Hunger Strike
-
మైలారంలో ఉద్రిక్తత.. పోలీసులు రాకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచె
సాక్షి, నాగర్ కర్నూలు జిల్లా: బల్మూర్ మండలం మైలారం(Mylaram) గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనింగ్ వెలికితీతను నిలిపివేయాలంటూ గత మూడు నెలలుగా ఆ గ్రామ రైతులు(Farmers), ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. దీంతో మహిళలను, రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేటలో ఉన్న మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామానికి పోలీసులు రాకూడదని.. గ్రామ ప్రధాన రహదారిపై ముళ్ళ కంచె వేసి పెద్ద ఎత్తున పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు.అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ రైతు ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని తక్షణం విడుదల చేయకపోతే మందు తాగి చావడానికైనా సిద్ధమంటూ మందు డబ్బులతో రైతులు, మహిళలు రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు -
దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్
చండీగఢ్: పంజాబ్‌లోని ఖానౌరీ బోర్డర్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించింది. మరోవైపు కేంద్రం పంజాబ్ రైతుల డిమాండ్లపై చర్చించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపధ్యంలో జగ్జీత్ సింగ్ దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. అయితే తాను ఆమరణ నిరాహార దీక్ష విరమించబోనని ప్రకటించారు. ఈ విషయాన్ని రైతు నేత సుఖ్జీత్ సింగ్ హర్డోజండే మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నవంబర్ 26 నుండి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన దల్లెవాల్ ఆరోగ్యం క్షీణించిన నేపధ్యంలో ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారని తెలిపారు.రైతు నేత దల్లెవాల్ ఆమరణ నిరాహార దీక్ష(Hunger strike) 54వ రోజుకు చేరుకుందని, రైతులకు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ లభించేంత వరకు జగ్జీత్ సింగ్ నిరవధిక నిరాహార దీక్షను విరమించబోనని స్పష్టం చేశారన్నారు. ఉపవాస దీక్ష సమయంలో అతని ఆరోగ్యం క్షీణించిందని, దాదాపు 20 కిలోగ్రాముల బరువు తగ్గారని, ఈ నేపధ్యంలో వైద్య సహాయాన్ని తీసుకునేందుకు ముందుకు వచ్చారని జండే తెలియజేశారు.మరోవైపు జగ్జీత్ సింగ్ దల్లెవాల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. అయితే తొలుత ఆయన వైద్య సహాయం తీసుకునేందుకు నిరాకరించారు. తాజాగా జాయింట్ సెక్రటరీ ప్రియా రంజన్(Joint Secretary Priya Ranjan) నేతృత్వంలోని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రతినిధి బృందం దల్లెవాల్‌ను కలుసుకుని, యునైటెడ్ కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇదే సమయంలో ఖనౌరి సరిహద్దు వద్ద మరో 10 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీంతో మొత్తం నిరాహార దీక్ష చేస్తున్న రైతుల సంఖ్య 121కి చేరింది.ఫిబ్రవరి 14న చండీగఢ్(Chandigarh)లో పంజాబ్ రైతుల సమావేశమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడంతో దల్లెవాల్ వైద్య సహాయం తీసుకునేందుకు అంగీకరించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులతో కేంద్రం తిరిగి చర్చలు జరపనుంది. దీంతో ఈ పంజాబ్ రైతుల సమస్యలపై ప్రతిష్టంభన తొలగిపోనున్నదని రైతులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి -
సుప్రీంకోర్టుపైనే దుష్ప్రచారమా?
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. పైగా సుప్రీంకోర్టు వల్లే దలేవాల్ దీక్ష కొనసాగిస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. దలేవాల్ దీక్షను భగ్నం చేయాలని తాము చెప్పడం లేదని, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించింది. దలేవాల్ గత ఏడాది నవంబర్ 26న దీక్ష ప్రారంభించారు. గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల∙ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అలాగే రైతుల ఉద్యమంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దలేవాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌నూ విచారించింది. ‘‘పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దలేవాల్ దీక్షను భగ్నం చేయడానికి సుప్రీంకోర్టు ప్రయతి్నస్తోందని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలి్పస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. దలేవాల్ పట్ల రైతు సంఘాల నాయకుల వ్యవహారాల శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని మేము ఏనాడూ ఆదేశించలేదు. దలేవాల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆసుపత్రి తరించాలని మాత్రమే చెబుతున్నాం. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించుకోవచ్చు. దలేవాల్ ఆరోగ్యంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు సంబంధం లేదని నాయకుడు. కేవలం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రైతు నాయకుడిగా దలేవాల్ ప్రాణం ఎంతో విలువైంది. ఆసుపత్రిలో చికిత్స పొందేలా దలేవాల్‌ను ఒప్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మంత్రులు గానీ, అధికారులు గానీ ఒక్కసారైనా దీక్షా శిబిరానికి వెళ్లారా? రైతు సంఘాలతో సఖ్యత కుదుర్చుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
దలేవాల్ బతికుండాలా? చనిపోవాలా?
న్యూఢిల్లీ: రైతాంగం సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా పంజాబ్–హరియాణా సరిహద్దులో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు వైద్య సాయం అందించడానికి అడ్డు తగులుతున్న రైతు సంఘాల నాయకులు, రైతులపై మండిపడింది. వారు నిజంగా దలేవాల్‌కు శ్రేయోభిలాషులు కాదని ఆక్షేపించింది. దలేవాల్‌ను ఆసుపత్రికి ఎందుకు తరలించడం లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నెల 31వ తేదీలోగా ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నుంచి సాయం తీసుకోవచ్చని సూచించింది. దలేవాల్‌కు వైద్య చికిత్స అందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాంశు ధూలియాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శనివారం విచారణ చేపట్టింది. పంజాబ్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ గురీ్మందర్ సింగ్ వాదనలు వినిపించారు. దీక్షలో ఉన్న దలేవాల్ చుట్టూ రైతులు మోహరించారని, ఆయనను ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకుంటున్నారని, తమ ప్రభు త్వం నిస్సహాయ స్థితిలో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఇదంతా జరగడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దలేవాల్ చుట్టూ కోట కట్టడానికి అనుమతి ఉందా? దీక్షా స్థలానికి భారీ సంఖ్యలో రైతు లు ఎలా చేరుకున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరోగ్యం క్షీణించి తక్షణమే వైద్య చికిత్స అవసరమైన వ్యక్తిని ఆసుపత్రికి తరలించకుండా చుట్టుముట్టడం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. చికిత్స తీసుకోవడానికి దలేవాల్ అంగీకరించడం లేదని, ఎంత ఒప్పించినా ఫలితం ఉండడం లేదని, దీక్ష విరమిస్తే ఉద్యమం బలహీనపడుతుందని ఆయన భావిస్తున్నారని గుర్మీందర్ సింగ్ చెప్పారు. ఒకవేళ బలవంతంగా తరలిస్తే అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉందని, అందుకే వెనుకంజ వేస్తున్నామని వివరించారు. దీనిపై ధర్మాస నం అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్ ప్రభు త్వం సక్రమంగా వ్యవహరించడం లేదని పేర్కొంది. రైతు సంఘాల నాయకుల తీరుపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం నేరమేనని, ఆత్మహత్యకు పురికొల్పినట్లే అవుతుందని తేల్చిచెప్పింది. దలేవాల్ విషయంలో చట్టప్రకారం ముందుకెళ్లాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘కొందరు రైతు సంఘాల నేతల ప్రవర్తనపై మేము ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఒక మనిషి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే వారు స్పందించడం లేదు. వారేం నాయకులు? దలేవాల్ బతికి ఉండాలని కోరుకుంటున్నారా? లేక దీక్ష చేస్తూ చనిపోవాలని కోరుకుంటున్నారా? వారి ఉద్దేశం ప్రశ్నార్థకంగా ఉంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం విరుచుకుపడింది. సెలవు రోజునా ప్రత్యేక విచారణ సుప్రీంకోర్టుకు సాధారణంగా సెలవుదినం. రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం శనివారం ప్రత్యేకంగా సమావేశమై విచారణ చేపట్టింది. -
ఈ యుద్ధం గెలవాలంటే మనం కలిసి పోరాడాలి
చండీగఢ్: ‘ఈ యుద్ధంలో మనం విజయం సాధించాలంటే సమైక్యంగా ఉంటూ పోరాడాలి’అని రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లెవాల్(70) ఉద్బోధించారు. పంజాబ్–హరియా ణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద ఆయన చేపట్టిన దీక్ష మంగళవారం 29వ రోజుకు చేరుకుంది. డల్లెవాల్ ఆరోగ్యం విషమంగా ఉన్న ట్లు ఆయన్ను పరీక్షించిన వైద్యులు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఖనౌరీలో ని దీక్షా శిబిరం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన మాట్లాడారు. ‘నిరశన దీక్షకు మద్దతుగా నిలిచిన వారందరికీహృదయ పూర్వక కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నానని, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ యుద్ధంలో మనం గెలవాలి. దేశం యావత్తూ కలిసికట్టుగా పోరాడినప్పుడు మాత్రమే ఈ పోరాటంలో నెగ్గగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మనల్ని ఇక్కడి నుంచి తొలగించరాదని నేను కోరుతున్నా. ప్రభుత్వం మన పోరాటాన్ని కొనసాగనిస్తే మనం గెలుస్తాం లేదా ఇక్కడే చనిపోతాం. ఈ రెండింటిలో ఒకటి ఖాయం’అని ఆయన స్పష్టం చేశారు. డల్లెవాల్ చాలా బలహీన స్వరంతో నెమ్మదిగా రెండు నిమిషాలసేపు మాత్రం మాట్లాడగలిగారని ఆయనకు సహాయకుడిగా ఉంటున్న రైతు నేత అభిమన్యు కొహార్ చెప్పారు. తాను బాగానే ఉన్నానంటూ డల్లెవాల్ చెప్పడం అంటే..శారీరకంగా అత్యంత బలహీనంగా ఉన్నప్పటికీ, మానసికంగా ఇప్పటికీ దృఢంగా ఉన్నట్లు అర్థమని అనంతరం కొహార్ వివరించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కలి్పంచడం వంటి డిమాండ్లతో రైతు సంఘాలు ఆందోళనలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలకు మద్దతుగానే డల్లెవాల్ నిరాహార దీక్ష చేపట్టారు. -
ఉద్యోగుల డెడ్‌లైన్.. దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం
సాక్షి,విజయవాడ: 108 సిబ్బంది నేటి అర్థరాత్రి నుంచి తలపెట్టన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. 108 సమ్మె ప్రకటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. 108 ఉద్యోగుల డిమాండ్ల గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు చర్చలకు రావాలంటూ యూనియన్ నాయకులను ఆహ్వానించింది. ప్రభుత్వం పిలుపు మేరకు నేటి అర్థరాత్రి నుండి తలపెట్టనున్న సమ్మెను యూనియన్ నాయకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రభుత్వంతో చర్చల అనంతరం నిర్ణయం ప్రకటిస్తామాని 108 ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు. మరోవైపు 108 ఉద్యోగులు మెరుపు సమ్మె చేసేందుకు సిద్దమయ్యారు. తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.పెండింగ్‌లో ఉన్న జీతాలు, ఉద్యోగు భద్రతతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్‌లో 108 సిబ్బంది రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా 108 సిబ్బంది మాట్లాడుతూ.. ‘మా డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అందించాం. సాయంత్రం వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతాం’ అని స్పష్టం చేశారు. ఈ తరుణంలో దిగొచ్చిన కూటమి ప్రభుత్వం 108 యూనియన్ నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. దీంతో నేటి అర్థరాత్రి నుంచి జరగాల్సిన సమ్మె వాయిదా పడింది. -
జూడాల సమ్మె విరమణ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ జూని యర్ డాక్టర్లు తమ సమ్మె ను విరమించారు. ము ఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం చర్చల అనంతరం 16 రోజులు గా చేస్తున్న దీక్షను విరమించుకున్నారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం బెంగాల్ జూనియర్ డాక్టర్లు గత 16 రోజులు గా నిరాహారదీక్ష చేస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సంపూర్ణ విధుల బహిష్కరణను కూడా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ రోజు సీఎంతో భేటీలో కొన్ని హామీలు లభించాయి. అయితే ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు. ప్రజలు, మా దివంగత సోదరి కుటుంబీకులు దీక్షను విరమించుకోవాలని కోరారు. విషమిస్తు న్న మా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టు కొని నిరాహారదీక్ష ముగించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే దీక్షను ముగిస్తున్నాం అని జూనియర్ డాక్టర్ దెవాశిష్ హల్దర్ వెల్లడించారు. -
ఆర్జీ కర్ డాక్టర్లతో చర్చలు విఫలం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, 12 డాక్టర్ల సంఘాలకు మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ.. తమ డిమాండ్ల సాధనం కోసం జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్ష పదోరోజుకు చేరింది. జూడాల డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై వేటువేసి.. మరికొందరు వైద్యశాఖ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్న బెంగాల్ ప్రభుత్వం.. జూడాల మిగతా డిమాండ్లను తీర్చడానికి గడువు పెట్టడాన్ని అంగీకరించడం లేదు. ‘సీఎస్‌తో సమావేశం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. నిరాహారదీక్ష చేస్తున్న యువ డాక్టర్లతో చర్చలకు ఉన్నతాధికారులను పంపాలని ప్రభుత్వాన్ని కోరాం. అయితే ఎప్పటిలోగా జూడాల సమస్య పరిష్కరిస్తామనేది నిర్దిష్టంగా చెప్పలేమని ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సూచనప్రాయంగా తెలిపారు’ అని పశి్చమబెంగాల్ డాక్టర్స్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ కౌశిక్ చకి తెలిపారు. -
కోల్‌కతా: జూడాలకు మద్దతుగా.. ఐఎంఏ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీ కర్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశంలో సంచలనం రేపింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఏ) అక్టోబర్ 15వ తేదీన 24 గంటల దేశవ్యాప్త నిరాహారదీక్షను చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించింది.మరోవైపు.. జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకోగా.. ఇప్పటి వరకు ముగ్గురు డాక్టర్లు ఆసుపత్రి పాలయ్యారు. ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్(జేడీఎన్), మెడికల్ స్టూడెంట్స్ నెట్వర్క్(ఎంఎస్ఎన్) నేతృత్వంలో ఈ దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టనున్నట్లు ఐఎంఏ పేర్కొంది.‘‘తమ న్యాయమైన డిమాండ్ల కోసం కోల్‌కతా జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. తొమ్మిదో రోజు నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు లభిస్తోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డాక్టర్ల డిమాండ్లను అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఐఎంఏ తెలిపింది.ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లు కలిశారని పేర్కొంది. వాళ్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇచ్చినట్లు తెలిపింది. ఐఎంఏ బెంగాల్ యూనిట్.. నిరాహార దీక్షలు చేపట్టిన జూనియర్ డాక్టర్ల సంఘాలకు సంఘీభావం ప్రకటించింది. దేశంలోని అన్ని ఆఫీస్ బేరర్లు, రెసిడెంట్ డాక్టర్లు కూడా నిరాహార దీక్షలో పాల్గొనాలని ఐఎంఏ కోరింది. ఇక.. నిరాహారదీక్ష/నిరసన వేదిక.. మెడికల్ కాలేజీ లేదా క్యాంపస్‌ల సమీపంలో ఆదర్శంగా ఉండాలని పేర్కొంది. మరోవైపు.. పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలోని పనిచేసే డాక్టర్లు.. తాము అక్టోబర్ 14 నుంచి 48 గంటల పాటు పాక్షికంగా విధలు నిర్వహిస్తామని ప్రకటించారు. -
RG Kar Medical Hospital: బెంగాల్లో కొనసాగుతున్న వైద్యుల రాజీనామాలు
కోల్‌కతా: ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని, ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతోంది. వారికి సంఘీభావంగా గురువారం ప్రభు త్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి లోని 40 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో ఏడుగురు, ఉత్తర బెంగాల్లో ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వైద్యుల ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి డాక్టర్ గౌతమ్ దాస్ తెలిపారు. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. పరిష్కరించడంలో పురోగతి లేదని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే రాజీనామాల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్లకు మద్దతుగా గురువారం సీనియర్ డాక్టర్లు కూడా నిరసనలో పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన 54 మంది సీనియర్ డాక్టర్లు మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన సుమారు 35 మంది వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాగా, జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్ష గురువారం ఐదో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా నిరాహార దీక్షా స్థలాన్ని సందర్శించిన పోలీసు బృందం... జూనియర్ డాక్టర్ల ఆరోగ్యం క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీక్షను విరమించాలని కోరింది. -
వరద బాధితులందరికీ పరిహారం అందించాలి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ గురువారం విజయవాడలోని ధర్నాచౌక్‌లో నిరాహార దీక్ష చేపట్టింది. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ప్రభుత్వం ముందస్తు సమాచారం ఇవ్వకపోవటంవల్లే బుడమేరు వరదలో ప్రజలు నిండా మునిగారని, పెద్ద ఎత్తున నష్టపోయారని దీక్షలో పాల్గొన్న నేతలు తెలిపారు. బాధితుల్లో ఒక్కరికీ పూర్తి నష్ట పరిహారం అందలేదని, ఆదుకోవాలంటూ సచివాలయాలు, కలెక్టరేట్ చుట్టూ తిరిగినా కనీసం పట్టించుకోవటంలేదని ధ్వజమెత్తారు. బుడమేరు గేట్లు ఎత్తిన ప్రభుత్వం, నష్టపరిహారం కోసం అర్జీలు తీసుకోకుండా కలెక్టరేట్ గేట్లు మూసేసిందని మండిపడ్డారు. వరద సహాయక చర్యల పేరుతో అవినీతి బురద పారిందని దుయ్యబట్టారు. సాయం చేయాల్సింది పోయి, బాధితులపై లాఠిఛార్జి చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బాధితుల్లో చివరి వ్యక్తికి కూడా పరిహారం అందేవరకు పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు భరోసా ఇచ్చారు. బాబు వల్లే బుడమేరుకు వరద సీఎం చంద్రబాబు వల్లే బుడమేరు వరద విజయవాడను ముంచేసిందని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ చెప్పారు. వరదతో నగరంలో 32 డివిజన్లలో 2.69 లక్షల కుటుంబాలు నీట మునిగాయన్నారు. సర్వస్వం కోల్పోయిన వరద బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని అడుగుతుంటే అధికార పార్టీ నేతలు వైఎస్సార్సీపీ మీద పడి ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.534 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటం ప్రారంభించామని, ఈ ప్రభుత్వం పడిపోవడానికి ఇదే నాంది అని చెప్పారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ రూ.1.50 కోట్లు ఖర్చుపెట్టి 50 వేల కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిందని చెప్పారు. వరద బాధితుల కోసం చేసిన ఖర్చుపై తమ లెక్కలు ఇస్తామని, ప్రభుత్వం లెక్కలు ఇవ్వాలని, వాటిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు. సీఎం చంద్రబాబు ఇల్లు, అమరావతి మునిగిపోకుండా బుడమేరు గేట్లు ఎత్తేసి విజయవాడను ముంచేశారని ఎమ్మెల్సీ రుహూల్లా చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రతి దేవస్థానం నుంచి ఆహారాన్ని తీసుకొచ్చారని, దానిని బాధితులకు అందించకుండా బయట పడేసి వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. నష్ట పరిహారం కోసం బాధితులు రోడ్ల మీద ఆందోళన చేసే దుస్థితి నెలకొందన్నారు. కంచికచర్లలో ముంపునకు గురైన ప్రాంతాల వారికి ప్రభుత్వం నష్ట పరిహారం అందించలేదని నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగలక్షి్మ, వైఎస్సార్సీపీ నాయకుడు పోతిన మహేష్, విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, పార్టీ నేత గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Mahsa Amini: హిజాబ్‌ను ధిక్కరించి తలెత్తుకుని...
‘‘గుమ్మానికి పరదా కట్టినట్టే అమ్మ ముఖానికి ‘నఖాబ్’ కట్టారు’’ అంటూ ముస్లిం మహిళల జీవితాల్లోని దుఃఖాన్ని వినిపించారో కవయిత్రి. దుఃఖమో.. సంతోషమో.. హిజాబ్ చాటున దాచేది లేదని ఇరాన్ మహిళలు ఇప్పుడు తేల్చి చెబుతున్నారు. సోమవారం ఇరాన్లో పలువురు హిజాబ్‌లను తొలగించి స్వేచ్ఛగా వీధుల్లో సంచరించారు. ఇస్లామిక్ డ్రెస్‌కోడ్‌ను ధిక్కరించారనే కారణంతో 2022లో కుర్దిష్ మహిళ అయిన మహసా అమీనీని ఇరాన్ పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆమె పోలీస్ కస్టడీలో మరణించడం తెలిసిందే. అయితే మహసా అమీనీ రెండో వర్ధంతి సందర్భంగా స్మారక సభను నిర్వహించాలని తల్లిదండ్రులు భావించగా.. పోలీసులు అందుకు అనుమతిని నిరాకరించారు. అంతేకాదు ఆమె తల్లిదండ్రులను బలవంతంగా గృహ నిర్బంధం చేశారు. అమీనీని ఖననం చేసిన సఖెజ్ నగరంలోని స్మశాన వాటికను సైతం మూసేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఇరాన్ మహిళలు మాత్రం ఆమెను స్మరించుకున్నారు. దేశ రాజధాని టెహ్రాన్ వీధుల్లో ‘జిన్.. జియాన్.. ఆజాదీ’(స్త్రీ.. జీవితం.. స్వేచ్ఛ) నినాదాలు చేశారు. ఇక టెహ్రాన్‌లోని ఏవీఎన్ జైలులోని పలువురు మహిళా ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మహిళలతోనే తామూ ఉన్నామని చెబుతూ 34 మంది జైలు ఖైదీలునిరాహార దీక్ష చేశారు. వీరిలో ఇరాన్ ఉద్యమకారులు నర్గీస్ మొహమ్మదీ, వెరిషెహ్ మొరాది, మహబూబ్ రెజాయ్, పరివాష్ ముస్లి కూడా ఉన్నారు. తీవ్రమైన అణచివేత.. 1979లో కొత్త ప్రభుత్వం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పాటయ్యాక ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖొమేనీ ఆవిర్భవించారు. ఇస్లాం మత విలువలను తిరిగి అమల్లోకి తీసుకొచ్చారు. అందులో భాగంగా మహిళలకు హక్కులను కల్పించిన కుటుంబ రక్షణ చట్టాన్ని రద్దు చేశారు. నాటి నుంచి ఇస్లాం డ్రెస్‌కోడ్ పాటించని మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ధిక్కరించిన మహిళలను గాయపరిచిన, జరిమానాలు విధించిన ఘటనలు అనేకం. మహిళలపై నిరంతరం కెమెరాల నిఘా కొనసాగుతోంది. 2024 టెహ్రాన్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో మహిళలను పర్యవేక్షించడానికి ఏరియల్ డ్రోన్లను కూడా ఉపయోగించారంటే ఎంతటి నిఘా ఉందో అర్థం చేసుకోవచ్చు. హిజాబ్‌ను తిరస్కరిస్తున్న మహిళల సంఖ్య పెరగడాన్ని ప్రభుత్వం గుర్తించకపోగా.. అణచివేత చర్యలకు పాల్పడుతోంది.ఎవరీ మహసా అమీనీ ?2022లో ఇరాన్లో హిజాబ్ నియమాలను ఉల్లంఘించారనే నెపంతో సకెజ్ నగరానికి చెందిన కుర్దిష్ మహిళ 22 ఏళ్ల మహసా అమీనీని ఇరాన్ మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉన్న ఆమెను తీవ్రంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయి, కొద్దిసేపటికే కోమాలోకి వెళ్లిపోయారు. మూడు రోజుల తరువాత ఆమె ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. కూతురును చూడటానికి అమీనీ తల్లిదండ్రులను కూడా అనుమతించలేదు. శవ పంచనామా నివేదిక అడిగినా నిరాకరించారు. మహసా అమీనీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అరెస్టు తరువాత ఆమెకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెప్పారు. డాక్టర్ కావాలని కలలు కన్న యువతి.. మరో వారం రోజుల్లో యూనివర్సిటీకి వెళ్లే ముందు వారం రోజులు తల్లిదండ్రులతో ఉందామని టెహ్రాన్‌కు వచ్చిన అమీనీ.. పోలీసుల చిత్రహింసలతో ప్రాణాలొదిలింది. -
నిరాహార దీక్షకు దిగుతా: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగకుంటే నిరాహార దీక్షకు దిగుతానని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా తన కేసులలో న్యాయం చేయడంలో విఫలమైతే నిరాహార దీక్షకు దిగుతానని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు.తమ పీటీఐ పార్టీకి సంబంధించిన కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ ఇసా ఉండటంపై ఇమ్రాన్ ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరగని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. తమ పార్టీ కేసులను విచారించే బెంచ్‌లో ప్రధాన న్యాయమూర్తి ఈసాను చేర్చడంపై తమ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఇమ్రాన్‌ఖాన్ మీడియాకు తెలిపారు. తమకు న్యాయం జరగదని పీటీఐ తరపు న్యాయవాదులు విశ్వసిస్తున్నారని, అందుకే తమ కేసులను మరొకరు విచారించాలని కోరారు. -
ఆరోగ్యం సహకరించడం లేదు.. దీక్ష విరమిస్తున్నా
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్) : ‘ఆరోగ్యం సహకరించడం లేదు.. శరీరంలోని అన్నీ అవయవాలు కొంతమేర శక్తిని కోల్పోయాయి. అందుకే నిరాహార దీక్ష విరమిస్తున్నా. ప్రలోభాలకు లొంగలేదు..తొమ్మిది రోజులు ఆహారం తీసుకోకుండా నిరుద్యోగుల కోసం పోరాటం చేశాను. ఇకపై ఆహారం తీసుకుంటూ ఉద్యమిస్తా.. త్వరలోనే ఐక్య కార్యాచరణ ప్రకటిస్తా’ అని నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌నాయక్ స్పష్టం చేశారు. తొమ్మిది రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న ఆయన మంగళవారం ఉదయం గాంధీ ప్రాంగణంలో కొబ్బరినీళ్లు తాగి దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పలుపార్టీల నేతలు, సంఘ నాయకులు కలిసి ఉద్యమం చేద్దామనే పిలుపు మేరకు దీక్ష విరమించానని, రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పారు. తన దీక్షకు సంఘీభావం ప్రకటించిన అందరినీ కలిసి మద్దతు కూడగట్టి, నిరుద్యోగుల సత్తా చూపిస్తామని, ప్రభుత్వ మెడలు వంచి న్యాయమైన డిమాండ్లు సాధించుకుంటామన్నారు. తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని, ఇకపై పాముకాటు ఎలా ఉంటుందో చూపిస్తానని సవాల్ విసిరారు. మరణిస్తే ఉద్యమం చేయలేనని, బతికి డిమాండ్లు సాధించుకుంటామని, రోజుకో తీరుతో విభిన్న తరహాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించనని శపథం చేశారు. తెలంగాణలోని పలు రాజకీ యపార్టీలు, సంఘాలు, నిరుద్యోగులు తన వెనుక ఉన్నారని, త్వరలోనే 10 లక్షల మందితో నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంత్రి సీతక్క ఫోన్ చేసి మాట్లాడింది వాస్తమేనన్నారు. నగరంలోని అశోక్‌నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి తన కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పారు. న్యాయమైన డిమాండ్లు సాధించేవరకు తన పోరాటం ఆగదన్నారు. నగర కేంద్ర గ్రంథాలయానికి మోతీలాల్‌నాయక్ మోతీలాల్ నాయక్ దీక్ష విరమించిన అనంతరం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించారు. లక్షలాది మందితో మరో 10 రోజుల్లో టీజీపీఎస్సీని ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. సిటీ లైబ్రరీ నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. -
ముగిసిన ఆతిశి నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఈనెల 21వ తేదీ నుంచి మంత్రి ఆతిశి కొనసాగిస్తున్న నిరాహార దీక్ష అర్ధంతరంగా ముగిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మంత్రి ఆతిశి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆతిశి దాదాపు ఐదు రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఢిల్లీకి న్యాయబద్ధంగా అందాల్సిన నీటిని హరియాణా నుంచి విడుదల చేయించాలంటూ ప్రధానికి ఆప్ ఎంపీలు లేఖ రాస్తారన్నారు. -
ఓటు కోసం నిరాహార దీక్ష
గల్లంతైన ఓటు కోసం ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి నిరాహార దీక్ష చేపట్టిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)లో పనిచేసే ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్లో తన పేరు లేకపోవడంతో బెంగళూరులో నిరాహార దీక్ష చేపట్టారు.కేఎస్ఆర్టీసీకి చెందిన కెంగేరి డివిజన్లో అసిస్టెంట్ స్టోర్‌కీపర్‌గా పనిచేసే మల్లికార్జున్ స్వామి బుధవారం బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని జేఎస్ఎస్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వెళ్లాడు. కానీ ఆయన పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసనకు దిగాడు.సంబంధిత అధికారులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో నిరాహార దీక్ష చేపట్టినట్లు మల్లికార్జున్ తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దక్షిణ బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గంలోని బొమ్మనహళ్లి పోలింగ్ స్టేషన్లో మల్లికార్జున్‌ను అసిస్టెంట్ పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించారు.ఎన్నికల విధులకు కేటాయించిన మరికొంత ఉద్యోగుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో కూడా ఓటు హక్కును వినియోగించుకోలేని వ్యవస్థలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని ఆయన మండిపడ్డారు.మల్లికార్జున్ వాస్తవానికి చామరాజనగర్ జిల్లాలోని సోమనాథపుర గ్రామానికి చెందినవాడైనా ఇక్కడ ఓటర్ల జాబితాలో ఆయన పేరు నమోదైంది. కర్ణాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు రెండో దశలో శుక్రవారం పోలింగ్ జరుగతోంది. -
మంచు ఎడారిలో నిరసన మంట
ఆమిర్‌ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చాలామందికి తెలుసు. కానీ, అందులో ఆమిర్ పోషించిన ఫున్సుఖ్ వాంగ్దూ పాత్రకు స్ఫూర్తినిచ్చిన ఇంజనీర్, విద్యాసంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌ఛుక్ గురించి బహుశా కొందరికే తెలుసుంటుంది. ఇటీవల చేసిన నిరవధిక నిరాహార దీక్ష పుణ్యమా అని ఆయన పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. ప్రపంచమంతటా మారుమోగి పోయింది. హిమాలయ ప్రాంతంలోని లద్దాఖ్‌లో శరీరం గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆయన సాగించిన నిరశన ఉద్యమానికి మద్దతుగా వేలాది జనం ముందుకు రావడం విశేషం. 21 రోజుల అనంతరం మంగళవారం ఆయన నిరాహార దీక్ష ముగిసినప్పటికీ, లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి నుంచి అలవిమీరిన అభివృద్ధితో అపాయంలో పడుతున్న ఆ ప్రాంత జీవావరణం దాకా అనేక అంశాలు చర్చలోకి రాగలిగాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లేకున్నా, ప్రస్తుతానికైతే లద్దాఖ్ ప్రజలు తమ డిమాండ్లను పాలకుల ముందు మరోసారి ఉంచి, ఒత్తిడి తేగలిగారు. నిజానికి, దాదాపు 3 లక్షల జనాభా గల లద్దాఖ్‌లో మొత్తం 8 తెగల వాళ్ళుంటారు. 2019 ఆగస్ట్ 5న మునుపటి జమ్మూ – కశ్మీర్ నుంచి విడదీసి, కేంద్రపాలిత ప్రాంతం చేశారు. భారత ఈశాన్య సరిహద్దు కొసన ఉండే ఈ ప్రాంత ప్రజలు లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్రప్రతిపత్తి ఇవ్వాలనీ, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనీ, స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఓ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుచేయాలనీ, తమ ప్రాంతానికి ఇద్దరు ఎంపీలు ఉండాలనీ డిమాండ్ చేస్తున్నారు. 2020 నుంచి వారు చేస్తున్న నిరసనలకు పరాకాష్ఠ – తాజా ఉద్యమం. లద్దాఖ్ ప్రాంతపు ఉన్నత ప్రాతినిధ్య సంస్థ, అలాగే కార్గిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్’ (కేడీయే) మద్దతుతో నెలన్నర క్రితమే ఫిబ్రవరి మొదట్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలో కూర్చొని లద్దాఖ్‌ను ఆడించాలనుకుంటే కుదరదంటూ ప్రజల్లోని అసమ్మతిని ఆ ప్రదర్శన తేటతెల్లం చేసింది. కీలకమైన విధాన నిర్ణయాలలో తమ స్థానిక స్వరాలకు చోటులేకపోవడమే ఈ నిరసనలకు ప్రధాన ప్రేరకమైంది. ఒకప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జమ్మూ–కశ్మీర్ విధాన పరిషత్‌కు స్పీకర్,ఎంపీ... ఇంతమంది ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంతానికి ఉండేవారు. అలాంటిది ప్రస్తుతం అక్కడంతా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వ అధికార గణపాలన. లద్దాఖ్‌కు మిగిలింది ఇప్పుడు పోర్ట్ ఫోలియో లేని ఒకే ఒక్క ఎంపీ. జిల్లాకు ఒకటి వంతున రెండు స్వతంత్ర పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళు ఉన్నప్పటికీ, అధికారాల పంపిణీపై స్పష్టత లేదు. ఇక, ఆర్టికల్ 370 రద్దు అనంతరం తీసు కున్న ప్రశ్నార్హమైన పాలనాపరమైన నిర్ణయాలు అనేకం. దానికి తోడు ఆకాశాన్ని అంటుతున్న నిత్యా వసర వస్తువుల ధరలతో జనం గగ్గోలు పెడుతున్నారు. భూ హక్కులలో మార్పులు, అలాగే స్థానిక ప్రయోజనాలకు విరుద్ధమైన పారిశ్రామిక విధాన రూపకల్పన లాంటివి ప్రజాగ్రహాన్ని పెంచాయి. లద్దాఖీ ఉద్యమకారుడు వాంగ్‌ఛుక్ దీక్షకు అంతటి స్పందన రావడానికి అదే కారణం. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున దాదాపు మంచు ఎడారిలా జనావాసాలు తక్కువగా ఉండే లద్దాఖ్ పర్యావరణ రీత్యా సున్నిత ప్రాంతం. అక్కడ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టిన అజెండా పైనా విమర్శలున్నాయి. పర్యాటకం ఆ ప్రాంత ఆర్థికవ్యవస్థలో కీలకమే కానీ, దాన్ని అంతకు అంత పెంచాలని పర్యావరణానికి హాని కలిగిస్తే మొదటికే మోసం. లే ప్రాంతంలో మెగా ఎయిర్పోర్ట్,ఛంగ్థాంగ్ బయళ్ళలో 20 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో సోలార్ పార్క్ లాంటి ప్రణాళికలపై ప్రభుత్వం పునరాలోచించాలని వాంగ్‌ఛుక్ లాంటివారు కోరుతున్నది అందుకే. పర్యావరణానికీ, స్థానికుల ప్రయోజనాలకూ అనుగుణంగానే అభివృద్ధి ఉంటే మేలు. లద్దాఖ్ సాంఘిక, సాంస్కృతిక ప్రత్యేకతల్ని పరిరక్షించేలా ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌నూ పాలకులు గుర్తించాలి. లద్దాఖ్, కార్గిల్‌లు రెండూ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా, ఒకే ఎంపీ ప్రాతినిధ్యానికి తగ్గిపోవడమూ చిక్కే. ఈ రెండు విభిన్న ప్రాంతాలకు చెరొక పార్లమెంటరీ స్థానంపై ఆలోచించాలి. చైనాతో సరిహద్దులో నెలకొన్న లద్దాఖ్ కీలకమైనది. అందులోనూ హిమాలయ ప్రాంతంలో తన పరిధిని విస్తరించుకోవాలని డ్రాగన్ తహతహలాడుతున్న వేళ వ్యూహాత్మకంగానూ విలువైనది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకొనే భయాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించాలి. లద్దాఖ్ ప్రజల నమ్మకాన్ని చూరగొని, వారిని కలుపుకొని ముందుకు సాగడం ముఖ్యం. గతంలో శ్రీనగర్ నుంచి, ఇప్పుడేమో ఢిల్లీ నుంచి పాలిస్తున్నారే తప్ప స్వపరిపాలన సాగనివ్వడం లేదనే భావనను వారి నుంచి పోగొట్టడం ముఖ్యం. ఈ ఏడాది జనవరి మొదట్లో కేంద్ర హోమ్ శాఖ ఉన్నతాధికార సంఘాన్ని (హెచ్పీసీ) వేసింది. గత శనివారంతో కలిపి 3 భేటీలు జరిగినా పురోగతి లేదు. హెచ్పీసీ హోమ్ మంత్రి లేకపోగా, తాజా భేటీకి సహాయ మంత్రి సైతం గైర్హాజరు కావడంతో సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు వారికి చిత్తశుద్ధి ఉందా అన్నది అనుమానాలు రేపుతోంది. గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ పాలనలోని పలు వైఫల్యాలను సహించి, భరించిన లద్దాఖ్ ప్రజలు గాంధేయ మార్గంలో శాంతియుతంగా తమ నిర సన తెలిపారు. స్థానిక ఆకాంక్షలకు తగ్గట్టు న్యాయబద్ధమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఢిల్లీ పాలకులు సైతం ప్రజాభీష్టాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవడం మేలు. లద్దాఖ్ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాటల్లోనే కాదు... చేతల్లోనూ చూపడం అవసరం. లేదంటే, మున్ముందు వాంగ్‌ఛుక్ దీక్షల లాంటివి మరిన్ని తలెత్తక తప్పదు. -
‘నిరాహార దీక్ష ముగిసినా.. నా పోరాటం ఆగదు’
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన 21 రోజుల నిరాహార దీక్ష మంగళవారం ముగిసింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరో షెడ్యూల్ వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆయన ఈ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే నిరాహార దీక్ష ముగింపుతో తన పోరాటం ఆగిపోదని సోనమ్ ఈ సందర్భంగా తెలిపారు. ఆయన మార్చి 6 తేదీనా ఈ దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘నిరాహార దీక్ష విరమించే కార్యక్రమంలో ఏడు వేల మంది పాల్గొన్నారు. నేను మళ్లీ పోరాటం చేస్తా. నా పోరాటంలో ఈ నిరాహార దీక్ష కేవలం మొదటి అడుగు మాత్రమే. మహాత్మా గాంధీ చేపట్టిన నిరాహారదీక్షల్లో 21 రోజుల దీక్షే ప్రధానమైంది. ఈ రోజు చాలా ముఖ్యమైంది. కేవలం తొలి దశ నిరాహార దీక్ష మాత్రమే నేటి( మంగళవారం)తో ముగిసింది. కానీ పోరాటం ముగిసిపోలేదు. మహిళలు 10 రోజు పాటు మరో నిరాహార దీక్ష చేపట్టనున్నాను. యువత, బౌద్ధ సన్యాసులు కూడా పాల్గొంటారు. ఇలా నేను, నా తర్వాత మహిళలు నిరాహార దీక్ష చేపడతారు. ఇలా నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. నా నిరాహార దీక్షలో ఒకే రోజు సుమారు 6వేల మంది పాల్గొన్నారు’ అని సోనమ్ వాంగ్‌చుక్ ఎక్స్ వేదికగా తెలిపారు. END 21st Day OF MY #CLIMATEFAST I'll be back... 7000 people gathered today. It was the end of the 1st leg of my fast. Btw 21 days was the longest fast Gandhi ji kept. From tomorrow women's groups of Ladakh will take it forward with a 10 Days fast, then the youth, then the… pic.twitter.com/pozNiuPvyS — Sonam Wangchuk (@Wangchuk66) March 26, 2024 అంతకు ముందు ‘ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దేశానికి చిత్తశుద్ధి, దూరదృష్టి, వివేకం ఉన్న రాజనీతి రాజనీతిజ్ఞులు కావాలని నేను ఆశిస్తున్నా. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు మా డిమాండ్లను నెరవేర్చి వారు కూడా రాజనీతిజ్ఞులమని రుజువు చేసుకుంటారని ఆశిస్తున్నా’అని సోనమ్ వాంగ్‌చుక్ ‘ఎక్స్’లో పోస్ట్చేసిన వీడియోలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 5 ఆగస్ట్ 2019 జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము కశ్మీర్, లడాక్ కేంద్రగా ప్రాంతపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. లేహ్, కార్గిల్ జిల్లాలతో లాడక్.. కేంద్ర పాలిత ప్రాంతంగా విస్తరించి ఉంది. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్‌లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర... వాంగ్‌చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్‌చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్‌చుక్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
నాడు కేసీఆర్‌ను కాపాడింది మీరే
సాక్షి, హైదరాబాద్: దీక్షాదివస్ సందర్భంగా తెలంగాణ సాధన కోసం 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్య సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం నాటి సంఘటనలు, అప్పటి భావోద్వేగాలను నెమరు వేసుకున్నారు. 11 రోజులపాటు కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందామని ఆయన ప్రాణానికి ముప్పు కలుగుతుందన్న భయాందోళన తమను వెంటాడేదన్నారు. ఒకవైపు సీఎం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరో వైపు అప్పటి ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన అనేక రకాల ఒత్తిడిలను తట్టుకోవడం తమకు ఒక సవాలుగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఏడు రోజుల తర్వాత కూడా తమ నిరాహార దీక్షను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయం కలిగిందన్నారు. అయితే ఆయన శారీరకంగా పూర్తిస్థాయిలో బలహీనంగా మారినా, ఆరోజు తన దీక్ష కొనసాగించే ముందు మానసికంగా అత్యంత దృఢంగా ఉండడంతోనే అన్ని రోజులు దీక్ష కొనసాగించగలిగారని ఆ నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చారు. మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా నిమ్స్ వైద్య బృందం అందించిన సేవలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేటీ రామారావు భావోద్వేగంతో అన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కాపాడుకుంటూనే మరోవైపు కుటుంబ సభ్యులుగా కేసీఆర్ ఆరోగ్యం పట్ల తమకు ఆందోళన ఉండేదన్నారు. ఆయన పట్టుదల, మొండితనం వల్లనే నిరాహార దీక్షను కొనసాగించగలిగారని చెప్పారు. అయితే ఒక కుటుంబ సభ్యుడిగా అనేక సందర్భాల్లో ఆందోళనకు గురైనప్పుడు నిమ్స్ వైద్య బృందం అందించిన మనోధైర్యం ఎప్పటికీ మరువలేమన్నారు. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభ సమయంలో తమ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సజీవంగా నిలిపి స్వరాష్ట్రాన్ని సాకారం చేసేందుకు సహకరించిన వైద్య బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపి వారిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. -
మరాఠా రిజర్వేషన్ల వివాదం.. సీఎం షిండే విధేయుల రాజీనామా
ముంబయి: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌పై ఆందోళనలు చెలరేగాయి. మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విధేయులు రాజీనామా చేశారు. హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ సోమవారం న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయానికి తన రాజీనామాను సమర్పించారు. నాసిక్ ఎంపీ హేమంత్ గాడ్సే తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపారు. మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ డిమాండ్‌పై తమ వైఖరిని స్పష్టం చేయాలని యావత్మాల్లో ఆందోళనకారులు పాటిల్‌ను అడ్డగించారు. దీంతో పాటిల్ అక్కడికక్కడే తన రాజీనామా లేఖను ఆందోళనకారులకు అందజేశారు. శివసేన ఎంపీ గాడ్సేను నాసిక్‌లో నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా నిరసనకారులు ప్రశ్నించగా.. ఆయన కూడా తన రాజీనామా లేఖను సీఎం షిండేకు పంపించారు. రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే రాజీనామా స్టంట్స్ చేస్తున్నారని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే వ్యాఖ్యానించడంపై పాటిల్ మండిపడ్డారు. "నేను నెహ్రూ-గాంధీ కుటుంబంలో పుట్టలేదు. రెండు-మూడు తరాలు అధికారంలో ఉన్నారు. వారే చొరవ తీసుకుని ఉండేవారు. కానీ అదేమీ చేయలేదు. మరాఠా సామాజికవర్గానికి చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఆ వర్గానికి ఏం చేయలేదు" అని పాటిల్ మండిపడ్డారు. మరాఠా రిజర్వేషన్ల కోసం జల్నాకు చెందిన కోటా కార్యకర్త మనోజ్ జరంగే చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష సోమవారానికి ఆరో రోజుకు చేరింది. మనోజ్ జరంగే ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో మరాఠా సమాజం మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటు సభ్యునికి రాజీనామా చేస్తున్నానని గాడ్సే పేర్కొన్నారు. ఇదీ చదవండి: 'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు' -
జనం రాక.. ఓపిక లేక
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : టీడీపీ నాయకుల దీక్షాదక్షత తేలిపోయింది. అధినేతపై ఉన్న అభిమానం స్పష్టమైపోయింది. దీక్షలకు జనం రాక, నిరసనలు చేసే ఓపిక లేక ఆ పార్టీ నాయకులు టెంట్లు ఎత్తేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కోసం చేపడు తున్న దీక్షా శిబిరాలు నిర్వహించలేక చేతులెత్తేశారు. అటు ప్రజల నుంచి, ఇటు కేడర్ నుంచి స్పందన లేకపోవడంతో రిలే నిరాహార దీక్షలు చేయడం టీడీ పీ నాయకులకు తలకు మించిన భారంగా మారింది. ధనమైతే ఎంతైనా పెట్టగలం గానీ జనాలను తీసుకురాలేకపోతున్నామని వారంటున్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ టెంట్లు తొలగించి, కుర్చీ లు టెంట్ హౌస్‌కు పంపించి తమకున్న భారాన్ని దింపుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు జైలుకెళ్లిన దగ్గరి నుంచి టీడీపీ అధిష్టానం ఆ పార్టీ నాయకులకు నిత్యం ఏదో ఒక టాస్క్ ఇస్తూనే ఉంది. చంద్రబాబుకు మద్దతుగా, ప్రజలే మన వెంట ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలని ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తోంది. చంద్రబాబు జైలులో ఉన్నంతకాలం ఏదో ఒకటి చేసి సానుభూతి పొందాలని, ఎన్నికల వరకు ఇదే టెంపో కొనసాగించాలన్న కృత నిశ్చయంతో టీడీపీ అధిష్టానం ఉంది. అందుకు తగ్గట్టుగానే కార్యక్రమాలకు రూప కల్పన చేస్తోంది. చంద్రబాబు జైలుకెళ్లిన రోజు, ముందు ధర్నాలు, రాస్తారోకోలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. కానీ జనాలు ఎక్కడా స్పందించలేదు. కనీసం సానుభూతి చూపించలేదు. చివరికి పార్టీ కార్యకర్తలు సైతం సీరియస్‌గా స్పందించలేదు. దీంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఓపెన్ అయిపోయారు. ‘అధినేత చంద్రబాబు అరైస్టెనా ప్రజల నుంచి స్పందన రావడం లేదు.. పార్టీ శ్రేణులు ముందుకు రావడం లేదు.. ఏంటీ దారుణమైన పరిస్థితి’ అని చంద్రబాబు జైలుకెళ్లిన రోజున టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆ పార్టీ నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చంద్రబాబు కోసం పూజలు, మీతోనే మేము వంటి కార్యక్రమాలు చేపట్టారు. వాటికీ స్పందన లేదు. తర్వాత పోస్టు కార్డుల ఉద్య మం చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా ఉన్నట్టు సెంట్రల్ జైలుకు పోస్టు కార్డులు రాసే కార్యక్రమం చేపట్టారు. జనాలు, కార్యకర్తలు ముందుకు రాకపోవడంతో నాయకులే బల్క్‌లో కొనుగోలు చేసి, బల్క్లోనే రాసి పంపించేసి మమ అనిపించారు. దీంతో పోస్టు కార్డుల ఉద్యమం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ తర్వాత రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు బయటికొచ్చేంతవరకు చేపట్టాలని పిలుపునిచ్చారు. కానీ శిబిరాల్లో కూర్చొనేందుకు జనాల్లేక దీక్షలు వెలవెలబోయా యి. గంట, రెండు గంటలు చేసేసి దీక్షలు ముగించేసిన పరిస్థితి కొనసాగింది. ఇప్పుడా గంట, రెండు గంటలు కూడా చేయలేని పరిస్థితికి వచ్చేశారు. దీంతో దీక్షా శిబిరాలు నిర్వహించడం కష్ట సాధ్యంగా తయారైంది. దానికి తోడు మధ్యలో కంచాల మోత మోగించే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నాయకులు తప్ప కార్యకర్తలు, ప్రజలు ఎక్కడా కంచాలు మోగించలేదు. కార్యక్రమం కూడా విఫలమైంది. ఆ తర్వాత ఇంట్లో లైట్లు ఆర్పేసి, కొవ్వొత్తుల వెలిగించాలని అధిష్టానం ఆదేశించింది. అది కూడా ఫ్లాప్ అయ్యింది. నాయకులు తప్ప మరెవ్వరూ కొవ్వొత్తులు వెలిగించలేదు. ఆ నాయకులు వెలిగించిన కొవ్వొత్తుల ఫోటోలనే సోషల్ మీడియాలో పెట్టుకుని తృప్తి చెందారు. నిరసన కార్యక్రమాలకు దిగుదాం అనుకునే సరికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో అతి కష్టం మీద సమీకరించిన ఇరవై ముప్పై మందితో కొన్నిచోట్ల అయితే పది మందికి మించి కార్యక్రమాలు చేపట్టలేని దుస్థితి నెలకొంది. చంద్రబాబు అరైస్టెన దగ్గరి నుంచి ఆ పార్టీ నాయకులకు చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇలా ఏ కా ర్యక్రమం చేపడుదామనుకున్నా స్పందన లేక వెలవెలబోతుండటంతో చేసేదేమీ లేక చివరికి రిలే దీక్షా శిబిరాలు కూడా మూసేసే పరిస్థితికి వచ్చేశారు. జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో మంగళవారం రిలే నిరాహార దీక్షా శిబిరాలను ఎత్తేశారు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గంలోనే రిలే నిరాహార దీక్షలు ఎత్తేశారంటే మిగతా చోట్ల ఏం జరిగి ఉంటుందో ఊ హించుకోవచ్చు. నరసన్నపేట, పలాస, పాతప ట్నం, ఎచ్చెర్ల తదితర నియోజకవర్గాల్లో ఇదే దుస్థితి. అధిష్టానం నుంచి కూడా తప్పకుండా చే యాలని ఒత్తిడి లేకపోవడంతో హమ్మయ్య అనుకుని ఊపిరిపీల్చుకున్నారు. ఒక భారం దిగిందని ఉపశమనం పొందారు. -
సోనియా త్యాగంతోనే తెలంగాణ వచ్చింది
లక్డీకాపూల్ (హైదరాబా ద్): సోనియా గాంధీ త్యాగంతోనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని దివంగత ప్రజాగాయకుడు గద్దర్ సతీమణి విమల అన్నారు. ఆమె త్యాగనిరతి ఏంటో తనకు తెలుసని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సోనియా గాంధీ ఆదివారం గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా తాను బస చేసిన తాజ్ కృష్ణా హోటల్‌కే విమలను పిలిపించుకున్నారు.ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం గద్దర్ చేసిన పోరాటాలను కొనియాడారు. రాహుల్ స్పందిస్తూ.. గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని సోనియా, ప్రియాంకలకు చెప్పారు. ఆయన గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విమల మీడియాతో మాట్లాడు తూ.. త్యాగమంటే ఏంటో సోనియాకు తెలు సు కాబట్టే ఆమెను కలవాలనుకున్నానని చెప్పారు. ఆ త్యాగం కేసీఆర్‌కు తెలియదని, ఆయన నిరాహార దీక్షలతో తెలంగాణ సిద్ధంగా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని విమల స్పష్టం చేశారు. -
దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి..
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ముగిసింది. బీజేపీ కార్యాలయంలో స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి నిరాహార దీక్షను విరమించారు. కిషన్‌రెడ్డికి నిమ్మరసం ఇచ్చి ప్రకాశ్ జవదేకర్ దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, అంతకుముందు.. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్షకు సమయం మించి పోవడంతో పోలీసులు కిషన్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు సిద్ధం కాగా.. పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాయి. మరోవైపు.. కేసీఆర్ సర్కార్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే చిత్తుకాగితం కాదు. 17పేపర్లు లీక్ చేసి.. తెలంగాణ విద్యార్థులకు విషాదం మిగిల్చారు. సచివాలయంలోకి ఎమ్మెల్యేలను కూడా రానివ్వడం లేదు. కేసీఆర్ పాలన కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అని తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఆరు కమిటీలు -
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొనసాగుతున్న కిషన్ రెడ్డి దీక్ష
-
కేఏ పాల్ ఆమరణ నిరాహార దీక్ష
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఆశీల్మెట్టలోని కేఏ పాల్ కన్వెన్షన్ హాల్ ఆవరణలో ఆయన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ నాయకులు కేంద్రానికి బానిసలుగా మారారని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ కోసం 16 వేల మంది భూదానాలు, 32 మంది ప్రాణాలర్పించారన్నారు. లక్షల కోట్లు లాభాలు తెస్తూ.. రూ.8 లక్షల కోట్లు విలువైన స్టీల్‌ప్లాంట్‌ను రూ.4 వేల కోట్లకు అదానీకి కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దీనిపై కోర్టులో కేసు వేసినట్టు తెలిపారు. ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ ఇప్పుడు యువతను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాని మోదీ, చంద్రబాబే కారణమని విమర్శించారు. తెలుగు ప్రజలందరూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ట్వీట్లు, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా తాను రూ.4 వేల కోట్లు, తరువాత రూ.40 వేల కోట్లు ఇచ్చి స్టీల్‌ప్లాంట్‌ను నడిపిస్తానన్నారు. స్టీల్‌ప్లాంట్ ద్వారా ఏడాదికి లక్ష కోట్లు లాభం చూపిస్తానన్నారు. ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు పది లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని పాల్ చెప్పారు. ఇంత పెద్ద స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం దారుణమన్నారు. కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక హోదా, ప్యాకేజీ, పోలవరం, స్మార్ట్ సిటీ, రెండు కోట్ల ఉపాధి లేకుండా పోయాయని ఆరోపించారు. రాష్ట్రం అప్పులు భారం తీర్చే సత్తా స్టీల్‌ప్లాంట్‌కు మాత్రమే ఉందన్నారు. యువతి, యువకులు, ప్రజలు తరలివస్తే స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. -
నిర్మల్‌లో ‘మాస్టర్’ ఫైట్
నిర్మల్/బాల్కొండ/ఇందల్వాయి/సాక్షి, హైదరాబాద్: మాస్టర్‌ప్లాన్ వ్యవహారంతో నిర్మల్ ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో బీజేపీ ఆదివారం రెండోరోజూ ఆందోళనకు దిగింది. నిర్మల్ బైల్‌బజార్ చౌరస్తా వద్ద పెద్దసంఖ్యలో మహిళలు, పార్టీ నేతలు, కార్యకర్తలు బైఠాయించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని నినదించారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలోకి రాగానే పోలీసులు వారిని అడ్డుకుని, లాఠీచార్జి చేశారు. దీనితో మహిళలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరోవైపు ఏలేటి దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌లను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, మంత్రి ఇంటి ముట్టడికి ప్రతిగా తాము సోమవారం బీజేపీ నేత ఏలేటి ఇంటిని ముట్టడిస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో భారీగా బలగాలను మోహరించారు. ఆమరణ దీక్షలోనే ఏలేటి.. నిర్మల్ మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్ పూర్తిగా రద్దయ్యేవరకూ పోరాటం చేస్తానంటూ మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ వైద్యులు ఆరోగ్యం పరీక్షించేందుకు వచ్చినా నిరాకరించారు. దీక్షకు సంఘీభావంగా వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను నిజామాబాద్–నిర్మల్ జిల్లాల సరిహద్దు వద్దే పోలీసులు నిలిపివేశారు. నిర్మల్ జిల్లా సోన్ వద్ద నిజామాబాద్ జిల్లా మెండోరా, నిర్మల్ పోలీసులు సంయుక్తంగా అరుణను అరెస్టు చేసి హైదరాబాద్‌కు పంపించారు. అరుణ సోన్‌లో, అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఏలేటిని పరామర్శించడానికి వెళ్తున్న తనను ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. అమిత్‌షా, కిషన్‌రెడ్డి ఆరా.. మహేశ్వర్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్‌చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆమరణ దీక్ష, పోలీసులు లాఠీచార్జి చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్లో ఆరా తీశారని తెలిపారు. కాగా సోమవారం కిషన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తదితరులు నిర్మల్ రానున్నట్లు పార్టీ నాయకులు వెల్లడించారు. మరోపక్క మాస్టర్‌ప్లాన్ రద్దు చేసేదాకా రిలే నిరాహార దీక్షలను ఆపేది లేదంటూ బాధిత రైతులు భీషి్మంచుకుని కూర్చున్నారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట దీక్షలో ఉన్నవారిని ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. -
లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిల దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై నిరసనగా ఉదయం నుంచి లోటస్ పాండ్‌లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగించిన షర్మిలకు గజ్వేల్ ప్రజలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కాగా, వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు తనను అడ్డుకున్న పోలీసులకు హారతిచ్చి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ షర్మిల మండిపడ్డారు. దళితబంధులో అవకతవకలు జరిగాయని ఆమె ధ్వజమెత్తారు. చదవండి: తెలంగాణలో బీజేపీ దూకుడు.. ప్లాన్ ఫలించేనా? -
పతకాలను గంగలో కలిపేస్తామంటూ హెచ్చరిక.. హరిద్వార్‌కు చేరుకున్న రెజ్లర్లు
భారత అగ్ర రెజ్లర్ల నిరసన రోజురోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. శాంతియుతంగా చేపట్టిన నిరసన కాస్త ఘర్షణలకు దారితీయడంతో వారిలో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుని నిరహారదీక్ష చేపట్టేందుకు దారితీసింది. ఈ మేరకు భారత అగ్ర స్థాయి రెజ్లర్లు తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తాం, ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటామని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రెజ్లర్లు హరిద్వార్‌కు చేరుకుని పతకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు. #WATCH | Uttarakhand: Wrestlers reach Haridwar to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations.#WrestlersProtest pic.twitter.com/WKqSJQyaH0 — ANI (@ANI) May 30, 2023 అంతకుముందు రెజ్లర్ సాకి మాలిక్ ట్విట్టర్ వేదికగా తమ రెజ్లర్లంతా హరిద్వార్ వెళ్లి గంగా నదిలో సాయంత్రం 6 గంటలకు పతకాలను విసిరేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాము కష్టపడి సాధించిన పతకాలను గంగా నదిలో విసిరివేయకపోతే బతకడంలో ఎలాంటి అర్థం లేదు. కాబట్టి ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్ష చేస్తాం అని ట్వీట్ చేశారు. అయిన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి.. రాజీపడి జీవించడంలో ప్రయోజనం లేదన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ మమ్మల్ని వేధింపులకు గురిచేసిన డబ్ల్యూఎఫ్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తెల్లటి దుస్తులు ధరించి అక్కడి దృశ్యాలను క్లిక్ మనిపించడం మమ్మల్ని కలిచివేసింది. అతను అలా తెల్లటి దుస్తులు ధరించడంలో అర్థం తానే వ్యవస్థ అని చెప్పకనే చెప్పినట్లు ఉందని ట్విట్టర్లో రెజ్లర్లంతా కన్నీటి పర్యంతమయ్యారు. అందుకనే మాకు ఈ పతకాలు వద్దు. ఆ వ్యవస్థ మాకు పతకాలు మెడలో వేసి ముసుగు వేసి గొప్ప ప్రచారం చేసుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా లైంగిక ఆరోపణల నేపథ్యంలో వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ పునియా తదితర రెజ్లర్లు ఏప్రిల్ 26 నుచి జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు శరణ్‌సింగ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. ఐతే రెజ్లర్లు మాత్రం అతన్నిఅరెస్టు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులతో సహ చాలామంది మద్దతు వారికి లభించడం గమనార్హం. అదీగాక ఇటీవల జరిగిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వెలుపలు రెజ్లర్లు శాంతియుతంగా నిరసనలు చేసేందుకు యత్నించారు. ఐతే ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. నిరవధిక నిరహార దీక్షకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. "We will throw our medals in river Ganga in Haridwar today at 6pm," say #Wrestlers who are protesting against WFI (Wrestling Federation of India) president Brij Bhushan Sharan Singh over sexual harassment allegations pic.twitter.com/Mj7mDsZYDn — ANI (@ANI) May 30, 2023 (చదవండి: ఫోన్ కోసం డ్యామ్ నీటిని ఎత్తిపోసిన ఘటన..వృధా చేసిన నీటికి డబ్బు చెల్లించమంటూ లేఖ) -
కవిత దీక్ష విజయవంతం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష విజయవంతం అయింది. శుక్రవారం జంతర్‌మంతర్‌లో చేపట్టిన ఈ దీక్ష కు తెలంగాణతోపాటు ఢిల్లీ, దాని పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. భారత్ జాగృతి చెప్పినట్లుగానే సుమారు 5 వేల మంది ఈ దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కవిత అనుచరు లు కలిపి ఐదారువందల మంది రాష్ట్రనేతలు హాజరుకాగా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు దీక్షకు తరలివచ్చారు. ఢిల్లీలోని జేఎన్‌యూ, జామి యా యూనివర్సిటీలతో పాటు చుట్టుపక్కల వర్సిటీల నుంచి వచ్చిన యువతులు ఆరంభం నుంచి ముగింపు వరకు దీక్షలో పాల్గొన్నారు. 18 పార్టీల నేతలు, ప్రతినిధులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ఆరంభించగా, సీపీఐ నేత నారాయణ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. సంజయ్ సింగ్, చిత్ర సర్వార (ఆప్), నరేష్ గుజ్రాల్ (అకాలీదళ్), అంజుమ్ జావెద్ మిర్జా (పీడీపీ), షమీ ఫిర్దౌజ్ (నేషనల్ కాన్ఫరెన్స్), సుస్మితా దేవ్ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్సీపీ), పూజ శుక్లా (ఎస్పీ), శ్యామ్ రజక్ (ఆర్జేడీ)తోపాటు శివసేన నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ కిసాన్ యూనియన్, నేషనల్ క్రిస్టియన్ బోర్డు, తమిళనాడు, కేరళ రైతు సంఘాల ప్రతినిధులు, సింగరేణి కోల్ మైన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాలుపంచుకున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా కవిత చేపట్టిన దీక్షపై కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయి. దీక్షకు హాజరైన రాష్ట్ర నేతలతో పాటు, వివిధ పార్టీల నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత వివరాలన్నింటినీ సేకరించాయి. సివిల్ దుస్తుల్లో ఉన్న సుమారు 20 మందికి పైగా ఇంటెలిజెన్స్ అధికారులు దీక్ష జరిగినంత సేపూ అక్కడే ఉండి ప్రతి విషయాన్ని నోట్ చేసుకున్నారు. వేర్వేరు భాషల్లో మాట్లాడిన నేతల ప్రసంగాలను అక్కడే మీడియా ప్రతినిధులు, ఇతరులతో తర్జుమా చేయించుకోవడం కనిపించింది. కవిత శనివారం ఈడీ ముందు హాజరు కానున్న నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల వైఫల్యం చోటు చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే ఇంటెలిజెన్స్ కన్నేసినట్లు చెబుతున్నారు. -
యతో ధర్మః.. తతో జయః :ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ‘యతో ధర్మ: తతో జయః.. దేవుడు మా వెంటే ఉన్నాడు. ఎవరికీ భయపడేది లేదు. ఎప్పటికీ ప్రజల కోసమే పని చేస్తాను’అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో భారత్ జాగృతి నేతృత్వంలో నిర్వహించనున్న నిరాహారదీక్షకు సంబంధించి గురువారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ తనకిచ్చిన నోటీసుల అంశంపై ఆమె స్పందించారు. ఈ నెల 11న ఈడీ విచారణకు హాజరవుతానని.. ఎప్పుడు, ఎక్కడికి రమ్మని పిలిస్తే అక్కడి వెళతానన్నారు. అయితే విచారణ సమయంలో చట్టప్రకారం మహిళలకు ఉండే అధికారాలను విచారణ సంస్థలు గౌరవించాలన్నారు. ‘వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ఎందుకు జరపరు? అవసరమైతే మా ఇంటికి వచ్చి ఎందుకు విచారించరు?’అని ప్రశ్నించారు. దీనిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని ఆమె స్పష్టం చేశారు. ధర్మం ఎవరివైపు ఉంటే వారిదే విజయం.. ‘మహాభారత యుద్ధ సమయంలో దుర్యోధనుడు తల్లి గాంధారి ఆశీర్వాదం కోరతాడు. అయితే దుర్యోధనుడు అన్యాయం వైపు ఉన్నాడని తెలుసు కాబట్టి ఆమె ‘యతో ధర్మః.. తథో జయః’అని కొడుకును ఆశీర్వదిస్తుంది. నేనూ అదే చెబుతున్నాను. ధర్మం ఎవరివైపు ఉంటే వారికే విజయం లభిస్తుంది. జైలులో ఉంచినంత మాత్రాన కృష్ణుడి పుట్టుకను ఆపలేకపోయారు. అజ్ఞాతవాసంలో ఉన్న కారణంగా అర్జునుడి శౌర్యం ఏమాత్రం తక్కువకాలేదు. వనవాసానికి వెళ్లిన తర్వాత శ్రీరాముడు మరింత బలవంతుడిగా మారి లోకకల్యాణం కోసమే పనిచేశారు. మేము దేవుడి కంటే బలవంతులమని ఎవరికైతే అనిపిస్తుందో... విచారణ సంస్థలు సహా అన్నింటినీ కంట్రోల్ చేస్తున్నామని భావిస్తారో, అప్పుడు ప్రకృతే న్యాయం చేసేందుకు ముందుకొస్తుంది. బీజేపీ నియంతృత్వ పాలనను అడ్డుకొని న్యాయం చేసేందుకు ప్రకృతి ముందుకు రావడం ఖాయం’అని కవిత పేర్కొన్నారు. వందలాది మందిపై దాడులు.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని 500 వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు, వందమందిపై సీబీఐ, 200 మందిపై కేంద్రం ఈడీ దాడులు చేయించిందని కవిత దుయ్యబట్టారు. తనతోపాటు పలువురు మంత్రులు, బీఆర్ఎస్కు చెందిన సుమారు 16 మంది ప్రజాప్రతినిధులపై రాజకీయ దురుద్దేశంతోనే విచారణ సంస్థలతో దాడులు చేయించిందని ఆరోపించారు. అలాగే సుమారు 600 మందిని ఎన్ఐఏ విచారణకు పిలిపించి భయపెట్టిందన్నారు. బీజేపీకి తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ఆశ ఉంటే తొలుత రాష్ట్ర ప్రజల మనసులు గెలవాలని, ఆ తర్వాతే అధికారం గురించి ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ అహంకారాన్ని వీడాలి దేశంలో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ ఇప్పటికైనా అహంకారా న్ని వీడాలన్నారు. ప్రతిపక్షాలు ఏకమవ్వడంలో సవాళ్లు ఏమీ లేవని.. అయితే దేశంలోని అన్నిచోట్లా బలంగాలేని కాంగ్రెస్ ప్రతిపక్షాలకు ఎలా నేతృత్వం వహిస్తుందని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ మాత్రమేనని, జాతీయ పార్టీ అనే భ్రమ నుంచి బయటికి రావాలని సూచించారు. విపక్షాలకు నేతృత్వం వహించాలని కాంగ్రెస్ భావిస్తే తొలుత ఆ పార్టీ అహంకారాన్ని వదిలిపెట్టి వాస్తవాలను గ్రహించాలని ఆమె సూచించారు. ముందు ఈడీ.. తర్వాతే మోదీ ఈ ఏడాది నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గతేడాది జూన్ నుంచి మోదీ ప్రభుత్వం తెలంగాణకు కేంద్ర దర్యాప్తు సంస్థలను పంపించడం ప్రారంభించిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ కొత్త సంప్రదాయాన్ని పాటిస్తోందని... ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ముందుగా ఈడీ వెళ్తోందని.. ఆ తర్వాతే మోదీ వస్తున్నారన్నారని ఆరోపించారు. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను చూసి భయపడే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిదికాదన్నారు. బీఎల్ సంతోష్ కు భయమెందుకు? ప్రతిపక్షాలకు చెందిన తనలాంటి నాయకులను వేధించడం ద్వారా ఏం సాధించాలనుకుంటుందో బీజేపీ స్పష్టం చేయాలని కవిత డిమాండ్ చేశారు. తాను తప్పు చేయలేదు కాబట్టి ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నానని, అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని కవిత కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ముందుకు బీఎల్ సంతోష్ హాజరై అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబులివ్వాలన్నారు. అన్ని అంశాల్లోనూ కేంద్రం అబద్ధాలాడుతూ కాలం వెళ్లదీస్తోందని, వన్ నేషన్– వన్ ఫ్రెండ్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇవ్వరాదని కోరారు. -
నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్తత.. ఎంపీ కోమటిరెడ్డి దీక్ష
సాక్షి, హైదరాబాద్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాత్విక్ మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాలేజీ వద్ద దీక్ష చేపట్టారు. సాత్విక్ సూసైట్ నోట్లో పేర్కొన్న నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యుల్ని అరెస్ట్ చేసేవరకు తాను దీక్ష చేస్తానని చెప్పారు. కాలేజీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళకు దిగారు. దీంతో పోలీసులు కాలేజీ వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థులకు బోధించేంకు క్వాలిఫైడ్ లెక్చరర్స్ కూడా లేరని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఐఐటీ పేరుతో విద్యార్థులను మోసం చేసి రూ.లక్షల వసూలు చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వీరిపై హెచ్ఆర్డీకి కూడా ఫిర్యాదు చేశానని, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని చెప్పారు. కాలేజీలో విద్యార్థులను కొట్టడం, దూషించడం వంటి హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు సున్నితమైన విషయాల్లో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు. చదవండి: సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్! -
నిర్వాసితులకు ఇచ్చేందుకు నిధుల్లేవా?
భువనగిరి: బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు పరిహారం కోసం ప్రాజెక్టు కట్టపై చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం 26వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారి దీక్షాశిబిరాన్ని ఎంపీ వెంకట్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ భూ నిర్వాసితులకు ఎంత పరిహారం ఇచ్చారు..? బస్వాపూర్ నిర్వాసితులకు ఎంత చెల్లిస్తున్నారో చె ప్పాలన్నారు. వాస్తు బాగోలేదని రూ.650 కోట్లు ఖ ర్చు చేసి సచివాలయం నిర్మిస్తున్న ప్రభుత్వం వద్ద నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మంచి మనసుతో నిర్వాసితులకు రూ.350 కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. బస్వాపూర్ ప్రాజెక్టు పేరుతో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మూసీ నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తూ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. బస్వాపూర్ నిర్వాసితులకు కొత్త అవార్డు ప్రకటించాలని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. పరిహారంపై హామీ ఇవ్వని పక్షంలో ఈ నెల 27న రిజర్వాయర్ కట్టపై వంటావార్పు చేపడతామని, అందులో తాను పాల్గొంటానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పలువురు నిర్వాసితులు కంటతడి పెట్టడంతో వారిని ఆయన ఓదార్చారు. -
అపోలో ఆస్పత్రి నుంచి వైఎస్ షర్మిల డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, షర్మిలకు 15 రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్ షర్మిల పూనుకోగా, శనివారం అర్ధరాత్రి పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం అక్కడ చికిత్స పొందారు షర్మిల. దీక్ష కారణంగా లో బీపీ, బలహీనత ఉండటంతో వైఎస్ షర్మిలను అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్లు నిన్నటి బులిటెన్‌లో వైద్యులు తెలిపారు. -
క్షీణించిన వైఎస్ షర్మిల ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ప్రవీణ్ బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు. బ్లడ్ లాక్ట్ లెవెల్స్ పెరిగాయని, బీపీ లెవెల్స్ పడిపోయాయన్నారు. ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యారన్నారు. ముందు ముందు కీడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. తక్షణమే షర్మిలను ఆసుపత్రిలో చేర్చాలన్నారు. కాగా, షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం నిరాకరించడంతో గురువారం ఆమె ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమె దీక్షను భగ్నం చేసి పోలీసులు లోటస్‌పాండ్‌కు తరలించారు. అక్కడ కూడా షర్మిల ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. -
YS Sharmila: వైఎస్ షర్మిల నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతులను ఎందుకు నొకేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై షర్మిల మండిపడ్డారు. తమ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్‌పాండ్‌కు తరలించారు. దీంతో ఆ పార్టీ కార్యాలయం ముందు దీక్షకు దిగారు. రోడ్డుపైనే షర్మిల దీక్ష చేస్తున్నారు. కోర్టు అనుమతిచ్చినా పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకూ, షర్మిలకూ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం అన్నారు. వైఎస్ షర్మిల దీక్షకు వైఎస్ విజయమ్మ సంఘీభావం వైఎస్ షర్మిల దీక్షకు వైఎస్ విజయమ్మ సంఘీభావం తెలిపారు. షర్మిలకు భయపడి పాదయాత్రను అడ్డుకుంటున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. పాదయాత్రకు స్పందన చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతుందనిపిస్తుందని విజయమ్మ అన్నారు. -
జైలులో నిరాహార దీక్ష చేపట్టిన యాసిన్ మాలిక్!
న్యూఢిల్లీ: తీహార్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాది యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మాలిక్ జూలై 22 నుంచి నిరాహార దీక్ష ప్రారంభించాడని చెప్పారు. తన కేసును సంక్రమంగా విచారంచిలేదంటూ ఆరోపణలు చేస్తూ... నిరాహారదీక్ష చేపట్టాడని వెల్లడించారు. వాస్తవానికి మాలిక్ నిషేధిత జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఐతే అతను 2019లో జేకేఎల్‌ఎఫ్‌ని నిషేధించిన కొద్దికాలానికే అరెస్టు అవ్వడమే కాకుండా ఉగ్రవాద నిధుల కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష తోపాటు దాదాపు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. పైగా అతను తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా ఫిటిషన్ దాఖలు చేయనని కోర్టుకు తెలిపాడు కూడా. అంతేగాదు పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబుబా మఫ్తీ సోదరి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహ్మద్ సయ్యద్ కుమార్తె రుబయా సయ్యద్‌ని డిసెంబర్ 8,1989న తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ కేసులో మాలిక్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మాలిక్ పై కిడ్నాప్ కేసు తోపాటు 1990 జనవరిలో శ్రీనగర్‌లో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను కాల్చి చంపిన కేసులో కూడా మాలిక్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐతే మాలిక్ ప్రస్తుతం ఈ కేసులో వ్యక్తిగత హాజరు కావాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. (చదవండి: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో బెంగాల్ మంత్రి అరెస్ట్.. అసలు సినిమా ముందుంది: బీజేపీ) -
250 మందితో 25 గంటల నిరాహార దీక్ష..
-
ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మారుస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మార్చుతామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీలో సీఎం ఎవరైనా సరే టీపీసీసీ అధ్యక్షుడిగా తాను సీఎంగా ఉన్న వారితో దళిత, గిరిజనుల విద్య, అభివృద్ధి కోసం మొదటి సంతకం చేయిస్తానని చెప్పారు. బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దళిత, గిరిజనుల అభివృద్ధికే కేటాయిస్తామన్నారు. బుధవారం మూడుచింతలపల్లిలోని దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా బుధవారం సాయంత్రం రేవంత్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి రెండు రోజుల దీక్షను విరమింపజేశారు. సీఎంగా కేసీఆర్ రాజభోగాలు అనుభవిస్తున్న ప్రగతిభవన్‌ను అంబేడ్కర్ బహుజన్ భవన్‌గా మార్చి అక్కడి నుంచే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లేలా చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దత్తత పేరుతో దగా.. సీఎం కేసీఆర్ దత్తత పేరుతో గ్రామాలను దగా చేశారే తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మూడుచింతలపల్లిని దత్తత తీసుకునే సమయంలో అది చేస్తా, ఇది చేస్తా అని ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ చేయలేదన్నారు. సీఎం దత్తత గ్రామాలపై తాను చర్చకు సిద్ధమని, అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరినా అధికారంలో ఉన్న ఏ ఒక్కరూ స్పందించకపోవడం విడ్డూరమన్నారు. పేదల పిల్లలు చదువుకుంటే రాజ్యాధికారం అడుగుతారని, చైతన్యవంతులు అవుతారని.. అందువల్లే సీఎం కేసీఆర్ 4,632 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, కాలేజీలు మూసివేయించారని ఆరోపించారు. తండ్రి ఓ మాట, కొడుకో మాట హుజూరాబాద్‌లో ఓటమి భయం పట్టుకుందని అందుకే సీఎం కేసీఆర్ ఒకటంటే.. ప్రెస్మీట్లో కుమారుడు కేటీఆర్ మరోటి అంటున్నారని రేవంత్‌రెడ్డి అన్నా రు. కాంగ్రెస్ దండోరా సభలతో కేసీఆర్ అనే ఎలుక బయటికొచ్చిందని వ్యాఖ్యానిం చారు. కేసీఆర్ జపాన్ ఎలుకలాంటి వాడని. ప్రమాదాన్ని ముందే గ్రహించి ఫామ్‌హౌస్ నుంచి బయటికొచ్చారని ఎద్దేవా చేశారు. తాను జీవితంలో సుఖంగా జీవిం చేందుకు దేవుడు అన్నీ ఇచ్చాడని, తనకు పదవుల ఆశ లేదని చరిత్రలో గుర్తుండేలా నిలిస్తే చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల ఇన్చార్జి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు ప్రసంగించారు. రాష్ట్ర నాయకులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మల్లు రవి, నందికంటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి వేదిక ఎక్కితే జోకర్... బయట ఉంటే బ్రోకర్ మంత్రి మల్లారెడ్డి వేదిక ఎక్కితే జోకర్.. బయట ఉంటే బ్రోకర్ అని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్నాడన్నారు. నియోజకవర్గంలో ఎవరు భూములు అమ్మినా, కొన్నా ఆయన మామూళ్లు వసూలు చేస్తారని ఆరోపించారు. జవహర్‌నగర్‌లో 268 సర్వే నంబర్లో తప్పుడు పత్రాలు సృష్టించి తన కోడలు పేరుతో ఆస్పత్రి నిర్మించారని, సూరారంలో చెరువును కబ్జా చేసి ఆస్పత్రి నిర్మించారని, మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీకి కేటాయించిన భూమిలో తన బావమరిది శ్రీనివాస్‌రెడ్డి పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. మంత్రి, తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కుమారులు, బావమరిది ఇలా కుటుంబమంతా కబ్జాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మల్లారెడ్డి అక్రమాలపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి అక్రమాలను తాను నిరూపిస్తానని, రుజువు చేయలేకపోతే ఏ శిక్ష విధించినా అంగీకరిస్తానని చెప్పారు. చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు? -
కేసీఆర్.. ఉద్యోగాలు ఇంకెప్పుడు?
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో వందలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వోద్యోగం సాధించి వస్తామని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లి శవాలై ఇళ్లకు వస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెందరు చనిపోతే సీఎం కేసీఆర్ దాహం తీరుతందని, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంకెప్పుడు వేస్తారని నిలదీశారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల డిమాండ్‌తో ప్రతి మంగళవారం వైఎస్ఆర్టీపీ నిర్వహిస్తున్న నిరాహార దీక్ష మంగళవారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగి గ్రామంలో జరిగింది. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఐదు నెలల క్రితం కాకతీయ వర్సిటీలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ నాయక్ కుటుం బాన్ని షర్మిల పరామర్శించారు. గుండెంగి సమీపంలోని సోమ్లా తండాలో ఉన్న సునీల్ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు మల్లిక, రాందన్, అన్న శ్రీనివాస్, వదిన వనజలతో మాట్లాడారు. వారిని ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం గుండెంగలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 6 గంటలకు సునీల్ తల్లిదండ్రులు నిమ్మరసం ఇచ్చి షర్మిల దీక్షను విరమింపజేశారు. వారి ఆత్మహత్యలకు కేసీఆరే కారణం... తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉద్యమ నాయకుడికి ఓటు వేసినా ఉద్యోగాల నోటిఫికేషన్ వేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారి ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని షర్మిల ఆరోపించారు. -
నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే..
సిరిసిల్ల: రాష్ట్రంలోని 54 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేదాకా దీనిని కొనసాగించాలన్నారు. ఎన్నికల సమయంలో రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లెలో మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతుంటే ముఖ్యమంత్రి కనీసం వారికి భరోసా కల్పించే ప్రయత్నం కూడా చేయడం లేదన్నారు. ఆయనకు మానవత్వం లేదని, అవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. గొల్లపల్లెలో ఆత్మహత్యకు పాల్పడిన ముచ్చర్మ మహేందర్ యాదవ్ కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో ఖాళీలతో కలిపి మొత్తం 3.85 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఏడేళ్లలో నిరుద్యోగం నాలుగు రెట్లు అయ్యిందన్నారు. రుణమాఫీ అంటే వైఎస్సార్‌దే రైతులకు రుణమాఫీ అంటే దివంగత నేత వైఎస్సార్ చేసిందేనని షర్మిల చెప్పారు. ఆయన ఒకే సారి రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. దీనితో పాటు ఆరోగ్యశ్రీ, 108 వంటి ఎన్నో పథకాలు అమలు చేశారని వివరించారు. ఇప్పుడు రైతులు రుణమాఫీలు లేక వడ్డీలు కడుతున్నారని తెలిపారు. 2 లక్షల పెన్షన్లను రద్దు చేశారని, ఫీజు రీయింబర్స్మెంట్ కింద ముష్టి రూ.35 వేలు ఇస్తున్నారని విమర్శించారు. అంతకు ముందు మహేందర్ యాదవ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. -
‘ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో కొలువులేవి?’
సిరిసిల్ల: ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. మళ్లీ కొలువుల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల శివారులోని గొల్లపల్లెలో మంగళవారం షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఉద్యోగం రాలేదన్న మానసిక వేదనతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన గొల్లపల్లెకు చెందిన ముచ్చర్ల మహేందర్ యాదవ్ (29) కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం 15 లక్షలమంది చూస్తున్నారు. ఉద్యోగాల కోసం 54 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉద్యోగాలు ఏవీ.. నిరుద్యోగ భృతి ఏదీ. ఉద్యోగాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో.. మళ్లీ ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అన్నారు. -
ఏడేళ్లలో 4 రెట్లు పెరిగిన నిరుద్యోగం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎక్కువగా నిరుద్యోగ సమస్య ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. గత ఏడేళ్లలో నిరుద్యోగిత నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సీఎం కేసీఆర్ పట ్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం పెనుబల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బతికే మార్గం లేక ఆత్మహత్యలు తాము నిరుద్యోగులమంటూ 54 లక్షల మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో పలువురు ఆత్మహత్య చేసుకున్నా.. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన సీఎం దున్నపోతు మీద వాన పడిన చందంగా స్పందించడం లేదని షర్మిల విమర్శించారు. నిరుద్యోగులు బతికే మార్గం లేక, అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజైనా 50 వేల ఉద్యోగాల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారంటే దానికి కారణం తాము బయటకు వచ్చి చేస్తున్న పోరాటం వల్లనే అని తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా సోయి వచ్చిందన్నారు. తాము ప్రతి మంగళవారం దీక్షలు చేస్తుంటే వ్రతాలు చేస్తున్నా మని కేటీఆర్ అంటున్నారంటూ.. ‘మేము ఆడవాళ్లం మెతుకు ముట్టకుండా వ్రతమే చేస్తున్నాం అనుకుందాం.. మరి వీరు పెద్ద మగాళ్లు కదా.. అధికారంలో ఉన్నారు కదా.. ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు’అని షర్మిల నిలదీశారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకోవాలనే మంత్రి.. పదవికి రాజీనామా చేసి హమాలీ పనికి వెళ్లాలని సూచించారు. తనకు ఉద్యోగం రాలేదనే నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. 1.91 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షకు ముందు వేదిక వద్ద దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు. -
పెనుబల్లిలో వైఎస్ షర్మిల ‘నిరుద్యోగ దీక్ష’
సాక్షి, ఖమ్మం జిల్లా: ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల ఆత్మహత్య పాల్పడిన గంగదేవిపాడుకు చెందిన నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. రాష్ట్రంలో ఉన్న పలువురు నిరుద్యోగులతో ఫోన్లో వైఎస్ షర్మిల మాట్లాడారు. జోహార్ వైఎస్సార్, జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన వైఎస్ షర్మిల.. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం అవుతుంటే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టామని, 72 గంటల పాటు అవమానాలను తట్టుకుని నిరాహార దీక్ష కొనసాగించామని తెలిపారు. లక్షా 91 వేల ఉద్యోగాలను వెంటనే సీఎం కేసీఆర్ భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వయో పరిమితి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. -
రేపు గంగదేవిపాడులో షర్మిల నిరాహార దీక్ష
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో ఈ నెల 20వ తేదీన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర నేత కొండా రాఘవరెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. 20న ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగిస్తారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలపాలని కోరారు. -
20న పెనుబల్లిలో షర్మిల దీక్ష
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో వైఎస్సార్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఈనెల 20న నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. గంగదేవిపాడులో ఉద్యోగం రావట్లేదని ఆత్మహత్యకు పాల్పడిన నాగేశ్వర్రావు కుటుంబాన్ని గురువారం వైఎస్సార్ టీపీ నేత లక్కినేని సుధీర్‌బాబు పరామర్శించారు. అనంతరం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అదేరోజు నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంబూరి శ్రీనివాసరావు, జెన్నారెడ్డి విజయనరసింహారెడ్డి పాల్గొన్నారు. -
రష్యాకు అమెరికా వార్నింగ్.. అదే గనుక జరిగితే..
వాషింగ్టన్: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(44) ఆరోగ్య పరిస్థితిపై అమెరికా స్పందించింది. ఒకవేళ ఆయన గనుక జైలులో మరణించినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ సీఎన్ఎన్తో మాట్లాడుతూ... ‘‘మిస్టర్ నావల్నీకి ఏం జరిగింది, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందన్న అంశం గురించి రష్యా ప్రభుత్వంతో మాట్లాడాము. కస్టడీలో ఆయనకు ఏమైనా జరిగితే అంతర్జాతీయ సమాజానికి జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యతను గుర్తుచేశాం. ఆయన పోలీస్ కస్టడీలో మరణిస్తే, రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించాలన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నాం. అయితే వీటన్నింటినీ ఇప్పుడే బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ మిస్టర్ నావల్నీ మృతి చెందితే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, యూరోపియన్ యూనియన్ సైతం నావల్ని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ‘‘నావల్నిని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత రష్యా అధికారులపై ఉంది. ఏదైనా జరగరానిది జరిగితే వాళ్లు జవాబుదారీగా ఉండాల్సిందే’’అని ఈయూ విదేశాంగ విధాన విభాగం అధినేత జోసెఫ్ బారెల్ ట్వీట్ చేశారు. కాగా పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించే అలెక్సీ నావల్నీ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాననీ, కాళ్లలో స్పర్శ కోల్పోయానని వ్యక్తిగత వైద్యులను అనుమతించాలంటూ నావల్నీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే, ఇందుకు సానుకూల స్పందన రాకపోవడంతో మూడు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఆయన ఏ క్షణంలోనైనా మరణించే అవకాశం ఉందని నావల్నీ పర్సనల్ డాక్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తిన నేపథ్యంలో, రష్యా నుంచి తమ రాయబారిని వెనక్కి పంపించే యోచనలో బైడెన్ ప్రభుత్వం ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి రష్యా పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను తరలించడంపై జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసిన ఆయన, ఉద్రిక్తతలను నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. చదవండి: రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యం విషమం: ‘ఏ క్షణంలోనైనా మృతి’ -
రష్యా ప్రతిపక్ష నేత ఆరోగ్యం విషమం.. ‘ఏ క్షణంలోనైనా మృతి’
మాస్కో: రష్యా ప్రతిపక్ష నేత, అధ్యక్షుడు పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించే అలెక్సీ నావల్నీ(44) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నావల్నీ మూడు వారాలుగా నిరాహార దీక్ష కొనసాగిస్తుండటంతో ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణిస్తోందని ఆయన వ్యక్తిగత వైద్యుడు యరోస్లావ్ అషిఖ్మిన్ వెల్లడించారు. ఆయన ఏ క్షణంలోనైనా తుదిశ్వాస విడిచే ప్రమాదముందన్నారు. కుటుంబసభ్యులు అందజేసిన నావల్నీ వైద్య పరీక్షల రిపోర్టులు పరిశీలిస్తే.. రక్తంలో పొటాషియం, క్రియాటినిన్ స్థాయిలు పెరిగిపోయాయనీ, ఇది గుండెపోటుకు, కిడ్నీల వైఫల్యానికి దారితీస్తుందన్నారు. కాగా విష ప్రయోగం అనంతరం జర్మనీలో 5 నెలలపాటు చికిత్స పొంది జనవరిలో స్వదేశం చేరుకున్న నావల్నీని అధికారులు అరెస్ట్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై కోర్టు ఆయనకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే, వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాననీ, కాళ్లలో స్పర్శ కోల్పోయానని వ్యక్తిగత వైద్యులు అనుమతించాలంటూ చేసిన నావల్నీ వినతిని జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు. చదవండి: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత: పుతిన్‌కు బైడెన్ ఫోన్ -
దీక్ష విరమించిన వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల ఆదివారం విరమించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న తన కార్యాలయంలో షర్మిల కొనసాగిస్తున్న ఉద్యో గ దీక్షను నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులు ఆమెకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదనే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన గుగులోత్ రవిందర్ నాయక్, కొప్పు రాజు, మురళి ముది రాజు కుటుంబ సభ్యులను షర్మిల ఈ సంద ర్భంగా ఓదార్చారు. రవిందర్ నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళి ముదిరాజు తల్లికి రూ. 50 వేల చొప్పున తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న వైఎస్ షర్మిల అనంతరం దీక్షా శిబిరం నుంచి ప్రసంగించిన షర్మిల కేసీఆర్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరు చుకుపడ్డారు. ప్రైవేటు ఉద్యోగాలు కూడా రావట్లేద ని ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నార న్నారు. అయినా ప్రభుత్వం పైసా సహాయం చేయలేదని మండిపడ్డారు. పాలకులకున్నది గుండెనా.. బండరాయా? అని నిలదీశారు. నిరుద్యోగులవి ప్రభుత్వ హత్యలు కావా? అని ప్రశ్నించారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రతిరోజూ మానసికంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించారని విమర్శించారు. 3.85 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. ‘‘మాట మీద నిలబడే వైఎస్సార్ బిడ్డగా చెబుతున్నా. కేసీఆర్ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేయిస్తా. నోటిఫికేషన్లు వచ్చే వరకు ప్రతి జిల్లాలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయి. రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఏ నిరుద్యోగీ ఆత్మహత్య చేసుకోవద్దు.’’అని షర్మిల స్పష్టం చేశారు. చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి: వైఎస్ షర్మిల కేసీఆర్ వారిపట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ: షర్మిల -
నేడు రైతు సంఘ నేతల నిరాహారదీక్ష
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. సోమవారం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన రైతు సంఘాల నేతలు ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘చలో ఢిల్లీ’లో భాగంగా ఢిల్లీ–జైపూర్ హైవే ముట్టడికి పిలుపునివ్వడంతో ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు ఆదివారం మధ్యాహ్నం నుంచి షాజహాన్‌పూర్ వద్ద హైవేపైకి చేరుకుంటున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలువరిస్తున్నారు. జైపూర్ మార్గంలో రాకపోకలకు ఆటంకం రైతు సంఘాల పిలుపు మేరకు ఆల్వార్ జిల్లా షాజహాన్‌పూర్ వద్ద జాతీయ రహదారి వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, హక్కుల కార్యకర్తలు అరుణారాయ్, మేథా పాట్కర్, సీపీఎం నేత ఆమ్రా రామ్ తదితరులు వీరిలో ఉన్నారు. రైతుల నిరసనల కారణంగా జైపూర్–ఢిల్లీ హైవే ట్రాఫిక్‌ను ఆల్వార్ జిల్లా బన్సూర్ తదితర మార్గాలకు మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం ఢిల్లీ నుంచి జైపూర్‌కు ఒన్‌వే ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఆందోళనల విచ్ఛిన్నానికి సర్కారు కుట్ర కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు సోమవారం ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష పాటిస్తారని రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చదుని తెలిపారు. దీంతో పాటు సోమ వారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరుగుతాయన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు యథాప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు. చిల్లా వద్ద రైతు ఆందోళనల విరమణపై ఆయన స్పందిస్తూ.. ‘ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు రైతులకు అనుకూలంగా ఉన్నాయంటూ కొన్ని గ్రూపుల నేతలు ఆందోళనలను విరమిస్తున్నారు. రైతుల పోరాటాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. సాగు చట్టాలు మూడింటిని రద్దు చేయాలనే విషయంలో రైతు సంఘాలన్నీ ఏకతాటిపై ఉన్నాయి’అని ఆయన ప్రకటించారు. ఈ నెల 19వ తేదీ నుంచి నిరవధిక దీక్ష చేప ట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు మరో నేత సందీప్ గిద్దె తెలిపారు. చిల్లా మీదుగా రాకపోకలు మొదలు చిల్లా మీదుగా వెళ్లే నోయిడా– ఢిల్లీ లింక్ రోడ్డులోని రవాణా వాహనాలు వెళ్లే ప్రాంతాన్ని రైతులు ఖాళీ చేయడంతో ఆ మార్గంలో రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఇక్కడ రైతులు ధర్నా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, నోయిడాలకు కలిపే డీఎన్డీ, కాళిందీ కుంజ్ మార్గంలో వాహనాల రాకపోకలు నిరాటంకంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు టిక్రీ, ధన్సా సరిహద్దులను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆందోళనల్లో సామాన్య మహిళలు హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతు కుటుంబాలకు చెందిన పలువురు సామాన్య గృహిణులు ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనల్లో చురుగ్గా పాలుపంచు కుంటున్నారు. . ‘వ్యవసాయానికి ఆడామగా తేడా లేదు.చాలా మంది పురుషులు ఇక్కడ నిరసనల్లో పాల్గొంటున్నారు. మేమెందుకు ఆందోళనల్లో పాల్గొనకూడదు?’అని లూధియా నాకు చెందిన మన్దీప్ కౌర్అన్నారు. కాగా, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తదుపరి దఫా చర్చల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర మంత్రి కైలాశ్ చౌధరి తెలిపారు. ఈసారి సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేంద్రం, రైతు ప్రతినిధుల మధ్య ఐదు రౌండ్ల చర్చలు జరిగినా ఎటువంటి పురోగతి కనిపించలేదు. 9వ తేదీన జరగాల్సిన ఆరో విడత చర్చలు రద్దయిన విషయం తెలిసిందే. రైతు ఆందోళనలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, సోమ్ ప్రకాశ్ ఆదివారం హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. దీక్షలో నేనూ పాల్గొంటున్నా: కేజ్రీవాల్ కేంద్రం అహంకారం వీడి కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను అంగీకరించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. 14వ తేదీన రైతు సంఘాల పిలుపు మేరకు తనతో పాటు ఆప్ పార్టీ కార్యకర్తలు ఒకరోజు నిరాహార దీక్ష పాటిస్తారని ఆయన వెల్లడించారు. రైతుల ఆందోళనలను మావో యిస్టులు, వామపక్ష పార్టీలు, జాతి వ్యతిరేక శక్తులు హైజాక్ చేశాయంటూ కొందరు కేంద్ర మంత్రులు ఆరోపించడంపై ఎన్సీపీ తీవ్రంగా స్పందించింది. పంజాబ్ డీఐజీ రాజీనామా రైతుల ఆందోళనకు మద్దతుగా రాజీనామా చేసినట్లు పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(జైళ్లు) లఖ్మీందర్ సింగ్ జాఖర్ ఆదివారం ప్రకటించారు. తన రాజీనా మా లేఖను శనివారం రాష్ట్ర ప్రభుత్వా నికి పంపినట్లు వెల్లడించారు. రైతు కుటుంబానికి చెందిన తను, రైతులు శాంతియు తంగా సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రహదారుల దిగ్బంధంపై 16న సుప్రీం విచారణ రైతుల నిరసనల కారణంగా వాహ నదారులు ఇబ్బందులు పడుతున్నారనీ, భారీ సంఖ్యలో రైతులు గుమి గూడుతుండటంతో కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటూ దాఖలైన పిటిషన్‌పై ఈనెల 16న సుప్రీంకోర్టు విచారణ చేప ట్టనుంది. ఢిల్లీ సరిహద్దులను తిరిగి తెరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరు తూ వచ్చిన పిటిషన్‌ను ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించనుంది. -
పేదల ద్రోహి చంద్రబాబు
తాడికొండ: బడుగు బలహీన వర్గాలకు రాజధాని ప్రాంతంలో నిలువ నీడ లేకుండా చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సత్యన్నారాయణ విమర్శించారు. అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలకు ఆయన బుధవారం మద్దతు ప్రకటించారు. రాజధాని భూ సమీకరణ పేరుతో దళితుల లంక, అసైన్డ్ భూములను లాక్కుని నిలువ నీడ లేకుండా చేశాడన్నారు. ఎన్ఆర్ఐ నిధులతో కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్న చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో ప్రజాదరణ లేకే ఓటమి పాలయ్యాడనే నిజం తెలుసుకోవాలని హితవు పలికారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమష్టిగా అభివృద్ధి, వికేంద్రీకరణ జరుగుతుందనే మూడు రాజధానులకు భారీ మద్దతు వస్తోందన్నారు. పాల్గొన్న మహిళలు, దళిత సంఘాలు ముస్లిం యువకులకు వేసిన బేడీల సంగతేంటి బాబూ.. మూడు రాజధానుల ఉద్యమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులతో పేద ఎస్సీ, మహిళలపై దాడులు చేయించింది చాలక, దాడిచేసిన వారిని అరెస్టు చేస్తే రైతులకు బేడీలు వేశారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆలిండియా ఇత్తెహాదుల్ ముస్లీమీన్ రాష్ట్ర యూత్ లీడర్ సయ్యద్ దాదాపీర్ విమర్శించారు. తన గుంటూరు సభలో ముస్లిం యువకులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తే దేశద్రోహం కేసు బనాయించి బేడీలు వేసి జైళ్లలో పెట్టిన విషయం గుర్తులేదా అని ప్రశి్నంచారు. దీక్షలకు ఏఐఎంఐఎం ప్రకాశం జిల్లాల జాయింట్ సెక్రటరీ ఉస్మాన్ ఘనీ, రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్, మైలాలీ, సల్మాన్, మేఘశ్యామ్ తదితరులు సంఘీభావం తెలిపారు. దళిత నేతలు నత్తా యోనరాజు, చెట్టే రాజు, పరిశపోగు శ్రీనివాసరావు, పిడతల అభిõÙక్, సుభాíÙణి, బూదాల సలోమి, సుధారాణి, సౌమ్య, బేతపూడి సాంబయ్య, పులి దాసు, గంజి రాజేంద్ర, కొలకలూరి లోకేష్, ఈపూరి ఆదాం, లకుమీ పద్మకుమార్, దానయ్య తదితరులు పాల్గొన్నారు.కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలియజేస్తుండడం విశేషం. -
ఆ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు
సాక్షి, అనంతపురం: మీడియా హక్కుల పరిరక్షణ కోసం 48 గంటల దీక్ష చేస్తానని ఏపీ జర్నలిస్ట్ డెవలప్ మెంట్ సోసైటీ అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి నిరాహారదీక్ష చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. ‘‘అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఎందుకు వార్తలు ఇవ్వకూడదు. జడ్జిలకు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. (చదవండి: టీడీపీ లాయర్లే జడ్జిలు) హైకోర్టు తీర్పు వల్ల న్యాయ వ్యవస్థపై విశ్వాసం తగ్గే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జిలు పరిమితులకు లోబడి వ్యవహరించాలన్నారు. ఏపీ హైకోర్టు తీరుపై సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీడియా హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని రామలింగారెడ్డి తెలిపారు. -
‘నారాయణ’ ఉపాధ్యాయుల ఆమరణ నిరాహారదీక్ష
సాక్షి, హైదరాబాద్ : కరోనా ఆపత్కాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న నారాయణ విద్యాసంస్థల తీరును నిరసిస్తూ పలువురు ఉపాధ్యాయులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బుధవారం సాయంత్రం రామంతపూర్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో పనిచేస్తున్న రవికుమార్ అనే ఉపాధ్యాయుడి ఇంట్లో దీక్షకు పూనారు. పనిచేసిన దానికి జీతం ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పట్నుంచి విద్యావ్యాపారంలో అగ్రగామిగా చెప్పుకునే నారాయణ, శ్రీచైతన్య సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆన్లైన్లో క్లాస్ చెప్పమని, ఫీజులు వసూలు చేయమని, ఆడ్మిషన్లు చేయాలని, రెన్యువల్స్ చేయాలని ఉద్యోగులపై యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని నారాయణ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా యాజమాన్యం చెప్పిన పని చేస్తే కేవలం సగం జీతమే ఇస్తామని, అభ్యంతరం ఉంటే ఉద్యోగానికి నిరభ్యంతరంగా రాజీనామా చేసి పోవచ్చని బెదిరింపులకు దిగుతున్నారని వారు పేర్కొంటున్నారు. -
ఇంతవరకు రైతుబంధు ఊసే లేదు: జీవన్‌రెడ్డి
సాక్షి, జగిత్యాల : ఇతర దేశాల్లో ఉన్న ఉపాధి కూలీలను తెలంగాణకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రానికి తెలపాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. లాక్డౌన్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా, రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోల బియ్యంకు అదనంగా ఒక కిలో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల బియ్యం ఇస్తుందని తెలిపారు. జన్‌దన్ సంబంధించి 500 రూ.లు అకౌంట్లో జమ కావడం లేదని ఆరోపించారు. (ఆ ముగ్గురికి రాహుల్ అభినందనలు ) రాష్ట్రంలో క్విటాలుకు హమాలి ఛార్జ్ 40 రూ.లు వసూలు చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 5రూ.ల హమాలి ఛార్జ్ ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి చార్జీలు లేకుండా అమలు చేశామని తెలిపారు. హమాలి ఛార్జితో రైతులు ఎకరానికి 1000రూ.లు, తాలు నెపంతో 1000 రూ.లు మొత్తంగా 2000/-రూ.లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇంతవరకు రైతుబంధు ఊసే లేదని దుయ్యబట్టారు. రుణమాఫీ నెపంతో దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణమాఫీలో 6శాతం అమలు లేకుండా పోయిందన్నారు. పసుపును మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని కేసీఆర్ చట్టసభల్లో హామీ ఇచ్చాడు కానీ అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. (కోవిడ్-19 : మహిళా రైతు ఔదార్యం ) -
నగరం బ్రాందీ హైదరాబాద్‌గా మారింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష ప్రారంభించారు. రెండురోజులపాటు దీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నియంత్రించి.. దశల వారీగా మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు. మద్యం వల్ల బాధితురాలైన వారి కుటుంబసభ్యులు సహా, ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలో హత్యాచారానికి గురైన సమత భర్త, అత్త, పిల్లలు కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘ రాజకీయ కారణాలతో దీక్ష చేపట్టలేదు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. తండ్రి కొడుకుల వల్లే బ్రాండ్ హైదరాబాద్ కాస్తా బ్రాందీ హైదరాబాద్‌గా మారింది. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చేశారు. మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వం రూ. 980 కోట్ల ఆదాయం స్వీకరించింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నా.. మద్యం అమ్మకాలు పెంచుకుంటూపోతున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మద్యం మత్తులో ముంచుతున్నారు. అర్ధరాత్రి మద్యం అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నారు. మద్యం నిషేధించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. పల్లెల్లో బెల్ట్ షాపులను ద్వంసం చేయాలని మహిళా మోర్చా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం’ అని అన్నారు. -
ఆరు నెలల్లో ఉరి...రేపటినుంచే దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరోసారి పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గత కొద్ది రోజులుగా నమోదైన అత్యాచార సంఘటనలతోపాటు, హైదరాబాద్‌లో చోటు చేసుకున్న దిశ హత్యాచార ఘటనతో తల్లిడిల్లిన ఆమె మరోసారి నిరహారదీక్షకు దిగనున్నారు. రేపిస్టులకు 6 నెలల లోపు మరణ శిక్ష విధించాలనేది స్వాతి మలేవాల్ డిమాండ్ చేస్తూ రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలనుంచి జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. మహిళలపై అత్యాచారాలకు తెగబడిన నేరస్థులకు మరణశిక్ష విధించాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం నుంచి కచ్చితమైన హామీ లభించేంతవరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం ఆమె చేశారు. కాగా మైనర్లపై అత్యాచార కేసుల్లో నేరస్తులకు మరణ శిక్ష వేయాలని స్వాతి గతంలో చాలా సార్లు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై గత ఏడాది ఏప్రిల్‌లో నిరాహార దీక్షను చేపట్టారు. అయితే 12 యేళ్ల లోపు బాలికలపై అత్యాచార ఘటనల్లో నిందితులకు మరణశిక్ష సహా, కఠిన శిక్షలు అమలు చేసేలా కేంద్రం ఒక ఆర్డినెన్స్‌ను పాస్ చేయడంతో 10 రోజుల తరువాత ఆమె తన దీక్షను విరమించిన సంగతి తెలిసిందే. Swati Maliwal, Chairperson, Delhi Commission for Women: I'll sit on hunger strike from 10 am tomorrow at Jantar Mantar. I won't get up until I get assurance from centre that rapists will be served death penalty within 6 months. Police accountability needs to be set. pic.twitter.com/69oauKVGnB — ANI (@ANI) December 2, 2019 -
నేడు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: తప్పనిసరిగా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఎంచుకునేలా కింది స్థాయి సిబ్బందిని యాజమాన్యం భయాందోళనలకు గురి చేస్తోందంటూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ నవంబర్ 25న (నేడు) దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు దిగనున్నట్లు సంస్థ ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. వీఆర్ఎస్ తీసుకోని వారి రిటైర్మెంట్ వయస్సును 58 ఏళ్లకు తగ్గించేస్తామంటూ, దూర ప్రాంతాల్లో పోస్టింగ్స్ ఇస్తామంటూ మేనేజ్మెంట్ బెదిరిస్తోందని ఆలిండియా యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్ (ఏయూఏబీ) కనీ్వనర్ పి. అభిమన్యు ఆరోపించారు. -
సమ్మె విరమణపై నేడు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : నెలన్నరగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. కార్మిక న్యాయస్థానం పరిధిలోకి ఈ అంశం వెళ్లిన నేపథ్యంలో సమ్మె కొనసాగించాలా.. వద్దా? అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మంగళవారం అత్యవసర సమా వేశం ఏర్పాటు చేసింది. ఇందులో సమ్మె కొనసాగింపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జేఏసీ సమావేశానికి ముందు.. అందులో భాగంగా ఉన్న కార్మిక సంఘాల నేతలు అంతర్గతంగా చర్చించనున్నారు. అనంతరం జేఏసీ భేటీలో ఉమ్మడి నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె కార్యాచరణలో భాగంగా మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్ నిర్ణయాన్ని ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. సోమవారం హైకోర్టులో జరిగిన వాదనల్లో సమ్మె విరమణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కార్మిక సంఘాలకు సమ్మె విరమణ విషయంలో సూచనలు చేస్తానంటూ జేఏసీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. సమ్మె వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రెండు నెలలుగా వేతనాలు లేక కార్మికుల కుటుంబాలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాటి జేఏసీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం వాదనల అనంతరం ధర్మాసనం పేర్కొన్న అంశాలకు సంబంధించిన పూర్తి వివరాల ప్రతి వెంటనే అందనందున సమ్మె విషయంలో సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ ప్రతిని పరిశీలించిన మీదట మంగళవారం భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించే వరకు నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించి, మూడు రోజులు దీక్ష కొనసాగించిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు సోమవారం సాయంత్రం దీక్ష విరమించారు. వీరిని ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించినా దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు, పలువురు ప్రజా సంఘాల నేతలు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుని నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. హైకోర్టులో జరిగిన వాదనల్లో కీలక పరిణామాల నేపథ్యంలో అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తమ సమ్మె కొనసాగుతుందని, మంగళవారం నిర్వహించ తలపెట్టిన సడక్ బంద్‌ను వాయిదా వేస్తున్నామని, సాయంత్రం జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 72.49 శాతం బస్సులు తిప్పాం – ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 72.49 శాతం బస్సులు నడిపినట్లు ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. 1,912 అద్దె బస్సులు సహా 6,487 బస్సులను తిప్పినట్లు పేర్కొంది. 4,575 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,487 మంది తాత్కాలిక కండక్టర్లు విధులకు హాజరయ్యారని వెల్లడించింది. 44వ రోజూ కొనసాగిన కార్మికుల సమ్మె అక్టోబర్ ఐదోతేదీన మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతూ సోమవారంతో 44 రోజులు పూర్తి చేసుకుంది. సమ్మె విరమించి విధుల్లోకి రావాలంటూ ప్రభుత్వం మూడు దఫాలు చేసిన సూచనలను కూడా కార్మికులు బేఖాతరు చేస్తూ నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. నిరాహార దీక్షలో ఉన్న జేఏసీ నేతలకు సంఘీభావంగా అన్ని బస్ డిపోల వద్ద కార్మికులు సంఘీభావ దీక్షలు కొనసాగించారు. -
నిరశనలు... అరెస్టులు
సాక్షి, హైదరాబాద్/హస్తినాపురం: ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె శనివారం స్వల్ప ఉద్రిక్తతలకు దారి తీసింది. సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం బస్ రోకో చేపట్టారు. దీనికి అనుమతి లేదని, బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు ముందే హెచ్చరించారు. అయినా కార్మికులు శనివారం ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు జేఏసీ రాష్ట్ర నేతలు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టగా వారికి మద్దతుగా అన్ని డిపోల వద్ద కార్మికులు కూడా దీక్షలు నిర్వహించటంతో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ కార్మికులను అరెస్టు చేశారు. ముఖ్యంగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గృహానిర్బంధం చేయడంతోపాటు, కోకన్వీనర్లు రాజిరెడ్డి, లింగమూర్తిలు చేపట్టిన దీక్షలను భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కార్మికులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీక్షలకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలపటంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు. వారిని నిలవరించే క్రమంలో పోలీసులతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అశ్వత్థామరెడ్డి గృహ నిర్బంధం... సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం ధర్నా చౌక్ ఇందిరాపార్కు వద్ద నిరశన దీక్ష చేపట్టాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. అయితే దీనికి పోలీసులు అనుమతిత్వలేదు. దీంతో వీఎస్టీ సమీపంలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం దీక్ష ఉండటంతో, దానిని భగ్నం చేసే క్రమంలో తెల్లవారుజామునే పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకోవాలని భావించారు. ఈ విషయం ముందుగానే ఊహించిన జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఇళ్ల వద్దకు రావాలంటూ అందుబాటులో ఉన్న కార్మికులకు సమాచారం అందించారు. హస్తినాపురం జయక్రిష్ణ ఎన్‌క్లేవ్‌లోని అశ్వత్థామరెడ్డి, రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజిరెడ్డి ఇళ్ల వద్దకు శుక్రవారం అర్ధరాత్రి దాటాక పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీక్షా శిబిరం వద్దకు బయలుదేరితే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని భావించి అశ్వత్థామరెడ్డి బయటకు రాకుండా ఇంట్లోనే తలుపు గడియపెట్టుకుని ఉండిపోయారు. ఆయనతోపాటు పలువురు ఆర్టీసీ కార్మికులు కూడా ఉన్నారు. దీంతో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో ఇంట్లోనే దీక్ష ప్రారంభిస్తున్నట్టు ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆయనతోపాటు మహిళా కార్మికులు కూడా దీక్షలో పాల్గొన్నారు. మహిళా కార్మికులను వెలుపలికి రావాల్సిందిగా పోలీసులు కోరినా వారు తిరస్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. అశ్వత్థామరెడ్డి దీక్ష విషయం తెలుసుకున్న ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విలేకరులను తప్పించి ఎవరినీ ఆపార్ట్‌మెంట్‌లోని అనుమతించలేదు. దీంతో పోలీసులు దమనకాండ నిర్వహిస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. అక్కడికి వచ్చిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, సంధ్యలను అనుమతించలేదు. ఆగ్రహానికి గురైన మందకృష్ణ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓ దశలో సంధ్య గేటు దూకి లోనికి వెళ్లేందకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రెడ్డికాలనీలో ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు రాజిరెడ్డి అరెస్టు.. విడుదల.. ఇదే సమయంలో రాజిరెడ్డి చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజిరెడ్డి వద్దకు పోలీసులు వెళ్లకుండా చుట్టూ మహిళా కార్మికులు వలయంగా ఏర్పడ్డారు. అయినా పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని, రాజిరెడ్డిని అరెస్టు చేసి పహడీషరీఫ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఆయన దీక్షను కొనసాగించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రాజిరెడ్డిని విడిచిపెట్టారు. మరో కోకన్వీనర్ లింగమూర్తి సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి బొల్లారం స్టేషన్‌ను తరలించారు. అక్కడ ఆయన దీక్ష కొనసాగించారు. సునీల్‌శర్మకు ఏం తెలుసు..?: అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఆర్టీసీ నష్టాలను పదేపదే చెబుతున్న ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోంది. నష్టాలకు కారణమైన ప్రభుత్వమే సంస్థను నిర్వీర్యం చేసింది. 17 నెలల క్రితం ఎండీగా వచ్చిన సునీల్‌శర్మకు ఆర్టీసీ గురించి ఏం తెలుసు. ఇప్పటివరకు కనీసం ఏడు సార్లు కూడా ఆయన ఆర్టీసీ కార్యాలయానికి రాలేదు. ముఖ్యమంత్రి తయారు చేసిన అఫిడవిట్లపై సునీల్‌శర్మ సంతకాలు పెడుతున్నారు. వాటిని చూస్తే అధికారుల రూపొందించినట్టు లేవు. రాజకీయ పార్టీలు తయారు చేసినట్టే ఉన్నాయి. కోర్టులు చివాట్లు పెట్టినా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవటం లేదు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సంస్థను మూసివేసేందుకు నష్టాల ముద్ర వేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై వెనక్కు తగ్గినా ప్రభుత్వం పట్టించుకోకపోవటమే దీనికి నిదర్శనం. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు దిగినా కార్మికులు భయపడలేదు, భయపడరు. సమ్మె కొనసాగుతుంది. మరింత ఉధృతమవుతుంది. ప్రశాంతంగా దీక్ష చేయబోతే, పోలీసులు 144 సెక్షన్‌తో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపామన్న ఆరోపణలు అవాస్తవం. తీరు మారకుంటే భవిష్యత్తులో ప్రజా క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి అవమానం తప్పదు. కేరళ ఎంపీ సంఘీభావం.. రాజిరెడ్డి సహా పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకుని పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న కేరళ సీపీఐ ఎంపీ బినాయ్ విశ్వం కూడా అక్కడికి చేరుకుని సంఘీభావం తెలిపారు. కార్మికులను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం సరి కాదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో జరుగుతున్న వ్యవహారం, ఇక్కడి ప్రభుత్వం తీరును పార్లమెంట్లో ప్రస్తావిస్తానన్నారు. పోలీసు స్టేషన్ వద్ద మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దీక్ష చేస్తే నాటి ప్రభుత్వం అనుమతించిందని, ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల దీక్షకు మాత్రం అనుమతించకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలన్నారు. ప్రభుత్వ వేధింపుల కారణంగా 27 మంది కార్మికులు చనిపోయారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు జరిపిన సమ్మె కారణంగానే రాష్ట్రం ఏర్పడిందని చెప్పిన కేసీఆర్.. ప్రస్తుతం వారి పట్ల నిరంకుశంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పోలీసులు కూడా మానవత్వంతో ఆలోచించాలన్నారు. -
హుజూర్‌నగర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం
సాక్షి, సూర్యాపేట: కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసు అధికారుల తీరుకు నిరసనగా రెండు రోజుల్లో హుజూర్నగర్ సెంటర్లో సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సూర్యపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలవడానికి మంత్రి హింసను ప్రేరేపిస్తున్నారని అన్నారు. అయితే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ సునాయసంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో పడవ ప్రమాదంలో మృతి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్పీకి అసలు పని చేసే అర్హత లేదని, అధికార పార్టీకి తొత్తుగా మారారని ఉత్తమ్ మండిపడ్డారు. అంతేకాక సదరు పోలీసు అధికారి తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తూ నేరస్తులు, పోలీసుల వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర అధికారులతో తెలంగాణ ప్రజలను మంత్రి వేధిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను భయపెట్టి, అక్రమకేసులు బనాయించి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీలో త్వరలోనే విస్ఫోటనం జరగనుందనీ, కేసీఆర్ తీరుఫై ఆ పార్టీ నాయకులే అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా వారిని కేసీఆర్ అవమానించారని దుయ్యబట్టారు. -
నిరాహార దీక్షకు దిగిన గజ ఉగ్రవాది
సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కో–ఫౌండర్ అతడు... హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతో పాటు అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, వారణాసి, బెంగళూరు విధ్వంసాలకు సూత్రధారి... మొత్తమ్మీద దేశ వ్యాప్తంగా బాంబు పేలుళ్లలో 149 మందిని పొట్టనపెట్టుకున్నాడు... దీనికి రెండు రెట్లకు పైగా జీవచ్ఛవాలుగా మార్చాడు... సిటీ పేలుళ్ల కేసులో రెండేళ్ల క్రితం ఉరి శిక్ష కూడా పడింది... ఇంతటి ‘ఘన చరిత్ర’ కలిగిన, ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఉగ్రవాది యాసీన్ భత్కల్ ‘ఉద్యమకారుడిగా’ మారుతున్నాడు. తమకు ఇండక్షన్ కుక్కర్లు ఇవ్వాలని కోరుతూ మరికొందరు నేరగాళ్లతో కలిసి గత నెల్లో ఇతను రెండు రోజుల పాటు నిరాహారదీక్షకు దిగాడు. తమకు యాసీన్ ఓ పెద్ద తలనొప్పిగా మారాడని తీహార్ జైలు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఏకాంత కారాగారం’లో... కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన యాసీన్ గజ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2008లో జరిగిన అహ్మదాబాద్ పేలుళ్ల అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యునానీ వైద్యుడి ముసుగులో నేపాల్‌లోని పోఖారాలో తలదాచుకుని తన అనుచరుల ద్వారా దేశ వ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడ్డాడు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్ వద్ద చేసిన జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్ అండ్ కో’కు చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ళ క్రితం ఉరి శిక్ష విధించింది. దీంతో ఇక్కడి కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్ తదితరులను తీసుకువెళ్ళారు. ప్రస్తుతం యాసీన్ భత్కల్ను తీహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్మెంట్) ఉంచారు. ఓపక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో భత్కల్ను బెంగళూరు న్యాయస్థానం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారిస్తోంది. ఇతడిని కోర్టు కేసుల విచారణ నిమిత్తం ఓ ప్రాంతం నుంచి మరో చోటుకు తీసుకువెళ్ళడం ఖర్చుతో పాటు భద్రతా కోణంతో ముడిపడి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలా ఎలా చేస్తారంటూ..? గత ఏడాది శీతాకాలంలో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో జైల్లో ఖైదీలు ఇబ్బంది పడకుండా జైలు అధికారులు వారికి పాలు, నీళ్లు వేడి చేసుకునేందుకు కొన్ని బ్లాకుల్లో ఇండక్షన్ కుక్కర్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. వాతావరణం వేడిగా మారి సాధారణ స్థితికి చేరుకోవడంతో ఏప్రిల్‌లో వీటిని వెనక్కి తీసుకున్నాడు. ఇక్కడే యాసీన్ ‘హర్ట్’ అయ్యాడు. తమకు శాశ్వతంగా ఆ కుక్కర్లు ఇచ్చి వండుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ జైలు అధికారులతో వాగ్వాదానికి దిగాడు. దాదాపు 40 రోజుల పాటు ప్రతి రోజూ జైలు అధికారులతో గొడవ పెట్టుకున్నాడు. అయితే కుక్కర్లు శాశ్వతంగా అందించడానికి వారు ససేమిరా అనడంతో ఇక ఉద్యమమే శరణ్యమని భావించాడు. తన సహచరుడు అసదుల్లా అక్తర్, ఢిల్లీ గ్యాంగ్‌స్టర్ రవి కపూర్, నార్త్ఈస్ట్ ఢిల్లీకి చెందిన చీను గ్యాంగ్‌తో కలిసి నిరాహారదీక్షకు దిగాడు. రెండు రోజులు పాటు వీరంతా జైల్లో ఎలాంటి ఆహారం ముట్టుకోలేదు. దీంతో జైలు అధికారులు వ్యూహాత్మకంగా యాసీన్, అక్తర్ మినహా మిగిలిన వారితో వ్యక్తిగతంగా మాట్లాడి నచ్చజెప్పారు. వారు వెనక్కి తగ్గడంతో యాసీన్, అక్తర్ సైతం సైతం నిరాహారదీక్ష మానాల్సి వచ్చింది. తీహార్ జైల్లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర నిఘా వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. రాత్రి వేళల్లో యాసీన్‌ను ఏకాంత కారాగారంలో బంధించినా మామూలు సమయాల్లో ఇతరులను కలిసే అవకాశం ఉంది. కలెక్షన్లు కురిపిస్తున్న ‘కథ’... సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉండి, ఎందరితో వాంటెడ్‌గా మారిన యాసీన్ భత్కల్ను పోఖారాలో పట్టుకున్న విధానం ఇప్పుడు కలెక్షన్లు కురిపిస్తోంది. ఇతగాడితో పాటు అక్తర్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరోలోని (ఐబీ) స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) పట్టుకుంది. ఈ ఆపరేషన్‌కు కొంత కాల్పనికత జోడిస్తూ బాలీవుడ్లో ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ పేరుతో రాజ్‌కుమార్ గుప్త ఓ సినిమాను తెరకెక్కించారు. గత శుక్రవారం విడుదలైన యాసీన్ ఆపరేషన్‌తో కూడిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది. -
వెనక్కు తగ్గని రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనంటూ పట్టుబట్టడంతో ఆ పార్టీలో అనిశ్చితి బుధవారం కొనసాగింది. మరోవైపు రాహుల్ తన రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతూ పార్టీ కార్యకర్తలు కొందరు ఆయన ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతంలో విడిచిపెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలైనందున తాను అధ్యక్ష పదవిలో ఉండనంటూ రాహుల్ రాజీనామా చేస్తాననడం, పార్టీ నేతలు దీనిని వ్యతిరేకించి ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా బుధవారం కూడా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ కోరారు. ఆమెతోపాటు ఢిల్లీ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు భారీ సంఖ్యలో రాహుల్ నివాసం వద్దకు చేరుకున్నారు. ‘మేమంతా రాహుల్ కోసమే ఉన్నాం. ఆయన తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి. ఆయనే పార్టీకి సారథ్యం వహించాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నందున పార్టీని వీడొద్దని నేను చెప్పాను’ అని షీలా అన్నారు. కర్ణాటక, రాజస్తాన్ పీసీసీలు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు రాహుల్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. జూన్ 1న సీపీపీ భేటీ పార్లమెంటరీ పార్టీ కొత్త నేతను ఎన్నుకునేందుకు తాజా లోక్‌సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) భేటీ జూన్ 1న జరగనుంది. ప్రస్తుతం సీపీపీ చైర్మన్‌గా సోనియా గాంధీ ఉన్నారు. కొత్త లోక్‌సభకు ఎన్నికైన 52 మంది ఎంపీలు, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ఈ భేటీకి హాజరుకానున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలు సమావేశమవుతారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానంపై వారు చర్చిస్తారు. -
హాజీపూర్ గ్రామస్తుల దీక్ష భగ్నం
-
నిమ్స్‌లో దీక్ష విరమించిన లక్ష్మణ్..!
హైదరాబాద్: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ గత 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన ఆయన దీక్ష శుక్రవారం నిమ్స్ ఆస్పత్రిలో ముగిసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ లక్ష్మణ్‌ను పరామర్శించి ఆయనతో దీక్ష విరమింపజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను అదేరోజు అరెస్ట్ చేసిన పోలీసులు నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. కాగా, లక్ష్మణ్‌ను పరామర్శించిన వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తెలంగాణ ఇన్చార్జి కృష్ణదాస్, ఎంపీ దత్తాత్రేయ ఉన్నారు. (చదవండి : అరెస్ట్‌లను ఖండించిన మురళీధర్ రావు) కేంద్రమంత్రి హన్సరాజ్ మాట్లాడుతూ.. 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండటంతో లక్ష్మణ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమింపజేశాం. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరం. విద్యార్థుల కుంటుంబాలకు మా సానుభూతి ఉంటుంది. తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రం తరపున విద్యార్థులకు నా విజ్ఞప్తి. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాని తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నా. ఉద్యమం ఉధృతం.. 9 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆందోళనపై కేసీఆర్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఒక జాతీయ పార్టీగా బాధితుల పక్షాన నిలబడ్డాం. వారి నిరసనలకు మద్దతు తెలుసుతున్నాం. లక్ష్మణ్‌తో అమిత్‌షా ఫోన్లో మాట్లాడారు. ఆయన దీక్షను హన్సరాజ్‌తో విరమింపజేయాలని వర్తమానం పంపారు. విద్యార్థుల పోరాటాలపై భరోసానివ్వడంతో లక్ష్మణ్ దీక్ష విరమించారు. వారికి న్యాయం జరిగేదాకా పోరాటం ఆపేది లేదు. ఉద్యమం ఇంకా తీవ్రం చేస్తాం. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తాం. 119 అసెంబ్లీ కేంద్రాల్లో దీక్షలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఢిల్లీకి వెళ్లి, హోంమంత్రి, రాష్ట్రపతిని కూడా కలుస్తాం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు -
పోలీసుల కళ్లగప్పి.. ట్యాక్సీలో వెళ్లిన లక్ష్మణ్!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం న్యాయం చేయాలన్న డిమాండ్‌తో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాటకీయ పరిణామాల నడుమ నిరాహార దీక్షకు దిగారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి తొలగించాలని, ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై న్యాయ విచారణ జరపాలంటూ ఆయన సోమవారం నుంచి నిరవధిక నిరాహాక దీక్ష చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దసంఖ్యలో పోలీసులు ముషీరాబాద్‌లోని లక్ష్మణ్ క్యాంపు కార్యాలయం ముందు మోహరించారు. ఆయన బయటకు రాగానే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి ట్యాక్సీ కారులో చాకచక్యంగా ఆయన బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన వేదిక వద్ద ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఇంటర్ ఫలితాల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని భావిస్తోంది. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆ కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలుపకపోగా తూ.తూ.మంత్రంగా చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. కేజ్రీవాల్ దీక్ష వాయిదా
న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడుల చేపట్టిన నేపథ్యంలో.. తాను చేపట్టాలనుకుంటున్న నిరాహార దీక్షను వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పాకిస్థాన్, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలంటూ కేజ్రీవాల్ కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించడం కోసం వచ్చే నెల ఒకటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా... దీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం, దేశ రక్షణ విషయంలో అందరూ కలిసి ఉండాలని.. అందుకే తన నిరాహారదీక్షను వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు. In view of prevailing Indo Pak situation, I am postponing my upwas for full statehood of Delhi. We all stand as one nation today. — Arvind Kejriwal (@ArvindKejriwal) February 26, 2019 -
‘అమాయకులం.. ఇక శాశ్వత సెలవు తీసుకుంటా’
సాక్షి, చెన్నై : తమను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితులు నళిని, ఆమె భర్త మురుగన్ జైలులోనే నిరాహార దీక్ష చేయడం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ గత 12 రోజులుగా దీక్ష చేస్తుండగా, గత శనివారం నళిని ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. తమతో పాటు ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరినీ విడుదల చేసేంత వరకు దీక్ష విరమించబోమని పేర్కొన్నారు. నళిని తరఫు న్యాయవాది ద్వారా ఈ విషయం బయటికి పొక్కడంతో తమిళ సంఘాలు, పార్టీల్లో కలకలం రేగుతోంది. మురుగన్ ఆరోగ్య పరిస్థితి విషమించడం, నళిని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండటంతో తమిళవాదుల్లో ఆగ్రహం వ్యక్తమయ్యే నేపథ్యంలో ప్రభుత్వం భద్రతాపరమైన అంశాలపై దృష్టి సారించింది. ఇక ఈ విషయమై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్‌కు లేఖ తమని విడుదల చేయాలి లేదా కారుణ్య మరణానికి అనుమతించాలంటూ నళిని పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ఈ మేరకు నళిని గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. ‘ న్యాయం కోసం అర్థిస్తున్న మాకు ప్రతీసారి నిరాశే ఎదురవుతోంది. 28 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాం. మేము అమాయకులం. పరిస్థితుల ప్రభావం వల్ల ఈ కేసులో ఇరుక్కున్నాం. ఇక ఇప్పుడు నేను ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. ఫిబ్రవరి 9 నుంచి నిరాహార దీక్ష చేపడతున్నాను. ఇలానైనా నాకు విముక్తి లభిస్తుంది’ అని నళిని లేఖలో పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా దీక్ష చేపట్టడం సబబు కాదు. కానీ నళిని విషయంలో ఇది సమర్థనీయం. రాజీవ్ హత్య కేసులో వారిని విడుదల చేసేందుకు తమిళనాడు గవర్నర్ చేస్తున్న జాప్యానికి వ్యతిరేకంగానే ఆమె దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతినిచ్చినా ఆయన ఇందుకు సంబంధించిన కాగితాలపై సంతకం చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఒకవేళ వీరిని గనుక విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కూడా. రాజీవ్ హత్యకేసు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. వీరిలో మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్ పయస్, పి.రవిచంద్రన్, నళిని ఉన్నారు. మరుసటి ఏడాది మురుగన్, సంతమ్, అరివు, నళినిల మరణశిక్షల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు.. జయకుమార్, రాబర్ట్ , రవిచంద్రన్‌ల శిక్షల్ని యావజ్జీవంగా మార్చింది. మిగిలిన 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2000లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విజ్ఞప్తితో తమిళనాడు గవర్నర్ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014, ఫిబ్రవరి 18న ఈ కేసును మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మురుగన్, సంతమ్, అరివులకు విధించిన మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చింది. -
అవినీతి అంతంచేసే చిత్తశుద్ధి ఎవరికైనా ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013’ కింద కేంద్ర స్థాయిలో లోక్‌పాల్, మహరాష్ట్రలో లోకాయుక్తను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త అన్నా హజారే గత వారం రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను మంగళవారం విరమించిన విషయం తెల్సిందే. హజారే దీక్షను విరమింపచేసేందుకు జూనియర్ మంత్రులను పంపించినా లాభం లేకపోవడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా వెళ్లి హజారే దీక్షను విరమింప చేశారు. రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త చట్టాన్ని తీసుకొస్తానని ఫడ్నవీస్ హామీ ఇచ్చి ఉండవచ్చుగానీ కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేస్తానని ఏ హోదాలో హామీ ఇచ్చారో, ఆ హామీని అన్నా హజారే ఎలా విశ్వసించారో వారికే తెలియాలి. ‘దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా భారత యుద్ధం’ అంటూ అన్నా హజారే పోరాటం చేయడం వల్లనే 2013లో లోక్‌పాల్, లోకాయుక్త చట్టం వచ్చింది. అవినీతిలో కూరుకుపోయిన నాటి యూపీఏ ప్రభుత్వం కూలిపోవడానికి, అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామన్న నరేంద్ర మోదీ నేతత్వంలో బీజేపీ అధికారంలోకి రావడానికి నాటి అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఎంతో తోడ్పడింది. అవినీతి అంతు చూస్తానన్న నరేంద్ర మోదీ తన నాలుగున్నర ఏళ్ల పాలనలో కేంద్ర స్థాయిలో లోక్‌పాల్‌ను నియమించలేక పోయారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో లోకాయుక్త నియామకానికి ససేమిరా అంగీకరించని మోదీ లోక్‌పాల్‌ను నియమిస్తారని ఆశించడం అత్యాశే అవుతుందేమో! 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్థుల అవినీతి గురించి ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చాక వారెవరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఆర్జేడీ నాయకుడు లాలూను జైలుకు పంపించడం, యూపీలో అఖిలేష్ యాదవ్, మాయావతిలపై, పశ్చిమ బెంగాల్లో పోలీసు కమిషనర్‌పై ఏసీబీ దాడులు జరపడం రాజకీయ కక్షలే తప్పించి అవినీతి నిర్మూలనా చర్యలు ఎంత మాత్రం కావు. నేతల అవినీతిని పక్కన పెడితే అధికార యంత్రాంగంలో, సైనికుల్లో, పోలీసుల్లో అవినీతిని అరికట్టేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదు. ఎలాంటి చట్టాలను తీసుకరాలేదు. అన్ని ప్రభుత్వ రంగాల్లో పారదర్శకతకు ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే, అందుకు చట్టాలను తీసుకొచ్చినట్లయితే సగం అవినీతి దానంతట అదే తగ్గిపోయి ఉండేది. మోదీ ప్రభుత్వం 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం గహ నిర్మాణ రంగంలో పారదర్శకతను పెంచింది. తద్వారా ఇళ్ల కొనుగోలుదారులకు లబ్ధి చేకూరింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి రంగంలో ఇలాంటి చట్టాలను తీసుకరావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రభుత్వంలోని అన్ని రంగాల్లో పారదర్శకతు ఆస్కారమిస్తూ అవినీతి బట్టబయలకు అవకాశం ఇస్తున్న ‘సమాచార హక్కు’ చట్టాన్ని నీరుకార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడం విచిత్రం. తనతో సహా కొంత మంది మంత్రుల విద్యార్హతలను సమాచార హక్కు కింద వెల్లడించకుండా కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌ను పీఎంవో కార్యాలయం అడ్డుకున్న విషయం తెల్సిందే. అలాగే కేంద్ర సమాచార కమిషనర్లను ప్రభుత్వం గుప్పిట్లో ఉంచుకోవడానికి వీలుగా వారి జీతభత్యాలను, పదవీకాలాన్ని కేంద్రమే నిర్ణయించే విధంగా సమాచార చట్టంలో రహస్యంగా సవరణ తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం సుప్రీం కోర్టుల జడ్జీలతో సమానంగా కేంద్ర సమాచార కమిషనర్లకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. సుప్రీం కోర్టు జడ్జీల జీతభత్యాలను ఎప్పటికప్పుడు పార్లమెంట్ నిర్ణయిస్తుందన్న విషయం తెల్సిందే. పార్లమెంట్‌ను మభ్యపెట్టడం ద్వారా కేవలం కేబినెట్ ఆమోదంతో ఆ సవరణ తీసుకరావాలనుకుంది. అదికాస్త బయటకు పొక్కడంతో ఇప్పటి వరకు దీనికి సంబంధించిన సవరణ బిల్లును మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టలేక పోయింది. గోవా పోలీసు అధికారి అమ్జద్ కరోల్ 2014లో ఓ పేద మహిళలను బహిరంగంగా వివస్త్రను చేసి చితకబాదినా ఆయనపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం విధుల నుంచి సస్పెండ్ కూడా చేయలేదు. బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ 2017లో అధికారుల అవినీతి కారణంగా తమకు ఎంత అధ్వాన్నమైన ఆహారాన్ని ఇస్తున్నారో వీడియో ద్వారా బయటపెడితే అందుకు బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోకపోగా క్రమశిక్షణారాహిత్యం కింద బహదూర్ యాదవ్‌ను తొలగించారు. ఢిల్లీలో ప్రతిష్టాకరమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏమ్స్) ఆస్పత్రిలో అవినీతి కార్యకలాపాలకు సంబంధించి అప్పటి ఆస్పత్రి విజిలెన్స్ కమిషనర్ మెగసెసే అవార్డు గ్రహీత సంజీవ్ చతుర్వేదీ బయటపెట్టినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 22 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతవడానికి బాధ్యుడయిన ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌పైనా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా కఠిన చట్టాలు అవసరం. అందుకు చిత్తశుద్ధి ఇంకా ఎంతో అవసరం. -
నిరహార దీక్ష చేపట్టిన అన్నా హజారే
రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర): సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి దీక్షకు దిగారు. లోక్‌పాల్ బిల్లు, లోకాయుక్త చట్టం నియామకాల్లో కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం ఆయన నిరహార దీక్ష చేపట్టారు. తొలుత ఆయన తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోని పద్మావతి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత విద్యార్థులు, యువకులు, రైతులతో కలిసి అక్కడికి సమీపంలోని యాదవ్‌బాబా ఆలయానికి వెళ్లిన హజారే అక్కడే దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తేవాలని మహారాష్ట్ర క్యాబినేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాకముందు లోక్‌పాల్, లోకాయుక్త, రైతు సమస్యలపై ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. కాగా, తాను దీక్ష ప్రారంభించనున్న విషయాన్ని సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు రాసిన లేఖలో హజారే పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఇచ్చిన మాటను తప్పిన ప్రభుత్వమిది
-
మణిక్యాలారావు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత
-
రెండోరోజుకు చేరుకున్న మాణిక్యాలరావు దీక్ష
-
రెండోరోజుకు చేరుకున్న మాణిక్యాలరావు దీక్ష
సాక్షి, తాడేపల్లిగూడెం: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఎన్నికల వేళ చంద్రబాబు బూటకపు హామీలతో ప్రజలను వంచించారని మాణిక్యాలరావు ఆరోపించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు తాను నిరాహార దీక్ష విరమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన దీక్షకు పలువురు బీజేపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. వైద్యులు మాణిక్యాలరావుకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. ఆయన పల్స్రేట్, షుగర్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నాయని వైద్యులు తెలిపారు. నిరాహార దీక్ష కారణంగా కొంత నీరసంగా ఉన్నా.. యోగాసనాలు వేస్తూ.. ధ్యానం చేస్తూ మాణిక్యాలరావు ఉల్లాసంగా గడిపారు. -
ప్రారంభమైన మాణిక్యాల రావు నిరాహార దీక్ష
సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తాడేపల్లి గూడెంలో ‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధనకై పోరుబాట’ పేరుతో సోమవారం ఉదయం దీక్షను ప్రారంభించారు. తొలుత తెలుగుతల్లికి, బీజేపీ వ్యవస్థాపక నేతలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పైడికొండల మాట్లాడుతూ.. జిల్లాకు ఇచ్చిన 56 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత నెల 25ననే చంద్రబాబు నాయుడుకి రాజీనామా అల్టిమేటం పంపినట్లు తెలిపారు. నెల రోజులు దాటినప్పటికి ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మాణిక్యాలరావుతో పాటు బీజేపీ నేతలు నరిశె సోమేశ్వర్రావు, ఈతకోట తాతాజీ, వట్టి శైలజ, కర్రి ప్రభాకర్ బాలాజీ తదితరులు దీక్షలో పాల్గొన్నారు. -
మూడో రోజుకు చేరిన రాజధాని రైతుల దీక్ష
సాక్షి, అమరావతి: తమ భూములను ఎంజాయ్మెంట్ సర్వేలో నమోదు చేయాలంటూ రాజధాని అసైండ్ భూముల రైతులు చేపట్టిన అమరణ నిరహార దీక్ష మంగళవారం మూడో రోజుకి చేరకుంది. దీక్ష చేపట్టిన రైతుల షుగర్, బీపీ లెవల్స్ పడిపోవడంతో వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ రైతులు చేపట్టిన దీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు చేపట్టిన దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు, వామపక్షాలకు చెందిన నాయకులు సంఘీభావం తెలిపారు. రాజధాని ప్రకటన సమయంలో చేసిన ఎంజాయ్మెంట్ సర్వేలో తమ భూములు నమోదు చేయకుండా అధికారులు, అధికార పార్టీ నాయకులు కక్ష పూరితంగా వ్యవహరించారని దీక్ష చేపట్టిన రైతులు మండిపడ్డారు. తమకు చెందిన 49 ఎకరాల చుట్టు పక్కల ఉన్న భూములన్నింటినీ సర్వేలో నమోదు చేసి తమ భూములను మాత్రం చేయకపోవడానికి ప్రధాన కారణం తమ భూములపై టీడీపీ నేతల కన్నుపడటమేనని రైతులు ఆరోపిస్తున్నారు. -
జక్కంపూడి రాజా దీక్షను భగ్నం చేసిన పోలీసులు
-
‘అక్టోబర్ 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష’
న్యూఢిల్లీ : అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. దీని గురించి ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో అన్నా.. ప్రధాని చాలా పెద్ద పెద్ద హామీలు ఇస్తారు.. కానీ చేతల్లో మాత్రం శూన్యమంటూ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచాయి. కానీ ఇప్పటివరకూ లోక్‌పాల్, లోకాయుక్తను నియమించలేదన్నారు. అందుకు నిరసనగా కేంద్రంలో లోక్‌పాల్, రాష్ర్టాల్లో లోకాయుక్త తీసుకురావాలన్న డిమాండ్‌పై గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే ప్రకటించారు. అంతేకాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మేలు చేసే వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్(సీఏసీపీ)కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తానని హమీ ఇచ్చింది. కానీ ఇంత వరకూ అందుకు సంబంధించి ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. సీఏసీపీకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తే ఆ కమిషనే వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్ణయిస్తుందని గుర్తు చేశారు. కనీస మద్దతు ధర లేకనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. లోక్‌పాల్, లోకాయుక్త డిమాండ్లపై ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని చరిత్రాత్మక రామ్ లీలా మైదానంలో అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. -
చింతమనేనిపై పోరుబాట: దీక్షను విరమించిన అబ్బయ్య చౌదరి
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్రమాలపై గళమెత్తుతూ వైఎస్సార్సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షను విరమించారు. ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, గన్నవరం కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం సాయంత్రం నిమ్మరసం ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేశారు. చింతమనేని ఇసుక అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలనే డిమాండుతో కొఠారు అబ్బయ్య చౌదరి శనివారం నుంచి దీక్షకు దిగారు. దీక్ష విరమణ అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు రాయన్నపాలెం నుంచి గోపన్నపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చింతమనేని అక్రమాలపై విచారణ జరిపి.. ఆయనపై చట్టబద్ధమైన చర్యలు తీసుకునేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. చింతమనేని అక్రమ మైనింగ్‌పై అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు.. ఇక నీ ఆగడాలను సాగనివ్వమంటూ నిరశన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దెందులూరు నియోజకవర్గంలో రౌడీరాజ్యానికి తెరదించడంతోపాటు, చింతమనేని అక్రమ మైనింగ్ వ్యాపారాన్ని అడ్డుకోవాలని, తమపై పెట్టిన అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దెందులూరు మండలం గోపన్నపాలెంలో శనివారం ఈ దీక్ష చేపట్టారు. -
దీక్ష విరమించిన పటేళ్ల ఉద్యమనేత హార్దిక్ పటేల్
-
లోక్‌పాల్ కోసం అక్టోబర్ 2 నుంచి నిరశన
రాలేగావ్ సిద్ధి: లోక్‌పాల్ నియామకంపై కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ప్రకటించారు. అవినీతి రహిత దేశం కోసం తాను చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన స్వస్థలమైన రాలేగావ్ సిద్ధిలో మహాత్ముడి జన్మదినమైన అక్టోబర్ 2 నుంచి నిరాహారదీక్ష చేపడతానని తెలిపారు. అవినీతిని అరికట్టాలనే చిత్తశుద్ధి ఎన్డీయే సర్కారుకు లేదని, అందుకే లోక్‌పాల్ నియామకంపై కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లు అమలుతో పాటు సత్వరమే లోక్‌పాల్‌ను నియమిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన ఎన్డీయే, ఇప్పడు దానిని విస్మరించిందని ఆరోపించారు. లోక్‌పాల్ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ 2011లో 12 రోజులపాటు అన్నా హజారే దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో అప్పటి యూపీఏ సర్కారు 2014లో లోక్‌పాల్ చట్టాన్ని తెచ్చింది. -
అమరుల స్తూపాలను కూల్చడం హేయం
వీణవంక(హుజూరాబాద్) : అమరవీరులకు కనీస మర్యాద ప్రభుత్వం ఇవ్వడం లేదని, అమరుల స్తూపాలను కూల్చడం హేయమైన చర్య అని తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గాదె ఇన్నయ్య అన్నారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకోడానికే స్తూపాలను నిర్మిస్తారని, అలాంటి అమరుల స్తూపాలను ప్రభుత్వం కూల్చేస్తూ రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వీణవంక మండలం అచ్చంపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జనసభ నేత అల్గివెల్లి రవీందర్‌రెడ్డి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు నిర్మిస్తున్న స్తూపాన్ని ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు కూల్చేశారు. మంగళవారం టీజేఎస్ నాయకులు అచ్చంపల్లి గ్రామాన్ని సందర్శించారు. రవీందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కల్వల ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆనాడు 33రోజులపాటు రవీందర్‌రెడ్డి నిరాహార దీక్షకు పూనుకున్నాడని, ఆయన ఎదుగుదలను జీర్ణించుకోలేని వ్యక్తులు రాజకీయ హత్య చేశారని పేర్కొన్నారు. జమ్మికుంటలో జరిగిన సభలో రవీందర్‌రెడ్డి తెలంగాణ కోసం అమరుడైనట్లు కేసీఆర్ ప్రకటించాడని, ఇప్పుడు ఆయన స్తూపాన్నే కూల్చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం అమరుడైన రవీందర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వాలు ఆదుకోలేదని, ఆయన జ్ఞాపకార్థం గ్రామ పంచాయితీ అనుమతితో కుటుంబసభ్యులు స్తూపాన్ని నిర్మించుకుంటే కూల్చేయడం సరికాదని తెలంగాణ జనసమితి జిల్లా కన్వీనర్ ముక్కెర రాజు అన్నారు. మంత్రి ఈటల రాజేందర్‌కు అమరులు, ఉద్యమకారుల మీద గౌరవం ఉంటే సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ఇన్చార్జి పత్తి వేణుగోపాల్‌రెడ్డి, పెరమండ్ల సంపత్‌గౌడ్, ఉడుగుల మహేందర్, నీల కుమారస్వామి, అంకూస్, శరత్, శ్రీనివాస్, అనిల్, నిరంజన్, మహేందర్, పరుశరాములు పాల్గొన్నారు.