ఆడపిల్ల అబద్ధం ఆడితే? | Somebody is lying to the girl ? | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల అబద్ధం ఆడితే?

Published Mon, Mar 27 2017 2:25 AM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM

ఆడపిల్ల  అబద్ధం ఆడితే?

ఆడపిల్ల అబద్ధం ఆడితే?

అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారో? లేదో? తెలీదు కానీ, ఆడపిల్ల అబద్ధం ఆడితే... ఆమె మనసులో ప్రేమ పుట్టిందనే అర్థమంటున్నారు దర్శకుడు వెంకటరెడ్డి ఉసిరిక. క్రాంతిచంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్‌దాస్, సుపూర, పమేలా ముఖ్య తారలుగా వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్‌ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి నిర్మించిన సినిమా ‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’.

కథారచయిత చిన్నికృష్ణ ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘ఒకప్పుడు చిన్న నటీనటులే తర్వాత పెద్ద స్టార్స్‌గా ఎదిగారు. ఈ చిత్రంలో నటీనటులకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్‌ ఉన్న సినిమా. బుల్‌ గానిన్‌ సంగీతం, దాము నర్రావుల సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్‌’’ అన్నారు దర్శకుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement