early
-
అమ్మాయిల్లో తొలి పీరియడ్స్ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం
సాధారణంగా ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, తదితర కారణాల రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్కనిపించగా, 2000- 2005 మధ్య జన్మించిన 56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్ తెలిపారు. -
ఓటు వేసిన మాజీ ప్రధాని షరీఫ్
పాక్‌లో నేడు జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) (పీఎంఎల్ (ఎన్)) చీఫ్ షెహబాజ్ షరీఫ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని షరీఫ్ లాహోర్‌లోని మోడల్ టౌన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో షరీఫ్ మాట్లాడుతూ తమ దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఓటింగ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై షెహబాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా తాత్కాలిక కేంద్ర సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంగి ఇస్లామాబాద్‌లోని ఎన్-46లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. కాగా బుధవారం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పిషిన్, ఖిలా సైఫుల్లాలో జరిగిన జంట ఉగ్రదాడుల్లో పలువురు మరణించారు. వందలమంది గాయపడ్డారు. -
త్వరగా రిటైర్ అవుదామనుకుంటున్నా.. రిటైర్మెంట్ ఫండ్ ఎలా?
నా వయసు 35 ఏళ్లు? 55 ఏళ్లకే రిటైర్ అవుదామని అనుకుంటున్నాను. ఆ సమయానికి రిటైర్మెంట్ ఫండ్‌ను సిద్ధం చేసుకోవడం ఎలా? – కీర్తిలాల్ మీ రిటైర్మెంట్కు ఇంకా 20 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంది. 55 లేదా 60 ఏళ్లకు రిటైర్ అవుదామని అనుకుంటే పెట్టుబడులకు ఇంకా 20–25 ఏళ్ల వ్యవధి మిగిలి ఉంటుంది. ఈక్విటీలో పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఈ సమయం చాలు. మీరు ఏ వయసులో రిటైర్ అయినా.. ఈక్విటీ పెట్టుబడులకు రిటైర్మెంట్ లేదని గుర్తు పెట్టుకోవాలి. ఈక్విటీల్లో ఉన్న పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకుని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన విధానం కాదు. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో కొనసాగించాలి. అప్పటి వరకు సమకూర్చుకున్న ఈక్విటీ పోర్ట్‌ఫోలియో నుంచి మీకు సగటు రాబడి వచ్చినా విశ్రాంత జీవనాన్ని సాఫీగా సాగించొచ్చు. ఇప్పటికైనా మించిపోయింది లేదు కనుక ఈక్విటీల్లో పెట్టుబడులు ప్రారంభించండి. ఒకటి రెండు ఫ్లెక్సీక్యాప్ (ఫోకస్డ్) ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పెట్టుబడులను క్రమంగా (ఏటా) పెంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు కాంపౌండింగ్ ప్రయోజనం కనిపిస్తుంది. ఇప్పటి నుంచి వీలైనంత అధిక మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని గుర్తుంచుకోవాలి. తగినంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీ అవసరాలకు సరిపడా నిధి ఎలా మారుతుంది? కనుక ఇప్పటి నుంచి వీలైనంత మేర దూకుడుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లడమే ముందున్న మార్గం. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్‌లో మంచిది ఏదనే విషయంలో సందేహం నెలకొంది. ఏ పథకం మంచిది? – రమేష్ ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది ఇది చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూసిన తర్వాత నచ్చిన పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు. - సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఢిల్లీలో ముందుగానే చలికాలం సెలవుల ప్రకటన
దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతుండంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరడంతో ఢిల్లీలోని విద్యాసంస్థలకు సెలవుల్ని పొడిగించింది. నవంబర్ 09 నుంచి 18 దాకా సెలవులు ఉంటాయని ప్రకటిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలో గత ఆరురోజులుగా విషపూరిత వాయువులు వాతావరణాన్ని కమ్మేశాయి. రాబోయే కొద్ది రోజుల్లోనూ ఈ పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి నగరానికి ఉపశమనం లభించకపోవచ్చని ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ బుధవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. సాధారణంగా డిసెంబర్-జనవరిలో చలి తీవ్రత దృష్ట్యా సెలవులు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. అయితే ఈసారి ఆ సెలవుల్ని కాలుష్యం నేపథ్యంలో ముందుకు జరిపినట్లు ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. బుధవారం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి అతిషి, రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్, ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరై .. స్కూళ్ల సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 10, 12వ తరగతులకు మినహా మిగతా అక్కడి తరగతుల విద్యార్థులు ఈ శుక్రవారం(నవంబర్ 10) తేదీ వరకు స్కూళ్లకు హాజరు కానక్కర్లేదని(ఫిజికల్ క్లాస్‌లకు మాత్రమే) ఆదేశించింది. అయితే పరిస్థితి తీవ్రతరం అవుతుండడంతో తాజాగా సెలవుల్ని పొడిగించింది. దేశ రాజధానిలో కాలుష్యం స్థాయిలు ఈ సీజన్లో తొలిసారి తీవ్రమైన జోన్లోకి ప్రవేశించాయి. వచ్చే రెండు వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 కేంద్రాల్లో వాయు నాణ్యత సూచీ (AQI) ‘తీవ్రమైన’ విభాగంలో నమోదు కావడం గమనార్హం. నగర వాసుల మెడపై వేలాడుతున్న కాలుష్య కత్తిని తప్పించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది, కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు 395 ఉన్న AQI.. బుధవారం ఉదయానికి 421కి చేరింది. దేశ రాజధాని ప్రాంతంలోని నోయిడా 409 వద్ద వాయు నాణ్యత సూచీ నమోదు అయ్యింది. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం -
కోడ్ కూయక ముందే సరిహద్దులో తనిఖీ కేంద్రాలు..
మంచిర్యాల : రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేదుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల కోసం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. జిల్లా సరి హ ద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. మంచిర్యాల–జగిత్యాల, జిల్లాల సరిహ ద్దు ప్రాంతమైన దండేపల్లి మండలం గూడెం అటవీ చెక్‌పోస్టు వద్ద, దండేపల్లి పోలీసులు తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మద్యం, డబ్బు, ఓటర్లను ప్రలోభ పె ట్టేందుకు తరలించే వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టి, తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చాక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారీ మాత్రం ముందుగానే తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. -
స్టేషన్‌కు వచ్చి చూస్తే రైలు లేదు.. రాలేదనుకుంటా? అంతలోనే షాక్!
ముంబయి: గోవా ఎక్స్‌ప్రెస్ రైలు 45 మంది ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని మన్మాడ్ స్టేషన్లోకి 90 నిమిషాలు ముందుగానే వచ్చి ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. రైలును అందుకోవడానికి నిర్ణీత సమయానికి స్టేషన్‌కి వచ్చిన ప్రయాణికులు విషయం తెలుసుకుని తెల్లబోయారు. వాస్కోడగామ-హజరత్ నిజాముద్దీన్ గోవా ఎక్స్‌ప్రెస్ మహారాష్ట్రలోని మన్మాడ్కు ఉదయం 10.35కి రావాల్సి ఉంది. కానీ అది రూటు మార్చుకుని ఉదయం 9.05 గంటలకే స్టేషన్‌కు చేరుకుంది. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్టేషన్లో నిలిచి, వెంటనే పరుగులు తీసింది. తీరిగ్గా నిర్ణీత సమయానికి గోవా ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్యాసింజర్లు స్టేషన్‌కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయిందని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. స్టేషన్ మేనేజర్ని నిలదీశారు. తమ ప్రయాణానికి మరో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. రైల్వే సిబ్బంది తప్పిదం వల్ల ఈ పొరపాటు జరిగిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి డాక్టర్ శివరాజ్ మనస్పూరే తెలిపారు. గోవా ఎక్స్‌ప్రెస్ ఎప్పుడూ వచ్చే బెళగామి--మిరాజ్-దౌండ్ మార్గంలో కాకుండా రోహా-కల్యాణ్-నాసిక్ రోడ్ మార్గంలో మళ్లించారని పేర్కొన్నారు. అందుకే మన్మాడ్ స్టేషన్‌కి సమయానికి ముందే వచ్చేసిందని వెల్లడించారు. మన్మాడ్ స్టేషన్లో స్టాప్ లేకున్నా గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ప్రయాణికులను తరలించారు. అక్కడి నుంచి జల్గాన్లో వరకు ప్రయాణికులను తీసుకువెళ్లారు. బాధిత ప్రయాణికుల కోసం జల్గాన్లో గోవా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: కావాలనే లీక్ చేశారు.. మణిపూర్ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు -
వారం ముందుగానే రుతుపవనాలు..!
న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత గడువుకంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణం కంటే వారం రోజుల ముందుగానే మే 25న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అధికారులు వెల్లడించారు. సాధారణ పరిస్థితుల్లో జూన్ 1వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉండగా.. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రుతుపవనాలు చాలా ముందుగా దేశంలోని ప్రవేశిస్తున్నట్టు అధికారులు తెలిపారు. గతేడాది కూడా నైరుతి రుతుపవనాలు రెండు రోజుల ముందుగానే(మే 30న) దేశంలోకి ప్రవేశించాయి. -
తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు?
-
ప్రజాసాధికార సర్వే త్వరితగతిన పూర్తిచేయాలి
కాకినాడ సిటీ : అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లు అలసత్వం ప్రదర్శించకుండా ప్రజా సాధికార సర్వేను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునీట ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జాయింట్ కలెక్టర్లతో ప్రజాసాధికార సర్వేపై సమీక్షించారు. ఈనెల 26 తేదీలోపు సర్వే పూర్తి చేయాలన్నారు. సర్వే పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు క్షేత్రస్ధాయిలో పర్యవేక్షించి నిరే్ధశించిన గడువులోపు పూర్తయ్యేలా చూడాలన్నారు. జిల్లా నుంచి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 76.55 శాతం సర్వే పూర్తి చేశామని మిగిలినది గడువులోపు పూర్తి చేస్తామన్నారు. ట్యాబ్‌లు, డివైజెస్ సర్వే పూర్తయిన ప్రాంతాల నుంచి మిగిలిన ప్రాంతాలకు పంపించే చర్యలు తీసుకున్నామన్నారు. నిర్ణీత సమయానికి సర్వే పనులు పూర్తిచేసి, నివేదిక పంపడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ అలీమ్ బాషా, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
త్వరితగతిన పుష్కర పనులు పూర్తిచేయాలి
నాగార్జునసాగర్ పుష్కరాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సాగర్ పుష్కరఘాట్ల ఇన్చార్జి, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి కోరారు. శనివారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో కాంట్రాక్టర్లు,సంబంధిత ఇంజనీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పనులు సకాలంలో పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కూలీల సంఖ్యను పెంచైనా అసంపూర్తి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ రమేశ్,ఈఈ వెంకట్‌రెడ్డి, డీఈ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. ఎస్ఈ కార్యాలయంలో జయశంకర్ జయంతి ఎస్ఈ కార్యాలయంలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాజెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ అధ్యక్షుడు జానపాటిరాములు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.