తిరువనంతపురం: భారతదేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ప్రజలు తమను తాము సురక్షితంగా ఉంచుకునేందుకు వినూత్న పద్ధతులతో ముందుకు వస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజులో 7,8 సార్లు కనీసం 20 సెకన్ల పాటు చేతులు కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఆటో ఎక్కే ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకునేందుకు ఓ ఆటో డ్రైవర్ చేసిన ప్రయోగం ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఆటో ముందు భాగంలో టాప్, హ్యాండ్‌వాష్ ఏర్పాటు చేశాడు సదరు డ్రైవర్. ఆటో ఎక్కే ప్రయాణికులను ముందుగా చేతులు కడుక్కొవాల్సిందిగా కోరుతున్నాడు. మొదట టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయాంక తన ట్విట్టర్‌లో షేర్ చేయడంతో మరోసారి వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు నెటిజనులు.
Comments
Please login to add a commentAdd a comment