Hand wash
-
ఈ ఆటోవాలా ఐడియా సూపర్
తిరువనంతపురం: భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ప్రజలు తమను తాము సురక్షితంగా ఉంచుకునేందుకు వినూత్న పద్ధతులతో ముందుకు వస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజులో 7,8 సార్లు కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఆటో ఎక్కే ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకునేందుకు ఓ ఆటో డ్రైవర్ చేసిన ప్రయోగం ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆటో ముందు భాగంలో టాప్, హ్యాండ్‌వాష్ ఏర్పాటు చేశాడు సదరు డ్రైవర్. ఆటో ఎక్కే ప్రయాణికులను ముందుగా చేతులు కడుక్కొవాల్సిందిగా కోరుతున్నాడు. మొదట టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక తన ట్విట్టర్లో షేర్ చేయడంతో మరోసారి వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
ఆటోడ్రైవర్‌పై నెటిజనుల ప్రశంసలు
-
‘2 మీటర్ల సామాజిక దూరం తప్పనిసరి’
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్నప్పటికి వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 2 లక్షల మార్కును దాటగా... ఈ ఒక్క రోజే 8 వేల పై చిలుకు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉండగా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికి లాక్డౌన్ ఎత్తివేత దిశగా కేంద్రం అడగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి చర్యలు కరోనా బారి నుంచి మనల్ని కాపాడతాయని ప్రసిద్ధ లాన్సెట్ జర్నల్ ఓ నివేదికను విడుదల చేసింది. 16 దేశాలలో దాదాపు 172 అధ్యయనాలను సమీక్షించిన తర్వాత ఈ నివేదికను వెల్లడించింది. దానిలోని అంశాలు.. మాస్క్, సామాజిక దూరం అన్ని కలిస్తేనే.. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం భౌతిక దూరం, మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి అంశాలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయని నివేదిక వెల్లడించింది. అయితే ఇందులో ఏ ఒక్కటి ఒంటరిగా కరోనాను కట్టడి చేయలేదని.. వీటన్నింటిని పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని నిరోధించగలమని నివేదిక తెలిపింది. అంతేకాక వ్యాధి సోకిన వారి నుంచి మీటరు దూరం లోపల ఉన్న వ్యక్తికి వైరస్ సోకే అవకాశం 12.8 శాతంగా ఉండగా.. మీటరు కంటే ఎక్కువ దూరం(2మీటర్లు)లో ఉన్నప్పుడు వ్యాప్తి కేవలం 2.6 శాతంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.ఫేస్ మాస్క్ ధరించిన వారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 3.1 శాతం ఉండగా.. ధరించని వారికి 17.4 శాతంగా ఉంది. అలానే ఫేస్ షీల్డ్స్, గ్లాసెస్ వాడటం వలన వైరస్ వ్యాప్తి 5.5 శాతం తగ్గిందని.. వాడకపోవడం వల్ల 16 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. మాస్క్ ఎలాంటిది అయినా పర్వాలేదు.. గుడ్డ మాస్క్‌లు, ఆపరేషన్ మాస్క్‌లు, ఎన్-95 మాస్కులు.. ఇలా ఏది వాడినా మంచిదే అని నివేదిక తెలిపింది. కాకపోతే ఎక్కువ పొరలు ఉన్న మాస్క్ ధరించడం మరింత శ్రేయస్కరం అని పేర్కొంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం కిర్బీ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ రైనా మాక్ ఇంటైర్ మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ సడలించాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు మాస్క్‌ను తప్పనిసరి చేయాలి. ఈ మాస్క్‌లు కూడా నీటిని పీల్చుకోని వస్త్రంతో.. ఎక్కువ పొరలు ఉన్న వాటిని వాడేలా ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం’ అన్నారు. భారత్‌ను కాపాడే అస్త్రాలు ఇవే.. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో వ్యక్తిగత శుభ్రత, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యల ద్వారా మాత్రమే కేసుల సంఖ్యను తగ్గించగలమని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, బయట ఉన్నా వీటిని పాటించడం మాత్రం మర్చిపోవద్దన్నారు గులేరియా. (అత్యధికం : 24 గంటల్లో 8909 తాజా కేసులు) తుంపర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు.. కళ్లు, ముక్కు, గొంతు ద్వారా ప్రవేశించి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు తెలుస్తుంది. కానీ దీన్ని నిరూపించేందుకు శాస్త్రీయమైన ఆధారాలు లేవని నివేదిక తెలిపింది. -
ఆటోరిక్షా.. హ్యాండ్‌వాష్
హ్యాండ్‌వాష్ సదుపాయంతో ఆటోరిక్షా నడుస్తున్నట్లు చూస్తే ఆశ్చర్యపోతారు. తన ప్రయాణికులు వాహనం ఎక్కే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలని సూచిస్తున్న ఆటోరిక్షా డ్రైవర్ సురేష్ కుమార్‌ను కలిస్తే అతని సృజనాత్మక పనికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు. కేరళ రాష్ట్రం తిరువంతపురంలోని సురేష్ తన ఆటోకు నాలుగు అంగుళాల వ్యాసం కలిగిన పొడవాటి పివిసి పైపును అమర్చాడు. దీని ద్వారా ప్రయాణికులు చేతులు కడుక్కోవడానికి వీలుగా ట్యాప్‌ను సెట్ చేశాడు. వాహనంలో ఎక్కడానికి, దిగడానికి ముందు ఉపయోగించడానికి వీలుగా ఆటోలో హ్యాండ్ శానిటైజర్లు కూడా ఉంచాడు. ప్రయాణికులు మాస్క్‌లు, గ్లౌజులు ధరించడం వంటి జాగ్రత్తలు కూడా సురేష్ తీసుకుంటున్నాడు. ఆటో డ్రైవర్ల బృందం లాక్డౌన్ సమయంలో రోగుల ప్రయాణ ఇబ్బందులను తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ‘జనమైత్రి ఆటో డ్రైవర్స్’ కూట్టైమా’అనే ట్రస్ట్ కింద 20 మంది తోటి డ్రైవర్లతో పాటు సురేశ్ ఈ సేవను కొనసాగిస్తున్నారు. ఈ బృందం రోజులో ఎప్పుడైనా నగరంలోని రోగుల కోసం హాస్పిటల్స్‌కు ఉచిత పిక్ అప్, డ్రాపింగ్ సేవలను అందిస్తుంది. ‘నిబంధనల ప్రకారం, ఒకే కుటుంబానికి చెందినవారైతే ముగ్గురు లేదంటే ఒక ప్రయాణికుడిని మాత్రమే తీసుకెళ్లడానికి మాకు అనుమతి ఉంది. ఎక్కువగా నేను హాస్పిటల్ లేదా రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతుంటాను. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ హ్యాండ్ వాష్ సెటప్‌తో నా ప్రయాణికులను, నన్ను నేను సురక్షితంగా ఉంచాలని అనుకున్నాను. నేను రోజూ ఉదయం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు ఆటో నడుపుతాను. అత్యవసర పరిస్థితిని బట్టి ఇంకా ఎక్కువే ఉంటుంది ‘అని సురేష్ చెప్పారు. జనమైత్రి సమూహంలో భాగమైన డ్రైవర్లు 23 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. కాబట్టి, వారి భద్రతకు భరోసా కూడా అవసరం. భౌతిక దూరంలో భాగంగా సురేష్ తన వాహనాన్ని వైరస్ నుంచి వేరుచేసే కవచాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేసుకున్నాడు. దానిలో భాగంగా పీవీసీ పైపుతో ఓ చిన్న వాటర్‌ట్యాంక్‌ను అమర్చి దాని ద్వారా ప్రయాణికులు చేతులు శుభ్రపరుచుకునేలా జాగ్రత్తపడుతున్నాడు. ‘ప్రస్తుతం, నా వాహనానికి మాత్రమే హ్యాండ్ వాషింగ్ సౌకర్యం ఉంది. ఈ సదుపాయాన్ని అన్ని జనమైత్రి ఆటోరిక్షాల్లో అందుబాటులో ఉంచాలనుకుంటున్నాను’ అని చెబుతున్న సురేష్‌ను చూసి బాగా చదువుకున్న వాళ్లు కూడా ఎంతో నేర్చుకోవాలి. -
హ్యాండ్ వాష్ ట్యాంకులను ప్రారంభించిన మంత్రి వనిత
సాక్షి, తూర్పుగోదావరి : మానసిక రుగ్మతలు పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం మద్యం షాపులు తెరిచిందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ ఏర్పాటు చేసిన హ్యండ్ వాష్ ట్యాంకులను మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్డౌన్ తర్వాత మద్యం షాపులు ఎప్పుడూ తెరిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగానే మద్యం రేట్లు పెంచామని, ఆదాయం కోసం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఆర్థిక సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు రెండు సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. కొవ్వూరు వద్ద ఇసుక ర్యాంపుల్లో చిక్కుకున్న బీహార్, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను త్వరలోనే ప్రత్యేక శ్రామిక్ రైలులో స్వస్థలాలకు పంపిస్తామని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. -
చేతులు కడుక్కోని మహానుభావులూ ఉంటారు
తరచూ చేతులు కడుక్కుంటున్నారా? సబ్బు పెట్టి కనీసం 20 సెకన్లయినా శుభ్రం చేసుకుంటున్నారా? లేదంటే కరోనా బూచి మిమ్మల్ని పట్టేసుకుంటుంది. ఇదే కదా కొన్ని నెలలుగా వింటున్నాం. వాస్తవం కూడా ఇదే. సాంక్రమిక వ్యాధుల్లో కనీసం 80 శాతం అపరిశుభ్రమైన చేతుల ద్వారానే ఇతరులకు వ్యాపిస్తాయని సైన్స్ చెబుతోంది. ఓ ఏడాదిపాటు చేతులు కడుక్కోకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా? అంతకంటే ముందు మనలో చేతులు ఎందరు కడుక్కుంటారో చూద్దాం. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనం ప్రకారం 69 శాతం పురుషులు, 35 శాతం మహిళలు పబ్లిక్ బాత్రూమ్లు వాడిన తరువాత చేతులు కడుక్కోరట. దగ్గినా లేదా తుమ్మిన తరువాత చేతులు కడుక్కోని వారు నూటికి 93 మంది! ఇప్పుడు ఒక ఏడాదిపాటు మీరు సబ్బు లేదా శానిటైజర్ వాడకపోతే ఏమవుతుందో చూద్దాం. వర్షంలో తడవడం, ఈత కొట్టడం, సబ్బు లేకుండా స్నానం చేయడం వంటి వాటి ద్వారా కొంతమేరకు బ్యాక్టీరియా/వైరస్ తొలగిపోవచ్చుగానీ సబ్బు, శానిటైజర్లు వాడటం ఆపేసిన కొంత కాలానికే మీరు జబ్బు పడటం మాత్రం గ్యారంటీ. ఎంతకాలంలో అన్నది మీరు ఎంత మందిని కలుస్తున్నారు? ఎక్కడెక్కడ తిరిగారు? వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని రోజుల తరువాత చేతులు మురికిగా అనిపిస్తాయి. మట్టి, మడ్డిలతోపాటు బోలెడంత బ్యాక్టీరియా ఇప్పటికే చేతిపై తిష్టవేసి ఉంటుంది. మీ గురించి తెలిసిన వారు మీ దగ్గరికి వచ్చినా షేక్‌హ్యాండ్ మాత్రం ఇవ్వరు. కొలరాడో యూనివర్సిటీ చేసిన ఒక పరిశోధనను బట్టి చూస్తే మన చేతులపై కనీసం 150 జాతులకు చెందిన 3,200 బ్యాక్టీరియా ఉంటాయి. మలమూత్రాలకు వెళ్లిన ప్రతిసారీ వేలి మొనలపై ఉండే బ్యాక్టీరియా సంతతి రెట్టింపు అవుతుంది. బాత్రూమ్ ఫ్లష్‌ను ఒక్కసారి వాడితే బ్యాక్టీరియా/వైరస్లు దాదాపు 6 అడుగుల దూరం వరకూ వ్యాపిస్తాయి. వాటివల్ల అతిసారం వంటివి తరచూ బాధిస్తాయి. జలుబు లాంటివి ఎక్కువవుతాయి. డాక్టర్లు ఇచ్చే యాంటీబయాటిక్‌లు వాడటం.. కొంత కాలానికి బ్యాక్టీరియా/వైరస్లు ఈ మందులకు అలవాటు పడిపోవడం జరిగిపోతుంది. కొంత సమయం తరువాత మీ చుట్టూ ఉన్న వారూ జబ్బు పడిపోతారు. ఇవన్నీ ఎందుకు అనుకుంటే.. ఎంచక్కా రోజులో కనీసం నాలుగైదు సార్లు 20 సెకన్లపాటు చేతులు శుభ్రం చేసుకోండి. -
లాక్డౌన్: వాటినే ఎక్కువగా ఆర్డర్ చేశారు!
ముంబై: మార్కెట్లో అవసరాలు తీర్చే యాప్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వేడి వేడి ఆహారాన్ని నిమిషాల్లో డెలివరీ చేసే యాప్స్‌కు యమ క్రేజీ ఉంది. అయితే లాక్డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇవి నిత్యావసరాలను కూడా డెలివరీ చేయడానికి పూనుకున్నాయి. అయితే కిరాణా సామాగ్రి నుంచి ఆహారం వరకు అన్నింటినీ క్షణాల్లో తెచ్చి పట్టే యాప్ ‘డుంజో’. ఇది హైదరాబాద్ కన్నా ముంబై, చెన్నై నగరాల్లో బాగా పాపులర్. డుంజో గత నెలలో జనాలు ఫార్మసీకి సంబంధించి ఏ వస్తువులను ఎక్కువగా ఆర్డర్ చేశారన్న విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం చెన్నై, జైపూర్‌వాసులు హ్యాండ్‌వాష్‌ను ఎక్కువగా ఆర్డర్ చేశారు. (బగ్గా వైన్ షాప్ పేరుతో ఆన్లైన్లో మోసం) తద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు శుభ్రతే ప్రధాన అవసరమని గుర్తించినట్లున్నారు. బెంగళూరు, పుణె నగరాల్లో ప్రెగ్నెన్సీ కిట్లను అధికంగా డెలివరీ చేశారు. అన్నింటికన్నా భిన్నంగా ముంబైవాసులు ఆర్డర్ చేసినవాటిలో కండోమ్స్ మొదటి స్థానంలో ఉంది. "ఇలాంటి విషమ పరిస్థితుల్లోనూ ఇదేం కక్కుర్తి" అని సోషల్ మీడియాలో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే మన భాగ్యనగర వాసులు ఐ-పిల్ అనే గర్భనిరోధక మాత్రలను విచ్చలవిడిగా వాడేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని డుంజో చెప్పుకొచ్చింది. (‘ఆన్లైన్’ అమ్మకాలకు ప్రోత్సాహం) Some Indian cities med the most of it during the lockdown, this March. Delivering from pharmacies is clearly no child's play.🏥#Contraceptives #Condoms #PregancyKits #HandWash #IPill #Pharmacies #Medicines #Lockdown2020 #quarantinelife #quarantineandchill pic.twitter.com/6fEvKMJniC — Dunzo (@DunzoIt) April 14, 2020 -
స్వచ్ఛమైన నీటి జాడ ఎక్కడ?
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఒక్కో దేశం ఒక్కో విధానాన్ని అవలంబిస్తోంది. కానీ, సులువైనదనీ, అందరూ సులభంగా అనుసరించగలరనీ భావించి ‘సబ్బుతో, నీళ్లతో మీ చేతులను కనీసం 20 సెకన్లపాటు కడుక్కోవాలని’ ప్రతి దేశంలోనూ చెబుతున్నారు. ఇందుకు ఎంతో సురక్షితమైన నీళ్లు అవసరం, కానీ ప్రపంచంలో చాలాచోట్ల పరిశుభ్రమైన నీళ్లు దొరకడం లేదు. చాలా ప్రాంతాల్లో సరఫరానే ఉండదు. అత్యవసరంగా పారిశుద్ధ్యం పెంపొం దించాల్సిన ప్రాంతాల్లో మహమ్మారి విస్తరిస్తే అటువంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది? తరచూ, శుభ్రంగా చేతులు కడుక్కోవడం ద్వారా కరోనా–19లాంటి వ్యాధులు సోకవని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పారిశుద్ధ్య లోపం, చేతులు శుభ్రం చేసుకునే అవకాశాలు లేకపోవడం కారణంగా 2017లో ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది మృతి చెందినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సురక్షితమైన తాగు నీటి వసతి లేకుండా 220 కోట్లమంది జీవిస్తున్నారు. పెద్దగా అభివృద్ధికి నోచుకోని దేశాల్లో కనీస నీటి వసతి లేకపోవడంతో మౌలిక నీటి సదుపాయాలు లేని ప్రాంతాల్లోనే ఆరోగ్య సంరక్షణ కూడా కొరవడుతోందని తేలింది. సురక్షితమై నీరు, పరిశుభ్రత అనేవి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తప్పనిసరిగా కావాలి. చేతులు కడుక్కోడానికి సరైన నీటి వసతి లేని ఇళ్లలో 75 శాతం మంది ఆఫ్రికన్లు నివసిస్తున్నారని ప్రపంచబ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కెన్యాలో తాము సందర్శిం చిన 95 శాతం ఇళ్లలో సరైన నీటి వసతి లేదని ఒక స్వచ్ఛంద సంస్థ తెలిపింది. సరైన నీటి సరఫరాలేని దేశాల్లోని ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. దక్షిణాసియా, ఆఫ్రికాల్లో 2017లో డయేరియా కారణంగా మరణించినవారి సంఖ్య అధికంగా ఉన్నాయి. అపరిశుభ్రమైన తాగునీరు, పారిశుద్ధ్యం సరిగా లేని కారణంగా 70 ఏళ్లు పైబడినవారిలో వ్యాధులు త్వరగా వ్యాపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని కరువు ప్రాంతాల్లో అపరిశుభ్రమైన నీళ్ల కారణంగా 2016లో అయిదేళ్ల లోపు చిన్నారులు 72 శాతం మంది మరణిం చారు. అయితే, సరైన నీటి వసతి వున్న ప్రాంతంలో కూడా తరచూ చేతులు కడుక్కోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జోర్డాన్‌లో నివసించేవారిలో 93 శాతంమందికి 2015లో సురక్షితమైన నీరు అందేది. అయితే, దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన కారణంగా ప్రజలందరినీ ఇంట్లోనే ఉండమని ప్రభుత్వం ఆదేశించినప్పుడు నీళ్లకి 40 శాతం డిమాండ్ పెరిగింది. 2011లో అంతర్యుద్ధం సందర్భంగా సిరియా శరణార్థులు రావడంతో ఆ డిమాండ్ 22 శాతం పెరిగింది. హఠాత్తుగా నీళ్లకు డిమాండ్ పెరిగిపోవడంతో చాలా దేశాల్లో నీటి కొరతను ఎదుర్కొనక తప్పడం లేదు. ఎక్కడైతే నిరంతరం రక్షిత నీటి సరఫరా కొరవడుతుందో అక్కడ వ్యాధులు మరింత తీవ్రంగా ప్రబలుతాయి. కరోనా లాంటి ఉపద్రవం ఎదురైనప్పుడు నీటి కొరత ప్రపంచ సమస్య అవుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి సంఘటిత చర్యలు అవసరం. వైరస్ వ్యాప్తి చెందకుండా నీళ్లతో చేతులు కడుక్కోవాలని పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్న ప్రస్తుత సందర్భం కంటే నీటి సంక్షోభంపై దృష్టి సారించడానికి కీలకమైన సమయం ఏదీ ఉండదు. వాతావరణ మార్పులపై దృష్టిపెట్టి ఉపరితల నీటి కొరతతో తలెత్తుతున్న కరువును కట్టడి చేయవచ్చు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టి భూగర్భ జలాల దుర్వినియోగాన్ని నివారించవచ్చు. నీటి వనరులను సంరక్షించడమనేది అందరికీ ముఖ్యమైనది. అందరికీ ఎదురైన సమస్యను పరిష్కరించాలంటే ఐక్య కార్యాచరణే సరైనదని కరోనా వైరస్ కారణంగా తలెత్తిన వైద్య సంక్షోభం చెబుతోంది. పరిశోధకులు కనుగొన్న అంశాలను, వారి నైపుణ్యాలను శాస్త్రవేత్తలకు, ఇతరులకు మధ్య ఉన్న ఖాళీ పూరించడానికి వినియోగించాలి. జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా నీటి వనరులను సంరక్షించుకోవడానికి, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడానికి, పరిశుభ్రత పెంపొందించడానికి కొత్త ఆలోచనలు రూపుదాల్చే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి విరుచుకుపడి సురక్షితమైన నీటి సరఫరా మనల్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుతుందో, అటువంటి నీటి వసతి లేనివారి పరిస్థితి ఏంటో ఆలోచించేలా చేసింది. శుద్ధమైన నీరు, పరిశుభ్రత అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరి హక్కుగా చేయడం ఇప్పుడు తక్షణ అవసరం. అంతేకాదు, భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులను తట్టుకునేలా ప్రపంచాన్ని సిద్ధం చేయడం కూడా ముఖ్యం. రయా ఎ. అల్–మస్రి వ్యాసకర్త పరిశోధక విద్యార్థి, సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీ, కెనడా -
పరిశుభ్రతే.. శ్రీరామ రక్ష!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే కనీసం ప్రతి 20 నిమిషాలకోసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్న సూచనను పెడచెవిన పెడుతున్న వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే... కడిగి కడిగి చేతులు అరిగిపోతాయ్ జాగ్రత్త అని జోకులేసేవారికి అయితే ఇది చాలా ముఖ్యం కూడా. మనకు తెలియకుండానే మన చేతులు మన ముఖాన్ని, ముఖ భాగాలను టచ్ చేస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వేల్లో వెల్లడయిన విషయాల ప్రకారం ఒక గంటకు మనం మన ముఖాన్ని ఎన్నిసార్లు తాకుతామో తెలిస్తే అవాక్కవక తప్పదు!. ప్రతి గంటకు ఎన్నిసార్లు మనం మన ముఖాన్ని, ముఖ భాగాలను తాకుతామో తెలుసా... సగటున 23 సార్లు. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా?.. ఆస్ట్రేలియాలోని ఓ విశ్వవిద్యాలయం తన మెడికల్ విద్యార్థులపై నిర్వహించిన సర్వే ఫలితం నిజమో కాదో తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. లేదంటే ఇతరులను నిశితంగా గమనించండి... అప్పుడయినా చేతులు శుభ్రంగా కడుక్కోండి... కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. దాదాపు అన్ని భాగాలు... ప్రతి వ్యక్తి తన ముఖాన్ని గంటకు ఎన్నిసార్లు తాకుతారన్నదానిపై ఆస్ట్రేలియాలోని ఓ విశ్వవిద్యాలయం 2015లో ఓ సర్వే నిర్వహించింది. వర్సిటీలో చదువుతున్న 26 మంది మెడికల్ విద్యార్థులను పరిశీలించింది. అప్పుడు వీరంతా కనీసం సగటున 23 సార్లు ముఖాన్ని, ముఖ భాగాలను తాకారని తేలింది. ప్రతి గంటలో ముక్కు, కంటి భాగాలను మూడుసార్లు చొప్పున.. నుదురు, బుగ్గలు, గడ్డం, పెదవులను నాలుగుసార్లు తాకుతారని... చెవిని గంటకు ఒకసారి మాత్రమే టచ్ చేస్తారని ఈ సర్వేలో వెల్లడయింది. ఆఫీసుల్లో పనిచేసిన వారిపై నిర్వహించిన మరో సర్వేలో ఆఫీసు వేళల్లో కనీసం సగటున 16 సార్లు ముఖాన్ని తాకుతారని తేలింది. ఈ మఖభాగాల ద్వారానే కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించే అవకాశమున్న నేపథ్యంలో వీలున్నప్పుడల్లా లేదంటే కనీసం ప్రతి 20 నిమిషాలకోసారి చేతులు శుభ్రంగా కడుక్కుంటే మంచిదన్నమాట. అందుబాటులో ఉంటే సబ్బు లేదంటే శానిటైజర్ ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యమని ఈ సర్వేల ద్వారా అర్థమవుతోంది. అందుకే... మన వ్యక్తిగత పరిశుభ్రతే... ఈ పరిస్థితుల్లో మనకు శ్రీరామరక్ష. -
ఎన్నిసార్లు ముఖాన్ని తాకుతామో తెలిస్తే..
యావత్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కోవిడ్ -19 (కరోనా వైరస్) నివారణకు ప్రస్తుతానికి కచ్చితమైన మందు ఏదీ అందుబాటులో లేదు. నివారణ ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలోనే మాస్క్ లు ధరించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో వుంటూ ఈ వైరస్ విస్తరణను అడ్డుకోవాలని అటు వైద్య నిపుణులు, ఇటు ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చేతులు శానిటైజర్ తో కడుక్కోవాలని కోరుతున్నారు. ముఖంలోని ముక్కు, కళ్లు, చెవులు, నోటిని తాకడం ద్వారా మాత్రమే ప్రాణాంతకమైన ఈ వైరస్ మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుందని, అప్రతమత్తంగా వుండాలని చెబుతున్నారు. అయితే మనం రోజులో ఎన్నిసార్లు మన ముఖాన్ని చేతితో తాకుతామో తెలుసా? పోనీ గంటలో ఎన్నిసార్లు ముఖాన్ని, ముఖంలో ఇతర భాగాలను ముట్టుకుంటామో తెలుసా? కొన్ని అధ్యయనాలు తేల్చిన విషయాలను గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అంశంపై పరిమితమైన రచనలు, చాలా తక్కువ పరిశోధనలు ఉన్న క్రమంలో, సెల్ప్ ఐసోలేషన్ లో ఉన్నపుడు, ఇతర సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నిరోధించే క్రమంలో దీనిపై గతంలో జరిగిన అధ్యయన ఫలితాలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. 2015లో ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో 26 మంది వైద్య విద్యార్థులపై ఈ స్టడీ నిర్వహించారు. వీడియో టేప్ రికార్డింగ్ ద్వారా ముఖాన్ని ఎన్నిసార్లు ముట్టుకుంటారనే దాన్ని విశ్లేషించారు. 26 మంది విద్యార్థులలో అందరూ ప్రతి గంటకు సగటున 23 సార్లు వారి ముఖాన్ని తాకారు. ఇందులో దాదాపు సగానికిపైగా సార్లు ముక్కు, కళ్లు, నోటిని తాకారట. 2008లో నిర్వహించిన మరో స్టడీలో ఇంకోఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఆఫీసు వాతావరణంలో ఉద్యోగులు గంటకు 16 సార్లు ముఖాన్ని టచ్ చేస్తారని హ్యాండ్ టూ ఫేస్ సంబంధంపై నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 10 మందిని మూడు గంటలపై నిర్వహించిన స్టడీలో గంటకు సగటున 16 సార్లు ముఖంలోని భాగాలను తాకారని అధ్యయనం తెలిపింది. 2014లో నిర్వహించిన మరో అధ్యయనం ఏం చెబుతోంటే.. వైద్య వృత్తిలో ఉన్నవారు గంటకు 19 సార్లు ముఖాన్ని ముట్టుకున్నారట. అంటే వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారో ఆయా భాగాలనే ఎక్కువగా తాకారన్న మాట. అందుకే ముఖాన్ని, ముఖంలోని ఈ ముఖ్య భాగాలను స్పర్శించే ముందు తప్పకుండా చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. స్వీయ పరిశుభ్రత, నియంత్రణ ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే సైకిల్ ను విచ్ఛిన్నం చేయాలి. ఇదే అతి సులువైన, చవకైన నివారణ పద్ధతి. లేదంటే భారీ మూల్యం తప్పదు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం అందించిన సమాచారం ప్రకారం గంటకు మూడుసార్లు కంటిని, ఒకసారి చెవిని, నోటిని నాలుగుసార్లు తాకుతాం. ప్రతీ గంటకు నాలుగుసార్లు జుట్టుని ముట్టుకుంటాం. అలాగే బుగ్గల్ని నాలుగుసార్లు, మెడను ఒకసారి, గడ్డాన్ని నాలుగు సార్లు తాకుతాం. ఈ విషయాలను నమ్మబుద్ధి కావడంలేదా.. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్త లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమై ఉన్న మీలో ఎవరైనా సరదాకా ఈ స్టడీ చేయండి. మీ అమ్మా నాన్న, తోబుట్టువులు, లేదంటే పెద్ద, చిన్న, ఇలా వారు గంటలో ఎన్నిసార్లు, ముక్కును తాకుతున్నారు. నోట్లో వేళ్లు పెట్టుకుంటున్నారు.. కళ్లను నులుముకుంటున్నారో పరిశీలించండి. -
శానిటైజర్ తయారీ ఇక ఇంట్లోనే
డాక్టర్ శివకల్యాణి ఆడెపు హైదరాబాద్ ఐఐటీలో మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్‌స్కాలర్. ఆమె తన పరిశోధన సమయంలో చేతులను శుభ్రం చేసుకోవడానికి సొంతంగా హ్యాండ్ శానిటైజర్‌ను తయారు చేసుకుని వాడుకునే వారు. నగరంలో కరోనా వ్యాప్తి కారణంగా ఇప్పుడు ఐఐటీ క్యాంపస్‌లో ఉన్న మూడు వేల మందికీ హ్యాండ్ శానిటైజర్ల అవసరం ఏర్పడింది. దేశవిదేశాల నుంచి కూడా స్టూడెంట్స్ వస్తుంటారు. వారందరి అవసరాల కోసం శివ కల్యాణి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసుకున్న శానిటైజర్‌కు గిరాకీ పెరిగింది. యూనివర్సిటీ అవసరాలకు తగినంత మోతాదులో తయారు చేశారు శివకల్యాణి. ఇదే ఫార్ములాను ఇంట్లో తయారు చేసుకోదగినట్లు కొద్దిపాటి మార్పులతో సాక్షికి వివరించారు. అర లీటరు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలి. ఆ నీటిని ప్రెషర్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేవరకు వేడి చేయాలి. నీటిని నేరుగా పాత్రను స్టవ్ మీద పెట్టి కాచేటట్లయితే నీరు బుడగలు వచ్చి మరిగే వరకు వేడి చేయాలి. ఆ నీటిని గది ఉష్ణోగ్రతకు వచ్చేవరకు పక్కన ఉంచాలి. చల్లారిన తర్వాత పావు లీటరు నీటిని మాత్రమే ఒక బాటిల్లో పోసి అందులో 750 మి.లీ ఐసోప్రొఫెనాల్, యాభై మి.లీల గ్లిజరిన్, ఒకటి నుంచి ఒకటిన్నర ఎం.ఎల్. హైడ్రోజెన్ పెరాక్సైడ్‌ను కలపాలి. ఈ మిశ్రమం సమంగా కలిసే వరకు బాటిల్‌ను షేక్ చేయాలి. ఇలా తయారైన శానిటైజర్ బాటిల్లో నిల్వ చేసుకుని వాడుకోవచ్చు. శానిటైజర్‌ను చేతుల్లో వేసుకున్న తర్వాత ముప్పై సెకన్ల పాటు వేళ్లసందుల్లో మొత్తం బాగా పట్టేటట్లు రుద్దాలి. ఇలా తయారు చేసుకున్న శానిటైజర్ పాడవదు. అయితే... ఇది ఆల్కహాల్ ఆధారితం కావడంతో మూత గట్టిగా పెట్టుకోకపోతే ఆవిరైపోతుంది. కాబట్టి మూత గట్టిగా పెట్టుకోవాలి. మంచి వాసన కోసం లెమన్ గ్రాస్, టీ ట్రీ ఆయిల్ వంటివి కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. ఈ ఆయిల్స్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి సువాసనతోపాటు శానిటైజర్ పనితీరును మరింతగా మెరుగుపరుస్తాయి కూడా. హోమ్మేడ్ హ్యాండ్ శానిటైజర్ తయారీలో వాడే బాటిళ్లను హైడ్రోజెన్ పెరాక్సైడ్‌తో శుభ్రం చేయాలి. -
శానిటైజర్ తయారీకి కావాల్సినవి..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఎక్కడ చూసినా కరోనా హైరానే.. ఎవరిని పలకరించినా ఈ వైరస్ గురించి చర్చలే. దేశ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది చేతులు పరిశుభ్రంగా ఉండటం. సబ్బుతోనో.. హ్యాండ్‌వాష్‌ను ఉపయోగించడం కన్నా శానిటైజర్‌ను వాడటం సులభం, ఉత్తమమని ప్రచారం జరగడంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వ్యాపారుల బ్లాక్ మార్కెట్ పుణ్యమా అని ఎక్కడ కూడా హ్యాండ్ శానిటైజర్ దొరకని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆన్లైన్, ఆఫ్ లైన్, మెడికల్ షాప్స్ ఇలా ఎక్కడ కూడా నోస్టాక్ అంటూ చెప్పేస్తున్నారు. ఈ దశలో అత్యధిక రేటు ఉండే హ్యాండ్ శానిటైజర్లు సులభంగా ఇంటిలోనే ఎలా తయారు చేసుకోవాలి? దీనికి కావాల్సిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి తదితర అంశాలపై పూర్తి వివరాలు ఇవీ.. (168కి చేరిన కరోనా కేసులు) శానిటైజర్ తయారీకి కావాల్సినవి.. రబ్బింగ్ ఆల్కహాల్: ఇది నాన్సెప్టిక్ ద్రావకం. దీన్ని ఐసోప్రోప్లీ ఆల్కహాల్, ఇథేల్ ఆల్కహాల్, ఇథనాల్ అని కూడా పిలుస్తారు. ఇది ఫంగస్, వైరస్‌లకు చంపేస్తుంది. మెడికల్ షాప్స్, మెడికల్ ఏజెన్సీలు లేదా మెడికల్ రసాయనాలు అమ్మే షాపులలో ఇది దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ స్టోర్లలో కూడా బ్రాండ్‌ను బట్టి 100 ఎంఎల్ రూ.100 నుంచి రెండు లీటర్లు, 5 లీటర్ల క్వాంటిటీలో రూ. 495 ఆపై ధరల్లో లభిస్తుంది. అలోవెరా జెల్: కిరాణా, ఆయుర్వేద షాపుల్లో ఇది సులభంగా దొరుకుతుంది. ఇంటిలో అలోవెరా మొక్క ఉంటే దాని నుంచి కూడా సేకరించవచ్చు. యాంటిబయోటెక్గా, చర్మ రక్షనకు ఇది ఉపకరిస్తుంది. ఎసెన్షియల్ ఆయిల్: అదనపు క్రిమినాశక లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. వివిధ రకాల ఫ్లేవర్లలో ఇది తక్కువ ధరకే దొరుకుతుంది. ప్లాంట్స్ నుంచి సేకరించే ఎసెన్సియల్ ఆయిల్ కాస్మొటిక్స్, పర్ఫ్యూమ్స్, పలురకాల ఫుడ్ ప్రొడక్ట్ల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. తయారీ ఇలా: 100 శాతం ఆల్కహాల్ ద్రావకం ఉంటే 140 ఎంల్ ఆల్కహాల్ తీసుకోవాలి. దీనిలో 60 ఎంల్ మినరల్ వాటర్ మిక్స్ చేయాలి. ఇందులో 100 ఎంఎల్ అలోవెరా జెల్ వేసి 8 నుంచి 15 చుక్కలు వేసి మిక్స్ చేయాలి. అంతా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత 300 ఎంఎల్ శానిటైజర్‌ను హ్యాండ్ పంప్ బాటిల్లో వేసుకుని శానిటైజర్‌గా వాడుకోవచ్చు. గమనిక: వంద శాతం మిక్స్ ఉన్న ఆల్కహాల్ ద్రావకంలో 30 నుంచి 40 వరకు మినరల్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. రబ్బింగ్ ఆల్కహాల్ దొరక్కపోతే ఓడ్కా లిక్కర్‌ను ఉపయోగించుకోవచ్చు. బాదం ఆయిల్, బాడీ ఆయిల్‌ను కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే అలోవెరా జెల్‌ను ఉపయోగిస్తే ఎసెన్షియల్ ఆయిల్ అవసరం ఉండదు. ఒకవేళ ఉపయోగించినా నష్టంలేదు. -
ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్లు ఏం చేస్తారో తెలుసా?
-
వైద్యులు ఎన్నిసార్లు చేతులు కడుక్కుంటారో తెలుసా?
‘తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి’ అన్న మాట ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. కేవలం మాటల్లోనే కాకుండా తప్పనిసరిగా పాటిస్తున్నారు కూడా. మరి కరోనా సోకకుండా మనమే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాధిగ్రస్తులను నిరంతరం పర్యవేక్షిస్తూ వారికి చికిత్స అందించే వైద్యుల పరిస్థితి ఏంటి? దీనికి సమాధానంగా ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. వివరాలు.. కరోనా బాధితులను పరీక్షించిన ఓ వైద్యురాలి డ్యూటీ ఆ రోజుకి ముగిసింది. దీంతో తన మెడికల్ సూట్, తదితరాలు తీసేందుకు రెడీ అయింది. తొలుత ఆమె శుభ్రంగా చేతులు కడుక్కుని షూ కవర్స్‌ను తీసేసింది. అనంతరం మళ్లీ చేతులు కడుక్కుని చేతులకున్న గ్లవ్స్‌ను తీసేసింది. ఆ తర్వాత యథాతథంగా చేతులు కడుక్కోవడం.. మెడికల్ గౌన్ జిప్ తీయడం, మళ్లీ హ్యాండ్ వాష్ చేసుకోవడం.. వెంటనే తలకు ధరించిన క్యాప్‌ను తీసేయడం.. ఇలా మొత్తం మీదట ఆమె ఏకంగా 11 సార్లు చేతులు కడుక్కుంది. దీనికి సంబంధించిన వీడియోను చైనాలోని ఓ టీవీ చానల్ ట్విటర్లో షేర్ చేసింది. ఆమె అంకితభావం, నిబద్ధతను మెచ్చిన నెటిజన్లు ఆ డాక్టరమ్మకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నారు. (ఉగ్రవాదులూ..అక్కడికి వెళ్లొద్దు: ఐసిస్) -
టచ్ చేస్తే వైరస్ పారిపోతుంది!
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో చేతులు కడుక్కోవడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఈ విషయాన్ని అరటిపండు వొలిచి నోట్లో పెట్టినంత సులువుగా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చింది ఓ టీచరమ్మ. ప్రతి ఒక్కరికీ హ్యాండ్ వాష్ ఎంత అవసరమో కళ్లకు కట్టినట్లు వివరించింది. ఇంకేముందీ.. అది అక్కడి పిల్లలనే కాదు.. అందరినీ మెప్పించింది. ఇంతకీ ఆ టీచర్ ఏం చేసిందంటే ఓ తెల్లని పాత్రను తీసుకుని అందులో సగం వరకు నీళ్లు పోసింది. దాంట్లో నల్ల మిరియాలు వేసింది. వాటిని వైరస్ అనుకోమని చెప్పింది. అనంతరం ఎవరైనా ఒకరు వచ్చి దాన్ని టచ్ చేయమని కోరగా ఓ విద్యార్థిని వెళ్లి ఆ నీళ్లలో చూపుడు వేలు ఆనించింది. కానీ ఆ వైరస్(మిరియాలు)లో ఎలాంటి చలనం కనిపించదు. (ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు) పైగా కొన్ని వేలికి కూడా అతుక్కున్నాయి. ఈ సారి పక్కనే ఉన్న సబ్బు నీటి పాత్రలో వేలు ఆనించి ఆ తర్వాత తెల్లని పాత్రలో వేలు తడపమంది. సరేనంటూ ఆ చిన్నారి సబ్బు నీటిలో వేలు ముంచి అనంతరం తెల్లని పాత్రలో ఆనించింది. వెంటనే అందులోని వైరస్(మిరియాలు) ఒక్కసారిగా దూరంగా వెళ్లిపోతుంది. వేలికి ఏదీ అంటను కూడా అంటదు. ఇది ఆ పిల్లలను ఎంతో ఆశ్చర్యపరిచింది. చూశారా పిల్లలు.. చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో అంటూ ఉపాధ్యాయిని ఈ ప్రయోగాత్మక పాఠాన్ని ముగిస్తుంది. ఈ వీడియోను లీ ట్రోట్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు తొమ్మిదిన్నర మిలియన్ల మందికి పైగా వీక్షించగా సుమారు 4 లక్షల లైకులు వచ్చాయి. (ఆదివారమూ శాకాహారమే!) -
చేతులు గరుకు బారుతుంటే..?
ఇంటిపనితో వేళ్ల చివర్లు పొడిబారుతున్నాయా? అరచేతులు గరుకు బారుతున్నాయా? అయితే ఇది ఒకరకమైన ఎగ్జిమా లక్షణం. వృత్తిపరంగా వచ్చే అనారోగ్యం. రైటర్స్ క్రాంప్, టెన్నిస్ ఎల్బో వంటిదే ఈ ఎగ్జిమా. దీనిని హౌస్‌వైఫ్స్ ఎగ్జిమా అంటారు. నిజానికి ఈ సమస్య గృహిణులకు మాత్రమే పరిమితం కాదు. ఆహార పరిశ్రమలో పనిచేసే వాళ్లకు, హెయిర్డ్రస్సర్లకు, నర్సులకు కూడా ఎక్కువగా వస్తుంటుంది. పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించే సబ్బులు, క్లీనింగ్ పౌడర్లు, దుస్తులు ఉతకడానికి వాడే వాషింగ్‌పౌడర్, డిటర్జెంట్ సబ్బులలో ఉండే రసాయనాల గాఢత.. ఇవన్నీ చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి గాఢత తక్కువగా ఉన్న వాటిని లేదా సహజసిద్ధమైన క్లీనింగ్ పౌడర్లను వాడడం లేదా పని పూర్తయిన వెంటనే చేతులను శుభ్రంగా తుడుచుకుని కొబ్బరినూనె రాసుకోవడం దీనికి మంచి పరిష్కారం. ఈ పనులు చేసేటప్పుడు గ్లవుజ్‌లు ధరించడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. అలాగే నర్సులకు ఎక్కువ సమయం రబ్బర్ గ్లవుజ్‌లు వాడడం వల్లనే సమస్య వస్తుంటుంది. అలాంటప్పుడు కాటన్ లైనింగ్‌తో తయారైన గ్లవుజ్లను వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. -
కరోనా: హ్యాండ్ శానిటైజర్ ఇలా..
ఏదైనా వస్తువుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగితే దాని ధర కూడా పెరిగిపోతుంది. ఇది మార్కెట్ సూత్రం. కోవిడ్-19 (కరోనా వైరస్) భారత్‌లోనూ విజృంభిస్తున్న నేపథ్యంలో శానిటైజర్స్‌కి గిరాకీ బాగా పెరిగింది. డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు దాని రేట్లు అమాంతం పెంచేస్తున్నారు. కొన్ని మెడికల్ షాపుల్లో అయితే స్టాక్ లేక కంపెనీల నుంచి ఆర్డర్లు పెడుతున్నారు. నిజానికి మార్కెట్లో దొరికే శానిటైజర్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా మనం కూడా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతోనే ఈ శానిటైజర్స్ తయారుచేసుకోవచ్చు. దీనికి కావల్సినవి: 1. రెండు కప్పుల రబ్బింగ్ ఆల్కహాల్ 2. ఒక కప్పు అలోవెరా గుజ్జు 3. పది చుక్కల టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్. తయారీ విధానం రబ్బింగ్ ఆల్కహాల్, కలబంద గుజ్జును బాగా కలపాలి. చివర్లో ఎసెన్షియల్ ఆయిల్‌ను కూడా కలుపుతూ ఓ లిక్విడ్ లాగా అయ్యేంతవరకు బాగా కలపాలి. అంతే హ్యాండ్ శానిటైజర్ సిద్దమైనట్లే. ఆ మిశ్రమాన్ని బాటిళ్లలోకి పోసుకొని వాడుకోవచ్చు. -
చేతిశుభ్రతపై అశ్రద్ధ
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యంపై విద్యార్థులకు ముందుగా చేతిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. దానికి నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఆశించినంతగా ఫలితాలు రావడంలేదు. నిధుల వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టేక్మాల్(మెదక్) : టేక్మాల్ మండలంలో 40 ప్రాథమిక, 7 ఉన్నత, 6 ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉన్నాయి. మొత్తం 4,600 మంది విద్యార్థులన్నారు. ఏ పాఠశాలలో కూడా చేతిశుభ్రత కార్యక్రమం అమలు చేస్తున్న దాఖలాలులేవని స్థానికులు చెబుతున్నారు. విరామ సమయాల్లో విద్యార్థులు ఆటలాడుకుంటారు. అప్పుడు వారి చేతులు అపరిశుభ్రంగా మారతాయి. భోజనం చేసేముందు కొందరు మాత్రమే చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. మిగిలిన వారు శుభ్రం చేసుకునేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. అంతేకాకుండా సబ్బులు, న్యాపికిన్స్ అందుబాటులో ఉంచాలి. ఘనంగా చేతుల శుభ్రత దినం ఏటా సెప్టెంబర్18న చేతుల శుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ర్యాలీలు నిర్వహిస్తుంటారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాలలకు 7 వేల చొప్పున ఇస్తున్నారు. శుభ్రతపై దృష్టిసారించాలి పిల్లలు మట్టిలో ఆడుకుంటారు. ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేతుల్లో చేరుతుంది. అలాంటి చేతులను శుభ్రపరచకుండా భోజనం చేస్తుంటారు. దీంతో వ్యాధుల బారినపడుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పరిశుభ్రత విషయంలో ఉపాధ్యాయులు, అధికారులు దృష్టిసారించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలో నీటి వసతి లేదు తాగునీరు లేకపోవడంతో ఇంటి నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. ఇక్కడ కలుషితనీటిని తాగడంతో అనారోగ్యం పాలవుతున్నాం. చేతులు శుభ్రం చేసుకోవాలంటే సబ్బు ఉండదు. నీటితోపాటు సబ్బులు కూడా అందుబాటులో ఉంచాలి. – సాయిబాబా విద్యార్థి అమలు చేయిస్తాం ప్రతి పాఠశాలలో చేతుల శుభ్రత కార్యక్రమాన్ని విధిగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించాం. సబ్బులు, తువ్వాలు అందుబాటులో ఉంచాలని సూచించాం. ఏవైనా వ్యాధులు వస్తే వైద్యులను సంప్రదించాలన్నాం. – నర్సింలు, ఎంఈఓ -
స్వచ్ఛ అభియాన్..
మార్కెట్లో ఎన్నో హ్యాండ్ వాష్‌లు ఉన్నాయికదా.. అలాంటివాటిల్లో ఇది హైటెక్. దీని పేరు ఐ-వాష్. దీని కింద మనం చేతులు పెడితే.. ఇందులో ఉండే ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు, డిజిటల్ మైక్రోస్కోప్ మన చేతులను పరిశీలిస్తాయి. వెంటనే ఎన్ని క్రిములు ఉన్నాయన్న విషయం పైన ఉండే పారదర్శక తెరపై ప్రత్యక్షమైపోతుంది. హెచ్చరికగా రెడ్‌లైట్ వెలుగుతుంది. మనం చేతులను శుభ్రపరుచుకుంటున్న కొద్దీ.. రెడ్‌లైట్ నెమ్మదిగా గ్రీన్ కలర్లోకి మారుతుంది. బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోగానే.. తెర కూడా మళ్లీ పారదర్శకంగా మారిపోతుంది. ఐ-వాష్ స్వీయ శుభ్రతపట్ల ప్రజలకు మరింత అవగాహనను కల్పిస్తుందని యాంకో డిజైన్.కామ్ తెలిపింది.