కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న ఫడ్నవీస్
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే(80) ఇక్కడి రామ్‌లీలా మైదానంలో గత ఆరు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను గురువారం విరమించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను వెంటనే ఏర్పాటుచేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంలో దీక్ష విరమణకు ఆయన అంగీకరించారు. కేంద్రం దూతగా ఇక్కడికి చేరుకున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. హజారేకు కొబ్బరి నీళ్లు ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
దీంతో హజారేతో పాటు దాదాపు 300 మంది ఆందోళనకారులు కూడా దీక్ష విరమించారు. ఈ హామీల అమలుకు కేంద్రానికి ఆగస్టు వరకూ సమయమిస్తున్నాననీ, అప్పటిలోగా హామీల్ని నెరవేర్చకుంటే సెప్టెంబర్‌లో మరోసారి ఆందోళనకు దిగుతానని హజారే హెచ్చరించారు. హజారే దీక్ష విరమణ సందర్భంగా మాట్లాడుతున్న సీఎం ఫడ్నవిస్‌పై రాజ్‌కుమార్ అనే వ్యక్తి చెప్పు విసిరాడు. అది ఫడ్నవిస్‌కు కొద్దిదూరంలో పడిపోయింది. దీంతో పోలీసులు రాజ్‌కుమార్‌ను బయటకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment