
‘తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి’ అన్న మాట ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. కేవలం మాటల్లోనే కాకుండా తప్పనిసరిగా పాటిస్తున్నారు కూడా. మరి కరోనా సోకకుండా మనమే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాధిగ్రస్తులను నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి చికిత్స అందించే వైద్యుల పరిస్థితి ఏంటి? దీనికి సమాధానంగా ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. వివరాలు.. కరోనా బాధితులను పరీక్షించిన ఓ వైద్యురాలి డ్యూటీ ఆ రోజుకి ముగిసింది. దీంతో తన మెడికల్ సూట్, తదితరాలు తీసేందుకు రెడీ అయింది.
తొలుత ఆమె శుభ్రంగా చేతులు కడుక్కుని షూ కవర్స్‌ను తీసేసింది. అనంతరం మళ్లీ చేతులు కడుక్కుని చేతులకున్న గ్లవ్స్‌ను తీసేసింది. ఆ తర్వాత యథాతథంగా చేతులు కడుక్కోవడం.. మెడికల్ గౌన్ జిప్ తీయడం, మళ్లీ హ్యాండ్ వాష్ చేసుకోవడం.. వెంటనే తలకు ధరించిన క్యాప్‌ను తీసేయడం.. ఇలా మొత్తం మీదట ఆమె ఏకంగా 11 సార్లు చేతులు కడుక్కుంది. దీనికి సంబంధించిన వీడియోను చైనాలోని ఓ టీవీ చానల్ ట్విటర్‌లో షేర్ చేసింది. ఆమె అంకితభావం, నిబద్ధతను మెచ్చిన నెటిజన్లు ఆ డాక్టరమ్మకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు. (ఉగ్రవాదులూ..అక్కడికి వెళ్లొద్దు: ఐసిస్)
Comments
Please login to add a commentAdd a comment