'భార్యలు చాలా తెలివైనవారు': హర్ష్ గోయెంకా ట్వీట్ | Wives Are Smarter Harsh Goenka Tweet Viral | Sakshi
Sakshi News home page

'భార్యలు చాలా తెలివైనవారు': హర్ష్ గోయెంకా ట్వీట్

Published Fri, Apr 25 2025 4:34 PM | Last Updated on Fri, Apr 25 2025 9:10 PM

Wives Are Smarter Harsh Goenka Tweet Viral

సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే.. RPG గ్రూప్ చైర్మన్ 'హర్ష్ గోయెంకా' భార్యల తెలివితేటలను ప్రశంసిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

10 సంవత్సరాల క్రితం.. నేను రూ. 8 లక్షలకు కారు కొన్నాను. ఆమె రూ. 8 లక్షలకు బంగారం కొన్నది. ఈ రోజు ఆ కారు విలువ రూ. 1.5 లక్షలకు చేరింది. బంగారం విలువ రూ. 32 లక్షలకు చేరింది. నేను బంగారం కొనడం మానేద్దాం.. వెకేషన్‌కు వెళ్దాం అన్నాను. వెకేషన్‌ 5 రోజులు మాత్రమే ఉంటాయి, బంగారం ఐదు తరాలు ఉంటుందని ఆమె చెప్పిందని హర్ష్ గోయెంకా చెప్పారు.

ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..

నేను ఒక లక్ష రూపాయలు పెట్టి మొబైల్ ఫోన్ కొన్నాను. అదే ధరకు ఆమె బంగారం కొన్నది. నా ఫోన్ ధర ఇప్పుడు రూ. 8వేలు. ఆమె కొన్న బంగారం రూ. 2 లక్షలు. దీన్ని బట్టి చూస్తే 'భార్యలు చాలా తెలివైనవారు' అని గోయెంకా చెప్పారు. ఈ ట్వీట్ ఎంతోమంది నెటిజన్లను ఆకర్శించింది. చాలామంది ఈ విషయంలో ఏకీభవించారు. ఇప్పటికైనా భార్యలు మాట వినాలంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement