chinni krishna
-
సినీ రచయిత చిన్నికృష్ణ కుటుంబంలో విషాదం
సినీ ప్రముఖ రచయిత చిన్నికృష్ణ ఇంట తీవ్ర విషాదం జరిగింది. ఆయన తల్లి సుశీల (75) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. చిన్నికృష్ణ స్వగ్రామం తెనాలిలో నేడు అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి మదర్స్‌డే నాడు ఆయన తన తల్లి గురించి చాలా ఎమోషనల్‌గా కవితలు రాశారు. ఎన్ని జన్మలైనా నీకే జన్మించాలని ఉందంటూ తన తల్లి గురించి చెప్పే వారు. సుశీల మరణంతో సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. గంగోత్రి,బద్రినాథ్,నరసింహనాయుడు,ఇంద్ర వంటి చిత్రాలకు ఆయన కథ అందించారు. -
అరెస్ట్ వెనకున్నోళ్లు సర్వనాశనం అయిపోతారు: రైటర్ చిన్నికృష్ణ
స్టార్ హీరో అల్లు అర్జున్‌ని శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిల్ పేపర్స్ సరిగా లేవని చెప్పి రాత్రంతా జైలులోనే ఉంచారు. శనివారం ఉదయం 6:45 గంటలకు జైలు వెనక గేట్ నుంచి ఎస్కార్ట్ ఇచ్చి మరి ఇంటికి పంపించారు. అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో బన్నీ.. రాత్రంతా భోజనం చేయకుండా నేలపైనే పడుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: నాన్న కోసం అల్లు అర్హ ఎదురుచూపులు.. వీడియో వైరల్)బన్నీ అరెస్ట్‌పై హీరోయిన్ రష్మిక, హీరో నాని, నితిన్, బాలీవుడ్ హీరోలు వరుణ్ ధావన్, వివేక్ ఒబెరాయ్.. ఇలా చాలామంది స్పందించారు. అరెస్ట్‌ని తప్పుబట్టారు. గతంలో అల్లు అర్జున్ 'గంగోత్రి', 'బద్రీనాథ్' సినిమాలకు రచయితగా పనిచేసిన చిన్నికృష్ణ కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. 'బన్నీని అరెస్ట్ చేయడం దారుణం. నిన్నటి నుంచి అల్లు అర్జున్ కోసం తినకుండా ఉన్నాను. టికెట్ ధర పెంపు అన్నది ఈ ఒక్క సినిమాకే ఇవ్వలేదు. అరెస్ట్ వెనక ఉన్నవారు సర్వనాశనం అవుతారు. తర్వాత పరిణామాలు మీరే చూస్తారు' అని అన్నారు.రచయితగా 'ఇంద్ర', 'నరసింహనాయుడు' లాంటి సినిమాలు చేసిన చిన్నికృష్ణ.. తర్వాత కాలంలో దర్శకుడిగానూ ఒకటి రెండు సినిమాలు తీశారు. కానీ వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం పెద్దగా యాక్టివ్‌గా లేరు. మెగా ఫ్యామిలీతో ఈయనకు మంచి అనుబంధం ఉంది. ఈ సందర్భంగానే బన్నీ అరెస్ట్‌పై స్పందించినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు)అల్లు అర్జున్‌కు మరక అంటించాలని చుసిన ఏ నాయకుడు అయినా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోతారు - గంగోత్రి సినిమా రచయిత చిన్నికృష్ణ pic.twitter.com/WqsnHYpDsI— ChotaNews (@ChotaNewsTelugu) December 14, 2024 -
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ టాలీవుడ్ రైటర్
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు దాడి చేశారంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఇప్పటికే ఆయన పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అంతేగాక తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు సదరు వ్యక్తులు ఆయనపై దాడికి యత్నించారని ఆరోపిస్తూ తాజాగా చిన్ని కృష్ణ శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్, ముఖ్య అతిథిగా.. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే చిన్ని కృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించారు. స్టార్ హీరోల సినిమాలకు కథలు అందించి ప్రముఖ రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కథ అందించిన చిత్రాల్లో అల్లు అర్జున్ ‘గంగోత్రి’, బాలకృష్ణ ‘నరసింహనాయుడు’, చిరంజీవి ‘ఇంద్రా’ సినిమాలు ఉన్నాయి. అవి ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయో ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. వీటితో పాటు ఆయన మరిన్ని సినిమాలకు కూడా కథలు అందించారు. -
బన్నీ ఫ్రెండ్‌గా ‘గంగోత్రి’లో చాన్స్, పరువు పోతుందని చేయనన్నాను..
యంగ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర ‘బలుపు’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల బాబీ ఓ ఛానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’ మూవీలో నటించే చాన్స్ వచ్చినట్లు చెప్పాడు. అయితే పరువు పోతుందని ఆ మూవీలో నటించడానికి ఒప్పుకోలేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబీ మాట్లాడుతూ.. ‘గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యుక్షుడిగా ఉన్న సమయంలో రైటర్ చిన్ని కృష్ణ తనని కలిసి హైదరబాద్‌కు వచ్చినప్పుడు కలవమని చెప్పారు. అలా ఓ సారి హైదరబాద్‌కు వచ్చి ఆయనను కలిశాను. వెంటనే ఆయన నన్ను రఘవేంద్ర రావు దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత కాసేపు నన్ను గమనించిన ఆయన గంగోత్రిలో అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా నటించే అవకాశం ఇచ్చారు. అయితే ఈ సినిమాలో నిక్కర్ వేసుకోవాలని నా కోలతలు తీసుకోమ్మంటూ అసిస్టెంట్ డైరెక్టర్‌కు చెప్పారు. అయితే అలా నిక్కరులో కనిపిస్తే గుంటూరులో నా పరువు పోతుందని భయపడి వెంటనే నేను చేయనని చెప్పాను. మరీ ఏం చేస్తావని చిన్ని కృష్ణ అడిగారు. వెంటనే నేను కథలు రాస్తానని చెప్పాను. దీంతో గంగోత్రికి కొన్ని సన్నివేశాలు రాసే అవకాశం ఇచ్చారు. అలా నేను రాసిన సన్నివేశాలు రాఘవేంద్రరావు నచ్చి సినిమాలో పెట్టుకున్నారు. అలా రచయిత, డైరెక్టర్‌ను అయ్యాను’ అంటూ బాబీ చెప్పుకొచ్చాడు. -
'అక్షర' ట్రైలర్ వచ్చేసింది..
"విద్యను నమ్మినవాడు విజ్ఞాని అవుతాడు, విద్యను అమ్మినవాడు జ్ఞానాగ్నిలో దహించుకుపోతాడు, అఖిల విశ్వాన్ని శాసించేది అక్షరమే.." అని ఎలుగెత్తి చాటుతున్న వాక్యాలతో అక్షర ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్ నందిత శ్వేత ఫిజిక్ టీచర్ అక్షర, అన్యాయాన్ని ఎదిరించే వనితగా కనిపిస్తోంది. ప్రస్తుత సమాజంలో విద్యను వ్యాపారం చేసిన కాలేజీల నిర్వాకాన్ని, సీట్లు, ర్యాంకుల అమ్మకాలను విమర్శిస్తూ విద్యార్థుల మానసిక ఒత్తిడిని తెర మీద చూపించేందుకు అక్షర చిత్రయూనిట్ ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్షర ట్రైలర్‌ను మంగళవారం రిలీజ్ చేశాడు. ఇక బడా కాలేజీలో చదివే ఓ విద్యార్థి మరణం చుట్టూ కథ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. భూమిని నమ్ముకున్నోడు రైతు, చదువును నమ్ముకున్నోడు రాజు అని చెప్పిన డైలాగు బాగుంది. ఇందులో షకలక శంకర్, సత్య, అజయ్ ఘోష్, మధునందన్, కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. చిన్నికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సురేశ్ వర్మ, అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. చదవండి: రఘుబాబు కూతురి ఎంగేజ్మెంట్లో స్టార్ల సందడి హైదరాబాద్ నా సిటీనే.. నా బ్యూటీ -
డాన్స్ రాజా
ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ, మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య పాత్రల్లో వెంకీ ఎ.ఎల్. దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రం ‘డాన్స్ రాజా డాన్స్’గా తెలుగులో విడుదల కానుంది. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రచయిత చిన్నికృష్ణ విడుదల చేసి, ‘‘నృత్య ప్రధానంగా రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ ఘనవిజయం సాధించాలి’’ అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తమిళ ప్రేక్షకులను డాన్సులతో ఉర్రూతలూగించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది. భారతీబాబు మాటలు–పాటలు అందించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకూ సంగీత దర్శకురాలు ఎమ్.ఎమ్.శ్రీలేఖ గాత్రం అందించడం విశేషం. చిన్నికృష్ణ చేతుల మీదుగా మా సినిమా ట్రైలర్ విడుదలవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ట్రైలర్ విడుదలలో ప్రొడక్షన్ డిజైనర్ చందు ఆది పాల్గొన్నారు. -
వైకుంఠ ఏకాదశి రోజున..
‘నరసింహా, నరసింహ నాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రినాథ్’ వంటి హిట్ చిత్రాలకు కథ అందించిన రచయిత చిన్నికృష్ణ తాజాగా రాసిన కథతో తెరకెక్కనున్న చిత్రం ‘వైకుంఠ ఏకాదశి రోజున..’. చిన్నికృష్ణ స్టూడియోస్ సమర్పణలో బిల్వా క్రియేష¯Œ ్స పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందనున్న ఈ చిత్రాన్ని చిన్నికృష్ణ, ఆయన తనయుడు ఆకుల చిరంజీవి నిర్మించనున్నారు. హైదరాబాద్‌లోని చిన్నికృష్ట ఆఫీసులో ఆయన కుమార్తె ఆకుల ఊర్మిళాదేవి జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా రచయిత–నిర్మాత చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య అద్భుతమైన అమృత ఘడియలుగా పెద్దలు నిర్ణయించారు. 1850వ సంవత్సరం నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ముహూర్తం రాలేదు. ఇలాంటి అరుదైన ముహూర్తంలో మా సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తెలుగు–కన్నడ వెర్షన్లకు ఒక దర్శకుడు, తమిళం–మలయాళం వెర్షన్లకు ఒక దర్శకుడు, హిందీ వెర్ష¯Œ కు మరో దర్శకుడు పని చేయనున్నారు. ఆయా భాషల్లో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వారందరి పేర్లు త్వరలో చెబుతాం. ఫస్టాఫ్ కథ గోవాలో, సెకండాఫ్ కాశీలో జరుగుతుంది. నా ఐదేళ్ల కష్టానికి ఫలితం ఈ కథ. కరోనా వ్యాప్తి తగ్గాక షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వెంకట్ ప్రసాద్ చేయనున్నారు. -
వైఎస్‌గారికి మరణం లేదు
‘‘వైఎస్ రాజశేఖర రెడ్డిగారు మరణించలేదు.. తెలుగు మాట్లాడే ప్రజలందరి హృదయాల్లో జీవించే ఉన్నారు’’ అని రచయిత చిన్నికృష్ణ అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి (బుధవారం (జులై 8)ని పురస్కరించుకుని చిన్నికృష్ణ మాట్లాడుతూ– ‘‘మీరు (వైఎస్) ఆ దేవుడు పంపించిన బిడ్డ సార్. ఆ పేద ప్రజల కోసం చేయాల్సిందల్లా చేసి, నిష్క్రమించారు. మీకు మరణం లేదు సార్. నేను మిమ్మల్ని ఎన్నోసార్లు కలిశాను. ఇప్పుడు ఒక విషయాన్ని తొలిసారి అందరికీ చెబుతున్నా. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని రోడ్డు నంబర్ 14లో నేను ఉండేవాణ్ణి. ఆ ముందు వీధిలో మీరు ఉండేవారు. జనార్ధన్‌గారు అనే ఆయన మీ వద్ద చాలా ఏళ్లుగా పనిచేసేవారు. మీకు బాగా ఆప్తుడాయన. ఆయనతో కలిసి ఎన్నోసార్లు మీ వద్దకు వచ్చాను. నా పుట్టినరోజున ఉదయాన్నే మీ వద్దకు వచ్చి మీ ఆశీస్సులు తీసుకుని వెళ్లాను. మీ అభిమానం, ఆప్యాయత, ప్రేమని ఎప్పటికీ మరువను. మీరు విలక్షణ రాజకీయ చతురుడే కాదు.. అవసరంలో ఉన్నవాళ్లకు అభయదాత, రైతన్నలకు ఆపద్భాంధవుడు. పౌరుషానికి ప్రతినిధి, నిరుపేదల పాలిట ప్రత్యక్ష దైవం. రాజకీయం అంటే వాగ్దానం చెయ్యడమే కాదు.. దాన్ని నెరవేర్చడం అని భావితరాలకు నేర్పిన ప్రజల ముఖ్యమంత్రి మీరు’’ అన్నారు. -
మా అమ్మే మా స్టార్!
అమ్మంటే అనురాగం అమ్మంటే ఆనందం అమ్మంటే ఆత్మీయం అమ్మంటే ధైర్యం అమ్మంటే త్యాగం అమ్మంటే రక్షణ అమ్మంటే ఓదార్పు అమ్మంటే... చెప్పడానికి ఇలా ఎన్నో ఉంటాయి. ‘మదర్స్ డే’ సందర్భంగా ‘మా అమ్మే మా స్టార్’ అంటూ కొందరు సినీ స్టార్స్ పంచుకున్న విశేషాలు. మన తప్పులను ప్రేమించే వ్యక్తి అమ్మ: దేవిశ్రీ ప్రసాద్ ► అమ్మ గురించి మాటల్లో చెప్పడం అంత సులభం కాదు. కొన్ని వేల పాటలు చేసినా కూడా అమ్మ గురించిన కంప్లీట్ ఎమోషన్‌ను చెప్పలేం. ఎందుకంటే వారు చూపించే ప్రేమ అటువంటిది. అమ్మ చేసే త్యాగాలు అటువంటివి. మనం ఎన్ని తప్పులు చేసినా ఎప్పుడూ ఒకేలా మనల్ని ప్రేమించగల ఏకైక వ్యక్తి అమ్మ. అటువంటి ప్రేమకు ప్రతిరూపమైన మదర్స్ అందరికీ ‘హ్యాపీ హ్యాపీ మదర్స్ డే’. ► మా కుటుంబంలో మేమందరం సాధించిన ప్రతి విజయానికి కారణం మా అమ్మగారే. మా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. మా అందరి పని కంటే మా అమ్మగారు మా కోసం చేసే పనే ఎక్కువ. ఏ పనినైనా చాలా అకింతభావంతో, ఏకాగ్రతగా చేస్తారు. ‘మీరు చేసే హార్డ్‌వర్క్, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్లో మాకు పదిశాతం ఉన్నా మేం జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళతాం’ అని మా అమ్మగారితో నేను అంటుంటాను. ఈ విషయాన్ని మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. ‘మా ఆవిడకు నలుగురు పిల్లలండీ నాతో కలిపి’ అని మా నాన్నగారు అంటుండేవారు. మా నాన్నగారిని కూడా మా అమ్మగారు ఓ చిన్నపిల్లాడిలా చూసుకున్నారు. ► నా ఇంటిపైనే నా స్టూడియో ఉంటుంది. దాని పై నా పెంట్‌హౌస్ ఉంటుంది. కింద అమ్మ ఉంటారు. పైన నేను ఉంటాను. మాములుగానే లంచ్ టైమ్, డిన్నర్లను మా అమ్మగారితో చేస్తాను. ఈ క్వారంటైన్ సమయంలో అమ్మతో ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నాను. ఖాళీ సమయంలో నేను ఏదైనా వంటకాన్ని ట్రై చేద్దామన్నా కూడా అమ్మ ఒప్పుకోవడం లేదు. ► ఈ మదర్స్ డే రోజు మా అమ్మగారి గురించి మాట్లాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మగారి గురించి చెప్పమంటే నేను చెబుతూనే ఉంటాను. మా అమ్మగారు వంట చేసినప్పుడల్లా నేను ఓ కాంప్లిమెంట్ ఇస్తూనే ఉంటాను. ‘మమ్మీ వంటలో నువ్వు ఇళయరాజాగారిలా అని’. మ్యూజిక్ గురించి ఏదైనా పోల్చాలంటే నా దృష్టిలో ఇళయరాజాగారు నంబర్ వన్. ‘మ్యూజిక్‌లో ఇళయరాజాగారు ఎలానో వంటలో నువ్వు అలా’ అని మా అమ్మకు నేను కాంప్లిమెంట్ ఇస్తుంటాను. ► చిన్నతనం నుంచే మ్యూజిక్ పట్ల చాలా ఆసక్తికరంగా ఉండేవాడిని. చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవాడిని. స్కూలు, మ్యూజిక్ క్లాసులు, ఇంటికి వచ్చిన తర్వాత మ్యాండలిన్ శ్రీనివాస్‌గారి దగ్గర క్లాసులు, మళ్లీ ప్రాక్టీస్.. ఇలా వేళకు భోజనం చేయడానికి కుదిరేది కాదు. అందుకే ఇప్పటికీ నాకు డిఫరెంట్ టైమ్స్‌లో ఆకలి వేస్తుంది. అప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది. ఆశ్యర్యంగా అప్పుడే మా అమ్మగారు ఫోన్ చేసి ‘ఏరా.. ఆకలేస్తుందా’ అని అడుగుతారు. ఇది జరిగినప్పుడల్లా నాకు ఒళ్లు పులకరిస్తుంది. ‘నాకు ఆకలేస్తున్నట్లు మీకు ఎలా తెలిసింది?’ అంటే ‘ఏమోరా నాకు అనిపించింది’ అని చెబుతారు. ఇంకో విశేషం ఏంటంటే.. నేను ఏదైతే తినాలనుకుంటున్నానో మా అమ్మగారు ఆ డిష్ పేరు చెప్పి తింటావా? అని అడుగుతారు. ఉదాహరణకు నాకు ఎగ్ రైస్ తినాలనిపించిందనుకోండి.. ‘ఏరా ఎగ్‌రైస్ తింటావా?’ అని మా అమ్మగారు అడుగుతారు. అమ్మా నేను అదే అనుకుంటున్నాను అంటాను. చాలా ఆశ్చర్యపోతారు. ఇలాంటివి చాలా జరిగాయి. మనం అందరం అమ్మకు రుణపడి ఉండాలి. వారిని ప్రేమిస్తూ, బాగా చూసుకుంటూ, వారితో ఎక్కువ సమయం గడపడమే మనం చేయగలిగింది. ఎందుకంటే వారి స్థాయికి మనం ఎప్పుడూ చేరుకోలేం. హ్యాపీ మదర్స్ డే. విత్ లవ్ టు మై మదర్ శివమణి సత్యమూర్తిగారు. మళ్లీ మళ్లీ నీకే పుట్టాలనుకుంటున్నా: చిన్నికృష్ణ ► బుడి బుడి అడుగుల నుంచి పరుగుల వరకు.. జీవితంలో అమ్మ (లక్ష్మీ సుశీల) ఎన్నో పాఠాలు నేర్పింది. నా జీవిత ప్రయాణానికి కూడా గురువు అయ్యింది. మా ఇంటో ఓ కష్టం వస్తే.. దేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలు తిప్పింది. అమ్మ వేలు పట్టుకుని అన్ని గుళ్లూ తిరిగాను. అప్పుడు ఎన్నో కథలు చెప్పింది. ఆ కథలే ప్రేక్షకులకు చెప్పే రచయితను చేశాయి. ► నేను సంపాదించడం మొదలుపెట్టాక ఏం కావాలని అడిగితే అమ్మ ‘కపిల గోవు’ని అడిగింది. మాకు గోశాల ఉండేది. అమ్మ అడిగిన గోవుని కొనిపెడితే సంబరపడిపోయింది. అమ్మకి తన పిల్లలు ఎప్పుడూ చిన్నవాళ్లే. ఇప్పటికీ నాకు అన్నం తినిపిస్తుంది. ► మానవత్వానికి, మంచితనానికి జంతువుల్లో ఆవుకి ప్రథమ తాంబూలం ఇస్తారు. అలా మానవత్వంలో మా అమ్మకు నేను ప్రథమ తాంబూలం ఇస్తాను. అందర్నీ సమానంగా చూడటం అనేది ఆమె దగ్గరే నేర్చుకున్నాను. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేదు. మా అమ్మగారు ఆర్ఎస్ఎస్సా? మదర్ థెరిస్సానా? ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఆవిడకు అందరూ ఒకటే. ‘మానవకులం’ అనుకుంటుంది. చెడ్డవాళ్లల్లోనూ మంచిని చూసే మనిషి. చెడ్డవాళ్లకు దూరంగా ఉండకు. వీలైతే మంచివాళ్లలా మార్చు అని చెప్పింది. అందుకే ‘అమ్మా... మళ్లీ మళ్లీ నీ కడుపునే పుట్టాలనుకుంటున్నాను’. ► అమ్మ నా దగ్గరే ఉంటుంది. మా అన్నయ్య, చెల్లెలు తెనాలిలో ఉంటారు. వాళ్లతో, వాళ్ల పిల్లలతో ఉండాలని తెనాలి వెళ్లింది. జీవితంలో ఎన్నో ఆనందకరమైన విషయాలకు కారణంగా నిలిచిన అమ్మా... నీకు ‘హ్యాపీ మదర్స్ డే’. లక్ష్మీ సుశీల, చిన్నికృష్ణ చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయాం: కాజల్ అగర్వాల్ ► నా పదేళ్ల కెరీర్లో ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం ఇదే ఫస్ట్ టైమ్. ఇంట్లో వాళ్లతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. అమ్మ, నాన్న, నాన్నమ్మతో ఎక్కువ టైమ్ గడిపే వీలు దొరికింది. అలాగని సమయాన్ని వృథా చేయడం లేదు. నన్ను నేను బిజీగా ఉంచుకుంటున్నాను. అందరం కష్టకాలంలో, భయంలో ఉన్నాం. దీన్ని ఎలా అయినా దాటగలుగుతాం. ► నేను అమ్మకి చాలా క్లోజ్. నేను ఈరోజు మంచి పొజిషిన్‌లో ఉన్నానంటే దానికి కారణం కచ్చితంగా మా అమ్మే. నన్ను సరైన మార్గంలో గైడ్ చేస్తుంటుంది. నాకు వంట నేర్పించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది అమ్మ. ఫైనల్‌గా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేను వంట గది బాధ్యతలు తీసుకోవడం అమ్మకు చాలా సంతోషంగా ఉంది (నవ్వుతూ). ► మా చిన్నప్పుడు నేను, చెల్లెలు (నిషా అగర్వాల్) మదర్స్ డే కోసం స్పెషల్‌గా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి, అమ్మకి ఇచ్చేవాళ్లం. అలాగే ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ మేమే తయారు చేసేవాళ్లం. అమ్మ గదిని బాగా అలంకరించేవాళ్లం. పెద్దయ్యాక లంచ్‌కి బయటికి తీసుకెళుతున్నాం. లాక్డౌన్ ముందు వరకూ మదర్స్ డే అంటే అవుటింగే. కానీ ఇప్పుడు చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయాం. బయటికి వెళ్లలేం కాబట్టి, చిన్నప్పుడు చేసినట్లుగా మా అమ్మ రూమ్‌ని అందంగా డెకరేట్ చేశాం. బ్రేక్‌ఫాస్ట్ కూడా మేమే తయారు చేస్తాం. ► అమ్మకు బహుమతులంటే ఇష్టం ఉండదు. తనతో మేం ఉండటమే పెద్ద గిఫ్ట్ అనుకుంటుంది. ఈ లాక్డౌన్ వల్ల ఓ రెండు నెలలుగా అమ్మతోనే ఉంటున్నాను. ఆవిడకు చాలా ఆనందంగా ఉంది. తల్లి సుమన్ అగర్వాల్‌తో కాజల్ అమ్మ ఏం చెప్పినా వింటాను: నిధీ అగర్వాల్ ► సాధారణంగా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ఇంటిపట్టున ఉండటానికి కుదరదు. ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బావుంది. ఇంట్లో ఉండటం ఎవ్వరికైనా ఇష్టమే కదా. అమ్మ చేతి వంట తింటూ జాగ్రత్తగా ఉంటున్నాం. ఇంట్లో ఉంటే చాలా గారాభంగా చూస్తారు. ఇలా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండి 2–3 ఏళ్లు అవుతోంది. షూటింగ్స్ వల్ల మహా అయితే 2 రోజులు కూడా ఉండటానికి కుదిరేది కాదు. ► చిన్నప్పుడు మదర్స్ డే అంటే అమ్మకి స్వయంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇచ్చేదాన్ని. ఎలాంటి కార్డ్ తయారు చేయాలనే విషయంలో ముందు రోజంతా ఆలోచించేదాన్ని. అలాగే చిన్న చిన్న గిఫ్ట్స్‌తో సర్ప్రైజ్ చేసేదాన్ని. ► ఈ మదర్స్‌డేకి అమ్మకి ఏదైనా కొందామంటే బయటకు వెళ్లే వీలు లేదు. ఇవాళ అమ్మ ఏం చెప్పినా వింటాను (నవ్వుతూ). షూటింగ్స్ ఉన్నప్పుడు ఇంటికి ఫోన్ చేయడం కుదరదు. కొన్నిసార్లు ఇంటి నుంచి ఫోన్ వచ్చినా ఆన్సర్ చేయడం వీలవదు. కానీ ఈసారి నుంచి అమ్మ ఫోన్‌ని ఎప్పుడూ మిస్ చేయకూడదని నిశ్చయించుకున్నాను. ► అమ్మానాన్న ఇద్దరితోనూ నేను క్లోజ్. అమ్మతో మంచి అటాచ్మెంట్ ఉంది. అమ్మకు చిన్న వయసులోనే నేను పుట్టాను. మా ఇద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను అన్ని క్లాస్‌లకు పంపేది. కేవలం చదువు ఒక్కటే కాదు. మన పర్సనాలిటీ డెవలప్ అవ్వాలంటే అన్నీ నేర్చుకోవాలని డ్యాన్సింగ్ క్లాస్, స్పోర్ట్స్ క్లాస్ చేర్పించారు. ప్రస్తుతం నేను సినిమాలో ఈజీగా డ్యాన్స్ చేసినా, ఈజీగా ఎవ్వరితో అయినా కమ్యూనికేట్ అవుతున్నా అంటే చిన్నప్పుడు అమ్మ తీసుకున్న శ్రద్ధ వల్లే. మన ప్రవర్తన, అలవాట్లు ఇవన్నీ అమ్మ పెంపకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా చూస్తే ‘మై మమ్మీ ఈజ్ బెస్ట్’. మంచి చెబుతూ పెంచారు. ► లాక్డౌన్లో వంట గదిలో ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాను. ఇప్పటివరకూ 2 కేకులు బేక్ చేశాను. దోసె, గ్రీన్ చట్నీ, టీ తయారు చేశాను. అన్నింటికీ మా అమ్మ పదికి పది మార్కులు వేశారు. ఏదైనా పని చేస్తే పక్కాగా చేయాలి, లేదంటే పక్కన పెట్టేయాలి అనుకుంటాను నేను. ఆ అలవాటు అమ్మ వల్ల వచ్చింది. అలాగే మా అమ్మ అందర్నీ సమానంగా చూస్తారు. తననుంచి నేను నేర్చుకున్న మరొక విషయం అది. తల్లి ఇందూ అగర్వాల్‌తో నిధి -
మూడు రాజధానులు స్వాగతిస్తున్నా: చిన్నికృష్ణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంశంపై ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ స్పందించారు. విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్ మంచి ఆలోచన అని, ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానులను తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి మద్దతివ్వడం మంచి పరిణామని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతిలోనే జరిగిందని చిన్నికృష్ణ సంచనల వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలే చెప్పారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ ఇప్పటికే నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. (3 రాజధానులను స్వాగతించాలి) కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్ క్యాపిటల్), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్ క్యాపిటల్) ఏర్పాటు చేసేందుకు వీలుందని అన్నారు. ఈ ప్రకటపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను స్వాగిస్తున్నారు. మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని చిరంజీవి రాష్ట్ర ప్రజలను ఇదివరకే కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో రూ. లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. (ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!) -
విడుదలకు సిద్ధమైన ‘అక్షర’
హీరోయిన్ నందిత శ్వేత నటిస్తోన్న తాజా చిత్రం అక్షర. ఈ సినిమాను అల్లూరి వర్మ, అహితేజ బెల్లంకొండలు నిర్మిస్తున్నారు. అక్షర సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ..విద్యావ్వవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్నిచ్చేలా ఈ కథను రూపోంచమన్నారు. ఈ సినిమాలో నందిత శ్వేత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుందని, కమర్షీయల్ ఎలిమెంట్స్ తగ్గకుండా అద్భుతమైన మెసేజ్‌తో ఈ సినిమాని అక్టోబర్ రెండోవారంలో విడుదల చేస్తున్నాట్లు తెలిపారు. అక్షర షూటింగ్ పూర్తి అయిందని, ఇంకా పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని అన్నారు. ఇప్పటికే విడుదల చేసిన అక్షర టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చిందని దీంతో సినిమాపై మా నమ్మకం మరింత రెట్టింపు అయింది, సినిమా కూడా ప్రతి ఒక్కరిని ఖచ్చితం అలరిస్తుందని మేము నమ్ముతున్నామని అన్నారు. అలాగే ఈ సినిమా దర్శకుడు బి. చిన్నికృష్ట మాట్లాడుతూ..ఈ సినిమా అవుట్ పట్పై మాకు పూర్తి సతృప్తిగా ఉందని, సినిమా చాలా బాగా వచ్చిందని తెలిపాడు. అక్షర లాంటి కథలు అరుదుగా వస్తాయని ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. అక్టోబర్ రెండవ వారంలో విడుదల కానున్న మా అక్షర సినిమా మీ అందరికి నచ్చుతుందని అశిస్తున్నాను అన్నాడు. నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ తదితరులు నటిస్తున్నాట్లు వెల్లడించారు. -
‘అర్జున్ రెడ్డి’ని మించేలా!
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన నిర్మాత రాకేష్ రెడ్డి మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి ప్రకటన తిరుమల నుంచి చేశారు. రచయిత చిన్న కృష్ణ ఈ సినిమాకు కథ అందిస్తున్నట్టుగా తెలిపారు. అర్జున్ రెడ్డిని మించే కథను చిన్న కృష్ణ అందించినట్టుగా తెలిపారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్న రాకేష్ రెడ్డి, వచ్చేనెలలో హీరో, దర్శకులను ప్రకటిస్తామన్నారు. గురువారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న రాకేష్ రెడ్డి, చిన్నికృష్ణలు ఈ ప్రకటన చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో రాకేష్ రెడ్డి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్లు కూడా భారీగా రావటంతో తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. -
గిరిపుత్రుడి సాహస యాత్ర
బంజారాహిల్స్: కొందరు అటు చదువులోనో, ఇటు క్రీడల్లోనో రాణిస్తుంటారు. మరికొందరు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. ఈ రెండింటితో పాటు మరిన్ని నైపుణ్యాలపై ప్రతిభను చాటేవారు కొందరే ఉంటారు. ఆ కోవలోకి చెందాడు ఈ గిరిజనపుత్రుడు. పర్వతారోహణమే కాకుండా కరాటే, జానపదగేయ రచయిత, గాయకుడు, స్టిక్ ఫైటర్, ఫిట్టింగ్ మాస్టర్, నటుడు, డాన్సర్ ఇలా అన్ని కలిపితే ఈ చిన్నికృష్ణ నాయక్ అవుతాడు. పుట్టింది గిరిజన తండాలో.. తల్లిదండ్రులది సాధారణ రైతు కుటుంబం.. కుటుంబ పోషణ అంతంత మాత్రమే.. అయితేనేం.. ఆ యువకుడు తాను అనుకున్నది సాధించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ఒకవైపు చదువుకుంటూనే ఇంకోవైపు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ఔరా.. అనిపించుకుంటున్నాడు ఈ గిరిపుత్రుడు. అనంతపురం జిల్లా పామిడి మండలం పాలెంతండా గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, రామావత్నారాయణస్వామి నాయక్ కొడుకు రామావత్ చిన్నికృష్ణనాయక్(26) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీపీఎడ్ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–14లోని లంబాడి బస్తీలో ఉంటున్న చిన్నికృష్ణనాయక్కు పర్వతారోహణ అంటే అమితాసక్తి. 3వ తరగతి చదువుతున్నప్పటి నుంచే అలవోకగా గుట్టలెక్కేవాడు. అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలాడు. గతేడాది నవంబర్ 13న కిలిమంజారో పర్వతారోహణ చేసి రికార్డు సృష్టించాడు. హిమాలయాల్లో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న రెనక్ పర్వతాన్ని అధిరోహించాడు. జమ్మూకాశ్మీర్‌లోని తులియన్సిక్ పర్వతారోహణ చేశాడు. అదే ప్రాంతంలోని మరో ఎత్తైన పర్వతం బైసరన్ అధిరోహించాడు. ఈ లక్ష్యాలన్నీ సాధించిన తర్వాత కిలిమంజారో పంపించడం జరిగింది. ప్రత్యేక శిక్షణ ద్వారా 40 మందిని ఎంపిక చేయగా అందులో కృష్ణ 8వ స్థానంలో నిలిచాడు. తాజాగా రష్యాలో పర్వతారోహణ చేసే అవకాశాన్ని కూడా చేజిక్కించుకున్నాడు. జులై 20వ తేదీన రష్యాలోని ఎల్బ్రోస్ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఆయనకు లేఖ రాశారు. చిన్నికృష్ణనాయక్ కేవలం పర్వతారోహణమే కాకుండా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, పరుగు పందేల్లోనూ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆర్థిక సాయం కావాలి.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో బతుకుతున్న చిన్నికృష్ణనాయక్కు రష్యాలో ఎల్బ్రోస్ పర్వతారోహణ చేసే అవకాశం దక్కింది. దేశంలో ఈ అవకాశం దక్కిన అతికొద్ది మందిలో కృష్ణ కూడా ఒకరు. అయితే.. ఇక్కడికి వెళ్లడానికి సుమారుగా రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని, దాతలు ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 83744 34274 నెంబర్లో సంప్రదించాలని కోరుతున్నాడు. ఈ పర్వతారోహణ చేసి భారతదేశ కీర్తిని దశదిశలా చాటుతాని పేర్కొంటున్నాడు. తనకు ఆర్థిక అండ అందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు. -
‘అసలు నాగబాబు పోటీయే కాదు’
సాక్షి, పశ్చిమగోదావరి : నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుకు జనసేన అభ్యర్థి నాగబాబు పోటీయే కాదన ప్రముఖ సీనీ రచయిత చిన్ని కృష్ణ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు పైగా గెలిచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అభిమాన హీరోల సినిమాలు 10 సార్లు చూడండి కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయమని ప్రజలను కోరారు. గతంలో చిరంజీవికి లక్షల మంది ఓట్లు వేస్తే ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. అదే కుటుంబం నుంచి మళ్లీ ఇద్దరు వచ్చి ఓట్లు అడిగితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమన్నారు. అక్కడ వైఎస్సార్సీసీ అభ్యర్థి శ్రీనివాస్ ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీలో చేరిన రచయిత చిన్ని కృష్ణ
సాక్షి, పాలకొల్లు: ఎన్నికల తేదీ దగ్గర పడుతున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. ఓ వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. పార్టీలో చేరడానికి పలువురు నేతలు క్యూ కడుతున్నారు. రాజకీయ నాయకులే కాకుండా సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖలు కూడా వైఎస్సార్సీపీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా పాలకొల్లులో ఎన్నికల బహిరంగ సభలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణతోపాటు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేటీ రామారావు, అడబాల వెంకట రమణ, బీసీ ఉద్యమ నాయకుడు చింతపల్లి గురు ప్రసాద్‌లకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కేటీ రామారావు ఈ సందర్భంగా చిన్ని కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితం రజినీకాంత్‌తో ప్రారంభమైందని.. రాజకీయ జీవితం వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆరంభం అయిందని తెలిపారు. వైఎస్ జగన్ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రతి పుట్టిన రోజున కలిసేవాడినని గుర్తుచేశారు. వైఎస్సార్ మహానేత అని అన్నారు. టీడీపీ తుడిచి పెట్టుకుపోవాలంటే వైఎస్ జగన్‌ను బలపరిచి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నవరత్నాలు ఏపీలో నవధాన్యాలుగా విరాజిల్లుతాయని నమ్మి పార్టీలో చేరినట్టు వెల్లడించారు. వైఎస్ జగన్ ప్రజలకు ఏం చేస్తారో సూటిగా చెబుతున్నారని.. ఆయన ప్రసంగం విని చాలా మంది ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు. -
పవన్‌కల్యాణ్ చేతిలో మోసపోవద్దు
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతిలో మరోసారి మోసపోవద్దని కాపులకు ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ విజ్ఞప్తి చేశారు. కాపులంటే మెగా ఫ్యామిలీ మాత్రమే కాదని.. తాము కూడా కాపులమేనన్నారు. ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని పవన్‌కు హితవు పలికారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే నీకెందుకు అంత భయమని పవన్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో ఉంటున్న ఆంధ్రులమంతా సంతోషంగానే ఉన్నామని చెప్పారు. రాజకీయం కోసం రాష్ట్రాలను విడదీయొద్దని.. ప్రజల జీవితాలతో ఆటలాడొద్దని పవన్‌కు సూచించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీయొద్దని కోరారు. తాను కూడా కాపు బిడ్డనేనని.. నీ మాటలతో రెచ్చిపోయి హైదరాబాద్‌లో తమపై ఎవరైనా దాడి చేస్తే ఎవరు రక్షిస్తారని చిన్నికృష్ణ ప్రశ్నించారు. పవన్ వచ్చి రక్షిస్తాడా? ఆయన అన్న నాగబాబు వచ్చి రక్షిస్తాడా? అని నిలదీశారు. ఎన్నో రికార్డులను తిరగరాసిన ఇంద్ర వంటి సినిమాను చిరంజీవికి ఇస్తే కనీసం భోజనం కూడా పెట్టకుండా పంపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన వీళ్లు.. ఒక్కసారైనా తమకు ఓట్లు వేసిన ప్రజల్ని కలిశారా? అని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని.. ముందు రాజకీయ ఓనమాలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్రాక లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమవుతుంటే.. ఏ రోజైనా టీడీపీ ప్రభుత్వాన్ని అడిగావా అని పవన్‌ను చిన్నికృష్ణ ప్రశ్నించారు. మళ్లీ కాపులను మోసం చేస్తున్న ఘనత పవన్‌దేనన్నారు. టీడీపీ, కాంగ్రెస్, జనసేన కుమ్మక్కై వైఎస్ జగన్ ఒక్కడ్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ ఇప్పటికీ పూర్తి కాలేదని.. ఇక చంద్రబాబు అమరావతి ఎలా పూర్తి చేస్తారని చిన్నికృష్ణ ప్రశ్నించారు. వైఎస్ జగన్ రూపకల్పన చేసిన నవరత్న పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్సీపీ ఘన విజయం తధ్యమన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. -
‘రిజల్ట్ చూసి మీ గుండెలు పగిలిపోతాయి’
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీకి సూపర్ హిట్ కథలను అందించిన ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ, పవన్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నేళ్లలో తన కులం ఏంటో ఎవరికీ చెప్పాల్సి అవసరం రాలేదన్న చిన్ని కృష్ణ తాను కూడా కాపునే అని చెప్పారు. కాపు కులస్థులకు మెగా ఫ్యామిలీ ఒక్కటే రిప్రజెంటేషన్ కాదు.. కాపులు అంటే రంగా, ముద్రగడ లాంటి నాయకులు అన్నారు. మెగాస్టార్ చిరంజీవికి ఆల్ టైం హిట్ సినిమా ఇంద్ర లాంటి కథ ఇస్తే ఏ రోజు కనీసం భోజనం కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ను హీరోగా పరిచయం చేసేందుకు గంగోత్రి కథ కోసం ఎన్నో అవకాశలు వదులుకున్నానని తెలిపారు. పవన్ కల్యాణ్‌కు సినిమాల పట్ల ఫోకస్ లేదన్న చిన్ని కృష్ణ, ఇండస్ట్రీలో తెలుగు వారిని అతి తక్కువ గౌరవించే వ్యక్తి పవన్ అని విమర్శించారు. (చదవండి : తెలంగాణలో ఎవరిని కొట్టారో చెప్పాలి) కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే నువ్వెందుకు ఉలికి పడుతున్నావ్ పవన్ అంటూ ప్రశ్నించారు. 70 ఏళ్లుగా తెలంగాణలో ఎన్నో రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసుంటున్నారని.. వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. అంతేకాదు ఇక్కడి సెటిలర్స్ అంతా పవన్, బాబులకు వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మీరు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇక్కడి వ్యవస్థ మమ్మల్ని పట్టించుకోకపోతే నువ్వొచ్చి కాపాడతావా.? లేక మీ అన్నలు నాగబాబు, చిరంజీవిలు వచ్చి కాపాడతారా.? మా జీవితాలతో ఆడుకునే వ్యాఖ్యలు చేయోద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల సొమ్ముతో ఎదిగిన మీ కుటుంబం వారికి తిరిగి ఏం చేసింది..? సినీ రంగం నుంచి ఇంత పొందిన మెగా ఫ్యామిలీ సినీరంగం కోసం ఒక్క కార్యక్రమమైనా చేసిందా అని ప్రశ్నించారు. అసలు నువ్వు సినీ రంగంలో ఎన్ని విజయాలు సాధించావ్ చెప్పు అంటూ పవన్ ను ప్రశ్నించారు. అజ్ఞాతవాసి.. ఓ విదేశి కథను కాఫీ కొట్టి తెరకెక్కించిన సినిమా కాదా... దొంగతనం చేసిన కథతో సినిమా తెరకెక్కించి ఆ విషయంలో టీ సీరిస్‌కు పెనాల్టీ కట్టిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. రాజకీయం అంటే త్రివిక్రమ్ రాసిచ్చిన డైలాగులు చెప్పటం కాదు పవన్ అంటూ చురకలంటించారు. (చదవండి : అధికారపక్షాన్ని ప్రశ్నించకపోవడమే పవన్ ట్రెండా? ) జగన్ సొంత పార్టీ పెట్టుకొని ప్రజల కోసం కష్టపడుతుంటే.. ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన తండ్రిని చంపారు, బాబాయిని చంపి ఆ నింద వేస్తున్నారు, ఆయన్ని చంపే కుట్రలు చేస్తున్నారు. ఇదా రాజకీయం.. రాజకీయం అంటే ఏంటో సీనియర్ల దగ్గరికి వెళ్లి నేర్చుకో అని పవన్‌కు హితవు పలికారు. మే 23న రాబోయే రిజల్ట్ చూస్తే మీ గుండెలు బద్ధలైపోతాయి, ప్రజలు జగన్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. చంద్రబాబు నాయుడు గోదావరి సాక్షిగా అంత మంది చావుకు కారణమైతే నీకు కనిపించలేదా పవన్, బోయపాటి శ్రీనివాస్ అనే దర్శకుడిని తీసుకు వచ్చి వేల మంది మధ్య షూటింగ్ చేస్తూ ఆడపడుచుల ఉసురు తీసి ఇప్పుడు పసుపు కుంకుమ పంచుతున్నారన్నారు. విజయవాడలో కేవలం 62 పిల్లర్ల ఫ్లైఓవర్‌ను ఇంతవరకు పూర్తి చేయలేకపోయిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనటం లేదే అని పవన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : పవన్ పూటకో మాట.. రోజుకో వేషం ) -
ఏఆర్ డీఎస్పీపై బదిలీవేటు
అనంతపురం సెంట్రల్: పోలీసు శాఖలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణపై ఎట్టకేలకు బదిలీవేటు పడింది. ఈయన్ను వైఎస్సార్ కడప జిల్లా ఏఆర్ డీఎస్పీగా బదిలీ చేస్తూ అక్కడ పనిచేస్తున్న ఎన్.మురళీధర్‌ను అనంతపురం ఏఆర్ డీఎస్పీగా నియమించారు. ఏఆర్‌విభాగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, సిబ్బందిపై వేధింపులు తదితర ఘటనలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. తాజాగా రెండు రోజుల క్రితం ఓ కానిస్టేబుల్‌ను నానా దుర్బాషలాడాడు. దీనిపైనా ‘నోరు తెరిస్తే బూతులే!’ అన్న శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైంది. డీఎస్పీ మాటలతో మానసికక్షోభకు గురైన బాధిత కానిస్టేబుల్ పోలీస్‌స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు.(నోరు తెరిస్తే బూతులే !) అయితే ఉన్నతాధికారులు బుజ్జగించడంతో మిన్నకుండిపోయారు. కేవలం ఈ ఘటన మాత్రమే కాకుండా గతంలో సైతం ఏఆర్ విభాగంలో ఆయన తీరు ఆద్యంతం వివాదాస్పదమయ్యింది. ఎదురుతిరిగే వారిపై కక్షకట్టి డ్యూటీలు వేస్తుండడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీనిపై కొంతమంది సిబ్బంది ఎస్పీ నుంచి డీఐజీ, ఐజీ, డీజీపీ వరకు ఫిర్యాదులు చేశారు. తప్పనిపరిస్థితుల్లో అప్పటి అనంతపురం డీఎస్పీ వెంకట్రావుచే విచారణ జరిపించారు. అయితే నామమాత్రంగా విచారించి సమస్యకు ఫుల్స్టాప్ పెట్టారు. అంత జరిగినా ఆయనలో పెద్దగా మార్పు రాకపోగా సిబ్బందిని మరింత ఇబ్బందులపై గురిచేస్తూ వచ్చారు. ఏఆర్‌లో జరుగుతున్న పరిణామాలను ‘సాక్షి’ ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చింది. తాజాగా జరిగిన పరిణామాలపై విచారణ చేసిన రాష్ట్ర ఉన్నతాధికారులు ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణను బదిలీ చేశారు. -
‘వైఎస్ జగన్‌ను ఎదుర్కొలేకే తప్పుడు ప్రచారం’
సాక్షి, హైదరాబాద్: ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీ మొత్తం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర గురించే మాట్లాడుతోందని తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేసిన ఘనత వైఎస్సార్ కుటుంబానిదేనని అన్నారు. వైఎస్ షర్మిలపై ఆరోపణలు చేయడానికి టీడీపీ నేతలకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. ఆడపడుచుపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ను ఎదుర్కొలేకనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నీచమైన, దగుల్బాజీ, గజ్జి కుక్కలు వైఎస్ షర్మిలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణమన్నారు. వైఎస్ షర్మిల ఫిర్యాదుపై తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా కేసును విచారిస్తుందని నమ్మకం ఉందన్నారు. ఏపీలో పరిపాలన అన్నదే లేదని.. టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. -
ఇది సౌండ్ మాత్రమే.. ఏపీలో బాబు రీసౌండ్ వింటారు..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించటంతో త్వరలో ఆంధ్ర ప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలపై చర్చ మొదలైంది. పలువురు ప్రముఖులు తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్స్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో విశ్లేషిస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ ఈ విషయంపై స్పందిస్తూ ఓ వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ‘తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు గారు టీఆర్ఎస్ పార్టీ సౌండ్ మాత్రమే విన్నారు.. 2019లో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే జనరల్ ఎలక్షన్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినిపించబోయే రీ సౌండ్ వినబోతున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం వినపడే రీ సౌండ్ వినబోతున్నారు’ అంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చెప్పారు. -
చిరునవ్వుకు చిరునామా డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి
-
బాలరాజు త్వరలో వస్తాడు
‘‘బంగారి బాలరాజు’ పాటలన్నీ చాలా బాగున్నాయి. చిన్నికృష్ణ, చిట్టిబాబు రెడ్డిపోగు కొత్తవారైనా చక్కని సంగీతం అందించారు ’’ అని నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. రాఘవ్, కరోణ్య కత్రిన్ జంటగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో కె.యండి. రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘బంగారి బాలరాజు’. ఈ సినిమా ట్రైలర్‌ని అంబికా కృష్ణ రిలీజ్ చేయగా, ఆడియో సీడీలను సురక్ష కంపెనీస్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ పద్మజ మానేపల్లి విడుదల చేశారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ– ‘‘4 కోట్ల లోపు నిర్మించే ప్రతి చిత్రానికి 10 లక్షల సబ్సిడీతో పాటు పన్ను రాయితీ కూడా ఉంటుంది. అయితే.. సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రీకరించాలి’’ అన్నారు. కోటేంద్ర దుద్యాల, కె.యండి. రఫీ, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. ∙కరోణ్య, రాఘవ్ -
సోమయాజులుకు ప్రముఖుల నివాళులు
-
సోమయాజులుకు ప్రముఖుల నివాళులు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆర్థిక సలహాదారుగా పని చేశారు. అగ్రికల్చర్ టెక్నాలజీ డిప్యూటీ ఛైర్మన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. సోమయాజులు మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతలు, ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి డీఏ సోమయాజులుతో తమకు విడతీయరాని అనుబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పథకాలు ప్రవేశపెట్టడంతో పాటు, ఇతర ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి సహకరించిన వ్యక్తుల్లో సోమయాజులు ఒకరు అని కాకాని గుర్తు చేసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ వివరాలను క్షుణ్ణంగా విశ్లేసించగల గొప్ప ఆర్థికవేత్త అని అన్నారు. కుటుంబ సభ్యులకు గోవర్ధన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియచేశారు. చిన్నికృష్ణ సోమయాజులుతో తనకు ఉన్న అనుబంధాన్ని సినీ రచయత చిన్ని కృష్ణ గుర్తు చేసుకున్నారు. సోమయాజులుతో తనకు దాదాపు 10ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ప్రజలకు ఉపయగపడే పలు అంశాల గురించి తెలుసుకోవడానికి రాజకీయవేత్తలు, అధికారులు వచ్చేవారని అన్నారు. ఆయన లేని లోటు ఆంధ్రరాష్ట్రానికి తీరనిలోటని అభిప్రాయపడ్డారు. దేశ, రాష్ట్రాలకు నిస్వార్థంగా సేవ చేసిన గొప్ప వ్యక్తి సోమయాజులు అని కొనియాడారు. తన స్క్రిప్ట్ పనుల్లో చాలా సహాయం చేశారని చిన్నికృష్ణ అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకూ సోమయాజులు పలు అంశాల్లో వారికి అండగా ఉన్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఏదైనా విషయం గురించి సమాచారం కావాల్సి వచ్చి ఆయన వద్దకు క్షణాల్లో నిమిశాలల్లో తయారుచేసి ఇచ్చేవారని తెలిపారు. ఆరోగ్యం సహకరిచంచకపోయినా బెడ్ మీద నుంచే తన కుమారుడికి డిక్టేట్ చేసి మరీ పంపించేవారని మేకపాటి గుర్తుచేసుకున్నారు. ప్రజలకు వైఎస్సార్ చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో సోమయాజులు అందించిన సహకారం ఎనలేనిదని అన్నారు. ఆయనను కోల్పోవడం తెలుగు ప్రజల దురదృష్టమని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేశారు. -
ఆడపిల్ల అబద్ధం ఆడితే?
అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారో? లేదో? తెలీదు కానీ, ఆడపిల్ల అబద్ధం ఆడితే... ఆమె మనసులో ప్రేమ పుట్టిందనే అర్థమంటున్నారు దర్శకుడు వెంకటరెడ్డి ఉసిరిక. క్రాంతిచంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్దాస్, సుపూర, పమేలా ముఖ్య తారలుగా వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి నిర్మించిన సినిమా ‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’. కథారచయిత చిన్నికృష్ణ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘ఒకప్పుడు చిన్న నటీనటులే తర్వాత పెద్ద స్టార్స్‌గా ఎదిగారు. ఈ చిత్రంలో నటీనటులకు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా. బుల్ గానిన్ సంగీతం, దాము నర్రావుల సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్’’ అన్నారు దర్శకుడు.