ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా బాంబుల మోత మోగించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్క్స్ నగరంపై రష్యా వైమానిక దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ సమయం 36 గంటల పాటు కొనసాగనుండగా.. నిబంధనలు ఉల్లంఘించిన రష్యా దళాలు క్రామాటోర్క్స్ నగరాన్ని రెండుస్లార్లు మిస్సైల్స్‌తో విరుచుపడినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ గగనతలంలో వైమానిక సైరన్‌లు వినపడినట్లు తెలిపారు. ఈ దాడిలో ఓ నివాస భవనం దెబ్బతిందని అయితే అందులో ప్రజలు ఎవరూ లేరని పేర్కొన్నారు.
కాగా రష్యాలో ఆర్థడాక్స్ క్రిస్మస్ కోసం ఉక్రెయిన్‌లో 36 గంటల కాల్పుల విరమణ పాటించాలని పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలుజారీ చేసిన విషయం తెలిసందే. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 అర్థరాత్రి 12 వరకు 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా రక్షణ మంత్రిని ఆదేశించారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని గురువారం పేర్కొన్నారు.
ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి. అయితే రష్యాతోపాటు ఉక్రెయిన్‌లోనూ నివసిస్తున్నవారు కూడా జనవరి 7తేదీన ఆర్థడాక్స్ క్రిస్మస్ జరుపుకుంటారు. ఇదిలా ఉండగా 10 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరు దేశాల సైన్యంతోసహా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment