girls
-
మండుటెండలో నిలబెట్టి... ఆపై జుత్తు కత్తిరించి!
జి.మాడుగుల: అసెంబ్లీకి సమయానికి రాలేదని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుతున్న విద్యార్థినుల జుత్తును ప్రిన్సిపాల్ కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజైన శుక్రవారం నాడు పాఠశాల, కళాశాల విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకొని పూజలు చేసుకొని ఆలస్యంగా కేజీబీవీకి వచ్చారు.పాఠశాలలో రోజువారీ నిర్వహించే అసెంబ్లీకి ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు అలస్యంగా రావడంతో వారిపై ప్రిన్సిపాల్ ఆగ్రహించారు. విద్యార్థినులను పాఠశాల, కళాశాలల ఆవరణలో ఎండలో 2 గంటలు సేపు నిలబెట్టారు. అసెంబ్లీకి రాని విద్యార్థినుల్లో కొంతమందిని దండించారు. వీరిలో 15 మందికి జట్టును ఇష్టానుసారంగా కత్తిరించారు. మనోవేదనకు గురైన విద్యార్థినులు ప్రిన్సిపాల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచినా.. వెంబడించి మరీ జుత్తు కత్తిరించినట్టు సమాచారం. వీరిలో ఒక విద్యార్థిని దేవుని మొక్కు ఉందని జుత్తు కటింగ్ చేయవద్దని ప్రాథేయపడినా ప్రిన్సిపాల్ కనికరించలేదు. జుత్తు కట్ చేస్తున్న సమయంలో మనోవేదనకు గురైన ఒక విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయినప్పటికీ తాగడానికి మంచినీరు కూడా ప్రిన్సిపాల్ అందించటానికి నిరాకరించారు. క్రమశిక్షణ నేర్పాలనే... విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సాయి ప్రసన్నను వివరణ కోరగా విద్యార్థినుల జుత్తు బాగా పెరిగిపోవడం వల్ల పేలు పట్టి, తలపై కురుపులు వస్తాయని, క్రమశిక్షణగా ఉంటారనే ఉద్దేశంతో జుత్తు కట్ చేసినట్లు తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సాయిప్రసన్న తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం కేజీబీవీలో విద్యార్థినుల జుత్తును అకారణంగా కటింగ్ చేసినట్టు కొంతమంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ దృష్టికి తీసుకు వచ్చారని ఎంఈవో బాబూరావుపడాల్ తెలిపారు. ఈ విషయంపై కేజీబీవీని సందర్శించేందుకు వెళ్లగా ప్రిన్సిపాల్ సెలవులో ఉన్నట్టు చెప్పారన్నారు. అక్కడ నుంచి ఫోన్లో ప్రిన్సిపాల్‌ని సంప్రదించగా విద్యార్థినులకు జుట్టు పెరిగిపోయిందని, క్రమశిక్షణ(డిసిప్లేన్) కోసం విద్యార్థినుల్లో కొంతమంది జత్తు కటింగ్ చేసినట్టు చెప్పారని ఎంఈవో తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖ, జీసీడీవోకు సమాచారం అందించామని ఆయన వెల్లడించారు. -
వైఎస్సార్సీపీ హయాంలోనే ‘మహోన్నత’ మహిళ!
సాక్షి, అమరావతి: రాష్టంలో మహిళా సాధికారత కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన కృషిని కూటమి ప్రభుత్వం భేష్ అని పరోక్షంగా ప్రస్తావించక తప్పలేదు. కూటమి సర్కారు సోమవారం ప్రవేశపెట్టిన జెండర్ బడ్జెట్ ఉపోద్ఘాతంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండానే గత ప్రభుత్వం సాధించిన ఫలితాలను ప్రస్తావించింది. రాష్ట్రంలో మహిళలను విద్య, ఉపాధి, సంక్షేమం, ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో సాధికారత వైపు అడుగులు వేయించేలా ఐదేళ్ల (2021–25) పటిష్ట కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర బడ్జెట్లో కొంతభాగాన్ని జెండర్ బడ్జెట్ పేరుతో మహిళాభివృద్ధికి ప్రభుత్వం 2021–22 నుంచి కేటాయింపులు చేస్తోంది. 2021–22లో మొదలైన జెండర్ బడ్జెట్ 2022–23 నాటికి మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మొదలైంది.విద్య, ఉపాధి, భూమి కేటాయింపు వంటి అనేక కీలకమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం చేయడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది. దీంతో మహిళలు ఇంటి యాజమాన్యంతోపాటు రాజకీయంగానూ, సామాజికంగానూ ముందడుగు వేశారు. ఫలితంగా మహిళా సాధికారతలో జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ రూపొందించిన ర్యాంకింగ్‌లో 4 నుంచి మూడో ర్యాంకును సాధించింది. 18 మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, వన్‌స్టాఫ్ సెంటర్లు, హెల్ప్‌డెస్‌్కల ఏర్పాటు వంటి అనేక చర్యలు చేపట్టింది. ఇలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అంశాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జెండర్ బడ్జెట్లోని ఉపోద్ఘాతంలో ప్రస్తావించడం విశేషం.జెండర్ బడ్జెట్ కేటాయింపులు ఇలాప్రత్యేకంగా మహిళలు, బాలికల కోసం ఉద్ధేశించిన జెండర్ బడ్జెట్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ప్రధాన కేటాయింపులు తగ్గించింది. ⇒ కూటమి ప్రభుత్వం(2024–25) బడ్జెట్లో 100శాతం కేటాయింపులు (పార్ట్–ఏ ప్రోగ్రామ్)లో రూ.20,935.56కోట్లు కేటాయించింది. 30 నుంచి 99శాతం లబ్ధి కలిగే పథకాలు (పార్ట్–బి ప్రోగామ్)లో రూ.58,355.44కోట్లు కేటాయించింది. మొత్తం రూ.79,291కోట్లు మాత్రమే కేటాయించింది. చిన్నారుల సంక్షేమానికి ఇలా.. ⇒ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నారుల సంక్షేమానికి మొత్తం రూ.21,910.75కోట్లు కేటాయించింది. నూరు శాతం పిల్లలకే ఉద్దేశించిన పథకాలు (పార్ట్–ఎ)లో రూ.13,793.51కోట్లు, పార్ట్–బిలో రూ.8,117.24కోట్లు మాత్రమే కేటాయించింది. -
ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదు
సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్): ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం పోలీసులకు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అన్నారు. ఆడపిల్లలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలను సమాజమే దీటుగా ఎదుర్కోవాలన్నారు. గుంటూరు అరణ్య భవన్లో ఆదివారం అటవీ అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. మహిళలపై నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, వాటి అమలులో చిత్తశుద్ధి కావాలన్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచి్చనా.. కోల్‌కతాలో వైద్యురాలిపై పాశవిక దాడి జరిగిందన్నారు. తమ కళ్లెదుట జరుగుతున్న నేరాలు, ఘోరాలను ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్య నేర్చుకుని, తమపై దాడులకు తెగబడే ఉన్మాదులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. గంజాయి. మత్తు పదార్థాలను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల్ని బెదిరిస్తే సుమోటో కేసులు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే ఎక్కడ ఉన్నా పిలిపిస్తామని ఐపీఎస్ అధికారులపై చేస్తున్న బెదిరింపులపై సుమోటో కేసులు వేస్తామని పవన్‌కళ్యాణ్ హెచ్చరించారు. ఒక మాజీ సీఎం స్థాయిలో పోలీసు అధికారులను బెదిరించడం సరైంది కాదని వైఎస్ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలం అని మాజీ సీఎం అంటున్నారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. 20 ఏళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉంటుందని గతంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారన్నారు.గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట రోడ్ల పక్కన చెట్లు నరికేశారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. షర్మిల కోరితే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని చెప్పారు. సరస్వతి భూములపై చర్యలు సరస్వతి పవర్ ప్లాంట్ భూముల వ్యవహారంపై చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ చెప్పారు. 76 ఎకరాల అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఆక్రమించారని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నామన్నారు. పవర్ ప్లాంట్ పరిధిలో గ్రీన్‌జోన్ ఏర్పాటు చేయలేదని, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు సైతం లేవని అన్నారు. విశాఖ నడి»ొడ్డున గంజాయి పెంచుతున్నారని, గంజాయి సాగు, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అటవీ దళాల అధిపతి చిరంజీవి చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మొద్దునిద్రలో సర్కారు.. చిదిమేస్తున్న కామాంధులు!
సాక్షి, అమరావతి: ఆకాశాన హరివిల్లు విరిస్తే అది తమకోసమేనని ఆనందించే పసిపాపలను కామ పిశాచాలు నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నాయి! పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని తుళ్లింతలతో స్కూల్‌కు వెళ్లే బాలికలపై పాశవికంగా లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. భవిష్యత్‌పై కోటి ఆశలతో కాలేజీకి వెళ్లే విద్యార్థినులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్నారులు, బాలికల ఆర్తనాదాలు అరణ్య రోదనగా మారుతున్నాయి. కూటమి సర్కారు చేతగానితనం తల్లిదండ్రులకు గుండెకోత మిగులుస్తోంది! రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోంది.నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కామ పిశాచాలు ఓ చిన్నారిని అపహరించి హత్యాచారానికి తెVý బడ్డా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు! నాలుగు నెలలు గడిచినా కనీసం మృతదేహాన్ని అయినా బాధిత కుటుంబానికి అప్పగించలేకపోయామనే అపరాధ భావన లేకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది!! చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో 9 మంది చిన్నారులపై అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఐదుగురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి చోటు చేసుకుంది. నాలుగు నెలల్లో రాష్ట్రంలో 91 మంది చిన్నారులు, విద్యార్థినులపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు జరిగాయి. వీరిలో ఏడు మందిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనం.ఆగని అత్యాచారకాండకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రౌడీమూకలు, అసాంఘిక శక్తులు విశృంఖలంగా రెచ్చిపోతున్నాయి. ఐదేళ్ల అజ్ఞాతవాసం తరువాత సంకెళ్లు తెగినట్టుగా యథేచ్చగా సంచరిస్తూ బరితెగించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అచ్చోసిన ఆంబోతుల్లా దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని కీచక పర్వానికి ఒడిగడుతున్నాయి. వరుస అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో జోగుతోంది.పోలీసుల అస్త్ర సన్యాసంబాలికలు, విద్యార్థినులు, మహిళల భద్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పోలీసులు పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన దారుణమే దీనికి తార్కాణం. పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఈ ఏడాది జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తాపీగా ఎనిమిది రోజుల తర్వాత కేసు నమోదు చేసినా ఉపసంహరించుకోవాలని బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ‘ముఖ్య’నేత ఆదేశించినట్టుగా రెడ్‌బుక్ రాజ్యాంగం అరాచకాలకు కొమ్ముకాయడం.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడమే తమ కర్తవ్యంగా పోలీసు శాఖ భావిస్తోంది. చిన్నారులను అపహరించారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదు. అందుకు పుంగనూరులో మైనార్టీ బాలిక ఉదంతమే అందుకు నిదర్శనం.బాలిక అపహరణకు గురైనా విస్తృత గాలింపు చర్యలు చేపట్ట లేదు. మూడు రోజుల తర్వాత నాలుగు కి.మీ. దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అదే పోలీసులు ఫిర్యాదు రాగానే స్పందించి ఉంటే ప్రాణాలతో కాపాడగలిగేవారు. యథా చేతగాని ప్రభుత్వం..తథా చేష్టలుడిగిన పోలీసు! అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. -
తిరుపతిలో మిస్సింగ్ కేసుల కలకలం.. మరో బాలిక అదృశ్యం
సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి నగరంలో రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి అక్సా క్వీన్ మిస్సింగ్ ఘటన మర్చిపోక ముందే మరో కేసు నమోదైంది. పశ్చిమ పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మకుంటకు చెందిన ప్రవల్లికశ్రీ అదృశ్యం కావడంతో తండ్రి సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పదిరోజులుగా కనిపించకపోవడంతో చిన్నారి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.కాగా, ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీలో బాలిక అదృశ్యంపై గత శనివారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక(17) ఈ నెల 14న రాత్రి భోజనం చేసి నిద్రించింది. ఆపై 15వ తేదీ ఉదయం నుంచి బాలిక కనిపించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. -
కీచక టీచర్ నిర్వాకం.. ట్యూషన్లోనే
సాక్షి,హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదో తరగతి విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు.హైదరాబాద్ పిలింనగర్లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ట్యూషన్ ఉపాధ్యాయుడు రాములు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడు చేసిన పనికి మనోవేదనకు గురైన విద్యార్థిని దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కీచక టీచర్ రాములుపై ఫిలింనగర్ పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. -
ఏపీలో పెరుగుతున్న అమ్మాయిలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికమని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. ఈ మేరకు లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను కేంద్రం విడుదల చేసింది. 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు ఈ సర్వే నిర్వహించినట్లు నివేదికలో తెలిపింది. దేశంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని పేర్కొంది.కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,138 మంది అమ్మాయిలుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 1,032 మంది అమ్మాయిలున్నారని వెల్లడించింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలుండగా.. 2023–24లో ఆ సంఖ్య 1,032కు పెరిగిందని పేర్కొంది. అలాగే ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,019 మంది అమ్మాయిలుండగా.. పట్టణ ప్రాంతాల్లో 1,064 మంది అమ్మాయిలున్నట్లు తెలిపింది. దేశం మొత్తం మీద 11 రాష్ట్రాల్లోనే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించింది. జాతీయ స్థాయిలోనూ పురోగతి..దేశం మొత్తం మీద చూస్తే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ.. అమ్మాయిల సంఖ్య గతంలో కంటే పెరిగిందని నివేదిక వెల్లడించింది. దేశంలో 2019–20లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలుండగా.. 2023–24లో ఆ సంఖ్య 981కి పెరిగిందని తెలిపింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోందని నివేదిక పేర్కొంది. అమ్మాయైనా, అబ్బాయైనా.. ఒక్కరు చాలనుకునే వారి సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇక హరియాణాలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 867 మంది అమ్మాయిలు, ఢిల్లీలో 837 మంది, దాద్రా–నగర్–హవేలీ–డామన్–డయ్యూలో 818 అమ్మాయిలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. -
చెరువులో మునిగి ఎనిమిది మంది చిన్నారులు మృతి
పట్నా: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జీవితపుత్రిక పర్వదినం సందర్భంగా రెండు వేర్వేరు గ్రామాల్లోని చెరువులలో స్నానాలు చేస్తూ ఎనిమిది మంది చిన్నారులు నీట మునిగి మృతి చెందారు.ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని మదన్‌పూర్ బ్లాక్‌లోని కుషాహా గ్రామంలోను, బరున్ బ్లాక్‌లోని ఇతత్ గ్రామంలోను చెరువులో స్నానం చేస్తూ చిన్నారులు మృతిచెందడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకాంత్ శాస్త్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ జీవితపుత్రిక పండుగ సందర్భంగా పుణ్యస్నానం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ చెరువులకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆయా చెరువుల వద్దకు వెళ్లి, బాధితులను బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ -
ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్‌ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, ప్రభుత్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. జరిగిన ఘటనను దాచిపెట్టడానికి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యాన్ని రక్షించడానికి ప్రభుత్వం తాపత్రయపడుతుండటంపై విమర్శల జడివాన కురుస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలకు వచ్చిన విద్యార్థినుల జీవితాలను రక్షించాలన్న, వారికి భరోసా ఇవ్వాలన్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని ప్రజలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో యాజమాన్యం వైఫల్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోవడంలో సాగుతూ... ఉన్న జాగుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న గుడ్లవల్లేరు రహస్య కెమెరాల ఘటనపై ప్రజలు, మేధావులు, వివిధ ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం బదులివ్వాల్సి ఉంది. ఎందుకీ ఉదాసీనత?: కళాశాలలో సీనియర్ల పేరుతో ఆకతాయిల వేధింపులు శృతిమించినా యాజమాన్యం ఎందుకు అడ్డుకట్టు వేయలేకపోయింది? ఇప్పుడీ ఘటనతో కళాశాల గుర్తింపు పోతోందని గగ్గోలు పెడుతున్న యాజమాన్యం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించింది? చివరకు విద్యార్థినుల వాష్‌రూమ్‌ల్లో రహస్య కెమెరాలు పెట్టే దుస్సాహసానికి కొందరు ఒడిగట్టినా ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు? ఈ విషయమై వారం క్రితమే విద్యార్థులు యాజమాన్యానికి చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారా? చెప్పి ఉంటే ఎందుకు పోలీసులు స్పందించలేదు? వారం రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంటే వాళ్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కళాశాల యాజమాన్యం టీడీపీ నేతల బంధువులది కాబట్టి.. చూసీచూడనట్టు వదిలేశారా? ఆదిలోనే ఆకతాయిలకు చెక్ పెట్టి ఉంటే.. అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారేదా? ఇంత దారుణ ఘటన జరిగాక కూడా బాధిత బాలికల్లో నైతిక స్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఎందుకు యాజమాన్యం పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తోంది? రహస్య కెమెరాలతో ఏకంగా 300 వీడియోలు తీసిన భాగోతం భగ్గుమంటుంటే ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడంలేదు? ఎవరెవరి వీడియోలు ఉన్నాయో అనే తీవ్ర మనోవేదనతో ఆడబిడ్డలు ఆందోళన చెందుతుంటే యాజమాన్యం, ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం ఎంతవరకు సమంజసం? అని ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎందుకు యత్నించారు?విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? కళాశాల పాలకవర్గ సలహాదారు రవీంద్రబాబు రంగంలోకి దిగి విద్యార్థులకు ఎందుకు బెదిరించారు? అమ్మాయిలు ఆందోళన చేయడంతో రంగంలోకి దిగిన మంత్రి కొల్లు రవ్రీంద, ఎస్పీ, కలెక్టర్ వాస్తవాలను తెలుసుకోకుండా వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు విచారణే చేయకుండా.. ఏం జరిగిందో పరిశీలనే చేయకుండా.. ఉదయం 10 గంటలకే ఈ వ్యవహారంలో ఏమీ లేదని ఎస్పీ ఎలా చెప్పగలుగుతారు? కవరింగ్ కోసం మళ్లీ విచారణ చేస్తామని ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? బాత్ రూమ్‌ల్లో కెమెరాలే లేవని తొలి రోజునే ప్రకటించిన పోలీసులు మరి షవర్లతోపాటు కొన్ని పరికరాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నట్టు? వాటిని పరిశీలనకు పంపడం వెనుక మర్మం ఏమిటి? షవర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు షవర్లలో కెమెరాలు ఉన్నా లేవని చెప్పేందుకా? ఉన్న కెమెరాలను తీసివేసేందుకా? విద్యార్థినుల వీడియోలు వైరల్ చేసినట్టు ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో రికవరీలో ఏం గుర్తించనున్నారు? ఇది కూడా యాజమాన్యానికి అనుకూలంగా చేసేందుకు ఆ ఫోన్లలో ఏమీలేవని చెప్పేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాలుగు రోజుల సెలవుల వెనుక అసలు కారణమిదేనా?ఈ ఘటనలో బాధిత బాలికలకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి సంఘ నేతలు, తల్లిదండ్రులను, మహిళా కమిషన్‌ను హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్లకుండా యాజమాన్యం, పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? యాజమాన్యం ఇప్పుడు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం కెమెరాలను మాయం చేసేందుకేనా? విద్యార్థులను ఇంటికి పంపితే.. హాస్టల్ బాత్రూమ్లలో సాక్ష్యాలు తారుమారు చేయడానికేనా? ఆడపిల్లలు.. ఆధారాలు ఉంటే తనకు పంపాలని సీఎం స్థాయి వ్యక్తి చెప్పడం దారుణం కాదా? విద్యార్థుల గ్రూప్‌ల్లో వైరల్ అయినట్టు చెబుతున్న అటువంటి వీడియోలను ఏ మహిళ అయినా పంపిస్తారా? చట్ట ప్రకారం బాధిత యువతుల ఆధారాలు బయటపెట్టకుండా ఘటనపై దర్యాప్తు చేయాలనే కనీస జ్ఞానం కూడా లేదా కోల్పోయారా? కళాశాలను సందర్శించి అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన కనీస బాధ్యత సీఎంకు లేదా? మదనపల్లెలో కాగితాలు తగలబెడితే నానా రాద్ధాంతం చేసి డీజీపీ, సీఐడీ చీఫ్‌లను హెలికాప్టర్లో çపంపిన సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి గంట ప్రయాణం కూడా లేని గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లడంలేదు? ఆడపిల్లల భవిష్యత్తుకు సంబందించిన ఇంతటి సీరియస్ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు తేలిగ్గా తీసుకుంటోంది? ప్రత్యర్థి పార్టీలో ఉన్నవారిపైన కక్షలు తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్న చంద్రబాబు ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎందుకు అలక్ష్యం వహిస్తున్నారు? అని విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.హోం మంత్రి ఎక్కడ?ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు? చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సీర్సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్‌కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్‌లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
300 మంది అమ్మాయిల జీవితాలు నాశనం..
-
అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు తప్పొప్పులు నేర్పించాలి: బాంబే హైకోర్టు
ముంబై: బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధంపుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలకు చిన్నతనం నుంచే వారి ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. అమ్మాయిలను, మహిళలను గౌరవించడం నేర్పంచాలని సూచించింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని.. అందుకే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.ద్లాపూర్లోని తమ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుపై సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు..తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. బాలురకు లింగ సమానత్వం, సున్నితత్వం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని, పిల్లలకు సమానత్వం గురించి బోధించే వరకు ఏదీ మారదని పేర్కొంది.‘సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ ఉన్నాయి. మన ఇంట్లో పిల్లలకు సమానత్వం గురించి చెప్పేంత వరకు ఏమీ జరగదు. అప్పటి వరకు నిర్భయ వంటి చట్టాలన్నీ పని చేయవు. మనంం ఎప్పుడూ అమ్మాయిల గురించే మాట్లాడుతుంటాం. అబ్బాయిలకు ఏది ఒప్పు, తప్పు అని ఎందుకు చెప్పకూడదు? అబ్బాయిల ఆలోచనా ధోరణిని చిన్నతనంలోనే మార్చాలి. మహిళలను గౌరవించడం నేర్పించాలి’ అని పేర్కొంది.కాగా గత వారం బద్లాపూర్‌లో కిండర్ గార్టెన్ విద్యార్థినులపై పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ అధ్యాపకుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో ఈ ఘటనలను ఎలా అరికట్టాలనే దానిపై కమిటీ సిఫారసులతో ముందుకు రావలని తెలిపింది. -
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్‌దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్‌లో ఫుట్‌బాల్‌లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్‌గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్‌బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్‌బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్‌లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్‌కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్‌రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్‌రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
‘కోల్‌కతాలో జరిగినట్లు...’ బాలికలను బెదిరించిన ఆటో డ్రైవర్
దేశంలో తరచూ అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో జనం ఆగ్రహం వ్యక్తంచేస్తూ, నిందితులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఒక ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్కూల్‌కు వెళుతున్న ఇద్దరు బాలికలను ఓ ఆటో డ్రైవర్ బెదిరించాడు. పైగా కోల్‌కతాలో ట్రైనీ మహిళా డాక్టర్‌కు జరిగినట్టే మీపైన కూడా దాడి చేస్తానని నిందితుడు బెదిరించాడని ఆ బాలికలు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్‌ను చావబాదడాన్ని వీడియోలో చూడవచ్చు. మరోవైపు కొందరు ఆ బాధిత బాలికలకు ధైర్యం చెప్పడం కూడా కనిపిస్తుంది. తరువాత బాధితురాలు ఆ నిందితుడిని చెప్పుతో కొట్టింది.దీనికిముందు ఆటో డ్రైవర్ ఆ బాలికలను వెనుక సీట్లో కూర్చోవాలని, బిగ్గరగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. ఈ నేపధ్యంలో ఆ బాలికలకు డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే ఆ డ్రైవర్ కోల్‌కతా ఉదంతాన్ని గుర్తుచేస్తూ వారిని బెదిరించాడు. దీంతో ఆ బాలికలు ఆటోను ఆపాలని కేకలు పెట్టారు. దీనిని విన్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్‌ను ఆటోలో నుంచి బయటకు లాగి చావబాదారు. "I will do the same to you as happened in Kolkata!" An auto driver threatened a girl. Public caught him and serviced him properly before handing him over to police. pic.twitter.com/BfNvNakZj6— Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2024 -
జనం రోడ్డెక్కనిదే స్పందించరా?
ముంబై: మహారాష్ట్రలో థానే జిల్లాలోని బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు దిగ్భ్రాంతికరమని బాంబే హైకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. దారుణం జరిగిన నాలుగైదు రోజులకు ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగితే గానీ పోలీసులు స్పందించలేదంటూ మండిపడింది. ‘‘పసిబిడ్డలపై అఘాయిత్యం జరిగితే తేలిగ్గా తీసుకోవడమేమిటి? జనం ఆగ్రహంతో వీధుల్లోకి వస్తే తప్ప ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదలదా? అంటూ ఆగ్రహించింది.ఈ కేసులో బద్లాపూర్ పోలీసుల దర్యాప్తు సక్రమంగా లేదంటూ ఆక్షేపించింది. ‘‘బాధితులు ఫిర్యాదు చేశారు గనుక ఈ వ్యవహారం బయటకొచి్చంది. బయటకు రాని కేసులు ఎన్నో ఉండొచ్చు’’ అని అభిప్రాయపడింది. ‘‘పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి రాకూడదు. వారు న్యాయం కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండకూడదు’’ అని పేర్కొంది.‘‘పిల్లలకు స్కూళ్లలో కూడా భద్రత లేకపోతే ఏం చేయాలి? ఇక విద్యా హక్కు చట్టానికి అర్థమేమిటి?’’ అంటూ నిలదీసింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకు జాప్యం జరిగిందని పోలీసులను ప్రశ్నించింది. ‘‘బాలికల భద్రతపై రాజీపడడానికి వీల్లేదు. వేధింపుల గురించి తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయని స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోండి’’ అని ఆదేశించింది. 27లోగా నివేదిక సమర్పించండిబద్లాపూర్ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. స్కూల్ వాష్ రూమ్‌లో అటెండర్ వారిని లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. ఈ నెల 12, 13న దారుణం జరిగితే పోలీసులు 16న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 17న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జస్టిస్ రేవతి మొహితే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌తో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుచేసింది. బాలికలకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని, మరింత బాధకు గురిచేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో 27వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. -
ధవళేశ్వరం బాలికల మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్...
-
Iraq: బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు కుదిస్తూ బిల్లు ప్రతిపాదన
అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.. అయితే ఇది ఆమోదం పొంది చట్టంగా మారితే వివాహానికి కనీస అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించనున్నారు.కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో మహిళ హక్కులను ఇది హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. బిల్లు కానీ పార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లింగ సమానత్వంతోపాటు మహిళా హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ బిల్లు నట్టేట్లో కలిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ బిల్లు ఆమోదం పొందితే, 9 ఏళ్లలోపు బాలికలు మరియు 15 ఏళ్లలోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారు, ఇది పెరిగిన బాల్య వివాహాలు మరియు దోపిడీల భయాలను రేకెత్తిస్తుంది. ఈ తిరోగమన చర్య మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాల పురోగతిని అణగదొక్కుతుందని విమర్శకులు వాదించారు.మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యను ఇది అడ్డుకుంటుందని, వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహ హింస వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రకారం, ఇఆరక్లో 28శౠతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపు వివాహాలుజరుగుతున్నట్లు వెల్లడైంది. అయితే ఇరాక్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ అప్పట్లో చట్ట సభ్యుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. -
పోకిరీల భయంతో రైలెక్కిన ఇద్దరు బాలికలు
యువతులను వేధించే పోకిరీల ఆగడాల గురించి తరచూ వింటుంటాం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే కుర్రాళ్ల గురించి కూడా వినేవుంటాం. ఇలాంటి యువకుల నుంచి తప్పించుకునేందుకు మహిళలు, యువతులు నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా పోకిరీల భయంతో ఇద్దరు బాలికలు చేసిన పని చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న గార్డుకు ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆయన వారిని ప్రశ్నించగా వారు తమకు ఎదురైన అనుభవాన్ని తెలిపారు. తాము హత్రాస్‌లో నివాసముంటామని, ట్యూషన్ ముగిశాక, ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు పోకిరీలు తమకు ఎదురయ్యారని, వారి నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకుని హడావుడిగా రైలు ఎక్కినట్లు తెలిపారు. ఇంతలో రైలు స్టార్ట్ అయ్యిందని, తాము 140 కిలోమీటర్ల దూరంలోని ఇటావా స్టేషన్ రాగానే స్టేషన్లో దిగేశామని తెలిపారు. వీరి మాటలు విన్న గార్డు ఈ సమాచారాన్ని చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు తెలిపారు. వారు ఈ బాలికలను వారి హత్రాస్‌లోని వారి ఇళ్లకు పంపించారు. -
నూటికో..కోటికో, ఈ అమ్మాయిల్ని చూసి నేర్చుకుందాం.. వైరల్ వీడియో
సాటి మనిషి ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో ఉన్నపుడు స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల విషయంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. కానీ చేయగలిగి ఉండి కూడా తమకేమీ సంబంధం లేదు అన్నట్టు పక్కనుంచి వెళ్లిపోతారు చాలామంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విషయం ఏమిటంటే.. మెట్రో స్టేషన్లో ఎక్స్‌లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు ఇది చూసి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్లినాక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్సలేటర్ మీద నుంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చి మరీ ఆయనకు సాయం చేశారు. ‘‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అన్న అందెశ్రీ ఆవేదనను మరిపించేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. మానవత్వం ఇంకా బతికే ఉంది, ఈ అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ కమెంట్ చేయడం విశేషం. అయితే ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యం అంటూ ఒక యూజర్ పేర్కొన్నారు. ఆర్వీసీజీ మీడియా ఎక్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. &Respect for these girls ❤️📈pic.twitter.com/bc6yeRLXl9— RVCJ Media (@RVCJ_FB) August 1, 2024 -
అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే టైప్-1 డయాబెటిస్ ముప్పు ఎక్కువ
ఆధునికకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. అయితే తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యూకే లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన పరిశోధనా బృందం వెల్లడించింది. చిన్నపిల్లలకు టైప్-1 డయాబెటిస్ (T1D) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. తాజా అధ్యయనం ప్రకారం అమ్మాయిల్లో 10 ఏళ్ల తర్వాత టైప్ 1 మధుమేహం రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం ఈ ముప్పు స్థిరంగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది. సెక్స్ హార్మోన్లు పాత్ర పోషిస్తాయని పరిశోధన తెలిపింది. పురుషుల్లోని ఆటోఆంటిబాడీల అభివృద్ధితో దీనికి సంబంధం ఉండవచ్చని సూచించింది. రోగనిరోధక వ్యవస్థ, దీనికి సంబంధించిన ప్రోటీన్లైన్ ఆటోఆంటిబాడీ ఎక్కువున్న అబ్బాయిల్లో ప్రమాదం ఉందని అధ్యయనం చూపించింది. వీరు మెజారిటీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల మాదిరిగా కాకుండా ఈ తరహా మధుమేహానికి ప్రభావితమవుతారని వెల్లడించింది.ఈ అధ్యయనంలో కంప్యూటర్, స్టాటిస్టికల్ మోడలింగ్ డేటా సాయంతో పరిశోధకులు టీఐడీ ఉన్న వ్యక్తుల 235,765 మంది బంధువులను పరిశీలించారు. ఇందులో మగవారిలో అధిక ఆటోయాంటిబాడీ స్థాయిలు ఉన్నట్లు కనుగొన్నారు (అమ్మాయిల్లో: 5.0శాతం, పురుషుల్లో: 5.4శాతం). అలాగే మగవారు మల్టిపుల్ యాంటిబాడీ ప్రతిరోధకాలకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నందున వీరిలో ఐదేళ్ల ముందే ఈ టీఐడీ వచ్చే అవకాశం ఉంది. పదేళ్ల వయస్సులో వచ్చే ప్రమాదంలో మార్పు టీనేజ్-సంబంధిత హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నఅధ్యయన బృందం మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9-13 వరకు జరిగే స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో యూరోపియన్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను ప్రెజెంట్ చేయనున్నారు. -
అందంగా లేనా? అస్సలేం బాలేనా? ఈ డిజార్డర్ గురించి తెలుసుకోండి!
ప్రసిద్ధ దర్శకుడు కరణ్ జోహార్ తాను ‘డిస్మార్ఫియా డిజార్డర్’తో బాధపడుతున్నానని తెలిపాడు. శరీరంలోని ఏదో ఒక అవయవం పట్ల వ్యక్తిలో తీవ్రమైన అసంతృప్తి ఉండి అది సరిగా లేదని పదే పదే బాధపడటమే ఈ డిజార్డర్. యువతీ యువకుల్లో టీనేజీ కాలంలో ఇదిపాదుకుంటే మున్ముందు వారు సామాజిక జీవితంలో ఇబ్బందిపడాల్సి ఉంటుంది. తగిన కౌన్సెలింగ్‌తో దీని నుంచి బయటపడొచ్చు.ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు ఒక టీనేజ్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చూడటానికి అందరూ భావించేటట్టుగా ‘అందం’గా ఉంది. చర్మం రంగు, రూపం, హైట్ అన్నీ బాగున్నాయి. కాని ఆ అమ్మాయికి ‘నా ముక్కు బాగా లేదు’ అని సందేహం, అనుమానం, అదే నిజం అనిపించే అబ్సెషన్. ఆ ముక్కును ఎలా అందంగా చేయించాలి అనేదే ఆమె సమస్య. ‘కాదు నీ ముక్కు చక్కగా ఉంది. నువ్వు అనుకున్నంత లోపం ఏ మాత్రం లేదు’ అని వీరికి చెప్తే ఒక నిమిషం తెరిపిన పడతారు. మరో నిమిషంలోనే ఆ అనుమానం పెనుభూతంలా ముందుకొస్తుంది. ఈ రుగ్మతను ‘బాడీ డిస్మార్ఫియా డిజార్డర్’ అంటారు. ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌లో ఒక కోవ కిందకు వస్తుంది. ఇది ఉన్నట్టుగా చాలామందికి తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కరణ్ జోహార్ దీని గురించి మాట్లాడి తాను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు చెప్పాడు. అందుకే నేను లూజ్ బట్టలు ధరిస్తాను’ అని తెలిపాడు.మైఖేల్ జాక్సన్ కూడాడిస్మార్ఫియా డిజార్డర్‌తో బాధపడిన వాళ్లలో మైఖేల్ జాక్సన్ ఒకడు. అతనికి తన ముక్కు నచ్చలేదు. దాని వల్ల లెక్కకు మించి ప్లాస్టిక్ సర్జరీలు చేసి చివరకు ప్లాస్టిక్ ముక్కు అంటించాల్సి వచ్చింది. మగవారికి తమ జుట్టు, కళ్లు, భుజాలు, పురుషాంగం, పిరుదులు... వీటిలో ఏదో ఒకటి అస్సలు బాగలేదనే భావన బాల్యంలోనో టీనేజీలోనో స్థిరపడి΄ోతుంది. ఆడవాళ్లకు తమ కళ్లు, ముక్కు, పెదవులు, ఒంటి రంగు... వీటిలో ఏదో ఒక అవయవం గురించి అసంతృప్తి ఏర్పడుతుంది. నిజానికి లోకంలో ఎవరూ చెక్కినట్టుగా ఉండరు. ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నా తమదైన రూపంతో బాగానే ఉంటారు. అయితే డిస్మార్ఫియా డిజార్డర్‌లో చూడటానికి మెరుగ్గా ఉన్నా, అంతపెద్ద లోపం ఏదీ లేక΄ోయినా వారి మైండ్ ‘నీ ఫలానా అంగం ఏం బాగ లేదు బాగలేదు’ అని చెప్తూ ఉంటుంది.మిర్రర్ చెకింగ్ఈ డిజార్డర్‌తో బాధపడేవాళ్లు తమకు లోపం ఉందని భావిస్తూ బట్టలతో, ఆభరణాలతో దానిని కవర్ చేసుకుంటున్నామని అనుకుంటూనే పదే పదే అద్దంలో చూసుకుంటూ ఉంటారు. లేదా ఎదుటివారిని ‘బాగున్నానా బాగలేనా?’ అని అడుగుతూ విసిగిస్తూ ఉంటారు. ‘బాగున్నావ్’ అన్నా నమ్మరు. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మటిక్ సర్జరీలు చేయించుకున్నా వీరికి సంతృప్తి కలగదు. ఎందుకు? సమస్య మైండ్‌లో ఉంది కాబట్టి. ఈ సమస్య ఉన్నవారు కాలక్రమంలో నలుగురినీ కలవని స్థితికి చేరుకుంటారు.కౌన్సెలింగ్డిస్మార్ఫియా డిజార్డర్‌తో బాధ పడేవారు ముందు చేయవలసిన పని తమ యథాతథ రూపాన్ని యాక్సెప్ట్ చేయడం. ‘నేను నా రూపాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను’ అని పదే పదే చెప్పుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. లేదా సైకియాట్రిస్ట్‌లను కలిస్తే వారు కౌన్సెలింగ్‌తో సమస్యను దూరం చేస్తారు. లేదా మరీ పదే పదే అందుకు సంబంధించి నెగెటివ్ థాట్స్ వస్తుంటే మందులతో చికిత్స చేస్తారు. ప్రకృతిలో ప్రతి ప్రాణి భిన్నమైన రూపాలతో ఉంటారని తెలుసుకుంటే శారీరక లోపాకు సంబంధించిన ఇలాంటి రుగ్మతలు దరి చేరవు. -
రిలీజ్‌కు ముందే అవార్డుల పంట.. ఆ సినిమా అరుదైన ఘనత!
కని కస్రుతి, ప్రీతి పాణిగ్రాహి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గర్ల్స్ విల్ బి గర్ల్స్'. ఈ చిత్రానికి సుచి తలాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ (IFFLA)లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెలుచుకుంది. రిచా, చద్దా అలీల నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రశంసలు అందుకుంది.ఈ సినిమా ఇప్పటికే రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాన్స్‌లోని బియారిట్జ్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్‌లను గెలుచుకుంది. అంతే కాకుండా సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకుంది. తమ చిత్రం పెద్ద విజయం సాధించడం పట్ల రిచా చద్దా ఆనందం వ్యక్తం చేశారు.రిచా మాట్లాడుతూ.. " మా చిత్రం గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ గెలవడం ఒక అపురూపమైన గౌరవం. మా టీమ్ మొత్తం కృషి, అంకితభావాన్ని గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. 'గర్ల్స్ విల్ బి గర్ల్స్' అనేది మన హృదయాలకు దగ్గరైన కథ. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. -
ఆడపిల్లలు పుట్టడమే పాపమా?
ఖిలా వరంగల్ : ‘ఆడపిల్లలు లేనిదే సృష్టి లేదు. ఆడపిల్లలను బతకనిద్దాం.. సమాజంలో గౌరవంగా నిలుపుదాం.. ఆడపిల్లను చదవనిద్దాం.. ఎదగనిద్దాం.. ఇంటికి వెలుగులు.. ఆడపిల్ల చిరునవ్వులు.. అంటూ ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసినా కొందరు మారడం లేదు. ఆడపిల్లల పట్ల ఇంకా వివక్షే ప్రదర్శిస్తున్నారు. బాలికకు జన్మించిందంటే చాలు.. ఎక్కడో చోట ఆ తల్లిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. ఆడపిల్లలకు జన్మనివ్వడమే ఆ ఇల్లాలు చేసిన పాపం..! ఆడపిల్లలకు జన్మనిచ్చిందని ఓ ప్రభుద్ధుడు.. తన భార్య, ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి గెంటేసి తాళం వేసి పరారు కాగా.. స్థానికులు, బంధువుల సహకారంతో ఆ ఇల్లాలు తన ఇద్దరి పిల్లలతో కలిసి అత్తారింటి ఎదుట ధర్నా చేపట్టింది. ఈ ఘటన ఆదివారం వరంగల్ ఉర్సు కరీమాబాద్ సుభాశ్నగర్లో వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ నాయుడు పెట్రోల్ బంక్ సమీప కాలనీకి చెందిన బైరి వీరస్వామి, నాగమణి దంపతుల కుమార్తె నవితను 14 ఏళ్ల క్రితం వరంగల్ ఉర్సు కరీమాబాద్ సుభాష్‌నగర్‌కు చెందిన బలభద్ర నారాయణ, చంద్రకళ దంపతుల కుమారుడు రాజేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ సమయంలో కట్నం ఇతర కానుకలు అందజేశారు. అయితే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చావంటూ భర్త, అత్తామామ వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో నవిత ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో వీరస్వామి తనకుమార్తె ఎదురవుతున్న కష్టాలు చూడలేక 43వ డివిజన్ నక్కలపల్లిలో ఓ ఇళ్లు, మహారాష్ట్రలోని బీమండిలో ఒక ఇళ్లు బిడ్డకు ఇచ్చేశారు. అయినా ఆడపిల్లలకు జన్మనిచ్చావని మళ్లీ భర్త.. నవితను కొట్టిగా.. ఆరునెలల క్రితం ఒక కన్ను కోల్పోయింది. చికిత్స పొందిన తర్వాత ఆదివారం ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని అత్తారింటికి చేరింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్య, ఇద్దరు కుమార్తెలను ఇంటి నుంచి గెంటేసి తాళం వేసి భర్త తల్లిదండ్రులను వెంట తీసుకుని పరారయ్యాడు. దీంతో నవిత పుట్టింటికి వెళ్లకుండా స్థానికులు , బంధువుల సహకారంతో అత్తారింటి ఎదుట ధర్నా నిర్వహించింది. స్థానికులు.. తాళం ధ్వంసం చేసి భార్య, ఇద్దరు కుమార్తెలు ఇంట్లోకి పంపించారు. రాత్రి సమయంలో భర్త వచ్చి ఏదైనా బెదిరింపులకు పాల్పడితే 100 డైల్ చేసి పోలీసులకు సమాచారం చెప్పాలని భరోసా కల్పించారు. కాగా, ఆడపిల్లలకు జన్మనివ్వడమే నవిత చేసిన పాపమా..? పోలీస్ అధికారులు వెంటనే స్పందించి చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తకు బుద్ధి చెప్పాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. -
ఢిల్లీ మెట్రోలో మరోసారి అమ్మాయిల రచ్చ: వీడియో వైరల్
సోషల్ మీడియా పిచ్చితో మెట్రో రైళ్లలో కొంతమంది తీరు అభ్యంతరకరంగా, తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు మరిచిపోకముందే, తాజాగా ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.इन रील्स वालों के लिए एक दो मेट्रो कही साइड में खड़ी कर दो यार जहां देखो वहां चालू हो जाते है । #DelhiMetro में तो ये चल ही रहा है कही #MumbaiMetro में भी ये चालू न हो जाए pic.twitter.com/l8pzDHKxpy— Mahendra Singh (@mahendrasinh280) June 11, 2024సోషల్ మీడియాలో యూజర్ల రీల్స్‌తో గతంలో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో మెట్రోలో రీల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ యువతీ యువకుల ఆకతాయి పనులకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు కలిసి డ్యాన్సింగ్ వీడియోనే ఇందుకు ఉదాహరణ. తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న కనీస స్పృహను కూడా మర్చిపోయిన అమ్మాయిలు భోజ్‌పురి పాటకి రాడ్ పక్కన నిలబడి స్టెప్పు లేశారు. దీంతో కొంతమంది ప్రయాణీకులు చూసీ చూడనట్టు కొందరు, మరి కొందరు అసహనం వ్యకం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్‌లో పోస్ట్ అయింది. మహేంద్ర సింగ్ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ రీల్స్ చేసేవాళ్ల కోసం ఒకటి రెండు మెట్రోలు సైడ్‌కి నిలపండి రా బాబూ, ఎక్కడ చూసినా ఈ రీల్స్ గోలే.. ఈ జాడ్యం ముంబై మెట్రోకి కూడా విస్తరించకూడదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. -
Mosh Pub: అమ్మాయిలను ఎరగా వేసి దందా చేస్తున్న మోష్ పబ్..
సాక్షి,హైదరాబాద్: డేటింగ్ యాప్స్ కేంద్రంగా పబ్స్ యజమానులు, కొందరు యువతులు చేస్తున్న భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్స్ ఆధారంగా వ్యాపారులు, బడా బాబులకు ఎర వేయడం, వాళ్లను పబ్స్‌కు రప్పించడం ఇందులో మొదటి ఎత్తు. సదరు యువతులకు మద్యం పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ సరఫరా చేసే పబ్స్ నిర్వాహకులు భారీ బిల్లుల్ని మాత్రం వెంట వచి్చన వారికి ఇస్తాయి. ఇలా వచ్చిన సొమ్ములో కొంత వాటా ఆ యువతులకు ఇస్తున్నాయి. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో అనేక మంది బాధితులుగా మారినా ఎవరూ బయటపడలేదు. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని మోష్ పబ్‌లో మోసపోయిన వ్యాపారి సోషల్ మీడియా ద్వారా తన గోడు వెళ్లబోసుకోవడంతో వెలుగులోకి వచి్చంది. ఓ యువతి వలలో పడి రూ.40,505 బిల్లు చెల్లించిన ఆ బాధితుడి వ్యధ ఇది.. టిండర్ యాప్ ద్వారా పరిచయం.. నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన ఈమె కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్నుమీటింగ్ పాయింట్‌గా చెప్పింది. సోమవారం సాయంత్రం అక్కడకు వచ్చిన వ్యాపారిని కలిసిన రితిక కొద్దిసేపటికి సమీపంలోని ఓ భవనం నాలుగో అంతస్తులో ఉన్న పబ్‌కు వెళ్దామని చెప్పింది. అక్కడకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు తీయగా మాట్లాడిన రితిక మద్యం తాగుదామంటూ అడిగింది. వ్యాపారి అంగీకరిచడంతో వెయిటర్‌ను కలిసి ఆ పబ్‌లో ఉన్న వాటిలో ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా వల వేయాలని, పడిన వారిని పబ్‌కు తీసుకురావాలని పబ్ యజమానులు–యువతి మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘పబ్స్ అండ్ గారల్స్’ కలిసి వినూత్న స్కామ్‌కు తెరలేపారు. మద్యం పేరుతో కూల్‌డ్రింక్స్ సరఫరా.. వ్యాపారితో కలిసి సదరు యువతి రాకను గమనించే పబ్ నిర్వాహకులు వెయిటర్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో అతడు ఏ మద్యం ఆర్డర్ తీసుకున్నా.. గ్లాసుల్లో సరఫరా చేసేది మాత్రం కూల్‌డ్రింకే. రితిక సైతం ఆ రోజు ఒక్కో పెగ్గు రూ.1,799 ఖరీదు చేసే పది పెగ్గుల మద్యం ఆర్డర్ చేసింది. ఈ పేరుతో పబ్ నిర్వాహకులు సరఫరా చేసిన కూల్‌డ్రింక్ తాగుతూపోయింది. దీంతో రూ.20 ఖరీదు చేసే కూల్‌డ్రింక్‌కు యువతి సహకారంతో మద్యం రంగుపూసిన నిర్వాహకులు రూ.1,799 చొప్పున వసూలు చేశారు. ఈ ‘మద్యం’తో పాటు ఇతర డ్రింక్స్, తినుబండారాలు కలిపి రూ.40,505 (పన్నులతో కలిపి) బిల్లు చేసింది. చివరకు వెయిటర్ బిల్లు తీసుకువచి్చన తర్వాత అది వ్యాపారి చేతిలో పెట్టిన యువతి వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానంటూ ఉడాయించింది. దాదాపు పది పెగ్గులు తాగిన ఆ యువతిలో ఎలాంటి తేడా లేకపోవడం, తూలకుండా నేరుగా నడిచి వెళ్లడంతో పాటు ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఆ పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ పరిశీలించి షాక్ అయ్యాడు. అక్కడ వేదనలు నిత్యకృత్యం సదరు పబ్‌లో ఇలాంటి మోసాలు నిత్యకృత్యమంటూ అనేక మంది వెలిబుచ్చిన వేదనలు ఆ రివ్యూస్‌లో ఆ వ్యాపారికి కనిపించాయి. ఓ వ్యక్తి రూ.16 వేలు, మరో వ్యక్తి రూ.24 వేలు, ఇంకొకరు రూ.20 వేలు చొప్పున చెల్లించారని తెలిసింది. వీరిలో ఒకరైతే బాత్రూమ్కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్‌లోనే వేచి ఉన్నారట. దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లుకు అదనం. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని, అలా వచి్చన మొత్తంలో యువతులు కొంత కమీషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే రంగ ప్రవేశం చేసిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మోష్ పబ్‌పై కేసు నమోదు హైటెక్ సిటీలోని మోష్ పబ్ యాజమాన్యంపై శుక్రవారం సుమోటో కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఎస్సై ఎన్వీ రమణ తెలిపారు. కొన్ని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి, అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి, వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని, వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా యువతులకు, పబ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బాధితుల భయమే వీరికి వరం ఇలా యువతుల వల్లో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటున్నారు. దీంతో తాము మోసపోయామని తెలిసినా.. యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువుపోతుందని భయపడుతున్నారు. దీంతో కొందరు మాత్రం పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్‌లో విషయం పొందుపరుస్తున్నా.. అనేక మంది మిన్నకుండిపోతున్నారు. ఇదే అటు పబ్ నిర్వాహకులు, యువతులకు వరంగా మారుతోంది. ఈ తరహా దందాలో ఆ ఒక్క పబ్‌లోనే కాదని, నగరంలోని అనేక పబ్బుల్లో జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. వాటిలోకి ఈ ‘జంటలు’ ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి, నమోదు చేసుకుంటున్నారు. ఈ హనీట్రాప్ దందాపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలా చేయడం కచి్చతంగా నేరమే అని, దీనికి యువతులతో పాటు పబ్స్ నిర్వాహకులు బాధ్యులని స్పష్టం చేస్తున్నారు. బాధితులుగా మారిన ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
హైదరాబాద్ పబ్‌ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొంతమంది పబ్ యజమానులు.. అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్‌లో కొత్త మోసానికి తెరతీశారు. పబ్ యజమానులు, అమ్మాయిలు.. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు.ఒక వ్యాపారవేత్తకు రితికా అనే యువతి పరిచయం కాగా, పరిచయం అయిన మరుసటి రోజే కలుద్దామని చెప్పి హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రమ్మంది. మరుసటి రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద చేరుకున్నారు. వ్యాపారవేత్తను పబ్‌లోకి తీసుకెళ్లి తియ్యని మాటలు చెప్పి గంట లోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి తాగింది. రూ. 40,505 రూపాయిలు బిల్‌ను చేతిలో పెట్టి రితిక జారుకుంది. బిల్లును చూసి ఆ వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 45 వేల రూపాయల మద్యం తాగిన రితిక తూలకుండా బయటికి వెళ్లిపోవడంతో విస్మయం చెందిన వ్యాపార వేత్త.. పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్ ని అమ్మాయికి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నాడు.పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఇలాగే ఆ యువతి, పబ్ యాజమానుల చేతిలో చాలా మంది మోసపోయి పోయినట్లు తేలింది. రెండు రోజుల పరిధిలోని ఈ పబ్బులో ఇలాంటి మోసాలు జరిగినట్లు గుర్తించారు. తనకు జరిగిన మోసంపైన సోషల్ మీడియాలో ఆధారాలతో సహా వ్యాపారవేత్త బయటపెట్టాడు.