Talks fail Again
-
ఆర్జీ కర్ డాక్టర్లతో చర్చలు విఫలం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, 12 డాక్టర్ల సంఘాలకు మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ.. తమ డిమాండ్ల సాధనం కోసం జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్ష పదోరోజుకు చేరింది. జూడాల డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై వేటువేసి.. మరికొందరు వైద్యశాఖ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్న బెంగాల్ ప్రభుత్వం.. జూడాల మిగతా డిమాండ్లను తీర్చడానికి గడువు పెట్టడాన్ని అంగీకరించడం లేదు. ‘సీఎస్‌తో సమావేశం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. నిరాహారదీక్ష చేస్తున్న యువ డాక్టర్లతో చర్చలకు ఉన్నతాధికారులను పంపాలని ప్రభుత్వాన్ని కోరాం. అయితే ఎప్పటిలోగా జూడాల సమస్య పరిష్కరిస్తామనేది నిర్దిష్టంగా చెప్పలేమని ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సూచనప్రాయంగా తెలిపారు’ అని పశి్చమబెంగాల్ డాక్టర్స్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ కౌశిక్ చకి తెలిపారు. -
అదే ప్రతిష్టంభన
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. 9వ ధపా చర్చలు శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో దాదాపు ఐదు గంటలపాటు జరిగాయి. కేంద్రం తరపున వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ సహా ఉన్నతాధికారులు 41 రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు. కొత్త సాగు చట్టాల విషయంలో ఇరుపక్షాలు తమ వాదనలకే కట్టుబడి ఉండడంతో ప్రతిష్టంభన నెలకొంది. రైతులు లేవనెత్తిన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, కాస్తయినా బెట్టు సడలించాలని తోమర్ రైతు సంఘాల నేతలను కోరారు. అయితే, కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని నేతలు తేల్చిచెప్పారు. తమ డిమాండ్ల విషయంలో మార్పు లేదని కుండబద్ధలు కొట్టారు. దీంతో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. 10వ రౌండ్ చర్చలు 19న మధ్యాహ్నం 12 గంటలకు జరుగనున్నాయి. ప్రతిపాదనలతో రండి తదుపరి చర్చల కంటే ముందే రైతులు సాగు చట్టాల విషయంలో తమ ప్రతిపాదనలతో ఒక ముసాయిదాను సమర్పిస్తే, వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. 9వ రౌండ్ చర్చలు విఫలమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు తాము రాతపూర్వక హామీ ఇచ్చామని వెల్లడించారు. కొత్త చట్టాల అమలు విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుకు కట్టుబడి ఉంటామని తోమర్ పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం కోసం న్యాయస్థానం ఏర్పాటు చేసిన కమిటీ తమను పిలిచినప్పుడు వాదనలు వినిపిస్తామన్నారు. రాహుల్‌ని చూసి కాంగ్రెస్ నవ్వుకుంటోంది తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం వ్యవసాయ సంస్కరణల విషయంలో 2–3 రాష్ట్రాల రైతులు మాత్రమే ధర్నా చేస్తున్నారని నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. ప్రస్తుతం శీతాకాలం, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వంటి పరిస్థితుల దృష్ట్యా నిరసనకారుల గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రకటనలు, ఆయన చర్యలను చూసి మొత్తం కాంగ్రెస్ పార్టీ నవ్వుకుంటోందని తోమర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో–2019లో వ్యవసాయ సంస్కరణలపై వాగ్దానం చేశారని గుర్తుచేశారు. ఈ విషయం మేనిఫెస్టోలో ఉంటే.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీడియా ముందుకు వచ్చి, అప్పుడు అబద్ధాలు చెప్పారో లేక ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారో వివరించాలని సూచించారు. 19న సుప్రీంకోర్టు కమిటీ సమావేశం! సాగు చట్టాల విషయంలో ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మొదటి సమావేశం జనవరి 19వ తేదీన జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. డిమాండ్లకు కట్టుబడి ఉన్నాం.. మూడు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు చట్టబద్ధత అనే తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామని, అదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియచేశామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికైత్ చెప్పారు. అంతేగాక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ముందు హాజరుకాకూడదని తాము నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే మాట్లాడుతామని, డిమాండ్లపై చర్చిస్తామని ఉద్ఘాటించారు. చర్చలు కొనసాగించాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నట్లు ఆలిండియా కిసాన్ సంఘర్‡్ష కో–ఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు కవితా కురుగంటి తెలిపారు. కమిటీ నుంచి తప్పుకుంటున్నా రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధ్యక్షుడు భూపీందర్‌సింగ్ మన్ చెప్పారు. కొత్త సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ కమిటీపై రైతు సంఘాలు, ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కమిటీలో తనను సభ్యుడిగా చేర్చినందుకు భూపీందర్‌సింగ్ సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, రైతన్నల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ పడబోనని తేల్చిచెప్పారు. భూపీందర్సింగ్కు దూరంగా ఉండాలని బీకేయూ పంజాబ్ యూనిట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే ఆయన ప్రకటన వెలువడింది. -
ముందు లా వాపసీ.. తర్వాతే ఘర్ వాపసీ
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ఇరు వర్గాలు పట్టు వీడకపోవడంతో రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు మరోసారి అసంపూర్ణంగా ముగిశాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో శుక్రవారం కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పియూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ 41 మంది రైతు సంఘాల ప్రతినిధులతో జరిపిన 8వ విడత చర్చలు ఎలాంటి సానుకూల ఫలితం సాధించకుండానే వాయిదా పడ్డాయి. మరో విడత చర్చలు జనవరి 15న జరగనున్నాయి. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు రైతు నేతలు జనవరి 11న సమావేశం కానున్నారు. చట్టాలను వెనక్కు తీసుకున్న (లా వాపసీ) తరువాతే.. తాము ఇళ్లకు వెళ్తామని(ఘర్ వాపసీ) రైతులు చర్చల సందర్భంగా ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. చట్టాల రద్దు కోసం చివరి శ్వాస వరకు పోరాడుతామన్నారు. మరోవైపు, చట్టాల రద్దు ప్రసక్తే లేదన్న ప్రభుత్వం.. ఆ చట్టాల్లోని అభ్యంతరకర నిబంధనలపై చర్చకు సిద్ధమేనని పునరుద్ఘాటించింది. చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయాలను సూచించాలని కోరింది. దేశవ్యాప్తంగా రైతుల్లో అత్యధికులు ఈ చట్టాలకు మద్దతిస్తున్నారని వాదించింది. దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని రైతు నేతలకు సూచించింది. వ్యవసాయ చట్టాలు, రైతుల నిరసనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ నెల 11న విచారణ జరగనున్న నేపథ్యంలో.. తదుపరి చర్చల తేదీని జనవరి 15గా నిర్ణయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాగు చట్టాల చట్టబద్ధతను సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశముందని పేర్కొన్నాయి. ‘నిజానికి వ్యవసాయం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకూడదు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు కూడా ప్రకటించింది. సమస్యను పరిష్కరంచాలన్న ఆలోచన మీకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఏ విషయం స్పష్టంగా చెప్పండి. మా నిర్ణయం మేం తీసుకుంటాం. అంతేకానీ, అనవసరంగా అందరి సమయం వృధా చేయొద్దు’అని రైతు నేతలు ప్రభుత్వానికి సూటిగా చెప్పారు. ‘చట్టాలను రద్దు చేయలేం, చేయబోం అని ప్రభుత్వం కూడా రైతు నేతలకు స్పష్టంగా చెప్పింది’అని చర్చల్లో పాల్గొన్న ఆల్ ఇండియా కిసాన్సంఘర్‡్ష కో ఆర్డినేషన్ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) సభ్యురాలు కవిత కురుగంటి తెలిపారు. రైతు ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య చర్చలు ప్రారంభమైన గంట తరువాత.. రైతు ప్రతినిధులు జీతేంగే యా మరేంగే(గెలుపో లేదా మరణమో) అన్న నినాదమున్న పేపర్లు ప్రదర్శిస్తూ మౌనంగా కూర్చోవడంతో, ప్రత్యేకంగా చర్చలు జరిపేందుకు కేంద్ర మంత్రులు సమావేశం స్థలి నుంచి బయటకు వెళ్లారు. మొత్తంగా శుక్రవారం ఇరు వర్గాల మధ్య చర్చలు సుమారు 2 గంటల పాటు మాత్రమే జరిగాయి. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని చర్చల అనంతరం రైతు నేత బల్బీర్ రాజేవాల్ విమర్శించారు. చట్టాల రద్దు విషయంలో ఏ కోర్టుకు వెళ్లబోమని, చట్టాలను వెనక్కు తీసుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఏఐకేఎస్‌సీసీ నేతలు చెప్పారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే 26న ట్రాక్టర్ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు. ‘ఈ ఆందోళనల్లో ఎంతో మంది తల్లులు తమ పిల్లలను కోల్పోయారు. ఎంతోమంది కూతుర్లు తమ తండ్రులను కోల్పోయారు. అయినా ప్రభుత్వం మనసు కరగడం లేదు’అని నిరసనల్లో పాల్గొంటున్న ఒక మహిళారైతు ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులతో పాటు ఆందోళనల్లో పాల్గొంటున్న పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో శుక్రవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమావేశమయ్యారు. అమిత్ షాతో భేటీ చర్చలు ప్రారంభం కావడానికి ముందు నరేంద్ర సింగ్ తోమర్ ప్రత్యేకంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. చర్చల సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. ఆ తరువాత హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కూడా షాతో సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయాలు చూపట్లేరు సాగు చట్టాల రద్దు ప్రతిపాదనకు ప్రత్యామ్నాయాలను సూచించమని కోరామని, అయితే, రైతు నేతలు చట్టాల రద్దుకే పట్టుబట్టడంతో ఎలాంటి ఫలితం రాకుండానే చర్చలు వాయిదా పడ్డాయని నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. తదుపరి చర్చల నాటికైనా రైతు నేతలు ప్రత్యామ్నాయాలతో వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసులో ఇంప్లీడ్ కావాలని రైతు నేతలను కోరారా? అన్న ప్రశ్నకు అలాంటి ప్రతిపాదనేదీ లేదన్నారు. ఈ చట్టాలను అమలు చేసే విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ ప్రతిపాదన ఏదీ రైతుల నుంచి రాలేదన్నారు. చర్చలు విఫల కావడంతో రైతు సంఘం నేత రవీందర్ కౌర్ కంటతడి -
రైతులతో చర్చలు అసంపూర్ణం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు లక్ష్యంగా ఉద్యమిస్తున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రుల మధ్య సోమవారం జరిగిన ఏడో విడత చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. కొత్త సాగు చట్టాల రద్దు మినహా మరే ప్రతిపాదన తమకు అంగీకారయోగ్యం కాదని రైతు నేతలు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. ఆ చట్టాల్లోని రైతుల అభ్యంతరాలను నిబంధనల వారీగా చర్చిద్దామన్న ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చారు. రైతు ప్రతినిధులు వ్యవసాయ చట్టాల రద్దుపైనే పట్టుపట్టడంతో, వారి మరో డిమాండ్ అయిన ‘కనీస మద్దతు ధరకు చట్టబద్ధత’ అంశం పెద్దగా చర్చకు రాలేదు. 8న మళ్లీ చర్చించాలని నిర్ణయించారు. 41 రైతు సంఘాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. విజ్ఞాన్ భవన్లో చర్చలు ప్రారంభం కాగానే, మొదట, ఈ ఆందోళనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. అనంతరం జరిగిన చర్చల్లో తొలి నుంచీ రైతు నేతలు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన సవరణల ప్రతులను చించివేశారు. దాంతో, చర్చలు ప్రారంభమైన గంట సేపటికే ప్రతిష్టంభన నెలకొంది. దాంతో ఇరువర్గాలు బ్రేక్ తీసుకున్నాయి. ఆ సమయంలో రైతు నేతలు, తమకు దీక్షాస్థలి నుంచి వచ్చిన భోజనాన్ని స్వీకరించారు. ఆరో విడత చర్చల సమయంలో రైతులతో పాటు కేంద్రమంత్రులు కూడా అదే ఆహారాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. కానీ ఈ విడత చర్చల్లో మంత్రులు రైతు నేతలతో కలిసి భుజించలేదు. ఆ సమయంలో వారు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అనంతరం, సాయంత్రం 5.15 గంటల సమయంలో ఇరు వర్గాలు మళ్లీ సమావేశమయ్యాయి. చట్టాల రద్దు మినహా మరే ప్రత్యామ్నాయానికి అంగీకరించబోమని రైతు నేతలు తేల్చిచెప్పడంతో, చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. రైతుల డిమాండ్లపై అంతర్గతంగా చర్చించాల్సిన అవసరం ఉందని, ఆ తరువాత మళ్లీ చర్చలు కొనసాగిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పినట్లు రైతు నేతలు వెల్లడించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ అహం అడ్డుపడుతోందని వ్యాఖ్యానించారు. చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత.. కీలకమైన ఈ రెండు డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గబోమని పునరుద్ఘాటించారు. తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం చర్చిస్తామన్నారు. రెండు చేతులతో చప్పట్లు జనవరి 8న జరిగే చర్చల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చర్చల అనంతరం వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. అయితే, అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం లభించాలంటే ఇరు వర్గాలు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ‘రెండు చేతులతోనే చప్పట్లు కొట్టగలం’ అని వ్యాఖ్యానించారు. ‘వారు చట్టాల రద్దు అనే ఒక్క విషయం పైననే మొండిపట్టు పట్టారు. చట్టాలను క్లాజ్లవారీ చర్చించాలన్నది మా అభిప్రాయం’ అని వివరించారు. జనవరి 8న జరిగే చర్చలు కూడా మరో తేదీకి వాయిదా పడేందుకే జరుగుతాయా? అన్న ప్రశ్నకు.. పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావంతోనే చర్చలు జరుపుతున్నామని సమాధానమిచ్చారు. దేశంలోని రైతులందరి ప్రయోజనాలు ఆశించి, తమ ప్రభుత్వం చట్టాలను చేసిందన్నారు. అనంతరం, ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సమస్య పరిష్కారానికి అన్ని సానుకూల ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అందులో పేర్కొంది. తద్వారా చట్టాల రద్దు కుదరదన్న విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేసింది. సింఘు సరిహద్దు వద్ద నిరసన