women doctor
-
డాక్టర్‌పై అఘాయిత్యం కేసు విచారణ బెంగాల్లోనే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై చోటుచేసుకున్న అఘాయిత్యంపై దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ ఆరో స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో సమరి్పంచింది. వైద్య సిబ్బంది భద్రత కోసం ప్రోటోకాల్ రూపొందించడానికి ఏర్పాటైన నేషనల్ టాస్‌్కఫోర్స్(ఎన్టీఎఫ్) సైతం తమ నివేదికను అందజేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... ఈ నివేదికను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పంచుకోవాలని ఎన్‌టీఎఫ్‌కు సూచించింది. 10 మంది సభ్యులతో ఎన్టీఎఫ్ను సుప్రీంకోర్టు గతంంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు దర్యాప్తును పశ్చిమబెంగాల్లోనే కొనసాగించాలని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై కోల్‌కతా కోర్టులో ఈనెల 4న అభియోగాల నమోదయ్యాయని, ఈ నెల 11 నుంచి రోజువారీ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. -
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఆర్జీ కర్ డాక్టర్లతో చర్చలు విఫలం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్, 12 డాక్టర్ల సంఘాలకు మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ.. తమ డిమాండ్ల సాధనం కోసం జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరాహార దీక్ష పదోరోజుకు చేరింది. జూడాల డిమాండ్ మేరకు కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై వేటువేసి.. మరికొందరు వైద్యశాఖ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకున్న బెంగాల్ ప్రభుత్వం.. జూడాల మిగతా డిమాండ్లను తీర్చడానికి గడువు పెట్టడాన్ని అంగీకరించడం లేదు. ‘సీఎస్‌తో సమావేశం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. నిరాహారదీక్ష చేస్తున్న యువ డాక్టర్లతో చర్చలకు ఉన్నతాధికారులను పంపాలని ప్రభుత్వాన్ని కోరాం. అయితే ఎప్పటిలోగా జూడాల సమస్య పరిష్కరిస్తామనేది నిర్దిష్టంగా చెప్పలేమని ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సూచనప్రాయంగా తెలిపారు’ అని పశి్చమబెంగాల్ డాక్టర్స్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ కౌశిక్ చకి తెలిపారు. -
మండపాలు వేదికగా నిరసనలు
నవరాత్రి ఉత్సవాలు అంటే.. బెంగాల్. బెంగాల్ అంటే నవరాత్రి ఉత్సవాలు. అలాంటిది ఈ సారి పండుగ దృశ్యం పూర్తిగా మారిపోయింది. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తరువాత.. దుర్గామాత మండపాలు సైతం నిరసనలను ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా బెంగాల్‌లోని దుర్గా పూజ మండపాల్లో దేవత నిలబడి ఉంటుంది. ఇరువైపులా వినాయకుడు, కార్తికేయుడు, దేవతలు లక్ష్మీ, సరస్వతులు ఉంటాయి. ఆమె పాదాల దగ్గర రాక్షసుడు ఉంటాడు. ఇంకొందరైతే మరికొంత విశాలంగా ఆలోచించి.. బుర్జ్ ఖలీఫా ప్రతీకనో, సుందర్బన్ అడవులనో ప్రతిబింబిస్తారు. ఇంకొందరు నీటి సంరక్షణ, ప్రపంచశాంతి వంటి సామాజిక సందేశాలను ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఇవేవీ జనాన్ని ఆకర్షించడం లేదు. చాలా మండపాలు నిరసన ప్రదర్శనలుగా మారాయి. వాటిని చూడటానికి కూడా జనం ఆసక్తి చూపుతున్నారు. కోల్‌కతాలోని కంకుర్గచ్చిలో పూజ ఇతివృత్తంగా లజ్జ(õÙమ్)ను ఎంచుకున్నారు. దుర్గాదేవి కళ్లు మూసుకుని ఉండగా.. తెల్లని షీటుతో చుట్టిన ఒక మహిళ శరీరంపై ఓ సింహం నిఘా పెట్టింది. పక్కనే బాధిత కుటుంబాన్ని ప్రదర్శించారు. మంచంపై కూర్చున్న తల్లి, కుట్టు మిషన్ దగ్గర కూర్చున్న తండ్రి, గోడపై కుమార్తె ఫొటో ఉన్నాయి. మహిళల ఆధ్వర్యంలో నడిచే ఓ మండపం థీమ్ వివక్ష. ఈ సంవత్సరం వారు దుర్గా పూజను పండుగ అని కాకుండా ప్రతిజ్ఞ అని పిలుస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని, అందులోని అధికరణలను నేపథ్యంగా తీసుకున్నారు. ఒక మహిళ న్యాయం చేయాలనే రెండు చేతులు పైకెత్తి శూన్యంలోకి సహాయం కోసం అరి్ధస్తోంది. ‘రాజ్యాంగం చెప్తున్నదేమిటి? వాస్తవానికి జరుగుతున్నదేమిటి?’అంటూ స్థానిక నటులు వీధి నాటకం ప్రదర్శిస్తున్నారు. మరోచోట దేవత శక్తిని.. నిరసనల్లోని కొవ్వొత్తిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేశారు. దక్షిణ కోల్‌కతాలోని బాఘా జతిన్ మండపం... దుర్గా మాతను మరింత భయానకంగా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వేడుకలు జరుపుకొనే ఉత్సాహం లేదని.. అందుకే డ్యాన్సులను రద్దు చేసుకున్నామని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
RG Kar Medical Hospital: బెంగాల్లో కొనసాగుతున్న వైద్యుల రాజీనామాలు
కోల్‌కతా: ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో న్యాయం చేయాలని, ఆస్పత్రుల్లో భద్రత, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతు పెరుగుతోంది. వారికి సంఘీభావంగా గురువారం ప్రభు త్వ ఆధ్వర్యంలోని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి లోని 40 మంది డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలో ఏడుగురు, ఉత్తర బెంగాల్లో ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న వైద్యుల ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి డాక్టర్ గౌతమ్ దాస్ తెలిపారు. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపడం లేదని ఆయన విమర్శించారు. పరిష్కరించడంలో పురోగతి లేదని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే రాజీనామాల నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్లకు మద్దతుగా గురువారం సీనియర్ డాక్టర్లు కూడా నిరసనలో పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా ఆర్.జి.కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన 54 మంది సీనియర్ డాక్టర్లు మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు చెందిన సుమారు 35 మంది వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాగా, జూనియర్ డాక్టర్లు చేస్తున్న దీక్ష గురువారం ఐదో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా నిరాహార దీక్షా స్థలాన్ని సందర్శించిన పోలీసు బృందం... జూనియర్ డాక్టర్ల ఆరోగ్యం క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీక్షను విరమించాలని కోరింది. -
CBI: నిందితుడి డీఎన్ఏ, రక్తనమూనాలు సరిపోలాయి
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ సంజయ్ రాయ్ డీఎన్ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజి, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక ఇచి్చందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది. -
స్ట్రీట్‌లో స్టెప్పులు.. నిరసన నిప్పులు
స్త్రీ అమ్మ... అన్యాయం జరిగితే ఆదిపరాశక్తి.స్త్రీ భూదేవి... సహనం కోల్పోతే అపరకాళి.ఈ జగత్తును తల్లిలా ఆదరించే ప్రతి స్త్రీ ఈ జగత్తులో తానొక భాగం అనుకుంటుంది. తనకు గౌరవప్రదమైన ఉనికి కోరుకుంటుంది. కానీ, మనుషులు ఘోరంగా వ్యవహరించి ఆమె విశ్వాసాన్ని ధ్వంసం చేస్తుంటారు. ఆమె సహనాన్ని పరీక్షిస్తుంటారు. కోల్‌కతాలో డాక్టర్‌పై జరిగిన ఘోరకలి ఈ దేశంలో ప్రతి స్త్రీని భద్రకాళిని చేసింది. ఆ సమయంలో ఎగసిన నిరసనల్లో కోల్‌కతా వీధుల్లో ఉగ్రతాండవం చేసింది మోక్షా సేన్ గుప్తా. ‘సాక్షి’తో ఆమె మాట్లాడింది.‘‘సమాజంలోని చీడపురుగులకు చికిత్స చేయాలి. లేకపోతే వైద్యులనే కబళించేస్తాయి. చికిత్స ఎంత తీవ్రంగా ఉంటే సమాజానికి అంత మేలు’’ అంటున్నారు మోక్షా సేన్ గుప్తా. కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా మోక్షా సేన్ గుప్తా స్ట్రీట్ డ్యాన్స్‌తో పాటు ఇంకా పలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ‘అలనాటి రామచంద్రుడు’తో తెలుగు తెరపై కనిపించిన ఆమె త్వరలో విడుదల కానున్న ‘రామం రాఘవం’లోనూ నటించారు. బెంగాలీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షా సేన్ గుప్తా చెప్పిన విషయాలు.→ వీధుల్లో కళా ప్రదర్శన మా సంస్కృతివీధుల్లో కళా ప్రదర్శన అనేది చాలా సంవత్సరాల నుండి వస్తున్న మా బెంగాల్ సంస్కృతి. వర్జీనియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు విభజనకు ముందు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో బెంగాల్ కూడా రాజధానిగా ఉండేది. మన పూర్వీకులు వీధి కళ, వీధి నాటకం, వీధి నృత్యం, వీధి పాటల ద్వారా వీధి ప్రదర్శనలు చేసేవారు. దర్శకుడు సత్యజిత్ రే ఏదైనా సమస్య అంటే బెంగాలీలు అందరూ ఎలా ఒక్కటవుతారో కూడా తన సినిమాల్లో చూపించారు. మన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో బెంగాలీ స్వాతంత్య్ర సమరయోధులు వీధుల్లోకి వచ్చి, నిరసనలు చేశారు. నా రాష్ట్రం, నా కుటుంబం నేర్పిన, పెంపకం నుంచి నాకు సామాజిక బాధ్యత వచ్చింది. పూరీ్వకులు చేసిన నిరసనలే నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే కోల్‌కతా వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా వీధుల్లో కళా ప్రదర్శనలు చేశాను. → సత్యం కోసం... కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం స్వాతంత్య్ర సమయంలో తన కవితలు, పాటల ద్వారా బెంగాల్లో పునరుజ్జీవనం తేవడానికి ప్రయత్నించిన గొప్ప వ్యక్తి. ఆయన్ను నేతాజీ సుభాష్ చంద్రబో‹స్, స్వామి వివేకానంద వంటి మహానుభావులు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇక నేను వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం పాటను స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను రామకృష్ణ పరమహంస ఆరాధకురాలిని. ఆ విధంగా మంచి కోసం నిలబడటం అనేది నా రక్తంలోనే ఉంది. ఏ కళాకారుడైనా... అది వీధి కళాకారుడైనా ‘సత్యమేవ జయతే’ అంటూ నిజం వైపు నిలబడే ధైర్యం ఆ ఆరి్టస్ట్కి ఉండాలి. నేను డ్యాన్స్ చేసిన పాట అర్థం కూడా దాదాపు ఇలానే ఉంటుంది. ‘ఒకవేళ నువ్వు చెరసాలలో ఉన్నట్లయితే నిజం కోసం గొంతు ఇవ్వడానికి ఆ చెరసాలను బద్దలు కొట్టి బయటకు రావాలి. సత్యం కోసం స్వరం వినిపించాలి’ అన్నట్లుగా ఆ పాట ఉంటుంది. → వ్యవస్థకి వ్యతిరేకంగా.. మృత్తిక అనే స్వచ్ఛంద సేవా సంస్థ, ఇంకా మరికొన్ని అలాంటి సంస్థలు అణగారిన స్త్రీలు, పిల్లల సంక్షేమం కోసం పని చేస్తుంటాయి. వారితో మేం కలిసి పని చేస్తాం. అభయ సంఘటన విషయంలో వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడే వైద్యులతో మేం నిలబడ్డాం. నేను మాత్రమే కాదు... ఎందరో కళాకారులు మాతో వీధుల్లోకి వచ్చారు. అభయ కుటుంబానికి, వైద్యుల కోసం, న్యాయం కోసం మేం అంతా ఉన్నామని చూపించడానికి నాట్యాన్ని ఎన్నుకున్నాం. మేం చేస్తున్న నిరసన కార్యక్రమాలు చాలామందిని ప్రభావితం చేస్తున్నాయని నమ్ముతున్నాను. → డ్యాన్స్ కాదు... నిరసన నేను చేసినది డ్యాన్స్ అని నాకనిపించలేదు. ఎందుకంటే సరైన కొరియోగ్రఫీ లేదు. నిజానికి నేను వేరొక నిరసన ప్రదర్శన నుండి నేరుగా అక్కడికి వెళ్లాను. ఓ 20, 25 కిలోమీటర్ల నిరసన కార్యక్రమం అది. ఆ నిరసన పూర్తయ్యాక అక్కడికి వెళ్లాను. ఒక బలమైన విషయాన్ని నృత్యరూపంలో చె΄్పాలనుకున్నప్పుడు సరైన వేదిక అక్కర్లేదు... కెమెరా, యాక్షన్, లైట్లు అవసరంలేదు. ఓ ఆరి్టస్ట్ సత్యం కోసం ఎక్కడ నిలబ డితే అదే పెద్ద వేదిక అవుతుంది. ఆ వేదిక సత్యం, న్యాయం కోసం మాత్రమే నిలబడే వేదిక అయితే చాలు... ముందస్తు ప్రిపరేషన్ లేకుండా చేసేయొచ్చు. → ఐక్యత కోసమే... పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని స్థానిక పార్టీ సమరి్థస్తోంది. అంటే... కొందరు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు, స్థానికులు. నా డ్యాన్స్ గురించి కూడా చాలా అవమానకరంగా మాట్లాడారు. ఇది నిరసనా లేక మీరు రెచ్చగొడుతున్నారా? అన్నారు. అయితే ఇప్పుడు కామన్ మేన్ కూడా తన గొంతు విప్పడానికి సిద్ధమయ్యాడు. సో... ఎక్కడో చోట మొదలయ్యే నిరసనలు సాధారణ వ్యక్తులను ప్రభావితం చేసేందుకూ ఉపయోగపడతాయి. కొన్నేళ్లుగా బెంగాలీల మధ్య ఉన్న ఐక్యత కాస్త సన్నగిల్లింది. అభయ రూపంలో మళ్లీ ఆ ఐక్యతను తిరిగి తేగలిగాం. → తలో చేయీ వేద్దాం రాష్ట్ర ప్రభుత్వం 21 మంది లాయర్లను నియమించింది. వారికి వ్యతిరేకంగా డాక్టర్లు, అభయ కుటుంబం పోరాడుతోంది. ఎందరో పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారిని ఎదిరించి పోరాడాలంటే ఆర్థిక బలం అవసరం. వెస్ట్ బెంగాల్ డాక్టర్స్ నిధిని సమకూర్చా లని అనుకుంటున్నారు. నా వంతుగా నేనూ ఫండ్ రైజ్ చేస్తున్నాను. 100 రూపాయలు కూడా మాకు ఎక్కువే. 50 మంది 100 రూపాయలు ఇస్తే... అదే పెద్ద మొత్తం అవుతుంది. అలా తలో చెయ్యీ వేసి, ముందుకొస్తే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే వీలుంటుంది. అభయ కేసుని ఓ ఉదాహరణగా నిలపగలిగితే ఇలాంటి వెయ్యి సమస్యలను అధిగమించగలం. ‘మేం భారతీయులమని చెప్పుకోవడానికి గర్వపడుతు న్నాం’ అని ప్రపంచానికి చెప్పగలుగుతాం.→ అవసరమైతే మళ్లీ డ్యాన్స్ మలయాళంలో నేను చేసిన ‘చిత్ని’ ఈ 27న రిలీజైంది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అలాగే తెలుగులో నా ఫస్ట్ మూవీ ‘అలనాటి రామచంద్రుడు’ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాని చూడనివాళ్లు ఓటీటీలో చూడాలని కోరుకుంటున్నాను. ఇలా నా సినిమా విషయా లను ఫోకస్ చేస్తూనే డిజిటల్‌గా బాధితుల పక్షాన వీలైనంతగా ప్రచారం చేస్తున్నాను. అవసరమైతే మళ్లీ ‘స్ట్రీట్ డ్యాన్స్’ చేస్తా. ఆ ప్రదర్శనతో ఐదు రూపాయలు లాంటి చిన్న మొత్తం వచ్చినా అది ‘అభయ క్లినిక్’కి, అది ఏర్పాటు చేసిన డాక్టర్లకు వెళుతుంది. ఎందుకంటే ఈ క్లినిక్ నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఉపయోగపడాలన్నది మా ఆశయం. అందుకే సాయం చేయాలనుకునేవారు ఈ ఫోను నంబరు +91 6291485209 లేదా ఠీb్జunజీౌటఛీౌఛ్టిౌటటజటౌn్టఃజఝ్చజీ .ఛిౌఝ ని సంప్రదించాలని కోరుకుంటున్నాను’’ అని మోక్ష విజ్ఞప్తి చేశారు. పార్టీలకు తటస్థంగా ఉంటే కొన్ని ప్రశ్నలు లేవనెత్తలేం. అయితే ప్రశ్నలు వేస్తే మీరు ప్రతిపక్ష పార్టీ కేడర్ అని అర్థం... ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల ప్రభావం నేనో కొత్త కల కనేలా చేశాయి. ‘మావన హక్కు’ల గురించి క్షుణ్ణంగా చదవాలన్నదే ఆ కల.అభయ అనేది అంతర్గతంగా, బాహ్యంగా నన్ను మార్చేసింది. ఇక ఇప్పుడు నేను దేని గురించీ పట్టించుకోను. ఎంత దూరం అయినా ఏ మార్గంలో అయినా వెళ్లగలను. ఇది ‘మోక్ష 2.ఓ’ వెర్షన్. ఈ మారిన మోక్ష డాక్లర్లకు సపోరి్టవ్గా ఉంది... న్యాయం పక్షాన ఉంటుంది. – డి.జి. భవాని -
కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మ
కోల్‌కతా: జూనియర్ డాక్లర్లు డిమాండ్ చేసినట్లుగానే కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్‌పై వేటు పడింది. కొత్త కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మను బెంగాల్ ప్రభుత్వం మంగళవారం నియమించింది. జూడాలకు ఇచి్చన హామీ మేరకు ఆరోగ్య సేవల డైరెక్టర్ దెవాశిష్ హల్దర్, వైద్య విద్య డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌లను మమత సర్కారు తొలగించింది. కోల్‌కతా నార్త్ డివిజన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ అభిõÙక్ గుప్తా పైనా వేటు వేసింది. మనోజ్ వర్మ జంగల్‌మహల్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేతలో కీలకపాత్ర పోషించారు. కిషన్‌జీ (కోటేశ్వర రావు) ఎన్కౌంటర్లోనూ ముఖ్యభూమిక వహించారు. ఆర్.జి.కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు 39 రోజులుగా విధులను బహిష్కరిస్తున్నారు. సోమవారం రాత్రి మమతతో సమావేశమయ్యారు. వారి ప్రధాన డిమాండ్లను మమత అంగీకరించడం తెలిసిందే. -
నైట్ షిఫ్టులు వద్దంటారా?
న్యూఢిల్లీ: మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కలి్పంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. కోల్‌కతాలో ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా హత్యాచారానికి గురవడం, ఈ ఉదంతం దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడం తెలిసిందే. దాంతో నెల రోజులకు పైగా మమత సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యుల భద్రత నిమిత్తం సలహాలు, సూచనలతో ‘రాతిరేర్ సాథి’ పేరిట ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. వైద్యురాలి హత్యాచారోదంతంపై విచారణ సందర్భంగా మంగళవారం ఈ అంశం ధర్మాసనం దృష్టికి రావడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించింది. ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది భద్రత నిమిత్తం కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేట్ సెక్యూరిటీని నియమించాలన్న నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘వైద్యులకు భద్రతే లేని పరిస్థితి నెలకొని ఉంది. కనుక ప్రభుత్వాసుపత్రుల్లో పోలీసు సిబ్బందినైనా నియమించడం రాష్ట్ర ప్రభుత్వ కనీస బాధ్యత. వాటిలో యువ వైద్య విద్యార్థులు, ఇంటర్న్లు పని చేస్తున్నారు’’ అని గుర్తు చేసింది. మా లాయర్లకు బెదిరింపులు: సిబల్ ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ‘‘ఇది ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్న కేసు. దీని విచారణ ఎలా జరుగుతోందో దేశ ప్రజలంతా తెలుసుకుని తీరాలి’’ అని స్పష్టం చేసింది. ప్రత్యక్ష ప్రసారం తమ లాయర్ల బృందానికి సమస్యలు సృష్టిస్తోందని సిబల్ వాదించారు. ‘‘ఇది విపరీతమైన భావోద్వేగాలతో కూడిన కేసు. మేం వాదిస్తోంది బాధితురాలి తరఫున కాదు గనుక మా బృందంలోని మహిళా లాయర్లకు యాసిడ్ దాడులు, అత్యాచారాలు చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. పైగా మా క్లయింట్ (బెంగాల్ సర్కారు) గురించి ధర్మాసనం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లాయర్లుగా పేరుప్రఖ్యాతు లన్నీ మట్టిలో కలిసిపోతున్నాయి’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. లాయర్లకు రక్షణ లభించేలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం హామీ ఇచి్చంది. ప్రత్యక్ష ప్రసారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మమత రాజీనామాకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఇదేమీ రాజకీయ వేదిక కాదంటూ సదరు న్యాయవాదికి తలంటింది.సీరియస్ అంశాలివి! వైద్యురాలి కేసులో దర్యాప్తు ప్రగతిపై సీబీఐ సమరి్పంచిన స్థాయీ నివేదికను సీజేఐ ధర్మాసనం మంగళవారం పరిశీలనకు స్వీకరించింది. అందులోని అంశాలు తమనెంతగానో కలచివేశాయంటూ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచి్చంది. ‘‘నివేదికలో సీబీఐ పేర్కొన్నవి చాలా సీరియస్ అంశాలు. వాటిని చదివిన మీదట మేమెంతో ఆందోళనకు లోనవుతున్నాం. అయితే వాటిని ఈ దశలో వెల్లడించలేం. అది తదుపరి దర్యాప్తుకు విఘాతం కలిగించవచ్చు’’ అని పేర్కొంది. ‘‘జరిగిన దారుణానికి సంబంధించి మృతురాలి తండ్రి కొన్ని విలువైన అంశాలను కోర్టు దృష్టికి తెచ్చారు. వాటిపైనా దర్యాప్తు చేయండి’’ అని సీబీఐకి సూచించింది. ఆర్జీ కర్ ప్రభుత్వాసుపత్రి ఆర్థిక అవకతవకల కేసు దర్యాప్తుపైనా స్థాయీ నివేదిక సమరి్పంచ్సాలిందిగా నిర్దేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.పేరు, ఫొటో తొలగించండి హతురాలి పేరు, ఫొటో ఇప్పటికీ వికీపీడియాలో కనిపిస్తున్నట్టు సీబీఐ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దాంతో వాటిని తక్షణం తొలగించాలని వికీపీడియాను ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో తామిచి్చన గత ఆదేశాలకు కట్టుబడాలని స్పష్టం చేసింది. సమ్మె, ఆందోళనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలూ చేపట్టబోమని బెంగాల్ ప్రభుత్వం ఈ సందర్భంగా హామీ ఇచి్చంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరుగుతుండగా అక్కడ ఎవరెవరున్నదీ జూనియర్ వైద్యులకు తెలుసని వారి తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ సమాచారాన్ని సీబీఐకి సీల్డ్కవర్లో అందజేస్తామన్నారు. తక్షణం విధుల్లో చేరాల్సిందిగా డాక్టర్లకు ధర్మాసనం మరోసారి సూచించింది. -
దిగొచ్చిన దీదీ
కోల్‌కతా: మమతా బెనర్జీ సర్కారు దిగివచ్చింది. జూనియర్ డాక్టర్ల ఐదు డిమాండ్లలో మూడింటిని ఆమోదించింది. వైద్య విద్య డైరెక్టర్, ఆరోగ్య సేవల డైరెక్టర్లను తొలగించడానికి అంగీకరించింది. వైద్యురాలి తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీసు కమిషనర్ వినీత్ గోయల్ పైనా వేటు వేసింది. మంగళవారం కొత్త కమిషనర్‌ను నియమిస్తామని సీఎం మమత ప్రకటించారు. వినీత్ గోయల్ కమిషనర్‌గా కొనసాగడానికి సుముఖంగా లేరన్నారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ (నార్త్)ను తొలగించాలని నిర్ణయించామన్నారు. జూనియర్ల డాక్టర్ల ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. ఐదింటిలో మూడు డిమాండ్లను అంగీకరించినందుకు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని జూనియర్ డాక్టర్లను కోరినట్లు మమత వెల్లడించారు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత మమత మీడియాతో మాట్లాడుతూ సమావేశపు వివరాలను వెల్లడించారు. 42 మంది జూనియర్ డాక్టర్లు, బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ సమావేశపు మినిట్స్‌పై సంతకాలు చేశారని మమత తెలిపారు. జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని ప్రకటించారు. చర్చించుకొని తమ నిర్ణయం చెబుతామని జూనియర్ డాక్టర్లు తెలిపారని మమత వెల్లడించారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విధులకు హాజరుకావాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఆరోగ్యశాఖ కార్యదర్శిని కూడా బదిలీ చేయాలనేది జూడాల డిమాండ్లలో ఒకటి. కాళిఘాట్‌లోని సీఎం నివాసంలో సోమవారం జూనియర్ డాక్టర్లతో రాత్రి 7 గంటలకు మొదలైన చర్చలు 9 దాకా కొనసాగాయి. 42 మంది జూడాలు మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తమ డిమాండ్లను లిఖితపూర్వకంగా సీఎం ముందుంచారు. అనంతరం ఇరుపక్షాలు రెండున్నర గంటల పాటు సమావేశపు మినిట్స్‌కు తుదిరూపునిచ్చాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని మమత అన్నారు. అందుకే ఇరుపక్షాలు మినిట్స్‌పై సంతకాలు చేశాయని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సోమవారం ఉదయం మమత సర్కారు జూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు íపిలవడం ఇది ఐదో, ఆఖరుసారని కూడా స్పష్టం చేసింది.నేడు సుప్రీం విచారణ న్యూఢిల్లీ: ఆర్.జి.కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం ఈ కేసును మరోసారి విచారించనుంది. సహచర డాక్టర్ పాశవిక హత్యను నిరసిస్తూ ఆగస్టు 9 నుంచి పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరిస్తున్నారు. క్రమశిక్షణ చర్యల బారినపడకుండా ఉండాలంటే సెప్టెంబరు 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు గతంలో జూడాలను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ జూడాలను సమ్మె కొనసాగించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం జరిపే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. -
సాక్ష్యాలను నాశనం చేశారు
కోల్‌కతా: దేశవ్యాప్త ఆగ్రహావేశాలకు, ఆందోళనలకు కారణమైన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఉదంతం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆర్.జి.కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ దారుణం జరిగిన సమయంలో ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నాశనం చేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆస్పత్రి నిధుల దురి్వనియోగం కేసులో ఆయన ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలను నాశనం చేయడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంతో పాటు కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయతి్నంచారని ఘోష్‌పై అభియోగాలు మోపింది. ఇవే అభియోగాలపై స్థానిక తలా పోలీసుస్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా అరెస్టు చేసింది. ఆర్.జి.కర్ ఆసుపత్రి తలా పోలీసుస్టేషన్ పరిధిలోకే వస్తుంది. అభిజిత్ మండల్‌ను శనివారం సీబీఐ తమ కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో మండల్‌ను అరెస్టు చేసింది. అతన్ని ప్రశ్నించడం ఇది ఎనిమిదోసారి అని. ప్రతిసారీ మండల్ భిన్నమైన కథనం చెబుతున్నాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. సందీప్ ఘోష్‌ను కస్టడీ కోరుతూ సీబీఐ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. సీబీఐ కస్టడీ నిమిత్తం ఘోష్‌ను హాజరుపర్చాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించిందని సీబీఐ అధికారి ఒకరు శనివారం తెలిపారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లో శవమై కని్పంచడం తెలిసిందే. ఆమెపై పాశవికంగా అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఒక రోజు అనంతరం ఆస్పత్రిలో పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణంపై వైద్యలోకం భగ్గుమంది. దీనివెనుక చాలామంది ఉన్నారని, ఆ వాస్తవాలను తొక్కిపెట్టేందుకు మమత సర్కారు ప్రయతి్నస్తోందని డాక్టర్లు ఆరోపించారు. వైద్యశాఖ కీలక డైరెక్టర్లు, కోల్‌కతా పోలీసు కమిషనర్ తదితరుల రాజీనామా కోరుతూ పశి్చమ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలతో వైద్యులు హోరెత్తిస్తున్నారు. అనంతర పరిణామాల్లో కేసు దర్యాప్తును సీబీఐకి కలకత్తా హైకోర్టు అప్పగించింది. దర్యాప్తు పురోగతిపై మూడు వారాల్లోగా నివేదిక సమరి్పంచాల్సిందిగా ఆదేశించింది. ఆ మేరకు సెపె్టంబర్ 17లోగా దర్యాప్తు సంస్థ నివేదిక సమరి్పంచనుందని సమాచారం. ఘోష్‌కు నేరగాళ్లతో లింకులు వైద్యురాలిపై దారుణం జరిగిన మర్నాడే సందీప్ ఘోష్ హడావుడిగా ఆస్పత్రిలో మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఘోష్ ఆదేశాలిచి్చ న లేఖను కూడా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ కేసు నిందితులతో ఘోష్‌కు నేరపూరిత బంధం ఉందని, వారితో కలిసి పలు తప్పుడు పనులకు కూడా పాల్పడ్డారని సీబీఐ గత వారమే అభియోగాలు మోపింది. -
మీరిక వెళ్లొచ్చు
కోల్‌కతా: రోజంతా హైడ్రామా తర్వాత బెంగాల్ ప్రభుత్వం, జూనియర్ డాక్టర్లకు మధ్య శనివారం చర్చలు అసలు ప్రారంభమే కాలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యర్థన మేరకు ‘ప్రత్యక్ష ప్రసారం’ డిమాండ్‌ను పక్కనబెట్టి చర్చలకు సిద్ధపడ్డ జూనియర్ డాక్టర్లను ఆకస్మాత్తుగా సీఎం నివాసం దగ్గర నుంచి పంపేశారు. చాలా మొరటుగా మీరికి వెళ్లిపోవచ్చని చెప్పారని జూడాలు ఆరోపించారు. ‘చర్చలకు ఆహ్వానించడంతో సీఎం నివాసానికి వచ్చాం. ప్రత్యక్షప్రసారం లేదా వీడియో రికార్డింగు ఉండాలని డిమాండ్ చేశాం. సీఎం మమతా బెనర్జీ బయటకు వచ్చి చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం మినిట్స్‌ను మాకు ఇస్తామని హామీ ఇచ్చారు. మాలో మేము చర్చింకున్నాం. సీఎం విజ్ఞప్తి మేరకు ప్రత్యక్షప్రసారం, వీడియో రికార్డింగు లేకుండా చర్చలకు అంగీకరించాం. ఇదే విషయాన్ని ఆరోగ్యమంత్రి చంద్రిమ భట్టాచార్యకు తెలుపగా.. ఇక చాలు మీరు వెళ్లిపోండని ఆమె చెప్పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, మీకోసం మూడు గంటలుగా వేచిచూస్తున్నామని తెలిపారు. అర్ధంతరంగా మమ్మల్ని పంపేశారు’ అని సీఎం నివాసం వద్ద జూనియర్ డాక్టర్లు మీడియాతో వాపోయారు. చర్చలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ‘ఈ ఉదంతం ప్రభుత్వం అసలు రంగును బయటపెట్టింది. చర్చలపై ఎవరికి చిత్తశుద్ధి లేదో తెలుపుతోంది’ అని ఒక జూనియర్ డాక్టర్ కన్నీరుపెట్టుకుంటూ అన్నారు. ‘ఈ రోజుకు ఇక ముగిసినట్లే. మూడు గంటలుగా మేం వేచిచూస్తున్నాం. మీరు సీఎం నివాసం లోపలికి రాలేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది (రాత్రి అయిందని)’ అని ఆరోగ్యమంత్రి చంద్రిమ అంటున్న వీడియోను జూడాలు మీడియాకు షేర్ చేశారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న పీజీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లు నెలరోజులకు పైగా విధులను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. సెపె్టంబరు 10న సాయంత్రానికల్లా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. జూడాల డిమాండ్ మేరకు స్వయంగా చర్చల్లో పాల్గొనడానికి మమత అంగీకరించారు. ప్రత్యక్షప్రసారంపై పీటముడి పడినా.. చివరకు శనివారం జూడాలు దానిపై వెనక్కితగ్గారు. అయినా సర్కారు వైఖరితో చర్చలు సాధ్యపడలేదు. ఎన్నిసార్లు నన్నిలా అవమానిస్తారు: మమత అంతకుముందు సీఎం నివాసం వద్దకు చేరుకొని జూనియర్ డాక్టర్లు చర్చల ప్రత్యక్షప్రసారం డిమాండ్‌తో బయటే నిలబడిపోయా రు. వర్షంలో తడుస్తూ అలాగే నిలబడ్డారు. దాంతో సీఎం మమత బయటకు వచి్చ.. ‘మీరందరూ లోపలికి వచ్చి చర్చల్లో పాల్గొనాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. వైద్యురాలి హత్యాచారం కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రత్యక్షప్రసారం సాధ్యం కాదు. చర్చలను వీడియో రికార్డు చేసి.. సుప్రీంకోర్టు అనుమతితో మీకొక కాపీ అందజేస్తాం. ఈ రోజు సమావేశమవుదామని మీరే కోరారు. మీకోసం వేచిచూస్తున్నా. మీరెందుకు నన్నిలా అవమానిస్తున్నారు. దయచేసి నన్నిలా అవమానించొద్దు. ఇదివరకు కూడా మూడుసార్లు మీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నా. కానీ మీరు రాలేదు’ అని మమత జూడాలతో అన్నారు. జూడాల శిబిరం వద్ద ప్రత్యక్షం శనివారం ఉదయం అందరినీ ఆశ్చర్యపరుస్తూ సీఎం మమతా బెనర్జీ స్వయంగా జూనియర్ డాక్టర్ల వద్దకు వచ్చారు. ఐదురోజులుగా జూడాలు బైఠాయించిన స్వాస్థ్య భవన్ (ఆరోగ్యశాఖ కార్యాలయం) వద్దకు చేరుకున్నారు. జూడాల డిమాండ్లను పరిశీలిస్తానని, ఎవరైనా తప్పుచేశారని తేలితే వారిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మెడికోలు వర్షాలకు తడుస్తూ రోడ్డుపై ఆందోళనలు కొనసాగిస్తుంటే తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. తానిక్కడి రావడం సమస్య పరిష్కారం దిశగా చివరి ప్రయత్నమని తెలిపారు. సమ్మె చేస్తున్న జూడాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుత ఆందోళనను అణిచివేయడానికి ఇది ఉత్తరప్రదేశ్ కాదు, బెంగాల్ అని సీఎం వ్యాఖ్యానించారు. -
Eesha Rebba: సొసైటీ... చట్టమూ మారాలి.. భయపెట్టేలా ఉండాలి
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం.... వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో... ఏం చేస్తే నేరాలు తగ్గుతాయి? ‘చట్టం మారాలి... అమ్మాయిలు నిర్భయంగా ఉండేలా సమాజం మారాలి’ అంటున్నారు ఈషా రెబ్బా. అంతేకాదు... నెగటివిటీని ఇంధనంలా చేసుకుని అమ్మాయిలు ముందుకు సాగాలని కూడా అంటున్నారు. ఇంకా ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను ఈ విధంగా పంచుకున్నారు. → రిపోర్ట్ చేయనివి ఎన్నో! హత్యాచారాలు జరిగినప్పుడు ర్యాలీలు, ధర్నాలు, కొవ్వొత్తులతో నిరసన... ఇలా చాలా చేస్తుంటాం. ఈ అన్యాయాలకు మన కోపాన్ని ఆ విధంగా ప్రదర్శిస్తాం. కానీ ఒకటి జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంకోటి. ఈ మధ్యే కోల్‌కతాలో జరిగింది ఒక ఘటన. ఆ తర్వాతా కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఏం చేస్తే ఇవి ఆగుతాయి? ఆగడానికి పరిష్కారమే లేదా? అనే భయం ఉంది. ఇలాంటి వార్తలు విన్నా, చూసినా చాలా ఆవేదన. రేప్ అనేది చాలా పెద్ద క్రైమ్. మన దగ్గర రేప్ కేస్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి దారుణాలు ఇంతకు ముందు కూడా జరిగాయి. సోషల్ మీడియా వల్ల మనకు తెలుస్తున్నాయి. ఇవన్నీ రిపోర్ట్ చేసిన కేస్లు... రిపోర్ట్ చేయనివి ఎన్నో! మన న్యాయ వ్యవస్థని మరింత కఠినంగా మార్చుకోవాలి. అలా ఉంటే అయినా ఇలాంటి ఘటనలు కాస్త తగ్గుతాయని నా అభి్రపాయం. → భయపెట్టాలి రేప్ జరగడానికి కారణాలు ఏమై ఉంటాయని మొన్న ఏదో సర్వే చేశారు. అందులో ఓ క్యాబ్ డ్రైవర్‌తో పాటు ఎక్కువ శాతం మంది చెప్పిన సమాధానం... అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడం... ఇంకొంత మంది ఇంకేదో కారణం. వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉందో చూడండి. మన రాజకీయ నాయకులు కూడా కొందరు ఇంకా ఓల్డ్ స్కూల్ స్టయిల్లోనే ఆలోచిస్తున్నారు. వాళ్లు కూడా సమస్య బట్టల్లోనే ఉందంటారు. కొన్ని దేశాల్లో ఇన్వెస్టిగేషన్ చాలా త్వరగా అవుతుంది. వెంటనే ఉరి తీసే దేశాలు ఉన్నాయి. లా స్ట్రిక్ట్‌గా ఉండటం అంటే చంపేయమని కాదు. ఇన్వెస్టిగేషన్ త్వరగా, క్లియర్‌గా చేయడం. తప్పు చేశాడని రుజువు అయిన వెంటనే శిక్షించాలి. అమెరికాలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయాలంటేనే భయపడతారు. పాయింట్స్ తగ్గిపోతాయేమో అని. చిన్న చిన్న విషయాల్లో అంత కఠినంగా ఉన్నారంటే ఆలోచించండి. అనుకున్న వెంటనే చట్టం అయిపోదు. మన లా కూడా రేపిస్ట్‌ల మీద అంత కఠినంగా లేకపోవడం. ఇలాంటి తప్పు చేస్తే శిక్ష ఇంత భయంకరంగా ఉంటుందని తెలిసేలా చేయాలి. ఇలా చేస్తే ఆగిపోతాయని నేను అనను. అలా అయినా ఎంతో కొంత భయం కలుగుతుందేమో. ముందు భయపెట్టాలి. ఇంట్లోవాళ్లు హెల్మెట్ పెట్టుకో అంటున్నా పెట్టుకోరు చాలామంది. కానీ 2000 రూపాయలు జరిమానా విధిస్తారంటే ఆ భయంతో అయినా పెట్టుకుంటారు. → అమ్మాయిలకు బోలెడు ఆంక్షలు హీరోయిన్ అనే కాదు ఏ అమ్మాయి అయినా తన శరీరం... తన ఇష్టం. అబ్బాయిలు వాళ్లకు నచ్చినట్టు కూర్చుంటారు. నచ్చిన చోటుకి వెళ్తారు. నచ్చిన టైమ్‌లో వెళ్తారు. మాక్కూడా ఆ స్వాతంత్య్రం కావాలి. అమ్మాయిలకు బోలెడన్ని ఆంక్షలు.. ఇలా కూర్చోవాలి... అలా కూడదు. ఇలా మాట్లాడాలి... అలా కూడదు. చిన్నప్పటినుంచి ఇలా పరిమితులు పెట్టిన వాతావరణంలోనే దాదాపు అందరం పెరిగి ఉంటాం. అమ్మాయిలందరూ నిర్భయంగా ఉండే సమాజం ఏర్పాటు జరగాలి. భయం పెట్టాలి... → కంఫర్ట్ జోన్లో ఉండకూడదు నేను ఇంట్రావర్ట్‌ని. నాకు తెలిసిన అతి కొద్ది మంది దగ్గర మాత్రమే హైపర్ ఎనర్జీతో ఉండగలను. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే రోజూ ఓ వంద మంది ఉంటారు సెట్లో. కానీ చేయాలి. మనల్ని మనం ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో పెట్టుకుని ఉండకూడదు. మనకున్న భయాలను ఫేస్ చేస్తూ ముందుకెళ్లడమే. ఉదాహరణకు నాకు నీళ్లంటే చాలా భయం. దాంతో నీళ్లల్లో దిగేదాన్ని కాదు. కానీ ఎన్నాళ్లని అలా దాటేస్తాను? ధైర్యం తెచ్చుకున్నాను. స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ భయం పోగొట్టుకున్నాను. ప్రతి భయాన్ని అధిగమిస్తామో లేదో ఖచ్చితంగా చెప్పలేం. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. చిన్న చిన్న భయాల్ని అధిగమిస్తేనే జీవితంలో పెద్ద సవాళ్లని, సమస్యలను ఎదుర్కోవచ్చు. → లీవ్ ఇస్తే బెటరే ఆడవాళ్లకు గవర్నమెంట్ అధికారికంగా పీరియడ్ లీవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే మనమే సెలవు పెడతాం. అయితే గవర్నమెంట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. కొంత మంది తట్టుకోలేనంత నొప్పితో బాధపడుతుంటారు. కొంతమంది నడవలేరు కూడా. ఒకవేళ సెలవు పెడితే జీతం కట్ అవుతుంది లేదా ఆల్రెడీ ఆ నెలకు సరిపడా లీవ్స్ తీసేసుకోవడం వల్ల మళ్లీ లీవ్ అంటే ఆలోచించాలి. అందుకే ఆ ఇబ్బందిని భరిస్తూనే పనులకు వెళ్తుంటారు. ఆ మూడు రోజులు సెలవు రోజులుగా పరిగణిస్తే బాగుంటుందని నా అభి్రపాయం. → నిన్ను నువ్వు నమ్మాలి మన జీవితంలో ప్రతి స్టేజ్‌లో ఎవరో ఒకరు మనల్ని ‘నువ్వు చేయలేవు అనో, నీ వల్ల కాదు’ అనో అంటారు. వాళ్లకు పూర్తిగా తెలియదు కదా మన గురించి. అందుకే నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్లడమే. ఎందుకంటే అనేవాళ్లు ఎప్పుడూ అక్కడే ఆగిపోతారు. నిన్ను నువ్వు నమ్మాలి... కష్టపడాలి. నెగటివిటీని మనల్ని కిందకు తోసేలా కాకుండా పైకి తీసుకెళ్లే ఇంధనంలా వాడుకోవాలి. వెరీ హ్యాపీ కెరీర్ పరంగా నేను చాలా హ్యాపీ. మంచి కథలన్నీ వస్తున్నాయి. కోవిడ్, ఓటీటీ తర్వాత కథల్లో వైవిధ్యం పెరిగింది. రియలిస్టిక్‌గా ఉండే కథలు. అన్ని జానర్స్ కథలు చెప్పడానికి ఓటీటీ మాధ్యమాలు ఉన్నాయి. అన్ని రకాల పాత్రలు చేయడానికి యాక్టర్స్‌కి ఇది మంచి టైమ్ అని చెపొ్పచ్చు. కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత నాకు వచ్చే కథల్లో తేడా తెలుస్తోంది. సినిమాల్ని, కథల్ని చూడటంలో ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. సబ్ టైటిల్స్‌తో అన్ని భాషల్లో సినిమాలను చూస్తున్నారు కూడా. అన్ని సినిమాలు అన్ని భాషల్లో డబ్ చేస్తున్నారు. సో... సినిమా బాగుంటేనే థియేటర్స్‌కి వస్తున్నారు. అలా థియేటర్స్ రప్పించాలంటే కచ్చితంగా ఏదో ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అందించాలి.– డి.జి. భవాని -
సీబీఐ దర్యాప్తుపై నమ్మకముంది
బరాసత్(పశ్చిమబెంగాల్): కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో తమ కుమార్తెపై అత్యాచారం, హత్య ఘటనపై సీబీఐ చేపట్టిన విచారణపై విశ్వాసముందని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. ‘ఈ ఘటన వెనుక ఉన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు మాకున్న అనుమానం నిజమేనని తేలింది. ఈ నేరానికి కేవలం ఒక్కరు మాత్రమే కారణం కాదు’అని శుక్రవారం నార్త్ 24 పరగణాల జిల్లాలోని తమ నివాసంలో మీడియాతో వారన్నారు. ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగే అక్రమాల గుట్టును బయటపెట్టాలన్నారు. -
వైద్యురాలి హత్యోదంతంలో... దీదీ సర్కారు 10 తప్పులు
యావద్దేశాన్నీ కదిలించిన యువ వైద్యురాలి పాశవిక హత్యోదంతంలో మమతా సర్కారు తీరు మొదటినుంచీ తీవ్ర విమర్శలపాలైంది. దాంతో దోషులను కాపాడేందుకు ప్రభుత్వమే ప్రయతి్నస్తోందన్న అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. ఈ ఘటన పట్ల రగిలిపోయిన వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్లపైకెక్కారు. ఇది దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడంతో సుప్రీంకోర్టే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఆద్యంతం తప్పులతడకేనంటూ అత్యున్నత న్యాయస్థానం కూడా తాజాగా తీవ్రంగా తలంటింది. ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించజూసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం, శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాదం, సోషల్ మీడియా విమర్శకుల నోళ్లు మూయించడానికి నోటీసులు, నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదరబాదరాగా మరమ్మతులు, ఆస్పత్రిపై మూక దాడిని అడ్డుకోలేక చేతులెత్తేయడం... ఇలా మమతా సర్కారు, కోల్‌కతా పోలీసులు వేసిన తప్పటడుగులు అన్నీ ఇన్నీ కావు...ఆస్పత్రి వర్గాల నిర్వాకం... 1. వైద్యురాలి అర్ధనగ్న మృతదేహం కళ్లముందు కన్పిస్తున్నా, ఒంటి నిండా గాయాలున్నా ఆసుపత్రి వర్గాలు ఆత్మహత్యగా చిత్రించేందుకు విశ్వప్రయత్నం చేశాయి. కానీ జరిగిన దారుణాన్ని పోస్ట్‌మార్టం నివేదిక బట్టబయలు చేసింది. ఒంటిపై 16, అంతర్గతంగా 9 గాయాలున్నాయని, ఒకరికి మించి రేప్ చేశారని, రెండు కాళ్లూ దారుణంగా విరిచేశారని, గొంతు నులిమి పాశవికంగా హత్య చేశారని పేర్కొంది.2. కూతురిని పొగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను 3 గంటలకు పైగా ఆసుపత్రి బయటే నిలబెట్టారు. మృతదేహం దగ్గరికి కూడా పోనీయలేదు. పైగా ఆగమేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయించేలా ఒత్తిడి తెచ్చారు. కోల్‌కతా పోలీసులు సరైన కోణంలో విచారణ జరపలేదని, దర్యాప్తు కొనసాగుతుండగానే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని విపక్షాలతో పాటు డాక్టర్లు, బాధితురాలి తండ్రి ఆరోపించారు. పోలీసుల తీరు వెనక...? 3. వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు తొలుత చెప్పారు. తర్వాత రేప్, హత్య అని తెలిపారు. ఇంత సున్నితమైన అంశంలో ఇలా వ్యవహరించడం యాదృచి్ఛకం కాదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. హతురాలి డైరీతో సహా పలు ఆధారాలను పోలీసులే ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. ఆమె తనను వేధించిన వారి గురించి డైరీలో కచి్చతంగా పేర్కొని ఉంటారంటున్నారు. ఈ ఉదంతం కోల్‌కతా పోలీసుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది. దీనికి తోడు బాధితురాలి కుటుంబానికి మమత సర్కారు రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం అగి్నకి మరింత ఆజ్యం పోసింది. న్యాయమడిగితే పరిహారం పేరిట ఈ పరిహాసమేమిటంటూ అంతా దుయ్యబట్టారు. వీటిపై కూడా ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలే విన్పించాయి.సాక్ష్యాల చెరిపివేత?4. ఓవైపు హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసుపత్రి బయట ఆందోళనలు, భారీ ప్రదర్శనలు జరుగుతుండగానే ఘోరానికి వేదికైన ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆదరబాదరా మరమ్మతులు చేపట్టారు. పక్కనున్న బాత్రూం గోడను కూల్చేశారు. ఇదంతా ఆధారాలను చెరిపేసేందుకేననే సందేహాలు సహజంగానే తలెత్తాయి. మరమ్మతులు తప్పనిసరే అనుకున్నా ఇంతటి కీలక కేసు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొంతకాలం ఆగలేరా అన్న వైద్య సమాజం ప్రశ్నలకు బదులే లేదు.5. ఆగస్టు 14న అర్ధరాత్రి సంఘీభావ ప్రదర్శనలు జరగుతుండగా.. అల్లరిమూకలు ఆర్జి కార్ ఆసుపత్రిలో విధ్వంసానికి దిగాయి. 40 నిమిషాలు వీరంగం సృష్టించాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఆధారాలను ధ్వంసం చేసేందుకు టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీతో సహా పలువురు ఆరోపించారు.ప్రిన్సిపల్‌పై వల్లమాలిన ప్రేమ 6. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు మమత సర్కారు దన్నుగా నిలిచిన తీరు తీవ్ర దుమారం రేపింది. హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే గాక హతురాలి గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేయడంతో వైద్య లోకం మండిపడింది. వారి నిరసనల నేపథ్యంలో పదవికే రాజీనామా చేయాల్సి వచి్చంది. కానీ ఆ తర్వాత మమత సర్కారు వ్యవహరించిన తీరు ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్టగా నిలిచిపోయింది. ఘోష్ రాజీనామాను ఆమోదించకపోగా, కొద్ది గంట్లోనే ఆయనను ప్రతిష్టాత్మక కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా బదిలీ చేసింది. లెక్కలేనితనంతో వ్యవహరించినందుకు కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోకపోగా ఈ రివార్డు ఏమిటంటూ వైద్యులంతా దుమ్మెత్తిపోశారు. ‘గో బ్యాక్’ అంటూ కోల్‌కతా మెడికల్ కాలేజీ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి ఘోష్ తీరును కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి సెలవుపై పంపింది.నిరసనకారులపై ఉక్కుపాదం 7. హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలపై మమత సర్కారు తొలినుంచీ మొండివైఖరే ప్రదర్శించింది. వైద్యురాలి హత్య వెనుక మతలబుందని ఆర్జి కార్ ఆసుపత్రి తోటి వైద్యులు వెంటనే నిరసనకు దిగారు. సమ్మెకు దిగడం ద్వారా ప్రజలకు వారు అసౌకర్యం కలిగిస్తున్నారంటూ ప్రభుత్వం నిందించింది. వైద్యురాలికే భద్రత లేని వైనంపై ఆత్మవిమర్శ చేసుకోవడంతో పాటు సురక్షిత పనిప్రదేశాలపై వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి సున్నితత్వమే లేకుండా వ్యవహరించింది. తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరవాలంటూ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచి్చంది. 8. భద్రతా కారణాల సాకుతో మోహన్‌బగాన్, ఈస్ట్‌బెంగాల్ జట్ల మధ్య జరగాల్సిన డెర్బీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కోల్‌కతా పోలీసులు రద్దు చేశారు. మ్యాచ్‌కు భారీగా వచ్చే అభిమానులు డాక్టర్‌కు సంఘీభావంగా, మమత రాజీనామా డిమాండ్‌తో కదం తొక్కవచ్చనే భయంతోనే మ్యాచ్‌ను రద్దు చేశారని విమర్శకులు, అభిమానులు మండిపడ్డారు. దీన్ని జనాగ్రహాన్ని అణచివేసే చర్యగానే చూశారు. 9. జనాగ్రహం, వైద్యుల నిరసనల సెగతో ఉక్కిరిబిక్కిరైన కోల్‌కతా పోలీసులు తప్పిదాలను దిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగి మరింత అప్రతిష్ట పాలయ్యారు. మమత రాజీనామా చేయాలన్న డిమాండ్లపై పోలీసు ఉన్నతాధికారులు ఎదురుదాడికి దిగి అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల్లా వ్యవహరించారు. మీడియా అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని, ఈ ఉదంతాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఆరోపించారు. ఇక రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ మరో అడుగు ముందుకేసి మమత వైపు చూపుతున్న వేళ్లను విరిచేయాలంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, డాక్టర్లు, విద్యార్ధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 280 మందికి నోటీసులిచ్చారు.ముఖ్యమంత్రే నిరసనలకు దిగి... 10. సీఎంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని అధికారాలూ చేతిలో ఉన్న మమత స్వయంగా రోడ్డెక్కి అభాసుపాలయ్యారు. దోషులకు మరణశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించారు. నిజానికి సీబీఐకి కేసు బదిలీ కాకముందు కోల్‌కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరుగార్చిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర హోం శాఖ మమత చేతిలోనే ఉండటం కొసమెరుపు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Mamata Banerjee: మరో బంగ్లాదేశ్ చేద్దామనుకుంటున్నారు
కోల్‌కతా: వైద్యురాలి రేప్, హత్యపై విపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, విద్యార్థులను ఎగదోసి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు సృష్టించాలని అనుకుంటున్నాయని సీపీఎం, బీజేపీలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి అవరణలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై తమకేమీ అభ్యంతరం లేదని, సీబీఐకి పూర్తిగా సహకరిస్తామని, కేసు త్వరితగతిన తేలాలనేదే తమ అభిమతమని పేర్కొన్నారు. ‘వైద్యురాలి కుటుంబానికి అండగా నిలువాల్సిందిపోయి సీపీఎం, బీజేపీలు చవకబారు రాజకీయాలు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి ఇక్కడా తేగలమని వారు అనుకుంటున్నారు. నేనొకటే చెప్పదలచుకున్నాను. నాకు అధికార వ్యామోహం లేదు’ అని మమత అన్నారు. హత్య గురించి తెలియగానే రాత్రంతా కేసును పర్యవేక్షించానని, పోలీసు కమిషనర్‌తో, బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడానని వివరించారు. మేము ఏం చేయలేదో చెప్పండి? ఏం చర్యలు తీసుకోలేదో చెప్పండి? అని విపక్షాలపై మండిపడ్డారు. ‘డీఎన్ఏ పరీక్ష, సీసీటీవీ ఫుటేజిని సేకరించడం, శాంపిల్స్‌ను పరీక్షించడం.. ఇలా ప్రతిదీ 12 గంటల్లోపే జరిగింది. నిందితుడిని కూడా 12 గంటల్లోనే అరెస్టు చేశాం’ అని చెప్పుకొచ్చారు. సీబీఐ ఆదివారం లోగా కేసును చేధించాలని డిమాండ్ చేశారు. కోల్‌కతా పోలీసులు 90 శాతం దర్యాప్తును పూర్తి చేశారన్నారు. దోషులను ఉరి తీయాలన్నారు. వైద్యురాలికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో స్వయంగా తాను శుక్రవారం కోల్‌కతా వీధుల్లో నిరసన ప్రదర్శన చేయనున్నట్లు వెల్లడించారు. నిందితుడిని రక్షించే ప్రయత్నం: రాహుల్ వైద్యురాలి రేప్, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరగడం ఆసుపత్రిపై, అధికార యంత్రాంగంపై పలు సందేహాలకు తావిస్తోందన్నారు. డాక్టర్లలో, మహిళల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. ‘‘మెడికల్ కాలేజీలోనే డాక్టర్లకు భద్రత లేకపోతే తల్లిదండ్రులు తమ కూతుళ్లను చదువు కోసం ఎలా పంపిస్తారు? నిర్భయ వంటి కఠినచట్టాలు కూడా ఇలాంటి నేరాలను ఎందుకు ఆపలేకపోతున్నాయి?’’ అని ప్రశ్నించారు. -
జయహో జోయా
‘ఈ ప్రపంచంలో గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం జోయా మీర్జా మనసులో ముద్రించుకుపోయింది. ఆ తరువాత కలగా మారింది. కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పరాజయం పలకరించింది. నిరాశలో రెండడుగులు వెనక్కి వేసినా ఆ తరువాత మాత్రం ఆత్మవిశ్వాసం అనే ఇంధనంతో వేగంగా ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఎంపిక అయింది జోయా మీర్జా. చత్తీస్‌గఢ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది జోయా....కల కన్నప్పుడే విజయానికి దగ్గరవుతాం. ఏ కలా లేనప్పుడు ఏ విజయమూ ఉండదు. ఛత్తిస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన జోయా మీర్జా చిన్నప్పటి నుంచి పెద్ద కలలు కనేది. అయితే అవేమీ ఆకాశానికి నిచ్చెన వేయాలనుకునే కలలు కావు. ‘వైద్యురాలిగా సేవ అందించాలి, సైన్యంలో పనిచేయాలి’... ఇలా ఉండేవి ఆమె కలలు.కన్న కలలు కాలానికి నిలబడతాయనే గట్టి నిబంధన లేదు. అయితే గట్టి పట్టుదల ఉంటే కల నెరవేర్చుకోవడం కష్టమేమీ కాదు అని చెప్పడానికి స్ఫూర్తి... జోయా మీర్జా. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ (ఏఎఫ్ఎంసీ)లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మీర్జా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ డాక్టర్‌గా నియామకం కావడం ద్వారా తన కలను నిజం చేసుకుంది.అయితే జోయా మీర్జాది నల్లేరు మీద నడకేమీ కాదు. కుటుంబ ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండేది. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ‘ఇక చదివింది చాలు’ అనే మాట తల్లిదండ్రుల నుంచి ఎప్పుడూ రాలేదు. చదువు విషయంలో కుమార్తెను ఎప్పుడూ ్రపోత్సహించేవారు. జోయాను డాక్టర్‌గా చూడాలనేది అమ్మమ్మ కల.‘నీట్’ పరీక్షలో జోయాను ఫెయిల్యూర్ పలకరించింది. బాధపడుతూ కూర్చోకుండా ‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’లో గ్రాడ్యుయేషన్ చేయడంపై దృష్టి పెట్టింది. ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని రాజస్థాన్‌లోని కోటాలో ‘నీట్’ కోసం కోచింగ్ తీసుకోవడానికి జోయా మీర్జాను తల్లిదండ్రులు ఒప్పించారు. కోచింగ్ కోసం అప్పులు చేశారు. ‘తల్లిదండ్రుల కోరిక మేరకు కోటాకు వెళ్లాను. అయితే ్రపాక్టీస్ ఎగ్జామ్స్‌లో ఇతర విద్యార్థులు నా కంటే మెరుగ్గా ఉన్నారనే విషయం తెలిసినప్పుడు నాలో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. నీట్ పరీక్షకు ఇరవై రోజుల ముందు అమ్మమ్మ తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల నేను ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత తిరిగి కోటాకు వచ్చాను. ఒకే ఒక్క ర్యాంకు తేడాతో సీటు సాధించే అవకాశాన్ని కోల్పోయాను’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది మీర్జా.తల్లిదండ్రులు మొదట నిరాశ పడినా ‘మరో ప్రయత్నం’ అంటూ కుమార్తెను కోచింగ్ కోసం భిలాయ్‌కు పంపించారు.‘భిలాయ్ కోచింగ్ సెంటర్లోని ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడంతోపాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. అది నాకు ఎంతగానో ఉపకరించింది’ అంటుంది మీర్జా. ఆ ఆత్మబలమే ‘నీట్’లో తగిన మార్కులు సాధించి ‘ఏఎఫ్ఎంసీ’ ఎంచుకునేలా చేసింది. పుణేలోని ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ’లో ఎంబీబీఎస్ చేసింది.‘గొప్ప వృత్తులు ఏమిటి?’ అని చిన్నప్పుడు తండ్రిని అడిగినప్పుడు... ‘సోల్జర్, డాక్టర్’ అని చేప్పేవాడు. లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఆ రెండు గొప్ప వృత్తులలో పనిచేసే అవకాశం తన అదృష్టం అంటుంది జోయా మీర్జా.తన ఫస్ట్ పోస్టింగ్ జమ్మూలో.‘చదువుపై నాకు ఉన్న ఆసక్తిని గమనించి మా అమ్మమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలనుకుంది. డాక్టర్‌గా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. దురదృష్టవశాత్తు ఆమె ఏడాది క్రితం చనిపోయింది. నన్ను యూనిఫామ్‌లో చూడలేకపోయింది’ అమ్మమ్మను తలుచుకుంటూ బాధగా అంటుంది మీర్జా.‘పరులకు సహాయం చేయాలనే తత్వం తనది. తన మనస్తత్వానికి సరిగ్గా సరిపోయే వృత్తి ఇది. మీర్జాకు ఎలాంటి సవాలైనా ఎదుర్కొనే శక్తి ఉంది’ అంటున్నాడు జోయా తండ్రి షమీమ్ మీర్జా. -
ఎలాన్ మస్క్ ఔదార్యం
టొరంటో: కెనడాలో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుకున్న భారత సంతతి వైద్యురాలికి సహాయం అందించేందుకు ఎక్స్(ట్విట్టర్) వ్యవస్థాపకుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ముందుకొచ్చారు. ఆమె చెల్లించాల్సిన 3 లక్షల డాలర్లు(రూ.2.50 కోట్లు) జరిమానా చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. భారత సంతతి వైద్యురాలు కుల్విందర్ కౌర్ గిల్ కెనడానలోని గ్రేటర్ టోరంటోలో గత పదేళ్లుగా చిన్నపిల్లల వైద్యురాలిగా పని చేస్తున్నారు. పిడియాట్రిక్స్, అలర్జీ, ఇమ్యూనాలజీలో పోస్ట్రుగాడ్యుయేట్ ట్రైనింగ్ పూర్తిచేశారు. స్పెషలిస్టు డాక్టర్‌గా గుర్తింపు పొందారు. పేద ప్రజలకు, వలసదారులకు తన సేవలు అందిస్తుంటారు. 2020లో కెనడాలో కోవిడ్–19 మహమ్మారి ఉధృతంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్‌ను కుల్విందర్ కౌర్ గిల్ వ్యతిరేకించారు. ప్రజలంతా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలన్న నిబంధనను కూడా తప్పుపట్టారు. లాక్డౌన్, వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ట్విట్టర్(ఇప్పుడు ఎక్స్) ధైర్యంగా పోస్టులు పెట్టారు. దీనిపై కెనడా మీడియా అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఆమెపై కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్, సర్జన్స్ ఆఫ్ అంటారియో విచారణ ప్రారంభించింది. క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేసింది. దీనిపై కుల్విందర్ కౌర్ గిల్ న్యాయ పోరాటానికి దిగారు. కానీ, దురదృష్టం వెక్కిరించింది. 1.2 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని 2022 అక్టోబర్‌లో కోర్డు ఆమెను ఆదేశించింది. పలు విన్నపాల తర్వాత జరిమానాను 3 లక్షల డాలర్లుగా ఖరారు చేస్తూ గత నెలలో తీర్పు వెలువరించింది. జరిమానా చెల్లించడానికి గడువు కూడా ఎక్కువగా లేదు. తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో కుల్విందర్ కౌర్ ప్రజల నుంచి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. దాదాపు సగం నిధులు సేకరించింది. జరిమానా చెల్లించడానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇంతలో ఈ విషయంలో తెలిసిన ఎలాన్ మస్క్ వెంటనే స్పందించారు. మొత్తం 3 లక్షల డాలర్ల జరిమానా తానే చెల్లిస్తానని ప్రకటించారు. ఆయనకు కుల్విందర్ కౌర్ గిల్ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. కుల్విందర్ కౌర్ గిల్ ఎలాన్ మస్క్ -
ఇంటింటా డాక్టర్
‘ప్రతి మనిషిలోనూ ఓ డాక్టర్ ఉంటారు. ప్రతి ఒక్కరిలో వైద్యం గురించి ్రపాథమిక అవగాహన ఉంటుంది’ అనే మౌలిక సూత్రాన్ని పట్టుకున్నారు డాక్టర్ సరళ. వైద్యరంగాన్ని అత్యంత సరళంగా వివరించి చెబుతున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లను, ముఖ్యంగా గృహిణులను హెల్త్ అడ్వయిజర్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఆహ్వానం పలికిన కాలనీలకు వెళ్లి హెల్త్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ‘‘ఇంటింటా ఓ డాక్టర్’ ఉండాలి. ఆ డాక్టర్ మహిళ అయితే ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన బంధువులు స్నేహితులకు నిస్వార్థమైన వైద్యసేవలందిస్తుంది. గ్రామాల్లో వైద్య సహాయం అందని పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. నేను తయారు చేస్తున్న హెల్త్ అడ్వయిజర్ వ్యవస్థ ద్వారా ఆ లోటును భర్తీ చేయాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు డాక్టర్ సరళ. ఆమె సాక్షితో మాట్లాడుతూ ‘‘నేను డాక్టర్ కావాలనే ఆలోచన నాది కాదు, మా అమ్మ కోరిక. నిఫ్ట్‌లో కోర్సు చేసి ఫ్యాషన్ డిజైనర్ కావాలనే నా ఆకాంక్ష నెరవేరలేదు. కానీ వైద్యరంగాన్ని సమాజానికి అవసరమైనట్లు రీ డిజైన్ చేస్తున్నా’’నని చె΄్పారు. ‘‘మాది కాకినాడ. నాన్న బిజినెస్ చేస్తారు. అమ్మ గవర్నమెంట్ ఉద్యోగంలో హెడ్ ఆఫ్ ది ఫార్మసీ డిపార్ట్మెంట్గా రిటైరయ్యారు. ఆడవాళ్లను చదువులో ్రపోత్సహించడం మా ఇంట్లోనే ఉంది. అమ్మకి పదవ తరగతి పూర్తయిన వెంటనే పెళ్లి చేశారు. మా నాన్నే అమ్మను చదివించారు. ఇక ముగ్గురు పిల్లల్లో నేను పెద్దదాన్ని కావడంతో అమ్మ కల నెరవేర్చే బాధ్యత నాదయింది. సాధారణంగా మెడిసిన్‌లో ఎంబీబీఎస్‌లో సీట్ రాని వాళ్లు హోమియో, ఆయుర్వేదం వంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ వైపు వెళ్తారనే అభి్రపాయం సమాజంలో స్థిరంగా ఉంది. కానీ హోమియో మీద ఇష్టంతో బీహెచ్ఎమ్ఎస్లో చేరాను. ఖాళీ సమయాల్లో కూడా మా ్ర΄÷ఫెసర్లకు సహాయం చేస్తూ సబ్జెక్టు లోతుగా తెలుసుకున్నాను. పెళ్లి అయి వైజాగ్ వెళ్లిన తర్వాత సీనియర్ దగ్గర ఏడాది పని చేయడం నన్ను పరిపూర్ణం చేసింది. ఈ రంగంలో సాధించే అనుభవం అంతా పేషెంట్‌తో ఎక్కువ సేపు మాట్లాడి, వ్యాధి లక్షణాలను, వారి జీవనశైలిని, మానసిక స్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకోవడంతోపాటు ఎక్కువమందికి వైద్యం అందించడమే. అప్పుడే సొంతంగా ్రపాక్టీస్ పెట్టగలిగిన ధైర్యం వస్తుంది. హైదరాబాద్‌లో సొంతంగా క్లినిక్ తెరవడం... నన్ను సమాజం కోసం పని చేయాలనే ఆలోచనకు బీజం వేసింది. పేషెంట్ల వల్లనే తెలిసింది! నేనిప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ప్యానల్ డాక్టర్‌గా సేవలందిస్తున్నాను. నెలకు కనీసం పదికి తక్కువ కాకుండా హెల్త్ అవేర్నెస్ ్రపోగ్రామ్స్ చేస్తున్నాను. హెల్త్ కేర్ అవేర్నెస్ ్రపోగ్రామ్ల అవసరం ఉందని గుర్తించడానికి కారణం నా దగ్గరకు వచ్చే పేషెంట్లే. డయాబెటిస్, హైపర్ టెన్షన్, స్ట్రోక్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం నా దగ్గరకు వచ్చే చాలామందిలో అప్పటికే వ్యాధి తీవ్రత పెరిగిపోయి చికిత్సకు స్పందించని స్థితికి చేరి ఉండేది. అల్లోపతిలో వైద్యం చేయించుకుని ఆరోగ్యం మెరుగైన వాళ్లు సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అక్కడ సాంత్వన లభించని వాళ్లు ఓ ప్రయత్నం అన్నట్లుగా హోమియో వంటి వైద్య ప్రక్రియల వైపు వస్తుంటారు. ఆల్టర్నేటివ్ మెడిసిన్ పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. మూడు నెలల్లో పూర్తి స్థాయిలో చికిత్స చేయగలిగిన మందులు ఉండి కూడా చివరి దశ వరకు ఈ చికిత్సకు అందుబాటులోకి రాకపోవడం వల్ల ్రపాణాలు కోల్పోతున్న వాళ్లు ఎందరో. అలాంటి గ్యాప్‌కు 2015 నుంచి నేను బ్రిడ్జినవుతున్నాను. గతంలో కాలనీలకు వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేయాల్సి వచ్చేది. సమావేశం ఉందనే సమాచారం కాలనీలో అందరికీ చేర్చడం కూడా ప్రయాసతో కూడి ఉండేది. ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలో వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్‌లో ఒక్క మెసేజ్ పెడితే సమాచారం అందరికీ చేరుతుంది. ఆసక్తి ఉన్నవాళ్లు హాజరవుతున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి మెన్స్ట్రువల్ హెల్త్, పీసీఓడీ వంటి సమస్యల మీద అవగాహన కల్పిస్తున్నాను. దీనికితోడుగా హెల్త్ అడ్వైజర్ అనే కాన్సెప్ట్‌కు కూడా శ్రీకారం చుట్టాను. వారం రోజుల శిక్షణ అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, కానీ ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకీ బెంబేలు పడిపోయి హాస్పిటళ్లకు పరుగులు తీయాల్సిన పని ఉండదు. సాధారణ జలుబు, దగ్గు వంటి వాటికి ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు. మూడు రోజులు దాటినా తగ్గకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లమని చెబుతాం. మొదటి మూడు రోజుల వైద్యం అందించగలిగేటట్లు హెల్త్ అడ్వైజర్లను తయారు చేస్తున్నాను. రోజుకో గంటసేపు వారం రోజులపాటు ఉంటుంది ఈ కోర్సు. మందులు కూడా హెల్త్ అడ్వైజర్లు పేషెంట్ లక్షణాలను బట్టి సులువుగా ఇవ్వగలిగేటట్లు తయారు చేశాను. మనకు స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లయినప్పటికీ దేశంలో ఇంకా డాక్టర్– పేషెంట్ల నిష్పత్తి సమతుల్యతలో పెద్ద అగాధమే ఉంది. వెయ్యి మంది పేషెంట్లకు ఒక డాక్టర్ అందుబాటులో ఉండాలనే సదుద్దేశం నెరవేరడం లేదు. పట్టణాల్లో అవసరానికి మించినంత మంది వైద్యులున్నారు, గ్రామాల్లో వైద్యం కరువవుతోంది. గృహిణులకు హెల్త్ అడ్వైజర్లుగా శిక్షణ ఇవ్వడం వల్ల ఆ లోటు కొంత భర్తీ అవుతోంది. వైద్యం అంటే... సామాన్యులకు అర్థం కాని చదువు కాదు, అత్యంత సులువుగా అర్థం చేసుకోగలిగిన శాస్త్రం అని నిరూపించడం, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించడమే నా లక్ష్యం. కోర్సులో భాగంగా నేర్చుకున్న వైద్యాన్ని నా వంతుగా కొంత విస్తరించి 76 అనారోగ్యాలకు మందులు కనుక్కున్నాను. వాటికి ఆయుష్ నుంచి నిర్ధారిత గుర్తింపు కూడా వచ్చింది’’ అని వైద్యరంగాన్ని సరళతరం చేయడంలో తన వంతు భాగస్వామ్యాన్ని వివరించారు డాక్టర్ సరళ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
Dr. Lasya Sai Sindhu: సమస్యను గుర్తించడమే అసలైన మందు
ఎవరికీ చెప్పుకోలేని వేదన, భావోద్వేగాల ఒత్తిడి శరీరం మీద పడుతుంది. చాలావరకు ఆరోగ్య సమస్యలు మందులతో నయం కావచ్చు. కానీ, కొన్నింటికీ ఎంతకీ పరిష్కారం దొరకకపోతే, అందుకు మూల కారణమేంటో తెలుసుకోవడానికి తగిన శోధన అవసరం. వర్టిగో (కళ్లు తిరగడం) సమస్యకు మూల కారణమేంటో తెలుసుకుంటూ చికిత్స చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ వాసి న్యూరటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధుకు కేంద్రప్రభుత్వం ఇటీవల ‘నేషనల్ అచీవర్స్ అవార్డ్ ఫర్ హెల్త్ ఎక్సలెన్స్’ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా లాస్య సాయి సింధును సాక్షి పలకరించింది. నలభైఏళ్లకు పైబడిన ఒక మహిళ... ‘మంచం మీద పడుకుంటే కళ్లు తిరుగుతున్నాయి’ అనే సమస్యతో వచ్చింది. రెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతూ మంచం మీద కాకుండా కుర్చీలో కూర్చుని నిద్రపోవడం అలవాటు చేసుకుంది. పూర్తి చికిత్స తర్వాత ఇప్పుడు మామూలుగా మం^è ం మీద నిద్రపోగలుగుతోంది. 90 శాతం మహిళలు భావోద్వేగాల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. పదిహేనేళ్ల అబ్బాయి స్కూల్లో బెంచిమీద కూర్చున్న కాసేపటికి కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతూ సరిగా చదవలేకపోతున్నాడు. చికిత్సలో అతనికి చదువుకు సంబంధించిన సమస్యనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు కూడా కారణమని తెలిసింది. పనిలో చురుకుగా ఉండే యాభైఏళ్ల వ్యక్తి రెండు నెలలుగా కళ్లు తిరుగుతున్నాయన్న సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వచ్చారు. కరోనా తర్వాత వైరల్ అటాక్ అతని మెదడు పనితీరులో సమస్యకు కారణం అయ్యిందని తేలింది. ఇలాంటివెన్నో ప్రతిరోజూ చూస్తుంటాం. నేను ఈఎన్టీ సర్జన్‌ని. వెర్టిగో అండ్ బ్యాలెన్స్ డిజార్డర్‌లో పరిశోధన చేశాను. ఈఎన్టీలోనే మరింత ఉన్నతమైన విద్యార్హత ఈ న్యూరటాలజిస్ట్. 200 మంది వర్టిగో పేషెంట్స్‌పై పరిశోధన చేసినప్పుడు నాకు ఈ విభాగంలో ఆసక్తి పెరిగింది. నాలుగేళ్లుగా న్యూరటాలజిస్ట్గా వైద్య రంగంలో సేవలందిస్తున్నాను. చేస్తున్న కృషికి గుర్తింపుతోపాటు గతంలోనూ రెండు జాతీయస్థాయి అవార్డులు అందుకున్నాను. వచ్చిన రివ్యూస్... ఈ సమస్యలో ప్రధానంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందుకని, 5–10 నిమిషాల్లో పేషెంట్ పూర్తి సమస్య అర్థం కాదు. ఈ గంట సమయంలో చేసిన చికిత్సకు రోగిలో సరైన మార్పులు రావడం, వారు ఇచ్చే రివ్యూస్.. మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి. అన్ని వర్గాల్లోనూ... ఇటీవల చూస్తున్న కేసుల్లో మగవారిలోనూ సమస్య ఎక్కువ గమనిస్తున్నాం. నిజానికి ఆడవాళ్లలోనే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ, మగవారు తమ సమస్యలను బయటకు చెప్పుకోరు. భావోద్వేగాలను బయటకు వెలిబుచ్చరు. ఈ సమస్య వర్టిగోకు దారితీస్తుంది. మరో ఆందోళనకర సమస్య ఏంటంటే.. టీనేజ్ పిల్లల్లో వర్టిగో కనిపిస్తోంది. మానసికంగా వారు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిలో చదువుకు సంబంధించినవి, కుటుంబ సమస్యలు... కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ముందు పేషెంట్‌కు సంబంధించిన అన్నిరకాల టెస్ట్ రిపోర్ట్స్ పరిశీలించి చూస్తాం, వారు చెప్పిన ఆరోగ్య సమస్యమీద వర్క్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వర్టిగో సమస్యలు పెరిగాయి కాబట్టి ఫిజికల్ హెల్త్ ఆ తర్వాత ఎమోషనల్ హెల్త్ కూడా చూస్తున్నాం. కుటుంబం కూడా ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకొని, పేషెంట్‌కు సపోర్ట్‌గా ఉండాలి. ఆన్లైన్ అవగాహన కాన్ఫరెన్స్, సోషల్‌మీడియా ద్వారా కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. విదేశాల నుంచి కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునేవారున్నారు. ముఖ్యంగా విదేశాలలో ఎమ్మెస్ చేసేవాళ్లు ఉంటున్నారు. జీవితంలో ఎవరికి తగ్గ సమస్య వారికి ఉంటుంది. దానినుంచి బయటకు రావడమే ముఖ్యం. అందుకోసం చేసే ప్రయత్నం ప్రతిరోజూ ఉంటుంది. డాక్టర్‌గా రోజు చివరలో నా నుంచి చికిత్స తీసుకున్నవాళ్లు ‘మా సమస్యకు సరైన పరిష్కారం దొరికింది’ అనుకుంటే చాలు. అదే పెద్ద అవార్డ్’’ అంటారు ఈ డాక్టర్. కోవిడ్ తర్వాత... ‘కళ్లు తిరుగుతున్నాయి..’ అనే సమస్యతో వచ్చే వారి సంఖ్య కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. గతంలో ఒత్తిడి, భావోద్వేగాలలో మార్పు కారణం అనుకునేవాళ్లం. ఆ తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కారణం అని తెలిసింది. వర్టిగో సమస్యకు టాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్లు. టాబ్లెట్లు వాడినప్పుడు బాగానే ఉంటుది. ఆ తర్వాత మళ్లీ మామూలే! దీనికి టాబ్లెట్స్తోపాటు కౌన్సెలింగ్, కొన్ని ఎక్సర్సైజ్లు కూడా అవసరం అని గమనించాను. ఒక పేషెంట్‌కి ఇచ్చే చికిత్స 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. వారంలో మూడుసార్లు ఈ సెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. – డాక్టర్ లాస్య సాయి సింధు – నిర్మలారెడ్డి -
Janhavi Nilekani: నార్మల్ డెలివరీలు ‘నార్మల్’ కావాలి
గర్భవతుల విషయంలో సాధారణ ప్రసవం అనే మాట ఈ రోజుల్లో ఆశ్చర్యంగా మారింది. దేశమంతటా సిజేరియన్ ప్రసవాలు పెరిగాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా తన నివేదికల్లో చూపింది. అయితే, ప్రభుత్వ– ప్రైవేట్ ఆసుపత్రులలో నార్మల్, సిజేరియన్ ప్రసవాల సంఖ్యలో తేడా మాత్రం ఉంది. ఈ విషయాన్ని తన సొంత అనుభవంతో గమనించిన ఫిలాంత్రపిస్ట్ డాక్టర్ జాన్హవి నిలేకని మెటర్నల్ హెల్త్‌కేర్ వైపు దృష్టి సారించింది. బెంగళూరులో మురికివాడల్లోని నగర గర్భిణుల్లో సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఆస్ట్రికా మిడ్వైఫరీ పేరుతో ప్రసవాల సెంటర్‌నూ ప్రారంభించింది. సాధారణ ప్రసవం ఆవశ్యకతవైపు వేసిన ఆమె అడుగుల గురించి ఆమె మాటల్లోనే.. ‘‘చదువుకుంటున్నప్పుడే స్వదేశం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉండేవి. అమ్మ మరాఠీ, నాన్న కోంకణి. పుణేలో పుట్టి, బెంగుళూరులో పెరిగాను. గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లాను. నా భర్త యేల్ జార్ఖండ్‌కు చెందినవాడు. ఆ విధంగా నేను ఒకే ఒక ప్రాంతానికి చెందినదానిని అని చెప్పలేను. 2012లో పెళ్లయ్యింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కర్ణాటక లో రీసెర్చ్ చేస్తున్నాను. ఆ సమయంలో నార్మల్ డెలివరీ కోసం నగరాల్లోని చాలా ఆసుపత్రుల వారిని కలిశాను. కానీ, నార్మల్ డెలివరీకి వారెలాంటి హామీ ఇవ్వకపోవడం ఆశ్చర్యమేసింది. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో గర్భిణులకు సరైన సమయంలో మందులు, డాక్టర్లు, నర్సుల సేవ అందడం లేదనీ, దీనివల్ల తల్లీ బిడ్డలిద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆ సమయంలోనే తెలుసుకున్నాను. ప్రయివేటు ఆసుపత్రులు సిజేరియన్ ప్రసవాన్ని వ్యాపారంలా మార్చేశాయి. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం జమ్మూ, కాశ్మీర్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని 80 శాతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. సి–సెక్షన్ ఆ మహిళకు, బిడ్డకు మంచిది కాదు. నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నప్పటికీ సర్జరీ చేయడం తప్పు. కానీ, వైద్యులు సాధారణ ప్రసవానికి చాలా సమస్యలు చెప్పారు. ఆ విషయంలో నాకు ఎన్నో సందేహాలు తలెత్తాయి. చివరకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో నాకు నార్మల్ డెలివరీ అయ్యింది. దేశమంతటా.. మొదట వాయుకాలుష్యంపై పరిశోధనలు చేస్తూ వచ్చాను. కానీ, బిడ్డ పుట్టాక మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేయాలనుకున్నాను. 2019లో ఆస్ట్రికా ఫౌండేషన్‌ను ప్రారంభించాను. దీని ద్వారా భారతదేశం అంతటా ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు, జీఎన్ఎమ్లకు శిక్షణ ఇచ్చాను. దీంతో వారు సురక్షితమైన ప్రసవం గురించి మహిళలకు అవగాహన కల్పించారు. అనవసరమైన సిజేరియన్ ప్రసవాల నుంచి వారిని రక్షించగలుగుతున్నారు. ప్రసవ సమయంలో అగౌరవం ప్రతి గర్భిణి గౌరవప్రదమైన ప్రసూతి సంరక్షణ పొందాలి. కానీ, ఒక గర్భిణికి నొప్పులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులలోని లేబర్‌రూమ్‌లో సిబ్బంది ఆమె మీద చెడు మాటలతో విపరీతంగా అరుస్తారు. చెప్పుతో కొట్టడం కూడా చూశాను. ఇది నాకు చాలా పాపం అనిపించింది. ఇలా జరగకూడదు, దీన్ని ఆపాలి అనుకున్నాను. 2021 వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ వచ్చాను. అది కూడా సరిపోదని ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రుల్లో అడుగుపెట్టాను. ధనికులైనా, పేదవారైనా ప్రతి స్త్రీకీ మంచి చికిత్స పొందే హక్కు ఉంది. ఇది గుర్తించే, బెంగళూరులోనే ఒక పేరున్న ఆసుపత్రిలో నా ఏడు పడకల కేంద్రాన్ని ప్రారంభించాను. గర్భిణిని కూతురిలా చూసుకునే మంత్రసాని ఉండాలని నమ్ముతాను. విదేశాల నుంచి సర్టిఫైడ్ మంత్రసానులను, వైద్యులను ఈ సెంటర్లో నియమించాను. ఎందుకంటే, ఇక్కడ చేరడానికి డాక్టర్లు ఎవరూ రెడీగా లేరు. దీంతో బయటివారిని సంప్రదించాల్సి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ బృందాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే చాలా ఇబ్బంది అయ్యింది. ఆరోగ్య కార్యకర్తలు కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఈ పనిచేయడానికి నాకు చాలా టైమ్ పట్టింది. అంతేకాదు, హాస్పిటల్లో ప్లేస్ కోసం కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకంటే సి–సెక్షన్ లకే ప్రాధాన్యమిస్తుంటారు. ఇక నార్మల్ డెలివరీ అంటేనే మహిళలు, వారి కుటుంబసభ్యులు కూడా భయపడుతున్నారు. వారి దృష్టిలో సిజేరియన్ డెలివరీ సురక్షితమైంది. కౌన్సెలింగ్‌తో నార్మల్... నా సంస్థ కర్ణాటక వాణివిలాస్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఓ రోజు హాస్పిటల్ బోర్డ్ మెంబర్ డ్రైవర్ భార్య మా సెంటర్‌కి వచ్చింది. ఆమె నార్మల్ డెలివరీకి భయపడింది. మా మంత్రసాని ఆమె మనసులోని భయాన్ని కౌన్సెలింగ్ ద్వారా తొలగించింది. ఫలితంగా ఆమెకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన సాధారణ ప్రసవం జరిగింది. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల డెలివరీ సమయంలో నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. అంటే, వారికి మానసిక, శారీరక బలాన్ని అందిస్తాం. వారికి సహాయం చేయడానికి మా బృందం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది. ఈ రెండేళ్లలో 200 మంది గర్భవతులలో కేవలం ఇద్దరికి మాత్రమే సిజేరియన్ అవసరం పడింది. అది కూడా వారికి ప్రసవంలో సమస్య ఉండటం వల్ల. మిగతా అందరికీ సాధారణ ప్రసవాలు జరిగాయి. ఆస్ట్రికా మిడ్వైఫరీ సెంటర్లో ముప్పైమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రపంచంలో ఉన్న నర్సులు, మంత్రసానుల కోసం ఆస్ట్రికా స్పియర్ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు చేశాం. దీని ద్వారా సిబ్బంది అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు రెండువేల మంది సర్టిఫికెట్లు పొందారు. యూరప్ నుంచి కూడా అధ్యాపకులు ఉన్నారు. మా మెటర్నిటీ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవాలనుకునేవారికి కోర్సులను కూడా అందిస్తుంది. ప్రసూతి మరణాలకు ప్రధాన కారణాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అని వివరిస్తారు జాన్హవి. మా సెంటర్లో మేం ప్రసవానికి మూడు నెలల ముందు నుంచి గర్భిణులకు శిక్షణ, కౌన్సెలింగ్ ఇస్తాం. గర్భిణి ఏం తినాలి, ఎలాంటి వ్యాయామం చేయాలో చెబుతాం. దీనివల్ల నార్మల్ డెలివరీకి భయపడకుండా ఉంటారు. – డాక్టర్ జాహ్నవి నిలేకని -
ఢిల్లీలో భారీ సైబర్ క్రైం
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నార్కోటిక్స్ డివిజన్ అధికారులమంటూ ఢిల్లీకి చెందిన ఓ వైద్యురాలి(34) నుంచి సుమారు రూ.4.50 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఢిల్లీలో ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ తరహా సైబర్ నేరం ఇదేనంటున్నారు పోలీసులు. ఫెడ్ఎక్స్ కొరియర్ సర్వీస్ ద్వారా ఆమె పేరుతో ముంబై నుంచి తైవాన్ వెళ్లాల్సిన పార్సిల్లో ఇతర వస్తువులతోపాటు డ్రగ్స్ ఉన్నాయంటూ నేరగాళ్లు మే 5న సదరు బాధితురాలికి ఫోన్ చేశారు. అది మొదలుకొని అంధేరి పోలీస్ స్టేషన్, ముంబై డీసీపీ, ఆర్బీఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ అధికారుల పేరుతో పలువురు స్కైప్ ద్వారా మాట్లాడుతూ ఆమెకు మాయమాటలు చెప్పారు. ఈ విషయాలను భర్త సహా ఎవరికీ చెప్పొద్దంటూ నమ్మించారు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్‌గా ఉన్న రూ.4.47 కోట్లను డ్రా చేయించి, ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. స్కైప్ ద్వారా జరిగిన సంభాషణలను డిలీట్ చేయించారు. డబ్బును తిరిగి ఇస్తామన్న మోసగాళ్లు ఎంతకీ ఇవ్వకపోవడంతో బాధితురాలు మోసం గ్రహించి, పోలీసులను ఆశ్రయించారు. -
నపుంసకుడివి అంటూ హేళన? మహిళా డాక్టర్ దారుణ హత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా డాక్టరును ఆమె బావ అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. వివరాలు.. వారణాసిలోని మహమూర్గంజ్ ప్రాంతానికి చెందిన స్వప్న స్థానిక ఆస్పత్రిలో డాక్టరుగా పనిచేస్తుంది. మహమూర్గంజ్ ప్రాంతంలో బావతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో అనిల్ తనని నపుంసకుడంటూ నిత్యం వేధిస్తోందనే ఆగ్రహంతో ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనిల్‌ను అరెస్ట్ చేశారు. మృతురాలు స్వప్న ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణుడు, మాజీ ఎమ్మెల్యే రజనీకాంత్ దత్తా కోడలిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో స్వప్నను అనిల్ హత్య చేశాడనే విషయం దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. మరోవైపు సప్నపై తాను పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మరణించిందని అనిల్ తన నేరాన్ని అంగీకరించాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది. తాను అనారోగ్యంతో ఉన్నా, తల్లిదండ్రులను చూసేందుకు వెళతుండగా తనను చూసి పెద్దగా నవ్వుతూ నపుంసకుడంటూ ఎద్దేవా చేసిందని వీడియో క్లిప్‌లో నిందితుడు అనిల్ వాపోయాడు. గతంలో తన సోదరుడిని కూడా ఇలానే వేధించిందని చెప్పుకు రావడం గమనార్హం. -
ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి.. మహిళా డాక్టర్‌పై లైంగిక దాడి
భువనేశ్వర్: ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి మహిళా డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై లైంగికదాడి చేశాడు. వివరాలు.. అంగూల్ జిల్లాలోని చెండిపద ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కేటాయించిన ప్రభుత్వ కార్వర్ట్స్‌లో తన సోదరుడితో పాటు కలిసి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి అక్కడికి సమీపంలోని దాబాకు డిన్నర్‌కు వెళ్లాడు. దాబాలో భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సోదరి కోసం ఫుడ్ పార్శిల్ పంపాడు. దీంతో దాబా యజమాని కుమారుడు.. సుకంత బెహరా రాత్రి సమయంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు మహిళా డాక్టర్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నఆమెపై బెహరా అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై మహిళా డాక్టర్, ఆమె సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెహరాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చదవండి: గూడూరులో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం -
Dr Soosan Jacob: రికార్డు కళ్లు
సూసన్ జాకబ్.. ప్రపంచంలోనే పేరుపొందిన కంటి వైద్యులలో ఒకరు. 2021 పవర్ లిస్టులో టాప్ 100 మందిలో ర్యాంకు సాధించారు... కేవలం కంటి వైద్యులకు సంబంధించిన ఈ జాబితాను ‘ద ఆప్తాల్మాలజిస్ట్’ అనే అంతర్జాతీయ పత్రికలో ఏటా ప్రకటిస్తారు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ... ఇతర వైద్యులకు ఆదర్శంగా నిలిచే వారి ఈ జాబితాలో సూసన్ జాకబ్ పేరు చేరింది ఇప్పుడు. డాక్టర్ జాకబ్ ‘అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్’లో 21 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కంటికి సంబంధించిన విభాగాలలో స్పెషలైజేషన్ చేశారు. కటింగ్ ఎడ్జ్ క్యాటరాక్ట్, గ్లకోమా వంటి వాటిలో నిపుణులు. ‘‘ఈ లిస్టులో నా పేరు ఉండటం నన్ను గౌరవించినట్లుగా భావిస్తాను. మహిళలు కట్టుబాట్లు అనే గాజు అద్దాలను పగలగొట్టి, తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలి. ఇటువంటి వేదికల ద్వారా రెట్టింపు ఉత్సాహాన్ని పొందవచ్చు’ అంటున్నారు జాకబ్. జాకబ్ చేసిన పరిశోధనలు ఎంతోమంది కంటి రోగుల జీవితాలను మార్చేశాయి. కార్నియా, రెఫ్రక్టివ్ సర్జికల్ రంగంలో జాకబ్ అనేక పరిశోధనలు చేసిన జాకబ్ యాభైకి పైగా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. క్రిట్జింగర్ మెమోరియల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ జాకబ్. ఆమె తమిళం, ఇంగ్లీషు, హిందీ, మలయాళ భాషలు మాట్లాడగలరు.