు అర్జున్.. ఎట్టకేలకు ఇంటికొచ్చేశాడు. శనివారం ఉదయం 6:45 గంటలకు చంచల్‌గూడ జైలు వెనక గేట్ నుంచి బన్నీని పోలీసులు విడుదల చేశారు. తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి తొలుత గీతా ఆర్ట్స్ ఆఫీస్‌కి వెళ్లాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్నాడు.
(ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)
ఇంటికొచ్చిన తర్వాత అల్లు అర్జున్ భార్య స్నేహ ఎమోషనల్ అయింది. భర్తని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. కుటుంబాన్ని కలిసిన తర్వాత బన్నీ మీడియాతో మాట్లాడాడు. 'నేను చట్టాన్ని గౌరవిస్తాను. నాకు మద్ధతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రేవతి కుటుంబానికి నా సానుభూతి. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. నిజంగా అది దురదృష్టకరం. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడేం మాట్లాడను' అని అల్లు అర్జున్ మీడియాతో చెప్పాడు.
సంధ్య థియేటర్ దగ్గర డిసెంబర్ 4 రాత్రి జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జైలుకి తీసుకెళ్లేలోపు 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినా సరే తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగా లేదని.. చంచల్‌గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. అండర్ ట్రైల్ ఖైదీగా.. ఖైదీ నంబర్ 7697 ఇచ్చి మంజీరా బ్యారక్ క్లాస్-1 రూంలో రాత్రంతా ఉంచారు. అయితే భోజనం చేయకుండా రాత్రంతా నేలపైన బన్నీ పడుకున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: అరెస్ట్ వెనకున్నోళ్లు సర్వనాశనం అయిపోతారు: రైటర్ చిన్నికృష్ణ)
Comments
Please login to add a commentAdd a comment