
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న క్రమంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన రేపుతోంది. దీంతో తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. మాస్క్ ధరించాలని అవగాహనకు కల్పిస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘అందరూ మాస్క్ ధరించాలి’ అని కాప్షన్ జతచేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘చాలా బాగుంది.. ఇప్పుడు అందరికీ మాస్కు రక్ష’.. ‘ముందు మాస్క్ పెట్టుకో.. అలా చెబితేనే వింటారు!’ అని కామెంట్లు చేస్తున్నారు.
#BeSafe Wear mask properly. pic.twitter.com/nQc98d4Z1z
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) December 4, 2021