Harsh Goenka
-
Harsh Goenka: తేనె-నిమ్మకాయ నీటితో బరువు తగ్గరు..!
బరువు తగ్గించే అద్భుతమైన డ్రింక్స్‌కి సంబంధించి చాల రకలా పానీయాల గురించి విన్నాం. అదీగాక ఇటీవల రోజుకో కొత్తరకం పానీయం గురించి సమాచారం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది కొవ్వుని కాల్చేస్తుంది. దెబ్బకు బరువు మాయం అంటూ ఊదరగొట్టేలా చెప్పేస్తున్నారు కొందరూ. వాటిలో వాస్తవికత ఎంత అనేదాంట్లో స్పష్టత మాత్రం ఉండదు. అచ్చం అలాంటి వాటికి సంబంధించిన ఏళ్లనాటి రెమిడీనే తేనె నిమ్మకాయ నీరు. అమ్మమ్మల కాలం నుంచి ఇది బరువుని మాయం చేసే అద్భుతమైన డ్రింక్ అని చెబుతుండటం విన్నాం. అయితే ఈ డ్రింక్‌పై తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇది బరువు తగ్గడంలో ఏమాత్రం సహాయపడదంటూ మండిపడ్డారు. ఆయన చెప్పినట్లుగా నిజంగానే ఇది బరువుని అదుపులో ఉంచలేదా..?. మరి నిపుణులు ఏం చెబుతున్నారు తదితరాల గురించి తెలుసుకుందాం..!.వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ నిమ్మకాయ తేనె పానీయం(honey-lemon water) వల్ల బరువు తగ్గరంటూ తన అనుభవాన్ని వెల్లడించారు. తాను రెండు నెలలపాటు పరగడుపునే తేనె నిమ్మరసంతో కూడిన గోరువెచ్చని నీటిని తాగేవాడినని. ఇది బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడంతో క్రమతప్పకుండా ఇలా తాగాననని అన్నారు. అయితే అలా ఇప్పటి వరకు రెండు కిలోలు నిమ్మకాయలు, మూడు కిలోలు తేనె తీసుకున్నాను కానీ తన బరువులో ఎట్టి మార్పు కనిపించలేదని వాపోయారు. బహుశా ఈ పదార్థాలన్నీ బరువుని పెంచేవే కాబోలు అంటూ పోస్ట్‌లో వ్యగ్యంగా రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు... అయితే ఇది మార్కెట్ ట్రిక్ అని ఒకరు, ఇది కేవలం శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందే కానీ బరువుని కాదు అని మరొకరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. చెప్పాలంటే పారిశ్రామిక వేత్త లేవెనెత్తిన ప్రశ్న సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మరి దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే..ప్రముఖ డైటీషియన్, సర్టిఫైడ్ డయాబెటిస్ కనిక్క మల్హోత్రా(Kanikka Malhotra) మాత్రం పరగడుపునే దీన్ని తీసుకుంటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియకు సహాయపడుతుందని, హైడ్రేషన్‌ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. అధిక కేలరీల పానీయాలకు బదులుగా ఇలా తేనె-నిమ్మకాయ నీటితో భర్తీ చేయడం వల్ల మొత్తం కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గేందుకు దారితీస్తుంది. అలాగే నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగ్గా ఉండి, కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా ఇది పౌండ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయలోని విటమిన్ సీ, తేనెలోని యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అంతేగాదు ఇది ఆరోగ్యకరమైన జీవక్రియకు మద్దతిస్తుంది. నిమ్మరసం జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. తేనె ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ ప్రేగు పనితీరుకి మద్దతిస్తుంది. అదీగాక మలబద్ధకాన్ని నివారించి పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో అందరూ ఉపయోగించే సాధారణ పద్ధతి, పైగా పరగడుపునే ఇలా తీసుకోవడం అనేది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచి, శక్తి స్థాయిలను పెంచేందుకు ఉపయోగపడుతుంది. నిజానికి బరువు తగ్గడానికి అద్భుత పరిష్కారం కాన్పటికీ ఇది సమతుల్య ఆహారంలా ఉపయోగపడుతుంది. వ్యాయామ దినచర్య లేనివారికి అద్భతమైన డ్రింక్‌లా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ బరువు తగ్గడం అనేది మొత్తం ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. ఇందులో ఉపయోగించే తేనె రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి అధిక బరువుని నియంత్రిస్తుంది. అలాగే ఉపవాస సమయంలో దీన్ని తీసుకుంటే శరీర బరువు తోపాటు శరీరం బీఎంఐని కూడా తగ్గిస్తుందని మల్హోత్రా నొక్కి చెప్పారు. అలాగే బరువు తగ్గడం అనేది శక్తి సమతుల్యతకు సంబంధించినది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు ఈ పానీయాలపై ఆధారపడటానికి బదులు తీసుకునే డైట్‌పై ఫోకస్ పెట్టండి అప్పుడే ఈ డ్రింక్ బరువు తగ్గించడంలో హెల్ఫ్ అవుతుందని చెప్పారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..హైడ్రేటెడ్‌గా ఉండే యత్నం చేస్తే చక్కటి ఫలితం పొందగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: అమ్మ 'చక్కెర' బిడ్డకూ చేదు..!) -
బాసులు లేని వర్క్ కల్చర్
వారంలో 90 గంటలు పని చేయాలంటు ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యయన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విధానాన్ని వ్యతిరేకించిన ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా డెన్మార్క్ వర్క్ కల్చర్‌ను అవలంబించడం ద్వారా భారత్ ప్రయోజనం పొందే అవకాశం ఉందని సూచించారు.‘డెన్మార్క్‌లో ఉద్యోగులు మైక్రో మేనేజ్మెంట్(కింది స్థాయి బాసులు) లేకుండా స్వతంత్రంగా పనిచేస్తారు. వీరు సంవత్సరానికి కనీసం ఐదు వారాల సెలవు, ఆరు నెలల పేరెంటల్ లీవ్ అనుభవించే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన పని గంటలు ఎంచుకోవచ్చు. దాంతో వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరూ ఉద్యోగాలను వీడకుండా స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడి ఉద్యోగులు అనుభవించే సౌకర్యాలు, స్వయంప్రతిపత్తి కారణంగా చాలా మంది పనిని కొనసాగిస్తారు. కంపెనీ యజమానులు మానసిక ఆరోగ్యానికి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు విలువ ఇస్తారు. వ్యక్తిగత ఆకాంక్ష కంటే సామూహిక శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తారు’ అని చెప్పారు.అసలేం జరిగిందంటే..ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.Why the people in Denmark are happiest about their work practices:- Employees are trusted to work independently without micromanagement- Minimum five weeks of vacation and six months of parental leave- Flexible hours allow time for family and personal life- Job loss is…— Harsh Goenka (@hvgoenka) January 16, 2025వినాశనానికి దారితీస్తుందంటూ ఇప్పటికే స్పందనసుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) గతంలో స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్-డ్యూటీ అని.. ‘డే ఆఫ్’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. -
‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’
పని గంటలపై ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వారానికి 90 గంటలు పని చేయడంతోపాటు, ఆదివారం సెలవునూ వదిలేయాలని సుబ్రహ్మణ్యన్ ఇటీవల ఓ వీడియో ఇంటెరాక్షన్‌లో తన ఉద్యోగులతో అన్నారు. దీనినై ప్రముఖులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా, సినీ నటి దీపికా పదుకొణె సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై కామెంట్ చేశారు.అసలేం జరిగిందంటే..ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.వినాశనానికి దారితీస్తుంది..సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్-డ్యూటీ అని.. ‘డే ఆఫ్’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.90 hours a week? Why not rename Sunday to ‘Sun-duty’ and make ‘day off’ a mythical concept! Working hard and smart is what I believe in, but turning life into a perpetual office shift? That’s a recipe for burnout, not success. Work-life balance isn’t optional, it’s essential.… pic.twitter.com/P5MwlWjfrk— Harsh Goenka (@hvgoenka) January 9, 2025ఇదీ చదవండి: నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యతమెంటల్ హెల్త్ ముఖ్యం..వారానికి 90 గంటలు పని చేయాలని సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి దీపికా పదుకొణె(deepika padukone) స్పందించారు. సుబ్రహ్మణ్యన్ను ఉద్దేశించి ‘అతను చాలా గౌరవం, అధికారంలో ఉన్న వ్యక్తి. అంత ఉన్నత స్థానంలో వ్యక్తులు ఇలాంటి కామెంట్లు చేయడంతో షాకింగ్‌గా అనిపించింది’ అని కామెంట్ చేశారు. తన కామెంట్ చివర ‘మెంటల్ హెల్త్ మేటర్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉంచారు. ఈ వ్యవహారంపై కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి’ అని తెలిపింది. ఇలా కంపెనీ స్పష్టత ఇచ్చిన దానిపై దీపిక పదుకొణె స్పందిస్తూ ‘ఇలా ఈ అంశంపై రిప్లై ఇచ్చి మరింత దిగజారారు’ అని అన్నారు. -
నీ కష్టం పగోడికి క్కూడా రాకూడదు మచ్చా... వైరల్ వీడియో
సాధారణంగా పెళ్లి కాని ప్రసాదులు ఏం చేస్తారు? పెళ్లిళ్ల పేరయ్యలనో, పెళ్లిళ్లు కుదిర్చే వెబ్‌సైట్లనో ఆశ్రయిస్తారు. అదీ కాదంటే స్నేహితుల ద్వారానో తనకు కావాల్సిన అమ్మాయిని వెతుక్కుంటారు. కానీ ఒక యువకుడు వెరైటీగా ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. స్టోరీ ఏంటంటే... రైళ్లలో చాయ్, సమోసాలు, పల్లీలు వగైరాలు అమ్ముకోవడం చూస్తాం.కానీ ఒక మెట్రో ట్రైన్లో ఉన్నట్టుండి ఒక యువకుడు గట్టి, గట్టిగా అరుస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తీరా అతను మాట్లాడుతున్నదేంటో అర్థమై పగలబడి నవ్వేశారు. అంతేకాదు అమ్మాయిలు కూడా ముసి ముసినవ్వులు కోవడం ఈ వీడియోలో చూడొచ్చు. "మీ రోజుకి అంతరాయం కలిగించినందుకు క్షమించండి. నేను డ్రగ్స్ వాడను నాకు పిల్లలు లేరు. కానీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఐ లవ్ అమెరికా, ప్లీజ్ నన్ను వరైనా నన్ను వివాహం చేసుకోండి. తద్వారా అమెరికాలో ఉండగలను. నాకు మంచి వంట వచ్చు. మంచిగా మాలిష్ చేయడం వచ్చు. డిస్కో సంగీతం వింటాను’’ ఇలా సాగుతుండి అతగాడి అభ్యర్థన. ‘‘నాకు మీ డబ్బు అవసరం లేదు, నా డబ్బు కూడా మీకే ఇస్తాను. మంచి బట్టలు, బూట్లు కొనుగోలు చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చేశాడు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో.. ఆడా, మగా ఎవరైనా, నాకు ఆఫర్ చేయడానికి సమాన అవకాశాలు’’ అనడంతో అక్కడున్నవారంతా గొల్లుమన్నారు. దీంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు.‘‘హిల్లేరియస్, ఇతగాడు మంచి సేల్స్ మేన్, తనను తాను అమ్మేసుకుంటున్నాడు’’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. వీళ్లను చూసి ‘‘మీకు భలే హ్యాపీగా ఉండాది గదా’’ అని పుష్ప స్టైల్లో ఉడుక్కుంటున్నారట పెళ్లి కాని ప్రసాదులు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గెయెంకా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియో ప్రామాణికత, మూలంపై స్పష్టత లేదు. యూఎస్ లో పరిస్థితి ఇదీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. In trains in India, people sell chai, toys, combs, samosa, etc. But in USA ??? Watch & enjoy ................. ! 😄😜😃 pic.twitter.com/dfXcEOEbOh— Harsh Goenka (@hvgoenka) December 12, 2024 -
అతడు టాక్సిక్ బాస్.. ‘పంత్‌తో రాహుల్ ముచ్చట’? హర్ష్ గోయెంకా స్పందన వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు అనుకున్నంత ధర దక్కలేదు. భారీ అంచనాల నడుమ ఆక్షన్‌లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ కోసం ఏ ఫ్రాంఛైజీ కూడా మరీ అంతగా ఎగబడిపోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో రాహుల్ తన పేరును నమోదు చేసుకున్నాడు.అయితే, లోకల్ బాయ్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలుత బిడ్ వేయగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా పోటీకి వచ్చింది. కానీ ధర కాస్త పెరగగానే ఈ రెండూ తప్పుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రాహుల్ కోసం పోటీపడ్డాయి. అలా ఆఖరికి రాహుల్‌ను ఢిల్లీ రూ. 14 కోట్లకు దక్కించుకుంది.కాగా కేఎల్ రాహుల్ ఐపీఎల్-2022- 2024 వరకు లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. లక్నో ఫ్రాంఛైజీని అరంగేట్రంలో(2022)నే ప్లే ఆఫ్స్ చేర్చి సత్తా చాటాడు. మరుసటి ఏడాది కూడా టాప్-4లో నిలిపాడు. కానీ.. ఐపీఎల్-2024లో మాత్రం లక్నోకు వరుస పరాభవాలు ఎదురయ్యాయి.రాహుల్‌పై గోయెంకా ఆగ్రహంసీజన్ మొత్తంలో ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఏడు మాత్రమే గెలిచిన లక్నో.. 14 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఆ ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా.. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశాడు.స్వేచ్ఛ ఉన్న చోటే ఆడాలనిఅందరి ముందే రాహుల్‌ను గోయెంకా తిట్టినట్లుగా ఉన్న దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిటెన్షన్‌కు ముందు రాహుల్- లక్నోల బంధం తెగిపోయింది. ఈ విషయంపై రాహుల్ స్పందిస్తూ.. స్వేచ్ఛ ఉన్న చోట ఆడాలని అనుకుంటున్నట్లు పరోక్షంగా గోయెంకా వైపు మాటల బాణాలు విసిరాడు.ఈ నేపథ్యంలో మెగా వేలం సందర్భంగా సంజీవ్ గోయోంకా సైతం కేఎల్ రాహుల్‌కు కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. కాగా సౌదీ అరేబియాలో జరిగిన ఆక్షన్‌లో లక్నో.. టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కోసం రూ. 27 కోట్లు వెచ్చించింది. ఈ విషయం గురించి గోయెంకా మాట్లాడుతూ.. ‘‘మాకు కావాల్సిన ఆటగాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ పంత్‌లో ఉన్నాయి. అందుకే అతడి కోసం మేము ముందే రూ. 25- 27 కోట్లు పక్కన పెట్టుకున్నాం’’ అని పేర్కొన్నాడు.ఏదేమైనా వేలం ముగిసే సరికి పంత్, రాహుల్‌ల జట్లు తారమారయ్యాయి. రాహుల్ స్థానంలో లక్నో కెప్టెన్‌గా పంత్, పంత్ ప్లేస్‌లో ఢిల్లీ సారథిగా రాహుల్ వ్యవహరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ వీళ్లిద్దరి ఫొటోతో ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అన్నీ బాగానే ఉంటాయి.. కానీరాహుల్ పంత్ చెవిలో ముచ్చటిస్తున్నట్లుగా ఉన్న ఫొటోకు.. ‘‘చూడు భాయ్.. కంపెనీ మంచిది.. డబ్బు కూడా బాగానే ఇస్తారు.. కానీ బాస్ మాత్రం విషపూరితమైన మనసున్న వ్యక్తి’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు ప్రముఖ వ్యాపారవేత్త, సంజీవ్ గోయెంకా అన్న హర్ష్ గోయెంకా స్పందించారు. ఇదేమిటబ్బా అన్నట్లుగా ఉన్న ఎమోజీని ఆయన జతచేశారు.చదవండి: IPL 2025 Mega Auction: మెగా వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..! -
హర్ష్ గోయెంకా ఓలా స్కూటర్‌ను ఎలా వాడుతారో తెలుసా..?
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్‌ను అందులో ట్యాగ్ చేశారు. ఇటీవల కమెడియన్ కునాల్ కమ్రా, భవిష్ అగర్వాల్ మధ్య ఆన్లైన్ వేదికగా జరిగిన మాటల యుద్ధంతో ఈ ఓలా వ్యవహారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది.హర్ష్ గోయెంకా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓలా ఎలక్ట్రిక్‌పై స్పందిస్తూ ‘తక్కువ దూరంలోని గమ్యాలు చేరాలంటే నేను ఓలా స్కూటర్ వినియోగిస్తాను. ఒక ‘కమ్రా’(ఇంటి గది) నుంచి మరో ఇంటి గదికి వెళ్లాలనుకుంటే ఓలా స్కూటర్ వాడుతాను’ అన్నారు. తన ట్విట్లో కునాల్ కమ్రా పేరుతో అర్థం వచ్చేలా ప్రస్తావించారు.If I have to travel close distances, I mean from one ‘kamra’ to another, I use my Ola @bhash pic.twitter.com/wujahVCzR1— Harsh Goenka (@hvgoenka) October 8, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.ఇదీ చదవండి: అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదుఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) ఇటీవల షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. సర్వీసు లోపాలు, నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య పద్ధతులను అనుసరించడం, వినియోగదారు హక్కుల ఉల్లంఘన వంటి చర్యలకు పాల్పడుతుందని సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కంపెనీ స్కూటర్లకు సంబంధించి నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన వివిధ సమస్యలు, అంశాలపై లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి సీసీపీఏ 15 రోజుల గడువు ఇచ్చింది. -
అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..
ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ 'హర్ష్ గోయెంకా' తన ఎక్స్ ఖాతాలో 'ముఖేష్ అంబానీ' నుంచి మూడు విషయాలను నేర్చుకున్నట్లు వెల్లడించారు. అంబానీతో జరిగిన పరస్పర చర్యల ద్వారా నేర్చుకున్న విషయాలు విజయానికి దోహదపడతాయని పేర్కొన్నారు.మూడు విషయాలుపెద్ద కల - ఏదైనా సాధించాలంటే ముందుగా దాని గురించి కలలు కనండి. దాన్ని సహకారం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ''లక్ష్యంపై దృష్టి పెడితే అన్ని అడ్డంకులను అధిగమిస్తారు, అడ్డంకులను దృష్టిలో ఉంచుకుంటే, మీరు మీ లక్ష్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు'' అని అంబానీ అన్నారు.శ్రమకు ప్రత్యామ్నాయం లేదు - లక్ష్యాన్ని చేరుకోవాలంటే.. ఎప్పుడూ కష్టపడుతూనే ఉండాలి. శ్రమకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. మీరు ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలని కోరుకోవాలి. భారతదేశంలో మాత్రమే గొప్పవాళ్లుగా గుర్తించబడితే సరిపోదు.. ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాళ్ళుగా ఎదగాలి. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది.సానుకూలంగా ఉండటం ముఖ్యం - జీవితంలో విజయం సాధించాలంటే సానుకూలత చాలా ముఖ్యం. విజయాన్ని సాధించడానికి ఆత్మవిశ్వాసంతో పాటు తనపై నమ్మకం కూడా ఉండాలి. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ఓర్పుగా ఆలోచించాలి.ఇదీ చదవండి: పెరిగిన ఇళ్ల అమ్మకాలు.. ఈ ఎనిమిది పట్టణాలే టాప్భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఆసియాలోని అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వ్యాపార ప్రపంచంలో విజయం సాధించడానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో 14వ స్థానంలో ఉన్న అంబానీ నికర విలువ 105 బిలియన్ డాలర్లు.I have always learnt so much from my interactions with Mukesh Ambani. Let me share three of his life learnings with you’ll. pic.twitter.com/5p2zR1vWMj— Harsh Goenka (@hvgoenka) October 5, 2024 -
EY సంస్థకో దణ్ణం..రూ.కోటి జీతంతో చేరిన రెండో రోజే గుండెలో నొప్పిగా ఉందంటూ
ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంతో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా (ఈవై)సంస్థలో పని వాతావరణంపై చర్చ కొనసాగుతుంది. ఆ సంస్థ మాజీ ఉద్యోగులు సైతం వర్క్ కల్చర్‌పై తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కోటి రూపాయల వేతనంతో చేరిన రెండో రోజే ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. అయినా ఆ వర్క్ కల్చర్‌పై ప్రశంసలు కురిపిస్తూ అష్నీర్ గ్రోవర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోని సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయోంకా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణం సంస్థల్లో పని భారం వల్లేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై హర్ష్ గోయోంకా స్పందిస్తూ.. అష్నీర్ గ్రోవర్ మాట్లాడిన వీడియోని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోలో అష్నీర్ గ్రోవర్ మాట్లాడుతూ.. తాను రూ. కోటి వేతనంతో యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరిన తొలిరోజే బయటకు వచ్చిన నిర్ణయాన్ని వెల్లడించారు.It’s baffling to see anyone advocate for a toxic environment. #AnnaPerayil Your views? pic.twitter.com/QhPnCeKhxq— Harsh Goenka (@hvgoenka) September 19, 2024చేరిన మొదటి రోజు ఆఫీసు మొత్తం కలియతిరిగాను. చుట్టూ చూశాను. అక్కడి వాతావారణం నాకు నచ్చలేదు. వెంటనే ఎదో ఒక్కటి చెప్పాలని.. నాకు గుండె నొప్పి వస్తుందని చెప్పి నటించాను.’ అని అన్నారు. కార్యాలయ వాతావరణం ఎలా ఉంటుందో వివరిస్తూ ఇలాంటి పని వాతావరణంతో ఉద్యోగులు ప్రాణాలు పోవడమేనని అర్ధం వచ్చేలా వ్యాఖ్యానించారు. అంతే కాదు.. ఒక కంపెనీలో వర్క్ గురించి చెడుగా చెబుతున్నారంటే అది మంచిదని అర్థం అని అష్నీర్ గ్రోవర్ అన్నారు. విషపూరితమైన పని వాతావరణాన్ని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేసిన అష్నీర్పై గోయెంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. విషపూరిత వాతావరణం గురించి ఇలా పాజిటీవ్‌గా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశారు. ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి : ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని కంపెనీపై విమర్శలు -
ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్
నెట్టింట యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వుతోంది. అందులో విదేశాల్లోని రెస్టారెంట్లో మన దక్షిణభారతదేశ బ్రేక్‌ఫాస్ట్‌ల పేర్లు, ధరలు గురించి షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్‌లో.. తాను అమెరికాలోని ఓ రెస్టారెంట్ మన దక్షిణ భారతదేశ అల్పహారాలకు ఫ్యాన్సీ పేర్లు పెట్టి మరీ అమ్మేయడం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. వాటి ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం అన్నారు. నిజంగా ఆ పేర్లు వింటే గనుక ఖానే కా మజా ఖతం(ఇలాంటి పేర్లతో తింటే..తినడంలో ఉండే ఆనందం పోతుంది) అని క్యాప్షన్ జోడించి మరీ సదరు రెస్టారెంట్ మెనుని కూడా జత చేసి మరీ పోస్ట్ చేశారు. అందులో మన దక్షిణ భారతదేశపు అల్పాహారాల పేర్లుకు ఆ మెనులో ఉన్న ఫ్యానీ పేర్లు వరుసగా..వడకి "డంక్డ్ డోనట్ డిలైట్", ఇడ్డీకి "డంక్డ్ రైస్ కేక్ డిలైట్", దోసకి "నేక్డ్ క్రేప్" ఫ్యాన్సీ పేర్లు పెట్టి విక్రయించేస్తున్నారు. ఇక వాటి ధరలు చూస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. ప్లేట్ దోసె ధర రూ. 1400/-, ఇడ్లీ సాంబార్ ధర రూ. 1300/-, వడ ధర రూ.1400/-గా మెనులో ధరలు ఉండటం విశేషం. ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. బహుశా వాళ్లు ఈ వంటకాలు తయారు చేయడానికి ఎంతమంది పనివాళ్లను పెట్టుకున్నారో అందుకే కాబోలు చుక్కలు చూపించేలా ఈ ధరలు అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. Who knew vada, idli, and dosa could sound so fancy? With these strange names khaane ka mazaa khatam! Agree 😂? pic.twitter.com/Px94gQGUAd— Harsh Goenka (@hvgoenka) July 2, 2024 (చదవండి: 'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం చేసిన ఆ పర్యటనే..) -
అందమైన అమ్మాయ్ అయితే ? అది ట్రాప్ బ్రో! అదిరిపోయే వీడియో
కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం అనేక రకాల వాణిజ్య ప్రకటనలను తయారుచేస్తాయి. భారీ ప్రకటనలతో చెప్పలేని కీలక అంశాలను ఒక చిన్న యాడ్ ద్వారా క్రియేటివ్‌గా చెబుతూ ఉంటాయి. క్రియేటివ్ ప్రమోషన్స్‌తో తమ ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి చెబుతూ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అలాంటి యాడ్ ఒకటి ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ కార్ల కంపెనీ టయోటాకు సంబంధించిన ఒక యాడ్‌ను పారిశ్రామిక వేత్త హర్షగోయెంకా ట్వీట్ చేశారు. ఈ యాడ్ వీడియో ప్రకారం.. కారు బ్రేక్ డౌన్ కావడంతో ఒక అందమైన యువతి వెనుక వస్తున్న యువకులను లిఫ్ట్ అడుగుతుంది. అమ్మాయిని చూసినా కానీ అతను కారు ఆపడు. అయితే కవ్వించే లుక్స్‌తో ఉన్న ఆ అమ్మాయిని చూసి కూడా కారు ఆపకపోవడంతో కారులో ఉన్న మరో వ్యక్తి అదోలాగా చూస్తాడు.. దీంతో ఇది ట్రాప్ బ్రో.. ఎపుడైనా టయోటా కరోలా కారు బ్రేక్ డౌన్ అవడం చూశామా? అంటూ ముందుకు పోతాడు. ఎండింగ్ మాత్రం మీరు చూసి థ్రిల్ అవ్వాల్సిందే.. ప్రత్యర్థులను పల్లెత్తు మాట అనకుండానే.. తమ టయోటా కరోలా స్టామినా, నాణ్యత ఎలాంటిదో చెప్పిన తీరు విశేషంగా నిలిచింది. Nice ad… pic.twitter.com/cMyGuAIotj — Harsh Goenka (@hvgoenka) April 2, 2024 -
మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!
హోటల్స్, రెస్టారెంట్లలో వాటి రేంజ్‌ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్ సర్వింగ్ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్‌లా ఉండే లగ్జరీయస్ హోటల్స్‌లో సర్వింగ్ విధానమే ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియోలో గాల్వియర్ మహారాజ్ ప్యాలెస్‌లో ఆహారం సర్వింగ్ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్‌లో బోజనం వడ్డించే పద్ధతి చాలా వెరైటీగా ఉంది. ఓ పెద్ద టేబుల్‌పై ట్రైయిన్ టాయ్‌లా ఉండే పట్టాల మధ్యలో వివిధరకాల పదార్థాల పాత్రాలను చక్కగా ఉంచారు. మరోవైపు ఆ పట్టాలపై నడుస్తున్న ట్రైయిన్ టాయ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.ఆ ట్రైయిన్ బోగిలపై గాల్వియర్ మహారాజ్ సింథియా పేరుకి సంబంధించినఅక్షరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ట్రైయిన్ టాయ్ పట్టాల మధ్య ఉన్న ఒక్కో ఆహార పదార్థం వద్దకు చకచక వస్తుంటుంది. అందుకు సంబంధించిన వీడియోకి "మహారాజ్ ప్యాలెస్‌లో ఆహారం ఎలా వడ్డిస్తారు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట షేర్ చేశారు హర్ష్ గోయెంకా. మీరు కూడా ఓ లుక్కేయండి.How food is served at Maharaja of Gwalior’s palace! pic.twitter.com/AGaYkj6PyG— Harsh Goenka (@hvgoenka) March 31, 2024 -
మహారాజ్ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!
హోటల్స్, రెస్టారెంట్లలో వాటి రేంజ్‌ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్ సర్వింగ్ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్‌లా ఉండే లగ్జరీయస్ హోటల్స్‌లో సర్వింగ్ విధానమే ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు. ఆ వీడియోలో గాల్వియర్ మహారాజ్ ప్యాలెస్‌లో ఆహారం సర్వింగ్ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్‌లో బోజనం వడ్డించే పద్ధతి చాలా వెరైటీగా ఉంది. ఓ పెద్ద టేబుల్‌పై ట్రైయిన్ టాయ్‌లా ఉండే పట్టాల మధ్యలో వివిధరకాల పదార్థాల పాత్రాలను చక్కగా ఉంచారు. మరోవైపు ఆ పట్టాలపై నడుస్తున్న ట్రైయిన్ టాయ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆ ట్రైయిన్ బోగిలపై గాల్వియర్ మహారాజ్ సింథియా పేరుకి సంబంధించినఅక్షరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ట్రైయిన్ టాయ్ పట్టాల మధ్య ఉన్న ఒక్కో ఆహార పదార్థం వద్దకు చకచక వస్తుంటుంది. అందుకు సంబంధించిన వీడియోకి "మహారాజ్ ప్యాలెస్‌లో ఆహారం ఎలా వడ్డిస్తారు" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ నెట్టింట షేర్ చేశారు హర్ష్ గోయెంకా. మీరు కూడా ఓ లుక్కేయండి. How food is served at Maharaja of Gwalior’s palace! pic.twitter.com/AGaYkj6PyG — Harsh Goenka (@hvgoenka) March 31, 2024 (చదవండి: డబ్బావాలా మాదిరి టిఫిన్ సెంటర్‌తో.. ఏకంగా 21 కోట్లు..!) -
Virat Kohli: లండన్‌లోనే ఆ బిడ్డ జననం.. మీకు ఆ హక్కు లేదు!
Virat Kohli- Anushka Sharma To Be Born 2nd Child Rumours: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల గురించి నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంక చేసిన పోస్ట్ ఇందుకు కారణం. కాగా విరుష్క జోడీ రెండో సంతానం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. అనుష్క గర్భవతి అంటూ ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తికమక పెట్టిన డివిలియర్స్ ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కోహ్లి వ్యక్తిగత కారణాల వల్ల దూరం కావడం.. ఈ వార్తలకు మరింత బలం ఇచ్చింది. అదే విధంగా.. సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్, కోహ్లి స్నేహితుడు ఏబీ డివిలియర్స్ సైతం విరుష్క రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని తన యూట్యూబ్ చానెల్లో వెల్లడించాడు. అయితే, వెంటనే మాట మార్చి తాను తప్పుడు సమాచార వ్యాప్తికి కారణమయ్యానంటూ కోహ్లి- అనుష్కలను క్షమాపణలు కోరాడు. ఈ క్రమంలో.. డివిలియర్స్ తొలుత చెప్పిందే నిజమని.. అయితే, అనుష్క శర్మ ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు ఉన్న కారణంగానే అతడు ఈ మేరకు ప్రకటన చేశాడని ఓ నెటిజన్ చేసిన కామెంట్ వైరల్ అయింది. దీంతో.. విరుష్క అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అనుష్క ఆరోగ్యం బాగుండాలని తాము కోరుకుంటున్నామంటూ పోస్టులు పెట్టారు. తాజాగా హర్ష్ గోయెంక పరోక్షంగా కోహ్లి- అనుష్కల రెండో సంతానం గురించి కామెంట్ చేశారు. ఆ బిడ్డ క్రికెటర్ లేదంటే సినిమా స్టార్ ‘‘మరికొన్ని రోజుల్లో ఓ బిడ్డ ఈ ప్రపంచంలోకి రానుంది! ఆ బేబీ తన తండ్రిలాగే క్రికెట్లో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందో.. లేదంటే.. తన తల్లిలా సినిమా స్టార్ అవుతుందో?!’’ అని గోయెంక ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఇందుకు #MadeInIndia #ToBeBornInLondon అనే హ్యాష్‌ట్యాగ్‌లు జతచేశారు. మీకు ఆ హక్కు లేదు.. చెత్తగా మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రసవం కోసం విరాట్ అనుష్కను లండన్ తీసుకువెళ్లాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం హర్ష్ గోయెంక తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలోకి రాకముందే.. క్రికెటర్ లేదంటే ఫిల్మ్ స్టార్ అంటూ భారం మోపడం సరికాదు. పుట్టబోయే ఏ బిడ్డకైనా తమకు నచ్చిన రంగం ఎంచుకోవడం, నచ్చిన పని చేయడం వారి హక్కు. దాన్ని కాలరాసేలా మీరు మాట్లాడుతున్నారు. అయినా.. ఇండియాలో తయారై.. లండన్‌లో అంటూ ఆ హ్యాష్ ట్యాగ్ ఏమిటి? మరీ చెత్తగా ఉంది’’ అని మండిపడుతున్నారు. కాగా క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లి- అనుష్క శర్మను 2017లో పెళ్లి చేసుకున్నాడు. ఈ సెలబ్రిటీ జంటకు 2021లో కుమార్తె వామిక జన్మించింది. ఇక రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పలికేందుకు వీరు సిద్ధమవుతున్నారనే వార్తలపై విరుష్క అధికారికంగా స్పందిస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదు. చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై A new baby is to be born in the next few days! Hope the baby takes India to great heights like the greatest cricketing father. Or will it follow the mother and be a film star? #MadeInIndia #ToBeBornInLondon — Harsh Goenka (@hvgoenka) February 13, 2024 -
'అది కోట్ల ఆశల విజయం'.. దిగ్గజ వ్యాపారవేత్తల స్పందన
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ గ్రూప్‌నకు చెందిన హర్ష్ గోయెంకా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా మంగళవారం ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ఆపరేషన్ విజయవంతం కావడంతో స్పందించారు. ఉత్తరాఖండ్‌లో 17 రోజుల తర్వాత 41 మంది కార్మికులను సురక్షితంగా రక్షించడంతో ఆపరేషన్ పూర్తయింది. నవంబర్ 12న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో కార్మికులు 17 రోజుల పాటు అందులోనే చిక్కుకుపోయారు. దాంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. చివరకు మంగళవారం అందరినీ విజయవంతంగా బయటకుతీశారు. దాంతో దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు రెస్క్యూ సిబ్బంది, కార్మికులకు అభినందనలు తెలిపారు. రెస్క్యూ వర్కర్లకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన ఎక్స్ ఖాతా ద్వారా సెల్యూట్ చేశారు. ఈ పోరాటంలో కోట్లాది మంది దేశప్రజల ఆశ ఫలించిందని ఆయన అన్నారు. 17 రోజుల పాటు ధైర్యం కోల్పోకుండా తిరిగి వచ్చిన 41 మంది కార్మికుల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో సహా ఈ రెస్క్యూ మిషన్‌లో భాగంమైన అందరికీ అభినందనలు చెప్పారు. దేశ ప్రగతికి బాటలు వేసే ఈ కార్మిక సోదరులందరికీ మెరుగైన ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. जीवन और मृत्यु के मैराथन संघर्ष के बीच यह करोड़ों देशवासियों के ‘उम्मीद’ की जीत है। 17 दिन तक एक सुरंग से बिना हिम्मत हारे वापिस लौटने वाले सभी 41 श्रमिकों के आत्मबल को मेरा प्रणाम। NDRF और SDRF की टीमों समेत इस रेस्क्यू मिशन को सफल बनाने वाले हर एक सदस्य को साधुवाद। हम देश की… — Gautam Adani (@gautam_adani) November 28, 2023 మహీంద్రా గ్రూప్ ఛైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా ఈ సంఘటనపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ విజయవంతం కావడంలో 'రాథోల్ మైనర్ల' పాత్రను ప్రశంసించారు. అధునాతన డ్రిల్లింగ్ పరికరాల తర్వాత, వీరు కీలకంగా మారి చివరి నిమిషంలో కార్మికులను కాపాడారని కొనియాడారు. ఆస్ట్రేలియాకు చెందిన భూగర్భ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ రెస్క్యూ పరిస్థితిని వివరించినందుకు అభినందనలు తెలిపారు. And after all the sophisticated drilling equipment, it’s the humble ‘rathole miners’ who make the vital breakthrough! It’s a heartwarming reminder that at the end of the day, heroism is most often a case of individual effort & sacrifice. 🙏🏽👏🏽👏🏽👏🏽🇮🇳 #UttarakhandTunnelRescue pic.twitter.com/qPBmqc2EiL — anand mahindra (@anandmahindra) November 28, 2023 ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా 41 మంది ప్రాణాలను కాపాడటంలో శ్రమించినందుకు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఇండియాకు వ్యతిరేకంగా రన్నులు కొట్టారన్నారు. కానీ అదే దేశానికి చెందిన డిక్స్ మాత్రం ఇండియాలోని 41 మంది కార్మికులను కాపాడేందుకు శ్రమించారని తెలిపారు. #Maxwell digs a hole against India #INDvsAUS But hey, an Aussie led a different kind of dig saving 41 lives! 💪 My gratitude to NDRF , SDRF, Army, our rat miners and all those involved in this incredible rescue mission. 🇮🇳🇮🇳 #UttarakhandTunnelRescue — Harsh Goenka (@hvgoenka) November 28, 2023 బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా రెస్క్యూ వర్కర్లను ప్రశంసించారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డానికి వీరోచితంగా పోరాడిని సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందన్నారు. Uttarkashi Tunnel Rescue Operation Live Updates: All Workers Rescued Safely - Heroic and outstanding sense of duty displayed by rescuers. Enduring resilience displayed by those rescued. Makes our nation proud🙏🙏👏👏👏 https://t.co/q2vqmUTRsG — Kiran Mazumdar-Shaw (@kiranshaw) November 28, 2023 -
ధనవంతులకు ఫ్రీ పాస్లా..! : హర్ష్ గొయెంకా
న్యూఢిల్లీ: దేశమంతా వరల్డ్ కప్ ఫైనల్ సందడి నడుస్తోంది. సోషల్ మీడియా మొత్తం భారత్-ఆసీస్ మ్యాచ్ ఫీవరే కనిపిస్తోంది. ఈ ఫీవర్ పరిస్థితుల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ట్వీట్‌ను నెటిజన్లు ఆయనకే బూమరాంగ్ చేసి రివర్స్ ప్రశ్నలేశారు. ఇంతకీ హర్ష్ గొయెంకా ఏమని ట్వీట్ చేశారంటే ‘ ప్రముఖ వ్యాపారస్తులైన నా స్నేహితులెవరూ డబ్బులు చెల్లించి ఫైనల్ మ్యాచ్ టికెట్లు కొనలేదు. వాళ్లందరూ ఫ్రీ పాస్‌లు తీసుకున్నారు. ఇక్కడ బాధేంటంటే ధనవంతులు డబ్బు చెల్లించడానికి ఇష్టపడకపోవడమే’ అని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఆయన ఫాలోవర్ ఒకతను ‘మరి మీ పరిస్థితేంటి సార్? టికెటా..పాసా..?’ అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన హర్ష్ గొయెంకా ఏదీకాదని సమాధానమిచ్చారు. అహ్మదాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఒక్కోటి రూ. 2 లక్షల దాకా ప్రముఖ రీసెల్లింగ్ ప్లాట్‌ఫాంలో అమ్ముడవుతున్నాయి. ఈ ప్లాట్‌ఫాంలో టికెట్ స్టార్టింగ్ ధర 32వేలుండడం విశేషం. భారత్, ఆసీస్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. None of my businessmen friends have paid to get tickets for the #WorldcupFinal, they have all managed to get a ‘pass’. And that’s where the irony lies- it’s the rich who don’t want to pay! — Harsh Goenka (@hvgoenka) November 18, 2023 How about you, Sir? Ticket or Pass. — Anand Singh (@Anands_page) November 18, 2023 ఇదీచదవండి...‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ -
భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, ఉచితంగా మ్యాచ్ టికెట్లు!
మరికొద్ది సేపట్లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ హర్ష్ గోయెంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ పోస్ట్‌పై ఓ వర్గానికి చెందిన క్రికెట్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంతకి ఆ పోస్ట్‌లో ఏముందంటే? వరల్డ్ కప్ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు లక్షల ఖర్చు చేసి మరీ మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు నిర్వాహకులు ప్రముఖుల్ని ఆహ్వానిస్తుంటారు. వారికి ఉచితంగా పాస్‌లు అందజేస్తుంటారు. దీనిపై ఆర్పీజీ ఛైర్మన్ హర్ష్ గోయెంక్ తనదైన స్టైల్లో స్పందించారు. How about you, Sir? Ticket or Pass. — Anand Singh (@Anands_page) November 18, 2023 వ్యాపార వేత్తలైనా తన స్నేహితులెవరూ మ్యాచ్ టికెట్లు కొనలేదని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఉచిత పాస్‌లు పొందారని తెలిపారు. పైగా ధనవంతులే డబ్బులు చెల్లించడానికి ఇష్టపడరని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై ఓ వర్గం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు నేరుగా ఇంతకీ మీరు టికెట్లను కొనుగులో చేశారా? లేదంటా పాస్ తీసుకున్నారా? అని ప్రశ్నిస్తుండగా.. అందుకు తాను రెండూ తీసుకోలేదని చెప్పడం గమనార్హం. ఈ పోస్ట్‌పై కామెంట్లు వైరల్‌గా మారాయి. None of my businessmen friends have paid to get tickets for the #WorldcupFinal, they have all managed to get a ‘pass’. And that’s where the irony lies- it’s the rich who don’t want to pay! — Harsh Goenka (@hvgoenka) November 18, 2023 మ్యాచ్ టికెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే? ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు ఒక్కటి రూ. 1.87 లక్షల వరకు పెరిగాయి . క్రికెట్ వరల్డ్ కప్ టిక్కెట్ రీ-సెల్లింగ్ సైట్‌లోని వయాగోగో (viagogo.com) ధరల ప్రకారం, టైర్ 4లో టిక్కెట్ ధర రూ. 1,87,407 కాగా పక్కనే ఉన్న టైర్ టిక్కెట్ ధర రూ.1,57,421. సైట్లో అతి తక్కువ ధర టిక్కెట్ ధర రూ. 32,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. -
వారానికి 70 గంటల పని: ఇన్ఫో ‘సిస్’ వీడియో వైరల్.. మీ పొట్ట చెక్కలే!
70 hour work week remark hilarious video viral భారతీయు యువత వారానికి 70 గంటలు పని పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రాజేశాయి. కొంతమంది కంపెనీల ప్రతినిధులు, నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రధానంగా ఇండస్ట్రీలో మహిళా ఉద్యోగులపై వివక్షపై ఎక్కువ చర్చ నడిచింది. ఇంటా బయటా మహిళా ఉద్యోగుల పనిగంటలు, వారికి లభిస్తున్న గుర్తింపు, అందుతున్న వేతనం తదితర విషయాలు చర్చనీయాంశమైనాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఇన్ఫీ ‘సిస్’ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియోను వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. 70-80-90 గంటలు పనిచేస్తున్నారు గృహిణులు దగ్గర మొదలు పెట్టి.. నారాయణ ..నారాయణ.. అంటూ ఇన్ఫో ‘సిస్’ మీకు ఇన్ఫో ఇస్తోంది బ్రో.. అంటూ తనదైన యాక్సెంట్‌తో సాగిన ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. ఈ హిలేరియస్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వావ్.. నిజం చెప్పారు. గృహిణులు 70 నుండి 80 గంటలు పని చేస్తారు.. లవ్ యూ ఫర్ అండర్ స్టాండింగ్ .. ఇన్ఫో ‘సిస్’ అని ఒక యూజర్ కమెంట్ చేశారు. ఇది నూటికి నూరు శాతం, ఈ వీడియోను ఇన్ఫీ మూర్తి అంకుల్ చూడాలి అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం Info sis giving you info on 70 hour week! 😂😂 pic.twitter.com/rh6Jw1n2TD — Harsh Goenka (@hvgoenka) November 6, 2023 -
5-రోజులు ఆఫీస్ విధానం చచ్చింది: ప్రముఖ బిలియనీర్ కీలక వ్యాఖ్యలు
దేశంలో ఉత్పాదకత మెరుగుపడాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల తర్వాత దేశవ్యాప్తంగా ప్రస్తుత పని ఉత్పాదకతపై చర్చ సాగుతోంది. ఈ విషయంపై తాజాగా తన అభిప్రాయాలను పంచుకున్న ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా.. నారాయణ మూర్తి అభిప్రాయాలతో ఏకీభవించలేదు. ఏ ఉద్యోగి ఎన్ని గంటలు పని చేస్తున్నారన్నదానిపై పట్టింపు లేదని, వారి ఆశయం, లక్ష్యం, ఎంత సాధించారన్న దానినే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. వర్తమానం, భవిష్యత్ హైబ్రిడ్ వర్క్‌దే.. పనిలో పనిగా వారానికి ఐదు రోజుల ఆఫీస్ వర్క్ విధానంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు హర్ష్ గోయెంకా. ఐదు రోజుల ఆఫీస్ విధానం ముగిసిన అధ్యాయం.. వర్తమానం, భవిష్యత్ హైబ్రిడ్ వర్క్ విధానానిదే అని పేర్కొన్నారు. "వారానికి 5 రోజుల ఆఫీస్ విధానం చచ్చింది. హైబ్రిడ్ వర్క్ విధానానిదే వర్తమానం, భవిష్యత్తు" అని రాసుకొచ్చారు. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) కరోనా మహమ్మారి వివిధ రంగాలలో ఉద్యోగుల పని విధానాన్ని మార్చివేసిందనడంలో సందేహం లేదు. కానీ మహమ్మారి ప్రభావం ఇప్పుడు గణనీయంగా తగ్గడంతో, కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు పిలవడం ప్రారంభించాయి. హైబ్రిడ్ లేదా ఆన్-సైట్ మోడల్ వర్క్‌ను అనుసరిస్తున్నాయి. జెరోధా సీటీవో కైలాష్ నాధ్ ఇటీవల మాట్లాడుతూ వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని తొలగించడం అంత సులువు కాదన్నారు. అయితే తమ ఉద్యోగులు ఇంటి దగ్గర కంటే ఆఫీసు నుంచి పని చేయడం ద్వారా పనులను వేగంగా పూర్తి చేయగలిగారని చెప్పారు. (భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్న హెచ్‌సీఎల్ టెక్.. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక సంస్థతో..) 🚀 The 5-day office week is dead! 🏢 People are working nearly 33% of their office time remotely, and it's a game-changer. Flexibility is worth as much to people as an 8% raise. 💰 What we value most is skipping the daily commute and the sense of flexibility! 🚗🚆 🌟 Hybrid work… — Harsh Goenka (@hvgoenka) October 30, 2023 -
హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు: మూర్తి అలా అనలేదంటున్న గుర్నానీ
యువ ఉద్యోగులు, పనిగంటలపై ఇన్ఫోసిస్ కో- ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలామంది నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుండగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ నారాయణ మూర్తికి మద్దతుగా నిలిచాయి. అటు మహిళల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఎడిల్వీస్ సీఎండీ రాధికా గుప్తా మూర్తి వ్యాఖ్యలను పరోక్షంగా ఖండించారు. ఇంటా, బయటా అలుపెరగకుండా పనిచేస్తున్నా కూడా, వారికి తగిన గుర్తింపు లభించడం లేదనీ, దీనికి గురించి ఎవరూ మాట్లాడక పోవడం విచారకరమంటూ ట్వీట్ చేశారు. (ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్ కౌంటర్ ) తాజాగా వ్యాపారవేత్త హర్హ్ గోయెంకా నారాయణ మూర్తి చెప్పినట్టుగా భావిస్తున్న వారానికి 70 గంటల పనివిధానం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ఒక ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 🚀 The 5-day office week is dead! 🏢 People are working nearly 33% of their office time remotely, and it's a game-changer. Flexibility is worth as much to people as an 8% raise. 💰 What we value most is skipping the daily commute and the sense of flexibility! 🚗🚆 🌟 Hybrid work… — Harsh Goenka (@hvgoenka) October 30, 2023 హర్ష్ గోయెంకా ఏమన్నారంటే.. ‘‘వారానికి 5 రోజుల ఆఫీస్ పని విధానానికి కాలం చెల్లింది. ఆఫీసు పనిలో దాదాపు 33 శాతం రిమోట్‌గా పని చేస్తున్నారు. ఇదోక గేమ్-ఛేంజర్. 8 శాతం ప్రొడక్టవిటీని పెంచే ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం. అలాగే ఆఫీసులకు రోజువారి రాకపోకల్ని నివారించడం, ఫ్లెక్సిబిలీటీ అనే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.’’ ప్రస్తుతం జరుగుతోంది.. భవిష్యత్తు అంతా హైబ్రిడ్ పని విధానమే. కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుంచా ,రిమోట్‌గానే అనే దానికి మిళితం చేసుకోవాలి. అంతే తప్ప 50-70 గంటలా అనేది కాదు చర్చ. దీనికి బదులుగా మన లక్ష్యం, ప్రయోజనాలు, ఉత్పదకత గురించి ఆలోచించాలి. మార్పును స్వాగతించాల్సిందే.. కొత్త వర్క్ ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా మారాలి. వర్క్ లైఫ్‌లో వర్క్ ఫ్రం హోం, లేదా ఆఫీసా అనే దాంట్లో నిజంగా ముఖ్యమైన దాన్ని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఇది! అంటూ పరోక్షంగా నారాయణమూర్తికి కౌంటర్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఇన్పీ మూర్తి మద్దతుగా టెక్ మహీంద్రా సీఈవో పీ గుర్నానీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ఆయా కంపెనీల కోసం 70 గంటలు పనిచేయడం గురించి మాట్లాడడం లేదని, వ్యక్తులుగా తమ కోసం లేదా తమ దేశ అభివృద్ధి కోసం 70 గంటలు పనిచేయాలని సూచించాలని గుర్నాని అన్నారు. అంతేకాదు యువత తాము ఎంచుకున్న రంగంలో మాస్టర్‌గా మారాలంటే యువత 10 వేల గంటలను పెట్టుబడిగా పెట్టాలని కూడా గుర్నాని పిలుపు నిచ్చారు. -
ఉద్యోగమా? పానీ పూరీ అమ్ముకోవడమా? ఏది బెటర్: వైరల్ వీడియో
కార్పొరేట్, లేదా టెకీ ఉద్యోగం అంటేనే అంతులేని పని ఒత్తిడి. పగలూ రాత్రీ తేడాలేని పనివేళలు,నిబంధనలతో పనిలేకుండా గంటలకొద్దీ అలా పని చేయాల్సిందే. ఇలాంటి సవాలక్ష సవాళ్లు ఉద్యోగం అంటేనే నిస్తేజం. జీవితం గడవాలి కాబట్టి ఎలాగోలా తట్టుకుని నెట్టుకొస్తున్నా ఇటీవలి కాలంలో లేఆఫ్స్ భూతం ఉద్యోగులను మరింత వేధిస్తోంది. ఆర్థికమాంద్యం, ఖర్చుల తగ్గింపు పేరుతో అనేక కార్పొరేట్ కంపెనీలు, ఐటీ దిగ్గజాలు వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరలవుతోంది. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన మూడు రోజుల్లోనే 20.3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పారిశ్రామికవేత్త హర్షగెయెంకాను ఈ వీడియోను ఆకర్షించింది. ఆయన కూడా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కార్పొరేట్ ఉద్యోగం కంటే..పానీ పూరీ విక్రయించుకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఇదొక విషాదకర పరిస్థితి అని అంటే, మధ్య తరగతి వాళ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి ప్రజలు ధనవంతులు. ఎందుకుంటే వారు ఖర్చు తక్కువ పొదుపు ఎక్కువ చేస్తారని మరొకరు కామెంట్ చేశారు. మరో యూజర్ ఏమన్నారంటే పానీ పూరి వ్యాపారి ఎక్కువ సంపాదించినా కూడా కార్పొరేట్ ఉద్యోగికి గౌరవం లభిస్తుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. అలాగే కార్పొరేట్ ఉద్యోగులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణంలో పనతోపాటు ఉద్యోగ భద్రత కూడా ఎక్కువే. టైంకి జీతం రావడం, ఆరోగ్య బీమా, పదవీ విరమణ ప్రణాళికల్లాంటివి ఉంటాయి. (యూట్యూబ్ కింగ్ గౌరవ్ తనేజా గుర్తున్నాడా? మళ్లీ ట్రెండింగ్లోకొచ్చేశాడు!) కార్పొరేట్ ఉద్యోగులు ఉద్యోగపరంగా మరింతపైకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది గొప్ప వ్యక్తులు, ఇతర నిపుణులతో కలిసి పనిచేయడం లేదా ప్రసిద్ధ కంపెనీలో పని చేయడం అనేది వారికి వ్యక్తిగతంగా తృప్తినిస్తుంది. అయితే కార్పొరేట్ ఉద్యోగిగా ఉండాలా లేక పానీ పూరి వ్యాపారిలా ఉండాలి అనే నిర్ణయం వైయుక్తికమైంది. ఏది మంచి, ఏది చెడు అనేది వారి వారి ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. Why would you be a corporate employee! pic.twitter.com/NY23wLeem8 — Harsh Goenka (@hvgoenka) October 19, 2023 -
హర్ష గొయెంకా ట్వీట్.. హాట్ టాపిక్‌గా ఇస్రో చైర్మన్ జీతం..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్పోగుతుంది. ఇందుకు కారణం ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష గోయెంకా. అవును సోమనాథ్ జీతం విషయాన్ని ట్విటర్ వేదికగా హర్ష గోయెంకా ప్రస్తావించడంతో ఇస్రో చైర్మన్ పేరు తీవ్ర చర్చకు దారితీసింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల జీతంగా రెండున్నర లక్షలు సంపాదిస్తున్నారని తెలిపిన గోయింకా.. ఇది ఆయనకు తగిన జీతమేనా అని ప్రశ్నించారు. శాస్త్రీయ విజ్ఞానం, పరిశోధనలపై సోమనాథ్‌కు ఉన్న ఆసక్తి, నిబద్ధతను వివరిస్తూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు. Chairman of ISRO, Somanath’s salary is Rs 2.5 lakhs month. Is it right and fair? Let’s understand people like him are motivated by factors beyond money. They do what they do for their passion and dedication to science and research, for national pride to contribute to their… — Harsh Goenka (@hvgoenka) September 11, 2023 ఆయన తన ట్వీట్లో ‘ఇస్రో చైర్మన్ సోమనాథ్ నెల జీతం రూ. 2.50 లక్షలు. ఈ జీతం ఆయనకు సరైనదేనా? న్యాయమేనా? సోమనాథ్ లాంటి వాళ్లు డబ్బుల కోసం కాదు.. అంతకు మించిన మంచి, దేశ ప్రగతి కోసం పనిచేస్తారని అర్థం చేసుకోవచ్చు. వారు సైన్స్, పరిశోధనల పట్ల అభిరుచి, నిబద్ధతతో జాతిని గర్వింపజేసేలా.. దేశ అభివృద్ధికి తోడ్పడతారు. వారి లక్ష్యాన్ని సాధించడంలో వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేస్తారు. ఆయనలాంటి అంకితభావం గల వ్యక్తులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను!’ అని పేర్కొన్నారు. హర్ష గోయెంకా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనేకమంది నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. సోమనాథ్‌కు ఎక్కువ సాలరీ ఇవ్వాలని.. ఆయనలాంటి వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొంటున్నారు. మరికొంతమంది.రెండున్నర లక్షలు అనేది ప్రాథమిక వేతనం అయి ఉండవచ్చని, ఇతర అలవెన్సన్లు కూడా కలపాలని కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఎట్టకేలకు భారత్ వీడిన కెనడా ప్రధాని.. రెండు రోజులు ఆలస్యంగా ‘ఇస్రోకు సోమనాథ్ లాంటి వ్యక్తుల నిబద్ధత, ఎనలేనిది. డబ్బులతో పోల్చలేనిది. సైన్స్, రీసెర్చ్ పట్ల ఆయనకున్న అంకితభావం దేశాన్ని మరింత ముందుకు నడపుతోంది. ఆయనలాంటి వారు ఎంతో మందికి ఆదర్శం. సమాజానికి ఆయన చేస్తున్న సేవలు అమూల్యమైనది’ అని ఓ యూజర్ పేర్కొనగా.. ‘ ఇస్రో చ్మైర్మన్కు నెలకు 25 లక్షలు ఇవ్వాలి. తన ప్రతిభను గుర్తించి రివార్డ్ ఇవ్వాలని మరొకరు చెప్పారు. కాగా ఇటీవల రెండు గొప్ప ప్రయోగాలను ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రుడిపై పరిశోధనలకు చంద్రయాన్-3 పేరుతో ఉపగ్రహాన్ని ప్రవేశించింది. ఇది జాబిల్లి ఉపరితలంపై మట్టి స్వభావం, వాతావరణం, ఖనిజాలు వంటి విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేసింది. అదే విధంగా సూర్యుడి గుట్టు తెలుసుకునేందుకు తొలిసారి ఆదిత్య ఎల్ల్1 పేరుతో అంతరిక్ష్యంలోకి మరో స్పేస్ క్రాఫ్ట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టింది. 125 రోజులపాటు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది సోలార్ మిషన్అనంతరం భూమికి సూర్యుడికి మధ్యనున్న లాంగ్రేజ్ పాయింట్ 1 వద్దకు చేరుకొని సూర్యుడిపై ప్రయోగాలు చేయనుంది. -
ఎల్జీబీటీక్యూ సిబ్బందికి మరిన్ని సదుపాయాలు
ముంబై: పని ప్రదేశాల్లో లింగ సమానత్వం పాటించే దిశగా ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే తదితరులు) ఉద్యోగులకు బాసటనివ్వడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా తమ సిబ్బంది, వారి భాగస్వాములకు ఆరోగ్య బీమాను అందుబాటులోకి తెచ్చినట్లు 24/7డాట్ఏఐ సంస్థ వెల్లడించింది. అలాగే, పేటర్నిటీ, మెటర్నిటీ లీవుల సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. సంస్థ అంతర్గతంగా ఏర్పాటు చేసిన కమిటీకి మిగతా ఉద్యోగుల తరహాలోనే వారు తమ సమస్యలను తెలియజేసి, అవసరమైన సహాయాన్ని పొందేలా చర్యలు తీసుకున్నట్లు వివరించింది. మరోవైపు, ఆర్పీజీ గ్రూప్ కూడా ప్రైడ్మంత్ సందర్భంగా తమ సంస్థలో ఉద్యోగుల కోసం ఎల్జీబీటీక్యూఏఐప్లస్ అండ్ పార్ట్నర్స్ బెనిఫిట్స్ పాలసీని ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. అటు ఆర్–షీల్డ్ పేరిట ప్రత్యేక హెల్ట్లైన్ను కూడా ఏర్పాటు చేసినట్లు సంస్థ చైర్మన్ హర్ష్ గోయెంకా తెలిపారు. -
రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న భారతీయ మహిళా రెజ్లర్ల ఆందోళనపై ప్రముఖ పారిశశ్రామికవేత్త హర్షగోయెంకా స్పందించారు. మహిళలకు తోటి మహిళలే అండగా లేకపోతే ఎలా? ఇంకెవరుంటారు అంటూ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. అంతేకాదు ప్రస్తుత దిగ్గజ క్రికెటర్లు తోటి క్రీడాకారులకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇదీ చదవండి: ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్! ఇది ఇలా ఉంటే బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు ఢిల్లీలో రెండు ఎఫ్ఐఆర్లు నమదు కావడం సంచలనం రేపింది. ఏళ్లుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులకు స్పందించిన ఢిల్లీ పోలీసులు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ 10 ఫిర్యాదులను నమోదు చేశారు. తమను అనుచితంగా తాకి, లైంగిక వేధింపులతో మనోవేదనకు గురిచేశారని మహిళా రెజర్లు ఆరోపించారు. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ సింగ్ మహిళా రెజ్లర్లను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలో నమోదు చేశారు. 2017, సెప్టెంబర్ లో ఆసియా ఇండోర్ గేమ్స్ కోసం కర్ణాటకలోని బళ్లారిలో శిక్షణ పొందుతున్నప్పుడు, శిక్షణ సమయంలో, గాయపడి దాదాపు మరణశయ్యపై ఉంటే, ఈమెయిల్ ద్వారా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినప్పటికీ నోటీసులు ఇచ్చారని, విచారణ కమిషన్ వేస్తామంటూ బెదిరించారని ఒక రెజ్లర్ వాపోయారు. సింగ్‌తోపాటు వినోద్ తోమర్‌పై ఆరోపణలు గుప్పించారు. (సూపర్ ఆఫర్: ఐపోన్13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) If women will not support other women, who will? If the current iconic cricketers not support their brethren, who will? — Harsh Goenka (@hvgoenka) June 2, 2023 -
సెవెన్ సీటర్ బైక్ : ఇది కదా.. మేకిన్ ఇండియా అంటే..
మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపిస్తున్నారు ఔత్సాహిక వేత్తలు.పెద్దగా చదువుకోకున్నా, టెక్నాలజీ గురించి తెలియకపోయినా.. పరిశోధనలు చేస్తున్నారు. పెరుగుతున్న అవసరాలు తీర్చుకునేందుకు సరికొత్త దారులు వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో చూస్తే.. ఆశ్చర్యపోతాం. తమ అవసరాలు తీర్చుకునేందుకు ఓ యువకుడు అత్యంత చౌకగా సోలార్ బైక్‌ను రూపొందించుకున్నాడు. మార్కెట్లో దొరికే వివిధ వస్తువులను ఉపయోగించి ఏకంగా సెవెన్ సీటర్ బైక్ తయారు చేశాడు. ఈ ఆవిష్కరణపై ప్రశ్నించినప్పుడు ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు. "ఈ బైక్‌పై ఏడుగురు ప్రయాణం చేయవచ్చు. పైగా ఇది సోలార్ తో నడుస్తుంది. దీనిపై 200 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయవచ్చు. దీన్ని తయారు చేయడానికి 8 నుంచి 10వేల దాకా ఖర్చు వచ్చింది. చూశారుగా నా సోలార్ బైక్" నిజమే.. భారత్ లాంటి ఎదుగుతున్న దేశాలకు ఇప్పుడు మరెన్నో ఆవిష్కరణలు కావాలి. దానికి బ్రాండ్ పేర్లు పెట్టి భారీగా ధర నిర్ణయించేకంటే.. చౌకగా ప్రజల అవసరాలు తీర్చే.. వినూత్న ఆవిష్కరణలు కావాలి. అప్పుడే మేకిన్ ఇండియాకు నిజమైన అర్థం దొరుకుతుంది. So much sustainable innovation in one product - produced from scrap, seven seater vehicle, solar energy and shade from the sun! Frugal innovations like this make me proud of our India! pic.twitter.com/rwx1GQBNVW — Harsh Goenka (@hvgoenka) April 29, 2023 చదవండి👉 చాట్‌జీపీటీ వినియోగంపై పోటీపడుతున్న సీఈవోలు.. ఏం జరుగుతుందో.. ఏమో! -
కలర్‌ఫుల్ ఎంఆర్ఐ స్కానర్
న్యూఢిల్లీ: ఎంఆర్ఐ స్కానింగ్ అంటే చాలా మందికి భయం. వింత శబ్దాలతో గుహలోకి వెళ్లిన ఫీలింగ్. చిన్నారులకు ఎంఆర్ఐ అంటే మరీ కష్టం. పిల్లలు భయపడకుండా స్కాన్ తీయడం కోసం ‘చిన్నారి’ ఎంఆర్ఐ మిషన్లు వస్తున్నాయి. మిషన్‌కు రంగులద్దడంతో పాటు దానిపైన ఫిక్షనల్ కేరక్టర్స్, బొమ్మలు చిత్రీకరించి పిల్లల్ని ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి ఎంఆర్ఐ మిషన్లు ఉంటున్నాయని పారిశ్రామికవేత్త హర్షగోయెంక ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ మిషన్‌ను చూసిన నెటిజన్లు భలేగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. -
వంతెనపై ఊహకే అందని అద్భుతంలా ఒక నగరం..! వీడియో వైరల్
వంతెనలు అనేవి దురాలను తగ్గించడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేవి. అలాంటి వంతెనపై ఒక నగరం నిర్మిస్తే ఎలా ఉంటుంది. ఊహిస్తేనే ఏదోలా ఉంది కదూ. ఔను! వంతెనపై ఒక యునిక్ నగరాన్ని నిర్మించారు. కింద నీళ్లు కూడా ఉన్నాయి. చూస్తే ఒక అద్భుతమైన దృశ్యంలా కనిపిస్తుంది. అంతేగాదు ఆ వంతెన కింద వాటిని అద్భతమైన ప్రకృతి దృశ్యంగా మార్చింది. ఇది చైనాలో ఉంది. చాంకింగ్లోని లిన్షి టౌన్షిప్లో సాంప్రదాయ చైనీస్, పాశ్చాత్య శైలి కలయికతో భవనాలను నిర్మించినట్లు ఫోటోగ్రాఫర్ గువోజు తెలిపారు. ఇది పర్యాటకులకు అంతరిక్షం గుండా ప్రయాణిస్తున్న అనుభూతి ఇస్తుందని చెప్పారు. ఎప్పుడూ మంచి ప్రేరణనిచ్చే ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తూ సామాజిక మీడియాలో యాక్టివ్‌గా ఉంగే దిగ్గజ పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా అందుకు సంబందించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు. ఐతే నెటిజన్లు మాత్రం ఈ వీడియోని చూసి చాలా విభిన్నంగా స్పందించారు. ఇది అసాధ్యం అని ఊహజనితమైనదని ఒకరూ, దీనివల్ల నది జలాల్లో వ్యర్థాలు ఎక్కువతాయని మరొకరూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. (చదవండి: చెత్త వివాదం..పారిశుధ్య కార్మికులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యాపారవేత్త) Imagine living here….. pic.twitter.com/foa7F4jTdC — Harsh Goenka (@hvgoenka) April 15, 2023 -
ఐక్యత పవర్ అంటే ఇది!..హర్ష గోయెంకా ట్వీట్
ఐక్యమత్యమే మహాబలం అని చిన్నప్పుడు కథలు కథలుగా చదువుకున్నాం. కానీ దానికి ఉన్న పవర్ ఏంటో ఈ ప్రకృతిలోని కొన్ని జీవాలు మనుషులకు చెప్పకనే చెబుతున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియోను పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో..గొంగళి పురుగులు గుంపులు గుంపులుగా స్పీడ్‌గా వెళ్లిపోతున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా గొంగళిపురుగులు చాలా నిదానంగా వెళ్తాయి. అవి విడిగా..ఒక్కొక్కటి అంత తొందరగా భూమ్మీద పాకవు. అలాంటిది అవి ఒక దానిపై ఒకటి గుంపుగా స్పీడ్‌గా పాకుతూ వెళ్తున్నాయి. ఐక్యతగా ఉంటే ఏ పనైనా సులభంగా చేయోచ్చు అని చెబుతుంది. ఐక్యతకు ఉన్న శక్తిని కూడా తెలియజేసింది. "ఆ గొంగళి పురుగులు విడిగా కంటే సముహంగా ఉంటే వేగంగ వెళ్లగలవు, ఇదే ఐక్యత బలం అంటూ ట్వీట్ చేశారు హర్ష గోయెంకా. దీనికి నెటిజన్లు ఎంతో మంచి విషయాన్ని గుర్తు \ చేశారంటూ ధన్యవాదాలు చెప్పారు. అంతేగాదు కలిసి ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలమని, టీమ్‌గా ఉంటే ఎన్నో అద్భుతాలు చేయగలం అంటూ మరికొందరూ నెటిజన్లు ట్వీట్ చేశారు. It’s a group of caterpillars, moving in a formation known as a rolling swarm. This rolling swarm of caterpillars moves faster than any single caterpillar. Power of unity…pic.twitter.com/TibW70GP9n — Harsh Goenka (@hvgoenka) February 24, 2023 (చదవండి: వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి!) -
నాకు ఆ సినిమా గుర్తొస్తుంది..హర్ష్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు!
షార్క్ ట్యాంక్ ఇండియా..! ప్రతిభావంతులైన ఎంట్రప్రెన్యూర్లను వెలుగులోకి తెచ్చేందుకు సోనీ ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. అమెరికాలో విజయవంతమైన ‘షార్క్ ట్యాంక్ షో’ దీనికి స్ఫూర్తి. ఇలాంటి షోలు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వరకు ఉన్నాయి. అన్ని చోట్లా ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలకే అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే ఈ షో మొదటి సీజన్ 2021లో విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఇండియా రెండో సీజన్ ప్రారంభమైంది. అయితే విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతున్న ఈ కార్యక్రమంపై భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని షో జడ్జ్ అనుపమ్ మిట్టల్ ఖండించారు. హర్ష్ గోయెంకా ఏమన్నారంటే? ఎప్పుడూ మోటివేషన్, లేదా రోజూ వారి సామాజిక మాద్యమాల్లో జరిగే ఘటనల గురించి మాట్లాడే హర్ష్ గోయెంకా.. ఈ సారి రూటు మార్చారు. షార్క్ ట్యాంక్ షో జడ్జెస్ గురించి, వాళ్లు చేసే బిజినెస్ గురించి స్పందించారు. దేశానికి చెందిన స్టార్టప్‌లు పెద్దమొత్తంలో నష్టపోతున్నాయంటూ.. వారి నష్టాన్ని 1975లో విడుదలైన అడ్వంచర్ అండ్ థ్రిల్లర్ హాలీవుడ్ మూవీ జాస్‌తో పోల్చారు. ఎప్పుడైనా సరే థింక్స్ ఆఫ్ షార్క్స్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు నిజమనేలా కంపెనీల లాభ నష్టాల డేటా స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. వాటిల్లో 2022 ఆర్ధిక సంవత్సరంలో బోట్ కంపెనీ అధినేత అమన్ గుప్త రూ.79 కోట్ల లాభం గడించారు. కార్ దేకో కోఫౌండర్ అమిత్ జైన్ రూ. 246 కోట్లు లాస్ అయ్యారు. లెన్స్ కార్ట్ 102 కోట్లు, షాదీ. కామ్ రూ.27 కోట్లు, సుఘర్ కాస్మోటిక్స్ అధినేత వినీత్ సింగ్ రూ.75కోట్లు నష్టపోయారని ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేయగా.. షార్క్ ట్యాంక్ ఇండియా షోని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతిభావంతులైన ఎంట్రప్రెన్యూర్లను వెలుగులోకి తెస్తుంది’. కానీ నేను షార్క్‌ల గురించి ఆలోచించినప్పుడల్లా, 'జాస్' సినిమా, ఆ సినిమాలోని రక్త పాతం గుర్తుకు వస్తుందని అన్నారు. పక్షపాతంగా, అర్ధరహితంగా ఆ ట్వీట్‌పై షార్క్ ట్యాంక్ జడ్జ్ షాది.కామ్ ఫౌండర్, అనుపమ్ మిట్టల్ స్పందించారు. సార్ మీరు దానిని హాస్యాస్పదంగా చెప్పారని అనిపిస్తుంది. మీరు పక్షపాతంగా, అసంపూర్ణంగా ఉండే అంశాలపై ప్రతిస్పందించారని నేను భావిస్తున్నాను. కానీ మీలాగే..సొరచేపలు నష్టాల్ని కాకుండా లాభాల్ని తెచ్చిపెడుతున్నాయంటూ చమత్కరించారు. I enjoy #SharkTankIndia as a program and I think it is a great platform for our budding entrepreneurs. 1 But whenever I think of sharks, I think of the movie ‘Jaws’ and bleeding 🩸! pic.twitter.com/LAmGxQOiU8 — Harsh Goenka (@hvgoenka) January 22, 2023 I know you meant it in jest so with all due respect sir, I think u reacted to what appears to be superficial, biased & incomplete data. Happy to learn from stalwarts, but just to clarify, like u, the sharks 🦈 don’t bleed red, we bleed blue 🇮🇳 & that’s why we do what we do 🤗 — Anupam Mittal (@AnupamMittal) January 24, 2023 -
‘కాస్త సమయం ఇవ్వాలి.. ఎలాన్ మస్క్ పిచ్చికి’.. హర్ష గోయెంకా ట్విట్ వైరల్!
ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌పై భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త హర్ష్ గోయెంకా ప్రశంసల వర్షం కురిపించారు. మస్క్ నిర్ణయాలు ట్విటర్‌ను మరింత గందర గోళంలోకి నెట్టేయొచ్చు. అలా అని ఆయన్ను తప్పు పట్టలేం అంటూ హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. బాస్‌గా మస్క్ ట్విటర్లో అడుగు పెట్టిన నాటి నుంచి ఏదో ఒక నిర్ణయంతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపు విషయంలో ఎక్కడ రాజీ పడడం లేదు. పైగా అందుకు సహకరించని మేనేజర్ స్థాయి ఉద్యోగుల్ని సైతం ఇంటికి పంపించేస్తున్నారు. మరోవైపు ట్విటర్ బ్లూ పేరు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ను అందుబాటులోకి తెచ్చారు. ఇలా వరుస నిర్ణయాలతో ఆ సంస్థను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఈ తరుణంలో మస్క్‌పై వస్తున్న విమర్శల్ని గోయెంకా సమర్ధిస్తున్నారు.‘ఎలాన్ మస్క్ లాంటి జీనియస్‌ని మనం తక్కువ అంచనా వేస్తున్నాం. ప్రస్తుతం అతని (మస్క్‌ను ఉద్దేశిస్తూ) పిచ్చికి వెనక ఖచ్చితంగా ఏదో మర్మం ఉండే ఉంటుంది. పేపాలు,దిబోరింగ్ కంపెనీ, టెస్లా, స్పేస్ ఎక్స్ ఇలా సంస్థ ఏదైనా సరే..ఆయన ఎన్నో సార్లు కాలం కంటే చాలా ముందున్నారు. మస్క్ వద్ద కచ్చితంగా ట్విటర్ విషయంలోనూ ఏదో గేమ్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతం అది మనకు అర్థం కాకపోవచ్చు, ఇప్పట్లో దాన్ని అంచనా కూడా వేయలేం. ట్విటర్ పని అయిపోయింది అనే ముందు ఆయనకు కొంత సమయం ఇవ్వాలి అని హర్ష్ గోయెంకా మస్క్‌పై వస్తున్న విమర్శల్ని కొట్టిపారేశారు. We are underestimating the genius of Elon Musk. There must be a method to his madness. Whether it was Tesla, SpaceX or Boring co, he was ahead of his times. He surely has a game plan with #Twitter which we just can’t comprehend. Let’s give him time before we predict its death. — Harsh Goenka (@hvgoenka) November 19, 2022 చదవండి: Twitter Hirings ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్: ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్ -
‘కోహినూర్ వజ్రం కోసం ఇలా ట్రై చేస్తే’.. హర్ష గోయెంకా ట్వీట్‌కి నవ్వకుండా ఉండలేరు!
రిషి సునాక్(Rishi Sunak).. గత రెండు రోజులుగా ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. బ్రిటన్ ప్రధాని పీఠంపై చిన్న వయసులో..అది కూడా తొలి శ్వేతజాతీయేతరుడిగా రిషి సునాక్ పగ్గాలు అందుకుని సంచలనం సృష్టించారు. ఆయన భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడం, పైగా మన దేశపు అల్లుడు కావడంతో భారత్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా, మరోవైపు రిషి సునాక్‌పై మీమ్స్ వడ్డన కూడా మామూలుగా లేదు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. బ్రిటన్ ప్రధానమంత్రిగా భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికైన సంగతి తెలిసిందే . ఇక అప్పటి నుంచి కోహినూర్ వజ్రం అంశం మరోసారి చర్చనీయాంశమైంది. దీనిపై నెట్టింట చర్చలు కూడా మొదలయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సైతం ఈ అంశంపై ఫన్నీగా స్పందించారు. బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలనే ఇలా ట్రై చేయండంటూ ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్లో ఏముందంటే.. 'కోహినూర్‌ను తిరిగి పొందాలంటే నా స్నేహితుడి ఆలోచన ఇదే... రిషి సునాక్‌ను భారతదేశానికి ఆహ్వానించండి. ఆయన అత్తమామల ఇంటికి వెళ్లేటప్పుడు బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్న సమయంలో కిడ్నాప్ చేయండి. రిషి సునాక్ స్థానంలో ఆశిష్ నెహ్రాను యూకే ప్రధానమంత్రిగా పంపండి, అలా చేసినా ఎవరూ గుర్తుపట్టరు. వెంటనే కోహినూర్‌ను తిరిగి ఇచ్చే బిల్‌ను నెహ్రా పాస్ చేయిస్తాడని’ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రసుత్త ఇది నెట్టింట హల్ చేస్తోంది. కాగా రిషి సునాక్, ఆశిష్ నెహ్రా చూడటానికి ఒకేలా కన్పించడంతో నెటిజన్లు క్రేజీగా మీమ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. My friend’s idea to get back #Kohinoor: 1. Invite #RishiSunak to India 2. Kidnap him when he is stuck in Bangalore traffic to visit his in-laws 3. Send instead Ashish Nehra as UK PM. No one will realise it. 4. Nehra will be told to pass the bill to return Kohinoor 💎 in 🇮🇳! 😀😀 — Harsh Goenka (@hvgoenka) October 25, 2022 చదవండి: Rishi Sunak: అక్కడ మొదలైన రిషి- అక్షత ప్రేమకథ.. మామగారి గురించి బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే! -
కెరీర్లో మనం చేసే అతిపెద్ద తప్పులు ఇవే .. హర్ష గోయెంకా పాఠాలు
తప్పులు చేయడం.. ఆ తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం కామన్. అందుకే తప్పులు చేయండి. వాటి నుంచి అవకాశాల్ని సృష్టించుకోండి’ అని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా పాఠాలు చెబుతున్నారు. చేసిన తప్పుల నుంచి జ్ఞానాన్ని సంపాదించడం గొప్ప అవకాశం. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరచడంలో, మీకున్న అపారమైన తెలివితేటల్ని విస్తరించేందుకు సహాయ పడుతుందని హర్ష్ గోయెంకా ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతుండగా.. మీరు తప్పు చేసి.. ఆ తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోంటే అది తప్పు కాదని అన్నారు. Always learn from your mistakes: - See what went wrong - See what could have been done better - See what was not necessary - See what took most of your energy - See what knowledge you lacked If you learn from a mistake, a mistake isn't a mistake anymore! — Harsh Goenka (@hvgoenka) October 18, 2022 ఇక ముఖ్యంగా కెరీర్లో చేసే తప్పుల్ని ఈ సందర్భంగా హర్ష గోయెంకా హైలెట్ చేశారు. అందులో ఒకటి అన్నీ తమకు తెలుసని అనుకోవడం, రెండోది సరైన పరిచయాలు లేకపోవడం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వామ్మో.. ఈ కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ కంటే జైలు నయం!
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తున్న విషయం తెలిసిందే. ఒక్క కేసు నమోదైనా.. లక్షల మందిని ఐసోలేషన్‌కు పరిమితం చేస్తోంది. ఇంకా వైరస్ లక్షణాలు కనిపించిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందనేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విటర్లో షేర్ చేసిన వీడియోనే నిదర్శనం. చైనాలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో పరిస్థితులు జైలును తలపిస్తున్నట్లు సూచిస్తూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ఇది జైలు అనుకుంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. అది చైనాలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డు’ అని రాసుకొచ్చారు గోయెంకా. అయితే, ఈ వీడియోను ముందుగా వాల్ స్ట్రీట్ సిల్వర్ షేర్ చేసింది. ‘చైనాలోని కోవిడ్ ఐసోలేషన్ క్యాంపుల్లో జీవన విధానం ఇలా ఉంది. చిన్న పిల్లలు, మహిళలు, గర్భవతులను సైతం ఇక్కడ నిర్బంధించినట్లు తెలిసింది. ఇది నిజంగా కోవిడ్ కోసమేనా? నిజంగా నియంత్రించేందుకేనా?’ అంటూ పేర్కొంది వాల్ స్ట్రీట్ సిల్వర్. జైలులో కన్నా దారుణంగా ప్రజలను నిర్బంధించటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. If you are wondering if it’s a prison- no, it’s a COVID isolation ward in China! pic.twitter.com/3SSnCI4dfi — Harsh Goenka (@hvgoenka) October 15, 2022 ఇదీ చదవండి: ఆఫీస్‌కు రమ్మని చెప్పేది ఇందుకే: హర్ష గోయెంకా వైరల్ ట్వీట్ -
ఆఫీస్ నుంచి వర్క్ చేయాలనేది ఇందుకే: హర్ష గోయెంకా వైరల్ ట్వీట్
వర్క్ ఫ్రం హోమ్.. కరోనా సమయంలో బాగా వినిపించిన పేరు. కోవిడ్ వచ్చాక దాదాపు ప్రతి కంపెనీ కార్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఇటీవల కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో మళ్లీ కార్యాలయాలు తెరుచుకున్నాయి. మెల్లమెల్లగా ఉద్యోగులు కంపెనీల బాట పడుతున్నారు. కానీ కొంతమంది ఇంకా ఇంటి నుంచే పని చేయడానికి ఇష్టపడుతున్నారు. సుమారు ఏడాది, రెండేళ్లపాటు ఇంట్లో ఉండటంతో చాలామంది వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడిపోయారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా తాజాగా వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీస్ గురించి తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ఇంటి నుంచి కంటే ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. పోస్టులో రెండు పై చార్ట్‌లు ఉండగా.. పై దానిలో వర్క్ ఫ్రం హోమ్‌కు సంబంధించింది. ఇందులో మొత్తం పని కోసమే కేటాయించి ఉంది. చదవండి: ఆఫీస్ నుంచి వర్క్ చేయాలనేది ఇందుకే: హర్ష గోయెంకా వైరల్ ట్వీట్ Here is a reason why you should work from office 😀😀😀! pic.twitter.com/rMcjD9ahl8 — Harsh Goenka (@hvgoenka) September 29, 2022 ఇక రెండో చార్ట్ వర్క్ ఫ్రం ఆఫీస్‌కు సంబంధించింది. ఇందులో వర్క్‌తో పాటు మిగతా పనులకు కూడా అవకాశం ఉంది. టీ, లంచ్ బ్రేక్ తీసుకోవడం, ట్రాఫిక్‌లో ఉండటం. మన పని చేసుకోవడంతోపాటు ఇతరులకు సాయపడటం వంటివి కూడా ఉన్నాయి. ఈ కారణాలతోనే ఆఫీస్ నుంచి వర్క్ చేయాలనేది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీస్ వల్ల కలిగే అసలైన ప్రయోజనాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఆఫీస్ వాతావరణం ఉద్యోగి, కంపెనీకి ఇద్దరికీ అనకూలమైనదని హర్ష గోయంకాకు కొందరు మద్దతిస్తున్నారు -
'ఒకప్పుడు మన పెళ్లిళ్లలో డబ్బుల వర్షం కురిపించేవారు'
దేశ వ్యాప్తంగా డిజిటల్ ఇండియా నినాదం మారు మ్రోగుతుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. పచారీ కొట్టునుంచి కిల్లీ కొట్టు దాకా ఎటు చూసినా గూగుల్ పే, ఫోన్ పే ఈ క్యూ ఆర్ కోడ్లే కనిపిస్తున్నాయి. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెల్లింపులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని ఉదహరిస్తూ గతంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. పండుగ సమయంలో ఇంటింటికీ తిరిగే గంగిరెద్దులను ఆడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను మంత్రి ట్విటర్లో షేర్ చేస్తూ.. డిజిటల్ విప్లవం జానపద కళాకారుల వైపుకు కూడా చేరుకుందని ఆమె తెలిపారు. There was a time money was showered in our weddings. Now in digital India……. pic.twitter.com/g4BApTbPLw — Harsh Goenka (@hvgoenka) August 24, 2022 తాజాగా డిజిటల్ ఇండియాపై ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పెళ్లికి వచ్చిన అతిధుల్లో ఉత్సాహం నింపిందేకు బరాత్‌లో డప్పు వాయిస్తున్నారు. వారిలో ఓ అతిధి డప్పు చప్పుళ్లకు ఫిదా అయ్యాడు. అంతే డబ్బు వాయిస్తున్న వారి వద్దకు వెళ్లి డప్పుకున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రూ.50 చెల్లించారు. ఆ వీడియోకు...'ఒకప్పుడు మన పెళ్లిళ్లలో డబ్బుల వర్షం కురిపించేవారు. ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ఇది డిజిటల్ ఇండియా అంటూ పేర్కొన్నారు. -
వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!
ఇటీవలకాలంలో యువత తమ సృజనాత్మకతను జోడించి చాలా వినూతనంగా వివాహాలు చేసుకుంటున్నారు. అందర్నీ ఆకట్టుకునేలా ఔరా! అనిపించేలా వివాహాలు జరుపుకుంటున్నారు. కొంతమంది హంగు ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసుకుంటే మరికొంతమంది చాలా సింపుల్‌గా వివాహాలు చేసుకుని అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడోక జంట భావించింది కాబోలు. ఆ నవ దంపతుల వివాహా ఆహ్వాన పత్రికను చూసే ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు విషయమేమిటంటే...ఆ దంపతులు తమ వెడ్డింగ్ కార్డు వెరైటీగా ఉండాలనుకున్నారు కాబోలు. అందుకోసం వారి వివాహా ఆహ్వాన పత్రికనే ఒక ట్యాబ్లెట్ స్టిప్స్ ఆకారంలో రూపొందించారు. ట్యాబ్లెట్ వెనుకవైపు ఉండే విభాగంలో ఆయా ట్యాబ్లెట్‌కి సంబంధించిన వివరాలు మాదిరిగా.. హెచ్చరిక, మాన్యుఫ్యాక్చరింగ్ వంటి తదితర అంశాలో వారి సమాచారం ఉంది. నిశితంగా చూస్తేనే అది ఆహ్వాన పత్రిక అని తెలుస్తుంది. పైగా చాలా ఫన్నీగా అనిపిస్తోంది కూడా. పెళ్లి పత్రికలో ఎలా అయితే వధువు, వరుడు వివరాలు ఉంటాయో అలానే అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయి. ఇలాంటి ఆలోచన రావడం కూడా గ్రేట్. అంతేకాదండోయ్ వరుడు పేరు ఎళిలరసన్ ఫార్మసీ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా, వధువు వసంతకుమారి నర్సింగ్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రోఫెసర్. తరుచు సోష్ల్ మీడియాలో యాక్టివిగ్ ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆర్పీజీ చైర్మన్ హర్ష గోయెంకాను ఎంతగానో ఇంప్రెస్ చేసింది ఈ వివాహ పత్రిక. ప్రజలు చాలా కొత్తదనం కోరుకోవడమే కాదు వినూత్నంగా ఆలోచిస్తున్నారు అని కొనియాడారు. ఇది ఫార్మసిస్ట్ వివాహా ఆహ్వాన పత్రిక అంటూ...ఆ జంట ఆలోచనని ప్రశంసించారు. A pharmacist’s wedding invitation! People have become so innovative these days…. pic.twitter.com/VrrlMCZut9 — Harsh Goenka (@hvgoenka) August 20, 2022 (చదవండి: మెట్రో స్టేషన్‌పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా!) -
ఇండియాపై పందెం కాసిన సాహసవంతుడు
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా నా ఇరుగింటివాడే. ఉత్సాహం ఉరకలెత్తే మనిషి. ఈ మధ్యే కలిశా. కొంచెం నలతపడ్డట్టు కని పించాడు. ఎలా ఉన్నారని అడిగితే, ఠకీమని ‘మై ఠీక్ హూ’ అన్న సమాధానం వచ్చింది. కానీ దశాబ్దాలపాటు ఇరుగు పొరుగుగా ఉన్న మా అపార్ట్మెంట్ భవనంలో ఇకపై ఆ కంచు కంఠం వినిపించదు. రాకేశ్ కుటుంబ నేపథ్యం సాధారణమైందే. తండ్రి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పని చేసేవారు. కొడుకు మంచి ఛార్టెర్డ్ అకౌంటెంట్ అవుతాడని ఆశించాడు. అయితే రాకేశ్ మంచి సీఏ అవడమే కాదు... స్టాక్ మార్కెట్‌ను శాసించగల స్థాయికి చేరతాడనీ, వందల మంది ఆరాధించే, అనుసరించే షేర్ గురువుగా ఎదుగుతాడనీ ఆ తండ్రి కూడా ఊహించి ఉండడు. అట్లాంటి వ్యక్తి అయిన నా మిత్రుడు దూరమయ్యాడన్న బాధ ఒకవైపు ఉండనే ఉంది. అదే సమయంలో అతడి జ్ఞాపకాలూ నన్నిప్పుడు వెంటాడుతున్నాయి. ఒకరకంగా రాకేశ్ ఓ మాటల మాంత్రికుడని చెప్పాలి. ఆయన పలికే ప్రతి మాటనూ శ్రద్ధగా విని, ఆయన బాగుండాలని కోరుకున్నవాళ్లు ఎందరో. అహ్మదాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గతంలో ఓ సెమినార్ ఏర్పాటు చేసి పాల్గొనాల్సిందిగా రాకేశ్‌ను ఆహ్వానించింది. అయితే అతడిని కలిసేందుకు వచ్చిన జనాలను నియంత్రించేందుకుగానూ ప్రవేశ రుసుమును ఐదు వేల రూపాయలుగా నిర్వాహ కులు ప్రకటించాల్సి వచ్చిందంటే అతడి జనాదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడో మాట చెప్పుకోవాలి. రాకేశ్‌ది చాలా ఉదార స్వభావం. స్టాక్ మార్కెట్ సలహాలు బోలెడు ఉచితంగానే ఇచ్చేసేవాడు. అతడి దృష్టిలో పెట్టు బడులు పెట్టేవాళ్లు అప్పుడప్పుడూ తమ జేబులు ఖాళీ చేసుకోవాలి. అలా చేస్తేనే మళ్లీ అవి నిండు తాయని నమ్మేవాడు. ఇలా రిస్క్ తీసుకునే తత్వం అతడి వైఖరిలోనూ స్పష్టంగా కనిపించేది. పెట్టే పెట్టుబడులు ధైర్యంగా పెట్టేవాడు. ఆటుపోట్లు ఎదురైనా ఏమాత్రం తగ్గేవాడు కాదు. రాకేశ్ ఈమధ్యే ‘ఆకాశ’ పేరుతో ఓ విమానయాన సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో అతడితో మాట్లాడుతూ కోటీశ్వరులను లక్షాధిపతులుగా మార్చిన రంగంలో ఎందుకు డబ్బులు పోస్తు న్నావని అడిగా. రాకేశ్ నవ్వుతూ ఇచ్చిన సమాధానమేమిటో తెలుసా? ‘‘నాకు గతంపై నమ్మకం లేదు. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటా. ప్రస్తుత ట్రెండ్ ఏమిటన్నది అంచనా వేస్తా. అందుకు తగ్గట్టుగానే డబ్బులు పెట్టుబడి పెడతా’’ అని! భారత్ వృద్ధి పథంలో ఉందనీ, పర్యాటకంతోపాటు ఇతర రంగాల్లోనూ డిమాండ్ పెరగనుందన్న అంచనా రాకేశ్‌ది. ఇతరుల వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడమూ రాకేశ్ నైజమని చెప్పాలి. కానీ అతడు భారత్ విజయంపై పందెం కాశాడు. బ్రాండ్ల విషయంలో అందరికంటే ముందు ఎక్కువ సాధికారత సాధించింది కూడా రాకేశ్ మాత్రమే. టైటాన్ గురించి తరచూ చెబుతూండేవాడు. బ్రాండ్‌ను మాత్రమే చూసి తాను అందులో పెట్టుబడి పెట్టగలనని అనేవాడు. నా స్నేహితుడి కంపెనీ బోర్డులో సభ్యుడిగా చేరాడు రాకేశ్. రావడం రావడంతోనే తన వ్యూహాలతో కంపెనీ విస్తరణను చేపట్టాడు. డిజిటల్ టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చాడు. ఫలితంగా ఒకప్పటి ఆ చిన్న కంపెనీ ఇప్పుడు వందకోట్ల డాలర్ల సంస్థగా (యూనికార్న్) ఎదిగింది. రాకేశ్ ఆలోచనలు సరళంగా, సంప్రదాయా లకు కట్టుబడి ఉండేవి కాదు. గందరగోళ పరిస్థితుల్లోనే వృద్ధి నమోద వుతుందని తరచూ అనేవాడు. ఎంత కష్టపడాలో అంతే ఉల్లాసం గానూ గడపాలన్నది రాకేశ్ సిద్ధాంతం. ‘‘విజయం తాత్కాలి కమైంది. కాలంతోపాటు కరిగి పోయేది’’ అని నమ్మేవాడు. రాకేశ్ గొంతు కొంచెం పెద్దదే. ఎక్కడ ఉన్నా మాటను బట్టే అతడిని గుర్తిం చవచ్చు. అయితే తన ఆరోగ్యం గురించి మాత్రం పెద్దగా పట్టిం చుకునే వాడు కాదు. రోజంతా పడ్డ కష్టాన్ని మరచిపోయేందుకు అతడు చేసే ప్రయత్నాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ మరుగున పడి పోయింది. రాకేశ్ పాల్గొన్న పార్టీలన్నింటిలోనూ సందడి ఎక్కువగా ఉండేది. సందర్భం ఏదైనా ఏమాత్రం శషభిషలు, సంకోచాలు లేకుండా ఎంజాయ్ చేసేవాడు. ఒకసారి తన పుట్టినరోజు జరుపుకొనేందుకు రెండు వందల మంది మిత్రులను తీసుకుని మారిషస్ వెళ్లాడు. ఒకవైపు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూంటే.. రాకేశ్ జూమ్ కాల్స్‌లో కమెడియన్లను పెట్టుకుని మరీ ఆనందంగా గడిపాడు. అప్పట్లో దీని గురించి పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు నేనున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ పక్కనే రాకేశ్ ఓ భారీ భవంతిని కడుతున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్లాలన్న ఆశ నెరవేరకుండానే పర లోకానికి చేరాడు. రాకేశ్ స్థాపించిన కంపెనీ ‘‘రేర్ ఎంటర్ప్రైజ్’’ పేరులో ఉన్నట్లే దాన్ని ఓ అరుదైన సంస్థగా తీర్చిదిద్దేందుకు తన జీవితకాలం మొత్తం శ్రమించాడు. దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు మొదలుకొని, దేశం మూలమూలల్లోని సాధారణ పెట్టుబడిదారులు కూడా రాకేశ్‌ను మరువలేరు. ఈ మార్కెట్ గురువును గౌరవాభిమానాలతో గుర్తు చేసుకుంటారు. నారింజ, ఊదా రంగుల్లోని ‘ఆకాశ’ విమానం ఎగిరిన ప్రతిసారీ రాకేశ్ స్ఫూర్తిని స్మరించుకుంటారు. రాకేశ్ మాట ఒకటి నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది: ‘‘చేయాలను కున్నది, కలలు కన్నది ఏదైనాసరే మొదలుపెట్టు. భయం లేకుండా చేసే పనుల్లో ఓ అద్భుతమైన శక్తి ఉంది.’’ మిత్రుడా! శాశ్వత నిద్రలో నీకు సాంత్వన చేకూరుగాక! బతికినంత కాలం ఉత్సాహంతో ఉరకలెత్తావు. నీ తదుపరి ప్రయాణమూ అదే విధంగా సాగిపోనీయ్!! హర్ష్ గోయెంకా వ్యాసకర్త ప్రముఖ పారిశ్రామిక వేత్త -
Viral Video: గుండెను తడిమే దృశ్యాలు!
-
వైరల్ వీడియో.. గుండెను తడిమే దృశ్యాలు!
స్నేహానికి కన్నా మిన్న లోకాన లేదన్నారు. చెలిమిని వర్ణించడానికి ఈ ఒక్క మాట చాలు. నా అన్నవాళ్లు ఎవరున్నా లేకపోయినా మంచి మిత్రుడు తోడుంటే జీవితాంతం భరోసాగా బతికేయొచ్చు. స్నేహం విలువను చాటి చెప్పడానికి ఆగస్టు నెలలో మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక ఫ్రెండ్షిప్ డే’ లాంటి ప్రత్యేకమైన రోజుల్లో శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇక ఫొటోలు, వీడియోలకైతే లెక్కేలేదు. అయితే అక్కడక్కడా గుండెను తడిమే హృద్యమైన దృశ్యాలు మన కంటబడుతున్నాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్లో షేర్ చేసిన వీడియో హృదయానికి హత్తుకుంటోంది. (క్లిక్: వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..) విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలు.. వెల్లువలా వచ్చి ఓ మహిళను అప్యాయంగా ముద్దాతున్న దృశ్యాలు వీక్షకులను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి. తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్న మూగజీవాలను ఆమె గుండెలకు హత్తుకోవడం చూస్తుంటే.. హృదయం పులకిస్తుంది. ఆమె ఎవరు.. ఎక్కడ, ఎపుడు జరిగిందనే వివరాలతో సంబంధం లేకుండా అలౌకిక భావనలోకి వెళ్లిపోతాం. మనం ఏది ఇస్తే అదే తిరుగొస్తుందనడానికి ఇంత కంటే నిదర్శనం కావాలా! ఈ వీడియోను మీరూ చూడండి. -
అచ్చం సీఎం షిండేలా ఉన్నారే!.. ప్రముఖ వ్యాపారవేత్త ట్వీట్ వైరల్
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా.. సమకాలీన అంశాలపై త్వరగతిన సోషల్ మీడియా స్పందిస్తుంటారు. అదే టైంలో ఆయన నుంచి సరదా విషయాలు కూడా కొన్ని నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఫుడ్ వేస్టేజ్ విషయంలో బాధ్యతయుతంగా వ్యవహరించాలంటూ ఆయన ఇచ్చిన పిలుపు సైతం ఎంతోమందిని ఆకట్టుకుంది కూడా. ఈ తరుణంలో తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్.. పలువురిని ఆకట్టుకుంటోంది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే బ్లాక్ అండ్ వైట్ ఫొటోను.. ఆ పక్కనే తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఉంచి హర్ష్ గోయెంకా ఒక క్యాప్షన్ ఉంచారు. ‘నన్ను కలవడానికి వచ్చిన వారికి.. ఏదైనా సౌలభ్యం కోసం క్షమించండి. నా Z+ కేటగిరీ భద్రత ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసు. మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నాను. జై మహారాష్ట్ర!’ అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. సరదాగా చేసిన పోస్ట్ ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడు తషీమ్ పూనావాలాతో పాటు ఎందరో నెటిజన్లను ఆ ఫొటోకు కామెంట్లు చేస్తున్నారు. To those who come to meet me, sorry for any convenience. I know my Z+ security can be a nuisance. Look forward to your support. Jai Maharashtra! 😜 pic.twitter.com/zXb9HynS6W — Harsh Goenka (@hvgoenka) July 3, 2022 -
ఆ విషయంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి - రతన్ టాటా
గ్లోబల్ ఎకానమీగా ఎదిగేందుకు ఇండియా నిర్విరామంగా కృషి చేస్తోంది. ఫార్మా రంగంలో ప్రపంచానికి పెద్దన్నలా మారింది. చిన్న నగరాల నుంచి పెద్ద కంపెనీలు పుట్టుకొస్తున్నాయ్. మూడు పదుల వయసులోనే యంగ్ ఎంట్రప్యూనర్లు బిలియనీర్లుగా మారుతున్నారు. ఈ మార్పుకు సాక్షిగా నిలిచినవారిలో రతన్‌టాటా ఒకరు. ఓ సందర్భంగా దేశీయంగా వచ్చిన మార్పులను రతన్‌టాటా వివరించారు. దాన్ని ట్విటర్ ద్వారా మరో ఇండస్ట్రియలిస్టు హర్ష్ గోయెంకా మనకు షేర్ చేశారు. ఎంటర్‌ప్యూనర్‌షిప్ గురించి రతన్ టాటా మాట్లాడుతూ.. తాను యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక యువ ఉద్యోగి కొత్త ఐడియాతో తన బాస్ లేదా మేనేజర్‌ను సంప్రదిస్తే.. ‘ ముందు నువ్వు ఒక ఐదేళ్లు పని చేయ్. అప్పుడే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకుంటావ్’ ‘ చేతులు పైకి మడిచి ఆఫీస్‌లో కష్టపడి పని చేయ్, ఆ తర్వాత ఐడియాల గురించి ఆలోచిద్దువు కానీ’ అనే సమాధానాలే వారికి వినిపించేవి. ఎక్కడా ప్రోత్సాహకర వాతావరణం ఉండేది కాదని రతన్ టాటా తెలిపారు. ఇదే అంశంపై మరింత వివరణ ఇస్తూ రతన్ టాటా ఇలా అన్నారు.. ‘ఇప్పుడయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్. ఒక యంగ్ ఎంట్రప్యూనర్లకు మంచి ఐడియాలతో పాటు వాటిని ఎలా అమలు చేయాలో కూడా తెలుసు. వారు ఇరవైలలో ఉన్నా సరే తమ ఐడియాలను నిజం చేసుకోవడంలో ముందుంటున్నారు’ అని రతన్‌టాటా అన్నారు. పారిశ్రిమికంగా, కొత్త అవకాశాలను సృష్టించడంలో యాభై ఏళ్ల క్రితం దేశంలో పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు మధ్య ఉన్న తేడాను ఆయన వివరించారు. How decision making has changed over the years - Ratan Tata pic.twitter.com/hviSSqk2xc — Harsh Goenka (@hvgoenka) June 29, 2022 చదవండి: టాటా చేతికి ఎన్ఐఎన్ఎల్, మా లక్ష్యం అదే! -
మొత్తానికి ఈజీ డైటింగ్ టెక్నిక్: ఈ వీడియో చూస్తే
సాక్షి, ముంబై: కొండలా పెరిగిన శరారీన్ని, బాన లాంటి పొట్టను తగ్గించుకోవడం అంత వీజీ కాదు. డైటింగ్లూ, జిమ్‌లూ అంటూ కసరత్తు చేయడం, ఎక్కడో ఒక చోట్ ఫెయిల్ అవ్వడం మనం చూస్తుంటాం. కొంతమందేమో ఎంత కడుపుమాడ్చుకున్నా.. వ్యాయామం చేస్తున్నా..ఒళ్లు మాత్రం తగ్గడం లేదంటూ నిరాశ చెందుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలంటే చక్కటి ప్రణాళిక, దానికి మించిన నిబద్ధత, ఒక్కోసారి మంచి ట్రైనర్ ఉండటం చాలా అవసరం. అలాగే వైద్యపరంగా ఎందుకు లావు అవుతున్నామనే విశ్లేషణ కూడా అంతే అవసరం. ఈ క్రమంలో వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఒక ఫన్నీ వీడియోను ట్వీట్ చేశారు. మొత్తానికి ఈజీ డైటింగ్‌ని మార్గాన్ని కనుగొన్నారు అంటూ ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఇలా చేస్తే.. మీరు కచ్చితంగా స్లిమ్ అవడం ఖాయం అంటూ నెటిజన్లు ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. నవ్వులు పూయిస్తున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. Finally found a way to make dieting easier …..😀😀 pic.twitter.com/CzY6jvil8V — Harsh Goenka (@hvgoenka) June 26, 2022 -
అగ్నివీరులకు కార్పొరేట్ల రెడ్ కార్పెట్:ఉద్యోగాలు పెరుగుతాయి!
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో రిక్రూట్మెంట్కు సంబంధించి వివాదాస్పదంగా మారిన అగ్నిపథ్ స్కీముకు కార్పొరేట్ దిగ్గజాలు మద్దతు పలికారు. దీనితో కార్పొరేట్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. స్కీం విషయంలో అల్లర్లు చెలరేగడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్రా, అగ్నివీరులుగా శిక్షణ పొందిన యువతకు తమ కంపెనీలో కొలువులిస్తామని తెలిపారు. ‘అగ్నిపథ్ స్కీముపై హింసాకాండ చెల రేగడం బాధ కలిగించింది. ఈ పథకంతో క్రమశిక్షణ, నైపుణ్యాలు పొందడం వల్ల అగ్నివీరులకు ఉద్యోగార్హతలు మెరుగు పడతాయని, వారికి మరింత ప్రాధాన్యం లభించగలదని దీన్ని గతేడాది ప్రతిపాదించినప్పుడే నేను చెప్పాను. అటువంటి సుశిక్షితులైన, సమర్ధులైన యువతను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మేము స్వాగతిస్తున్నాము‘ అని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో మహీంద్రా ట్వీట్ చేశారు. ఇంతకీ మహీంద్రా గ్రూపులో అగ్నివీరులకు ఏ తరహా ఉద్యోగాలిస్తారంటూ ఒక ట్విటర్ యూజర్ వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆపరేషన్స్ మొదలుకుని అడ్మినిస్ట్రేషన్, సరఫరా వ్యవస్థ నిర్వహణ వరకూ వివిధ విభాగాల్లో వారికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. సమాజంపై సానుకూల ప్రభావం.. మహీంద్రా ట్వీట్‌పై స్పందిస్తూ గోయెంకా ‘ఆర్పీజీ గ్రూప్ కూడా అగ్నివీరులను నియమించుకునే అవకాశాన్ని స్వాగతిస్తోంది. మన యువతకు భవిష్యత్‌పై నమ్మకం కలిగించేలా మిగతా కార్పొరేట్లు కూడా మా వెంట వస్తారని ఆశిస్తున్నాను‘ అని వ్యాఖ్యానించారు. ‘క్రమశిక్షణ, నైపుణ్యాలు గల అగ్నివీరులు.. మార్కెట్ తక్షణావసరాలకు తగిన పరిష్కార మార్గాలతో ఎంతగానో తోడ్పడగలరు. సమర్ధులైన యువతను రిక్రూట్ చేసుకోవడంలో పరిశ్రమ మద్దతుగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను‘ అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి ఒక ట్వీట్లో తెలిపారు. మరోవైపు, అగ్నిపథ్ స్కీము.. సమాజంపై గణనీయ స్థాయిలో సానుకూల ప్రభావం చూప గలదని, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలదని టీవీఎస్ మోటర్ కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు అభిప్రాయపడ్డారు. ‘రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధి సాధనలో, సమాజాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంలో అగ్నివీరులు ముఖ్య పాత్ర పోషించగలరు‘ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయుధ బలగాల్లో చేరి దేశానికి సేవలు అందించడంతో పాటు టాటా గ్రూప్ సహా పరిశ్రమకు అత్యంత క్రమశిక్షణ గల, సుశిక్షితులైన యువతను అందించేందుకు అగ్నిపథ్ తోడ్పడగలదని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ ద్వారా లభించే అవకాశాలను తాము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అగ్గి రాజేసిన అగ్నిపథ్.. పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు వారిని నాలుగేళ్ల పాటు సాయుధ బలగాల్లో రిక్రూట్ చేసుకునేందుకు ఉద్దేశించిన అగ్నిపథ్ స్కీమును జూన్ 14న కేంద్రం ప్రకటించింది. తర్వాత గరిష్ట వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఇలా తీసుకునే వారిలో 25 శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు సర్వీసులో కొనసాగించే అవకాశం ఉంది. నాలుగేళ్లకు రిటైర్ అయ్యేవారికి నిర్దిష్ట ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా రూపొందించారు. అయితే, సాయుధ బలగాల్లో పూర్తి స్థాయి రిక్రూట్మెంట్పై ఆశలు పెట్టుకున్న అభ్యర్ధులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో హింసాకాండకు కూడా ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలోనే స్కీములోని సానుకూల అంశాలపై అవగాహన కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. -
పనిలో మజా లేదు.. నేను వెళ్లిపోతున్నా..
దేశంలో చాప కింద నీరులా నిరుద్యోగం విస్తరిస్తోంది. అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళన హింస నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతున్నాయి. ఉద్యోగాల కోసం ఇంతలా యువత ఎదురు చూస్తుంటే మరోవైపు చేస్తున్న పనిలో మజా రావడం లేదంటూ ఉద్యోగాలను వదిలేస్తున్న ట్రెండ్ కూడా కనిపిస్తోంది. ఒకే సమయంలో రెండు భిన్నమైన దృశ్యాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో ఎడ్యుటెక్ కంపెనీలు తామరతంపరలా పుట్టుకొచ్చాయి. ఆన్లైన్ క్లాసుల పద్దతి ఏడాదికి పైగా కొనసాగడంతో వీటికి మంచి ఊపు లభించింది. దేశం నలుమూలల అనేక మంది ఈ ఎడ్యుటెక్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. తమ భవిష్యత్తుకి బంగారు బాటలు పడ్డాయనే భావనలో మునిగిపోయారు. కానీ కొద్ది రోజులకే పరిస్థితి తారుమారైంది. రెగ్యులర్ క్లాసులు ప్రారంభంకాగానే ఎడ్యుటెక్ కంపెనీల పునాదులు కదిలిపోవడం మొదలైంది. ఫలితంగా అనేక కంపెనీల్లో కొత్తగా పుట్టుకొచ్చిన ఉద్యోగాలు గోవిందా అయ్యాయి. అలా పని చేయలేం కోవిడ్ 19 కారణంగా సోషల్ డిస్టెన్స్ అనేది తప్పనిసరి వ్యవహారంగా మారిపోయింది. దీంతో అనేక కంపెనీలు వర్క్ ఫ్రం హోం / రిమోట్ వర్క్ కల్చర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ముఖ్యంగా ఐటీ ఆధారిత కంపెనీలు అయితే వర్క్ ఫ్రం హోంను తమ భుజాలపై మోశాయి. కానీ కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టగానే ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్నాయ్. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తోంది. బలవంతంగా ఆఫీసుకు రమ్మంటే ఉద్యోగాలు మానేస్తామనే ప్రొఫెషనల్స్ పెరిగిపోతున్నారు. సరికొత్త సమస్య కరోనా తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాల విషయంలో కొత్త సమస్యలు పుట్టుకువస్తున్నాయి. ఉద్యోగాలు లేక కొందరు వెతలు అనుభవిస్తుంటే తమకు కంఫర్ట్ మిస్ అవుతున్నామంటూ మరికొందరు బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఆర్థిక అంశాలు, లాజిస్టిక్స్, భౌతిక అంశాలతో ముడిపడిన అంశాలు. కానీ వీటికి భిన్నంగా సరికొత్త సమస్యను మన ముందుకు మోసుకు వచ్చారు ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా. మజా లేదంటూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ సమాకాలిన అంశాలపై స్పందించే హార్ష్ గోయెంకా మరో అంశాన్ని మన ముందుకు తెచ్చారు. రాజేశ్ అనే ఉద్యోగి ఇటీవల తన రాజీనామా చేశారు. పని చేస్తున్న చోట మజా దొరకడం లేదు కాబట్టి రిజైన్ చేస్తున్నట్టు సింపుల్‌గా తేల్చేశాడు అతను. సుత్తి లేకుంటా సూటిగా రెండంటే రెండు రెండు ముక్కల్లో విషయం చెప్పేశాడు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. This letter is short but very deep. A serious problem that we all need to solve… pic.twitter.com/B35ig45Hhs — Harsh Goenka (@hvgoenka) June 19, 2022 సీరియస్ ఇష్యూ మజా లేదనే కారణంతో ఉద్యోగాన్ని వదులుకోవడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారను హార్ష్ గోయెంకా. పని చేసే చోట ఉత్సాహం, ప్రోత్సాహాం, స్ఫూర్తి లాంటివి కరువైపోవడం సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అంటూ తేల్చిచెప్పారు. ఇతర కంపెనీల్లో కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించుకుని ఉద్యోగుల్లో ఉత్సాహం నింపుతూ ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకు వచ్చేలా వ్యూహాలు రూపొందించాలనే విధంగా హెచ్చరికలు జారీ చేశారు. చదవండి: మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు! -
ఇది చూసి నవ్వాపుకోలేకపోతున్నా...
కరోనా తెచ్చిన సంక్షోభం ఆ వెంటనే వచ్చిన సరఫరా వ్యవస్థలో అవాంతరాలు ఉక్రెయిన్ యుద్ధంతో ఏర్పడిన ముడి సరుకుల కొరత కారణంగా ఇండస్ట్రియల్ సెక్టార్లో వేగం మందగించింది. ముఖ్యంగా చిప్సెట్ల మీద ఆధారపడ్డ పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అయితే పరిస్థితులతో సంబంధం లేకుండా టెన్షన్ ఫ్రీగా ఉండే పారిశ్రామికవేత్తల్లో ముందు వరుసలో ఉంటారు హార్ష్‌గోయెంకా, ఆనంద్ మహీంద్రాలు. తాజాగా నెట్టింట వైరల్‌గా మారిన ఓ ఫన్నీ వీడియోను హార్ష్ గోయెంకా ట్విటర్లో షేర్ చేశారు. I laughed so much 😂😂pic.twitter.com/vyWm8X0xJA — Harsh Goenka (@hvgoenka) June 17, 2022 చదవండి: ఓన్లీ ఇన్ ఇండియా - ఆనంద్ మహీంద్రా -
ఆర్నాల్డ్ సుభాష్‌నగర్.. ఎక్కడున్నాడీ వ్యక్తి !
వ్యాపారంలో నిరంతరం బిజీగా ఉన్నా కచ్చితంగా వీలు చేసుకుని సోషల్ మీడియాకి వచ్చే ఇండస్ట్రియలిస్టుల్లో ముందు వరుసలో ఉంటారు ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకాలు. సమకాలిన అంశాలపై స్పందించడంతో పాటు అప్పుడప్పుడు నవ్వులు పూయించే ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంటారు. కాకతాళీయంగా ఈ సారి ఇద్దరు ఒకే రోజు అలాంటి ఫోటో/వీడియోను షేర్ చేశారు. ప్రపంచంలో ఏ విషయాన్నైనా ఇండియనైజ్డ్ చేయడంలో మన వాళ్లకు సాటి లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు/ఫోటోలు సోషల్ మీడియాలో దండయాత్ర చేశాయి. కానీ ఓ కొత్త ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. హాలీవుడ్ కండల వీరుడు టెర్మినేటర్, కమాండో ఆర్నాల్డ్ షార్వ్జ్నెగ్గర్ పేరు రాయడం, పలకడంలో ఇప్పటికీ ఇండియన్లు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందుకే ఓ వీధికి ఆర్నాల్డ్ షార్వ్జ్నెగర్ అని రాయకుండా దేశీ స్టైల్లో ఆర్నాల్డ్ సుభాష్‌నగర్ అని రాసేశారు. ‘ఎందుకు ఇంత కాలం ఆర్నాల్డ్ పూర్తి పేరు పలికేందుకు ఇబ్బంది పడ్డాను సింపుల్‌గా సుభాష్ నగర్ అని పిలిస్తే పోయేదానికి అంటూ కామెంట్ పెట్టారు ఆనంద్ మహీంద్రా. This is the ‘Great Indian Funnel.’ We adopt everything and everyone & give them Indian Avatars! हम पूरी दुनिया को अपनाते हैं. (And I wonder why I used to try so hard to pronounce ‘Schwarzenegger’ when I could have just called him Mr. Subhashnagar..) pic.twitter.com/zqOZN05k2N — anand mahindra (@anandmahindra) June 16, 2022 మరోవీడియో హర్ష గోయెంకా తనలోని సెన్సాఫ్ హ్యుమర్‌ని పండించారు. తనకు ఈ మధ్యనే బరువు తగ్గడానికి డైట్ చేయంటూ సూచించారు. అందు కోసం రోజుకే ఒకేట రోటీ తినమని చెప్పారంటూ కామెంట్ చేశారు. ఆ ఒక్క రొట్టే తయారు చేసే వ్యక్తి కోసం వెదుకుతున్నట్టు కూడా పేర్కొన్నారు. తీరా ఎవరా ఒక్క వ్యక్తి అని తెలుసుకోవాలంటే మీరే ఆ వీడియో చూడండ మరి! I’ve been asked to lose weight and eat only one roti. Now I’m searching for him….😄 pic.twitter.com/SEIPuA47gP — Harsh Goenka (@hvgoenka) June 16, 2022 చదవండి: ఆనంద్ మహీంద్రా సందేశం.. పనంతా నువ్వొక్కడివే చేయకు! -
అమెజాన్ కనుక ఈ బిజినెస్‌లోకి దిగితే తిరుగుండదు !
హార్షానంద పేరుతో ట్విటర్ వేదికగా చెణకులు విసిరే ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా అమెజాన్‌పై అదిరిపోయే పంచ్ పేల్చారు. నెటిజన్లు సైతం హర్ష్ గోయెంకా సెన్సాఫ్ హ్యూమర్‌కి పడిపడి నవ్వుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే... అమెజాన్ సంస్థ ఇదీఅది అని తేడా లేకుండా అన్ని రకాల వస్తువులను అమ్ముతూ వ్యాపారం చేస్తూ ఉంటుంది కదా? ఇంత వరకు అమెజాన్ చేయని వ్యాపారం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు తానే బదులిస్తూ.. అమెజాన్ ఇప్పటి వరకు చేయని వ్యాపారం మ్యాట్రిమోని సర్వీసెస్ అంటూ తెలిపారు. ఒక వేళ అమెజాన్ కనుక మ్యాట్రిమోని సర్వీసుల్లోకి వస్తే తప్పకుండా విజయవంతం అవుతుందంటూ బల్లగుద్ది మరీ చెప్పాడు. ఎందుకంటే అమెజాన్‌లో కొనుగోలు చేసే వస్తువలు బాగాలేకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేసే అవకాశం ఉంది కాబట్టి అంటూ చివర్న ఓ పంచ్‌ను అద్దారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. I asked Swami Harshanand “Amazon is in everything. Anything they are missing?” He answered “Yes, they should be in matrimonial services. It is a blockbuster idea because they have a 30 day return policy, no questions asked.” pic.twitter.com/R1nXfiCrp8 — Harsh Goenka (@hvgoenka) June 13, 2022 చదవండి: ఆనంద్ మహీంద్రా సందేశం.. పనంతా నువ్వొక్కడివే చేయకు! -
ఈ విషయంలో మన వంతు బాధ్యత నెరవేర్చాల్సిందే
ఇటీవల ఇంటర్నెట్లో ఓ ఫోటో బాగా పాపులర్ అయ్యింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యాంటీన్లో ఏర్పాటు చేసిన ఈ బోర్డు ఎంతో మందిని ఆలోచనలో పడేంది. అలాంటి వారిలో సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే హర్ష్ గోయెంకా కూడా ఉన్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఆ ఫోటోకు తనవంతు సమాచారం జోడించి మరింత అర్థవంతంగా మార్చారు. అంతేకాదు ఆ సబ్జెక్టుపై మనం నిర్వర్తితంచాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఇంతకీ నెట్టింట వైరల్‌గా మారిన టీసీఎస్ క్యాంటీన్‌కి సంబంధించిన సదరు ఫోటోలో.. తినడానికి ఎన్ని ఐటమ్స్ కావాలో అన్ని తీసుకోండి. కానీ తీసుకున్న ఐటమ్స్‌ని పూర్తిగా తినండి. వృధా చేయకండి. క్రితం రోజు ఇలా వృధా అయిన ఆహారం 45 కేజీలు. దీంతో ఒక 180 మందికి భోజనం పెట్టవచ్చంటూ వివరించారు. In industrialised regions, almost half of the total food squandered, around 300 million tonnes annually, occurs because producers, retailers and consumers discard food that is still fit for consumption. Let’s all do something about it…. pic.twitter.com/TJEqI5jr0z — Harsh Goenka (@hvgoenka) June 7, 2022 ఈ ఫోటోకు హార్ష్ గోయెంకా మరింత సమాచారం అందిస్తూ ... హోటల్ ఇండస్ట్రీలో ఏటా 3000 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతోందంటూ తెలిపారు. ఆహారం తయారీదారు నుంచి అమ్మకందారు తినేవాళ్ల వరకు అందరూ ఎంతో కొంత తినదగిన పదార్థాలను చెత్తకుండీ పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది తిండికి అల్లల్లాడుతుంటే మరోవైపు ఇంత వృధా చేయడం సరైన పనా అని ప్రశ్నించారు. ఈ విషయంలో మనమంతా ఏదో ఒకటి చేయాలంటూ సూచించారు హార్ష్ గోయెంకా. చదవండి: బిల్‌గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా? -
అవును ఇది నిజమే కదా! మనసులను తాకే మాట?
నిత్యం వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నా వీలుచూసుకుని సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించే బిజినెస్ పర్సన్స్‌లో ఆర్పీజీ గ్రూపు సీఈవో హర్ష్ గోయెంకా ఒకరు. క్రికెట్ మొదలు పాలిటిక్స్ వరకు కాంటెంపరరీ అంశాలపై ఆయన స్పందిస్తుంటారు. కొన్ని సార్లు అవి నవ్వులు పూయించగా మరి కొన్ని సార్లు సరికొత్త ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. అయితే ఈసారి ఆయన మనసులను హత్తుకునేలా లోకల్ షాపింగ్‌పై ట్వీట్ చేశారు. లోకల్ కష్టాలు ఈ కామర్స్ రంగం జోరందుకోవడంతో లోకల్ మార్కెట్‌కు కొంత మేర కోత పడిందనేది కాదనలేని వాస్తవం. అలాగే తళుకుబెళులతో పాటు హంగు ఆర్భాటం ఉండే బ్రాండెడ్ షోరూమ్స్ చిన్నచిన్న పట్టణాలకు కూడా విస్తరించడం కూడా లోకల్ షాపింగ్‌ను దెబ్బ తీస్తోంది. కాలానుగుణంగా వస్తున్న ఈ మార్పులకు అందరం మౌనసాక్షలుగానే మిగిలిపోయాం. అయితే లోకల్ షాపింగ్ ఎందుకు అవసరమో చెబుతూ ఓ షాప్ ఎదుట ఏర్పాటు చేసిన బోర్డు ఆలోచింప చేసే విధంగా ఉంది. అదే విషయాన్ని యథావిధిగా ట్వీట్ చేశారు హర్ష్. షాప్ లోకల్ షాప్ ఎదుట ఏర్పాటు చేసిన బోర్డులో.. ‘ మీరు ఒక చిన్న షాపులో కొనడం వల్ల ఓ పెద్ద కంపెనీ సీఈవో తమ మూడో హాలిడే హోం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు సమకూర్చలేకపోవచ్చు. కానీ ఆ డబ్బు ఓ చిన్నారి డ్యాన్స్ స్కూల్‌కి వెళ్లేందుకు సాయపడుతుంది. మరో పిల్లాడు తన టీం జెర్సీని కొనుక్కునే శక్తిని ఇస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు దోహదం చేస్తుంది. స్థానికంగా ఉండే చిన్న దుకాణాల్లో కొనుగోలు చేయండి’ అని రాసింది. దీనికి మేక్ సోమచ్ సెన్స్.. మీ దగ్గరున్న చిన్న దుకాణదారుల దగ్గర కొనండి అంటూ హర్ష్ సూచించారు. Makes so much sense….buy from your small vendor. pic.twitter.com/WMDwuaEH8j — Harsh Goenka (@hvgoenka) June 2, 2022 చదవండి: 'వర్క్ ఫ్రమ్ హోమ్'లో కరోనా, హర్షానంద స్వామి ఏం చెప్పారంటే! -
టాటాలకే కాదు బిర్లాలకు ఉంది ఓ కారు.. ఇప్పుడది దూసుకొస్తోంది
ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలిగిన అంబాసిడర్ కారు మార్కెట్లోకి వస్తోంది. అది కూడా కొత్త రూపులో కొత్త టెక్నాలజీతో అనే వార్తలు బయటకు రావడం ఆలస్యం అందరి దృష్టి అంబాసిడర్ మీదే పడింది. సామాన్యులు మొదలు ఇండస్ట్రియలిస్టుల వరకు అంబాసిడర్‌తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా ట్విటర్లో స్పందిస్తూ... మిలీనియం ముందు తరం వాళ్లకు అంబాసిడర్ గురించి బాగా తెలుసు. అదొక గొప్ప కారు మాత్రమే కాదు. కుటుంబంలో ఓ భాగం. అలాంటి కారు మళ్లీ తిరిగి రావడం సంతోషకరం అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మరికొందరు నెటిజన్లు అంబాసిడర్ కారు పుట్టుపూర్వోత్తరాలను తవ్వి తీస్తున్నారు. చాలా మందికి తెలియని విషయాలను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అంబాసిడర్ కారును తయారు చేసింది హిందూస్థాన్ మోటార్స్ అనే సంస్థ. పేరు వినగానే ఇది ప్రభుత్వ రంగ సంస్థ అనుకుంటాం. కానీ హిందూస్థాన్ మోటాన్స్ ప్రైవేటు సంస్థ. దాని వ్యవస్థాపకుడు సీకే బిర్లా. అంటూ అంబాసిడర్ కారు గురించి ఇప్పటి తరానికి తెలియని విషయాలు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే టాటాలకే కాదు బిర్లాలకు కూడా కార్ల కంపెనీ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. Little known fact is that this was a Birla car… HM belonged to my uncle Mr. CK #Birla!@hvgoenka 🙏 https://t.co/KhlnuxSg9l — Vedant Birla (@birla_vedant) May 30, 2022 హిందూస్థాన్ మోటార్ సంస్థ ఫ్రెంచ్‌కి చెందిన ప్యూగట్ సంస్థతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం త్వరలో సరికొత్త హంగులతో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారుగా అంబాసిడర్‌ను ఇండియాలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఒకప్పటి ఐకానిక్ కారు మళ్లీ మార్కెట్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నారు చాలా మంది. చదవండి: Ambassador Electric Car: ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
అంబానీ,బిల్‌గేట్స్, బఫెట్.. బ్రాండెడ్ డ్రెస్‌లు ఎందుకు వేయరంటే?
బాగా డబ్బున్న వాళ్లు పూటకో డ్రెస్ వేయోచ్చు. బ్రాండెడ్ బట్టలు తప్ప మరొకటి ముట్టుకోరు అని చాలా మంది నమ్ముతారు. కానీ బిజిజెస్ మీటింగులు మినహాయిస్తే మిగిలిన సమయాల్లో ముకేశ్ అంబానీ మొదలు బిల్‌గేట్స్ వరకు చాలాసార్లు సాదాసీదా బట్టల్లోనే కనిపిస్తుంటారు. వాళ్లకేం లోటు ఎందుకిలా నాన్ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారనే సందేహాలు మనకు కలుగుతుంటాయి. అచ్చంగా మనకు వచ్చినలాంటి సందేహమే ఇండస్ట్రియలిస్టు ఆర్పీజీ గ్రూప్స్ చైర్మన్ హర్ష్ గోయెంకాకి వచ్చింది. వెంటనే ఆయనో బిలియనీర్‌ని ఈ ప్రశ్న అడిగారట. దానికి ఆయనిచ్చిన సమాధానం వింటే ఔరా అని ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది. హార్ష్గోయెంకాకు బిలియనీర్ చెప్పిన సమాధానం ప్రకారం... ఉతికి పారేసే బట్టల మీద ఎక్కువగా డబ్బులు వెచ్చించడం వృధా ప్రయాస. ఎంత ఖరీదై బట్టలైన కొంత కాలానికి పాడైపోతాయి లేదా చినిగిపోతాయి. కాబట్టి బట్టల మీద పెట్టే డబ్బులేవో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం ఉత్తమం. నేను ఎలాంటి వాడిని నా విలువ ఏంటనేది నా పని నిర్ణయిస్తుంది కానీ నేనే ధరించే బ్రాండెడ్ బట్టలు కాదంటూ తెలిపాడు. అందుకేనేమో చాలా మంది వ్యాపార రంగానికి చెందిన బిలియనీర్లు ఇతర సెలబ్రిటీల్ల డబ్బును ప్రదర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. I asked a billionaire why he didn’t wear brands? He replied “Why spend millions on clothing that will wash out, wear down or get lost, when you can save the money to invest in real estate or open a business? Brands don’t define me. My work, my values do!” pic.twitter.com/J9iMj0B5JQ — Harsh Goenka (@hvgoenka) May 24, 2022 చదవండి: 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ -
ఒకే ఫ్రేమ్‌లో ఈలాన్ మస్క్, జెఫ్‌బేజోస్.. హార్ష్ ఆకట్టుకునే వ్యాఖ్య
ఈలాన్‌మస్క్, జెఫ్బేజోస్లో స్టార్టప్‌లతో తమ కెరీర్ ప్రారంభించి ప్రపంచంలోనే అతి పెద్ద కార్పోరేట్ కంపెనీలకు యజమానులు అయ్యారు. అయితే తమ విజయం ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగే వరకు ఇద్దరు ‘తగ్గెదేలే’ అన్నట్టుగా వ్యవహరించారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా తమ గళం విప్పడం మాత్రం ఆగలేదు. ఇందుకు ఉదాహారణగా అనేక ఘటనలు ఉన్నాయి. 2004లో జరిగిన వీరిద్దరు ఓ రెస్టారెంట్లో కలిసి స్పేస్ గురించి సీరియస్‌గా చర్చించారు. ఇలా ఇద్దరు దిగ్గజాలు కలిసున్న ఫోటోను ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్, ఆర్పీజీ గ్రూపు ఎండీ హార్ష్ గోయెంకా ట్వీట్ చేశాడు. ఆ ఫోటోలో ఈలాన్‌మస్క్, జెఫ్ బేజోస్లిద్దరు ఉన్నారు. వీరిద్దరి మధ్య పసుపు రంగులో విరబూసిన ఓ టులిప్ పువ్వు కూడా ఉంది. ఈ ఫోటోను వర్ణిస్తూ హార్ష్.. ది మోస్ట్ ఇంపార్టెంట్ టూ లిప్స్ ఇన్ ది వరల్డ్ అంటూ ఆసక్తికరంగా కామెంట్ జోడించారు. నెటిజన్లు సైతం భారీ ఎత్తున ఈ ఫోటోకు తమ స్పందన తెలుపుతున్నారు. The most important ‘Two-lips’ in the world! pic.twitter.com/m2FHHwWCvL — Harsh Goenka (@hvgoenka) May 15, 2022 చదవండి: హెచ్ఆర్ ఎంతో ప్రతిభావంతులు.. కానీ జీతం దగ్గర మాత్రం.. -
Harsh Goenka: కార్పోరేట్ సెక్టార్లో హెచ్ఆర్ పాత్ర ఏంటంటే?
ఓ స్థాయికి చేరుకున్న ఈ సంస్థలో అయినా యాజమాన్యం, ఉద్యోగులకు వారధిగా పని చేసేది హ్యుమన్ రిసోర్స్ (హెచ్ఆర్) డిపార్ట్మెంట్. ఎంతో శ్రమించి పని చేసే ఈ డిపార్ట్‌మెంట్‌పై సోషల్ మీడియాలో నిత్యం జోకులు, మీమ్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా హెచ్ఆర్ పని తీరు ఎలా ఉంటుంది. కార్పోరేట్ వరల్డ్‌లో వారి పాత్ర ఎలా ఉంటోందో ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్‌గోయెంకా సరదాగా ట్విటర్లో స్వామి హర్షానంద అవతారంలో వివరించారు. స్వామి హర్షానంద అభిప్రాయం ప్రకారం కార్పోరేట్ ప్రపంచంలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేక రకలైన పాత్రలను పోషిస్తుంది. ఇందులో ముఖ్యమైన వాటిలో అనధికారిక లాయర్, సైకియాట్రిస్ట్, ఈవెంట్ ఆర్గనైజర్, టీచర్, సమస్యల పరిష్కార కర్త, కెరీర్ ప్లానర్, డిటెక్టివ్ వంటివి ఉన్నాయి. ఇన్ని పాత్రలు సమర్థంగా పోషించే అతను ఉద్యోగులకు జీతాలిచ్చేప్పుడు పినాసిగా మారిపోతాదంటూ చమత్కరించారు హర్ష్ గోయెంకా. హర్ష్‌గోయెంకా ట్వీట్‌కు నెటిజన్లు కూడా సరదాగా రిప్లై ఇస్తున్నారు. కొందరు చాలా మంది స్వామి హర్షానంద అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా.. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ప్రతినిధులు మాత్రం.. ఉద్యోగులు తమనే టార్గెట్ చేస్తారని, కానీ జీతం పెంచడం తమ చేతిలో ఉండదని అది హెచ్‌వోడీల ఇష్టమని చెబుతున్నారు. ఎన్నో పనులు సమర్థంగా పని చేస్తున్నా.. నిందలు తమపైనే పడతాయంటున్నారు. I asked Swami Harshanand “Swami, please explain to me the role of HR in the corporate context?” He thought for a while and answered “HR is the unofficial lawyer, psychiatrist, event organizer, teacher, conflict solver, career planner, detective and distributor of peanuts.” — Harsh Goenka (@hvgoenka) May 10, 2022 చదవండి: ష్.. చెప్తే నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారు: ఆనంద్ మహీంద్రా -
'వర్క్ ఫ్రమ్ హోమ్'లో కరోనా, హర్షానంద స్వామి ఏం చెప్పారంటే!
చైనాలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. 2019 తరువాత మళ్లీ తీవ్రస్థాయిలో విలయ తాండవం చేస్తోంది.దాన్ని కట్టడి చేసేందుకు చైనా ప్రభ్వుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రముఖులుండే బీజింగ్ నగరంలోని అన్నీ రెస్టారెంట్లపై ఆంక్షలు విధించింది. థీమ్ పార్క్ యూనివర్సల్ స్టూడియోను షట్ డౌన్ చేసింది. గత తొమ్మిది రోజుల్లో 350 కేసులు నమోదు కావడంతో జిన్ పింగ్ ప్రభుత్వం బీజింగ్ ప్రజలపై ఆంక్షలు విధించింది. షాంఘై తరహాలో..బీజింగ్‌లో కరోనా కేసులు నమోదైన భవనాలు, గృహాల్లో నివాసం ఉంటున్న ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హాలిడేస్ కావడంతో జిమ్‌లు, థియేటర్లను సైతం స్థానిక అధికారులు మూసివేశారు. గ్రేట్ వాల్ వంటి పర్యాటక ప్రదేశాలను సందర్శించే సందర్శకులు గడిచిన 48 గంటలలోపు కోవిడ్ రిపోర్ట్‌ను చూపించాల్సి ఉండగా..ఇప్పుడు చైనాలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో భారత వ్యాపార వేత్త హర్ష గోయెంకా సెటైరికల్‌గా స్పందించారు. I asked my Guru “What is discipline?” He replied “When you are tired, lazy and do not have a single reason to wake up from that cozy bed in the morning and go for work, there comes a small voice from deep inside your heart to let up and push forward. That voice is discipline!” — Harsh Goenka (@hvgoenka) April 30, 2022 'చైనాలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని నేను హర్షానంద స్వామిని అడిగాను. వైరస్ అలసిపోయింది. అందుకే వర్క్ ఫ్రమ్ హోం చేయాలనుకుంటుంది. అని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా, చైనాలో పెరిగిపోతున్న కరోనా కేసులు, కరోనా (చైనాను మినహాఇస్తే) తగ్గడంతో ఇన్నిరోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఇంటికే పరిమితమైన ఉద్యోగులు.. ఇప్పుడు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. పై అంశాలనే ప్రస్తావిస్తూ హర్ష్ గోయాంక్ సరదా ట్వీట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి👉 అరెభాయ్.. బయటకురా.. వర్క్ ఫ్రం హోంపై ప్రముఖ ఇండస్ట్రియలిస్టు స్పందన -
ఐపీఎల్ రేటింగ్స్ ఎందుకు తగ్గాయ్! విశ్లేషించిన బిజినెస్ మ్యాగ్నెట్
క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించే కార్పోరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్‌కి సరైన వేదికగా భావించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ రేటింగ్స ఈ సీజన్లో దారుణంగా పడిపోయాయి. గతేడాదితో పోల్చితే 15 నుంచి 40 ఏళ్ల వయసులో వివిధ కేటగిరీల్లో సగటున 30 శాతం పైగానే వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది. దీనిపై సియట్ టైర్స్ చైర్మన్ ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ హార్స్ హార్ష్ గోయెంకా స్పందించారు. ఐపీఎల్ టీవీ రేటింగ్స్ తగ్గడానికి హర్ష్ గోయెంకా తెలిపిన కారణాలు - ఎక్కువ మంది అభిమానుల మద్దతు ఉన్న ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ జట్లు వరుసగా ఓటమి పాలవుతుండటం - విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోని వంటి దిగ్గజాలు కూడా వరుసగా ఫెయిల్ అవుతుండటం - చాలా మ్యాచ్‌లు ఉత్కంఠ లేకుండా నీరసంగా ముగుస్తుండటం - ఎక్కువ మ్యాచ్‌లు ముంబై రీజియన్‌లో జరపడం వల్ల గ్యాలరీల్లో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడం - కరోనా కారణంగా రెండేళ్ల పాటు టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోయిన జనాలు ఇప్పుడు ఎక్కువగా బయట తిరగాలి అనుకోవడం వల్ల ఈసారి ఐపీఎల్ రేటింగ్స్ తగ్గిపోయినట్టు హర్ష్ గోయెంకా వివరించారు. ఐపీఎల్ తాజా సీజన్ మొదటి వారానికి సంబంధించి బార్క్ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో గతేడాదితో పోల్చితే వివిధ వయసుల వారీగా 15-21 గ్రూప్‌లో 38 శాతం, 22-30 గ్రూపులో 33 శాతం. 31-40 గ్రూపులో 32 శాతం మేర వీక్షకుల సంఖ్య తగ్గినట్టు తెలిపింది. రెండో వారం ఫలితాల్లో ఇది 40 శాతానికి చేరవచ్చని తెలిపింది. ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్‌టీవీ రూ.3,200 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్ ద్వారా రూ.4000 కోట్ల రెవెన్యూ ఆశిస్తోంది. ఐపీఎల్లో 10 సెకన్ల యాడ్‌కి రూ.16.50 లక్షల ఫీజు వసూలు చేస్తోంది స్టార్. చదవండి: ప్రచారంలో పీక్స్.. మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఉచితం -
అరెభాయ్.. బయటకురా.. వర్క్ ఫ్రం హోంపై ప్రముఖ ఇండస్ట్రియలిస్టు స్పందన
కరోనా థర్డ్ వేవ్ మన దేశంలో నామమాత్రం కావడంతో క్రమంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. మాస్క్‌లు, సామాజిక దూరం తప్ప మిగిలిన కరోనా ఆంక్షలన్నీ 2022 ఏప్రిల్ 1 నుంచి రద్దయిపోతాయంటూ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేసిన కంపెనీలు క్రమంగా ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వర్క్ ఫ్రం హోంపై స్పందిస్తూ.. ఈ మోడల్ భారతీయులకు నప్పదని. ప్రొడక్టివి దెబ్బతింటుందంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయాలంటూ హింట్ ఇచ్చారు. ఆయన బాటలోనే మరికొన్ని కంపెనీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా స్పందించారు. కంపెనీలు వర్క్ ఫ్రం హోంకి గుడ్ బై ఉద్యోగులను ఎలా ఆఫీసులకు పిలుస్తున్నాయో చూడండి అంటూ అరేభాయ్ నికల్ ఆవో ఘర్ సే అనే పాత బాలీవుడ్ సాంగ్‌ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. హర్ష్ గోయెంకా టైమింగ్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. We have sent this video to all our colleagues at office #WFH 😀 @bang_lalitpic.twitter.com/BpaoArMWv3 — Harsh Goenka (@hvgoenka) March 25, 2022 -
ముఖం మీద పిడిగుద్దులు పడుతున్నా.. చిరునవ్వుతో!
ముహమ్మద్ ఆలీ.. బాక్సింగ్ దిగ్గజం. 20వ శతాబ్దంలో ‘ది గ్రేటెస్ట్’ గుర్తింపు ఉన్న ఆటగాడు. ఇవన్నీ కాదు.. ఛాంపియన్‌కి పర్యాయ పదం ఈ లెజెండ్. రింగ్‌లో ప్రత్యర్థిని పిడిగుద్దులతో అగ్రెస్సివ్‌గా మట్టికరిపించే ఆలీ.. ప్చ్.. తన వీక్నెస్కు లొంగిపోయి అతని చేతిలో ఓటమి పాలయ్యాడు. పిల్లలు దేవుళ్లు.. ఒక్కటే అంటారు. అందుకే బోసి నవ్వుల దేవుళ్లంటూ పిల్లల్ని అభివర్ణిస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్లు చేసే పనులు చూడముచ్చటగా ఉంటాయి కూడా. అందుకే పిల్లలంటే ఆలీకి బాగా ఇష్టం. వాళ్ల అల్లరిని భరించడంలో ఆయన దిట్ట. అలా ఓ చిన్నారి చేష్టలకు మురిసిపోయే.. ఆలీ పిడిగుద్దులు తిన్నాడు. బాక్సింగ్ గ్లౌజ్‌లు వేసుకున్న ఆ బుడ్డోడు.. ఆలీ యాక్టింగ్‌ను ఎంజాయ్ చేశాడు. ఆలీ నాలిక బయటపెట్టి రెచ్చగొడుతుంటే.. ఎగబడి మరీ గుద్దేశాడు. చివరికి ఆలీ ఓడిపోయినట్లు రెఫరీ ఆ బుడ్డోడి చేతిని పైకి ఎత్తి అభినందించడంతో.. చేతుల్ని ప్రొఫెషనల్ బాక్సర్‌లాగా కొట్టుకుంటూ బిల్డప్ ప్రదర్శించాడు. అది చూసి.. ఓ ముద్దు పెట్టమంటూ ఆలీ కోరగా.. ‘ఎలాగూ ఓడిపోయాడు కదా! ఓ ముద్దిస్తే ఏమవుతుంది పోనీలే.. అనుకుంటూ ఆలీ ముచ్చటను తీర్చేశాడు ఆ బుడ్డోడు. The best boxing match I have witnessed #MuhammadAli pic.twitter.com/etQXR7qVJ1 — Harsh Goenka (@hvgoenka) February 24, 2022 పారిశ్రామికవేత్త హార్ష్ గోయెంకా ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘నేను చూసిన బెస్ట్ బాక్సింగ్ మ్యాచ్ ఇదే’ అంటూ క్యాప్షన్ ఉంచారు. గోయెంకా పోస్ట్‌కి విపరీతంగా లైకులు, కామెంట్లు వచ్చిపడుతున్నాయి. అయితే తరచూ ఇది సోషల్ మీడియాలో కనిపించే వీడియోనే అనుకోండి. -
హర్ష్ గోయెంకా వైరల్ ట్వీట్..! బడ్జెట్ ఎలా ఉందంటే..!
సామాజిక మాధ్యమాల్లో రెగ్యులర్‌గా స్పందించే పారిశ్రామికవేత్తలలో హర్ష్గోయోంకా ఒకరు. పలు రంగాల్లో అన్నింటి మీద ఆయన ట్వీట్లు చేస్తుంటారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్-2022పై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ట్వీటర్లో స్పందించారు. బడ్జెట్ ఎలా ఉందంటే..! ఎన్నో అంచనాల మధ్య కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2022పై హర్ష్ గోయెంకా సానుకూలంగా స్పందించగా... ఆయన స్నేహితుడు మాత్రం విమర్శిస్తూ ఒక ఆసక్తికర వీడియోను హర్ష్ గోయెంకాతో పంచుకున్నాడు. హర్ష్ గోయెంకా తన ట్విట్లో ‘ ఈ ప్రభుత్వాన్ని అసలు ఇష్టపడని నా స్నేహితుడితో ఇది చక్కటి బడ్జెట్! భారత ఆర్థిక వ్యవస్థ ఇంజన్లు ఇప్పుడు మరింత వేగంగా కదులుతాయి. బడ్జెట్ గురించి నువ్వేం అనుకుంటున్నావు? అని స్నేహితుడిని అడగ్గా రాయల్ ఎన్ఫీల్డ్ బాడీతో సైకిల్‌పై ప్రయాణిస్తోన్న వ్యక్తి వీడియోతో నా మిత్రుడు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడని హర్ష్ గోయెంకా వీడియోను షేర్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడడానికే భారీగా కన్పిస్తోన్న బడ్జెట్లో అంత పసలేదని ఆయన స్నేహితుడు విమర్శించాడు. ప్రతిపక్షాల విమర్శలు..! కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఇది ప్రగతిశీల బడ్జెట్ అని..ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా బడ్జెట్‌పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలను చేస్తున్నాయి. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి చదవని పెట్టుబడిదారీ బడ్జెట్ ప్రసంగం చేశారని మండిపడ్డారు. మొత్తం బడ్జెట్ ప్రసంగంలో పేదలన్న పదం కేవలం రెండుసార్లు మాత్రమే(పేరా ఆరులో) వచ్చిందన్నారు. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారని గుర్తు చేసినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం ‘జీరో’ సమ్ బడ్జెట్ ప్రకటించిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మధ్య తరగతి ప్రజలు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, యువత, రైతులు, ఎంఎస్ఎంఈలకు ఈ బడ్జెట్లో మొండిచేయి చూపారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. I told my friend who doesn’t like this government “A fine budget! The engines of economy will now move faster. What do you think of it?” He sent me this reply… pic.twitter.com/In636XorPK — Harsh Goenka (@hvgoenka) February 1, 2022 చదవండి: ఇండియా ఎలా ఉందన్న అమెరికన్.. ఈ ఆన్సర్ చూస్తే ఆశ్చర్యపోతారు! -
ఒమిక్రాన్ వేరియంట్‌గా షారూక్.. నవ్వులు పూయిస్తున్న హర్ష్ గోయెంకా ట్వీట్
కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి వర్క్ ఫ్రం హోం విధానం ఉద్యోగుల జీవితంలో భాగంగా మారింది. చాలా కంపెనీలు క్రమంగా వర్క్ ఫ్రం హోం నుంచి రెగ్యులర్ ఆఫీస్ మోడ్‌కి షిఫ్ట్ అవుతుండగా ఐటీ కంపెనీల విషయంలోనే వర్క్ ఫ్రం ఎన్నాళ్లనేది తేలడం లేదు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియతో ఆఫీసు పని విధానం, హైబ్రిడ్ మోడ్లు తెరపైకి వస్తుండగా మరో వైపు ఒమిక్రాన్, ఫ్లోరినా వంటి కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆఫీస్ వర్క్‌పై కంపెనీల హెచ్ఆర్ విభాగం తీసుకునే నిర్ణయాలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. నవ్వులు పూయిస్తోంది వర్క్ ఫ్రం హోంపై తాజాగా నెలకొన్న పరిస్థితులను లవ్ క్లాసిక్ మొహబ్బతేతో పోల్చుతూ కొత్త మీమ్ వెలుగులోకి వచ్చింది. కేవలం రోజుల వ్యవధిలోనే వైరల్‌గా మారింది. ఇందులో మూడు ప్రేమ జంటలు (ఉద్యోగులు) డోలు వాయిస్తూ పాట పాడుతుండగా (వర్క్ ఫ్రం హోం).. అక్కడికి వచ్చిన అమితాబ్ (హెచ్ఆర్) ఆఫీస్‌కి రండి అన్నట్టుగా సీరియస్‌గా చూస్తాడు. హెచ్ఆర్ని చూసి ఉద్యోగులు నిశ్చేష్టులయి ఉండిపోగా.. అప్పుడే వచ్చిన షారూఖ్ (ఒమిక్రాన్ వేరియంట్) తిగిరి డోలు వాయిస్తాడు.. దీంతో ఉద్యోగులు తిరిగి డ్యాన్సు చేస్తూ పాట పాడుకుంటారు (వర్క్ ఫ్రం హోం). న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన ఈ మీమ్ నెట్టింట బాగా పాపులర్ అవగా తాజాగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ గోయెంకా సైతం ఈ మీమ్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. WFH….. pic.twitter.com/UfavDRUj3Y — Harsh Goenka (@hvgoenka) January 3, 2022 -
రతన్‌టాటా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. వెదురు చెట్టుతో అబ్బురపరిచే పోలిక
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ హార్ష్ గోయెంకా తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట ఆసక్తి రేపుతోంది. ఈ ట్వీట్లో ఉన్న ఫోటో పాతదైన సరే అందులో ఉన్న వ్యక్తులు, వారు సాధించిన ఘనతలు.. ఈ ఇద్దరు లెజెండ్స్ గురించి మరో బిజినెస్ దిగ్గజం చేసిన కామెంట్లు ట్విట్టర్లో భావోద్వేగపూరిత సంభాషణలకు తెర లేపాయి. కోవిడ్ సంక్షోభం ఇండియాను ముట్టడించకముందు 2020 జనవరిలో ముంబైలో ఓ ప్రైవేటు కార్యక్రమం జరిగింది. ఇందులో రతన్‌టాటాకి లైఫ్ టైం అచీవ్మెంట్ని ఇన్పోసిన్ నారాయణమూర్తి అందించారు. ఈ సందర్భంగా భారతీయ పారిశ్రామికవేత్తలకు దార్శనికుడైన రతన్‌టాటా పాదాలకు నారాయణమూర్తి పాదాభివందనం చేశారు. ఈ ఫోటో అప్పుడు కూడా చాలా మందిని ఆకట్టుకుంది. తాజాగా అదే ఫోటోను హార్ష్‌గోయెంకా ట్వీట్ చేస్తూ చక్కని కామెంట్‌ని జత చేశారు. ‘వెదురు చెట్టులా మనం ఉండాలి. జీవితంలో ఎంత ఎత్తులకు ఎదిగినా అణకువతో ఒదిగి ఉండాలి’ అనే అర్థం వచ్చేలా కామెంట్ జత చేశారు. ఈ ఫోటో నెటిజన్లకు బాగా నచ్చడంతో ఇందులో భాగస్వాములైన ముగ్గురి లెజెండ్స్ జీవితాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. “Be like a bamboo. The higher you grow, the deeper you bow.” Two of the most respected businessmen #RatanTata #NarayanaMurthy pic.twitter.com/xa77aCsRiW — Harsh Goenka (@hvgoenka) December 26, 2021 చదవండి: Vijay Mallya : రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు ! -
Harsh Goenka: కైండ్‌నెస్‌కి కొత్త అర్థం చెప్పిన బిజినెస్‌మ్యాన్
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయోంకా తాజాగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. వీల్‌చైర్‌లో ఉన్న అమ్మాయి వర్షంలో తడవకుండా ఓ అబ్బాయి గొడుకు పట్టుకున్న ఫోటోను హర్ష్ గోయెంకా షేర్ చేశారు. దానికి క్యాప్షన్‌గా కైండ్‌నెస్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ చెప్పారు. హర్ష్ చేసిన ఈ ట్వీట్ గంటల్లోనే వైరల్‌గా మారింది. అనేక మంది నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. మరికొందరు తమకు ఎదురైన ఘటనలు ట్వీట్ చేస్తున్నారు. మొత్తంగా ఈ బిజినెస్‌మ్యాన్ చేసిన ట్వీట్ మరోసారి మనుషుల్లోని మానవత్వాన్ని తట్టి లేపింది. Random acts of kindness never go in vain. What goes around comes around. pic.twitter.com/bEllwllWI5 — Talkative Dollar 🇮🇳 (@Talkativedollar) December 13, 2021 Kindness is the beauty that never fades.👌 — Romulus Iglesìas (@tu_sharcastic) December 13, 2021 చదవండి:900 మంది ఉద్యోగుల తొలగింపుపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు -
ఇండియా ఎలా ఉందన్న అమెరికన్.. ఈ ఆన్సర్ చూస్తే ఆశ్చర్యపోతారు!
సామాజిక మాధ్యమాల్లో రెగ్యులర్‌గా స్పందించే పారిశ్రామికవేత్తలలో హర్ష్గోయోంకా ఒకరు. సామాజిక అంశాల నుంచి కరోనా, ఆర్థికం, క్రీడలు ఇలా అన్నింటి మీద అయన ట్వీట్లు చేస్తుంటారు. కానీ, 2021 డిసెంబరు 11 శనివారం సాయంత్రం ఆయన పోస్టు చేసిన ట్వీట్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే ఆయన ట్వీట్ అద్భుతం అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందో మీరు చూడండి. తాజా ట్వీట్లో ఇండియా ఎలా ఉందంటూ ఓ అమెరికన్ తనను అడిగాడని.. దానికి సమాధానం ఇది అంటూ కింద ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో పరవశంలో ఉన్న ఓ నెమలి పురివిప్పుతున్న నెమలి కనిపిస్తుంది. An American friend asked me “What does India look like?” I sent him this video.pic.twitter.com/opCOxP9f44 — Harsh Goenka (@hvgoenka) December 11, 2021 దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నెమలి ఫించం నిదర్శనమంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు ఇండియా ఎంత వైబ్రంట్‌గా ఉందో చక్కగా చూపించారంటూ హర్ష్గోయెంకాని మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. -
900 మంది ఉద్యోగుల తొలగింపుపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు!
జూమ్ వీడియో కాల్లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి బెటర్.కామ్ సీఈఓ విశాల్ గార్గ్ వార్తలో వైరల్ అయ్యారు. అమెరికాకు చెందిన ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు. ఈ మేరకు ఒక ట్వీట్ ఇలా చేశారు.. "విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించటం చూసి నా హృదయం చలించింది. ఇది పూర్తిగా తప్పు! ఉద్యోగుల తొలగింపుపై వారికి వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉండేది. క్రిస్మస్ ముందు ఇటీవల 750 మిలియన్ డాలర్లు సేకరించిన తర్వాత ఈ నిర్ణయం సరైంది కాదు. ఈ విధానం వల్లే కార్పొరేట్లకు హృదయం లేదు అనే ముద్ర పడుతుంది" అని ట్వీట్లో పేర్కొన్నారు. బెటర్.కామ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్లో మాట్లాడుతూ.. ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో, జూమ్ కాల్లో కంపెనీ సీఈఓ చెప్పిన మాటలు వీని ఉద్యోగులు షాక్‌కు గురి అయ్యారు. ప్రస్తుతం అనేక కారణాల వల్ల మేము కంపెనీలో15 శాతం ఉద్యోగులను తొలిగించాల్సి వస్తుంది అని అన్నారు. ఈ వీడియోను ఒక ఉద్యోగి షేర్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. My heart went out to the 900 employees sacked through Zoom by Vishal Garg. Totally wrong! Do it on a one on one basis. And in person. And not before Christmas and after a $750 mn recent infusion. This is how Corporates get a heartless tag!pic.twitter.com/9aPoFNybKp — Harsh Goenka (@hvgoenka) December 7, 2021 (చదవండి: అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం!) -
ఒమిక్రాన్ ఎఫెక్ట్..! భారత్‌కు వస్తోన్న ఎన్నారైలకు తప్పని తిప్పలు..!
ప్రపంచదేశాలను కోవిడ్-19 కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే సుమారు 38 దేశాలకు పాకింది. అందులో భారత్ కూడా చేరింది. దీంతో భారత ప్రభుత్వం ఒక్కసారిగా అలర్టైంది. విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలపై, ఇతర దేశస్తులపై ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లను కచ్చితం చేసింది. ఢిల్లీ, ముంబై ఎయిర్పోట్‌లో పడిగాపులు..! విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ను కచ్చితం చేయడంతో ప్రయాణికులు కోవిడ్-19 టెస్ట్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో నెగటివ్ వస్తేనే ఆయా ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లనుంచి బయటకు పంపిస్తున్నారు. అయితే ఒక్కో టెస్ట్ ఫలితాలు రావడానికి ఏకంగా 4-6 గంటల సమయం పడుతోంది. దీంతో ఎన్నారైలు, ఇతర దేశస్థులు గంటలపాటు వేచి ఉండాల్సి వస్తోంది. . ఫుల్ క్రౌడ్..నో కోవిడ్ రిస్ట్రిక్షన్స్..! ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లను భారత ప్రభుత్వం కచ్చితం చేయడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పడిగాపులు కాస్తోన్న ప్రయాణికుల ఫోటోను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్షా గోయెంకా ట్విటర్లో షేర్ చేశారు. కోవిడ్ నిబంధనలను పాటించకుండా ఫుల్ క్రౌడ్‌తో నిండిపోయిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ కోవిడ్ హాట్‌స్పాట్‌గా మారే అవకాశం లేకపోలేదని గోయెంకా అభిప్రాయపడ్డారు. Scenes yesterday at Delhi airport #Covid hotspot pic.twitter.com/SoM6RNumYO — Harsh Goenka (@hvgoenka) December 5, 2021 చదవండి: అమెరికా వెళ్తున్నారా? ఈ రూల్స్ పాటించాల్సిందే ! బైడెన్ సర్కార్ కొత్త ఆదేశాలు -
కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్ పరిజ్ఞానంతో పని లేదు
మనం జీవితంలో మంచి స్థాయిలోకి రాలేకపోవడానికి రకరకాల కారణాలు చెబుతుంటాం. కానీ మనలాగే రకరకాల సమస్యల మధ్య నలిగిపోతునప్పటికీ అత్యున్నత స్థాయికి చేరుకున్నావారు ఎందురో ఉన్నారు. కానీ వాళ్లను మనం ఆదర్శంగా తీసుకుని కష్టపడటానికి ఇష్టంపడం. అచ్చం అలాంటి సందేశాన్ని వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా యువతకు తెలియజేశారు. (చదవండి: అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం) అసలు విషయంలోకెళ్లితే....వ్యాపార దిగ్గజం ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చరిత్రలో అతిపెద్ద ఐపీఓని ప్రారంభించారంటూ ప్రశంసించారు. అంతేకాదు జీవితంలో అత్యున్నత స్థాయికి చేరాలంలే కుటుంబ నేపథ్యం, గొప్ప ఆంగ్ల పరిజ్ఞానం లేదా డబ్బు అవసరం లేదని చెప్పడానికి అతని కథే నిదర్శనం అంటూ విజయ్ శర్మని కొనియాడరు. డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం గత కొంత కాలంగా తమ సేవలను మరింతగా విస్తరించే యోచనలో పబ్లిక్ ఇష్యూ ఇన్వెస్టర్(ఐపీవో) ప్రారంభించిన నేపథ్యంలో గోయోంకా విజయ్ శేఖర్ శర్మను ప్రసంశిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాదు దాదాపు ఐదేళ్ల క్రితం డీమోనిటైజేషన్ ప్రకటించినప్పుడు శ్రీ శర్మ దాదాపు ఆనందంతో డ్యాన్స్ చేశాడన్న విషయాన్ని కూడా గోయెంకా ట్విట్టర్లో వెల్లడించారు. (చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్) -
అసాధ్యురాలు.. ఏకంగా సింహం తోకపట్టుకుని
సింహాలను టీవిల్లోని డిస్కవరీ ఛానల్లోనో లేక ఏదైన జూ పార్క్‌లలో చూసి ఉంటాం. కానీ దాన్ని సరాసరిగా చూడటానికే భయపడతాం. అలాంటిది ఒక అమ్మాయి సింహం తోక పట్టుకుని మరీ నడిచేస్తుంది. అసలు ఆమె ఎవరు, ఎక్కడ జరిగింది చూద్దాం రండి. (చదవండి: మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!) అసలు విషయంలోకెళ్లితే.....వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా కూతురు వసుంధర పత్నీ సింహg తోక పట్టుకుని నవ్వుతూ నడుస్తుంది. అయితే ఆమె తండ్రి ఇండియన్ ఆర్పీజీ గ్రూప్ కాంగ్లోమెరిట్ ఛైర్మన్ అయిన హర్ష్ గోయెంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో తోపాటు" అది నా కూతురు. మీరు ఆమె తల్లిని ఊహించుకోగలరా " అనే క్యాప్షన్‌తో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇది దక్షిణాఫ్రికా జాతీయ ఉద్యానవన పార్క్‌లోని వన్యప్రాణుల పర్యటనలోనిదని, అక్కడ నిపుణుల సమక్షంలో పెద్ద పులులతో ఎంజాయ్ చేస్తారు అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: వృద్దుడు చేసిన వెరైటీ చాట్) -
16 వేల కోట్ల రూపాయల ఐపీవో.. డ్యాన్స్‌తో అదరగొట్టిన సీఈవో
చిన్న మొక్కగా మొదలైన స్టార్టప్ కంపెనీలు పెద్ద వట వృక్షంలా ఎదిగితే దాన్ని స్థాపించిన వ్యక్తుల ఆనందానికి హద్దే ఉండదు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ. సెబీ తాజా నిర్ణయంతో ఆయనలో ఉప్పొంగిన సంతోషం కట్టలు తెంచుకుని చక్కని నృత్యంగా మారింది. సెబీ గ్రీన్ సిగ్నల్ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం గత కొంత కాలంగా తమ సేవలను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. దీంతో నిధుల సమీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. అందులో భాగంగా ఏడాది కాలంగా పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు సన్నహకాలు చేస్తోంది. కాగా తాజాగా పేటీఎంకి సంబంధించి ఇన్షియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి సెక్యూరిటీ ఎక్సేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి ఇచ్చింది. రూ, 16,600 కోట్లు పేటీఎం సంస్థ ఐపీవో ద్వారా రికార్డు స్థాయిలో రూ. 16,600 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సమీకరించనుంది. దీంతో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఆనందంతో డ్యాన్స్ చేశారు. సెబీ నుంచి అనుమతులు వచ్చాయనే విషయం తెలియగానే సంస్థకు చెందిన ఉద్యోగులతో కలిసి ఆఫీసులో చిందులేశారు. అమితాబ్ పాటకి బిగ్‌బి అమితాబ్ నటించిన లావారిస్ సినిమాలో అప్‌నీతో జైసే తైసే పాటకి లయబద్దంగా నృత్యం చేస్తూ విజయ్ శేఖర్ శర్మ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియోను మరో పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రస్తుతం విజయ్ శేఖర్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. జోమాటో తర్వాత స్టాక్ మార్కెట్లో స్టార్టప్‌లు సంచలనం సృష్టిస్తున్నాయి. జోమాటో సృష్టించిన ప్రకంపనలు ఇంకా ఆగకముందే మరోసారి మార్కెట్లో అలజడి రేపేందుకు పేటీఎం రెడీ అయ్యింది. Scenes at Paytm office after SEBI approves one of India’s largest IPOs 😀😀@vijayshekhar pic.twitter.com/6yQHKVBm39 — Harsh Goenka (@hvgoenka) October 24, 2021 -
ఈ ఫుడ్ డెలివరీ యాప్‌తో బరువు తగ్గుతారు!.. ఇది నిజమేనా?
సియట్ టైర్లు తయారు చేసే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్‌గోయెంకా కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నట్టుగా ట్విట్టర్లో ప్రకటించారు. జోగ్గీ పేరుతో కొత్తగా ఫుడ్ డెలివరీ వ్యాపారానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరాలు వెల్లడించారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త నుంచి ఈ ప్రకటన రావడంతో జోమాటో, స్విగ్గీలకు కష్టాలు వచ్చినట్టే అని అంతా భావించారు. కొత్త వ్యాపారానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ... చివర్లో హార్ష్ గోయెంకా ఓ ట్విస్ట్ ఇచ్చారు. అప్పటి వరకు సీరియస్‌గా న్యూ స్టార్టప్ గురించి చదువుతూ వెళ్లిన వారు... ఒక్కసారిగా ఘోల్లున నవ్వుకున్నారు. హర్ష్‌గోయెంకా సెన్సాఫ్ హ్యుమర్‌కి సలాం కొట్టారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. లైకులు, కామెంట్లు, రీట్వీట్లలతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందంటే ‘ అందరికీ నమస్కారం! మీ సహకారం, ఆశీస్సులు నాకు కావాలి. ఎందుకంటే నేను కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నాను. జొగ్గీ పేరుతో కొత్తగా ఫుడ్‌డెలివరీ స్టార్టప్ మొదలుపెడుతున్నాను. ఇందులో సూపర్ మెనూ, గ్రేట్ డిసెర్ట్స్ ఉన్నాయి. అంతే కాదు ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేసే ఫుడ్ వల్ల బరువు కూడా తగ్గించుకోవచ్చని పేర్కొంటూ కొత్త బిజినెస్‌పై ఉత్కంఠ పెంచారు హర్ష్‌గోయెంకా... ఆ వెంటనే కొంత గ్యాప్ ఇచ్చి... బరువు ఎలా తగ్గుతారబ్బ అని అంతా ఆలోచించే లోగానే ఆ సీక్రెట్‌ని కూడా ఆయన వివరించారు. అదేంటంటే ఈ యాప్ ఆర్డర్స్ తీసుకుంటుంది. కానీ ఐటమ్స్ డెలివరీ చేయదు అంటూ ముక్తాయించారు. హర్ష్ గోయెంకా ఇచ్చిన లాస్ట్ పంచ్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Hello Everyone, Need ur help, blessings & wishes🙏🏻 I am starting my new venture, a startup food app called Zoggy (super menu, great desserts) that will help all of you reduce weight dramatically! It works as follows: You order, I won't deliver — Harsh Goenka (@hvgoenka) October 22, 2021 చదవండి: పండగ వేళ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ పాఠాలు -
ఇడ్లీదే గెలుపు, తందూరీ గట్టి ప్రయత్నం.. ఐపీఎల్ స్పెషల్ మెనూ!
ఇదేదో హోటల్, రెస్టారెంట్ మెనూ కాదు. ఐపీఎల్ స్పెషల్ మెనూ. ఎవరూ తయారు చేశారంటే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ గోయెంకా. సామాజిక, సమకాలీన అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తుంటారు. ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీని రెస్టారెంట్ మెనూతో పోల్చుతూ ఆయన ట్వీట్ చేశారు. మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు, జర్నలిస్టులు ఏదైనా బిగ్ టోర్నీకి ముందు డ్రీమ్ 11, ఆల్‌టైం గ్రేట్ ఇలా రకరకాల పేర్లతో టీమ్‌లను ప్రకటిస్తుంటారు. హర్ష్‌గోయెంకా కొంచెం వెరైటీగా ప్రయత్నించారు. ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఆధారంగా టీమ్ పెర్ఫార్మెన్స్లను అంచనా వేస్తూ... ఆయా జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలలో ఫేమస్ వంటకాలతో పోల్చుతూ ఐపీఎల్ మెనూని తయారు చేశారు. ఐపీఎల్ స్పెషల్ మెనూలో రసగుల్లాపై ఇడ్లీ విజయం సాధించిందంటూ ఐపీఎల్ ఫైనల్‌కి పోలికి పెట్టారు. తందూరీ నాన్ గట్టినా ప్రయత్నించినా ఫలితం లేదని బిసబెళబాత్ చూడటానికి బాగుంది కానీ అంటూ ఇలా ఫన్నీ పోలీకలతో ట్వీట్‌ని నడిపించారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే మెనూ కార్డులో బిర్యానీకి ఆఖరి స్థానం దక్కిందన్నారు హర్ష్ గోయెంకా. #IPL MENU Idli wins decisively against rasgulla in final! Tandoori nan tried hard… Bisi bele bhaath was looking delicious but… 5 times champion vadapaav was out. Lassi also couldn't make it to last 4. Daal baati was outclassed. Biryani remained at the bottom of the menu card. — Harsh Goenka (@hvgoenka) October 15, 2021 -
బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ ! పండగ వేళ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ పాఠాలు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీసీ గ్రూప్ చైర్మన్ హార్ష్‌గోయెంకా దసర పండగ వేళ సరికొత్త పాఠాలు నేర్పారు. ట్విట్టర్ వేదికగా జీవితంలో పైకి ఎదగాలనుకునే వారికి, మానసిక ప్రశాంతత కోరుకునే వారికి హితబోధ చేశారు. అయితే ఆయన వ్యాపారవేత్త కదా అందుకు జ్ఞానాన్ని సైతం బిజినెస్ స్టైల్లోనే చెప్పారు. హర్ష్ చేసిన ట్వీట్లో మీరు కోపాన్ని కొంటే అసిడిటీ ఉచితంగా వస్తుంది. ఈర్ష్యని కొంటే భయం ఉచితం, ఒత్తిడిని కొంటే బ్లడ్ ప్రషర్ ఉచితం అంటూ పలు విధాలుగా సెలవిచ్చారు ఈ పారిశ్రామికవేత్త. అంతేకాదు నమ్మకాన్ని కొంటే స్నేహం ఉచితం, ప్రేమని కొనుగోలు చేస్తే సంతోషం ఉచితమంటూ జీవిత సత్యాలను ట్విట్టర్లో ఓలకబోశారు. Buy anger, get acidity free. Buy jealousy, get bitterness free. Buy hatred, get ulcer free. Buy stress, get blood pressure free. OR Buy trust, get friendship free. Buy exercise, get health free. Buy honesty, get sleep free. Buy love, get happiness free. — Harsh Goenka (@hvgoenka) October 15, 2021 స్టాక్మార్కెట్లో కొనసాగుతున్న బుల్ ట్రెండ్‌పై కూడా ఆసక్తికర వీడియోను ఆయన షేర్ చేశారు. ఇప్పుడు కొనసాగుత్ను బుల్ ట్రెండ్ ముందు ఏదీ నిలవలేదన్నట్టుగా ఆయన షేర్ చేసిన వీడియో నవ్వులు పూయిస్తోంది. Stock market today….with everyone cheering !pic.twitter.com/kIdfniFVbT — Harsh Goenka (@hvgoenka) October 14, 2021 -
ఆ హోటల్.. ఇట్స్ అమేజింగ్! జింగ్.. జింగ్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌గోయెంకా అద్భుతమైన దృశ్యాన్ని మన ముందుకు తెచ్చారు. ఉరుకులపరుగుల జీవితం నుంచి దూరంగా వెళ్లి కాసేపు పక్షులా స్వేచ్ఛగా బతికేయాలని అనుకునేవాళ్లకి అనువైన ఓ హోటల్ని పరిచయం చేశారు. క్యూబాలోని దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటల్ని నిర్మించారు. ఎత్తైన చెట్లపైన పక్షులు కట్టిన గూళ్ల తరహాలో అధునాతన సౌకర్యాలతో గదులు, లాంజ్‌లు నిర్మించారు. వేర్వేరు చెట్ల మీద గూళ్ల తరహాలో ఉన్న గదులను చేరుకునేందుకు చెట్లపైనే వేలాడే వుడెన్ బ్రిడ్జీలను ఏర్పాటు చేశారు. వెలిజ్ ఆర్కిటెక్టో అనే వ్యక్తి ఈ హోటళ్లను డిజైన్ చేశారు. ప్రశాంతతకి స్వర్గథామంగా ఈ హోటళ్లని స్థానికంగా పేర్కొంటారు. Amazing hotel complex in Cuba located on the trees of a forest where individual nests are connected by wooden suspension bridges. Looks like a haven of peace and tranquility! Architect: Veliz Arquitecto pic.twitter.com/s5lBDJYWaL — Harsh Goenka (@hvgoenka) October 10, 2021 చదవండి : 17 ఏళ్లుగా అడవిలోనే ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి.. కారణం? -
‘దేశంలో రాజాలు ఎందరున్నా.. మహారాజా ఒక్కడే’
ఎయిర్ ఇండియా సంస్థను టాటా గ్రూపు తిరిగి దక్కించుకోవడం పట్ల పారిశ్రామిక వర్గాల్లో సానుకూల స్పందన లభిస్తోంది. ప్రైవేటీకరణ అంటే సాధారణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ టాటా గ్రూపు విషయానికి వస్తే... ఈ వ్యతిరేకత కొంత తక్కువే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రజాభిప్రాయాన్ని అద్దం పట్టే సోషల్ మీడియాలో ఈ డీల్ పట్ల సానుకూల స్పందనే వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ హార్ష్ గోయెంకా ఎయిరిండియా ప్రైవేటీకరణపై స్పందించారు. మస్కట్ మహారాజాతో పోలిక పెడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. వారిలో చాలా మందిని రాజా అని పిలస్తూ ఉండవచ్చు. కానీ దేశంలో మహారాజు అని పిలిచే గ్రూపు ఒక్కటే ఉంది. అది టాటా అని ఆయన పేర్కొన్నారు. There are very very rich people who may be the ‘Rajas’ of India. But there is only one group who can be called the ‘Maharaja’ of our Country. pic.twitter.com/M4b2eX53M2 — Harsh Goenka (@hvgoenka) October 9, 2021 మరోవైపు ఆనంద్ మహీంద్రా సైతం ఈ డీల్‌ను ఉద్దేషిస్తూ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే ‘ఈ టేకోవర్ ప్రాముఖ్యతపై నేను చేసే వ్యాఖ్యలు కొంచెం అతిశయోక్తిగా అనిపించొచ్చు. ఈ పెట్టుబడుల ఉపసంహరణ వల్ల భారత వ్యాపార వాతావరణానికి ప్రభుత్వం పునర్వైభవం తీసుకొస్తోందని నేను భావిస్తున్నాను. అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను ప్రభుత్వం వదులుకుంటోంది. అంతేకాదు, దశాబ్దాల తర్వాత ప్రైవేటురంగ సామర్థ్యంపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరిస్తోంది’ అని పేర్కొన్నారు. I may be accused of overstating the importance of this event but I think this divestment amounts to a ‘reset’ of the Indian business environment. Yes, the Govt. is dispensing of a cash drain; But it’s also renewing faith-after decades-in the potential efficiency of the Pvt.sector https://t.co/iZKgt2L7cD — anand mahindra (@anandmahindra) October 8, 2021 చదవండి : వెల్కమ్ బ్యాక్ ఎయిర్ ఇండియా - రతన్ టాటా -
ఆమిర్ ఖాన్ యాడ్‌పై తీవ్ర దుమారం
Boycott CEAT Trending in Twitter: సినిమాలు, వెబ్ సిరీస్‌లను వివాదాస్పద కాన్సెప్ట్‌లు, సీక్వెన్స్‌లతో తెరకెక్కించడమే కాదు.. అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్ల రచ్చ ద్వారానూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్. ముఖ్యంగా సున్నితమైన అంశాల్ని టచ్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈమధ్య వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్ నటి అలియా భట్‌తో తీసిన ‘కన్యాదాన్’ అడ్వర్టైజ్మెంట్ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ యాక్ట్ చేసిన ఓ యాడ్‌పై తీవ్ర దుమారం నడుస్తోంది. ఆమిర్ ఖాన్ నటించిన సీయట్ టైర్ల కంపెనీ యాడ్ ఒకటి ఈమధ్య రిలీజ్ అయ్యింది. ‘‘రోడ్లు ఉంది పటాసులు(టపాకులు) పేల్చడానికి కాదు’’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‌ను ప్రమోట్ చేశాడు. అయితే అమీర్ ఖాన్ ఈ యాడ్ చేయడం, పైగా తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఆ అభ్యంతరాలు తారాస్థాయికి చేరగా.. సీయట్ను బాయ్‌కాట్ చేయాలంటూ Boycott_Hinduphobic_CEAT వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపేస్తున్నారు. ఈ యాడ్ చేసింనందుకు నటుడు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్ కంపెనీని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకాను ఇందులోకి తీసుకొస్తున్నారు. గతంలోనూ ఇలా సున్నితమైన అంశాలపై హర్ష గోయెంకా అనుచిత ట్వీట్లు వేశాడని, ఆ టైంలోనూ బాయ్‌కాట్ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్ కంపెనీ యాడ్స్ తీయాల్సిన అవసరం, అందులో ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ నటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు చాలామంది. Hello @CEATtyres The chairman of your parent company has such views on Hinduism and it's traditions We have many alternative tyre companies in India MRF, JK, Apollo So there won't be any problem for us if we #BoycottCEAT We need an unconditional apology from him ✌🏼 pic.twitter.com/Qr7UjGYDjC — Anish (@Aniiiiish) April 14, 2021 చదవండి: అండర్వేర్ యాడ్.. ఏం మెసేజ్ ఇద్దామని రష్మిక? -
అక్కడికి వెళ్తే ఈ స్వీట్ తినడం మాత్రం మర్చిపోకండి.. అద్భుతం.!
ఢిల్లీకి వెళ్తే చోలే భచూరా రుచి చూడకుండ ఉండలేరు. చెన్నై మురుకులు, హైదరాబాద్ దమ్ బిర్యానీ తినందే అక్కడి నుంచి కదలరు భోజనప్రియులు. ఇంకా బెనారస్ లస్సీ, అమృత్సర్ జిలేబీ, అహ్మదాబాద్ డోక్లా, ముంబాయ్ వడాపావ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. అలాగే దేశీ వంటకాల్లో కలకత్తా రసగుల్లా కూడా చాలా ఫేమస్ అండీ! ఇటీవల బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ కోల్‌కతా సందర్శించారు. ఇంకేముంది అక్కడి ఫేమస్ స్వీట్లలో ఒకటైన రసగుల్లాను రుచి చూసేశారు. రసగుల్లాకి ఫిదా అయిపోయారు. దీని రుచిని గురించి తెల్పుతూ ట్విటర్లో పోస్ట్ కూడా పెట్టారు. ‘ఇండియాలోనే స్వీటెస్ట్ సిటీ అయిన కలకత్తాలో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. కేసీ దాస్ ఔట్‌లెట్‌లోని ఫేమస్ స్వీట్లలో ఒకటైన రసగుల్లాను రుచిచూశాను’ అని బెంగాళీ భాషలో రాశారు. ముఖం మీద చిరునవ్వుతో మట్టిపాత్రలోని రసగుల్లాను తింటున్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ స్వీట్‌ను రుచి చూడమనని రిఫర్ చేశారు కూడా. ఈ పోస్ట్‌ను చూసిన ఫాలోవర్లు, అభిమానులు మాత్రం కామెంట్ల రూపంలో తమ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది కోల్‌కతాలోని ఇతర ప్రసిద్ధ వంటకాలు, స్వీట్లను కూడా రుచి చూడమని కోరారు. తాజాగా ప్రముఖ పారిశ్రమిక వేత్త హర్ష్ గొయెంకా కూడా దేశంలోనే కోల్‌కతా స్ట్రీట్ ఫుడ్ బెస్ట్ అని ట్విటర్లో పేర్కొనడం విశేషం. చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!! ভারতের সবথেকে মিষ্টি শহর কলকাতায় এসে বড়োই আনন্দিত আমি। এখানকার এসপ্লানেডের কে. সি. দাসের আউটলেটে আমি চেখে দেখলাম দারুণ স্বাদের "বাংলার রসগোল্লা"। pic.twitter.com/m2tirphBML — Alex Ellis (@AlexWEllis) September 26, 2021 -
కేటీఆర్ చేసిన ఆ పనికి పారిశ్రామికవేత్తలు ఫిదా
పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్టైలే వేరు. పారిశ్రామికవేత్తలను కలవడం దగ్గర నుంచి పెట్టుబడులకు వారిని ఒప్పించడం వరకు మంత్రిగా ఎంతో చొరవ చూపిస్తారు. ఇటీవల ఆయన చేసిన ప్రయత్నం దేశవ్యాప్తంగా అనేక మంది ఇండస్ట్రియలిస్టులను ఆకట్టుకుంటోంది. తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్యశాఖ మంత్రి కేటీఆర్ పనితీరుని నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు. చిన్నపిల్లల దుస్తుల తయారీ రంగంలో అమెరికాకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న కైటెక్స్ సంస్థ కేరళలో వస్త్ర పరిశ్రమ నెలకొల్పే ప్రయత్నాల్లో ఉండగా అనుమతుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. దీంతో ఆ సంస్థ అక్కడ పరిశ్రమ పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ విషయం పత్రికల్లో చదివిన మంత్రి కేటీఆర్ వెంటనే కైటెక్స్ సంస్థ ఎండీ సాబు జాకబ్‌తో ఫోన్లో మాట్లాడారు. అంతటితో ఆగలేదు. సాబు జాకబ్ హైదరాబాద్ వచ్చేందుకు ప్రత్యేకంగా విమానం కూడా ఏర్పాటు చేశారు. అలా తెలంగాణ వచ్చిన సాబు జాకబ్ వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రూ.2,400 కోట్ల వ్యయంతో రెండు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఓ బిజినెస్‌మాన్‌ను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ప్రైవేట్ ఫ్లైట్ పంపించడాన్ని ప్రశంసిస్తూ ప్రముఖ పారిశ్రామికవేత్త హార్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. గోయెంకా ట్వీట్‌కి దేశవ్యాప్తంగా చాలా మంది నెటిజన్లు స్పందించారు. మంత్రి కేటీఆర్ పనితీరుని మెచ్చుకున్నారు. హర్ష్ గోయెంకా ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. పారిశ్రామిక వేత్తలను గౌరవించడం మన విధి అని చెబుతూ.. అలా చేయడం ద్వారా త్వరగా ఉపాధి కల్పించడంతో పాటు సంపదను పెంచేందుకు అవకాశం లభిస్తుందని బదులిచ్చారు. దీనికి ప్రతిగా మీ లాంటి నేతలు ఈ దేశానికి కావాలంటూ హర్ష్ అన్నారు. Harsh Ji, Many thanks for your kind words🙏 We as a nation need to start respecting & celebrating our entrepreneurs, make it easy for them to create employment & wealth which in turn will spur growth Telangana offers a red carpet welcome to investors with unique TS-iPASS policy https://t.co/pzSNjLdQ2q — KTR (@KTRTRS) September 23, 2021 చదవండి : ‘కైటెక్స్’ పెట్టుబడి మరో 1,400 కోట్లు -
Fact Check: డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఇలా ఉన్నాడేంటీ?
Fact Check: సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హార్ష్ గోయేంకా తప్పులో కాలేశారు. సరైన సమచారం లేకుండా వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఇంతలో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బెంగాల్ ప్రభుత్వం నిజాలు వెల్లడించింది. షెర్లాక్ హోమ్స్ కూలి పోవడానికి సిద్ధంగా ఉన్న ఓ పాడుబడ్డ భవనం. ఆ బిల్డింగ్ ద్వారాలకు డిటెక్టివ్ డిపార్ట్మెంట్ , సీఐడీ వెస్ట్‌బెంగాల్ అన్న బోర్డు. దాని కింద నుంచి నడుముకు టవల్ చుట్టుకుని చేతిలో బకెట్‌తో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి. పైన బోర్డుకు కింద కనిపిస్తున్న మనిషికి మధ్య పొంతనే లేదు. ఈ ఫోటోను ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హార్ష్గోయెంక ట్వీట్ చేశారు. ‘షెర్లాక్‌హోమ్స్ స్టెపింగ్ అవుట్ ఆఫ్ హిజ్ బేకర్ స్ట్రీట్ ఆఫీస్ ఇన్ కోల్‌కతా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. Sherlock Holmes stepping out of his Baker Street office in Kolkata! 😀😀😀 pic.twitter.com/wVSNFYICYA — Harsh Goenka (@hvgoenka) September 21, 2021 మారువేశంలో హర్ష్ గోయేంకా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. డిటెక్టివ్ మారు వేశంలో ఉన్నాడంటూ చాలా మంది వ్యంగంగా స్పందించగా మరికొందరు డిటెక్టివ్లు ఆఫీసుల కూర్చుని ఉండిపోకుండా ఫీల్డ్‌కు వెళ్లాలని ఇలా చేశారంటూ చమత్కరించారు. కానీ చాలా మంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం మమతా బెనర్జీని టార్గెట్‌గా చేసుకుని కామెంట్లు చేశారు. వాస్తవం ఇది బ్రిటిష్ కాలంలోనే 1886లోనే కోల్‌కతాలో ఓ బ్రిటీష్ అధికారి హత్యకు గురైతే తొలిసారిగా డిటెక్టివ్ కార్యాలయం నెలకొల్పారు. వందల ఏళ్ల నుంచి ఈ నగరంలో డిటెక్టివ్ డిపార్ట్మెంట్ పని చేస్తోంది. నగరంలోని పీల్ఖానాలో డిటెక్టివ్ భవనం కూలేందుకు సిద్ధంగా ఉండటంతో 2016లో ఆ భవనం ఖాళీ చేశారు. భవనీ నగర్‌లోని సీఐడీ కార్యాలయంలోకి డిటెక్టివ్ ఆఫీస్‌ని మార్చారు. అయితే పాత ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరీ షెర్లాక్‌హోమ్స్ ఇంగ్లండ్ రచయిత విలియం షేక్స్పియిర్ గొప్ప రచనలు ఎన్నో చేశారు. అందులో డిటెక్టివ్ ప్రధాన పాత్రగా షెర్లాక్ హోమ్స్ అనే నాటకం రచించారు. దీంతో సీక్రెట్ ఏజెంట్ అంటే జేమ్స్‌బాండ్ పాత్ర గుర్తొచ్చినట్టు ప్రపంచ వ్యాప్తంగా డిటెక్టివ్ అంటే షెర్లాక్‌హోమ్స్ గుర్తుకురావడం పరిపాటిగా మారింది. చదవండి : కానిస్టేబుల్ ధైర్యానికి ఆనంద్ మహీంద్రా ఫిదా ! -
హైదరాబాద్ రెస్టారెంట్‌కి ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ గోయెంకా ఫిదా!
ప్రముఖ ఇండస్ట్రియలిస్టు హర్ష్ గోయెంకా దృష్టిని ఆకర్షించింది హైదరాబాద్‌కి చెందిన ఓ రెస్టారెంట్, సాధారణ రెస్టారెంట్లకి భిన్నంగా ఫుడ్ సర్వ్ చేయడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న ఫ్లాట్‌ఫారమ్ నంబర్ 65 రెస్టారెంట్లో టేబుల్స్‌పై మినీ ట్రాక్స్ ఉంటాయి. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఆ ట్రాక్‌పై మాల్గాడీలో ప్రయాణిస్తూ మన దగ్గరికి వస్తుంది. ఫ్లాట్‌ఫామ్ నంబర్ 65కి సంబంధించిన వివరాలు హైదరాబాదీలు సుపరిచితమే అయినా హర్స్ గోయెంకా లాంటి ఇండస్ట్రియలిస్టు తన ట్విట్టర్లో ఈ రెస్టారెంట్‌కి సంబంధించిన వీడియో పోస్ట్ చేయడంతో దీని ప్రత్యేకతలు మరోసారి సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీసింది. If you are missing train travel, here’s a unique restaurant in Hyderabad #Platform65pic.twitter.com/SVvvmkqr25 — Harsh Goenka (@hvgoenka) September 14, 2021 చదవండి: Work From Home చాలు.. నా భర్తను ఆఫీస్‌కు రమ్మనండి బాబోయ్ -
వర్క్ ఫ్రమ్ హోం చేసే వాళ్ల పరిస్థితి అంతేనా?
Work From Home: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ సమకాలిన అంశాలపై స్పందించడంలో ఎప్పుడూ ముందుంటారు ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోం ఉండాలా? వద్దా ? దాని వల్ల ఉపయోగాలు నష్టాలపై ఆయన వరుసగా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. అవన్ని నవ్వులు పూయించడంతో పాటు చర్చకు సైతం దారి తీస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం తొలగించి, తన భర్తను ఆఫీసుకు రమ్మనకపోతే తమ దాంపత్య బంధానికి వీడాకులు తప్పవంటూ ఇటీవల ఓ గృహిణి చేసిన రిక్వెస్ట్‌ని షేర్ చేసిన హర్ష్ గోయెంకా... తాజాగా మరో వీడియోను వదిలారు. నెలల తరబడి వర్క్‌ఫ్రం హోంకి అలవాటైన ఉద్యోగులు.. ఆఫీసులకు వచ్చిన తర్వాత వారి ప్రవర్తన ఎలా ఉంటుందనే అంశంపై ఫన్నీగా చిత్రీకరించిన వీడియోను షేర్ చేశారు. ఆఫీసులో ఉద్యోగులు ఎదురెదురుగా మాట్లాడుతున్నప్పటికీ... వారంతా ఇంటి నుంచి జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. Scene at workplace after over a year of zoom/teams meetings 😀😀😀! pic.twitter.com/sCCVpMurma — Harsh Goenka (@hvgoenka) September 13, 2021 హర్స్ గోయెంకా ట్వీట్ చేసిన వీడియోని చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫన్నీగా ఉన్నప్పటికీ వాస్తవం అదేనంటూ రీ ట్వీట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. చదవండి : Viral Video: ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయిన వేళ! -
వర్క్ ఫ్రం హోం చాలు.. నా భర్తను ఆఫీస్‌కు రమ్మనండి బాబోయ్
ముంబై: కరోనా కారణంగా సాఫ్ట్వేర్ సహా చాలా రంగాల్లో వర్క్ ఫ్రం హోం కల్పించారు. ఇక సాఫ్ట్వేర్ కంపెనీల్లో అయితే దాదాపు రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రం హోం కొనసాగతోంది. ఈక్రమంలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు పూర్తిగా వర్క్ ఫ్రం హోం అమలు చేసే ఆలోచనలో ఉన్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం వల్ల ఇళ్లల్లో ఆడవారికి చాకిరి మరింత పెరిగిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా చేసిన ట్వీట్ చూస్తే.. ఈ నివిదేకల్లో ఉన్నది వాస్తవమే అని అర్థం అవుతుంది. ఈ ట్వీట్లో హర్ష్ గోయెంకా ఓ మహిళ తన భర్త కంపెనీకి రాసిన లెటర్ని ట్వీట్ చేశాడు. దీనిలో సదరు మహిళ నా భర్తకు వర్క్ ఫ్రం హోం చాలు.. ఇక ఆఫీసుకు పిలవండి అని కోరుతూ యాజమాన్యానికి లేఖ రాసింది. ఇంకొద్ది రోజులు వర్క్ ఫ్రం హోం ఇలానే కొనసాగితే.. మా వైవాహిక బంధం ముగుస్తుంది అని తెలపడం గమనార్హం. (చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: ఇదీ పరిస్థితి!) లేఖలో సదరు మహిళ ‘‘సార్ నేను మీ కంపెనీలో పని చేసే మనోజ్ అనే ఉద్యోగి భార్యను. ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా విన్నవించుకుంటుంది ఒక్కటే. నా భర్తకు ఆఫీస్‌కు వచ్చి పనిచేసే అవకాశం ఇవ్వండి. అతను ఇప్పటికే టీకా రెండు డోసులు వేసుకున్నాడు.. అన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తాడు. దయచేసి అతడిని ఆఫీస్‌కు రమ్మనండి’’ అని కోరింది. (చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: ఆఫీస్‌లకు శాశ్వతంగా గుడ్‌బై!) ‘‘మీరు ఇలానే మరి కొన్నాళ్లు నా భర్తకు వర్క్ ఫ్రం హోం ఇస్తే.. మా వైవాహిక జీవితం ముగిసిపోతుంది. ఎందుకంటే వర్క్ ఫ్రం హోం మొదలైన నాటి నుంచి నాకు పని భారం పెరిగింది. నా భర్త రోజుకు పది సార్లు కాఫీ తాగుతాడు.. ఒక్క గదిలో కూర్చుని పని చేయడు. వేర్వురు గదల్లో కూర్చుంటాడు. పైగా అక్కడంతా చెత్తా చెదారం పడేస్తాడు. ఇక రోజుకు ఎన్నిసార్లు తింటున్నాడో లెక్కేలేదు. వర్క్ కాల్స్ సమయంలో కునికిపాట్లు పడుతుంటాడు’’ అని తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. (చదవండి: ఇందిరా గాంధీ, జేఆర్డీ టాటా మధ్య ఆసక్తికర లేఖ..!) అంతేకాక ‘‘ఇప్పటికే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి బాగోగులు చూడ్డానికే సమయం సరిపోవడం లేదు. వారికి తోడు ఇప్పుడు నా భర్త వచ్చి చేరాడు. ఇంతమందికి సేవ చేయడం నా వల్ల కాదు. దయచేసి పెద్ద మనసుతో నా ఇబ్బందిని అర్థం చేసుకుని.. నా భర్తను ఆఫీస్‌కు పిలిచి.. నాకు కొంత విశ్రాంతి ఇవ్వండి’’ అని కోరింది. Don’t know how to respond to her….😀 pic.twitter.com/SuLFKzbCXy — Harsh Goenka (@hvgoenka) September 9, 2021 ప్రస్తుతం ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వర్క్ ఫ్రం హోంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి ఈ లేఖలో చక్కగా వర్ణించారు. భర్తలకు వర్క్ ఫ్రం హోం వల్ల మాకు పని భారం పెరిగింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇప్పటికే దీన్ని 5,300 మంది లైక్ చేయగా.. 480 మంది రీట్వీట్ చేశారు. -
అప్పడాలపై జీఎస్టీ !.. ట్విట్టర్లో రచ్చ రచ్చ
అప్పడాలపై జీఎస్టీ ఉందా? ఉంటే ఏ రకమైన అప్పడాలపై జీఎస్టీ ఉంది ? వేటికి మినహాయింపు ఉందనే అంశంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. చివరకు కేంద్రమే ఈ చర్చలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పాపడ్‌పై జీఎస్టీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఇటీవల ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. అందులో గుండ్రంగా ఉన్న పాపాడ్ (అప్పడం), చతురస్రాకారంలో ఉన్న అప్పడాల ఫోటోలను షేర్ చేశారు. ఇందులో గుండ్రటి అప్పడాలకు జీఎస్టీ మినహాయింపు ఉందని, చతురస్రాకారపు అప్పడాలకు జీఎస్టీ విధిస్తున్నారు ? ఇందులో లాజిక ఏముంది ? ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ ఈ సందేహానికి బదులివ్వాలంటూ అడిగారు. Did you know that a round papad is exempt from GST and a square papad attracts GST ? Can anyone suggest a good chartered accountant who can make me understand the logic? pic.twitter.com/tlu159AdIJ — Harsh Goenka (@hvgoenka) August 31, 2021 చర్చకు దారి తీసిన ట్వీట్ హర్ష్‌గోయెంకా ట్వీట్‌పై పెద్ద ఎత్తన నెటిజన్లు స్పందించారు. గుండ్రటి అప్పడాలు చేతితో చేస్తారు కాబట్టి వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని, చుతరస్రాకారపు అప్పడాలు మెషిన్ చేస్తారు కాబట్టి వాటికి జీఎస్టీ విధిస్తారంటూ చాలా మంది తమ అభిప్రాయం చెప్పారు. మరికొందరు చేతితో చేసే రౌండ్ షేప్ అప్పడాలు కుటీర పరిశ్రమ పరిధిలోకి వస్తాయని, స్క్వేర్ షేప్ అప్పడాలు భారీ పరిశ్రమ విభాగంలోకి వస్తాయంటూ స్పందించారు. ప్రభుత్వంపై విమర్శలు ఇక జీఎస్టీ చట్టం, అందులోని నిబంధనల జోలికి పోకుండా చాలా మంది నెటిజన్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అప్పడాలు రెండు ఒకటై అయినా రౌండ్ వాటికి మినహాయింపు ఇచ్చి, స్క్వేర్ షేప్ వాటికి పన్ను వేయడం పనికి మాలిన నిర్ణయమంటూ దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. ట్వీట్ పోస్ట్ చేసి 24 గంటల గడవక ముందే వేలాది మంది దీనిపై స్పందించడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. Papad, by whatever name known, is exempt from GST vide Entry No. 96 of GST notification No.2/2017-CT(R). This entry does not distinguish based on the shape of papad. This notification is available at https://t.co/ckIfjzg8hw https://t.co/19GbQJvYZe — CBIC (@cbic_india) August 31, 2021 జీఎస్టీ మినహాయింపు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోవడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం స్పందించింది. పాపాడ్ (అప్పడం) ఎలాంటిదైనా సరే దానిపై ఎటువంటి జీఎస్టీ విధించడం లేదని ప్రకటించింది. పాపాడ్లను జీఎస్టీ నుంచి మినహాయించినట్టు పేర్కొంది. ఈ మేరకు హర్ష్ గోయెంకా ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ బదులిచ్చింది. ఆల్కహాల్, పెట్రోలు ఉత్పత్తులు తప్ప దాదాపు అన్ని రకాల ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. చదవండి : సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి -
హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫన్నీ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. 2014 వింబుల్డన్ లేడీస్ డబుల్స్ మ్యాచ్ సందర్భంగా అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను గోయెంకా ట్విటర్లో రీట్వీట్ చేశారు. ఈ మిలియన్ డాలర్ల వీడియో నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. 2014లో జరిగిన వింబుల్డన్ మహిళల డబుల్స్ మొదటి రౌండ్ మ్యాచ్ మ్యాచ్‌లో టెన్నిస్ స్టార్లు సెరెనా, వీనస్ విలియమ్స్ ఒక్సానా కలష్నికోవా, ఓల్గా సావ్చుక్తో పోటీపడ్డారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి సర్వీస్‌ను ఎదుర్కొనే క్రమంలో వీనస్ వాలీ షాట్‌ను సెరెనా బ్యాలెన్స్ చేస్తూ బేస్లైన్పై పరుగెత్తుతూ పక్కనే ఉన్న ప్రేక్షకులపై పడపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ప్రేక్షకులలో ఒకరు ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటన అక్కడున్నవారిలో నవ్వులు పూయించింది. అంతేకాదు ‘వావ్.. వాట్ ఏ లక్కీమాన్’అంటూ చమత్కరిస్తున్నారు. అతని టిక్కెట్ ధరకి చాలా విలువ వచ్చింది ఇలాంటి అదృష్టం లక్షల్లో ఒకరికే అంటూ అసూయపడుతున్నారు. కాగా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే గోయెంకా తరచుగా అనేక విషయాలపై స్పందిస్తూ పలు వీడియోలు షేర్ చేస్తూ సందడి చేయడం తెలిసిందే. తాజాగా ఆయన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. చదవండి : Zomato: యాడ్ల దుమారం, మండిపడుతున్న నెటిజనులు Fun clip from Wimbledon. That's why it's said that the front seat is always expensive 🤣😂😅😜. #tennis #wimbledon #fun #moment #cute #humour #smile @hvgoenka pic.twitter.com/k9062DNvBi — Tarana Hussain (@hussain_tarana) August 30, 2021