
తమ శత్రువులను మట్టుబెట్టడమే లక్ష్యంగా హమాస్, హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్లను అంతమొందించడమే టార్గెట్‌గా వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న నిరంతర దాడులతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఉక్కిరిబిక్కిరవుతోంది.
ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానికి దాడుల్లో గాజాలోని హమాస్ ప్రభుత్వాధినేత రావి ముష్తాహా మరణించాడు. ఆయనతోపాటు మరో ఇద్దరు హమాస్ కమాండర్లు సయేహ్ సిరాజ్ సమేహ్ ఔదేహ్ మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. కానీ, కొన్ని నెలల క్రితమే తాము జరిపిన దాడుల్లో వారు చనిపోయినట్లు వెల్లడించింది.
‘సుమారు 3 నెలల క్రితం ఉత్తర గాజాలోని ఒక భూగర్భ సొరంగంపై ఐడీఎఫ్, ఐఎస్‌ఏ సంయుక్తంగా జరిపిన దాడిలో ముగ్గురు హమాస్ టాప్ కమాండర్లు మరణించారు. గాజాలోని హమాస్ ప్రభుత్వ అధిపతి రౌహి ముష్తాహా, హమాస్ పొలిటికల్ బ్యూరో, హమాస్ లేబర్ కమిటీ నాయకుడు ససయేహ్ సిరాజ్, జనరల్ సెక్యూరిటీ మెకానిజం కమాండర్‌సమేహ్ ఔదేహ్ చనిపోయారు’ అని ఐడీఎఫ్ తమ ఎక్స్ పేర్కొంది. అయితే హమాస్ మాత్రం ఇజ్రాయెల్ ప్రకటనను ధృవీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment