
టెల్‌అవీవ్:గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఏ క్షణమైనా తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఒప్పందం ప్రకారం హమాస్ తమ వద్ద ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ బందీలను శనివారం వదిలిపెట్టినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం 620 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టలేదు. తమ దేశానికి చెందిన మిగిలిన బందీలను వదిలిపెట్టేదాకా ఎవరినీ విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది.
పాలస్తీనా ఖైదీలను జైలు నుంచి బయటికి తీసుకువచ్చి తిరిగి జైలులోకే పంపించారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఆరుగురు బందీల విడుదల సమయంలో హమాస్ వ్యవహరించిన తీరు క్రూరంగా,అవమానకరంగా ఉందని ఇజ్రాయెల్‌తో పాటు ఐక్యరాజ్యసమితి కూడా ప్రకటించింది. శనివారం బందీలను విడిచిపెట్టే సందర్భంగా గాజాలో ప్రత్యేకంగా వేసిన స్టేజిపై వారిని ప్రదర్శించి వేడుకలాగా చేయడంపై ఇజ్రాయెల్ అభ్యంతరం తెలిపింది.
పైగా బందీల వెంటే ఆయుధాలు పట్టుకున్న ఉగ్రవాదులు ఉండడం సరికాదని పేర్కొంది.తొలి విడత గాజా కాల్పుల విరమణ ఒప్పందం కాల పరిమిత మరో వారం రోజుల్లో ముగియనుంది.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి వేలాది మందిని చంపడంతో పాటు కొందరిని వారి వెంట బందీలుగా తీసుకెళ్లారు.అనంతరం ఇజ్రాయెల్ గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో 45 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment