ceasefire
-
పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్
టెల్అవీవ్:కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇటు ఇజ్రాయెల్ , అటు హమాస్ ఒప్పందం అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఒప్పదంలో భాగంగా ఇజ్రాయెల్ తాజాగా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇప్పటికే హమాస్ తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో నుంచి ముగ్గురిని విడుదల చేసింది.అనంతరం ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం అమల్లోకి వచ్చింది.ఆరు వారాల్లో హమాస్ 33 మంది బందీలను, ఇజ్రాయెల్ దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వంలో భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి ఆ పార్టీ వైదొలగింది. పార్టీకి చెందిన ముగ్గురు నేతలు ఇప్పటికే తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.2023 అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1200 మందిని చంపారు.కొంత మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు.దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 47 వేల మంది దాకా మరణించినట్లు సమాచారం. తాజా కాల్పుల విరమణతో గాజాలో శాంతి నెలకొనే అవకాశాలున్నాయి. -
గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు..70 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్(Israel) జరిపిన దాడుల్లో70 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో 17 మంది దాకా మరణించారు.‘తెల్లవారుజామున రెండు గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. 14,15 మంది దాకా నివసించే మా పక్కనున్న ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంట్లోని వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు’అని పొరుగున ఉండేవారు తెలిపారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు.మరోవైపు గాజా(Gaza)లో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలకు అమెరికా ప్రభుత్వ సహకారం ఉంది. బందీల విడుదలకు ఒప్పుకోవాలని హమాస్‌ను మధ్యవర్తులు కోరుతున్నారు. అప్పుడే కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. -
Sakshi Cartoon: ఇజ్రాయెల్-హెజ్బొల్లా కాల్పుల విరమణ
ఇజ్రాయెల్-హెజ్బొల్లా కాల్పుల విరమణ -
అమల్లోకి కాల్పుల విరమణ
జెరూసలేం: అనూహ్యంగా కుదిరిన ఇజ్రాయె ల్–హెజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం అమల్లోకి వచ్చింది. తాత్కాలిక కాల్పుల విరమణ 60 రోజులపాటు అమల్లో ఉంటుంది. దక్షిణ లెబనాన్ ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్ సైన్యం ఈ కాలంలో అక్కడి నుంచి వెనక్కి మళ్లుతుంది. ఆయా ప్రాంతాలను లెబనాన్ సైతం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. ఒప్పందం ప్రకారం.. ఆక్ర మణకాలంలో ఆయా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన హెజ్బొల్లా స్థావరా లను తిరిగి నిర్మించకూడదు. 14 నెలలకాలంగా సరిహద్దు వెంట యుద్ధం కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల స్థానికులు మళ్లీ తమ స్వస్థలాలకు వచ్చి ధ్వంసమైన తమ ఇళ్లు, దుకాణాలను నిర్మించుకోవచ్చు. ‘‘ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటీలతో మాట్లాడా. తా త్కాలిక కాల్పుల విరమణ శాశ్వతంగా ఉండిపోవాలని ఆశిస్తున్నా’’ అని శ్వేతసౌధం నుంచి అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యా నించారు. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌కు హెజ్ బొల్లా నుంచి లభిస్తున్న ఆయుధ, నైతిక మద్ద తును అడ్డుకునేందుకే ఇజ్రాయెల్ ఈ కా ల్పుల విరమణకు అంగీకారం తెలిపిందని అంతర్జాతీయ మీడియా లో వార్తలొచ్చాయి. అయితే హెజ్బొల్లాతో పోరులో నిండుకున్న ఆయుధ సంపత్తిని తిరిగి సమకూర్చుకునేందుకు ఈ కాల్పుల విరమణ కాలాన్ని ఇజ్రాయెల్ వాడుకుంటోందని తెలుస్తోంది. -
యుద్ధం ఆపేస్తేనే ఒప్పందం
జెరూసలేం: గాజా స్ట్రిప్‌లో యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయెల్‌తో బందీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ స్పష్టం చేసింది. యుద్ధం ముగియకుండా, ఖైదీల మార్పిడి జరగదని హమాస్ తాత్కాలిక చీఫ్ ఖలీల్ అల్ హయా బుధవారం పేర్కొన్నారు. దురాక్రమణకు ముగింపు పలకకుండా బందీలను ఎందుకు వదిలేస్తామని ఆయన ప్రశ్నించారు. యుద్ధం మధ్యలో ఉండగా తమ వద్ద ఉన్న బలాన్ని మతి స్థిమితం లేని వ్యక్తి కూడా వదులుకోడని వ్యాఖ్యానించారు. సంప్రతింపులను పునరుద్ధరించడానికి కొన్ని దేశాలు, మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నాయని, తాము ఆ ప్రయత్నాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యుద్ధం ఆపడానికి ఆక్రమించినవారు నిబద్ధతతో ఉన్నారా? లేదా అనేది ముఖ్యమని హయా చెప్పారు. చర్చలను బలహీనపరిచే వ్యక్తి నెతన్యాహు అని రుజువవుతోందన్నారు. మరోవైపు బేషరతుగా శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా బుధవారం వీటో చేసింది. కాల్పుల విరమణలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను తక్షణమే విడుదల చేయాలని స్పష్టంగా కోరే తీర్మానానికి మాత్రమే అమెరికా మద్దతు ఇస్తుందని ఐరాసలో అమెరికా రాయబారి స్పష్టంచేశారు. ఒప్పందానికి ఇరుపక్షాలు సుముఖత చూపకపోతే మధ్యవర్తిత్వ ప్రయత్నాలను నిలిపివేస్తామని హమాస్, ఇజ్రాయెల్‌కు తెలియజేశామని కాల్పుల విరమణ మధ్యవర్తి అయిన ఖతార్ ప్రకటించింది. దోహాలోని హమాస్ రాజకీయ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయలేదని ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ నవంబర్ 19న ప్రకటించారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి మధ్యవర్తిత్వ ప్రయత్నాలను సులభతరం చేయడానికి హమాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అల్ అన్సారీ చెప్పారు. అయితే హమాస్‌ను బహిష్కరించాలని ఖతార్‌ను అమెరికా కోరిందని, దోహా ఈ సందేశాన్ని హమాస్‌కు చేరవేసిందని వార్తలు వచ్చాయి. ఈజిప్టు ప్రతిపాదనను స్వాగతించిన హమాస్ గాజా స్ట్రిప్‌ను నడపడానికి అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రత్యర్థి ఫతా ఉద్యమంతో కలిసి ఒక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్టు చేసిన ప్రతిపాదనను హమాస్ స్వాగతించింది. యుద్ధం ముగిశాక గాజాను ఈ కమిటీ నడిపించి, సమస్యలను పరిష్కరిస్తుందని హయా చెప్పారు. అయితే ఒప్పందం ఇంకా ఖరారు కాలేదన్నారు. యుద్ధం తరువాత గాజాను పాలించడంలో హమాస్ పాత్రను ఇజ్రాయెల్ తిరస్కరించింది. -
‘విరమణకు నస్రల్లా అంగీకారం’
బీరూట్: బీరూట్‌పై ఇటీవల ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారు. అయితే ఆయన హత్యకు ముందు కాల్పుల విరమణకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసినట్లు లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్ అన్నారు. హత్యకు ముందే ఇజ్రాయెల్‌తో నస్రల్లా కాల్పుల విరమణకు అంగీకరించారని తెలిపారు. అదేవిధంగా కాల్పుల విరమణకు సంబంధించిన నిర్ణయం గురించి నస్రల్లా అమెరికా, ఫ్రెంచ్ ప్రతినిధులకు కూడా తెలియజేసినట్లు వెల్లడించారు. సెప్టెంబరు 27న ఇజ్రాయెల్ బీరూట్‌పై వైమానిక దాడుల చేసినట్లు సమయంలో నస్రల్లా దక్షిణ శివారు ప్రాంతం దహియేలోని ఒక బంకర్లో ఉన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ దాడిలో హత్యకు గురయ్యే కొన్ని రోజుల ముందు లెబనాన్ నుంచి పారిపోవాలని నస్రల్లాను హెచ్చరించినట్లు బుధవారం రాయిటర్స్ ఓ కథనంలో పేర్కొంది.ఇజ్రాయెల్ శుక్రవారం జరిపిన భారీ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా సంస్థ చీఫ్ షేక్ హసన్ నస్రల్లా (64)తో పాటు పలువురు అగ్ర శ్రేణి కమాండర్లు మృతి చెందారు. హెజ్బొల్లా కూడా దీన్ని ధ్రువీకరించింది. ‘నస్రాల్లా తన తోటి అమరవీరులను చేరుకున్నారు’ అంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పాలస్తీనాకు మద్దతుగా శత్రువుపై పవిత్రయుద్ధం కొనసాగుతుంది’ అని ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.చదవండి: ఇజ్రాయెల్ వార్నింగ్ వేళ.. ఇరాన్ సుప్రీం నేత సంచలన ట్వీట్ -
నెతన్యాహు తగినంత కృషి చేయటం లేదు: బైడెన్
న్యూయార్క్: ఆరుగరు బంధీలను మిలిటెంట్ సంస్థ హమాస్ హత్య చేయటంపై ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎయిర్‌పోర్టులు, ఆస్పత్రులు, బ్యాంకుల్లో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. కాల్పులు విరమణకు ప్రధాని నెతన్యాహు ఒప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం నెతన్యాహు వ్యవహిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తుది ఒప్పందం చాలా దగ్గరలో ఉందని అన్నారు. అయితే ఈ ఒప్పందంలో విషయంలో నెతన్యాహు మాత్రం తగినంత కృషి చేయటం లేదని బైడెన్ ఆరోపణలు చేశారు.చదవండి: గాజా సొరంగంలో ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు -
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
బోర్గో ఎగ్నాజియా(ఇటలీ): సరిగ్గా జీ7 శిఖరాగ్ర భేటీ మొదలైన రోజే షరతులు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ తక్షణం అమలుచేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనను ప్రచార ఎత్తుగడగా అని ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ అభివరి్ణంచారు. ఇటలీ సారథ్యంలో ఈ ఏడాది జీ7 భేటీ జరిగాక శనివారం విలేకరుల సమావేశంలో మెలోనీ మాట్లాడారు. ‘‘ కుదిరితే జపాన్, లేదంటే అమెరికా, బ్రిటన్, కెనడాలు సంయుక్తంగా ఉక్రెయిన్‌కు 50 బిలియన్ డాలర్లమేర రుణాలు ఈ ఏడాది చివరికల్లా అందిస్తాయి. యూరప్‌లో స్తంభింపజేసిన రష్యా ఆస్తులను వాడుకుని తద్వారా ఈ రుణాలను చెల్లిస్తాయి. యురోపియన్ యూనియన్ సభ్య దేశాలకు ఈ రుణాలతో ఎలాంటి సంబంధం లేదు. అమెరికా, బ్రిటన్ వంటి జీ7 దేశాలే ఈ రుణ అంశాలను చూసుకుంటాయి’ అని స్పష్టంచేశారు. గాజా స్ట్రిప్‌పై భీకర దాడులతో వేలాది మంది అమాయక పాలస్తీనియన్ల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్‌ను జీ7 దేశాలు ఎందుకు శిఖరాగ్ర సదస్సులో తీవ్రంగా మందలించలేదు? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ అసలు ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది ఎవరు అనేది మీరొకసారి గుర్తుచేసుకోండి. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మందిని పొట్టనపెట్టుకున్నారు. హమాస్ పన్నిన ఉచ్చులో ఇజ్రాయెల్ పడింది’ అని మెలోనీ వ్యాఖ్యానించారు. ‘‘ అక్రమ వలసలకు వ్యతిరేకంగా జీ7 కూటమి స్పందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆఫ్రికా దేశాలకు నిధుల మంజూరు, పెట్టుబడులు పెంచడం ద్వారా ఆయా దేశాల నుంచి ఐరోపాకు వలసలను తగ్గించవచ్చు’ అని చెప్పారు. ఐరోపా దేశాలకు వలస వస్తున్న ఆఫ్రికా పేదలకు ఇటలీ ముఖద్వారంగా ఉన్న విషయం విదితమే. -
UNSC: బైడెన్ తీర్మానాన్ని స్వాగతించిన హమాస్
న్యూయార్క్: గాజా యుద్ధంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమతి భద్రతామండలిలో అగ్రరాజ్యం అమెరికా సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రష్యా మినహా మిగతా 14 భద్రతా మండలి సభ్య దేశాలు ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు.మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని హమాస్ స్వాగతించింది. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు అమలు చేసే ప్రణాళికకు మద్దుతుగా ఉంటామని, అది కూడా పాలస్తీనా ప్రజలకు డిమాండ్లకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నామని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.మే 31న ఇజ్రాయెల్ చొరవతో మూడు దశల కాల్పుల విరమణ ప్రణాళికను రూపొందించినట్లు అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ‘ఈ రోజు మేము శాంతి కోసం ఓటు వేశాం’ అని ఐరాసలో యూఎస్ అంబాసిడర్ లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అన్నారు. ఇక ఈ తీర్మానాన్ని ఇజ్రాయెల్ సైతం అంగీకరించింది. హమాస్ కూడా ఈ తీర్మానాన్ని అంగీకరించాలని కోరింది. హమాస్, పాలస్తీనా మధ్య అంతర్జాతీయంగా కాల్పుల విరమణ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాలు అంగీకరించనట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి శాంతి ఒప్పదం కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు పలువురు అంతర్జాతీయ నేతలతో సమావేశం అయిన అనంతరం ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. ఇక.. ఈ తీర్మాణంపై రష్యా విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్ నుంచి వివరణాత్మక ఒప్పందాలు లేకపోవడాన్ని రష్యా ఎత్తిచూపింది. తీర్మానం ప్రకారం.. కాల్పుల విరణమ ప్రణాళిక మూడు దశల్లో కొనసాగుతుంది. మొదటి దశలో ఇజ్రాయెల్ బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడితో కూడిన కాల్పుల విరమణ ఉంటుంది. రెండో దశలో ఇరుపక్షాలు శత్రుత్వానికి శాశ్వతంగా ముగింపు పలకాలి. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలి. మూడో దశలో గాజా పునర్నిర్మాణంపై దృష్టి పెట్టే ప్రణాళికను అమలు చేయటం జరుగుతుంది. -
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం.. నెతన్యాహు సంచలన ప్రకటన
జెరూసలెం: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమై ఆదివారం(ఏప్రిల్ 7)తో సరిగ్గా ఆరు నెలలు గడిచిన వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేసేదాకా గాజాలో కాల్పుల విరమణకు ఒప్పుకునేలేదని తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్ క్యాబినెట్ సమావేశానికి ముందు బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఒత్తిడి తమపై పెరుగుతున్నప్పటికీ హమాస్ గొంతెమ్మ కొరికలకు తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఈజిప్టులో తాజా రౌండ్ చర్చలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా, గతేడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూపు హమాస్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడమే కాకుండా కొంత మంది పౌరులను హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాను పూర్తిగా చిధ్రం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి.. ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు -
గాజా ఓటింగ్: అమెరికాపై ఇజ్రాయెల్ గుర్రు!
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌కు అమెరికా దూరంగా ఉండడంపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఈ క్రమంలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపుల్ల పడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రతిపాదించిన డిమాండ్‌ను అమెరికా వీటో ఉపయోగించి వీగిపోయేలా చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ ముందు నుంచే కోరింది. కానీ, అమెరికా పూర్తిగా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. దీంతో అగ్రరాజ్యంపై ఇజ్రాయెల్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శాంతి చర్చల కోసం తమ బృందాన్ని అమెరికాకు పంపించాలనుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ వెనక్కి తగ్గారు. దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంబంధించి చర్చల కోసం తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా ఇజ్రాయెల్‌ను ఆహ్వానించింది. అయితే తాజా పరిణామాలతోనే ఇజ్రాయెల్ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ తీర్మానం వల్ల ఇజ్రాయెల్‌తో సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని యుఎస్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇరాన్‌తో సహా పలు దేశాలకు దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత, రక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పూర్తి మద్దతును తెలియజేస్తున్నారని వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవన్ స్పష్టం చేశారు. ఇక.. గాజా కాల్పుల విమరణను తక్షణమే అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం డిమాండ్ చేసింది. భద్రతా మండలిలోని సమావేశానికి 14 దేశాల సభ్యులు హాజరుకాగా.. అందులో పదిమంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దీంతో ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలను వెంటనే విడిచిపెట్టాలని తెలిపింది. అయితే ఈ సమావేశంలో అమెరికా తీర్మానాన్ని ప్రతిపాదించకుండా ఓటింగ్‌కు దూరం ఉంది. అయితే కాల్పుల విరమణ చేపట్టాలని మాత్రం కోరింది. మొత్తంగా.. ఆమెరికా వ్యవహరించిన తీరుపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. -
గాజా కాల్పుల విరమణకు ఐరాస భద్రతా మండలి డిమాండ్
ఇజ్రాయెల్, పాలస్తీనా సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) డిమాండ్ చేసింది. ఇలా భద్రతా మండలి డిమాండ్ చేయటం తొలిసారి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని యూఎన్ఎస్సీ పేర్కొంది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా హాజరుకాకపోవటం గమనార్హం. భద్రతా మండలిలో 14 మంది సభ్యులు హాజరు కాగా.. అందులో 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘గాజా ప్రజలు తీవ్రంగా బాధ పడుతున్నారు. ఈ దాడులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమాంత్ర ఆలస్యం కాకుండా ఈ దాడులకు ముగింపు పలుకడమే మన బాధ్యత’ అని భద్రతా మండలి సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితిలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా తెలిపారు. మరోవైపు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికా వీటో ప్రయోగించాలని ఇజ్రాయెల్ ఆర్మీ కోరింది. అయితే పవిత్ర రంజామ్ మాసంలో గాజాలో కాల్పుల విరమణ జరగటం కోసమే అమెరికా భద్రతా మండలి సమావేశానికి గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 32 వేల మంది మరణించారు. ఇక.. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1160 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మొత్తం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లగా.. వారి చేతిలో ఇంకా 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇటీవల గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. -
గాజాలో కాల్పుల విరమణ.. ‘యూఎన్’లో వీగిన అమెరికా తీర్మానం
న్యూయార్క్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సభ్య దేశాల్లో 11 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానానికి అల్జేరియా వ్యతిరేకంగా ఓటు వేయగా గుయానా ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆకలితో అలమటిస్తున్న గాజా యుద్ధ బాధితులు మానవతా సాయం పొంందేందుకు వీలుగా ఆరు వారాల పాటు కాల్పుల విరణమణ పాటించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే దీనికి ప్రత్యామ్నాయ తీర్మానంపై ఓటింగ్ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శనివారం మళ్లీ సమావేశం కానుంది. తీర్మానంలోని చైనా, రష్యాలకు అభ్యంతరమున్న పదాలను మార్చినట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తాజా తీర్మానంలో పొందుపరిచినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మాస్కోలో ఐసిస్ మారణహోమం -
Israel Hamas War: కాల్పుల విరమణపై బైడెన్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధంలో తక్షణ తాత్కాలిక కాల్పుల విరమణ హమాస్ గ్రూపు చేతిలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వచ్చే వారం ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసంలో 40 రోజుల పాటు కాల్పుల విరమణ కోసం ఖతార్, ఈజిప్టులకు చెందిన దూతలు ఈజిప్టు రాజధాని కైరోలో హమాస్ గ్రూపు ప్రతినిధులతో జరుపుతున్న చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాల్పుల విరమణ డీల్‌లో భాగంగా ఇటు హమాస్ తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బంధీలను విడుదల చేయాల్సి ఉంటుంది. మరోవైపు గాజాకు మానవతాసాయాన్ని భారీగా పెంచేందుకు అనుకూల వాతావరణాన్ని ఇజ్రాయెల్ కల్పించడం అనేవి ప్రధాన షరతులుగా ఉన్నాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పి తమ వద్ద ఉన్న బంధీలను విడుదల చేయాలంటే హమాస్ భారీ డిమాండ్లు ముందు పెడుతోంది. ఇజ్రాయెల్ తమపై దాడులు పూర్తిగా ఆపాలి, ఇజ్రాయెల్ సేనలు గాజా నుంచి వెళ్లిపోవాలి, ఇళ్లు వదిలి పోయిన గాజా వాసులు తిరిగి ఇళ్లకు వచ్చే పరిస్థితులు కల్పించాలి లాంటి డిమాండ్లు పరిష్కరించి యుద్ధానికి పూర్తిగా ఫుల్స్టాప్ పెట్టాలని హమాస్ కోరుతోంది. అయితే వీటన్నింటికి ముందు కాల్పుల విరమణ అనేది తప్పనిసరని పేర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ స్పందిస్తూ తాము కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ పాటించి గాజా వాసులకు మరింత మానవతాసాయం అందించేందుకు మాత్రమే ఒప్పుకుంటామని, హమాస్ అంతమయ్యేదాకా యుద్ధం ఆపేది లేదని తేల్చి చెబుతోంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి(యూఎన్) సెక్యూరిటీ కౌన్సిల్లో ఇజ్రాయెల్, హమాస్‌లు తక్షణం కాల్పుల విరమించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా కాల్పుల విరమణ తీర్మానం ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కావడం విశేషం. ఇదీ చదవండి.. అమెరికా అధ్యక్ష పోరులో మళ్లీ ఆ ఇద్దరే..! -
తక్షణమే కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం కారణంతో గాజాలో తీవ్ర ఆహార కోరత ఏర్పడింది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందిస్తూ.. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్‌కు పిలుపునిచ్చింది. పాలస్తీనాలోని ప్రజలు అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. మానవతా సాయం పెంచాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. అలబామాలోని సెల్మాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హారిస్.. ‘గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడి పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయి. మానవత్వం మమ్మల్ని చర్య తీసుకోవడానికి బలవంతం చేస్తోంది. గాజాలోని ప్రజలకు సహయం పెంచడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కృషి చేయాలి’ అని కమలా హారిస్ అన్నారు. ‘హమాస్ కాల్పుల విరమణను కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ ఒప్పుకోవడానికి సిద్ధం ఉంది. కాల్పుల విరమణ డీల్ చేసుకోండి. బంధీలను వారి కుటుంబాలకు వద్దకు చేర్చండి. అదేవిధంగా వెంటనే గాజా ప్రజలకు కూడా శాంతి, సాయం అందించండి’ అని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఇక.. తమ వద్ద సజీవంగా ఉన్న ఇజ్రాయెల్ బంధీల పేర్లు వెల్లడించడానికి హమాస్ తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ స్థానిక మీడియా పేర్కొంటోంది. ఆదివారం కైరోలో జరిగిన గాజా కాల్పుల విరమణ చర్చలను ఇజ్రాయెల్ బాయ్‌కాట్ చేయటం గమనార్హం. -
Israel-Hamas war: గాజాలో పౌరుల మరణాలను నివారించాలి
ది హేగ్: ఇజ్రాయెల్ ఆర్మీ– హమాస్ మధ్య పోరు కారణంగా గాజాలో తీవ్ర ప్రాణనష్టం సంభవిస్తుండటం, ప్రజలు అంతులేని వేదనకు గురికావడంపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం కారణంగా అక్కడ అమాయక ప్రజల మరణాలను, నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరింది. అయితే, ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలో యుద్ధం ద్వారా మారణహోమానికి పాల్పడుతోందన్న ఆరోపణలను కొట్టివేయరాదని ఐసీజే నిర్ణయించింది. గాజాలో వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలన్న ఉత్తర్వులను మాత్రం ఐసీజే ఇవ్వలేదు. తాజా ఉత్తర్వులు మధ్యంతర తీర్పు మాత్రమేనని చెబుతున్నారు. గాజాలో యుద్ధానికి విరామం ప్రకటించేలా, అక్కడి ప్రజలకు వెంటనే మానవతా సాయం అందేలా చూడాలని దక్షిణాఫ్రికా ఐసీజేలో కేసు వేసింది. దీని విచారణకు ఏళ్లు పట్టొచ్చని భావిస్తున్నారు. -
గాజాపై మళ్లీ విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
టెల్ అవీవ్: ఇజ్రాయెల్- హమాస్ మధ్య మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది. తాత్కాలిక కాల్పుల విరమణ శుక్రవారం ఉదయం ముగియడంతో గాజాలో ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధాన్ని పునప్రారంభించింది. కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందాన్ని ఇటు ఇజ్రాయెల్ గానీ, అటు హమాస్ వర్గం ప్రకటించలేదు. దీంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మళ్లీ ప్రారంభమైంది. కాల్పుల విరమణ ముగియడానికి కొన్ని గంటల ముందే గాజా నుంచి ప్రయోగించిన రాకెట్‌ను తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. అటు.. హమాస్ అనుబంధ మీడియా కూడా గాజా ఉత్తర ప్రాంతాల్లో పేలుళ్లకు సంబంధించిన శబ్దాలు వస్తున్నట్లు నివేదించింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభమైంది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు మొదట దాడి చేశారు. ఆ తర్వాత ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో గాజాపై విరుచుకుపడింది. ఉత్తర గాజాను ఖాలీ చేయించింది. హమాస్ అంతమే ధ్యేయంగా కాల్పులు జరిపింది. అయితే.. అమెరికా సహా ప్రపంచ దేశాల విన్నపం మేరకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య నాలుగు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇజ్రాయెల్, హమాస్ ఇరుపక్షాలు బందీలను వదిలిపెట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ గురువారం ఉదయం నాటికే నాలుగు రోజుల కాల్పుల విరమణ పూర్తైంది. బందీలంతా విడుదల కాకపోవడంతో కాల్పుల విరమణను మరొక్క రోజు పొడిగించారు. శుక్రవారం ఉదయానికి ఆ గడువు కూడా పూర్తవడంతో మళ్లీ కాల్పుల మోత ప్రారంభమైంది. ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్' -
బరితెగించిన పాక్ రేంజర్స్
జమ్మూ/అరి్నయా: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో భారత్–పాక్ సరిహద్దు వెంట గురువారం ఈ ఘటన జరిగింది. సరిహద్దు ఔట్‌పోస్ట్ వద్ద ఉన్న 50ఏళ్ల లాల్ఫామ్ కీమాపై కాల్పులు జరపడంతో రక్తమోడుతున్న ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ‘ పాక్ రేంజర్ల కాల్పులకు దీటుగా బీఎస్ఎఫ్ బలగాలు కాల్పుల మోత మోగించాయి. సమీపంలోని జెర్దా గ్రామంపైనా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు’ అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. -
టీజర్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్‌కు అర్థం తెలుసా?
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిని 'సలార్' టీజర్ విడుదలైన సమయం నుంచి యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. 'సింహం, చిరుత, పులి, ఏనుగు, చాలా ప్రమాదం.. కానీ, జురాసిక్ పార్క్‌లో కాదు.. ఎందుకుంటే ఆ పార్కులో... అంటూ టీనూ ఆనంద్ డైలాగ్‌తో టీజర్ పీక్స్‌కు చేరుకుంటుంది. దీంతో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని మరింత ఆసక్తిగా ఎదురు చూశారు. (ఇదీ చదవండి:సలార్ టీజర్‌తో తేలిపోయింది.. ఇది నిజమేనని) టీజర్లో ప్రభాస్ కటౌట్ క్లియర్‌గా చూపించకపోవడంతో పాటు డార్లింగ్‌కు ఎలాంటి డైలాగ్స్ లేకపోవడంతో కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఇది టీజర్నా లేదా గ్లింప్స్ నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసినా ప్రభాస్ ఫేస్ చూపించకపోవడంతో వారు కొంత వరకు హర్ట్ అయినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: NKR21:కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ!) కేజీఎఫ్ చాప్టర్-1&2 అని ప్రశాంత్ రెండు భాగాలుగా తీసి విజయవంతమయ్యాడు. ఇప్పడు ప్రభాస్‌తో 'సలార్ పార్ట్-1: సీజ్‌ఫైర్‌తో ట్యాగ్ లైన్ ఇచ్చాడు. అంటే పార్ట్-2 ఉంటుందని ఫైనల్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ 'సీజ్ ఫైర్' అంటే ఏమిటని వెతుకుతున్నారు. రెండు దేశాల మధ్య యుద్ద సమయంలో తీవ్రమైన కాల్పులు జరిగినప్పుడు కానీ అత్యంత హింసాత్మకక ఘటనలు జరిగిన సమయంలో కానీ శాంతి కోసం ఒప్పందాన్ని కుదుర్చకునేందుకు ఉపయోగించే పేరే సీజ్ ఫైర్. మరి సినిమాలో ప్రభాస్ వేట ఎంత వైల్డ్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు. -
యుద్దానికి విరమణ ప్రకటించిన సూడాన్
సూడాన్‌లో గత కొన్ని రోజులు జరుగుతున్న అంతర్యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాల సైన్యం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇది చర్చల ద్వారా ఏర్పడిన మొదటి సంధి. అయితే సుడాన్ సైన్యం సోమవారం రాజధాని ఖార్టూమ్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. సహాయక చర్యలను అనుమతించే క్రమంలో వారం రోజుల కాల్పుల విరమణ అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు పారామిలిటరీ ప్రత్యర్థులపైచేయి సాధించేందుకు సూడాన్ సైన్యం ఈ చర్యకు పాల్పడింది. ఇరు సైనిక వర్గాల మధ్య వివాదం చెలరేగినప్పటి నుంచి రాజధానిలోని నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మొబైల్ యూనిట్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం సాయంత్రం వరకు వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే సోమవారం సాయంత్రం 7: 45 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రతినిధులు ఉన్నారు. జెడ్డాలో చర్చల తర్వాత ఒప్పందానికి ఈ బృందం మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందం పొరుగు దేశాలకు పారిపోయిన 2,50,000 మందితో సహా దాదాపు 1.1 మిలియన్ల మందికి ఊరట కల్పించింది.సెంట్రల్ ఖార్టూమ్‌లోని వ్యూహాత్మక స్థానాల నుంచి పౌర భవనాలను ఆక్రమించిన పొరుగు ప్రాంతాల నుంచి RSFని తొలగించడానికి అక్కడి సైన్యం చాలా కష్టపడింది. -
మాట తప్పిన రష్యా.. ప్రకటన చేసిన గంటల్లోనే ఉక్రెయిన్‌పై దాడి
ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా బాంబుల మోత మోగించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్క్స్ నగరంపై రష్యా వైమానిక దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ సమయం 36 గంటల పాటు కొనసాగనుండగా.. నిబంధనలు ఉల్లంఘించిన రష్యా దళాలు క్రామాటోర్క్స్ నగరాన్ని రెండుస్లార్లు మిస్సైల్స్‌తో విరుచుపడినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ గగనతలంలో వైమానిక సైరన్లు వినపడినట్లు తెలిపారు. ఈ దాడిలో ఓ నివాస భవనం దెబ్బతిందని అయితే అందులో ప్రజలు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా రష్యాలో ఆర్థడాక్స్ క్రిస్మస్ కోసం ఉక్రెయిన్‌లో 36 గంటల కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలుజారీ చేసిన విషయం తెలిసందే. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్థరాత్రి 12 వరకు 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా రక్షణ మంత్రిని ఆదేశించారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని గురువారం పేర్కొన్నారు. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి. అయితే రష్యాతోపాటు ఉక్రెయిన్లోనూ నివసిస్తున్నవారు కూడా జనవరి 7తేదీన ఆర్థడాక్స్ క్రిస్మస్ జరుపుకుంటారు. ఇదిలా ఉండగా 10 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరు దేశాల సైన్యంతోసహా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. -
Ukraine Russia War: రష్యా కాల్పుల విరమణ
కీవ్: ఉక్రెయిన్‌లో ఈ వారాంతంలో 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా అధినేత పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని గురువారం పేర్కొన్నారు. రష్యాలో ఆర్థోడాక్స్ క్రిస్మస్ సెలవు నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి. ఉక్రెయిన్‌లోని కొందరు ఇదే రోజు క్రిస్మస్ జరుపుకుంటారు. కాగా, ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ పునరుద్ఘాటించారు. కానీ, చర్చలు జరగాలంటే ఒక షరతు విధించారు. ఉక్రెయిన్ నుంచి తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలను రష్యాకు చెందిన భూభాగాలుగానే జెలెన్స్కీ ప్రభుత్వం అంగీకరించాలని తేల్చిచెప్పారు. ఈ ఒక్క షరతుకు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌తో చర్చలకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని పలు కీలక ప్రాంతాలను రష్యా బలప్రయోగంతో ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. డొనెట్స్క్, లుహాన్స్క్, జపొరిఝాజియా, ఖేర్చన్లలో రష్యా సైన్యం పాగా వేసింది. -
Russia-Ukraine War: కీవ్ పరిసరాల్లో భీకర పోరు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాల్లో గురువారం భీకర పోరు కొనసాగింది. దీంతో సైనిక కార్యకలాపాల తగ్గింపు ప్రతిపాదన ముసుగులో రష్యా తన సేనలను పునరేకీకరిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా డోన్బాస్ ప్రాంతంలో భారీగా మోహరింపులు చేస్తోందని, వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించారు. మరోవైపు మారియుపోల్ నుంచి ప్రజలను తరలించేందుకు పలు బస్సులను ఆ నగరానికి పంపారు. నగరం నుంచి పౌర తరలింపు కోసం పరిమిత కాల్పుల విరమణకు రష్యా అంగీకరించింది. శుక్రవారం ఇరుపక్షాల మధ్య మరోదఫా ఆన్లైన్ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటికే నగరం నుంచి పలువురు వలస పోవడంతో నగర జనాభా 4.3 లక్షల నుంచి లక్షకు దిగివచ్చింది. వీరిని కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 45 బస్సులను ఇక్కడికి పంపామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. చెర్నోబిల్ నుంచి రష్యా బలగాలు వెనుదిరిగాయని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా వెనక్కు తగ్గలేదు ముందుగా అంగీకరించినట్లు రష్యా వెనక్కు తగ్గడం లేదని నాటో జనరల్ స్టోల్టెన్‌బర్గ్ సైతం ఆరోపించారు. బలగాల ఉపసంహరణ ముసుగులో రష్యా తన బలగాలకు సరఫరాలందించడం, కావాల్సిన ప్రాంతాల్లో మోహరించడం చేస్తోందన్నారు. ఒకపక్క డోన్బాస్‌పై దాడికి దిగుతూనే మరోపక్క కీవ్ తదితర నగరాలపై రష్యా ఒత్తిడి పెంచుతోందని నాటో ఆరోపించింది. రష్యా చాలా పరిమితంగా బలగాల తరలింపు చేపట్టిందని బ్రిటన్ కూడా ఆరోపించింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి రష్యా తప్పు చేసిందన్న యూఎస్ వ్యాఖ్యలను రష్యా తోసిపుచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా 1, 34, 500 మందిని సైన్యంలో చేర్చుకునే ఆదేశాలపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. వ్యూహాత్మక తప్పిదం ఉక్రెయిన్‌పై దాడికి దిగాలనుకోవడం పుతిన్ చేసిన వ్యూహాత్మక తప్పిదమని, దీని వల్ల రష్యా బలహీనపడిందని, ప్రపంచదేశాల మధ్య ఏకాకిగా మారిందని వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. రష్యా మిలటరీ పుతిన్‌ను తప్పుదోవ పట్టించి యుద్ధానికి దించిందని, దీనివల్ల ప్రస్తుతం పుతిన్‌కు మిలటరీ అగ్రనాయకులకు మధ్య పొరపచ్చాలు వచ్చాయని వైట్‌హౌస్ ప్రతినిధి కేట్బీడింగ్ఫీల్డ్ చెప్పారు. రష్యాపై ఆంక్షలను, ఉక్రెయిన్‌కు సాయాన్ని అమెరికా కొనసాగిస్తుందన్నారు. రష్యాలో నాయకత్వ మార్పును బైడెన్ కోరుకోలేదని చెప్పారు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత్ పర్యటనకు వచ్చారు. శుక్రవారం ఆయన ప్రధాని మోదీతో, విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమవుతారు. ఎస్400 మిసైల్ వ్యవస్థలోని భాగాలతో పాటు పలు మిలటరీ హార్డ్‌వేర్‌ను సకాలంలో అందించాలని లావ్రోవ్ను భారత్ కోరనుందని సమాచారం. తొలినుంచి ఉక్రెయిన్ సంక్షోభ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు సూచిస్తోంది. -
కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
Ukraine president Volodymyr Zelenskiy: ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెనియన్ దళాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. అయితే ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అనూహ్యంగా ఆ ప్రాంతంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. ఈ మేరకు త్రైపాక్షిక బృంద సమావేశంలో రష్యా, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో-ఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్ఈ)లతో పాటు ఉక్రెయిన్ కూడా శాంతిచర్చలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. తాము ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మొగ్గు చూపుతామని అన్నారు. ప్రస్తుతం తాము త్రైపాక్షిక సమావేశానికి మద్దతు ఇవ్వడమే కాక ఘర్షణ లేని పాలనను తక్షణమే అమలు చేస్తామని జెలెన్స్కీ ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: ఉక్రెయిన్ వీడి భారత్‌కు రండి.. ఎంబసీ కీలక ప్రకటన) -
కాల్పుల విరమణ.. మా బలహీనత కాదు: పాక్
ఇస్లామాబాద్: భారత్–పాకిస్తాన్ మధ్య గత ఏడాది ఫిబ్రవరి 25న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒకరి బలంగా, మరొకరి బలహీనతగా చూడరాదని పాకిస్తాన్ సైనిక దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ అన్నారు. ఈ ఒప్పందం విషయంలో భారత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే చేసిన వ్యాఖ్యలను ఆయన శుక్రవారం ఖండించారు. నరవణే వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూ 2021 ఫిబ్రవరి 25న నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంట కాల్పుల విరమణను పాటించేలా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ చీఫ్ నరవణే గురువారం ఢిల్లీలో ఓ సెమినార్లో మాట్లాడుతూ.. తాము(భారత సైన్యం) బలమైన స్థానంలో ఉండి చర్చలు జరపడం వల్లే పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెప్పారు. చదవండి: ఆందోళనకారులపై మిలటరీ అవసరం లేదు