గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడి.. 70 మంది మృతి | Israel Devastating Attack on Gaza Large Number of People Killed | Sakshi
Sakshi News home page

గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడి.. 70 మంది మృతి

Published Thu, Mar 20 2025 1:37 PM | Last Updated on Thu, Mar 20 2025 1:45 PM

Israel Devastating Attack on Gaza Large Number of People Killed

ఇజ్రాయెల్ సైన్యం(Israeli army).. గాజాపై విధ్వంసకర దాడితో విరుచుకుపడింది. ఈ దాడిలో 70 మందికిపైగా ప్రజలు మృతిచెందివుంటారని సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం గాజాలో  తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడి బుధవారం రాత్రి  మొదలై గురువారం ఉదయం వరకు కొనసాగింది.

ఈ భకర దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మృతిచెందారు. గాజాకు చెందిన వైద్యులు గురువారం ఈ సమాచారాన్ని మీడియాకు అందించారు. దక్షిణ గాజా పట్టణాలైన ఖాన్ యూనిస్, రఫా, బీట్ లాహియాలోని పలు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని వైద్యులు తెలిపారు. అయితే మొత్తం మరణాల సంఖ్య ఎంత అనేదీ వెల్లడించలేదు. అయితే ఉత్తర, దక్షిణ గాజాలో ఈ తెల్లవారుజామున జరిగిన  దాడిలో 70 మందికి పైగా ప్రజలు మృతిచెందినట్లు అల్ జజీరా(Al Jazeera) వెల్లడించింది.  

ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ వారం రోజుల క్రితం విచ్ఛిన్నమైంది. నాటి నుండి ఇజ్రాయెల్ సైన్యం గాజాపై నిరంతరం  దాడులు చేస్తూనే ఉంది. మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్.. గాజాపై భీకర దాడి చేసింది. ఈ దాడుల్లో 400 మందికి పైగా జనం మరణించారు. తమ బందీలను విడుదల చేయనందుకు హమాస్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో హమాస్‌పై భారీ దాడులు చేయాలంటూ తమ సైన్యాన్ని ఆదేశించారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర , దక్షిణ గాజాలో దాడులకు దిగుతోంది.  

ఇది కూడా చదవండి: Parliament: నినాదాల టీ షర్టుతో ఎంపీ.. స్పీకర్‌ ఆగ్రహం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement