గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌కు అమెరికా దూరంగా ఉండడంపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఈ క్రమంలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపుల్ల పడింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రతిపాదించిన డిమాండ్‌ను అమెరికా వీటో ఉపయోగించి వీగిపోయేలా చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ ముందు నుంచే కోరింది. కానీ, అమెరికా పూర్తిగా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. దీంతో అగ్రరాజ్యంపై ఇజ్రాయెల్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శాంతి చర్చల కోసం తమ బృందాన్ని అమెరికాకు పంపించాలనుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ వెనక్కి తగ్గారు.
దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంబంధించి చర్చల కోసం తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా ఇజ్రాయెల్‌ను ఆహ్వానించింది. అయితే తాజా పరిణామాలతోనే ఇజ్రాయెల్ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ తీర్మానం వల్ల ఇజ్రాయెల్‌తో సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని యుఎస్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇరాన్‌తో సహా పలు దేశాలకు దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత, రక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పూర్తి మద్దతును తెలియజేస్తున్నారని వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవన్ స్పష్టం చేశారు.
ఇక.. గాజా కాల్పుల విమరణను తక్షణమే అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం డిమాండ్ చేసింది. భద్రతా మండలిలోని సమావేశానికి 14 దేశాల సభ్యులు హాజరుకాగా.. అందులో పదిమంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దీంతో ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలను వెంటనే విడిచిపెట్టాలని తెలిపింది. అయితే ఈ సమావేశంలో అమెరికా తీర్మానాన్ని ప్రతిపాదించకుండా ఓటింగ్‌కు దూరం ఉంది. అయితే కాల్పుల విరమణ చేపట్టాలని మాత్రం కోరింది. మొత్తంగా.. ఆమెరికా వ్యవహరించిన తీరుపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment