
కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం అనేక రకాల వాణిజ్య ప్రకటనలను తయారుచేస్తాయి. భారీ ప్రకటనలతో చెప్పలేని కీలక అంశాలను ఒక చిన్న యాడ్ ద్వారా క్రియేటివ్‌గా చెబుతూ ఉంటాయి. క్రియేటివ్ ప్రమోషన్స్‌తో తమ ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి చెబుతూ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అలాంటి యాడ్ ఒకటి ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ప్రముఖ కార్ల కంపెనీ టయోటాకు సంబంధించిన ఒక యాడ్‌ను పారిశ్రామిక వేత్త హర్షగోయెంకా ట్వీట్ చేశారు. ఈ యాడ్ వీడియో ప్రకారం.. కారు బ్రేక్ డౌన్ కావడంతో ఒక అందమైన యువతి వెనుక వస్తున్న యువకులను లిఫ్ట్ అడుగుతుంది. అమ్మాయిని చూసినా కానీ అతను కారు ఆపడు.
అయితే కవ్వించే లుక్స్‌తో ఉన్న ఆ అమ్మాయిని చూసి కూడా కారు ఆపకపోవడంతో కారులో ఉన్న మరో వ్యక్తి అదోలాగా చూస్తాడు.. దీంతో ఇది ట్రాప్ బ్రో.. ఎపుడైనా టయోటా కరోలా కారు బ్రేక్ డౌన్ అవడం చూశామా? అంటూ ముందుకు పోతాడు. ఎండింగ్ మాత్రం మీరు చూసి థ్రిల్ అవ్వాల్సిందే..
ప్రత్యర్థులను పల్లెత్తు మాట అనకుండానే.. తమ టయోటా కరోలా స్టామినా, నాణ్యత ఎలాంటిదో చెప్పిన తీరు విశేషంగా నిలిచింది.
Nice ad… pic.twitter.com/cMyGuAIotj
— Harsh Goenka (@hvgoenka) April 2, 2024
Comments
Please login to add a commentAdd a comment