కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, 12 డాక్టర్ల సంఘాలకు మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ.. తమ డిమాండ్ల సాధనం కోసం జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్ష పదోరోజుకు చేరింది.
జూడాల డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై వేటువేసి.. మరికొందరు వైద్యశాఖ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్న బెంగాల్ ప్రభుత్వం.. జూడాల మిగతా డిమాండ్‌లను తీర్చడానికి గడువు పెట్టడాన్ని అంగీకరించడం లేదు. ‘సీఎస్‌తో సమావేశం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. నిరాహారదీక్ష చేస్తున్న యువ డాక్టర్లతో చర్చలకు ఉన్నతాధికారులను పంపాలని ప్రభుత్వాన్ని కోరాం. అయితే ఎప్పటిలోగా జూడాల సమస్య పరిష్కరిస్తామనేది నిర్దిష్టంగా చెప్పలేమని ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సూచనప్రాయంగా తెలిపారు’ అని పశి్చమబెంగాల్ డాక్టర్స్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ కౌశిక్ చకి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment