సామాజిక మాధ్యమాల్లో రెగ్యులర్‌గా స్పందించే పారిశ్రామికవేత్తలలో హర్ష్‌గోయోంకా ఒకరు. పలు రంగాల్లో అన్నింటి మీద ఆయన ట్వీట్లు చేస్తుంటారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2022ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్-2022పై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ట్వీటర్‌లో స్పందించారు.
బడ్జెట్ ఎలా ఉందంటే..!
ఎన్నో అంచనాల మధ్య కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2022పై హర్ష్ గోయెంకా సానుకూలంగా స్పందించగా... ఆయన స్నేహితుడు మాత్రం విమర్శిస్తూ ఒక ఆసక్తికర వీడియోను హర్ష్ గోయెంకాతో పంచుకున్నాడు. హర్ష్ గోయెంకా తన ట్విట్‌లో ‘ ఈ ప్రభుత్వాన్ని అసలు ఇష్టపడని నా స్నేహితుడితో ఇది చక్కటి బడ్జెట్! భారత ఆర్థిక వ్యవస్థ ఇంజన్లు ఇప్పుడు మరింత వేగంగా కదులుతాయి. బడ్జెట్ గురించి నువ్వేం అనుకుంటున్నావు? అని స్నేహితుడిని అడగ్గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బాడీతో సైకిల్‌పై ప్రయాణిస్తోన్న వ్యక్తి వీడియోతో నా మిత్రుడు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడని హర్ష్ గోయెంకా వీడియోను షేర్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూడడానికే భారీగా కన్పిస్తోన్న బడ్జెట్‌లో అంత పసలేదని ఆయన స్నేహితుడు విమర్శించాడు.
ప్రతిపక్షాల విమర్శలు..!
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఇది ప్రగతిశీల బడ్జెట్ అని..ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా బడ్జెట్‌పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలను చేస్తున్నాయి. నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో చేసిన బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి చదవని పెట్టుబడిదారీ బడ్జెట్ ప్రసంగం చేశారని మండిపడ్డారు. మొత్తం బడ్జెట్ ప్రసంగంలో పేదలన్న పదం కేవలం రెండుసార్లు మాత్రమే(పేరా ఆరులో) వచ్చిందన్నారు. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారని గుర్తు చేసినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం ‘జీరో’ సమ్ బడ్జెట్ ప్రకటించిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మధ్య తరగతి ప్రజలు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, యువత, రైతులు, ఎంఎస్‌ఎంఈలకు ఈ బడ్జెట్‌లో మొండిచేయి చూపారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
I told my friend who doesn’t like this government “A fine budget! The engines of economy will now move faster. What do you think of it?”
— Harsh Goenka (@hvgoenka) February 1, 2022
He sent me this reply…
pic.twitter.com/In636XorPK
చదవండి: ఇండియా ఎలా ఉందన్న అమెరికన్.. ఈ ఆన్సర్ చూస్తే ఆశ్చర్యపోతారు!
Comments
Please login to add a commentAdd a comment