స్టార్ హీరో అల్లు అర్జున్‌ని శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిల్ పేపర్స్ సరిగా లేవని చెప్పి రాత్రంతా జైలులోనే ఉంచారు. శనివారం ఉదయం 6:45 గంటలకు జైలు వెనక గేట్ నుంచి ఎస్కార్ట్ ఇచ్చి మరి ఇంటికి పంపించారు. అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో బన్నీ.. రాత్రంతా భోజనం చేయకుండా నేలపైనే పడుకున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: నాన్న కోసం అల్లు అర్హ ఎదురుచూపులు.. వీడియో వైరల్)
బన్నీ అరెస్ట్‌పై హీరోయిన్ రష్మిక, హీరో నాని, నితిన్, బాలీవుడ్ హీరోలు వరుణ్ ధావన్, వివేక్ ఒబెరాయ్.. ఇలా చాలామంది స్పందించారు. అరెస్ట్‌ని తప్పుబట్టారు. గతంలో అల్లు అర్జున్ 'గంగోత్రి', 'బద్రీనాథ్' సినిమాలకు రచయితగా పనిచేసిన చిన్నికృష్ణ కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. 'బన్నీని అరెస్ట్ చేయడం దారుణం. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కోసం తినకుండా ఉన్నాను. టికెట్ ధర పెంపు అన్నది ఈ ఒక్క సినిమాకే ఇవ్వలేదు. అరెస్ట్ వెనక ఉన్నవారు సర్వనాశనం అవుతారు. తర్వాత పరిణామాలు మీరే చూస్తారు' అని అన్నారు.
రచయితగా 'ఇంద్ర', 'నరసింహనాయుడు' లాంటి సినిమాలు చేసిన చిన్నికృష్ణ.. తర్వాత కాలంలో దర్శకుడిగానూ ఒకటి రెండు సినిమాలు తీశారు. కానీ వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం పెద్దగా యాక్టివ్‌గా లేరు. మెగా ఫ్యామిలీతో ఈయనకు మంచి అనుబంధం ఉంది. ఈ సందర్భంగానే బన్నీ అరెస్ట్‌పై స్పందించినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు)
అల్లు అర్జున్‌కు మరక అంటించాలని చుసిన ఏ నాయకుడు అయినా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోతారు - గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ pic.twitter.com/WqsnHYpDsI
— ChotaNews (@ChotaNewsTelugu) December 14, 2024
Comments
Please login to add a commentAdd a comment