పాక్‌లో నేడు జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) (పీఎంఎల్ (ఎన్)) చీఫ్ షెహబాజ్ షరీఫ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని షరీఫ్ లాహోర్‌లోని మోడల్ టౌన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో షరీఫ్ మాట్లాడుతూ తమ దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందన్నారు.
ఓటింగ్‌కు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై షెహబాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా తాత్కాలిక కేంద్ర సమాచార శాఖ మంత్రి ముర్తజా సోలంగి ఇస్లామాబాద్‌లోని ఎన్-46లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. కాగా బుధవారం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని పిషిన్, ఖిలా సైఫుల్లాలో జరిగిన జంట ఉగ్రదాడుల్లో పలువురు మరణించారు. వందలమంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment