అమ్మాయిల్లో తొలి పీరియడ్స్‌ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం | Obesity a possible contributor to early menarche in girls Study | Sakshi
Sakshi News home page

అమ్మాయిల్లో తొలి పీరియడ్స్‌ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం

Published Thu, Jun 6 2024 1:05 PM | Last Updated on Thu, Jun 6 2024 1:05 PM

Obesity a possible contributor to early menarche in girls Study

సాధారణంగా  ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న  జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు,  తదితర కారణాల  రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే  పీరియడ్స్‌ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా  అధ్యయనంలో వెల్లడైంది.

హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో  రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య  ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ  అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.

ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో  తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్‌కనిపించగా,  2000- 2005 మధ్య జన్మించిన  56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్‌ రెగ్యులర్‌గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు  కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్‌ తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement