ఇంటిపనితో వేళ్ల చివర్లు పొడిబారుతున్నాయా? అరచేతులు గరుకు బారుతున్నాయా? అయితే ఇది ఒకరకమైన ఎగ్జిమా లక్షణం. వృత్తిపరంగా వచ్చే అనారోగ్యం. రైటర్స్ క్రాంప్, టెన్నిస్ ఎల్బో వంటిదే ఈ ఎగ్జిమా. దీనిని హౌస్‌వైఫ్‌స్ ఎగ్జిమా అంటారు. నిజానికి ఈ సమస్య గృహిణులకు మాత్రమే పరిమితం కాదు. ఆహార పరిశ్రమలో పనిచేసే వాళ్లకు, హెయిర్‌డ్రస్సర్‌లకు, నర్సులకు కూడా ఎక్కువగా వస్తుంటుంది.
పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించే సబ్బులు, క్లీనింగ్ పౌడర్‌లు, దుస్తులు ఉతకడానికి వాడే వాషింగ్‌పౌడర్, డిటర్జెంట్ సబ్బులలో ఉండే రసాయనాల గాఢత.. ఇవన్నీ చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి గాఢత తక్కువగా ఉన్న వాటిని లేదా సహజసిద్ధమైన క్లీనింగ్ పౌడర్లను వాడడం లేదా పని పూర్తయిన వెంటనే చేతులను శుభ్రంగా తుడుచుకుని కొబ్బరినూనె రాసుకోవడం దీనికి మంచి పరిష్కారం. ఈ పనులు చేసేటప్పుడు గ్లవుజ్‌లు ధరించడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. అలాగే నర్సులకు ఎక్కువ సమయం రబ్బర్ గ్లవుజ్‌లు వాడడం వల్లనే సమస్య వస్తుంటుంది. అలాంటప్పుడు కాటన్ లైనింగ్‌తో తయారైన గ్లవుజ్‌లను వాడితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment