products
-
అంతరిక్షంలో.. హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరి కోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించిన ప్రతిష్టాత్మక 100వ ప్రాజెక్ట్ ఎన్వీఎస్–02. బుధవారం ఉదయం ప్రయోగించిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోని దూసుకెళ్లింది. ఎన్వీఎస్ సిరీస్‌లో ఈ ప్రయోగం రెండోది కాగా మరో మూడింటిని సిద్ధం చేస్తున్నారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రాజెక్టులో నగరంలోని నాగసాయి ప్రెసిషియన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తయారు చేసిన ఉత్పత్తులను వినియోగించడం విశేషం. ఈ శాటిలైట్‌లో వినియోగించే అతి సున్నితమైన లిథియం అయాన్ గ్లాజు బ్యాటరీలను సురక్షితంగా అమర్చే ‘స్లీవ్స్’ను నాగసాయి ప్రెసిషియన్ సంస్థ తయారు చేసిందని సంస్థ వ్యవస్థాపకులు బీఎన్.రెడ్డి(బొమ్మారెడ్డి నాగభూషణరెడ్డి) తెలిపారు. అయితే ఇస్రో చేపట్టిన ప్రాజెక్టుల్లో నాగసాయి ప్రెసిíÙయన్ భాగస్వామ్యం అందించిన ప్రాజెక్టుల్లో ఈ ఎన్వీఎస్–02 ప్రయోగం 55వది కావడం విశేషం. ∙శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఎన్వీఎస్ శాటిలైట్‌లో సోలార్ ఆధారంగా బ్యాటరీలు చార్జ్ అవుతాయి. ఈ విద్యుత్ శక్తితో శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధారంగానే అంతరిక్షంలోని విషయాలు మనకు చేరుతాయి. ఈ ప్రాజెక్టులో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు చాలా సున్నితమైనవి, సంక్లిష్టమైనవి. వేగంగా దూసుకెళ్లే రాకెట్ వైబ్రేషన్లను సైతం సమన్వయపరుస్తూ బ్యాటరీలను సురక్షితంగా, స్థిరంగా అమర్చడం క్లిష్టమైన వ్యవహారం. వీటిని అమర్చే స్లీవ్స్ బాడీ(రక్షణ కవచాలు)ని నగరంలో తయారు చేస్తున్నారు. దీనికి వినియోగించే ముడిపదార్థాలను ఇస్రో నియమాలకు అనుగుణంగా నాగసాయి కొనుగోలు చేసి తయారు చేసి ఇస్రోకు పంపిస్తుంది. వీటిని బెంగళూరు వేదికగా ధూళిసైతం చేరని ప్రత్యేక పరిశోధనా కేంద్రం(బ్యాటరీ డివిజన్)లో బిగించి అక్కడి నుంచి శ్రీహరి కోటకు పంపిస్తారు. ప్రయోగానికి ముందు శాటిలైట్‌లోని అన్ని భాగాలను రెండుసార్లు తనిఖీ చేస్తే ఈ స్లీవ్స్‌ను మాత్రం మూడుసార్లు (ఎన్డీపీ మైక్రో టెస్టింగ్) తనిఖీ చేస్తారు. 55 ఇస్రో ప్రాజెక్టుల్లో ప్రాతినిధ్యం 1998లో మొదటి భారతీయ సాంకేతికతతో ప్రయోగించిన ఇన్శాట్ 2 ఈ ప్రాజెక్టులో భాగంగా ఇస్రోతో మా సంస్థ ప్రయాణం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 55 ఇస్రో ప్రాజెక్టుల్లో మా ప్రాతినిధ్యం ఉంది. ఈ ప్రయోగం కోసం స్లీవ్స్ బాడీని 3 నెలల్లో తయారు చేశాం. ఎన్వీఎస్ సిరీస్‌లో ఎన్వీఎస్–01, ప్రస్తుత ఎన్వీఎస్–02లో నాగసాయి భాగస్వామ్యముంది. ఎన్వీఎస్–03 కోసం కూడా ఉత్పత్తులను సిద్ధం చేశాం. మరో వారం రోజుల్లో వాటిని ఇస్రోకు పంపించనున్నాం. దీనిని ఏప్రిల్–మే నెలలో ప్రయోగించే అవకాశముంది. ఈ సిరీస్‌లో 04, 05 ప్రయోగాలు కూడా ఉన్నాయి. వాటికి ఇంకా అనుమతి అందలేదు. వీటితో పాటు ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్ బ్యాటరీలను అమర్చే అల్యూమినియం స్టాండ్స్, నాసిల్స్, స్లీవ్స్‌ను సమకూర్చాం. చంద్రయాన్ 4కు అవసరమైన ఉత్పత్తులను సైతం సిద్ధం చేస్తున్నాం. భారతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గగన్‌యాన్‌లో సైతం కీలక పాత్ర పోషిస్తున్నాం. జీఎస్ఎల్వీ, డీఆర్డీఎల్కు కూడా సేవలందించాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)తో కలిసి పని చేయడంతో పాటు ఏరో స్పేస్, యుద్ధ విమానాల విడిభాగాల తయారీలో కృషి చేస్తున్నాం. టూల్స్ డిజైనింగ్ ఇంజినీరింగ్, ఏరో డైనమిక్స్‌లో నాకున్న అనుభవం ఈ 55 ప్రాజెక్టుల్లో పనిచేయడానికి అవకాశం లభించింది. – బీ.ఎన్.రెడ్డి -
గోమయం, గోమూత్రంతో : సమాజ హితం కోసం, ప్రకృతికి దగ్గరగా!
‘నా బిడ్డలు ఆరోగ్యంగా జీవించడానికి వారికి నేను ఇలాంటి భూగోళాన్ని ఇస్తున్నానా?’ అని ఆవేదన చెందుతోంది పూజా రాథోడ్. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. సహజమైన వనరులతో ప్రకృతి సిద్ధంగా జీవించడానికి మనమెందుకు సిద్ధంగా ఉండడం లేదు... అని ప్రశ్నిస్తున్నారు డాక్టర్ చెన్నమనేని పద్మ. ఇద్దరి ఆవేదనలోని ఆంతర్యం ఒక్కటే. భూమి చల్లగా ఉంటే మన జీవితాలు ఆనందంగా గడుస్తాయని. భూమాతకు ఎదురవుతున్న పరీక్షలకు సమాధానంగా ఇద్దరూ అనుసరిస్తున్న మార్గం ఒక్కటే. ఒకరిది రాజస్థాన్ రాష్ట్రం, మరొకరిది తెలంగాణ. పర్యావరణం పట్ల వారికి ఉన్న స్పృహ ఒకరితో మరొకరికి పరిచయం లేకపోయినా, ఆలోచనలను పంచుకోకపోయినా... వారిని ఒక దారిలో నడిపిస్తున్నది మాత్రం భూమాత గురించిన శ్రద్ధ, ఆరోగ్యకరమైన జీవనం పట్ల ఆసక్తి మాత్రమే. పూజారాధోడ్ చిత్రకారిణి. పటం మీద బొమ్మలు చిత్రిస్తారు. డాక్టర్ పద్మ ఇంటి అలంకరణ వస్తువులు, బొమ్మలు చేస్తారు. ఇద్దరూ తమ కళకు ముడిసరుకుగా ఉపయోగిస్తున్నది ప్రకృతి ప్రసాదాలను మాత్రమే. ఎర్ర మట్టి, రంపపు పొట్టు, మొక్కజొన్న పీచు, బొగ్గు, గోరింటాకు, ఆవు పేడ, గులకరాళ్లు, పూలు, వంటల్లో ఉపయోగించే పిండి...వీటికి పూజ క్రియేటివిటీ తోడైతే అద్భుతమైన వాల్ పెయింటింగ్ తయారవుతుంది. పద్మచేతిలో ఆవు పేడ గణపతి, లక్ష్మీదేవి రూపాలవుతుంది.పూజా రాథోడ్...జైపూర్‌లోని ఐఐఎస్యూలో విజువల్ ఆర్ట్స్‌లో కోర్సు చేసి, ‘స్టూడియో ద సాయిల్’ పేరుతో ఆర్ట్ స్టూడియో స్థాపించింది.డాక్టర్ చెన్నమనేని పద్మ... హైదరాబాద్‌లోని వనిత మహావిద్యాలయలో తెలుగు ప్రొఫెసర్‌గా రిటైరయ్యారు. తన విద్యార్థులకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను గమనించిన తర్వాత వాటి పరిష్కారం కోసం చేసిన అన్వేషణ ఇలా సహజ జీవనశైలి, జీవనశైలిలో ఆవు పాత్ర తెలిసి వచ్చాయంటున్నారు. ఒక మనిషి నిద్ర లేచిన తర్వాత పళ్లు తోముకోవడం నుంచి రాత్రి పడుకునే ముందు దోమలను పారదోలడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్ వరకు రోజు మొత్తంలో ఉపయోగించే అనేక వస్తువులను గోమయం, గోమూత్రంతో తయారు చేసి చూపిస్తున్నారు. వాటి తయారీలో శిక్షణనిస్తున్నారు. ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్, హ్యాండ్ మేడ్ సోప్స్, కీ హోల్డర్స్, ధూప్ స్టిక్స్, జపమాల, వాకిలి తోరణాలు... ఇలా రకరకాల వస్తువులు తయారు చేస్తోందామె.సస్టెయినబుల్ లైఫ్ స్టైల్ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి తన రిటైర్మెంట్ జీవితాన్ని అంకితం చేసినట్లు చెప్పారు పద్మ. ఆవును బతికించుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని సాధించవచ్చని నిరూపించాలనేది ఆమె ఆశయం. ఇందుకు ఆవును పెంచుకోమని బోధించడం వల్ల ప్రయోజనం లేదని గ్రహించిన తర్వాత స్వయంగా రెండు వందల గోవుల సంరక్షణ బాధ్యతను స్వీకరించారు. అందుకోసం హైదరాబాద్ నగరాన్ని వదిలి జగిత్యాల జిల్లాలోని సొంతూరు బోర్నపల్లికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు పద్మ. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం తన గ్రామం నుంచే మొదలుపెట్టారు. ఇదీ చదవండి: కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలుసహజ సిద్ధంగా...ఆవు తనకు చేతులెత్తి మొక్కమని చెప్పదు. తనను ఉపయోగించుకుని ఆరోగ్యంగా జీవించమని కోరుతుంది. అందుకే ఆవును అమ్మతో సమానం అని చెబుతారు. ఆవుతో వచ్చే ఆరోగ్యం గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆవును ఎన్ని రకాలుగా మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవచ్చో తెలియచేయడానికి నెలకు ఐదువందల రూ΄ాయలకు ఒక కిట్ తయారు చేశాను. అందులో ఇంటిని శుభ్రం చేసుకునే క్లీనింగ్ మెటీరియల్ నుంచి దేహాన్ని శుభ్రం చేసుకునే వస్తువుల వరకు అన్నీ ఉన్నాయి. రసాయన రహితమైన, ప్రకృతి సహజమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం కోసం నా ప్రయత్నం కొనసాగుతోంది. క్యాన్సర్‌ను దూరంగా ఉంచాలంటే మనం ప్రకృతికి దగ్గరగా జీవించాలి. నేలను భద్రంగా ఉంచుకోవాలి. రసాయనాలతో నేల కాలుష్యం, నీరు కాలుష్యం కావడంతో మన దేహమూ కాలుష్య కాసారమవుతోంది. క్యాన్సర్‌కు ఆహ్వానం పలుకుతోంది. ఈ దుస్థితి నుంచి మనం బయటపడాలి. – డాక్టర్ చెన్నమనేని పద్మ, విశ్రాంత ఆచార్యులు, సామాజిక కార్యకర్త ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
లోకల్ టు గ్లోబల్!
సాక్షి, హైదరాబాద్: చేనేత, హస్తకళలతోపాటు వ్యవసాయ రంగంలో ఘన సాంస్కృతిక వారసత్వాన్ని, నైపుణ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. తెలుగు నేలపై ప్రత్యేకత సంతరించుకున్న మరికొన్ని ఉత్పత్తులకు ఈ ఏడాది భౌగోళిక గుర్తింపు (జీఐ) సాధించేందుకు పోటీపడుతున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి మరో 10 ఉత్పత్తులు, ఏపీ నుంచి ఇంకో 12 ఉత్పత్తులు జీఐ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుకు రానున్నాయి.ఈ మేరకు ఆయా చేనేత, హస్తకళల గుర్తింపు కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ ఉత్పత్తులకు గుర్తింపు కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయం, వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే తెలంగాణలో 17 ఉత్పత్తులకు జీఐ గుర్తింపు లభించగా ఏపీలో 19 ఉత్పత్తులకు జీఐ హోదా లభించింది. తాజా ప్రతిపాదనలకు కూడా జీఐ ట్యాగ్ లభిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 58 ఉత్పత్తులకు ఆ ఘనత లభించినట్లు అవుతుంది.తెలంగాణ నుంచి జీఐ దరఖాస్తులివీ.. హైదరాబాద్ ముత్యాలు, ఆర్మూర్ పసుపు, నారాయణపేట ఆభరణాల తయారీ కళ, మెదక్‌కు చెందిన బాటిక్ పెయింటింగ్, నల్లగొండలోని బంజారా కుట్లు–అల్లికలు, బంజారా గిరిజన ఆభరణాలు, బాలానగర్ సీతాఫలం, నల్లగొండ దోసకాయ (ఓరియెంటల్ పిక్లింగ్ మెలన్), అనబ్–ఈ–షాహీ ద్రాక్ష, ఖమ్మం మిర్చి.ఏపీ నుంచి జీఐ దరఖాస్తులివీ.. తిరుపతిలోని మాధవమాల హస్తకళా శిల్పాలు, జమ్మలమడుగులోని డూపియన్ సిల్‌్క, వైఎస్సార్ కడపలోని మాధవరం కాటన్ అండ్ సిల్క్ చీరలు, పోలవరం చీరలు, బొబ్బిలి చీరలు, కడపగుంట తెల్లజిల్లేడు చెక్క విగ్రహాలు, పాలమ్నేరు టెర్రకోట, సుగంధాల అరటి, మైదుకూరు పసుపు, పోలూరు వంకాయ, దుర్గాడ మిర్చి, కాకినాడ గులాబీ.జీఐ గుర్తింపు ఎందుకు? మన సంప్రదాయాన్ని, ఆర్థికాభివృద్ధిని ప్రపంచానికి చాటిచెప్పే సాధనమే జీఐ. దీనివల్ల నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలకు చెందిన ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి పరిరక్షించడం వీలవుతుంది. ప్రస్తుతం దేశంలో 1,408 ఉత్పత్తులు జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా వాటిలో 658 ఉత్పత్తులు జీఐ గుర్తింపు పొందాయి.చట్టపరమైన రక్షణ.. భౌగోళిక గుర్తింపు వల్ల ఆయా ఉత్పత్తులకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. అలాగే వాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా ఉత్పత్తుల ఎగుమతితో ఉత్పత్తిదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. జీఐ ఉత్పత్తులకు ఉండాల్సిన అర్హతలు ఇవే.. ⇒ ఆయా ఉత్పత్తి తప్పనిసరిగా స్థానిక భౌగోళిక ప్రాంతానికి చెందినదై ఉండాలి⇒ భౌగోళిక స్థానంతో కొంత అనుసంధానమై ఉండాలి ⇒ స్థానికంగా, జాతీయంగా లేదా ప్రపంచ స్థాయిలో ఖ్యాతిని కలిగి ఉండాలి⇒ ఆయా ఉత్పత్తులకు చారిత్రక ఆధారాలు, ఉనికి కలిగి ఉండాలి⇒ ఇతర ఉత్పత్తులతో కొంత ప్రత్యేకత కలిగి ఉండాలి⇒ స్థానిక సంఘం ద్వారా తయారై లేదా ఉత్పత్తి అయి ఉండాలిజీఐ గుర్తింపుతో వారసత్వ పరిరక్షణ సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మన వారసత్వం, విలువలు, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేవి సాంస్కృతిక, హస్త, చేనేత కళలే. జీఐ గుర్తింపుతో ఉత్పత్తుల వారసత్వ పరిరక్షణతో పాటు ప్రపంచ దేశాలలో వ్యాపార డిమాండ్‌కు అవకాశం ఏర్పడుతుంది. – సుభాజిత్ సాహా, జీఐ ప్రాక్టీషనర్ -
ప్రతి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే..!
బాలీవుడ్ నటి రిచా చద్దా ఈ మధ్యనే జూలై లో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. నిజానికి, ఏడాది క్రితం వరకు ఆమె – పిల్లల్ని అస్సలు కనకూడదనే అనుకున్నారు! ఆమెలోని ఎకో యాంగ్జైటీనే అందుకు కారణం. ‘ఇంతటి విపరీతమైన వాతావరణ మార్పుల్లో పిల్లల్ని భూమి మీదకు తెచ్చిపడేయటం ఎలారా దేవుడా.. ‘అని ఆకాశం వైపు దీనంగా చూసేవారట రిచా. ఉదయ లేస్తూనే భూతాపం గురించి ఆలోచించటం, లేచాక కిటికీ లోంచి పొల్యూషన్ లోని తీవ్రతను అంచనా వేయటం రిచాకు అలవాటైపోయింది. ‘మొన్నటి వరకు అతి వేడి. ఇప్పుడు అతి చలి. ఈ మార్పులు నా బిడ్డపై ప్రభావం చూపకుండా జాగ్రత్త పడుతున్నాను. తనకు వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ వే. అలాంటి కొన్ని బేబీ ఐటమ్స్ ని నా స్నేహితురాళ్లు దియా మీర్జా, సోహా అలీ ఖాన్, ఇంకా నా పేరెంటల్ యోగా ఇన్స్ట్రక్టర్ నాకు కానుకగా ఇచ్చారు. నా చుట్టూ వాళ్లంతా నా ఆందోళనను కనిపెట్టి వాతావరణ మార్పులకు అనుగుణంగా పాప పెంపకంలో నాకు తోడ్పడుతున్నారు. టిప్స్ ఇస్తున్నారు’ అని ‘ఓగ్స్ ఇండియా‘కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు రిచా. ఇక ఆమె భర్త అలీ ఫజల్ గురించి చెప్పే పనే లేదు. ఈ ’మీర్జాపుర్ ’ యాక్టర్.. సింగిల్ యూస్ లాస్టిక్కి ఎప్పట్నుంచో వ్యతిరేకి. భార్యాభర్తలు షాపింగ్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా వాళ్ళ యాకేజీల్లో ఏ రూపంలోనూ ప్లాస్టిక్ అన్నదే ఉండదు. బిడ్డ పుట్టాకయితే వాళ్ళు మరీ మరీ జాగ్రత్తగా ఉంటున్నారు. పిల్లలు పుట్టక ముందు నుంచే, పుట్టబోయేవారి సంరక్షణ గురించి, వారి కోసం భూతాపాన్ని తమ వంతుగా తగ్గించటం గురించి ఆలోచించే ఇటువంటి తల్లిదండ్రుల వల్లనే రాబోయే తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. భూమి తల్లి వారిని చల్లగా చూస్తుంది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) (చదవండి: మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!) -
అరటి నార.. అందాల చీర
ఈ చీరలను నూలు, పట్టు దారాలతో నేశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. వీటిని కేవలం అరటి నారతో నేశారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఔత్సాహిక యువత అరటి నార (బనానా ఫైబర్)తో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. చీర నుంచి చేతిసంచి వరకు దాదాపు 45 రకాల ఉత్పత్తుల్ని తయారు చేస్తూ అదరహో అనిపిస్తున్నారు. పర్యావరణ హితమైన ఈ ప్రయత్నానికి ఏడాదిన్నర క్రితం బీజం వేయగా.. వాణిజ్యపరంగాను లాభాల పంట పండించనుంది.సాక్షి, అమరావతి: ‘బిడ్డలకు జన్మనిచ్చి తల్లి ప్రాణాలు కోల్పోతుంది’ అనే పొడుపు కథ విన్నారా. అరటి చెట్టును ఉద్దేశించి ఈ పొడుపు కథ వాడుకలోకి వచ్చింది. అరటి చెట్టు గెలవేసి.. గెలలోని కాయలు పక్వానికి రాగానే గెలను కోసేస్తారు. మరుక్షణమే అరటి చెట్టును నరికేస్తారు. అలా నరికిపడేసిన అరటి చెట్లు తోటల్లో గుట్టలుగా పేరుకుపోవడంతో వాటిని తొలగించేందుకు రైతులు పడే ఇబ్బందులు వర్ణానాతీతం. దీనికి శాస్త్రవేత్తలు గతంలోనే చక్కటి పరిష్కారం కనుక్కున్నారు. అరటి చెట్ల కాండం నుంచి నార తీసే సాంకేతికతను అభివృద్ధి చేయడంతోపాటు యంత్రాలను సైతం అందుబాటులోకి తెచ్చారు.అరటి నార తయారీతో రైతులకు ఆదాయంఅరటి నారకు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోంది. దీంతో ఔత్సాహికులు రైతుల వద్దకు వెళ్లి కొట్టి పడేసిన అరటి బొంత (కాండం)లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కొక్క బొంతకు రూ.2 నుంచి రూ.5 వరకు చెల్లిస్తున్నారు. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఆ బొంతలను ఎండబెట్టి యంత్రాల సాయంతో నార తీస్తున్నారు. ఈ నారతో పర్యావరణ హితమైన వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. దీనిపై మరింత అవగాహన పెంచి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎసాŠస్ర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో అరటి నార ఉత్పత్తుల తయారీపై ఔత్సాహిక యువత, మహిళలు, రైతులకు శిక్షణ ఐదు రోజుల శిక్షణ ఇచ్చారు. కాగా.. కడప నగరానికి చెందిన ముసా ఫైబర్ స్టార్టప్ సంస్థ వివిధ ప్రాంతాల్లో యువత, మహిళలకు అరటి నార ఉత్పత్తులపై శిక్షణ ఇస్తోంది. తాజాగా ఈ సంస్థ అనంతపురం జిల్లా కురుగుంటలో రెండు నెలలపాటు ఇచ్చిన శిక్షణ శనివారంతో ముగిసింది.అద్భుతమైన ఉత్పత్తుల తయారీఅరటి నారతో అద్బుతమైన ఉత్పత్తులను అందించే నైపుణ్యం అందర్నీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఇప్పటికే ఔత్సాహిక, అంకుర సంస్థలు అరటి నార నుంచి తీసిన దారాలతో చీరల్ని నేయించి అమ్మకాలకు పెడుతున్నాయి. అరటి నార దారాలతో ప్యాంట్లు, షర్ట్లు తదితర దుస్తులను రూపొందిస్తున్నాయి. కొందరు ఔత్సాహికులు అందమైన చేతి సంచులు, బుట్టలు, హ్యాండ్‌బ్యాగ్‌లు సైతం అరటి నారతో రూపొందిస్తున్నారు. చెవి రింగులు, గాజులు, బుట్టలు, ప్లేట్లు, గ్లాసులు, పాదరక్షలు, డోర్ మ్యాట్లు, యోగా మ్యాట్లు, శానిటరీ న్యాప్కిన్స్, పేపర్, పూల బుట్టలు ఇలా అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. పరుపులో వాడే పీచుకు బదులు అరటి నారతో తయారు చేస్తున్న క్వాయర్ మరింత నాణ్యతతో ఉన్నట్టు గుర్తించారు.మా కృషి ఫలిస్తోందిరాష్ట్రంలో అరటి సాగుచేసే రైతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అరటి బొంతల నుంచి తీసే ఫైబర్‌తో ఉత్పత్తులు తయారు చేయడంపై ఉతర రాష్ట్రాలకు వెళ్లి శిక్షణతో అవగాహన పెంచుకున్నాం. ఐదుగురు సభ్యులతో ముసా ఫైబర్ స్టార్టప్ నెలకొల్పాం. కడప, అనంతపురం, కృష్ణా, రాజమండ్రి, విజయనగరం జిల్లాల్లో అరటి నారతో ఉత్పత్తులు తయారు చేసే ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశాం. రైతుల నుంచి అరటి బొంతలు సేకరించి నారతీసి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నాం. మిగిలిన వ్యర్థాలను కంపోస్టుగా మారుస్తున్నాం. ర్చి రైతులకు ఇస్తున్నాం. అరటి బొంత నీరు నుంచి క్రిమిసంహారక మందులు, సౌందర్య సాధనాలు తయారు చేసే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. – పుల్లగుర శ్రీనివాసులు, ముసా ఫైబర్ స్టార్టప్, కడపఉపాధిగా మలుచుకుంటాంఅరటి ఉప ఉత్పత్తుల తయారీపై తీసుకున్న శిక్షణ మాకు ఉపయోగపడుతుంది. దీనిని ఉపాధిగా మలుచుకుంటాం. అరటి నార తీయడం మొదలు ఉత్పత్తుల తయారీ వరకు అనేక విధాలుగా జీవనోపాధి దొరుకుతుంది. – విద్య, కురుగుంట, అనంతపురం జిల్లాఅరటితో ఎన్నో ప్రయోజనాలుకొట్టిపడేసే అరటి చెట్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కుటీర పరిశ్రమగా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. శిక్షణ తీసుకోవడంతో మేం స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నాం. – శ్రీలక్ష్మి, కురుగుంట,అనంతపురం జిల్లా -
జోలోప్యాక్వైపు బాలీవుడ్ చూపు
న్యూఢిల్లీ: పర్యావరణహిత(సస్టెయినబుల్) డిస్పోజబుల్ ప్యాకింగ్ సంస్థ జోలోప్యాక్ ఇండియాలో పెట్టుబడులకు పలువురు బాలీవుడ్ అగ్రహీరోలు ఆసక్తి చూపుతున్నారు. సెలబ్రిటీ నటులు ఆమీర్ ఖాన్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ పబ్లిక్ ఇష్యూకంటే ముందుగా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అంతేకాకుండా రోజీ బ్లూ ఇండియా యజమాని రసెల్ మెహతా, ఆకాశ్ అంబానీ మామ సైతం కంపెనీలో మైనారిటీ వాటాలను సొంతం చేసుకున్నారు. అయితే ఎవరెంత ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడికాలేదు. సంస్థ ప్రీఐపీవో రౌండ్లో వాటాలు కొనుగోలు చేసిన జాబితాలో రివర్స్టోన్ క్యాపిటల్‌కు చెందిన దేవనాథన్ గోవిందరాజన్, మినర్వా వెంచర్స్ ఫండ్, నెక్ట్సా ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, ఎన్వీఎస్ కార్పొరేట్ కన్సల్టెన్సీ సరీ్వసెస్, ఓపస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, సరోద్ రియలీ్ట, ఫిరోజ్ ఫామ్స్ అండ్ హోల్డింగ్స్, వినే ఈక్విటీ మార్కెట్ ఎల్ఎల్పీ చేరాయి. కంపెనీ వివరాలివీ.. పుణేకు చెందిన జోలోప్యాక్ ఇండియా ఆర్గానిక్ డిస్పోజబుల్ చాకులు(కట్లెరీ), ఐస్‌క్రీమ్ స్టిక్స్, స్పూన్లు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. కంపెనీ ఇప్పటికే పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఎమర్జ్‌కు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 52.86 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. గతేడాది(2023–24) కంపెనీ ఆదాయం రూ. 12 కోట్ల నుంచి రెండున్నర రెట్లు జంప్‌చేసి రూ. 31.5 కోట్లకు చేరింది. నికర లాభం సైతం రూ. 3.5 కోట్ల నుంచి రూ. 6.4 కోట్లకు ఎగసింది. -
ప్రజారోగ్యంతో రెస్టారెంట్ల చెలగాటం
-
Deloitte: విలువను కోరుతున్న కస్టమర్లు
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని, తాము కొనుగోలు చేసే ఉత్పత్తుల విషయంలో విలువకు ప్రాధాన్యమిస్తున్నారని డెలాయిట్ నివేదిక తెలిపింది. కన్జ్యూమర్ వ్యాపారాలన్నింటా ఇదే ధోరణి కనిపిస్తున్నట్టు వివరించింది. ఖాళీ సమయాల్లో కార్యకలాపాలపై వినియోగదారులు తమ వ్యయాలను పెంచొచ్చని, దీంతో 2024–25లో ఏవియేషన్, హోటల్ పరిశ్రమలు మంచి పనితీరు నమోదు చేసే అవకాశాలున్నట్టు డెలాయిట్ నివేదిక అంచనా వేసింది. సౌందర్య ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి క్షీణించొచ్చని అంచనా వేసింది. కరోనా అనంతరం కస్టమర్లు పెద్ద మొత్తంలో విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో 2024–25 సంవత్సరానికి అధిక బేస్ ఏర్పడినట్టు డెలాయిట్ ‘ఫ్యూచర్ ఆఫ్ రిటైల్’ నివేదిక వెల్లడించింది. ‘‘కొన్ని విభాగాల్లో ఆరంభస్థాయి ఉత్పత్తులతో పోల్చి చూస్తే ప్రీమియం ఉత్పత్తుల్లో వృద్ధి ఎక్కువగా ఉంది. ఎల్రక్టానిక్స్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో ఇది కనిపిస్తోంది. ప్రీమియం ఉత్పత్తుల పరంగా తమ కస్టమర్ల ప్రాధాన్యతలను అర్థం చేసుకున్న కంపెనీలు దీన్నుంచి వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోగలవు’’ అని పేర్కొంది. చాలా విభాగాల్లో కస్టమర్లు పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి చోదకంగా నిలవగలదని తెలిపింది. ఈ ధోరణి నుంచి ప్రయోజనం పొందాలంటే కంపెనీలు తమను విశ్వసించే కస్టమర్లను కాపాడుకోవాలని, పనితీరు, విలువ పరంగా మెరుగైన ఉత్పత్తులతో వారికి చేరువ కావాలని సూచించింది. కస్టమర్లు, ఉత్పత్తులు, ఛానల్, అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిటైలర్లు 8–20 శాతం ఇంక్రిమెంటల్ వృద్ధిని సాధించొచ్చని అభిప్రాయపడింది. -
సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆల్ టైం రికార్డు
సాక్షి, అమరావతి: సముద్ర మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు 2023–24లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) చైర్మన్ డి.వి.స్వామి వెల్లడించారు. ఘనీభవించిన రొయ్యలు, చేపలు అమెరికా, చైనా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల వివరాలను ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరించారు. 2022–23తో పోలిస్తే ఎగుమతి పరిమాణం 2.67 శాతం పెరిగింది. 2022–23లో రూ.63,969.14 కోట్ల (8,094.31 మిలియన్ డాలర్ల) విలువైన 17,35,286 టన్నుల సముద్రపు ఉత్పత్తుల ఆహారం ఎగుమతి కాగా, 2023–24లో రూ.60,523.89 కోట్ల (7.38 బిలియన్ డాలర్ల) విలువైన 17,81,602 టన్నుల సముద్ర ఉత్పత్తులు దేశం నుంచి ఎగుమతి అయ్యాయి. ఘనీభవించిన రొయ్యల పరిమాణం, విలువ రెండింటి పరంగా ప్రధాన ఎగుమతి ఉత్పత్తిగా నిలిచింది. గతేడాది తీవ్రమైన మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ 7.38 బిలియన డాలర్ల విలువైన 17,81,602 టన్నుల సముద్రపు ఆహారాన్ని రవాణా చేయడం ద్వారా ఆల్ టైమ్ గరిష్ట ఎగుమతులను నమోదు చేసినట్లు ఎంపెడా ప్రకటించింది. ప్రపంచస్థాయి వాణిజ్యరంగంలో భారతదేశ సముద్ర ఆహార దిగుమతుల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. మత్స్య ఉత్పత్తుల ఎగుమతి ద్వారా 2,549.15 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అమెరికా నుంచి భారత్ ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే 34.53 శాతం వృద్ధిరేటు సాధించింది. ఆ తర్వాత మన మత్స్య ఉత్పత్తుల దిగుమతిలో చైనా రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. ఈ ఏడాది 1,384.89 మిలియన్ డాలర్ల విలువైన 4,51,363 టన్నుల మత్స్య ఉత్పత్తులు చైనాకు ఎగుమతి అయ్యాయి. 25.33 శాతం వృద్ధి రేటు నమోదైంది. చైనా తర్వాత స్థానాల్లో జపాన్, వియత్నం, థాయలాండ్, కెనడా, స్పెయిన్, బెల్జియం దేశాలున్నాయి.రొయ్య ఎగుమతుల్లో అగ్రస్థానం అమెరికాకే ఎగుమతుల్లో 7.16 లక్షల టన్నులతో ఘనీభవించిన రొయ్యలు మొదటిస్థానంలో నిలిచాయి. వీటిద్వారా దేశానికి రూ.40,013.54 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా 2,97,571 టన్నులు అమెరికాకు ఎగుమతి కాగా.. చైనాకు 1,48,483 టన్నులు, యూరోపియన్ దేశాలకు 89,697 టన్నులు, సౌత్ ఈస్ట్ ఏషియాకు 52,254 టన్నులు, జపాన్‌కు 35,906 టన్నులు, మిడిల్ ఈస్ట్ దేశాలకు 28,571 టన్నులు ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత ఘనీభవించిన చేపలు రెండో అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా గుర్తింపు పొందింది. వీటిద్వారా రూ. 5,509.69 కోట్ల ఆదాయం లభించింది. చేప, రొయ్యల ఆహారం, పొడి దాణా ఉత్పత్తులు ఎగుమతిలో మూడో అతిపెద్ద ఉత్పత్తిగా నిలిచింది. వీటి ద్వారా దేశానికి రూ.3,684.79 కోట్ల ఆదాయం వచ్చింది. ఘనీభవించిన స్క్విడ్ నాలుగో అతిపెద్ద ఎగుమతిగా నిలిచింది. దీనిద్వారా రూ.3,061.46 కోట్ల ఆదాయం లభించింది. సురిమి, సురిమి అనలాగ్స్కు చెందిన ఉత్పత్తులు ఐదోస్థానంలో నిలిచాయి. ఇవి రూ.2,414.43 కోట్ల విలువైన 1,35,327 టన్నులు ఎగుమతి అయ్యాయి. ఆ తర్వాత రూ.2,252.63 కోట్ల విలువైన 54,316 టన్నుల ఎగుమతితో ప్రోజిన్ కాటిల్ ఫిష్ ఆరోస్థానంలో నిలిచింది. చిల్డ్ ఐటమ్స్, ఆక్టోపస్ ఎగుమతులు ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. -
గ్లామ్ అప్ ఫెస్ట్ 2024 సెకండ్ ఎడిషన్ లాంచ్, మూడు రోజులపాటు
భారతదేశంలోని అతిపెద్ద బ్యూటీ ఈవెంట్ ‘గ్లామ్ అప్ ఫెస్ట్ 2024’ రెండో ఎడిషన్ షురూ అయింది. స్వదేశీ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా జూన్ 14 నుండి జూన్ 17 వరకు జరిగే ఈ ఈవెంట్లో గ్లామ్ అప్ సేల్‌తో పాటు ప్రీమియం, స్వదేశీ D2C బ్రాండ్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అందం, సౌందర్య సాధనాలు, చర్మ సంరక్షణ, సువాసన ఉత్పత్తుల అద్భుతమైన డీల్స్ అందిస్తుంది. ఇంకా సరికొత్త లాంచ్‌లు, డీల్స్ , సిగ్నేచర్ కలెక్షన్స్, బ్రాండ్ లాంచింగ్స్, ఇంటరాక్టివ్ యాక్టివిటీలు, ఫ్యాషన్ షో, ప్రోడక్ట్ ట్రయల్స్ డెడికేటెడ్ ఫోటో అండ్ వీడియో స్టేషన్లు ఉంటాయి.ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రకటించిన ఈ గ్లామ్ అప్ ఫెస్ట్ సెకండ్ ఎడిషన్‌లో 3,500+ బ్యూటీ అండ్ లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ఏకం చేసే ఈ గ్రాండ్ ఈవెంట్లో 70కిపైగా టాప్ బ్రాండ్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. గ్లామ్ అప్ ఫెస్ట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం అద్భుతమై ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తోందని ఫ్లిప్‌కార్ట్ FMCG అండ్ జనరల్ మర్చండైజ్ బిజినెస్ హెడ్ మంజరీ సింఘాల్ తెలిపారు. తమ కస్టమర్లకు ఈ ఈవెంట్ చక్కటి బ్యూటీ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు.స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్లను ఒకే తాటిపైకి తీసుకువస్తూ, ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ గ్లామ్ అప్ ఫెస్ట్‌ను తాప్సీ పన్ను, సిద్ధాంత్ చతుర్వేది, రోహిత్ సరాఫ్, అదా శర్మ , పష్మీనా రోషన్లతో సహా పలువురు ఈ ఫెస్ట్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. వర్చువల్ ట్రై-ఆన్, వీడియో కామర్స్, స్కిన్ ఎనలైజర్లు లాంటి వినూత్న సాధనాలతో ఫ్లిప్‌కార్ట్ , AR , VR సామర్థ్యాలను కూడా ఉపయోగించుకోవచ్చు. -
ప్యాక్ చేసిన ఆహార పదార్థాల లేబుల్‌లో ఇవి ఉంటేనే కొనండి!
చాలామంది ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను కొనేస్తారే గానీ ఆ ప్రొడక్ట్ నాసిరకమైనదా? కాదా? అనేది చెక్ చెయ్యరు. తీరా కొని తినేశాక అస్వస్థతకు గురయ్యేంత వరకు మేలుకోరు కొంతమంది. అంతేగాదు కొందరూ కొన్ని బ్రాండెడ్ కంపెనీ నుంచి కొన్న ఉత్పత్తులు కదా..! అన్న ధీమాతో అస్సలు లేబుల్ చెక్ చెయ్యరు. ఎవరికో అక్కడ కొనడం వల్ల ఈ సమస్య వచ్చిందనో లేక ఆహార భద్రతా అధికారుల చెక్కింగ్ల వల్లో అసలు విషయం బయటపడితేగానీ తేరుకోరు. ఇలా అస్సలు చెయ్యద్దని అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఏ బ్రాండ్‌కి సంబంధించిన ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలైన దాని లేబుల్‌పై ఈ సమాచారం తప్పనిసరిగా ఉండాలి. అవేంటంటే..ఈ రోజు జూన్ ఏడోవ తేదీ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించడం, తీసుకోవాలసిన చర్యలు గురించి చర్చలు, అవగాహన శిబిరాలు నిర్వహిస్తారు. అయితే ఇటీవల పలు ప్రముఖ ఫుడ్ స్టోరేజ్‌లపై జరిగిన వరుస తనిఖీల్లో గడవు తీరిన వాటిని ఫుడ్ ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు పెద్ద కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఈ నకిలీ ఫుడ్ ప్రొడక్ట్స్‌ని ఎలా నివారించాలి. వాటిని ఎలా గుర్తించాలి సవివరంగా తెలుసుకుందాం. ప్రాసెస్ లేదా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువ వినయోగిస్తున్నాం కాబట్టి తప్పని సరిగా ఆ ఉత్పత్తులకు సంబంధించిన లేబుల్ ఉంటుంది. దానిలో ఉత్పత్తికి సంబంధించిన ఇలాంటి సమాచారం మొత్తం ఉంటేనే కొనాలి . అవేంటంటే..ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగో..ఉత్తత్తులపై ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) లోగో ఉండాలి. ఇది ప్రభుత్వం నిర్దేశించిన భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది. కాబట్టి ప్రొడక్ట్స్‌పై ఈ లోగో ఉంతో లేదో తనిఖీ చేయండిగడువు తేది:ఆహార ఉత్పత్తులపై గడువుత తేదీ కచ్చితంగా ఉండాలి. అది ఉందో లేదో చూడండి. దానిపై గడవు తీరిపోయినట్లు తేదీ ఉంటే వెంటనే వాటిని కొనుగోలు చేయకండి. పోషకాహార సమాచారం:ఆ ఉత్పత్తిలో ఉండే కేలరీలు, కొవ్వు పదార్థాలు, చక్కెర కంటెంట్ ఇతర పోషకాలకు సంబంధించన సమాచారం అంతా ఉందో లేదో చూడంది. ఇది మీకు ఈ ఉత్పత్తిని తీసుకోవచ్చో లేదా తెలియజేస్తుంది. అంతేగాదు ఆర్యోకరమైనదే తీసుకుంటున్నామో లేదో కూడా తెలుస్తుంది. పదార్థాల జాబితా..ఏ పదార్థాలతో దాన్ని తయారు చేశారనే సమాచారం కూడా ఉండాలి. దీన్ని బట్టి ఆయా పదార్థాలు మీకు పడనవి అయితే వెంటనే ఆప్రొడక్ట్ కొనుగోలు చేయకుండా ఉంటారు. ఇతర సమస్యలు తలెత్తవు కూడా. జీఎంఓ ఉచిత లేబుల్ఆహారంలో జన్యు మార్పు చెందిన జీవులను నివారించాలనుకుంటే నాన్ జీఎంవో ప్రాజెక్ట్ వెరిఫైడ్ ఉత్పత్తులను ఎంచుకోండి. దీనిలో జన్యుపరంగా మార్పు చేసిన పదార్థాలు ఉండవు. ఆర్గానిక్ సర్టిఫికేషన్..సేంద్రీయా ఉత్పత్తులతో తయారు చేసిందనే సమాచారం ఉంటుంది. దానిపై ఇండియా ఆర్గానిక్ ఏదా యూఎస్డీఏ ఆర్గానిక్ వంటి గుర్తింపు పొందిన ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో ధృవీకరించబడినట్లు ఉంటుంది. (చదవండి: జీరో-వేస్ట్ వెడ్డింగ్: శెభాష్ పూర్వీ.. పర్యావరణ హితంగా పరిణయ వేడుక) -
ట్రైనీ నుంచి డైరెక్టర్ దాకా... రూ.2,556 కోట్ల మార్కెట్
నేడు చాలామంది యువత చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి సొంతంగా వ్యాపారాలను ప్రారరంభిస్తున్నారు. అనుకున్న రంగంలో విజయం సాధించాలని కలలు కంటున్నారు. అయితే తమ కలల లక్ష్య సాధనలో అడుగులువేయడం కోసం ఏదైనా ఒక స్ఫూర్తి ఉండాలి కదా...పుణేలో ఉంటున్న 33 ఏళ్ల అక్షాలీషా సాధిస్తున్న విజయం నవతరానికి స్ఫూర్తి దాయకం. ఎంబీయే చేసి, పద్నాలుగేళ్ల క్రితం తండ్రి ప్రారంభించిన చిన్న డెయిరీ యూనిట్లో ట్రైనీగా చేరింది అక్షాలీ షా. మిల్క్ ప్రొడక్ట్స్ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తూ నేడు కంపెనీ రూ.2,556 కోట్ల మార్కెట్‌ని సాధించేంతగా కృషి చేసింది.బిజినెస్‌లో రాణించాలనుకునేవారికి పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె చేసిన ప్రయాణం ఓ పాఠం అవుతుంది.‘‘నేను ఎంబీయేలో చేరేనాటికి మా నాన్న దేవేంద్ర షా పుణే సమీపంలోని మంచార్లో ఒక చిన్న డెయిరీ యూనిట్‌ను ప్రారంభించాడు. ఎంబీయే పూర్తవుతూనే ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకున్నప్పుడు మా నాన్న తన యూనిట్లోనే జాబ్‌లో చేరి, వ్యాపారాన్ని డెవలప్ చేయమన్నాడు. దానిని సవాల్‌గా తీసుకున్నాను. పరాగ్ పేరుతో రకరకాల పాల ఉత్పత్తులను తయారుచేయడం మొదలుపెట్టాను. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన అధ్యయనంతో మొదలుపెట్టాను. ఏ బిజినెస్ అయినా అంచెలంచెలుగా ఎదగాలంటే ముందు మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి. నాణ్యతపైన దృష్టి పెట్టాలి. పుణే ప్రాంతంలో సహకార సంఘాల వాళ్లు మిల్క్ లీవ్ ప్రకటించినప్పుడు మా నాన్న రైతుల నుండి పాలను సేకరించి, మిల్క్ ఫుడ్స్ తయారీకి పునాది వేశారు. అక్కణ్ణుంచి కంపెనీ పాడి పరిశ్రమంలో ఇదొక విప్లవాత్మకమైన ప్రయాణానికి నాంది పలికినట్లయింది. ఆ విధంగా నాన్న ఆలోచనలనూ అందుకుంటూ నా ప్రయత్నాలు మొదలుపెట్టాను. శ్రేష్టమైన ఉత్పత్తులు..చాలారకాల ఆహారపదార్థాల నుంచి ప్రొటీన్స్ లభిస్తాయన్నది తెలిసిందే. పాలలో ప్రొటీన్ మోతాదు ఎక్కువ. అందుకే వినియోగదారుల అవసరాల మేరకు ప్రొటీన్ మిల్క్ ప్రొడక్ట్‌లను తయారుచేసి విక్రయిస్తున్నాం. ‘పరాగ్’ అని ప్రారంభించిన మా సంస్థ నుంచి నెయ్యి, చీజ్, ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు.. ఈ అన్ని ఉత్పత్తుల్లో మంచి అమ్మకాలు సాధిస్తుంది. ఇప్పుడు చీజ్ తయారీ, అమ్మకంలో దేశంలోనే మా సంస్థ రెండవదిగా నిలిచింది. ఫార్మ్ టు హోమ్ బిజినెస్, స్పోర్ట్స్ న్యూట్రిషన్ బ్రాండ్, పానీయాల వృద్ధి, ఉత్పత్తిలో నా మార్క్‌ను చూపించగలిగాను. గడపగడపకూ..ఆవుపాల శ్రేష్టత గురించి తెలిసిందే. అందుకే, మన దేశంలో వీటి వాడకమూ ఎక్కువే ఉంటుంది. ఖరీదు ఎక్కువైనా శేష్ట్రమైన ఆవుపాల గురించి చాలా మంది అన్వేషిస్తారు. మొదట్లో ఆవుపాలు పితికి, అవి అవసరం ఉన్న కొద్దిమంది ఖాతాదారులకే అందించేవాళ్లం. ఆ తర్వాత ఆవు పాల గురించి దేశీయంగా ఉన్న మార్కెటింగ్ వైపు దృష్టి పెట్టాను. శ్రేష్టమైన ఆవుపాల కోసం కోట్లమంది ఖాతాదారులు ప్రయత్నిస్తున్నారని అర్థంచేసుకున్నాను. దీంతో ‘ప్రైడ్ ఆఫ్ కౌస్’ పేరుతో దేశవ్యాప్తంగా ఆవుపాలను కోరుకున్న ఖాతాదారుల గడప దగ్గరకు చేర్చేలా ప్రణాళికలు రూపొందించాం. ఢిల్లీ, ముంబై, పుణే, సూరత్‌లలో ఆవుపాలు విశేషంగా అమ్ముడుపోతున్నాయి. వ్యాపావేత్తగా ఎన్నో అవార్డులను పొందుతూనే ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ మార్కెట్ పై ఒక అంచనాతో అడుగులు వేస్తున్నాం’’ అని వివరిస్తుంది అక్షాలీ. -
‘వీటిని స్టాక్ పెట్టుకోండి’.. కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలు అంటించారు. ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని.. బీఆర్ఎస్ కాదని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రస్తుత కాలంలో ప్రజలంతా.. కొన్ని ఉత్పత్తులను నిల్వ చేసుకోవాలని అభ్యర్థించారు. అందులో... 1. ఇన్వర్టర్. 2. ఛార్జింగ్ బల్బులు. 3. టార్చ్ లైట్లు. 4. కొవ్వొత్తులు. 5. జనరేటర్లు. 6. పవర్ బ్యాంకులను నిల్వ ఉంచుకోవాలని ప్రజలను కోరుతూ కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. వీటీనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలుగా హామీ ఇచ్చిందని ఎద్దేవా చేశారు. గ్యారంటీల హామీ ఇచ్చి.. వాటీని స్టాక్ పెట్టుకోవల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. అందుకే మే 13 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రోజు తెలివిగా ఆలోచించి ప్రజలంతా ఓటు వేయాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రజలను కోరారు.Request all fellow citizens to stock up on the following products Six Guarantees 😄1. Inverter2. Charging bulbs3. Torch lights4. Candles5. Generators6. Power BanksRemember it’s the Congress Govt, Not BRS’Vote wisely on 13th May 🙏#Vote4Car #KCRForTelangana— KTR (@KTRBRS) May 9, 2024 కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ప్రధాని మోదీజీ.. అదానీ, అంబానీ స్కాంగ్రెస్(కాంగ్రెస్)కు టెంపోల నిండా డబ్బు పంపిస్తుంటే.. ఆయన అభిమాన మిత్రులైన ఈడీ, ఐటీ, సీబీఐ ఎందుకు మౌనంగా ఉన్నాయి?. డీమోనిటైజేషన్ వైఫల్యం అని కూడా ఆయన ఒప్పుకుంటారా?’ అని కామెంట్స్ చేశారు. As per PM Modi, if Adani & Ambani have been sending Tempoes full of cash to Scamgress, why did his favourite allies ED, IT & CBI stay mum?Is he also admitting that Demonetisation was a failure ?#JustAsking— KTR (@KTRBRS) May 9, 2024 -
నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఇటీవలకాలంలో కొన్ని ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో క్యాడ్బరీ చాక్లెట్లు, బోర్నావిటా వంటి ప్రొడక్ట్స్‌పై ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో అధిక చక్కెర ఉందని ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తెలిపారు. అవి మరువక మునుపై తాజాగా ప్రముఖ బేబి బ్రాండ్ నెస్లేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రొడక్ట్స్‌పై జరిపిన అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందంటే..నెస్లే బ్రాండ్‌కి సబంధించిన శిశువుల ప్రొడక్ట్స్ సెరెలాక్‌లో అధిక చక్కెర కలుపుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఒక్కో స్పూన్లో దాదాపు మూడు గ్రాములు చక్కెర ఉన్నట్లు పరిధనలో గుర్తించారు. ఇది అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు పబ్లిక్ ఐ, అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్స్ అనే పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. దీని కారణంగా ఊబకాయం, దీర్థకాలిక వ్యాధులు తలెత్తుతాయిని తెలిపింది. ఈ ఉల్లంఘనలు కేవలం ఆసియా, ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ దేశాలలో మాత్రమే జరుగుతున్నట్లు గుర్తించింది. నెస్లే ద్వారా అమ్ముడవుతున్న రెండు రకాల బేబీ ఫుడ్ బ్రాండ్స్‌లలో అధిక స్థాయిలో చక్కెర ఉన్నట్లు పబ్లిక్ ఐ వెల్లడించింది. అయితే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెస్లే ఉత్పత్తుల్లో చక్కెర రహితం ఉన్నాయని పబ్లిక్ ఐ తెలిపింది. భారత్‌లో ఇదే బ్రాండ్ మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రొడక్ట్స్‌లో ఒక్కో సర్వింగ్‌లో సగటున దాదాపు మూడ గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే ఇథియోపియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఇదే బ్రాండ్ ప్రొడక్ట్స్‌లో ఏకంగా ఆరు గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మరీ జర్మనీ, యూకేలో మాత్రం చక్కెర జోడించకుండా విక్రయించడ గమనార్హం. నిజానికి ఈ నెస్లే ప్యాకేజింగ్‌పై షోషకాహార సమాచారంలో ఈ జోడించిన చక్కెర గురించి సమాచరం లేనట్లు నివేదిక పేర్కొంది. ఇది కేవలం తన ఉత్పత్తులపై విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల గురించి ప్రముఖంగా హైలైట్ చేస్తుందని, పారదర్శకంగా లేదని నివేదిక వెల్లడించింది. నిపుణలు ఏం మంటున్నారంటే.. శిశువుల ఉత్పత్తుల్లో అధిక చక్కెర ప్రమాదకరమైనదని నిపుణలు చెబుతున్నారు. శివువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారంలో చక్కెర ఎక్కువగా జోడించకూడదు. వాళ్లు ఈ రుచికి అలవాటు పడి చక్కెరకు సంబంధించిన ఆహారాలను తినేందుకు ఇష్టపడటం జరుగుతుంది. దీంతో క్రమంగా పోషకాహార రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా కౌమర దశకు చేరుకోక మునుపే ఊబకాయం, మధుమేహం లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు వెల్లడించారు. అయితే పరిశోధన సంస్థపబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్‌లు నెస్లే కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా..గత ఐదేళ్లలో, నెస్లే ఇండియా ప్రపంచవ్యాప్తంగా శిశు తృణధాన్యాల పోర్ట్‌ఫోలియోలో (పాలు తృణధాన్యాల ఆధారిత కాంప్లిమెంటరీ ఫుడ్) వేరియంట్‌ను బట్టి 30% వరకు చక్కెరలను జోడించడం తగ్గించింది అని చెబుతుండటం విశేషం. (చదవండి: ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్ మ్యాగజైన్లో..!) -
అందమైన అమ్మాయ్ అయితే ? అది ట్రాప్ బ్రో! అదిరిపోయే వీడియో
కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం అనేక రకాల వాణిజ్య ప్రకటనలను తయారుచేస్తాయి. భారీ ప్రకటనలతో చెప్పలేని కీలక అంశాలను ఒక చిన్న యాడ్ ద్వారా క్రియేటివ్‌గా చెబుతూ ఉంటాయి. క్రియేటివ్ ప్రమోషన్స్‌తో తమ ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి చెబుతూ వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అలాంటి యాడ్ ఒకటి ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రముఖ కార్ల కంపెనీ టయోటాకు సంబంధించిన ఒక యాడ్‌ను పారిశ్రామిక వేత్త హర్షగోయెంకా ట్వీట్ చేశారు. ఈ యాడ్ వీడియో ప్రకారం.. కారు బ్రేక్ డౌన్ కావడంతో ఒక అందమైన యువతి వెనుక వస్తున్న యువకులను లిఫ్ట్ అడుగుతుంది. అమ్మాయిని చూసినా కానీ అతను కారు ఆపడు. అయితే కవ్వించే లుక్స్‌తో ఉన్న ఆ అమ్మాయిని చూసి కూడా కారు ఆపకపోవడంతో కారులో ఉన్న మరో వ్యక్తి అదోలాగా చూస్తాడు.. దీంతో ఇది ట్రాప్ బ్రో.. ఎపుడైనా టయోటా కరోలా కారు బ్రేక్ డౌన్ అవడం చూశామా? అంటూ ముందుకు పోతాడు. ఎండింగ్ మాత్రం మీరు చూసి థ్రిల్ అవ్వాల్సిందే.. ప్రత్యర్థులను పల్లెత్తు మాట అనకుండానే.. తమ టయోటా కరోలా స్టామినా, నాణ్యత ఎలాంటిదో చెప్పిన తీరు విశేషంగా నిలిచింది. Nice ad… pic.twitter.com/cMyGuAIotj — Harsh Goenka (@hvgoenka) April 2, 2024 -
కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వ్యవస్థాపకురాలిగా సత్తా చాటుతున్న టీచర్!
కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ఆ ప్రొడక్ట్‌లన్నీ సహజసిద్ధమైన వాటితోనే తయారు చేయడంతో ఆ ప్రొడక్ట్‌లకు మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. అందులోనూ కొరియన్ మహిళలు మచ్చలేని చందమామలా కనిపించడంతో ఆ దేశ ప్రొడక్ట్‌లను కొనేందుకు ప్రజలు ఎగబడుతుంటారు. ముఖ్యంగా వాళ్ల గ్లాస్ స్కిన్ మరింతగా కట్టిపడేస్తుంది. అలాంటి ప్రముఖ కొరియన్ బ్రాండ్లలో ఒక ప్రసిద్ధ బ్రాండ్‌ని ప్రారంభించి.. ఓ టీచర్ సత్తా చాటుంది. వ్యాపారవేత్తగా విజయపథంలో దూసుకుపోతోంది. ఆమె సక్సెస్ జర్నీ ఎలా ప్రారంభమయ్యిందంటే.. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కొరియన్ బ్రాండ్లదే అగ్రస్థానం అని చెప్పాలి. కొరియన్ల మచ్చలేని చర్మం కారణంగానే ఆ ప్రొడక్టలకు ఇంత ప్రజాధరణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కొరియన్ డ్రామాలు, సినిమాలకు భారత్ అంతటా వేలాదిగా అభిమానులు ఉన్నారు. బహుశా ఆ కారణం వల్ల కూడా ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్టలకీ మార్కెట్లో ఇంతలా డిమాండ్ ఉంది. అయితే ఈ కొరియన్ ప్రొడక్టలకీ కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ ఉంది. అలాంటి కొరియన్ బ్యూటీ ప్రొడక్టలలో ప్రసిద్ధ బ్రాండ్ అయినా బ్యూటీ బార్న్ వ్యవస్థాపకురాలు నాగలాండ్కి చెందిన తోయినాలి చోఫీ . ఈ కే బ్యూటీ బ్రాండ్‌ని చోఫీ 2016లో స్థాపించింది. ఇందులో బార్న్ COSRX నత్త మ్యూసిన్, క్లైర్స్ జ్యూస్డ్ విటమిన్ డ్రాప్, హోలికా సిరమైడ్ క్రీమ్ తదితర ఫేమస్ బ్యూటీ ప్రొడక్ట్‌లను తయారు చేస్తారు. ప్రారంభంలో కేవలం 500 ఆర్డర్లు మాత్రమే వచ్చినట్లు చోఫీ పేర్కొంది. అయితే కాల క్రమేణ ఉత్పత్తుల నాణ్యత కారణంగా ఆ సంఖ్య విపరీతంగా పెరిగి, భారత్‌లో ఉన్న మిగతా ప్రసిద్ద కొరియన్ బ్రాండ్లలో ఇది కూడా ఒకటిగా దూసుకుపోవడం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇక చోఫీ ఈ వ్యాపారం గురించి మాట్లాడుతూ ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు బాగానే ఉన్నాయని చెప్పారు. అయితే ఈ బ్రాండ్‌ని తాను కేవలం నాగాలండ్కే పరిమితం చేయాలనుకోవడం లేదని, భారతదేశమంతటా విస్తరించనున్నట్లు తెలిపింది. ఇక తాను టీనేజ్‌లో ఉన్నప్పుడూ ముఖంపై వచ్చిన మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతుండేదాన్ని అని చెప్పారు. అప్పుడే తన స్నేహితులు ఈ కొరియన్ చర్మసంరక్షణ ప్రొడక్ట్‌లు బెటర్ అని సూచించడంతో తనకు వాటి గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. అవి తనకు బాగా పనిచేయడంతోనే ఈ బ్యూటీ ప్రొడక్టలను తయారు చేసే వ్యాపారం చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఆ ఆసక్తి కారణంగానే టీచర్ ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టానని చెప్పుకొచ్చింది. ఇక ఆమె బ్రాండ్‌కి చెందిన అధికారిక ఇన్‌స్టాగ్రాంలో 45 వేల మందికి పైగా ఫాలోవర్లు, అభిమానులు ఉండటం విశేషం. ఆసక్తి ఉంటే టీ (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో డౌన్ అయిపోలే..! ఏకంగా మోడల్‌గా..!) -
మాది రైతు ప్రభుత్వం
లక్నో/సంభాల్/న్యూఢిల్లీ: భారతీయ ఆహార ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా డైనింగ్ టేబుళ్లపై ఉండాలన్నదే మనందరి ఉమ్మడి లక్ష్యమని, ఆ దిశగా కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని నూతన మార్గంలోకి తీసుకెళ్లడానికి మన ప్రభుత్వం రైతన్నలకు తోడ్పాటునందిస్తోందని చెప్పారు. వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశంలో ప్రకృతి వ్యవసాయం, తృణధాన్యాల సాగును ప్రోత్సాహిస్తున్నట్లు చెప్పారు. సూపర్ ఫుడ్ అయిన తృణధాన్యాలపై పెట్టుబడులకు ఇదే సరైన సమయమని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లో గంగా నది పరివాహక ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని పిలుపునిచ్చారు. దీనివల్ల రైతులు లబ్ధి పొందడంతోపాటు నది సైతం కాలుష్యం నుంచి బయటపడుతుందని పేర్కొన్నారు. మన నదుల పవిత్రను కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి రంగంలో లోపాలు అరికట్టాలని సంబంధిత పరిశ్రమ వర్గాలకు సూచించారు. స్వచ్ఛమైన ఉత్పత్తులు అందించాలని కోరారు. ‘జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్’ అనే విధానంతో పనిచేయాలన్నారు. సిద్ధార్థనగర్ జిల్లాలో పండిస్తున్న కలానమాక్ బియ్యం, చందౌలీలో పండిస్తున్న బ్లాక్ రైస్ గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రెండు రకాల బియ్యం విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నట్లు తెలిపారు. మన ఆహార ఉత్పత్తులను ప్రపంచం నలుమూలలకూ చేర్చే సమ్మిళిత ప్రయత్నంలో ఇదొక భాగమని అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులతో కలిసి పనిచేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేవారు. యూపీలో ప్రభుత్వ అలసత్వానికి చరమగీతం పాడి పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామన్నారు. సంభాల్ జిల్లాలో శ్రీకల్కీ ధామ్ ఆలయ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళుర్పించారు. -
సాంకేతిక ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఏపీ
సాక్షి, అమరావతి: సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్) రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ఈ రంగంలో ఐఐటీ–ఢిల్లీ నిర్వహించిన అధ్యయనంలోనూ దేశంలోనే మొదటి నాలుగు స్థానాల్లో రాష్ట్రం చోటు దక్కించుకుంది. సాంకేతిక ఉత్పత్తుల్లో వైద్య రంగం (మెడిటెక్), వ్యవసాయం, ఆక్వా (ఆగ్రోటెక్), ఆటోమొబైల్ (మొబిటెక్), క్రీడా పరికరాలు (స్పోర్ట్స్టెక్), భవన నిర్మాణ సామాగ్రి (బిల్డ్‌టెక్), గృహోపకరణాలు (హోంటెక్), భారీ టవర్లు (ఇండుటెక్), ప్యాకింగ్ సామాగ్రి (ప్యాక్టెక్) వంటి దాదాపు 12 విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. రాష్ట్రంలో ప్రధానంగా ఆగ్రో టెక్స్టైల్స్, మొబైల్ టెక్స్‌టెల్స్, జియో టెక్స్‌టైల్స్‌లకు భారీ డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా, జర్మనీ, నేపాల్ తదితర దేశాలకు ఏటా రూ.180 కోట్ల విలువైన సాంకేతిక ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయి. రాష్ట్రంలోనూ స్థానికంగా వినియోగం ఉంటోంది. విశాఖపట్నంలోని మెడిటెక్ జోన్లో వైద్య పరికరాల ఉత్పత్తులు (మెడికల్ టెక్స్టైల్స్) ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్లాస్టిక్, గ్రాసిమ్ వంటి అంతర్జాతీయ డిమాండ్ ఉన్న 15 టెక్నికల్ టెక్స్టైల్ కంపెనీలు మనరాష్ట్రంలోనే ఉండటం విశేషం. రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తులు (టెక్నికల్ టెక్స్టైల్స్)కు మూడు పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, పారిశ్రామికీకరణ వంటివి అనుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఏయే రంగాల్లో అనుకూలమంటే.. ♦ మొబిటెక్: కియా, ఇసూజీ, అశోక్ లేలాండ్, హీరో వంటి ప్రధాన ఆటోమొబైల్ తయారీదార్ల నుంచి రాష్ట్రంలో మొబిల్‌టెక్ ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంది. ♦ జియో టెక్స్టైల్స్: దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో జియో ట్యూబులు, జియో బ్యాంగ్‌లకు డిమాండ్ ఉంది. ఓడరేవుల వద్ద తీర ప్రాంతం నీటి కోతకు గురికాకుండా జియో ట్యూబులను వినియోగిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో జియోట్యూబ్ సీవాల్ నిర్మాణం ఒకటి. ఇది దేశంలోనే మొదటి జియో టెక్స్టైల్ ట్యూబ్ నిర్మాణంగా గుర్తింపు పొందింది. రోడ్ల పటిష్టత కోసం కూడా జియో ట్యూబులను వినియోగిస్తారు. ♦ ఆగ్రోటెక్ టెక్స్టైల్స్: ఉద్యాన రంగంలో ఉపయోగించే షేడ్ నెట్లు, పండ్లు, మొక్కలకు ఉపయోగించే క్రాప్ కవర్ ఉత్పత్తులు.. స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తాయి. హారి్టకల్చర్లో ఆగ్రో టెక్స్టైల్స్ వినియోగంతో మంచి దిగుబడులను సాధించవచ్చు. నీటి వినియోగాన్ని 30 నుంచి 45 శాతానికి తగ్గించవచ్చు. ఆక్వా కల్చర్‌లోనూ ఫిషింగ్ నెట్స్, ఫిషింగ్ లైన్ల రూపంలో ఆగ్రో టెక్స్‌టైల్స్‌కు అవకాశాలు ఉన్నాయి. చేపల చెరువుల నిర్మాణం, నిర్వహణలోనూ జియో టెక్స్ౖటెల్స్ను ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో 2.12 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఆక్వాకల్చర్ రంగం ఆగ్రోటెక్కు ప్రధాన ప్రోత్సాహంగా నిలుస్తోంది. దేశంలో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో ఆగ్రోటెక్, జియోటెక్స్‌టైల్స్‌కు 30 శాతం డిమాండ్ ఉంది. అరటి వ్యర్థాల ఉత్పత్తుల్లో దేశంలోనే ఏపీ టాప్.. టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో అరటి వ్యర్థాలతో ఉత్పత్తులను తయారు చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అలాగే జనపనార ఉత్పత్తుల్లో ఐదో స్థానం దక్కించుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ వ్యర్థాలను నూలుగానూ, ఆ తర్వాత వస్త్రంగానూ పలు రకాలుగా వినియోగించే సాంకేతిక ఉత్పత్తులను తయారు చేయడంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందడుగు వేస్తున్నారు. రీసైకిల్ చేసిన వ్యవసాయ వ్యర్థాలను నూలు ఉత్పత్తులు, షూలు, శానిటరీ నాప్కిన్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అరటి ఫైబర్ నుంచి కవర్లు, శానిటరీ ప్యాడ్లు, నూలు, షూలు తయారు చేస్తున్నారు. పైనాపిల్, అరటి పండు వ్యర్థాల నుంచి వివిధ ఫంక్షనల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నారు. సాంకేతిక ఉత్పత్తుల్లో రాష్ట్రం గత ఐదేళ్లలో 8–10 శాతం వృద్ధిని నమోదు చేసింది. సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉంది.. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సాంకేతిక ఉత్పత్తుల రంగంలో వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు ఆక్వా రంగం పెద్ద వినియోగదారుగా ఉంది. ఆగ్రో టెక్స్టైల్స్.. సుస్థిర వ్యవసాయం, వనరుల సామర్థ్యం, వ్యర్థాల తగ్గింపునకు దోహదం చేస్తున్నాయి. హార్టికల్చర్‌లో ఆగ్రో టెక్స్టైల్స్.. నీరు, ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని అనేక అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్ ఉంది. దీంతో రాష్ట్రంలోనూ ఆ దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుష్కలమైన వనరులు, సాంకేతిక సామర్థ్యాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు ఉత్పత్తిదారుగానే కాకుండా అతిపెద్ద వినియోగదారుగా కూడా ఉండనుంది. – కె.సునీత, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి రాష్ట్రం నుంచి ఎగుమతవుతున్న సాంకేతిక ఉత్పత్తులు.. జిల్లా ప్రధాన సాంకేతిక ఉత్పత్తులు అనంతపురం సీటు బెల్టులు, ఎయిర్ బ్యాగ్‌లు చిత్తూరు శానిటరీ ప్యాడ్స్ తూర్పుగోదావరి చేపలు పట్టే వలలు, లైఫ్ జాకెట్లు ప్రకాశం కన్వేయర్ బెల్ట్ పశ్చిమగోదావరి జనపనారతో చేసిన హెస్సియన్ వస్త్రం విశాఖపట్నం సన్నటి ఊలు దారాల ఉత్పత్తులు, సీటు బెల్టులు, కన్వేయర్ బెల్టులు -
వర్ధమాన దేశాలపై కార్బన్ ట్యాక్స్ సరికాదు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా వర్ధమాన దేశాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ (సీబీఏఎం) వంటి చర్యలు విధించడం సరికాదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వాతావరణపరమైన మార్పులకు సంబంధించి చర్యలు తీసుకుంటూ వర్ధమాన దేశాలు అటు సంపన్న దేశాల్లో ప్రజల ప్రాణాలు..ఆస్తులు, వ్యాపారాలు క్షేమంగా ఉండేలా కూడా చూసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. దానికి ప్రతిఫలంగా వాటిపై సీబీఏఎం వంటి చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ధమాన దేశాల పట్ల సంపన్న దేశాలు సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహిత చర్యలకు రుణ సదుపాయంపై ఆర్థిక వ్యవహారాల విభాగం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ప్రాంతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ఉక్కు, సిమెంటు తదితర రంగాల ఉత్పత్తులపై కార్బన్ ట్యాక్స్ విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఇది 2026 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. 2023 అక్టోబర్ 1 నుంచి ట్రయల్ పీరియడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉక్కు, సిమెంటు, ఎరువులు తదితర ఏడు రంగాల సంస్థలు తమ కార్యకలాపాల ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాల వివరాలను యూరోపియన్ యూనియన్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. భారత ఎగుమతులకు యూరప్ కీలకమైన మార్కెట్లలో ఒకటి కావడంతో కార్బన్ ట్యాక్స్ వల్ల భారతీయ ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం పడనుంది. 2022–23లో ఈయూతో భారత వాణిజ్యం 134.71 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులు 74.84 బిలియన్ డాలర్లు, దిగుమతులు 59.87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
జస్ట్ మూడు సెకన్ల వీడియోలతో... కోట్ల పంట!
సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్లుగా ఎదిగిపోతున్నారు. డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నారు. వాళ్లలో దాగి ఉన్న ఏదో ఒక స్కిల్‌తో ఇన్‌స్టా, టిక్‌టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేసి ఫేమస్ అయిపోతున్నారు. కొద్ది వ్యవధిలోనే కోట్లలో డబ్బులు గడిస్తూ..అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పైగా వీరిని సోషల్‌మీడియా పరిభాషలో ఇన్ఫ్లుయెన్సర్లుగా పిలుస్తున్నారు. ఇక్కడ ఈ మహిళ కూడా అలాంటి కోవకు చెందింది. జస్ట్ మూడు నిమిషాల నిడివగల వీడియోలతో ఫేమస్ అవ్వడమే గాకుండా ఏకంగా వారానికే కోట్లు గడిస్తోంది. వివరాల్లోకెళ్తే..జపాన్‌కి చెందిన జెంగ్ జియాంగ్ యువతి సరదాకి సోషల్ మీడియాను వాడటం ప్రారంభించింది. ఆ ఇష్టంతోనే డిఫరెంట్.. డిఫరెంట్‌గా.. వీడియోలు టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేది. అయితే ఆ వీడియోలు చాలా విభిన్నంగా ఉండటమే కాకుండా ఆకట్టుకునే రీతీలో ఉండటంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆమె వీడియోల్లోని కొత్తదనం నచ్చి లక్షల కొద్ది ప్రజలు ఆమెను అనుసరించడం ప్రారంభించారు. దీంతో వివిధ రకాల కంపెనీలు ఆమెతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చాయి. ఫలితంగా ఆమె తన వీడియోల్లో ఆ కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం మొదలు పెట్టింది.. ఇలా ఆమె వారానికి 120 కోట్లు సంపాదిస్తోంది. అంతేగాదు ఈ టిక్ టాక్ యాప్ లో ఆమెకు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే జియాంగ్ ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయోన్సర్ల మాదిరిగా కాకుండా ప్రమోట్ చేస్తున్న ఉత్పత్తుల వివిరాలను నిశితం వివరించడంలో ఆమె నేర్పు అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాగే ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలు జస్ట్ మూడు సెకన్లలో అర్థమయ్యేలా వేగవంతంగా చెప్పే వే ఆఫ్ స్టయిల్‌కి ఫిదా అయిపోతున్నామని చాలామంది చెబుతుండటం విశేషం. అందువల్లే ఆమెతో వ్యాపార సంబంధ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని చైనా వ్యాపారులు చెబుతున్నారు. అలాగే ఆమె తమ కంపెనీల ఉత్పత్తులను ప్రమోట్ చేయడం వల్ల అమ్మకాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయని చైనా వ్యాపారులు చెబుతున్నారు. ఈ స్థాయిలో ఆర్జిస్తున్నప్పటికీ జెంగ్ జియాంగ్ ఇసుమంత అహం ప్రదర్శించదు. అందువల్లే జియాంగ్‌కు రోజురోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. కేవలం వ్యాపార సంస్థలకు సంబంధించిన ప్రకటనలు మాత్రమే కాకుండా.. సామాజిక, ధార్మిక సంస్థలకు సంబంధించిన ప్రకటనలను జెంగ్ జియాంగ్ చేస్తోంది. అయితే అలాంటి వాటికి డబ్బులు తీసుకోదు. పైగా తనవంతుగా సాయం కూడా చేస్తుందట. View this post on Instagram A post shared by ASTRO XUAN (@xuan.com.my) (చదవండి: ప్రేమికుల రోజుని జైల్లో సెలబ్రేట్ చేసుకోవడం గురించి విన్నారా? అదికూడా ఖైదీలు..) -
పాత జీన్స్‌ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా?
అతి కొద్దిమంది మాత్రమే వ్యర్థాలను కూడా ఉపయుక్తంగా మలచి, తమ జీవితాన్ని కూడా అర్థవంతంగా మార్చుకుంటారు. ఆ కొద్దిమంది జాబితాలో నిలుస్తుంది సౌమ్య కల్లూరి. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వాసి అయిన సౌమ్యముంబైలో సోషల్ ఎంటర్ప్రైజ్ ‘ద్విజ్’ అనే సంస్థను ఏర్పాటు చేసిదాని ద్వారా వాడి పడేసే డెనిమ్ దుస్తులను తిరిగి ఉపయోగించుకునేలా బ్యాగులు, టోపీలు, జ్యువెలరీ, క్లచ్‌లు, ఇతర యాక్సెసరీస్.. తయారు చేస్తోంది. ఈ పని ద్వారా 40 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిథిమ్‌లో జరుగుతున్న దస్తకారి హాత్ సమితి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన డెనిమ్ స్టాల్లో తన ఉత్పత్తుల ద్వారా వ్యర్థాలతో కొత్త అర్థాలను మనకు పరిచయం చేస్తోంది.రెండోసారి మరింత కొత్తగా! ‘‘ద్విజ్ అంటే రెండవది అని అర్థం వచ్చేలా ఈ రీయూజ్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాను. డెనిమ్ లేదా జీన్స్ అని పిలిచే క్లాత్ చాలా గట్టిగా ఉంటుందని మనకు తెలుసు. కొంత కాలం వాడాక పాతబడి పోవడమో, బోర్ అనిపించడమో, రంగు వెలిసిందనో పిల్లలవైతే పొట్టిగా అయ్యాయనో .. ఇలా రకరకాల కారణాలతో డెనిమ్ దుస్తులను ఎవరికైనా ఇచ్చేస్తుంటారు. అవి తీసుకున్నవాళ్లు వాటిని వాడతారు అనే నమ్మకం లేదు. ఎందుకంటే, అవి వారి సైజుకు సరిపోకపోవచ్చు. వారు వాటిని చెత్తలో పడేయచ్చు. ప్రపంచమంతటా విరివిగా ఉపయోగిస్తూ, వాడి పడేసే జీన్స్‌ను తిరిగి ఉపయుక్తంగా మార్చేలా చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దీంతో 2018లో ఈప్రాజెక్ట్‌ను 6 లక్షల రూపాయలతో ఆరంభించాను. పర్యావరణ హితంగా.. మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఎమ్మెస్ కోసం జర్మన్ వెళ్లాను. అక్కడ కార్బన్ ఉద్గారాలు, వ్యర్థాలపై పరిశోధన చేస్తున్నప్పుడు చాలా విషయాలు పరిశీలనకు వచ్చాయి. పర్యావరణహితంగా ఏదైనా వర్క్ చేయాలనుకున్నాను. ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేసినా నా ఆలోచనలు మాత్రం రీ సైక్లింగ్ చుట్టూ తానే తిరుగుతూ ఉండేవి. వాడేసిన డెనిమ్పైన దృష్టి మళ్లి వాటిని సేకరించడం మొదలుపెట్టాను. వాడేసిన వాటర్ బాటిల్స్‌ను సేకరించి, రీ సైకిల్ చేసి, బ్యాగ్ లోపలివైపు వచ్చేలా డిజైన్ చేశాను. దీనివల్ల ఏదైనా పదార్థాన్ని బ్యాగ్‌లో తీసుకెళుతున్నప్పుడు డబ్బా మూతలు లీక్ అయినా సమస్య ఉండదు. ఈ బ్యాగ్లుఎక్కడా పాతవిగా అనిపించవు. మొదటిసారి వాడు తున్నట్టుగానే ఉంటాయి. ఈ తరం కోరుకునే బ్యాక్ ప్యాక్స్, క్లచ్‌లు, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు.. కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. చిన్న పీస్‌ను కూడా వదలం వాడేసిన జీన్స్‌ను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో బల్క్‌లో కొనుగోలు చేస్తాం. కొందరు నేరుగా వచ్చి డొనేట్ చేస్తారు. ముందు వాటిని శుభ్రం చేయిస్తాం. ఆ తర్వాత వాటి సైజ్, షేడ్, సన్నం, మందం.. క్లాత్‌ని బట్టి దేనిని ఎలా మలచాలి అనే ఆలోచనకు వస్తాం. పదిమంది ఫుల్ టైమ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. 30మంది మహిళలు వాళ్ల ఇంటి నుంచే పని చేస్తారు. బాగా మందంగా ఉండి, పెద్ద పెద్ద జీన్స్ వస్తే వాటిని బ్యాగ్‌లుగా తయారు చేస్తాం. కొంచెం మీడియం సైజు వాటితో చిన్న బ్యాగ్స్,. పలుచటి, చిరిగిన జీన్స్‌తో హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తయారు చేస్తాం. ఇంకా, బొమ్మలు, ఎంబ్రాయిడరీ చేసి హోమ్ డెకార్ ఐటమ్స్ కూడా ఇందులో ఉంటాయి. మా దగ్గరకు వచ్చిన జీన్స్‌లో చిన్న ముక్కను కూడా వృథాగా పోనివ్వం. ఈ రోజుల్లో పర్యావరణం ఎలా ఉంటుందో చూస్తున్నాం. కాలానుగుణంగా వర్షాలు పడవు, భూ తాపం పెరిగిపోతుంటుంది. కాలుష్యం కంపెనీల నుంచో, వాహనాల నుంచో వస్తుందనే అనుకుంటాం. కానీ, మనం రోజూ వాడే బట్టలు కూడా కాలుష్యానికి పెద్ద కారకం. ఈ సమస్య నివారణకు చేసిన చిన్న ప్రయత్నమే ద్విజ్. స్వచ్ఛంద సంస్థలతో కలిసి మిషన్ గ్రీన్ ముంబయ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వ స్కూల్ పిల్లలకు హ్యాండ్ బ్యాగ్‌లను కానుకగా ఇచ్చాం. దీని ద్వారా అటు చదువుకునే పిల్లలనూ, ఇటు ఈ పనిలో భాగం పంచుకుంటున్న మహిళలనూ ్ ప్రోత్సహిస్తున్నాం. అనిమేథ్ చారిటబుల్ ట్రస్ట్ వారితో కలిసి మహిళలకు డెనిమ్ రీ యూజ్ ప్రాజెక్ట్‌లో భాగంగా వర్క్‌షాప్స్ ఏర్పాటు చేసి, శిక్షణ ఇస్తున్నాం. 2022లో సర్వోదయ ట్రస్ట్ ద్వారా తెలంగాణలోని వికారాబాద్ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు హ్యాండ్ బ్యాగ్‌లను కానుకగా ఇచ్చాం. ఇండియా మొత్తంలో క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ ఎక్కడ జరిగినా అక్కడ మా స్టాల్ ఏర్పాటుకు కృషి చేస్తుంటాం. దీనికి విడిగా షాప్ అంటూ ఏమీ లేదు. ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తుంటాం’’ అని వివరిస్తారు సౌమ్య. -
Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి
పెద్ద నగరాలలో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ రిన్జింగ్ భూటియా మనసులో ఏదో లోటు ఉండేది. విశాలమైన ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన రిన్జింగ్ రణగొణ ధ్వనులకు దూరంగా తన మూలాలను వెదుక్కుంటూ సిక్కిం వెళ్లింది. హిమాలయాలలోని అరుదైన మొక్కలతో తయారు చేసే స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ స్టార్టప్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించింది. సొంతకాళ్ల మీద నిలబడడానికి పునరావాస కేంద్రాల్లోని మహిళల కోసం ఉచిత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. సిక్కింలోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగిన రిన్జింగ్ వృత్తిరీత్యా దిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తాలాంటి మహానగరాల్లో గడిపింది. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఏదో లోటుగా అనిపించేది. ప్రకృతి మధ్య తాను గడిపిన కాలాన్ని గుర్తు చేసుకునేది. మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సిక్కిం బాట పట్టింది. ఎంటర్ప్రెన్యూర్ కావాలనే రిన్జింగ్ చిరకాల కల అక్కడ రెక్కలు విప్పుకుంది. ‘ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏ లోటు లేకపోయినప్పటికీ పెద్ద నగరాలలో కాలుష్యం, ఇరుకు ప్రదేశాలలో నివసించాల్సి రావడంతో బాగా విసుగెత్తిపోయాను. నా బిడ్డ పచ్చని ప్రకృతి ప్రపంచంలో పెరగాలనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను’ అంటుంది రిన్జింగ్. ఉద్యోగం లేదు కాబట్టి బోలెడంత ఖాళీ సమయాన్ని చర్మ సంరక్షణకు సంబంధించిన పరిశోధనకు కేటాయించింది. ప్రకృతిలోని ఎన్నో వనమూలికల గురించి లోతుగా అధ్యయనం చేసింది. హిమాలయాలలో లభించే అరుదైన మొక్కలతో హ్యాండ్ క్రాఫ్టెడ్ స్కిన్‌కేర్ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ అనే అంకుర సంస్థను ఆరంభించింది. ‘అగాపి’ అనేది గ్రీకు పదం. దీని అర్థం... ప్రేమ. సిక్కింలోని అనేక ప్రాంతాలలో చర్మవ్యాధులకు ఔషధంగా తమ చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించడం అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయమే తనకొక దారి చూపింది. చర్మవ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాల వాడకం పరంపరగా వస్తున్నప్పటికీ వాటి గురించి స్కిన్‌కేర్ ఇండస్ట్రీకి తెలియదు. బిజినెస్ మోడల్‌ను డిజైనింగ్ చేసుకున్న తరువాత కబీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది రిన్జింగ్. ఇరవైమందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలలో మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది.‘మా వర్క్‌షాప్‌లో శిక్షణ తీసుకున్న పదిమందికి పైగా మహిళలు సొంత ప్రాజెక్ట్‌లు మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. ఏదో సాధించాలనే పట్టుదల వారిలో కనిపించింది. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అంటుంది రిన్జింగ్. మాదక ద్రవ్యాలు, మద్యవ్యసనంతో శిథిలం అవుతున్న వారికి ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చే సాధనంగా వర్క్‌షాప్‌లను ఉపయోగించుకుంటోంది రిన్జింగ్. పునరావాస కేంద్రాల్లో కూడా వర్క్‌షాప్‌లు నిర్వహించి వారిలో ఆర్థికస్థైర్యాన్ని నింపింది. మాస్కులు, షాంపులు, స్క్రబ్‌లు, ఫేషియల్ ఆయిల్... మొదలైనవి ఎన్నో ఉత్పత్తి చేస్తుంది అగాపి సిక్కిం. స్థానిక రకాల కలబంద, జనపనార... మొదలైన వాటిని తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగించుకుంటోంది. మొదట సిక్కిం చుట్టుపక్కల నగరాలలో ప్రాడక్ట్స్‌ను విక్రయించేవారు. ఆ తరువాత బెంగళూరు, కోల్‌కతాతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. ‘అగాపి’ చెప్పుకోదగిన బ్రాండ్‌గా ఎదిగినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోవడం లేదు రిన్జింగ్. స్కిన్ కేర్ సైన్స్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లాండ్‌లోని ‘ఫార్ములా బొటానికా’కు సంబంధించి ఆన్లైన్ కోర్సులు చేస్తోంది. ప్రాచీన ఔషధాలపై కొత్త వెలుగు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఔషధాలు వెలుగు చూసేలా, ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తోంది రిన్జింగ్. తాను కంపెనీ స్థాపించడమే కాదు ఇతరులు కూడా స్థాపించేలా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. ‘ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికింది. అగాపి విజయం నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది’ అంటుంది రిన్జింగ్ భూటియ. -
అధిక దిగుమతి సుంకాలపై కీలక నివేదిక
న్యూఢిల్లీ: బియ్యం వంటి సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు కొనసాగించడం, దేశీయ వ్యవసాయ రంగాన్ని తక్కువ టారిఫ్‌లకు అనుకూలంగా మార్చాలన్న ఒత్తిళ్లను నిరోధించడం అన్నవి భారత్ ప్రజల ఆహార భద్రత, స్వావలంబనకు కీలకమని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్షియేటివ్ (జీటీఆర్ఐ) సూచించింది. మెరుగైన ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భారత్ వెజిటబుల్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, ఇది దిగుమతుల బిల్లును తగ్గిస్తుందని తన తాజా నివేదికలో పేర్కొంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన ఆవనూనె, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని సూచించింది. ప్రపంచంలో భారత్ అతిపెద్ద వంట నూనెల దిగుమతిదారుగా ఉన్న విషయాన్ని పేర్కొంది. 2017–18 సంవత్సరంలో 10.8 బిలియన్ డాలర్ల విలువైన నూనెలు దిగుమతి అయితే, 2023–24లో ఇది 20.8 బిలియన్ డాలర్లకు పెరగడాన్ని ప్రస్తావించింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఉత్పత్తిని పెంచడం, దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు అధిక సుంకాల విధింపు చర్యలతో యూఎస్, ఈయూ తమ వ్యవసాయ రంగానికి మద్దతుగా నిలుస్తున్నట్టు గుర్తు చేసింది. ఆ్రస్టేలియా వంటి దేశాలు అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలపై వ్యవసాయ ఉత్పత్తుల సబ్సిడీలు, టారిఫ్‌లు తగ్గించాలనే ఒత్తిడిని తీసుకువస్తూనే ఉంటాయని తెలిపింది. ‘‘భారత్ కీలకమైన వ్యవసాయ ఉత్పత్తులపై 30–100 శాతం మధ్య టారిఫ్‌లు అమలు చేస్తోంది. సబ్సిడీ సాయంతో వచ్చే దిగుమతులను నిరోధించడానికి ఇది మేలు చేస్తోంది. ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలకు సైతం టారిఫ్‌లు తగ్గించడంలేదు. ఈ చర్యలు వంట నూనెలు మినహా దాదాపు అన్ని రకాల సాగు ఉత్పత్తుల విషయంలో భారత్ స్వావలంబన శక్తికి సా యపడుతున్నాయి’’అని ఈ నివేదిక వివరించింది. ఇదే విధానం కొనసాగాలి ‘‘తక్కువ టారిఫ్, సబ్సిడీలతో కూడిన దిగుమతులకు దేశీ వ్యవసాయ రంగాన్ని తెరవకుండా ఉండాలన్న ప్రస్తుత విధానాన్ని భారత్ కొనసాగించాలి. సున్నితమైన ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు కొనసాగించాలి. టారిఫ్‌లు తగ్గించాలన్న ఒత్తిళ్లకు తలొగ్గకూడదు. ఎంతో కష్టపడి సాధించుకున్న స్వీయ సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి ఇది అవసరం’’అని జీటీఆర్ఐ పేర్కొంది. భారత వ్యవసాయ దిగుమతులు 2023లో 33 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. భారత్ మొత్తం దిగుమతుల్లో ఇది 4.9 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘హరిత, క్షీర విప్లవం తరహా విధానాలపై దృష్టి సారించడం, అధిక దిగుమతి సుంకాలు.. సబ్సిడీ ఉత్పత్తుల దిగుమతులకు భారత వ్యవసాయ రంగం ద్వారాలు తెరవాలన్న అభివృద్ధి చెందిన దేశాల ఒత్తిళ్లకు తలొగ్గకుండా.. 140 కోట్ల ప్రజల ఆహార భద్రత కోసం ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద చురుకైన సంప్రదింపులు నిర్వహించడం భారత్ ఈ స్థితిలో ఉండేందుకు దారితీశాయి’’అని జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం
మరో సంవత్సరం కనుమరుగవనుంది. మంచీ చెడుల మిశ్రమంగా ఎన్నెన్నో అనుభూతులు మిగిల్చి కాలగర్భంలో కలిసిపోనుంది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2024లో జరగనున్న ఆసక్తికర ఘటనలు, మిగల్చనున్న ఓ పది మైలురాళ్లను ఓసారి చూస్తే... నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ దశాబ్దంలోనే భారత్ కచి్చతంగా ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది అందరూ చెబుతున్న మాటే. అది 2026లో, లేదంటే 2027లో జరగవచ్చని ఇప్పటిదాకా అంచనా వేస్తూ వచ్చారు. కానీ అన్నీ కుదిరితే 2024 చివరికల్లా జర్మనీని వెనక్కు నెట్టి మనం నాలుగో స్థానానికి చేరడం కష్టమేమీ కాదన్నది ఆర్థికవేత్తల అభిప్రాయం. 2024 తొలి అర్ధభాగం చివరికి జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.4 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. అప్పటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును సులువుగా దాటేయనుంది. మన వృద్ధి రేటు, జర్మనీ మాంద్యం ఇప్పట్లాగే కొనసాగితే సంవత్సరాంతానికల్లా మనది పై చేయి కావచ్చు. 2.దూసుకుపోనున్న యూపీ ఉత్తరప్రదేశ్ కొన్నేళ్లుగా వృద్ధి బాటన పరుగులు పెడుతోంది. ఆ లెక్కన ఈ ఏడాది అది కర్ణాటకను పక్కకు నెట్టి దేశంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముంది. 2023–24కు కర్ణాటక జీఎస్డీపీ అంచనా రూ.25 లక్షల కోట్లు కాగా యూపీ రూ.24.4 లక్షల కోట్లుగా ఉంది. అయితే 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతున్న యూపీ సంవత్సరాంతానికల్లా కర్ణాటకను దాటేసేలా కని్పస్తోంది. 3. బీజేపీ ‘సంకీర్ణ ధర్మ’ బాట 2024 అక్టోబర్‌లో మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగి్నపరీక్షగా నిలవనున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏ ఒక్క పారీ్టకీ సొంతంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. కనుక ఆ రాష్ట్రాల్లో బీజేపీ విధిగా సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగే పక్షంలో వాటిలో రెండు రాష్ట్రాలు ఇండియా కూటమి ఖాతాలో పడ్డా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పక్షాలకు గట్టి పోటీ ఇవ్వాలంటే మిత్రులతో పొత్తులపై ముందస్తుగానే స్పష్టతకు వచ్చి సమైక్యంగా బరిలో దిగడం బీజేపీకి తప్పనిసరి కానుంది. 4. ‘సుదీర్ఘ సీఎం’గా నవీన్ అత్యధిక కాలం పాటు పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా పవన్‌కుమార్ చామ్లింగ్ నెలకొలి్పన రికార్డును ఒడిశా సీఎం నవీన్ 2024లో అధిగమించేలా ఉన్నారు. ఎందుకంటే మే లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వరుసగా ఆరోసారి గెలవడం లాంఛనమేనని భావిస్తున్నారు. చామ్లింగ్ 1994 డిసెంబర్ నుంచి 2019 మే దాకా 24 ఏళ్లకు పైగా సిక్కిం సీఎంగా చేశారు. నవీన్ 2000 మార్చి నుంచి ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. 5. మెగా మార్కెట్ క్యాప్ భారత మార్కెట్ క్యాపిటలైజేషన్ 2024లో 5 లక్షల కోట్ల డాలర్లను దాటేయనుంది. 2023లో మన మార్కెట్ క్యాప్ ఏకంగా 26 శాతం వృద్ధి రేటుతో పరుగులు తీసి 4.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది! ఇది పాశ్చాత్య ఆర్థికవేత్తలనూ ఆశ్చర్యపరిచింది. కొత్త ఏడాదిలో హీనపక్షం 20 శాతం వృద్ధి రేటునే తీసుకున్నా తేలిగ్గా 5 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం లాంఛనమే. సెన్సెక్స్ కూడా ఈ ఏడాది ఆల్‌టైం రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లడం తెలిసిందే. 2024లోనూ ఇదే ధోరణి కొనసాగడం ఖాయమేనని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 6. 20 కోట్ల మంది పేదలు ఆర్థిక వృద్ధికి సమాంతరంగా దేశంలో పేదలూ పెరుగుతున్నారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశం మనమేనన్నది తెలిసిందే. 2024లో ఈ సంఖ్య 20 కోట్లను మించనుంది. ఇది బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీల మొత్తం జనాభా కంటే ఎక్కువ! ప్రపంచబ్యాంకు నిర్వచనం ప్రకారం భారత్‌లో 14 కోట్ల మంది పేదలున్నారు. నీతీఆయోగ్ లెక్కలను బట్టి ఆ సంఖ్య ఇప్పటికే 21 కోట్లు దాటింది. 7. వ్యవసాయోత్పత్తుల రికార్డు భారత ఆహార, ఉద్యానోత్పత్తుల పరిమాణం 2024లో 70 కోట్ల టన్నులు దాటనుంది. అందుకు అనుగుణంగా ఆహారోత్పత్తుల ఎగుమతి కూడా ఇతోధికంగా పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2021లో కేంద్రం రద్దు చేసిన వివాదాస్పద సాగు చట్టాల భవితవ్యం 2024లో తేలిపోవచ్చంటున్నారు. 8. కశ్మీర్‌పై చర్చలకు డిమాండ్లు కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు పాకిస్థాన్‌తో చర్చలను పునఃప్రారంభించాలని స్థానికంగా డిమాండ్లు ఊపందుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈ మేరకు గళమెత్తే అవకాశాలు పుష్కలంగా కని్పస్తున్నాయి. అలాగే సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీ ర్ తక్షణం రాష్ట్ర హోదా పునరుద్ధరించడంతో పాటు సెపె్టంబర్ కల్లా అసెంబ్లీకి ఎన్నికలూ జరపాల్సి ఉంది. 9. విదేశీ వాణిజ్యం పైపైకి... భారత విదేశీ వాణిజ్యం 2024లో 2 లక్షల కోట్ల డాలర్లను తాకవచ్చు. 2023లో యుద్ధాలు తదితర అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచ ఎగుమతులు, దిగుమతుల మార్కెట్‌ను విపరీతంగా ప్రభావితం చేశాయి. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన విదేశీ వాణిజ్యం కళకళలాడింది. మొత్తం జీడీపీలో 40 శాతంగా నిలిచింది. 10. బీజేపీ వర్సెస్ ‘ఇండియా’ విపక్షాలకు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యగా చెప్పదగ్గ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు 2024 వేదిక కానుంది. హ్యాట్రిక్ విజయం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఉరకలేస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉండటమే గాక అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటముల పాలవుతున్న కాంగ్రెస్ ఇంకా కాలూ చేయీ కూడదీసుకునే దశలోనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.800 కోట్ల అమ్మకాలే లక్ష్యం.. బ్యాగ్‌జోన్ ప్రణాళికలు ఇలా..
BRAND SUTRA: ప్రముఖ సంస్థ లావి ప్యారెంట్ బ్రాండ్ 'బ్యాగ్‌జోన్' (Bagzone) మల్టీ-కేటగిరీ, మల్టీ-బ్రాండ్ వ్యాపారంగా వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ సీఈఓ 'ఆయుష్ తైన్వాలా' వెల్లడించారు. ఈ క్రమంలోనే బ్రాండ్ ఇటీవల వాచ్‌ల విభాగంలోకి కూడా ప్రవేశించింది. ఈ సంస్థ 2023 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ. 500 కోట్ల అమ్మకాలను సాధించి రికార్డ్ క్రియేట్ చేసిందని, రానున్న రోజుల్లో కంపెనీ రూ. 800 కోట్లకు చేరటానికి సన్నద్ధమవుతోందని తెలిపాడు. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 10 రెట్లు వృద్ధి సాధించడానికి.. మల్టీ-కేటగిరీ, మల్టీ-బ్రాండ్ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సంస్థ 300 బ్రాండ్ అవుట్లెట్లను ప్రారంభించడం ద్వారా 70 శాతం స్థానిక సోర్సింగ్ లక్ష్యాన్ని సాధించడం, ఆఫ్‌లైన్ విధానం పెంచడానికి ఆలోచిస్తోంది. అనుకున్న విధంగా అన్ని సజావుగా జరిగితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. నిధుల ప్రకటన సమయంలో, కంపెనీ తయారీ సామర్థ్యాలను విస్తరించే ప్రణాళికలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఇగత్పురి జిల్లాలోని నాసిక్ వెలుపల, ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీకి సమీపంలో రెండవ ఫ్యాక్టరీని నిర్మించే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభమవుతుందని, దీంతో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 5 లక్షలకు పెరుగుతుందని సమాచారం. ఇప్పటి వరకు నాసిక్ ప్లాంట్‌లో నెలకు సుమారుగా 2 లక్షల బ్యాగులను ఉత్పత్తి చేస్తున్నట్లు తైన్వాలా తెలిపారు. కంపెనీ హ్యాండ్‌బ్యాగ్‌లు, స్లింగ్ బ్యాగ్‌లు, టోట్ బ్యాగ్‌లు, మహిళల పర్సులు, ల్యాప్‌టాప్ హ్యాండ్‌బ్యాగ్‌లు, ఫ్యాషన్ బ్యాక్‌ప్యాక్‌లు, బాక్స్ బ్యాగ్‌లు వంటివి తయారు చేస్తోంది. కంపెనీ 2020లో తన బ్రాండ్ ఎక్స్టెన్షన్ లావి స్పోర్ట్ కింద యునిసెక్స్ బ్యాక్‌ప్యాక్‌లను ప్రారంభించింది. ఇప్పుడు డఫిల్ బ్యాగ్‌లు, బ్రీఫ్‌కేస్‌లు, వాలెట్లు, స్లింగ్ల వంటి యాక్సెసరీస్ కూడా తయారు చేస్తుంది. కాగా ఏడాది ప్రారంభంలో రీజనబుల్ ధరల వద్ద బ్రాండ్ బ్యాగులను అందించడానికి లావి లక్స్‌ను సృష్టించింది. వీటి ధర రూ. 3000 నుంచి రూ. 7000 మధ్య ఉంటుంది. మహిళల వాచ్‌ల ధరలు రూ. 5999 నుంచి ఉన్నాయి. బ్రాండ్ వాచ్‌లు లావి అధికారిక వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న లావి రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఈ ఉత్పత్తుల మీద ఏకంగా ఒక సంవత్సరం వారంటీ కూడా అందిస్తోంది. సర్వీస్ సెంటర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కంపెనీ రిటైల్ విస్తరణకు కూడా ప్రణాళికలు ఉన్నాయని, దక్షిణాదిలో రిటైల్ ఉనికిని పెంచడానికి దృష్టి సారించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయుష్ తైన్వాలా తెలిపాడు. ఇందులో మెట్రో నగరాలు, చిన్న నగరాలు వంటి వాటితో పాటు టైర్ 1 నగరాల్లో బ్రాండ్ విస్తరణ గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. టైర్ 2, టైర్ 3 నగరాలను కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. టైర్ 1 నగరాలే ప్రధానమని తైన్వాలా వెల్లడిస్తూ.. పశ్చిమ దేశాలలో మా ఉనికి బలంగా ఉందని, దక్షిణాదిలో కొంచెం బలహీనంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ నగరాలను వృద్ధి చేసుకోవాలంటే రిటైల్ స్టోర్లను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఆలోచనను వ్యక్తం చేశారు. మొత్తం విక్రయాలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో సాగుతున్నాయి. ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు, అయితే ఆన్లైన్ కొనుగోలు కోసం 'లావీవరల్డ్.కమ్'లో మాత్రమే కాకుండా అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్, నైకా వంటివాటిని ఉపయోగించుకోవచ్చు. -
Bhargavi Pappuri: నా రోల్‌మోడల్ నేనే!
భార్గవి పప్పూరి... మన కళలను ఇష్టపడ్డారు. మన కళాకారులకు అండగా నిలవాలనుకున్నారు. అందుకోసం కళాత్మకమైన వేదికను నేశారు. అది తన సృజనాత్మకతకే వేదికవుతుందనుకోలేదామె. ఆర్ట్ఎన్ వీవ్స్... కృషి ఆమెదే... కళ ఆమెదే. ఆర్ట్ అండ్ వీవ్స్ స్థాపించడానికి ముందు నా జర్నీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే... అది సరదాగా సాగిపోయే ఓ సినిమాని తలపిస్తుంది. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్, వనస్థలి పురం దగ్గర ఆర్కే పురంలో. నాన్న పోస్ట్ మాస్టర్‌గా రిటైరయ్యారు. అమ్మ గృహిణి. బికామ్ చదివి చాలా కామ్‌గా ఉండేదాన్ని. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే నోరు పెగిలేది కాదు. పెళ్లయిన తర్వాత మా వారు నన్ను మార్కెటింగ్ వైపు నడిపించారు. ఆయనది కూడా అదే ఫీల్డ్ కావడంతో నాకు మెళకువలు నేరి్పంచారు. మొదట క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్లు మార్కెట్ చేశాను. మా వారికి కోల్‌కతాకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ కార్ లోన్ మార్కెటింగ్ చేశాను. కాలి నడకన కోల్‌కతా మొత్తం తిరిగాను. మళ్లీ బదలీ కోల్‌కతాలో మార్కెటింగ్ మీద పట్టు వచ్చేటప్పటికి మా వారికి మళ్లీ బదలీ. ఈ సారి విజయవాడ. అప్పుడు బాబు పుట్టడంతో నా కెరీర్లో విరామం తీసుకున్నాను. మళ్లీ బదలీలు. మొత్తానికి బాబు స్కూల్‌కెళ్లే వయసు వచ్చేటప్పటికి హైదరాబాద్‌కొచ్చాం. బాబు పెద్దయ్యాడు కాబట్టి ఉద్యోగం చేద్దామనుకున్నప్పటికీ ఇక ఆ వయసుకు ఎవరూ ఉద్యోగం ఇవ్వరని ఫ్రెండ్‌తో కలిసి క్రెష్ నడిపించాను. కొంతకాలానికి ఇంట్లోనే ఉంటూ కేటరింగ్ మొదలుపెట్టాను. మేముండే వెస్ట్ మారేడ్‌పల్లిలో ఎక్కువ మంది వయసు మళ్లిన దంపతులే. పిల్లలు విదేశాలకు వెళ్లిన తర్వాత పెద్ద దంపతులు విశ్రాంత జీవితాన్ని గడుపుతుంటారు. వాళ్లను దృష్టిలో పెట్టుకుని లంచ్, డిన్నర్ పంపించే ఏర్పాటు చేశాను. ఉదయం తొమ్మిదిలోపు ఆర్డర్ చేస్తే భోజనం సమయానికి ఒక బాయ్ సహాయంతో క్యారియర్ చేర్చాను. మా వారికి తరచూ బదలీలు, ఆయన కష్టమంతా ఎన్నో కంపెనీల అభివృద్ధికి దోహదం అవుతున్నాయి. మాకు మాత్రం ఒక చోట స్థిరంగా ఉండే అవకాశం లేదు. మంచి జీతం వస్తోంది. కానీ మనకు మనంగా సాధించింది ఏమిటని చూసుకుంటే వెలితి కనిపించసాగింది. అప్పుడు పంథా మార్చుకున్నాం. ఇదంతా ఆర్డ్ అండ్ వీవ్స్ ప్రారంభానికి ముందు నా జీవితం. కళాకృతుల సేకరణ ఆర్ట్ అండ్ వీవ్స్ అనే ప్రాజెక్ట్ రూపొందించుకుని, దేశంలో ఏడెనిమిది రాష్ట్రాల్లో çకళలు, కళాకారులు, చేనేతకారులను స్వయంగా కలిశాం. భారతీయ కళలు ఒకదానికి మరొకటి పూర్తిగా భిన్నం. దేనికదే ప్రత్యేకం. అంతటి వైవిధ్యతను ఒక వేదిక మీదకు తీసుకురావడం ద్వారా ఆ కళారూపాలను అభిరుచి ఉన్నవారికి దగ్గర చేయడం, కళాకృతుల తయారీదారులకు పని కలి్పంచడం మా ఉద్దేశం. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా రిజిస్టర్ చేయించాం. ఒడిశా, రాజస్థాన్, బీహార్, కర్నాటక, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూపుదిద్దుకునే కళాకృతుల ఫొటోలను మా వెబ్సైట్లో పెట్టాం. మధుబని, బిద్రీ వంటి కళాఖండాలకు ఆదరణ బాగా వచ్చింది, ఆర్డర్లు కూడా వచ్చాయి. కానీ తయారీదారుల దగ్గర ఆ సమయానికి కస్టమర్ కోరుకున్న మధుబని ఆర్ట్ కానీ, చేనేత చీర కానీ ఉండేది కాదు. ఇవన్నీ చాలా సమయం తీసుకునే కళాకృతులు. అంత సమయం వేచి చూసే ఓపిక కస్టమర్లకు ఉండేది కాదు. కస్టమర్‌కి సకాలంలో అందించాలంటే తయారీదారులం మనమే అయి ఉండాలనుకున్నాను. టెర్రకోట కళాకృతులు నేర్చుకోవడానికి ప్రయతి్నంచాను. కానీ కుదరలేదు. అదే సమయంలో ఖాదీ గ్రామోద్యోగ్ వాళ్లు హ్యాండ్ మేడ్ సోప్ మేకింగ్ వారం రోజుల కోర్సు ప్రకటించారు. నేర్చుకోవడం, ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, పొరపాట్లను సరిదిద్దుకుంటూ 54 రకాల సబ్బుల తయారీలో నైపుణ్యం సాధించాను. నా ఉత్పత్తులకు ఆయుష్ లైసెన్స్ వచ్చింది. ఆర్గానిక్ హోమ్మేడ్ సబ్బులు, షాంపూ, బాత్ జెల్స్ చేస్తున్నాను. మా బ్రాండ్‌కు మౌత్ పబ్లిసిటీ వచి్చంది. విదేశాలకు వెళ్లే వాళ్లు తమ పిల్లల కోసం పచ్చళ్లు, పొడులతోపాటు మా దగ్గర నుంచి ఏడాదికి సరిపడిన సబ్బులు, షాంపూలు కూడా తీసుకెళ్తున్నారు. నా వర్క్ యూనిట్, ఆఫీస్, ఇల్లు ఒకే బిల్డింగ్‌లో. ఆర్డర్లు ఎక్కువున్నప్పుడు ఎక్కువ గంటలు పని చేస్తాను. సాధారణంగా మధ్యాహ్నం రెండు వరకు పని చేస్తాను. ఓ గంట ధ్యానం, గార్డెనింగ్ నా డైలీ రొటీన్లో భాగం. ప్రకృతి సహకారం నా క్రియేటివిటీని నా బ్రాండ్ కోసమే ఉపయోగిస్తున్నాను. మరో నలుగురికి జీతం ఇవ్వగలుగుతున్నాను. మన సంకల్పం మంచిదై ఉండి, నిబద్ధతతో పని చేస్తే ప్రకృతి తన వంతుగా సహకారం అందిస్తుందని, అదే మనల్ని ఓ మార్గంలో నడిపిస్తుందని నమ్ముతాను. ఎమ్ఎస్ఎమ్ఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్)తో అనుసంధానమయ్యాను. ముద్ర లోన్ వచి్చంది. ఈ రోజు నేనిలా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి కారణం ఏ పనికి గౌరవం ఎక్కువ, ఏ పనికి గౌరవం తక్కువ అని ఆలోచించకపోవడమే. అన్ని పనులూ గౌరవంతో కూడినవే. మహిళలకు నేను చెప్పగలిగిన మాట ఒక్కటే. గొప్పవాళ్లు ప్రత్యేకంగా పుట్టరు. నిజాయితీగా కష్టపడే తత్వమే మనల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలుపుతుంది. నాకు రోల్‌మోడల్ ఎవరూ లేరు. నాకు నేనే రోల్మోడల్ని. అలాగే నాకు నేనే కాంపిటీటర్ని. ఈ రోజు చేసిన పనిని రేపు మరింత మెరుగ్గా చేయాలనే లక్ష్యాన్ని మనకు మనమే నిర్దేశించుకోవాలి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. ఆర్థిక సవాళ్లతోపాటు ఆరోగ్యం పెట్టే పరీక్షలూ ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మన ఏకైక కర్తవ్యం. సంతోషంగా జీవించాలా దిగాలుగా రోజులు గడపాలా అని నిర్ణయించుకోవాల్సింది మనమే. మనసు బాగాలేకపోతే ఇష్టమైన వ్యాపకంతో రిలాక్స్ కావడం అనే చాయిస్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది’’ అన్నారు భార్గవి. జీవితం మనకు రెండే రెండు ఆప్షన్లనిస్తుంది. ఒకటి సంతోషంగా జీవించడం, మరొకటి దిగులుగా జీవించడం. కష్టాల్లేని వాళ్లెవరూ ఉండరు. సంతోషంగా జీవించాలా.. దిగాలుగా రోజులు గడపాలా అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. – భార్గవి పప్పూరి – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
మెరిసే చర్మం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఏం కలుపుతున్నారో తెలుసా?
ఆరోగ్య వంతమైన మెరిసే చర్మం కోసం ఏ రకమైన ప్రోడక్ట్స్ బాగా పనిచేస్తాయనే దానిపై చాలా మంది ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో పరిశోధకులు కూడా అన్వేషణ ప్రారంభించారు. ఆ డిమాండ్‌ను గ్రహించిన సౌత్ కొరియా కాస్మెటిక్ తయారీ సంస్థలు బోలెడన్నీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్‌తో మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. ఆ ఉత్పత్తులకు అవి వాడుతున్న పదార్థం ఏంటో తెలుసా..? నత్త స్రావాలు. ముఖ్యంగా క్రిప్టోంఫాలస్ ఆస్పెర్సా జాతికి చెందిన నత్తల స్రావాలు. అవి బురద లాంటి జిగట పదార్థాన్ని స్రవిస్తుంటాయి. దాంతోనే తమ స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి సదరు సంస్థలు. ఆ స్రావం ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడంలో అద్భుతంగా పనిచేస్తుందట. అందుకే దీనిని ఫేస్ మాస్క్, సీరమ్, మాయిశ్చరైజర్లలో వాడుతున్నారు. పురాతన గ్రీకులు కూడా చర్మంపై వృద్ధాప్య ఛాయల నివారణకు నత్త స్రవించే ఈ బురద లాంటి జిగటనే ఉపయోగించేవారట. వీటి తోపాటు గ్లాస్ స్కిన్ కోసం దక్షిణ కొరియా ఒక టేబుల్ స్పూన్ కోకో బటర్‌కి రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్‌ని కలిపి.. పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ని ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకుని.. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకోవాలి. అంతే ముఖం చాలా కాంతిమంతంగా ఉంటుంది. (చదవండి: పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..) -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) రెండు పెట్రోకెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముడి చమురును నేరుగా అధిక విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్టు కంపెనీ రెండవ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ఓఎన్జీసీ ఫైనాన్స్ డైరెక్టర్ పోమిలా జస్పాల్ వెల్లడించారు. వేర్వేరు రాష్ట్రాల్లో రెండు ప్రాజెక్టులకుగాను 2028 లేదా 2030 నాటికి రూ.10,000 కోట్లు వెచ్చించనున్నట్టు సంస్థ ఈడీ డి.అధికారి తెలిపారు. పెట్రోకెమికల్స్ సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4.2 మిలియన్ టన్నుల నుంచి 2030 నాటికి 8.5–9 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది ప్రణాళిక అని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు సొంతంగా, మరొకటి భాగస్వామ్యంలో నెలకొల్పనున్నట్టు తెలిపారు. -
‘స్థానిక’ ఉత్పత్తుల ప్రోత్సాహానికే యూనిటీ మాల్
సాక్షి, విశాఖపట్నం: ఒక్కొక్క రాష్ట్రంలోని ప్రత్యేకమైన హస్తకళల ఉత్పత్తులు, వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడక్ట్, భౌగోళిక గుర్తింపు (జీఐ ఇండెక్స్) పొందిన ఉత్పత్తుల్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించడం, విక్రయించడమే లక్ష్యంగా యూనిటీ మాల్ నిర్మిస్తున్నట్లు ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు సోనియా దుహానా, ఆకాంక్ష తెలిపారు. ఇటీవల కేంద్ర బడ్జెట్–2023 సందర్భంగా ‘ది యూనిటీ మాల్’ అనే ప్రాజెక్టును కేంద్రం ప్రవేశపెట్టి ఆయా రాష్ట్రాల్లోని రాజధాని లేదా ఆర్థిక రాజధాని, లేదా ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతంలో యూనిటీమాల్ ఏర్పాటుకు స్థలాన్ని సిద్ధం చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మాల్ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బీచ్‌రోడ్డులోని రామానాయుడు స్టుడియో సమీపంలో ఉన్న 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలం యూనిటీ మాల్ నిర్మాణానికి అనువుగా ఉందా లేదా అనే అంశాల్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు విశాఖలో శుక్రవారం పర్యటించారు. స్థలం సరిహద్దులు, ఇతర వివరాలను ఖాదీబోర్డు సీఈవో విజయరాఘవ నాయక్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ డా.పద్మ, డీఐసీ జీఎం గణపతి, ఏపీహెచ్డీసీ ఈడీ విశ్వ, డీహెచ్టీవో మురళీ కృష్ణ వారికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.172 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తుందనీ.. 50 నెలల పాటు రుణంపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా అందించనుందని ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే డీపీఆర్ సిద్ధమైన వెంటనే టెండర్లు ఖరారు చేసి వీలైనంత త్వరగా యూనిటీ మాల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. మధురవాడ తహసీల్దార్ రమణయ్య పాల్గొన్నారు. -
ప్రకృతి అనుకూల ఉత్పత్తులకు భారీ మార్కెట్ - డబ్ల్యూఈఎఫ్
న్యూఢిల్లీ: గృహ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తే, 2030 నాటికి ఈ రంగానికి అదనంగా 62 బిలియన్ డాలర్ల మేర వార్షిక మార్కెట్ ఏర్పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) తెలిపింది. ప్రైవేటు రంగం ప్రకృతి అనుకూల పరిష్కారాలను అనుసరిస్తే 2030 నాటికి అదనంగా (అన్ని రంగాల్లో) 10.1 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ ఏర్పడుతుందని అంచనా వేసింది. గృహ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో నీటి నిర్వహణ, బాధ్యాయుత వనరుల సమీకరణ, ప్రకృతి పరిరక్షణను ప్రస్తావిస్తూ.. ప్రకృతి నష్టం విషయంలో కంపెనీల పాత్రను ఇవి పునర్ వ్యవస్థీకరిస్తాయని డబ్ల్యూఈఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఈ రంగం వార్షిక టర్నోవర్ 700 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఇవి ప్రకృతికి నష్టం కలిగిస్తున్నట్టు వివరించింది. ఒక్క కాస్మొటిక్స్ పరిశ్రమే ఏటా 120 బిలియన్ ప్యాకేజింగ్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపింది. కాస్మోటిక్స్, సబ్సుల్లో ముడి పదార్థంగా వినియోగించే పామాయిల్ కారణంగా 2000–2018 మధ్య అంతర్జాతీయంగా 7 శాతం అటవీ సంపద క్షీణతకు కారణమైనట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయని ప్రస్తావించింది. ఈ రకమైన హానికారక విధానాలకు వ్యతిరేకంగా.. గృహ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల పరిశ్రమ ప్రకృతి పరిధిలోనే, ప్రకృతి అనుకూల విధానాలను అనుసరించాల్సిన అవసరాన్ని డబ్ల్యూఈఎఫ్ నివేదిక నొక్కి చెప్పింది. ఈ రంగంలో వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తి 3.4 శాతం మేర ప్రపంచ గ్రీన్గౌస్ గ్యాస్ ఉద్గారాలకు కారణమవుతున్నట్టు వివరించింది. ప్లాస్టిక్‌ను 10–20 శాతం మేర తిరిగి వినియోగించడం ద్వారా 50 శాతం సముద్ర ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించొచ్చని సూచించింది. జీవ వైవిధ్యానికి హాని కలిగించే రిస్క్‌లను అధిగమించే పరిష్కారాలతో అదనంగా 10.1 లక్షల కోట్ల డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయని డబ్ల్యూఈఎప్ ఎండీ గిమ్ హువే పేర్కొన్నారు. పురోగతి నిదానం ప్రకృతి పరిరక్షణ పట్ల వ్యాపార సంస్థల్లో అవగాహన పెరుగుతున్నా ఈ దిశగా పురోగతి నిదానంగా ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఫారŠూచ్యన్ గ్లోబల్ 500 కంపెనీల్లో 83 శాతం వాతావరణ మార్పులకు సంబంధించి లక్ష్యాలను కలిగి ఉండగా, ఇందులో కేవలం 25 శాతం సంస్థలే తాజా నీటి వినియోగం లక్ష్యాలను ఆచరణలో పెట్టినట్టుగా తాజా అధ్యయన గణాంకాలను ప్రస్తావించింది. -
విమానాశ్రయాల్లో గిరిజన ఉత్పత్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ‘గిరిజన్’ బ్రాండ్ పేరుతో అందిస్తున్న సహజసిద్ధమైన ఉత్పత్తులకు గిరాకీ ఉంది. ప్రధానంగా అరకు వ్యాలీ కాఫీతోపాటు గిరిజన తేనె, షర్బత్, జీడిపప్పు, చిరుధాన్యాలు, త్రిఫల పౌడర్, హెర్బల్ ఆయిల్, సబ్బులు వంటి 80 ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ప్రత్యక్షంగా స్టాల్స్ ఏర్పాటు చేసిన జీసీసీ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా విక్రయాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీతోపాటు అనేక నగరాల్లోను జీసీసీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్వేస్టేషన్లో జీసీసీ అవుట్లెట్ ఏర్పాటు చేశారు. దేశంలో 13 విమానాశ్రయాల్లోను గిరిజన ఉత్పత్తులను అమ్ముతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయంలో పూర్తిగా జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తున్నారు. విజయవాడ విమానాశ్రయంలో జీసీసీ ఏర్పాటు చేసిన స్టాల్ విక్రయాలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ట్రైబల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్ (ట్రైఫెడ్) భాగస్వామ్యంతో అనేక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీసీసీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. జైపూర్, గోవా, త్రివేండ్రం, మహారాణా ప్రతాప్ ఎయిర్‌పోర్టు (ఉదయ్‌పూర్), కోయంబత్తూరు, పుణె, కేబీఆర్ (లద్దఖ్), మాతా దంతేశ్వరి (జగదల్పూర్), కొచ్చిన్, లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ (గౌహతి), ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయాల్లో గిరిజన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో రూ.85.56 లక్షల విలువైన ఉత్పత్తుల విక్రయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జీసీసీ విస్తృతమైన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన అటవీ ఫలసాయాలకు మంచి ధర దక్కేలా జీసీసీ దోహదం చేస్తోంది. గిరిజనుల నుంచి కొనుగోలు చేసిన వాటిని అనేక రకాల ఉత్పత్తులుగా విక్రయిస్తోంది. ఈ క్రమంలో గిరిజనులకు మరింత మేలు చేసేలా జీసీసీ సేవలు విస్తృతం చేస్తోంది. దీన్లో భాగంగానే దేశంలోని అనేక ప్రాంతాల్లో జీసీసీ అవుట్‌లెట్స్ ప్రారంభించాం. ఇతర రాష్ట్రాల్లో గతేడాది (2022–23లో) రూ.85.56 లక్షల విలువైన జీసీసీ గిరిజన్ ఉత్పత్తులు విక్రయించాం. దేశంలో ఎక్కడైనా జీసీసీ ఫ్రాంచైజీ అవుట్లెట్లు పెట్టుకునే ఆసక్తి ఉన్నవారికి ప్రోత్సాహం అందిస్తాం. – శోభ స్వాతిరాణి, జీసీసీ చైర్పర్సన్ -
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మార్కెట్లోకి ‘అమూల్ ఆర్గానిక్’ ఉత్పత్తులు!..ఇంకా ఇతర అప్డేట్స్
-
అరటి నారతో వస్తువులు.. హీరోయిన్ విద్యాబాలన్ కూడా మెచ్చుకుంది
అందరూ వెళ్లే దారిలో వెళ్లాలనిపించదు. కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన కుదురుగా ఉండనీయదు. జీవనం పరీక్షగా అనిపిస్తుంటుంది. ‘అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయా? మనమే అవకాశాలను అందిపుచ్చుకోవాలా?! ఈ విధమైన సంఘర్షణే అరటినార వైపుగా అడుగులు వేయించింది’ అంటారు బళ్లారి వాసి విశ్వనాథ్. అరటినారతో గృహోపకరణాలను తయారుచేస్తూ తమ గ్రామమైన కంప్లిలో 20 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎకోఫ్రెండ్లీ వస్తువుల ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేసిన విశ్వనాథ్ తన ప్రయత్నం వెనక ఉన్న కృషిని వివరించారు. ‘‘ప్రయత్నం లేకుండా ఫలితాలను ఆశించలేం అని తెలుసు. కానీ, కొంతకాలం మైండ్‌లో ఏ పని మీద దృష్టి పెట్టాలో తెలియకుండా ఉంటుంది. నా విషయంలో అదే జరిగింది. బీటెక్ చదువును మధ్యలో వదిలేశాను. ఇంట్లో అమ్మానాన్నలకు ఏ సమాధానమూ చెప్పలేక బెంగళూరులో ఏదైనా పని చేసుకోవచ్చని కొన్ని రోజులు ప్రయత్నించాను. ఏ పనీ సంతృప్తిని ఇవ్వలేదు. కరోనాటైమ్‌లో ఇంటి వద్దే కాలక్షేపం. బోలెడంత సమయం ఖాళీ. చదువు పూర్తి చేయలేకపోయానని అమ్మానాన్నల ముందు గిల్టీగా అనిపించేది. అరటితోటల్లోకి.. మా ప్రాంతంలో అరటితోటలు ఎక్కువ. నా చిన్నతనంలో అరటి నుంచి తీసే నారతో అమ్మావాళ్లతో కలిసి తాళ్లు, ఏవో ఒకట్రెండు ఐటమ్స్ తయారు చేసిన జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఎవరూ వాటి మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కాలక్షేపానికి అరటి నారతో రాఖీలు, కీ చెయిన్లు తయారు చేయడం మొదలుపెట్టాను. మా ఊరైన కంప్లిలో మహిళలు ఊలు దారాలతో క్రొచెట్ అల్లికలు చేస్తుంటారు. ఆ క్రొచెట్ను అరటినారతో చేయిస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచన వచ్చింది. ముందు నేను ప్రయత్నించాను. క్రోచెట్ అల్లికలను నేర్చుకున్నాను. బ్యాగులు, బుట్టలు చేయడం మొదలుపెట్టాను. ముందైతే జీరో వేస్ట్ ప్రోడక్ట్స్ అనే ఆలోచన ఏమీ లేదు. నచ్చింది చేసుకుంటూ వెళ్లడమే. అయితే, అరటినారను తీసి, బాగా క్లీన్ చేసి, ఎండబెట్టి, ప్రత్యేక పద్ధతిలో దీనిని తయారుచేస్తే ఎక్కువ కాలం మన్నుతాయి అనే రీసెర్చ్ సొంతంగా చేశాను. సిద్ధం చేసుకున్న అరటినారను క్రొచెట్ అల్లే మహిళలకు ఇచ్చి, నాకు కావల్సిన వస్తువులు తయారు చేయించడం మొదలుపెట్టాను. రాఖీతో మొదలు... నేను చేసే పనిని ఒక ప్లానింగ్‌గా రాసుకొని, బ్యాంకువాళ్లను సంప్రదిస్తే 50 వేల రూపాయలు రుణం మంజూరు చేశారు. ఆ మొత్తంతో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, అరటి నార తీసి, ఎండబెట్టడం.. ప్రక్రియకు వాడటంతో పాటు మహిళలు వచ్చి అల్లికలు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాను. మూడేళ్ల క్రితం ఇదే టైమ్‌లో మార్కెట్‌కి వెళ్లినప్పుడు రాఖీలను చూశాను. అవన్నీ కాటన్, ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసినవి. అవి చూసి రాఖీలను అరటినార, మట్టి ఉండలు, గవ్వలు, సీడ్ బాల్స్, తాటి ఆకులతో తయారు చేశాను. తెలిసిన వారికి వాటిని ఇచ్చాను. ప్రతి ఉత్పత్తి జీరో వేస్ట్ మెటీరియల్‌తో రూపొందించడంలో శ్రద్ధ తీసుకున్నాను. ‘విష్నేచర్’ పేరుతో హస్తకళాకారుల ఫోరమ్ నుంచి ఐడీ కార్డ్ ఉంది. దీంతో ఎక్కడ ఎకో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్స్, స్టాల్స్‌కు అవకాశమున్నా నాకు ఇన్విటేషన్ ఉంటుంది. నా వీలును, ప్రొడక్ట్స్‌ను బట్టి స్టాల్ ఏర్పాటు చేస్తుంటాను. ఆన్లైన్ ద్వారా వచ్చిన ఆర్డర్స్‌ను బట్టి ఇతర రాష్ట్రాలు, విదేశాలకూ మా అరటినార ఉత్పత్తులు వెళుతుంటాయి. వంద రకాలు.. ఊలు దారాలతో క్రొచెట్ చేసే మహిళలు ఇప్పుడు అరటినారతో గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు. హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్ బ్యాగ్స్, క్లచెస్, మిర్రర్, టేబుల్ మ్యాట్స్, ΄ప్లాంటేషన్ డెకార్, పెన్ హోల్డర్స్, తోరణాలు, బుట్టలు... దాదాపు 100 రకాల వస్తువులను తయారు చేస్తుంటాం. ఈ ఉత్పత్తులు ఐదేళ్లకు పైగా మన్నికగా ఉంటాయి. నీటిలో తడిసినా పాడవవు. అయితే, తడి ఉన్న ఉత్పత్తులను నీడన ఎక్కడో పడేస్తే మాత్రం ఫంగస్ చేరుతుంది. శుభ్రపరిచినా ఎండలో బాగా ఆరబెట్టి, తిరిగి వాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ముందే చెబుతుంటాను. ఇరవైమంది మహిళలు ఒక్కొక్కరు నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయల దాకా ఆదాయం పొందుతున్నారు. గుర్తింపు, ఆదాయాన్ని పొందే మార్గాన్ని కనుక్కోవడంతో కొంతమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ పనిని మరింత విస్తృతం చేయాలన్న ఆలోచనతో నేచరల్ ఫేస్ స్క్రబ్స్, ఇతర ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఒక ప్యాకేజీగా ఇవ్వాలన్న తపనతో పని చేస్తున్నాను. నా పనిని మెచ్చుకున్నవారిలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వంటి ప్రముఖులు ఉన్నారు. మూడేళ్లుగా చేస్తున్న ఈ ప్రయత్నం, నా పనితీరుతో అమ్మానాన్నలు సంతోషంగా ఉన్నారు’’ అని వివరించారు విశ్వనాథ్. – నిర్మలారెడ్డి -
టోకు ధరలు మూడోనెలా మైనస్‌లోనే..
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, ఇంధనం, ప్రాథమిక లోహాల ధరలు తగ్గుదల ప్రభావం మొత్తంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) క్షీణతకు దారితీస్తోంది. క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, టెక్స్టైల్స్ ధరలు కూడా జూలై తగ్గుదలను నమోదుచేసుకున్నాయి. ఆయా అంశాల నేపథ్యంలో డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో అసలు పెరుగుదల లేకపోగా మైనస్ 4.12 శాతంగా నమోదయ్యింది. ఇలాంటి పరిస్థితిని ప్రతి ద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. గత ఏడాది జూన్ నెల్లో హై బేస్ ఎఫెక్ట్ (16.23 శాతం) కూడా తాజా ప్రతిద్రవ్యోల్బణం పరిస్థితికి ఒక కారణం. ఈ తరహా పరిస్థితి నెలకొనడం వరుసగా ఇది మూడవనెల కావడం గమనార్హం. ఇక ఇంతటి స్థాయిలో ప్రతిద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల కనిష్టం కావడం మరో విషయం. 2015 అక్టోబర్‌లో మైనస్ 4.76 ప్రతిద్రవ్యోల్బణం రికార్డయ్యింది. మేలో 4.3 శాతం ఉన్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 4.8 శాతానికి పెరిగిన నేపథ్యంలోనే టోకు ధరలు భారీగా తగ్గడం గమనార్హం. అయితే ఆర్థికవ్యవస్థకు కీలకమైన రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) రేటు నిర్ణయానికి సెంట్రల్ బ్యాంక్ వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్నే ప్రామాణికంగా తీసుకునే సంగతి తెలిసిందే. -
ముగిసిన రబీ ఉత్పత్తుల కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: రబీ ఉత్పత్తుల సేకరణ ముగిసింది. రైతులకు మద్దతు దక్కని పంట ఉత్పత్తులను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రికార్డు స్థాయిలో సేకరించింది. ధరల స్థిరీకరణ ద్వారా ఏటా ప్రతి సీజన్లోను మార్కెట్లో మద్దతు ధర లభించని పంట ఉత్పత్తులను సేకరిస్తూ నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. అదేరీతిలో 2022–23లో ఖరీఫ్, రబీ సీజన్లలో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఫలితంగా మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మద్దతు ధరకు మించి పెరిగాయి. సీఎం యాప్ ద్వారా రోజూ మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఖరీఫ్ 2021 సీజన్ చివరిలో మార్కెట్ ధరలు తగ్గడంతో ప్రభుత్వాదేశాలతో 3,513 మంది రైతుల నుంచి రూ.24.61 కోట్ల విలువైన 8,384 టన్నుల సజ్జలు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు సేకరించారు. గడిచిన ఖరీఫ్–2022 సీజన్లో సజ్జలు మినహా మిగిలిన పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరలు దక్కడంతో రైతులకు మంచి లాభాలొచ్చాయి. సజ్జలను మాత్రమే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశారు. 564 మంది రైతుల నుంచి రూ.3.94 కోట్ల విలువైన 1,676 టన్నులు కొనుగోలు చేశారు. రబీ 2021–22 సీజన్లో 33,566 మంది రైతుల నుంచి రూ.426 కోట్ల విలువైన 84,773 టన్నుల శనగలు, జొన్నలు, పసుపు, పెసలు సేకరించారు. ఇటీవల ముగిసిన రబీ 2022–23 సీజన్లో 39,479 మంది రైతుల నుంచి రూ.510.74 కోట్ల విలువైన 1,39,262 టన్నుల శనగలు, మొక్కజొన్న, పసుపు సేకరించారు. ప్రధానంగా 28,112 మంది రైతుల నుంచి రూ.336.83 కోట్ల విలువైన 63,132 టన్నుల శనగలు, 9,110 మంది రైతుల నుంచి రూ.139.52 కోట్ల విలువైన 71,110 టన్నుల మొక్కజొన్న, 2,257 మంది రైతుల నుంచి రూ.34.39 కోట్ల విలువైన 5,020 టన్నుల పసుపు సేకరించారు. శనగలకు సంబంధించి నూరుశాతం చెల్లింపులు చేయగా, మొక్కజొన్న రైతులకు రూ.139.06 కోట్లు, పసుపు రైతులకు రూ.7.48 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ.27.37 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. గడిచిన రబీ సీజన్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో మొక్కజొన్న ధర రూ.1,500 నుంచి రూ.2 వేలకుపైగా పెరిగింది. అదేరీతిలో కందులు, పెసలు, మినుములు వంటి అపరాల ధరలు కూడా రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3,322.15 కోట్ల విలువైన 9.01 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 12 రకాల పంట ఉత్పత్తులను సేకరించగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.7,712.32 కోట్ల విలువైన 21.56 లక్షల టన్నుల పరిమాణం కలిగిన 17 రకాల పంట ఉత్పత్తులను సేకరించింది. గతంలో ఏన్నడూ లేనివిధంగా అరటి, పత్తి, పొగాకు, బత్తాయి. టమాటా పంట ఉత్పత్తులను కనీస మద్దతు ధరలకు సేకరించి రైతులకు అండగా నిలిచింది. -
చిన్న సంస్థల కోసం వినూత్న బీమా పథకాలు
ముంబై: జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తాజాగా చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కోసం మూడు వినూత్న బీమా పథకాలను ప్రవేశపెట్టింది. ఎంఎస్ఎంఈ సురక్షా కవచ్ పాలసీ, ప్రాపర్టీ ఆల్ రిస్క్ (పీఏఆర్) పాలసీ, ఐ–సెలెక్ట్ లయబిలిటీ పాలసీ వీటిలో ఉన్నాయి. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా వీటిని ప్రవేశపెట్టినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ మంత్రి తెలిపారు. సురక్షా కవచ్ పాలసీ.. విపత్తుల నుంచి వాటిల్లే ఆస్తి నష్టాన్ని భర్తీ చేస్తుందని, ప్రమాదాల వల్ల జరిగే ఆస్తి నష్టాల కోసం పీఏఆర్ కవరేజీ ఉపయోగపడుతుందని వివరించారు. ఆభరణాల వంటి విలువైన వాటికి ఐ–సెలెక్ట్ లయబిలిటీతో అదనపు కవరేజీ పొందవచ్చని పేర్కొన్నారు. -
అమెజాన్ నుంచి ఇక అలాంటి ప్రొడక్ట్స్ రావు..
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దగ్గర నుంచి దుస్తుల వరకు అన్ని రకాల వస్తువులు ఈ-కామర్స్ సంస్థల ద్వారా ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా ఆన్లైన్లో కొన్న కస్టమర్లకు కొన్నిసార్లు డ్యామేజీ అయిన వస్తువులు డెలివరీ అవుతుంటాయి. దీంతో వాటిని మళ్లీ రిటర్న్ చేస్తుంటారు కస్టమర్లు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహకారం డ్యామేజీ వస్తువుల సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త ఉపాయం ఆలోచిస్తోంది. ఇందు కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారం తీసుకోనుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. అమెజాన్ తన గిడ్డంగులలో పెద్ద మార్పు చేస్తోంది. వస్తువులను కస్టమర్లకు పంపే ముందు వాటిని క్షుణ్ణంగా పరిశీలంచడానికి కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల కస్టమర్లకు డ్యామేజీ వస్తువులు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. అదే విధంగా కస్టమర్ల ఆర్డర్లకు అనుగుణంగా వస్తువుల ఎంపిక, ప్యాకింగ్ చేసే ప్రక్రియ వేగంగా జరుగుంది. అమెజాన్ గిడ్డంగులను మరింత ఆటోమేషన్ పెంచడానికి ఇది ఒక ముందడుగుగా భావిస్తున్నారు. కస్టమర్లకు పంపే వస్తువుల్లో ఏదైనా డ్యామేజీ ఉందా అనేది ప్రస్తుతం అమెజాన్ వేర్‌హౌస్‌లలో కార్మికులే మ్యానువల్‌గా పరిశీలిస్తున్నారు. అయితే ఉత్పత్తి లోడ్ చాలా ఎక్కువగా నేపథ్యంలో కొన్నిసార్లు డ్యామేజీ వస్తువులను గుర్తించలేక పోతున్నారు. దీంతో ఆ డ్యామేజీ వస్తువులు కస్టమర్లకు అలాగే చేరుతున్నాయి. డ్యామేజీ ఉత్పత్తులను మాన్యువల్‌గా స్క్రీనింగ్ చేసే ప్రక్రియ కష్టతరమైనది. చాలా సమయం తీసుకుంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని అమెజాన్ భావిస్తోంది. -
ఏపీలో వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వశాఖ వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 రైల్వే స్టేషన్లలో 37 వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ అవుట్లెట్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విజయవాడ స్టేషన్‌తో పాటుగా నెల్లూరు, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, గుడివాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేసిన అవుట్లెట్ స్టాల్స్ ద్వారా స్థానిక చేతి వృత్తుల వారి జీవనోపాధి, సంక్షేమానికి ప్రధాన ప్రోత్సాహం క ల్పించారు. సంప్రదాయ కలంకారి చీరలు, జనపనార ఉత్పత్తులు, అనుకరణ ఆభరణాలు, చెక్క హస్తకళలు, గిరిజన ఉత్పత్తులు, ఊరగాయలు, మసాలా పొడులు, అప్పడాలు వంటి స్థానిక వంటకాలు, షేల్ పెయింటింగ్స్, రైస్ ఆర్ట్స్ తదితర ఉత్పత్తులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రైల్వే స్టేషన్లు అనుకూలమైన స్థలమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. -
చైనా దిగుమతుల్లో మారిన తీరు.. గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?
న్యూఢిల్లీ: భారత్ దిగుమతుల్లో చైనా వాటా తగ్గుతోంది. వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 - 22లో భారత్ మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 15.43 శాతం. ఇది 2022 - 23లో 13.78 శాతానికి తగ్గింది. అయితే విలువల్లో మాత్రం ఈ పరిమాణం ఇదే కాలంలో 94.57 బిలియన్ డాలర్ల నుంచి 98.51 బిలియన్ డాలర్లకు చేరింది. గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో చైనాకు భారత్ ఎగుమతులు కూడా 21.26 బిలియన్ డాలర్ల నుంచి 15.32 బిలియన్ డాలర్లకు తగ్గాయి. రష్యా (369 శాతం), ఇండోనేషియా (63 శాతం), సౌదీ అరేబియా (23 శాతం), సింగపూర్ (24 శాతం) కొరియా (21 శాతం)లకు భారత్ ఎగుమతులు పెరిగాయి. -
ఈ తోడికోడళ్లు రూ.600 కోట్లు టర్నోవర్ చేస్తున్నారు..
రికా జైన్, కిమీ జైన్ ఇద్దరూ తోడికోడళ్లు.. విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వీరు 2012లో ప్రీమియం హోటల్ టాయిలెట్రీ (టాయ్లెట్లో ఉపయోగించే సబ్బులు, షాంపులు, హెయిర్ కండీషనర్లు, టూత్ పేస్టులు, టాయ్‌లెట్ పేపర్లు తదితర వస్తువులు) తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. (క్రిక్‌పే లాంచ్ ఆలస్యమైంది.. క్షమించండి) కరోనా మహమ్మారి సమయంలో వారు జీవనశైలికి సంబంధించిన వస్తువుల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఈ తోడికోడళ్లకు కెనడాకు చెందిన హాస్పిటాలిటీ ఉత్పత్తుల తయారీ సంస్థలో భాగస్వామ్యం ఉంది. తక్కువ వ్యవధిలోనే వారి వ్యాపార టర్నోవర్ రూ.600 కోట్లకు పెరిగింది. ఇంతకీ వాళ్ల కంపెనీ పేరు ఏంటంటే.. ‘కిమిరికా’. తన భర్త రజత్ జైన్‌తో కలిసి ఓ హోటెల్‌కు వెళ్లినప్పుడు రికా జైన్ అక్కడి గదిలోని టాయిలెట్రీ వస్తువులను గమనించారు. వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించారు. అప్పుడే ఆమెకు ఈ వ్యాపార ఆలోచన వచ్చింది. వెంటనే మోహిత్, కిమీ జైన్‌లతో కలిసి టాయిలెట్రీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హంటర్ ఎమినిటీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కిమిరికా హంటర్ ఇంటర్నేషనల్, కిమిరికా లైఫ్ స్టైల్ వ్యాపారాల వార్షిక టర్నోవర్ రూ.600 కోట్లు. (‘మారుతీ ఆల్టో 800’ను ఇక కొనలేరు! ఎందుకంటే...) కిమీ జైన్ మధ్య ప్రదేశ్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. తర్వాత 1991లో ఆమె చదువు కోసం కుటుంబమంతా ఇండోర్‌కు వచ్చేశారు. ఇక రికా ఇండోర్‌లోనే పుట్టి పెరిగారు. సోదరులైన మోహిత్, రజత్‌లతో వీరికి వివాహమైంది. కిమీ ఈ-కామర్స్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. రికా ఫార్మసీ డిగ్రీ చేశారు. వీరి కంపెనీలో 600 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది మహిళలే. వారి విక్రయాలలో ఎక్కువ భాగం ఆన్లైన్ ఛానెల్‌ల నుంచి వస్తుంది. వారు తమ డైరెక్ట్ టు కస్టమర్ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ను ప్రారంభించిన తర్వాత మొదటి ఆరు నెలలూ కేవలం 2500 మంది కస్టమర్లు మాత్రమే ఉండేవారు. దీంతో లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ను ప్రారంభించాలనే తమ నిర్ణయం సరైనదేనా అని అప్పట్లో ఆలోచనలో పడ్డారు. అయితే లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ అమ్మకాలకు ప్రోత్సాహం లభించడంతో దీనిపైనే తమ శక్తిని కేంద్రీకరించి విజయమంతమయ్యారు. రాబోయే రోజుల్లో ఆఫ్‌లైన్ స్టోర్లకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఈ తోడికోడళ్లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) -
ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్‌పై పెట్టుబడులు
ముంబై: ఐటీ సర్వీసుల దిగ్గజం టెక్ మహీంద్రా కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ విభాగంపై రూ. 700 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనుంది. రానున్న రెండేళ్లలో ఈ పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. టెలికం రంగానికి సేవలందిస్తున్న కామ్వివా కొనుగోలు ద్వారా కంపెనీ ఇప్పటికే ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ బిజినెస్‌లో కార్యకలాపాలు కలిగి ఉంది. వీటితోపాటు ఇతర సర్వీసులు సైతం అందిస్తున్న కామ్వివా వార్షికంగా 45 కోట్ల డాలర్ల ఆదాయ రన్‌రేట్‌ను సాధించినట్లు గుర్నానీ వెల్లడించారు. కాగా.. ప్రొడక్టులు, ప్లాట్‌ఫామ్స్ బిజినెస్ ద్వారా రెండేళ్లలో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. ఇన్వెస్టర్ డే సందర్భంగా పుణే నుంచి వర్చువల్‌గా గుర్నానీ ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటు చేసిన విభాగంపై పెట్టుబడులను కామ్వివా బృందం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న కామ్వివా భువనేవ్వర్, బెంగళూరులలోనూ కార్యకలాపాలు విస్తరించినట్లు తెలియజేశారు. టెలికంతోపాటు తాజా విభాగం బీఎఫ్ఎస్ఐ తదితర రంగాలకూ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా మరో 20 కోట్ల డాలర్ల ఆదాయానికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ వార్తల నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు బీఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 1,085 దిగువన ముగిసింది. -
వింటర్ జోరు: హీటింగ్ ఉత్పతుల హాట్ సేల్!
న్యూఢిల్లీ: వాటర్ హీటర్లు, గీజర్లు, రూమ్ హీటర్లు తదితర ఉత్పత్తుల అమ్మకాలు ప్రస్తుతం శీతాకాలంలో (వింటర్) జోరుగా ఉంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం అమ్మకాలకు దన్నుగా నిలవనుంది. రెండంకెల స్థాయిలో అమ్మకాలు పెరుగుతాయన్న అంచనాలతో, కంపెనీలు ఇప్పటికే తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం గమనార్హం. వింటర్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కొత్త ఉత్పత్తులను కూడా మార్కెట్‌కు పరిచేయం చేస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతికతతో కూడిన గీజర్లను కూడా తీసుకొచ్చాయి. ట్యాంక్ రహిత ఇన్స్టంట్ వాటర్ హీటర్లను కూడా తీసుకొచ్చాయి. ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లతో కూడిన ఖరీదైన రూమ్ హీటర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. సామాన్య వినియోగదారుల నుంచి, సంపన్న వినియోగదారుల వరకు అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా.. సౌకర్యం, మన్నిక, డిజైన్లతో కూడిన ఉత్పత్తులను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) 20 శాతం వృద్ధిపై క్రాంప్టన్ కన్ను.. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (సీజీసీఈఎల్) అయితే, ఇన్స్టంట్, స్టోరేజ్ వాటర్ హీటర్ల అమ్మకాల్లో 20 శాతం మేర వృద్ధి ఉంటుందని అంచనా వేస్తోంది. గతేడాదితో పోలిస్తే రూమ్ హీటర్ల అమ్మకాల్లో 70 శాతం వృద్ధి ఉండొచ్చని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ కంపెనీ ఏడు కొత్త మోడళ్లను పరిచయం చేసింది. సోలారియం క్యూబ్ ఐవోటీ సిరీస్, సోలారియం కేర్ సిరీస్ నుంచి ఈ ఉత్పత్తులు ఉన్నాయి. బేబీ కేర్, హెయిర్ కేర్, హైజీన్ కేర్ అనే ఫీచర్లు వీటిల్లో ఉన్నాయి. ఈ ఏడాది వాటర్ హీటర్ల మార్కెట్ సైజ్ 10 శాతం వృద్ధితో 42.5 లక్షలుగా ఉంటుందని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజా తెలిపారు. రూమ్ హీటర్ల మార్కెట్ 40 లక్షల యూనిట్లు కాగా, ఈ ఏడాది వృద్ధి చలి తీవ్రతపై ఆధారపడి ఉంటుందన్నారు. ముందే సన్నద్ధం.. ‘‘వింటర్ సీజన్‌పైనే వ్యాపార వృద్ధి ఆధారపడి ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువైతే ఉత్పత్తులకు డిమాండ్ సహజంగానే అధికమవుతుంది. మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా కొరత ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ముందే తయారీ పరంగా తగినంత సన్నద్ధతతో ఉన్నాం’’అని బజాజ్ ఎలక్ట్రికల్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సీవోవో రవీందర్ సింగ్ నేగి వెల్లడించారు. రూమ్ హీటర్ల విభాగంలో ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్లు, కార్బన్ రూమ్ హీటర్లు, ఫ్యాన్ రూమ్ హీటర్లు, హాలోజెన్ రూమ్ హీటర్లు ఇలా అన్ని రకాల ఉత్పత్తులను తాము ఆఫర్ చేస్తున్నట్టు నేగి తెలిపారు. హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్ ఈ విభాగంలో గడిచిన రెండేళ్లుగా రెండంకెల వృద్ధిని చూస్తున్నట్టు కంపెనీ సీఈవో రాకేశ్ కౌల్ చెప్పారు. ఈ ఏడాది 20 వరకు వాటర్ హీటర్, రూమ్ హీటర్ మోడళ్లను విడుదల చేయడం ద్వారా తమ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించినట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అమ్మకాల్లో 30 శాతం వృద్ధి కనిపించినట్టు చెప్పారు. (సామాన్యుడికి ఊరట: 11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం) -
దిగుబడి అబద్ధం, అనారోగ్యం నిజం
జన్యుమార్పిడి ఆవాల విత్తన వినియోగానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని అక్టోబర్ 31 నాడు మూడు జాతీయ వ్యవసాయ శాస్త్ర సంస్థల (ఐసీఎంఆర్, ఎన్ఏఎస్ఎస్, టీఏఎస్ఎస్) అధిపతులు ప్రకటించారు. జన్యుమార్పిడి ఉత్పత్తుల వరదకు గేట్లు తెరవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తోంది. జన్యుపరంగా మార్పుచేసిన ఆహార పంటల వాణిజ్య సాగును అనుమతించడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసానా లను ప్రభుత్వం అర్థం చేసుకోలేదు. జన్యుమార్పిడి విత్తనాలు దిగుబడులు తేకపోగా, అనారోగ్యానికి కారణం అవుతాయని గత అనుభవాలు చెబు తున్నాయి. అయినా అవాంఛిత, హానికరమైన సాంకేతిక పరిజ్ఞాన వాడకానికి ప్రపంచంలోనే అతిపెద్ద చెత్తబుట్టగా భారత్ మారడానికి సిద్ధమవుతోంది. యూరోపియన్ యూనియన్ జన్యు మార్పిడి (జీఎం) పంటలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ వ్యతిరేకత తరువాత, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా జన్యు మార్పిడి పంటలను అనుమతించబోనని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పాలన ఉన్నప్పటికీ చైనా కూడా ప్రమాదకరమైన సాంకేతిక పరిజ్ఞానం పట్ల అప్రమత్తంగా ఉంది. ఈ తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో జన్యు మార్పిడి విత్తన రంగం మరెక్కడకు మారగలదు, భారతదేశం తప్పితే. సాంకేతిక ఆవిష్కరణ పేరిట, జన్యుమార్పిడి ఆవాల (డీఎంహెచ్–11 రకం) వాణిజ్య సాగుకు ఆమోదం ఇవ్వవలసి వస్తే, శాస్త్రీయ నిబంధనల ప్రక్రియ ఎంత అశాస్త్రీయంగా మారిందో అర్థమవుతుంది. జన్యు ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జీఈఏసీ) జీఎం ఆవాలకు ఆమోదం మంజూరు చేసిన పద్ధతి అన్ని శాస్త్రీయ నిబంధనలను ఉల్లంఘిస్తుంది. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్క రించడానికి జన్యు మార్పిడి టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసును ధ్రువీకరించడానికి జీఈఏసీ తన నియంత్రణను బలహీనపరిస్తే, విధాన రూపకర్తలు వ్యవసాయ సంక్షోభాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయినట్లే. జన్యు మార్పిడి ఆవాలు 30 శాతం ఎక్కువ దిగుబడిని ఇస్తాయి, అందువల్ల రూ.1,71,000 కోట్ల వంటనూనె దిగుమతి బిల్లును తగ్గించడానికి అవకాశం లభిస్తుందని ఒక అసంబద్ధ వాదన చేస్తు న్నారు. ఆమోదించిన డీఎంహెచ్–11 రకం అధిక దిగుబడినిచ్చేది కాదు. దీని ఉత్పాదకత ప్రస్తుతం వాడుతున్న మూడు ఇతర నాన్– జీఎం రకాల కంటే తక్కువ. అన్ని శాస్త్రీయ నిబంధనల ప్రకారం, ఇది అసలు పరిశీలించాల్సిన రకం కూడా కాదు. అధిక ఉత్పాదకతతో ఇప్పటికే నాలుగు ఆవాల రకాలు ఉన్నాయని ఒక శాస్త్రవేత్త సెంటర్ ఫర్ జెనెటిక్ మానిప్యులేషన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సౌత్ క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో చెప్పారు. మూడు రకాలు ఒకే డీఎంహెచ్ శ్రేణిలో ఉన్నాయి. సంప్రదాయ రకం అయిన డీఎంహెచ్–4, జన్యుమార్పిడి ఆవాల కంటే 14.7 శాతం అధిక దిగు బడి ఇస్తుంది. రెండు విత్తన కంపెనీల (పయనీర్, అడ్వాంటా ఉత్పత్తి చేసిన) మరో రెండు రకాలు కూడా 30 శాతం అధిక దిగుబడిని ఇస్తాయి. కాబట్టి వంటనూనెల దిగుమతులను తగ్గించేందుకే అను మతి ఇస్తున్నారన్న వాదనలో అర్థం లేదు. 2016–17లో భారతదేశం గణనీయ స్థాయిలో ఆవాలను పండించింది. అధిక ఉత్పత్తి నేపథ్యంలో ధరలు పడిపోయినాయి. రైతులకు సగటున క్వింటాలుకు రూ.400–600 వరకు ధరలు తగ్గాయి. దాదాపు 65 లక్షల హెక్టార్లలో సాగయ్యే ఆవాల పంట, దిగు బడి సమస్యలను ఎన్నడూ ఎదుర్కోలేదు. ఉన్న సమస్య కనీస మద్దతు ధర గానీ, గిట్టుబాటు ధర గానీ రాకపోవడం. నీతి ఆయోగ్ రైతులకు భరోసా ధర కల్పించే ప్రయత్నం చేయకుండా, దిగుబడి మాత్రమే సమస్య అన్నట్లుగా, అధిక దిగుబడితోనే అధిక ఆదాయం వస్తుందనే భావన కల్పిస్తున్నది. 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం వంటనూనెల దిగుమతులను తగ్గించడం ద్వారా విదేశీ మారకంలో లోటును తగ్గిం చాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయిల్ సీడ్ టెక్నాలజీ మిషన్ ప్రారంభమైంది. ఫలితంగా, 1993–94 నాటికి భారత్ దాదాపు స్వయం సమృద్ధి సాధించింది. వంటనూనెల ఉత్పత్తి 97 శాతం దేశీయం కాగా, కేవలం 3 శాతం మాత్రమే దిగుమతి చేసుకున్నారు. కానీ ఈ ‘ఎల్లో రివల్యూషన్’ ఎక్కువ కాలం నిలవలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలు క్రమంగా దిగుమతి సుంకాలను తగ్గించాయి. భారతదేశం విధించగల 300 శాతం దిగుమతి సుంకాల పరిమితికి వ్యతిరేకంగా, సుంకాలు దాదాపు సున్నాకు తగ్గిపోయాయి. చౌక నూనె దిగుమతులు పెరిగినాయి. ప్రధా నంగా పామాయిల్ దిగుమతులు దేశీయ మార్కెట్లను ముంచెత్తాయి. కేవలం 3 శాతం దిగుమతుల నుంచి, మళ్లీ 60 శాతానికి పైగా దిగు మతి చేసుకోవడం మొదలైంది. ఫలితంగా, వర్షాధార భూములలో ఎక్కువగా పండించే నూనెగింజల రైతులు ఇతర పంటలకు మార వలసి వచ్చింది. దేశీయ వంటనూనె పరిశ్రమ నష్టాల్లోకి పోయింది. కొన్ని భారతీయ కంపెనీలు శ్రీలంకకు కూడా తరలివెళ్లాయి. వంట నూనెల దిగుమతి ఖర్చును తగ్గించడమే లక్ష్యం అయితే, మొదట దేశీయ నూనె ఉత్పత్తికి అనుకూల వాతావరణాన్ని కల్పిం చాలి. దిగుమతి సుంకాలను పెంచకపోతే, విదేశీ మారకంలో తరు గును తగ్గించే ఏ చర్య అయినా అర్థరహితం అవు తుంది. ఈ విషయం నీతి ఆయోగ్‌కు తెలుసు. వంటనూనె ఉత్పత్తిని దేశీయంగా పెంచాలనే ఉద్దేశం ఉంటే భారతదేశం ‘పసుపు విప్లవం’ మార్గంలో నడవవలసి ఉంటుందని దానికి తెలుసు. అయినా కొన్ని విత్తన కంపెనీల వ్యాపార అభివృద్ధికే జన్యుమార్పిడి ఆవాల అనుమతి ఇచ్చారు. జన్యుమార్పిడి ఆవాల రకం వాస్తవానికి రసాయన కలుపు నాశిని తట్టుకునే పంట. కానీ జీఈఏసీ దీనిని ఖండించింది. కాకపోతే, ఖరీదైన కలుపు నాశక రసాయనాలను రైతులు కొనలేరు కనుక వాటిని వాడే అవసరం ఉండదని వాదిస్తున్నారు. ఇది అశాస్త్రీయ వాదన. జన్యుమార్పిడి ఆవాల రకం అనుమతి వెనుక కలుపునాశక రసాయ నాల కంపెనీల వ్యాపార విస్తరణ కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే, హెచ్‌టీ బీటీ ప్రత్తి గింజలకు అనుమతి లేకున్నా చట్ట వ్యతిరేకంగా వేల ఎకరాలలో సాగు అవుతోంది. ఈ పంట కోసం గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం పెరిగింది. ఇటీవల దాని ఉపయోగం అత్యంత ప్రమాదకరం అని గుర్తించిన ప్రభుత్వం, రైతులు కాకుండా, రసాయన పిచికారీ కంపెనీలు మాత్రమే చేయాలని నిబంధన తెచ్చింది. జన్యు మార్పిడి ఆవాల రకాన్ని అనుమతి ఇచ్చిన కొద్దీ రోజులలోనే ఆ నిబంధన తేవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ రెండు అనుమతులు ఒకదానికొకటి సంబంధం లేనట్లు ఉన్నా, జన్యు మార్పిడి విత్తనాలు ఈ కలుపునాశక రసాయనం తట్టుకునే రకాలు కావడం విశేషం. అంటే, జన్యుమార్పిడి ఆవాల రకం విత్తనాలు రైతులు వాడితే తప్పనిసరిగా కలుపునాశక రసాయనం కొనవలసిందే. అవి వాడి రైతులు మరణిస్తే, మొత్తం ప్యాకేజికే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం రైతులు కాకుండా ప్రత్యేక కంపెనీలు పిచికారీ చేసే విధంగా నిబంధన తెచ్చారు. దీని వలన, రెండు ప్రయోజనాలు: గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం చట్ట బద్ధం అవుతుంది, జన్యుమార్పిడి పంటల విస్తీర్ణం పెరుగుతుంది. భారత దేశంలో గ్లాయిఫోసేట్ రసాయన వినియోగం కేవలం తేయాకు తోటలలోనే చేయాలి. ఇంకెక్కడైనా చేస్తే అది చట్టవిరుద్ధం. ప్రత్యేకంగా ఆహార పంట మీద చేయడానికి వీలు లేదు. జన్యు మార్పిడి ఆవాల ద్వార హానిచేసే రసాయన అవశేషాలు కూడా విని యోగదారులకు అందుతాయి. జన్యుపరంగా మార్పు చేసిన విత్తనాలు ప్రమాదకరమైనవి. ఆహార పదార్థాల జన్యు నిర్మాణం పక్కదారి పట్టినట్లయితే, జీవ క్రియలు, బయోకెమిస్ట్రీ ప్రభావితమవుతాయి. దాని వలన అలర్జీలు, అనేక ఇతర వ్యాధులు రావచ్చు. ఏ1, ఏ2 పాల నుండి లాక్టోస్ అలర్జీ, గోధుమల నుండి గ్లూటెన్ అలెర్జీ వంటి వాటిని ఇప్పటికే చూస్తున్నాం. బహుళజాతి కంపెనీల లాభాపేక్ష ఆధారంగా విధానాలు రూపు దిద్దుకుంటున్నాయి. విత్తనాల మీద రైతుల హక్కులు తగ్గుతున్నాయి. బీటీ పత్తికి అనుమతి ఇచ్చిన 20 ఏళ్ళలో రైతుల పరిస్థితి మెరుగు పడకపోగా ఆత్మహత్యలు, అనారోగ్యం పెరిగినాయి. జన్యు మార్పిడి పంటల వల్ల లాభపడేది రైతులు, వినియోగదారులు కాదు. విత్తన కంపెనీలు మాత్రమే. భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భారత పౌరులు జీఎం ఆవాలను వ్యతిరేకించాలి. డాక్టర్ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు -
సుస్థిరమైన ఆవిష్కరణలు, ఉత్పత్తులు రావాలి
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని అతి పెద్ద మార్కెట్ లక్ష్యంగా వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, సుస్థిరమైన ఉత్పత్తులు తీసుకురావాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. వివిధ రంగాల పరస్పర సహకారం, వినూత్న విధానాలతో వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల శక్తికేంద్రంగా నిలుస్తుందనే ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిఫ్ట్, ఎఫ్డీఐఐ, ఎన్ఐడి, ఐఐఎఫ్టి, ఐఐపి విద్యార్థుల సమావేశం శిల్పకళావేదికలో శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన నిర్మలా సీతారామన్ ‘డిజిటలైజేషన్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్: భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ సూచించిన పంచ సూత్రాల(పంచ పరిష్కారాలు) అమలుతో దేశం మరింత బలోపేతం అవుతోందన్నారు. ఇప్పటికే భారత్ అభివృద్ధి చేసిన స్థిరమైన డిజైన్ల గురించి తెలుసుకొని, వాటిని ఈ తరానికి సౌకర్యంగా ఉండేలా మెరుగుపరచాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. మార్పును స్వీకరించి, కొనసాగించే వారధులుగా విద్యార్థులు ఉండాలని సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆశాకిరణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ : పీయూష్ గోయల్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ ఆర్థికవ్యవస్థ ఒక ఆశాకిరణంగా ఉందని కేంద్ర పరిశ్రమలు, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఉత్తమ డిజైన్లను రూపొందించి, ఖర్చు తగ్గించే అంశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. సభికులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. పేటెంట్ల కోసం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డిజిటలైజేషన్ ద్వారా అవినీతిని రూపుమాపామని, మధ్యవర్తులను దూరం చేయగలిగామని, పోటీతత్వం పెంచగలిగామని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఐదు విద్యాసంస్థల విద్యార్థుల (పూర్వవిద్యార్థులుసహా) సమ్మేళనం తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతోందని, రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రవాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్, ఎఫ్‌డీడీఐ ఎండీ అరుణ్ కుమార్ సిన్హా, నిఫ్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మంత్రి, ఎన్ఐడి ప్రొఫెసర్ శేఖర్ ముఖర్జీ, ఎఫ్డిఐఐ హైదరాబాద్ సెంటర్ ఇంచార్జ్ దీపక్ చౌదరి, ఐఐఎఫ్టి డీన్ డాక్టర్ సతీందర్ భాటియా, ఐఐపీ చైర్మన్ వాగీ దీక్షిత్ పాల్గొన్నారు. -
మెప్పించిన టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్
న్యూఢిల్లీ: టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (టీసీపీఎల్) సెప్టెంబర్ క్వార్టర్లో పనితీరు పరంగా మెప్పించింది. నికర లాభం 36 శాతం పెరిగి రూ.389 కోట్లుగా నమోదైంది. ఆదాయం 11 శాతం ఎగసి రూ.3,363 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి నికర లాభం రూ.286 కోట్లు, ఆదాయం రూ.3,033 కోట్ల చొప్పున ఉన్నాయి. వ్యయాలు 12 శాతం వరకు పెరిగి రూ.3,022 కోట్లకు చేరాయి. భారత్‌లో వ్యాపారం బలమైన పనితీరు చూపించినట్టు టీసీపీఎల్ గ్రూపు సీఎఫ్‌వో ఎల్ కృష్ణకుమార్ తెలిపారు. ముఖ్యంగా ఆహారోత్పత్తుల వ్యాపారం గొప్ప పనితీరు చూపించిందన్నారు. భారత మార్కెట్ నుంచి ఆదాయం 9 శాతం పెరిగి రూ.2,160 కోట్లుగా ఉంది. ఫుడ్స్ బిజినెస్ ఆదాయం 29 శాతం వృద్ధిని చూసింది. టాటా సంపన్న్, నీటి వ్యాపారం ఆదాయం డబుల్ డిజిట్ స్థాయిలో పెరిగింది. ప్యాకేజ్డ్ పానీయాల వ్యాపారం 7 శాతం క్షీణించింది. టాటా స్టార్ బక్స్ ఆదాయం 57 శాతం పెరిగింది. ఉప్పు వ్యాపారంలో మార్కెట్ వాటాను పెంచుకున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజ తెలిపారు. చదవండి: ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు -
దగ్గు సిరప్ కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి... ఉత్పత్తికి చెక్!
చిన్నారులను మింగేసిని దగ్గు సిరప్ కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డబ్ల్యూహెచ్‌వో గాంబియాలో దాదాపు 66 మంది చిన్నారులు బారత్ తయారు చేసిన సిరప్ వల్లే చనిపోయారని పేర్కొనడంతో హర్యానా ప్రభుత్వం ఆ ఉత్పత్తులను నిలిపేసినట్లు తెలిపింది. అంతేగా ఆ కంపెనీ సంబంధించి మూడు జౌషధాలను పరీక్షల నిమిత్తం కలకత్తాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్‌కి పంపారు. ఆ పరీక్ష నివేదికల తదనంతరం సదరు కంపెనీపై చర్యలు తీసుకుంటానని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. ఐతే కేంద్ర హర్యానా రాష్ట్ర జౌషధ విభాగా సంయుక్త తనిఖీల్లో ఔషధ తయారీలో దాదాపు 12 లోపాలను గుర్తించడంతోనే ఉత్పత్తిని నిలిపేసినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీకి జారీ చేసిన షోకాజ్ నోటీస్‌లో...కంపెనీ ఔషధాలను తయారు చేయడానికి, పరీక్షించడానికి ఉపయోగించిన పరికరాలు, సాధనాల సమాచారానికి సంబంధించిన పుస్తకాన్ని నివేదించడంలో విఫలమైంది. అలాగే సిరప్ తయారీలో వాడిన రసాయనాల బ్యాచ్‌కి సంబంధించి సమాచారం కూడా పేర్కొనలేదు. సిరప్ తయారీ, ప్రక్రియ పద్ధతులను నివేదించడంలో విఫలం. అలాగే సిరప్కి సంబంధించి పరీక్షల నివేదికనను అందించలేకపోయింది. అంతేగాదు తయారి తేదీకి, ఉత్పత్తి అనుమతించిన తేదీకి చాలా వ్యత్యాసం ఉందంటూ పలు లోపాలను లేవనెత్తింది. ఈ మేరకు హర్యాన స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ షోకాజ్ నోటీస్‌కి ప్రతిస్పందించేందుకు సదరు కంపెనీకి సుమారు 7 రోజుల వ్యవధి ఇచ్చింది. సదరు కంపెనీపైన వచ్చిన ఆరోపణలు నిజమైతే గనుక కంపెనీ తయారీ లైసెన్సు రద్దు చేయడమే గాక తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. (చదవండి: చిన్నారులను మింగేసిన దగ్గు మందు... సంచలన విషయాలు) -
ఎంఎస్ఎంఈల నుంచి కొత్త ఉత్పత్తులు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ప్రతి మూడింటిలో ఒకటి పండుగలకు ముందే కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించాలని అనుకుంటున్నాయి. ప్రచార కార్యక్రమాలు, డిస్కౌంట్లపై దృష్టి పెట్టనున్నట్టు 34 శాతం కంపెనీలు తెలిపాయి. మీషో–కాంటార్ సర్వేలో ఈ విషయాలు తెలిశాయి. సెప్టెంబర్ 23 నుంచి ఈ కామర్స్ సంస్థల పండుగల ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. మీషో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇప్పటికే సేల్స్‌ను ప్రకటించాయి. ఆన్లైన్ విక్రేతల పండుగల విక్రయాల సన్నద్ధతను తెలుసుకునేందుకు మీషో కాంటార్ సర్వే ప్రయత్నించింది. సర్వే అంశాలు.. ► 36 శాతం మంది కొత్త ఉత్పత్తులను పండుగలకు ముందు విడుదల చేయనున్నట్టు తెలిపాయి. ► ప్రమోషన్లు, డిస్కౌంట్లను ప్రకటించనున్నట్టు 34 శాతం కంపెనీలు వెల్లడించాయి. ► ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడంపై ఇన్వెస్ట్ చేయనున్నట్టు 33 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ► పండుగల డిమాండ్‌ను తట్టుకునేందకు అదనపు స్టాక్‌ను సమకూర్చుకుంటామని 32 శాతం కంపెనీలు చెప్పాయి. ► కొత్త కస్టమర్లను చేరుకోవాలని 40 శాతం కంపెనీలు కోరుకుంటున్నాయి. ► దేశవ్యాప్తంగా 787 ఆన్లైన్ విక్రయదారుల నుంచి ఈ అభిప్రాయాలను మీషో సర్వే తెలుసుకుంది. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు! -
ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రియ దేశీ ఆవుపాల (ఏ–2) ఉత్పత్తులు మార్కెట్లోకి రాబోతున్నాయి. ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట పాలు, వెన్న, నెయ్యి, పన్నీరు ఇలా వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయవాడలో ఈ నెలాఖరున తొలి కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఏర్పాటుచేయనున్నారు. జెర్సీ, హెచ్ఎఫ్ జాతి పశువుల నుంచి వచ్చే పాలను ఏ–1 పాలుగానూ.. ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రెడ్సింధీ జాతి దేశీ ఆవుల నుంచి వచ్చే పాలను ఏ–2 పాలుగా పిలుస్తారు. చదవండి: మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే! మూపురం కల్గిన పశువుల పాలల్లో హానికర రసాయనాలు (బీసీఎం–7) ఉండవని, వీటిలో కేసిన్ ప్రొటీన్ పదార్థం అధికంగా ఉండడంవల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు చక్కని ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో నిర్ధారణ కావడంతో ఈ పాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ. విజయవాడ, వైజాగ్‌లో లీటర్ రూ.80–100 చొప్పున విక్రయిస్తుంటే, హైదరాబాద్‌లో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. ఇక వీటి పేడ ద్వారా తయారుచేసే ఎరువును కిలో రూ.7 చొప్పున, మూత్రాన్ని లీటరు రూ.75 చొప్పున స్థానికంగా విక్రయిస్తున్నారు. ఐదేళ్లలో దేశీవాళీ గోజాతి రెట్టింపు లక్ష్యం రాష్ట్రంలో 2019 పశుగణన ప్రకారం.. 7.87లక్షల దేశీ ఆవులు, 11.93 లక్షల సంకర, విదేశీ జాతి పశువులున్నాయి. రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రాతి, రెడ్సింధీ వంటి అంతరించిపోతున్న దేశీ నాటు ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సేంద్రీయ పాలు, పాల ఉత్పత్తులను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో 50 శాతం సబ్సిడీపై ఒక్కోటి రూ.30లక్షల అంచనా వ్యయంతో వైఎస్సార్ దేశవాళీ గో జాతుల పెంపకం కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే తొలివిడతలో గతేడాది 57 కేంద్రాలు ఏర్పాటుచేయగా, మలివిడతలో 52 కేంద్రాలు మంజూరు చేశారు. 27 కేంద్రాలు త్వరలో గ్రౌండింగ్ కానున్నాయి. ఒక్కో క్షేత్రంలో 20 దేశీ ఆవులు, ఓ ఆంబోతును అందిస్తుండగా, పునరుత్పత్తి ద్వారా వీటి సంతతిని ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్ర గో పుష్టి పేరిట బ్రాండింగ్ ఒక్కో ఆవు రోజుకు 6–8 లీటర్ల చొప్పున ఏడాదిలో 220 రోజులపాటు పాలు ఉత్పత్తి చేస్తాయి. పాల ఉత్పత్తి, వినియోగం క్రమేపి పెంచడం, ఉప ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడంతో పాటు ఆవుపేడ, గో మూత్రం, పంచగవ్య, జీవామృతం వంటి ఉప ఉత్పత్తులకు ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా మార్కెట్లోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్ఎస్ఓపీ) ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాలకు అదితి ఆర్గానిక్ సరి్టఫికేషన్ (బెంగళూరు) ద్వారా ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయిస్తున్నారు. ఏ–2 పాలు, పాల ఉత్పత్తుల విక్రయాల కోసం రైతుల ద్వారా ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రముఖ నగరాల్లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నారు. విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో తొలిస్టాల్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో సేంద్రీయ పాలతో పాటు నెయ్యి, పన్నీరు వంటి ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మలివిడతలో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి 50కు పైగా నగరాల్లో నెలకొల్పేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఫిష్ ఆంధ్ర రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు త్వరలో ఏర్పాటుచేస్తున్న అమూల్ అవుట్‌లెట్స్, రైతుభరోసా కేంద్రాల ద్వారా కూడా మార్కెటింగ్ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. త్వరలో ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘జైవిక్ ఖేతి’ ద్వారా ఆన్లైన్లో విక్రయించేందుకు కసరత్తు జరుగుతోంది. సేంద్రియ పాల ఉత్పత్తులకు మార్కెటింగ్ అంతరించిపోతున్న దేశీవాళీ ఆవుల సంతతిని వృద్ధి చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ దేశవాళి గో జాతుల పెంపకం కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఈ క్షేత్రాల్లోని దేశీ ఆవుల పాలు, పాల ఉత్పత్తులతోపాటు ఉప ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్ఠి పేరిట మార్కెటింగ్ చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. పాడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటుచేస్తున్నాం. తొలిస్టాల్ ఈనెలాఖరున విజయవాడలో అందుబాటులోకి రానుంది. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్, పశుసంవర్థక శాఖ -
ప్రమాదకర వస్తు రవాణాకు ట్రాకింగ్ ఉండాల్సిందే
న్యూఢిల్లీ: ప్రమాదకరమైన సరుకులను, ముడిపదార్థాలను రవాణా చేసే వాహనాలు లొకేషన్ ట్రాకింగ్ పరికరాలను అమర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ఇది తప్పనిసరిగా అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర రవాణా, రహదారుల శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ పర్మిట్ (అనుమతులు) పరిధిలోకి రాని వాహనాలు ప్రమాదకర వాయువులు, వస్తువులను రవాణా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. 2022 సెప్టెంబర్ 1 తర్వాత కేటగిరీ ఎన్2, ఎన్3 వాహనాలకు తయారీ దశలోనే పరికరాలు అమర్చాల్సి ఉంటుంది. -
పీరియడ్ ప్రొడక్టులు ఫ్రీగా అందిస్తున్న తొలి దేశం
పీరియడ్ పావర్టీ.. చాలా దేశాలను పట్టి పీడిస్తున్న సమస్య. ఆర్థికంతో ముడిపడిన విషయం కావడంతో.. చాలామంది పీరియడ్స్ ప్రొడక్టులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అక్కడిదాకా ఎందుకు.. అసలు వాటి గురించి అవగాహన, మాట్లాడేందుకు మొహమాటం ప్రదర్శించే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మహిళలకు నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించకపోతే.. ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురవుతాయి. అంతేకాదు దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపిస్తుంది. అందుకే రుతుక్రమ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి.. పీరియడ్ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తున్న తొలి ప్రపంచ దేశంగా నిలిచింది స్కాట్లాండ్. ఎడిన్బర్గ్: అవును.. యూరోపియన్ దేశం స్కాట్లాండ్ ఇవాళ్టి(ఆగష్టు 15వ తేదీ) నుంచి దేశం మొత్తం పీరియడ్ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తోంది. తద్వారా ప్రపంచంలోనే ఈ చర్యకు ఉపక్రమించిన తొలి దేశంగా నిలిచింది. ఈ మేరకు ముందస్తుగా ఆదివారమే ఓ ప్రకటన చేసింది స్కాట్లాండ్ ప్రభుత్వం. స్కాట్లాండ్ ఉచిత పీరియడ్ ప్రొడక్ట్స్ చట్టం 2020లోనే తెర మీదకు వచ్చింది. శానిటరీ ఉత్పత్తులతో పాటు టాంపన్స్, శానిటరీ ప్యాడ్స్‌ను సైతం బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 2020లో స్కాటిష్ పార్లమెంట్ ఏకగ్రీవంగా చట్టానికి ఆమోదం కూడా వేసింది. అయితే.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు రుసుము లేకుండా శానిటరీ ఉత్పత్తులు ఇప్పటికే అందించబడ్డాయి, అయితే ఇప్పుడు బిల్లు.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత మంత్రులకు ఇచ్చింది. తద్వారా దేశంలో శానిటరీ ఉత్పత్తులు ఇకపై అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నమాట. అయితే ఈ చట్టం అంత ఈజీగా ఆచరణలోకి రాలేదు. చాలా పోరాటాలే జరిగాయి. ఉచిత పీరియడ్ ఉత్పత్తులకు ప్రాప్యతను అందించడం సమానత్వం, గౌరవానికి సంబంధించింది. వాటిని మహిళలు అంగీకరించడం ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది అని సామాజిక న్యాయ కార్యదర్శి షోనా రాబిసన్ చెప్తున్నారు. జీవన వ్యయ సంక్షోభం కారణంగా ప్రజలు కష్టతరమైన ఎంపికలు చేస్తున్న సమయంలో.. ఇది(ఈ సమస్య) గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా పీరియడ్ ఉత్పత్తులకు ఎవరూ దూరంగా ఉండకూడదనే తమ ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. ఇదీ చదవండి: బుజ్జి బుల్లిపిట్ట.. కానీ, నిలువెల్లా విషమే! -
ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు
న్యూఢిల్లీ/దుబాయ్: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి. 57 ముస్లిం దేశాల సమాఖ్య ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (ఓఐసీ) ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే గాక భారత్‌లో ముస్లిం మైనారిటీల భద్రతపై జోక్యం చేసుకోవాలంటూ ఐరాసకు విజ్ఞప్తి చేసింది! ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన దేశాల జాబితాలో తాజాగా ఇండొనేసియా, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, అఫ్గానిస్తాన్ కూడా చేరాయి. దీనిపై తమ తీవ్ర అభ్యంతరాలను జకార్తాలోని భారత రాయబారికి తెలియపరిచినట్టు ఇండొనేసియా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. యూఏఈతో పాటు మక్కా గ్రాండ్ మాస్క్, మదీనా ప్రాఫెట్స్ మాస్క్ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ కూడా ఇలాంటి ప్రకటనలే చేశాయి. సౌదీ విదేశాంగ శాఖ ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండిస్తూనే, సదరు నేతలపై బీజేపీ చర్యలను స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. ఖతార్, కువైట్ ఒక అడుగు ముందుకేసి భారత్ క్షమాపణకు కూడా డిమాండ్ చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈలతో కూడిన ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక యూనియన్ అయిన గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జీసీసీ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ విద్వేష ప్రచారం భారత ఉత్పత్తులను బహిష్కరిస్తామని ఇస్లామిక్ దేశాల్లోని పలు ప్రముఖ సంస్థలు ప్రకటనలు చేస్తుండటం వివాదాన్ని మరింత జటిలంగా మార్చింది. తమ సూపర్ మార్కెట్లలో టీ పొడి తదితర భారత ఉత్పత్తుల విక్రయాలను ఆపేయాలని యోచిస్తున్నట్టు కువైట్‌లోని అల్–అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ వంటివి ఇప్పటికే ప్రకటించాయి. పలు ముస్లిం దేశాల్లో ఇప్పటికే భారత ఉత్పత్తుల బహిష్కరణ మొదలైంది! అరబ్ ప్రపంచమంతా వాటిని నిషేధించాలంటూ ట్విట్టర్ తదితర సోషల్ మాధ్యమాల్లో ట్రెండింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన నష్ట నివారణ చర్యలకు దిగింది. అటు ఓఐసీ వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండిస్తూనే, అవి కొందరు వ్యక్తుల అనాలోచిత వ్యాఖ్యలే తప్ప భారత ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేవి కానే కావని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీతో పాటు పలు ముస్లిం దేశాల్లోని భారత రాయబారులు స్థానికంగా కూడా ప్రకటనలు చేశారు. బలమైన ఆర్థిక బంధం అరబ్ ప్రపంచం నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలను శాంతింపజేసేందుకు భారత్ హుటాహుటిన రంగంలోకి దిగడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పశ్చిమాసియాలోని ఈ ముస్లిం దేశాలతో మనకున్న బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలు. సౌదీ, కువైట్, ఖతర్, ఒమన్ తదితర దేశాల్లో భారతీయులు చాలా ఎక్కువగా ఉంటారు. యూఏఈ జనాభాలోనైతే 30 శాతం దాకా భారతీయులే. మొత్తమ్మీద ఈ ముస్లిం దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల సంఖ్య ఏకంగా 87 లక్షలని అంచనా. వీరిలో కార్మికులే అత్యధికంగా ఉంటారు. తాజా వివాదం నేపథ్యంలో వారి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే మొత్తాలు (రెమిటెన్సులు) దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి. 2021లో భారత్‌కు 87 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు అందాయి. అంటే రూ.6.76 లక్షల కోట్ల పై చిలుకే! దేశ జీడీపీలో ఇది ఏకంగా 3.1 శాతం! ఇంతటి కీలకమైన ఈ రెమిటెన్సుల్లో అమెరికా తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఒమన్ దేశాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి. దాంతో రెమిటెన్సుల్లో భారత్ ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంది. కీలక గల్ఫ్ దేశాలతో కూడిన గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్(జీసీసీ)తో 2020–21లో భారత్ 87 మిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరిపింది. మన వర్తక భాగస్వాముల్లో యూఈఏ మూడో, సౌదీ నాలుగో స్థానంలో ఉన్నాయి. యూఏఈతో ఇటీవలే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమూ కుదిరింది. చదవండి: గూగుల్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా కోర్టు గల్ఫ్ దేశాలతో బంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దును స్వాగతించిన తొలి దేశాల్లో యూఏఈ ఉంది. ఇరాక్, సౌదీ, యూఏఈ తదితర గల్ఫ్ దేశాల నుంచి మనం భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధం వల్ల రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతున్నందున గల్ఫ్ దేశాలపై ఆధారపడటం మరింతగా పెరిగేలా కన్పిస్తోంది. మనతో వర్తకం ద్వారా సమకూరే ఆదాయం గల్ఫ్ దేశాలకూ కీలకమే. పైగా వాటి కార్మిక శక్తిలో భారతీయులు కీలకంగా ఉన్నారు. వీటికి తోడు చాలా గల్ఫ్ దేశాల ఆహార అవసరాలను భారతే తీరుస్తోంది. ఈ జాబితాలో బియ్యం, మాంసం, సుగంధద్రవ్యాలు, పళ్లు, కూరగాయలు, చక్కెర వంటివెన్నో ఉన్నాయి. కువైట్ ఏకంగా 90 శాతం ఆహార పదార్థాలను భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది! -
గిరి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్
సాక్షి, పాడేరు : గిరిజన వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ లక్ష్యంగా కృషిచేయాలని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. శనివారం సాయంత్రం పాడేరులోని వెలుగు కార్యాలయం సమీపంలోని వన్‌ధన్ యోజన మార్కెటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఐటీడీఏ పీవో పాడేరు డివిజన్ పరిధిలోని డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులన్నింటిని పరిశీలించారు. వెలుగు కార్యాలయం సమీపంలో విశాలమైన స్థలం ఉందన్నారు. అక్కడ మార్కెటింగ్ విస్తరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే చిరుధాన్యాల ఉత్పత్తుల ద్వారా డుంబ్రిగుడ మండలంలోని డ్వాక్రా మహిళలు సత్తా సాధించారని, అదే స్ఫూర్తితో డివిజన్లోని అన్ని మండలాల డ్వాక్రా సంఘాలు స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. రోడ్డు పక్కనే ఉన్న సుండ్రుపుట్టు వెలుగు కార్యాలయం ద్వారా అన్ని అటవీ, వ్యవసాయ గిరిజన ఉత్పత్తులన్నింటికి రిటైల్ మార్కెటింగ్ జరపాలన్నారు. వన్‌ధన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వ సాయంతో అమలవుతున్న అన్ని వ్యాపార ఉత్పత్తులను రిటైల్‌గా అమ్మకాలు జరిపి ఆ లాభాలను డ్వాక్రా సంఘాలకు వర్తింపజేయాలన్నారు. స్వయం సమృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడీ మురళి, డీపీఎం సత్యం నాయుడు, వెలుగు ఏపీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు. (చదవండి: పోలీసులకు చిక్కిన హుండీల దొంగ) -
బజ్జీల నుంచి ఐస్‌క్రీం వరకు.. అంతా కల్తీ మయం
సాక్షి,ఇచ్చోడ(అదిలాబాద్): కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా జిల్లాలో నిత్యావసరాల కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. కట్టడి చేయాల్సిన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కారం, పసుపు, నూనె, ఉప్పు, పప్పు, పాలు, పెరుగు, సబ్బులు, షాంపులు, టీ పొడి, చివరకు దేవుడి దీపాలకు ఉపయోగించే నూనెను కూడా కల్తీ చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు కల్తీ నిత్యావసరాలను పేద, మధ్య తరగతి ప్రజలకు విక్రయిస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నా జిల్లాలో పట్టించుకునే వారే కరువయ్యారు. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు కల్తీ సరుకులను ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, మిఠాయిల దుకాణాలు, బేకరీలు, ఐస్‌క్రీమ్ పార్లర్లలో కల్తీ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బ్రాండెడ్ పేరుతో విక్రయాలు... జిల్లాలోని దుకాణాల్లో విక్రయిస్తున్న నిత్యావసర సరుకుల్లో అసలు ఏదో.. నకిలీ ఏదో గుర్తు పట్టడం కష్టంగా మారుతోంది. బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకుల వ్యాపారం జరుగుతోంది. అసలును పోలిన ప్యాకింగ్, కాస్త ధర తగ్గించి విక్రయిస్తుండడంతో వినియోగదారులు నకిలీ గుర్తించలేకపోతున్నారు. నిత్యావసరాలే లక్ష్యంగా ఈ కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిత్యం రూ.కోటి వ్యాపారం.. జిల్లాలో ప్రతీరోజు నిత్యావసర సరుకుల వ్యాపారం రూ.కోటి వరకు జరుగుతోంది. ధనికుల నుంచి నిరు పేదల వరకు నిత్యం వాడే నూనె, సబ్బులు, టీ పౌడర్, పప్పు, ఉప్పు, కారం, పంచదార ఇలా 30 రకాల వస్తువులు కల్తీ అవుతున్నాయి. వీటినే వ్యాపారులు ప్రజలకు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారసంతల్లో కల్తీ వస్తువుల విక్రయాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. వ్యాపారులకు తక్కువ ధరకు వస్తుండడం, లాభం ఎక్కువగా ఉండడంతో వారు కూడా కల్తీ సరుకుల విక్రయాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. బజ్జీల నుంచి ఐస్‌క్రీం వరకు.. రోడ్ల పక్కన విక్రయించే టిఫిన్లు, మిర్చి బజీలు, పానీ పూరి, కట్లెస్తోపాటు ఐస్‌క్రీం వరకు అన్నింటిలో కల్తీ జరుగుతోంది. ప్రతీరోజు ఉదయం కొనుగోలు చేసే పాలలోనూ వ్యాపారులు పిండి, రసాయనలు కలిపి కల్తీ చేస్తున్నారు. హోటళ్లలో గడ్డ పెరుగు పేరిట కల్తీ పెరుగు విక్రయిస్తున్నారు. 25 లీటర్ల పెరుగు తయారీకి కేవలం 25 లీటర్ల వెడినీళ్లలో రెండు మాత్రలు వేసి అరగంటలో పెరుగు తయారు చేస్తున్నారు. ఐస్క్రీంలలోనూ హానికరమైన రసాయనాలు వాడుతున్నారు. జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు.. ► ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొంత కాలంగా మురిగి పోయిన, నాణ్యతలేని అల్లం, వెల్లులితో అల్లం పేస్టు తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసు ఇటీవల దాడిచేశారు. యాజామానిపై కేసు నమోదు చేశారు. ► గుడిహత్నూర్ మండలంలో కల్తీ కారం, పసుపు తయారు చేస్తున్న కేంద్రాలపై టాస్క్‌పోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. నమూనాలను సేకరించి కేసులు నమోదు చేశారు. ► ఐదు నెలల క్రితం నేరడిగొండ మడలంలోని వారసంతలో కొంత మంది వ్యాపారులు కల్తీ కారం, పసుపు, నూనె విక్రయిస్తుండగా వినియోగదారులు గుర్తించి గొడవ చేశారు. దీంతో వ్యాపారులు పారిపోయారు. ► జిల్లా కేంద్రంలో గతేడాది కల్తీ నూనె విక్రయిస్తున్న వ్యాపారీ నుంచి 4 వేల లీటర్ల నూనెను అధికారులు పట్టుకున్నారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. నాలుగు జిల్లాలకు ఒకే ఆధికారి... అహార భద్రత శాఖకు సంబంధించిన ఆధికారులు జిల్లాకు ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కలిపి ఒకే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. దీంతో కల్తీ నియంత్రణ సాధ్యం కావడం లేదు. ఇదే అదనుగా కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. నాణ్యతలేని సరుకులు ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీతో క్యాన్సర్ ముప్పు.. పసుపు, కారంలో వ్యాపారులు నికిల్, గిలాటిన్ అనే పదార్థాలు కలుపుతున్నారు. ఇవి శరీరంలో రక్తకణాలను దెబ్బతీస్తాయి. కడుపులో మంట, అల్సర్ వస్తుంది. ప్రా«థమిక దశలో చికిత్స అందకపోతే క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. కల్తీ వస్తువలకు దూరంగా ఉండాలి. – రాథోడ్ రవికుమార్, పిల్లల వైద్యనిపుణుడు చదవండి: దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా.. -
మన్నవరంలో సోలార్ ఉపకరణాల తయారీ
సాక్షి, అమరావతి: తిరుపతి జిల్లా మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలను నిజంచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్తో కలిసి 750 ఎకరాల్లో ఈ యూనిట్ ఏర్పాటుకు అంకురార్పణ చేయగా ఆయన మరణానంతరం అది అటకెక్కింది. కానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ సర్కార్ మన్నవరంలో సోలార్ వంటి పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించిన ఉపకరణాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేస్తోంది. అలాగే, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పునరుత్పాదక ఇంధన ఉపకరణాల దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు మాన్యుఫాక్చరింగ్ జోన్స్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందుకు ఇష్టమైన రాష్ట్రాలు, భాగస్వామ్య కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను ఆహ్వానిస్తూ తాజాగా టెండర్లను పిలిచింది. వీటిలో.. ఇప్పటికే ఉన్న రెండు విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాలను (బ్రౌన్‌ఫీల్డ్) సోలార్ ఉపకరణాల యూనిట్లుగా మార్చడంతోపాటు వీటికి అదనంగా మరో గ్రీన్‌ఫీల్డ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో.. బ్రౌన్‌ఫీల్డ్ విభాగంలో మన్నవరాన్ని అభివృద్ధిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. ఒక్కొక్కటి రూ.1,000 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ యూనిట్లలో రూ.400 కోట్లు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ (సీఐఎఫ్), కామన్ టెస్టింగ్ ఫెసిలిటీ (సీటీఎఫ్)లకు గ్రాంట్ రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు కానీ, భాగస్వామ్య కంపెనీలుగానీ ముందుకు రావచ్చని, ఆసక్తి కలిగిన సంస్థలు మే 4లోగా బిడ్లు దాఖలు చేయాలని కోరింది. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ.. ఇక మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రం కోసం నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి భూములను కేటాయించారు. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. కానీ, ఒక్కసారిగా థర్మల్ విద్యుత్‌కు డిమాండ్ తగ్గడంతో ఈ కేంద్రం నామమాత్రంగా ఉండిపోయింది. అనంతరం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి మన్నవరంలో భారీ ఉపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసే నిమిత్తం కేంద్రానికి పలు ప్రతిపాదనలు పంపారు. అలాగే, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నవంబర్ 11, 2021లో కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌ను కలిసి పీఎల్ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) స్కీం కింద మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఈ ఏడాది జనవరిలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసి ప్రతిపాదిత మూడు విద్యుత్ ఉపకరణ తయారీ కేంద్రాల్లో ఒకటిగా మన్నవరాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరారు. ఇక కేంద్ర ప్రభుత్వం మూడు పునరుత్పాదక విద్యుత్ పరికరాల యూనిట్లను ఏర్పాటుచేయడానికి ముందుకు వస్తుండటంతో ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుందని ఏపీఐఐసీ వీసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్కు కేటాయించారని.. దీన్ని ఏ విధంగా భాగస్వామ్య కంపెనీగా ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పరిశీలించి బిడ్డింగ్‌లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. -
‘ప్రపంచ నకిలీ మార్కెట్ల జాబితా 2021’ విడుదల.. అన్నీ నకిలీ ఉత్పత్తులే!
వాషింగ్టన్: కాపీరైట్ల ఉల్లంఘన, నకిలీ ఉత్పత్తులకు పేరొందిన మార్కెట్ల జాబితాలో భారత్‌కు చెందిన బీటుబీ ఈ కామర్స్ పోర్టల్ ఇండియమార్ట్.కామ్‌ను యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తన తాజా జాబితాలోకి చేర్చింది. భారత్ నుంచి మరో నాలుగు మార్కెట్లు.. ముంబైలోని హీరా పన్నా, ఢిల్లీలోని ట్యాంక్ రోడ్, పాలికా బజార్, కోల్‌కతాలోని కిడ్డర్‌పోర్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ‘ప్రపంచ నకిలీ మార్కెట్ల జాబితా 2021’ను యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) గురువారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 42 ఆన్లైన్, 35 భౌతిక మార్కెట్లకు ఇందులో చోటు కల్పించింది. ఇవన్నీ పెద్ద ఎత్తున నకిలీ ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్ హక్కుల ఉల్లంఘనకు వీలు కల్పిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ‘‘నకిలీ, పైరేటెడ్ ఉత్పత్తులకు (కాపీరైట్ ఉన్న వాటికి నకిలీలు) సంబంధించి అంతర్జాతీయంగా నడుస్తున్న వాణిజ్యం అమెరికా ఆవిష్కరణలు, సృజనాత్మకతను దెబ్బతీస్తోంది. అమెరికా కార్మికులకు నష్టం కలిగిస్తోంది. ఈ చట్ట విరుద్ధమైన వ్యాపారం పెరగడం వల్ల నకిలీ ఉత్పత్తుల తయారీలో పాలు పంచుకునే కార్మికులను దోచుకునే విధానాలకు దారితీస్తుంది. నకిలీ ఉత్పత్తులు వినియోగదారులు, కార్మికుల ఆరోగ్యం, భద్రతకు పెద్ద ముప్పు’’ అని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ క్యాథరిన్ టే అన్నారు. పెద్ద మొత్తంలో నకిలీలు.. యూఎస్టీఆర్ నివేదిక ప్రకారం.. ‘‘కొనుగోలుదారులు, సరఫరాదారులను అనుసంధానం చేస్తూ, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆన్లైన్ బిజినెస్ టు బిజినెస్ (బీటుబీ) మార్కెట్‌గా చెప్పుకునే ఇండి యామార్ట్లో, పెద్ద మొత్తంలో నకిలీ ఉత్పత్తులు గుర్తించాం. నకిలీ ఫార్మాస్యూటికల్, ఎలక్ట్రానిక్, వస్త్రాలు కూడా ఉన్నాయి. నకిలీ ఉత్పత్తులను ఏరిపారేయడానికి మెరుగైన విధానాలను ఇండియా మార్ట్ అమలు చేయకపోవడం పట్ల హక్కుదారులు ఆందోళన చెందుతున్నారు. విక్రయదారును నిర్ధారించుకోవడం, నకిలీ ఉత్పత్తుల విక్రయదారులకు జరిమానాలు విధించడం, సరైన పర్యవేక్షణ చేయలేకపోతున్నట్టు’’ పేర్కొంది. ముంబైలోని హీరపన్నా మార్కెట్లో నకిలీ వాచ్‌లు, పాదరక్షలు, యాక్సెసరీలు, కాస్మొటిక్స్ విక్రయమవుతున్నట్టు తెలిపింది. ‘ఫ్యాన్సీ మార్కెట్’గా పేర్కొందిన కిడ్డర్‌పోర్ (కోల్‌కతా) నకిలీ బ్రాండ్ల వస్త్రాలు, కాస్మొటిక్స్‌కు కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది. వీటితో చర్మ సంబంధిత సమస్యలు, కంటి సమస్యలు వస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఢిల్లీలోని అండర్‌గ్రౌండ్ మార్కెట్ పాలికా బజార్ 2021 జాబితాలోనూ ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇక్కడ మొబైల్ యాక్సెసరీలు, కాస్మొటిక్స్, వాచ్‌లు, కళ్లద్దాల నకిలీ ఉత్పత్తులను అమ్ముతున్నట్టు తెలిపింది. ట్యాంక్రోడ్ హోల్‌సేల్ మార్కెట్ వస్త్రాలు, పాదరక్షలు, వాచ్‌లు, హ్యాండ్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్స్, సౌందర్య ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది. -
Krishna: మూడు రోజుల పాటు జాతీయ ఆర్గానిక్ మేళా
సాక్షి, అమరావతి: సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా విజయవాడలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘4వ జాతీయ ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నారు. ఏపీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్ఎస్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ఈ మేళాను మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రారంభిస్తారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా రైతులు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో సాగవుతున్న సేంద్రియ ఆహార ఉత్పత్తులు, మొక్కలు, దుస్తులు, మెడిసిన్స్‌తో పాటు యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వం కూడా భాగస్వామి కాబోతోంది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా సంఘాలు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. అలాగే జై కిసాన్ ఆధ్వర్యంలో ఆదర్శ రైతులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పాత్రికేయులను సత్కరించనున్నారు. శనివారం మిద్దెతోటల సాగుపై వ్యవసాయ, ఉద్యాన రంగ నిపుణులతో సెమినార్ నిర్వహిస్తారు. ఆదివారం ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అనే అంశంపై డాక్టర్ రామచంద్రరావు ప్రసంగిస్తా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వహణ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, గో ఆధారి త వ్యవసాయదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామకృష్ణంరాజు, భారతీయ కిసాన్ సంఘం అధ్యక్షుడు జె.కుమారస్వామి కోరారు. -
పేస్ట్, సబ్బు, ఫేస్పౌడర్లు బంద్.. మరో నాలుగు రాష్ట్రాలకు!
ఎఫ్ఎంసీజీ (Fast-moving consumer goods) ఉత్పత్తులపై మార్జిన్ విషయమై పంపిణీదారుల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. రిటైల్ ధరలకు, బీ2బీ కంపెనీలకు వేర్వేరు రేట్లపై నిరసన.. క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది. ఇదివరకే మహారాష్ట్ర పంపిణీదారులు కొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది మరికొన్ని రాష్ట్రాలకు పాకింది. ఎఫ్ఎంసీజీ పంపిణీదారుల సెగ మరో నాలుగు రాష్ట్రాలకు పాకింది. గుజరాత్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు జనవరి 4వ తేదీ నుంచి సప్లయ్ నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల పంపిణీదారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఒక స్పష్టమైన ప్రకటన సైతం విడుదల చేసింది. హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తులైన పౌడర్, సబ్బులు, హెయిర్ ఆయిల్, షాంపూ ప్రొడక్టులతో కోల్గేట్ సంబంధిత ఉత్పత్తులు ఈ లిస్టులో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ కంపెనీలది ఒక ఆర్గనైజ్డ్‌ఛానెల్. జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్, వాల్‌మార్ట్)లాంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వాటికి ఎలాంటి పంపిణీ మార్జిన్ ఇస్తున్నారో.. తమకూ అదే మార్జిన్ ఇవ్వాలంటూ పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని పంపిణీదారులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేం లేదని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో పంపిణీదారులు హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తుల పంపిణీని నిలిపివేశారు. ఆపై జనవరి 1వ తేదీ నుంచి కోల్గేట్ కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తులను సైతం ఆపేశారు. దీంతో పేస్టుల కొరత ఏర్పడొచ్చన్న కథనాల మేరకు జనాలకు ఎగబడి కొంటున్నారు. మరోవైపు చర్చలు జరిపిన మరికంపెనీల నుంచి కూడా సరైన స్పందన లేకుండా పోయింది. సహయక నిరాకరణ చేపడతామని తాము ముందస్తు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఎఫ్ఎంసీజీ కంపెనీల నుంచి సరైన స్పందన లేదని పంపిణీదారుల అసోషియేషన్ గుర్రుగా ఉంది. ఈ తరుణంలో సోమవారం జరగబోయే చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ ఈ చర్చలు గనుక విఫలమైతే.. మరికొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేయాలన్న ఆలోచనలో All India Consumer Product Distributors Federation ఉంది. సంబంధిత వార్త: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే.. -
కోల్గేట్ పేస్ట్ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే..
Colgate Products Shortage In Maharastra: కోల్గేట్ పేస్ట్, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అక్కడ జనాలు ఎగబడిపోతున్నారు. కిరాణ.. చిల్లర దుకాణాల్లో, మార్ట్‌లలోనూ కోల్గేట్ పేస్టులు హాట్ హాట్‌గా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. త్వరలో కోల్గేట్ పేస్టుల కోరత అక్కడ ఎదురు కానుంది. కాబట్టే, అంత డిమాండ్ నడుస్తోంది. అవును.. మహారాష్ట్ర వ్యాప్తంగా కోల్గేట్ ఉత్పత్తుల పంపిణీ నిలిపివేయాలని డిస్ట్రిబ్యూటర్స్(పంపిణీదారులు) నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి పేస్ట్‌లు, ఇతర ఉత్పత్తులను దశల వారీగా పంపిణీ ఆపేయనున్నారు. ఇవాళ(జనవరి 1, 2022) నుంచి మ్యాక్స్ఫ్రెష్ పేస్ట్‌ల ఉత్పత్తిని ఆపేశారు. వారం తర్వాత వేదశక్తి పేస్ట్‌ను సైతం పంపిణీ నిలిపివేయాలని నిర్ణయించారు. జనవరి మధ్య నుంచి కోల్గేట్ టూత్ బ్రష్స్లు పంపిణీ ఆగిపోనుంది. ఇక పూర్తి ఉత్పత్తుల పంపిణీ బంద్‌ను ఫిబ్రవరి 1 నుంచి నిర్ణయించారు. కారణం.. ధరల అసమానత. Fast-moving consumer goods(ఎఫ్ఎంసీజీ) కంపెనీల ఉత్పత్తుల విషయంలో సంప్రదాయ వ్యాపారపు రేట్లకు.. ఆర్గనైజ్డ్‌ఛానెల్ అంటే జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్ లాంటి కామర్స్ బీ2బీ కంపెనీలకు మరో రేట్లు ఉంటోంది. అయితే పూణేలో జరిగిన ఒక ఉత్పత్తి లాంచ్ ఈవెంట్లో కంపెనీ తన ఉత్పత్తులను అన్ని ఛానెల్‌లలో ఒకే ధరకు విక్రయించినట్లు తెలిపింది. కానీ, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో నిజం లేదని అంటున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని చెప్తున్నారు. దీనికి నిరసనగానే పంపిణీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు చిల్లర వ్యాపారులు వ్యవస్థీకృత(ఆర్గనైజ్డ్) ఛానెల్ నుంచి స్టాక్లను ఎత్తివేయడం పెంచుకుంటూ పోతున్నారు. కోల్గేట్ స్పందన.. కోల్గేట్ పాల్మోలైవ్ ఇండియా, పంపిణీదారుల చర్యలపై స్పందించింది. పంపిణీదారులతో ఎనిమిది దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని, పారదర్శకత ఉందని, డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌తో సంప్రదింపులు జరుపుతామని, సవాళ్లను అధిగమిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు Fast-moving consumer goods అయిన మరో కంపెనీ హిందుస్థాన్ లివర్ ప్రొడక్టుల విషయంలోనూ పంపిణీదారులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే మహాలో తమ ఉత్పత్తుల సరఫరా అంతరాయం లేకుండా ఉంటుందని HUL చెబుతోంది.మరోవైపు Edelweiss సెక్యూరిటీస్ తన నివేదికలో ఈ సమస్యలు (కంపెనీ మరియు పంపిణీదారులు) ముందుగానే జరిగాయని, HUL మరియు డిస్ట్రిబ్యూటర్లు త్వరలో ఒక ఒప్పందానికి వస్తారని అంచనా వేసింది. లేఖలు రాసినా.. ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (నాలుగున్నర లక్షలమంది ఉన్నారు).. ఎఫ్ఎంసీజీ కంపెనీలతో సమావేశమై ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇదివరకే ప్రయత్నించింది. ఒకే రకమైన ధరలు, పాలసీలు ఉండాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఎఫ్ఎంసీజీల ముందు ఉంచింది(రెండు లేఖలు రాసింది). లేకుంటే జనవరి 1 నుంచి సహాయక నిరాకరణోద్యమం చేస్తామని ప్రకటించింది కూడా. ఈ క్రమంలో నెస్లే ఇండియా, ఐటీసీ, డాబర్, మారికోలు చర్చించినా.. ఓ కొలిక్కి రాలేదని సమాచారం. చదవండి: లేస్ చిప్స్ ‘ఆలు’పై పేటెంట్ రైట్స్ రద్దు.. భారత రైతులకు భారీ ఊరట -
కొత్త సంవత్సరం వచ్చేసింది.. అయితే ఇలా చేయండి!
పాత భావాలు... పారేయము. అటక మీద పాత సరుకు.. పారేయము. పంచేయము. పాత బట్టలు, బూట్లు... పారేయము. పంచేయము. అవసరం లేని ఇంటిని ఆక్రమించిన చెడిపోయిన వస్తువులు? పారేయము. పంచేయము. కొత్తవి రావాలంటే పాతవి ఖాళీ చేయాలి. కొత్త సంవత్సరం వచ్చేసింది. పాతవి పారేయండి. లేదా అవసరం ఉన్నవారికి పంచేయండి.కొత్తకు దారివ్వండి. కొత్త సంవత్సరం వస్తుంటే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనిపిస్తుంది. దానికి ముందు పాతవి పారేయాలి కదా. పాతను తీసేయాలి కదా. అక్కరలేని పాతవి అక్కర ఉన్నవారికి కనీసం పంచేయాలి కదా. ఆ పని చేయము. కొత్త సంవత్సరానికి రెడీ కావడం అంటే కొత్తగా రెడీ కావడమే. కొత్త సంవత్సరంలో తేలిగ్గా ప్రవేశించాలి. పాత లగేజ్‌తో కాదు. ఎన్ని ఉంటాయి పాతవి ఇళ్లల్లో. పేరబెట్టుకొని. అడ్డంగా. స్పేస్ ఆక్యుపై చేసి. ఇంట్లో ఏయే పాత వస్తువుల బరువు దించుకోవాలో చూద్దామా? ఆ భారీ పాత సోఫా మన ఇంటి సోఫా జన్మ సంవత్సరం ఏమోగాని దాని ఆయుష్షు తీరి చాలా రోజులై ఉంటుంది. కవర్లు మార్చి, చిరిగిన చోట ప్యాచ్ వేసి, కిరకిరమంటుంటే మానేజ్ చేస్తూ, చిల్లులు పడుంటే పైన బెడ్‌షీట్ వేస్తూ... డబ్బులు లేకపోతే సరే. ఉంటే కొత్త సోఫా తెచ్చుకోండి. ఇల్లు కొత్తదిగా కనిపించాలంటే మారే కాలంతో పాటు వచ్చే ఫర్నీచర్ తెచ్చుకోవాలి. ఖరీదైనదే అక్కర్లేదు. రోడ్‌సైడ్ కూడా మోడరన్ ఫర్నీచర్ దొరుకుతుంది. ఆ పాత సోఫాను వాచ్‌మన్‌కు ఇచ్చేయండి. దానిని పెన్నిధిగా భావించే ఏ కారు డ్రైవర్కో లేదంటే అవసరం ఉన్నవారికో ఇచ్చేయండి. ఇల్లు బరువు తగ్గుతుంది. కొత్త కళ వస్తుంది. పాత బట్టలు, పుస్తకాలు ప్రతి ఇంట్లో ఏవి ఉన్నా ఏవి లేకున్నా ఇవి ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. భర్తవి, భార్యవి, పిల్లలవి మళ్లీ పొరపాటున వేసుకోరు అని తెలిసినా ఆ బట్టలను కూరి కూరి బీరువాలలో నింపి ఉంటారు. వాటిని ఈ చలికాలంలో పేదవారికి పంచేస్తే ఎంత గుండె తేలిక. ఇల్లు తేలిక. పిల్లలు స్కూలు పుస్తకాలు కూడా దాచి ఉంటారు. పాత క్లాసులవి ఎందుకు. ఎవరికైనా ఇచ్చేయొచ్చు. ఇంట్లో ఎప్పటెప్పటివో పుస్తకాలు ఉంటాయి. వాటిలో కొన్నే విలువైనవి. కొన్ని ఒకసారి చదివితే చాలనిపించేవి. ఆ ఒకసారి చదవదగ్గ పుస్తకాలను వేరేవాళ్లకు ఇచ్చేయాలి. హ్యాపీగా ఉంటుంది. షూ ర్యాక్ క్లీన్ చేయండి ప్రతి ఇంటి షూ ర్యాక్ పాత చెప్పులు, బూట్లు దుమ్ముపట్టి పోయి ఉంటాయి. వాటిని వాడేది లేదు. అలాగని పారేసేది లేదు. పిల్లల షూస్ కూడా ఉంటాయి. వాటిని పేద పిల్లలకు ఇచ్చేస్తే సంతోషంగా వేసుకుంటారు. చెప్పులు నిరుపేదలకు ఇచ్చేస్తే వేసుకుంటారు. పాతవి పోతే కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు. ఈ న్యూ ఇయర్‌కి కొత్త చెప్పులు తొడుక్కోండి. అటక మీద ఉంటుంది రహస్యం అటక మీద తోసేస్తాం చాలా. పాత తపేలాలు, కీబోర్డులు, చెంబులు, కుర్చీలు, మిక్సీలు, గ్రైండర్లు... అవన్నీ ఎందుకు దాస్తామో తెలియదు. వాటిని ఎవరికైనా ఇస్తే సరి చేయించుకుని వాడుకుంటారు. లేదా పాత సామాన్లవాడికి వేస్తే మనకే కొద్దిగా చిల్లర వస్తుంది. అవి బూజుపట్టి వికారంగా కనిపిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పరిపూర్ణంగా తిరుగాడదు. ఇంకా బాల్కనీల్లో అక్కర్లేని సామాన్లు ఉంటాయి. వాష్ ఏరియాల్లో బోలెడన్ని పనికిరాని వస్తువులు ఉంటాయి. మిద్దె మీద కొందరు పనికి రానిదంతా దాస్తారు ఎందుకో. అన్నీ పారేయండి. పంచేయండి. కొత్త సంవత్సరం కోసం ఇంటిని మీ మనసును తేలిగ్గా చేసుకోండి. కొత్త వెలుతురు కు దారి ఇవ్వండి. అదిగో ఇవాళ మీరు ఫలానా వస్తువు ఇచ్చారన్న ఆనందంతో కొంతమంది అయినా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేలా చేయండి. సరేనా? -
Parle: బిస్కట్ ధరలు కూడా పెరిగాయ్
Parle Products hikes : ఆహారోత్పత్తుల తయారీలో ఉన్న పార్లే ప్రొడక్టŠస్ అన్ని విభాగాల్లో 5–10 శాతం ధరలు పెంచింది. చక్కెర, గోధుమలు, వంట నూనెల వ్యయం అధికం కావడం వల్లే ధరలు సవరించినట్టు కంపెనీ ప్రకటించింది. గోధుమలు, చక్కెర ధర గతేడాదితో పోలిస్తే 8–10 శాతం పెరిగిందని పార్లే ప్రొడక్టŠస్ సీనియర్ క్యాటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. వీటిపైన రూ.20 ఆపై ధర గల బిస్కట్స్, ఇతర ఉత్పత్తులు ప్రియం అయ్యాయి. రూ.20 లోపు ధర గల ఉత్పత్తుల బరువు తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చిలో సైతం కంపెనీ ఉత్పత్తుల ధరను పెంచింది. -
భారత్ దెబ్బ.. చైనాకు ఏకంగా 50వేల కోట్లు నష్టం
న్యూఢిల్లీ: భారత్‌ను దెబ్బ తీయాలని నానా ప్రయత్నాలు చేస్తున్న చైనాకు భారీ షాక్ తగలనుంది. ప్రస్తుత దీపావళి సీజన్లో చైనా వస్తువులను భారత వ్యాపారులు నిషేదించడంతో డ్రాగన్ దేశ ఎగుమతిదారులు కొన్ని వేల కోట్లు నష్టపోనున్నారు. ఈ దీపావళికి చైనా సరకులను బాయ్ కాట్ చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( సీఏఐటీ) వ్యాపారులకు పిలుపునిచ్చింది. దీంతో చైనాకు సుమారు 50 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లు సీఏఐటీ తెలిపింది. ఇటీవల గమనించిన ముఖ్యమైన మార్పుని పరిశీలిస్తే.. దేశంలోని ప్రధాన నగరాల్లోని వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని దీని ప్రభావంతో భారతీయ వస్తువులకు డిమాండ్‌ను పెరుగుతున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఇటీవల 20 ముఖ్యమైన నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఇప్పటివరకు దీపావళి వస్తువులు, బాణసంచా లేదా ఇతర వస్తువుల కోసం చైనా ఎగుమతిదారులకు భారతీయ వ్యాపారులు లేదా దిగుమతిదారులు ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదని తేలింది. తాజా పరిణామంతో భారతీయ వినియోగదారుల నేరుగా దేశీయ వస్తువుల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకి ₹2 లక్షల కోట్ల మేర ఇన్‌ఫ్లో రాబోతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా సీఏఐటీ చైనీస్ వస్తువులను బహిష్కరణకు పిలుపునిచ్చింది. చదవండి: Exam Result తప్పుగా మెసేజ్ వచ్చింది.. తొందరపడి ప్రాణం తీసుకుంది -
టిపుల్ఐటీ హైదరాబాద్‌లో కొత్త కోర్సు ప్రారంభం
రాయదుర్గం(హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ ఓ కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కాలపరిమితితో కూడిన ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్(పీడీఎం)లో ఎంటెక్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్స్, డిజైన్, ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అభ్యర్థులు అవగాహన సాధించేలా ఈ కోర్సును రూపొందించా రు. ప్రారంభ కెరీర్లో ఉన్న ఐటీ గ్రాడ్యుయే ట్లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ మెరుగైన అనుభవాన్ని సాధించేందుకు, కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్‌లు ప్రారంభించేలా అభ్యర్థులను సన్నద్ధులను చేయడంలో ఈ కోర్సు దోహదపడుతుంది. ఈ కోర్సు ఐటీసీ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టితో సాంకేతికత, డిజైన్, నిర్వహణ అం శా ల్లో సమతుల్యత కలిగి ఉందని పీడీఎం ప్రోగ్రా మ్ హెడ్ ప్రొ. రఘురెడ్డి తెలిపారు. శీతా కాల ప్రవేశాల్లో భాగంగా ఈ కోర్సులో చేరడానికి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతులు, 75 రకాల ఉత్పత్తులు గుర్తింపు
న్యూఢిల్లీ: ఎగుమతులను మరింతగా పెంచుకునే దిశగా ప్రభుత్వం, పరిశ్రమ కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గణనీయంగా ఎగుమతి చేసేందుకు అవకాశమున్న 75 ఉత్పత్తులను గుర్తించినట్లు పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ వెల్లడించింది. వీటిలో వ్యవసాయం, ఖనిజాలు తదితర తొమ్మిది రంగాలకు చెందినవి ఉన్నాయని, అమెరికా.. యూరప్ వంటి మార్కెట్లకు వీటిని ఎగుమతి చేయొచ్చని పేర్కొంది. 2027 నాటికి 750 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యాన్ని సాధించేందుకు ఇవి తోడ్పడగలవని తెలిపింది. రాబోయే 75 నెలల్లో అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి దేశాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ వివరించారు. చేపలు, మాంసం, కాటన్, ఖనిజాలు, వాహనాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఫర్నిచర్, మ్యాట్రెస్లు, బొమ్మలు మొదలైనవి గుర్తించిన ఉత్పత్తుల్లో ఉన్నాయి. ప్రస్తుతం మరింతగా ఎగుమతి చేసేందుకు అవకాశాలు ఉన్న ఈ 75 ఉత్పత్తుల వాటా .. మొత్తం ఎగుమతుల్లో 46 శాతంగా ఉంటోంది. వీటి విలువ సుమారు 127 బిలియన్ డాలర్లుగా ఉంది. చదవండి: యుద్ధ నౌకల తయారీకి, నావల్ గ్రూప్‌తో జీఆర్ఎస్ఈ జట్టు -
ఎలక్ట్రానిక్స్‌కు డ్రాగన్ షాక్!
న్యూఢిల్లీ: చైనా కారణంగా మరో విడత దేశీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా వైరస్ నియంత్రణకు చైనా కఠినంగా వ్యవహరిస్తుండడంతో కీలకమైన విడిభాగాల సరఫరాలో కొరతకు కారణమవుతోంది. దీంతో దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీదారులు, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు 10–30 శాతం మేర ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో చైనా ఆంక్షలు, నిషేధాజ్ఞలు విధించింది. దేశీయంగా ముఖ్యమైన పండుగుల సీజన్లోనే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విక్రయాలు భారీగా నమోదవుతుంటాయి. ఏడాది మొత్తం మీద 35–45 శాతం విక్రయాలు పండుగల సమయాల్లోనే కొనసాగుతుంటాయి. ఇదే సమయంలో కీలక విడిభాగాల కొరత నెలకొనడం ఈ ఏడాదికి సంబంధించి పరిశ్రమ వృద్ధి అంచనాలకు గండికొట్టేలా ఉంది. తాజా పరిణామాలతో రవాణా వ్యయాలు గడిచిన మూడు నెలల్లో రెట్టింపయ్యాయని.. ఉత్పత్తుల ధరలను పెంచక తప్పదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మనదేశంలో తయారయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి 60–70 శాతం విడిభాగాలు చైనా నుంచే సరఫరా అవుతుంటాయి. పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌ల మూత ఆగస్ట్ 21న సాంఘై పుడోంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేశారు. కార్మికులు కొంత మంది కరోనా వైరస్ బారిన పడడంతో గ్రౌండ్ హ్యాండ్లింగ్ పనులను నిర్వహిస్తున్న షాంఘై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ కరోనా క్వారంటైన్ పాలసీని ప్రకటించింది. అలాగే, చైనా నింగ్బో జోషువాన్ పోర్ట్‌ను సైతం మూసేశారు. చైనా సరఫరాలకు (ఎగుమతులు) షాంఘై, నింగ్బో రెండూ ముఖ్యమైనవి. కరోనా విషయంలో ఉపేక్షించేది లేదన్న చైనా విధానానికి వీటిని నిదర్శనంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. చైనాలో సుమారు 15 పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు కేవలం 30–70 శాతం సిబ్బందితో పరిమిత కార్యకలాపాలే నిర్వహిస్తుండడం గమనార్హం. వీటిల్లో ముఖ్యమైన బీజింగ్, షియామెన్ కూడా ఉన్నాయి. కరోనా కఠిన విధానాల ఫలితంగా ఇతర పోర్ట్‌లు, ఎయిర్పోర్ట్లైన హాంగ్‌కాంగ్, షెన్జెన్లోనూ రద్దీ పెరిగిపోయింది. ఫలితంగా ఎగుమతులకు రోజుల పాటు వేచి ఉండాల్సి రావడం పరిస్థితికి అద్దం పడుతోంది. స్మార్ట్ఫోన్ల విక్రయాలపైనా ప్రభావం స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ల అంచనాల్లోనూ కోతలు విధించుకోవాల్సిన పరిస్థితులే నెలకొన్నాయి. చైనాలోని, ఓడరేవులు, విమానాశ్రయాల్లో ఆంక్షల వల్ల డిమాండ్‌కు సరిపడా చిప్సెట్లు, ఇతర కీలక విడిభాగాల సరఫరా సాధ్యపడడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్ఆర్క్ అనే సంస్థ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు 7 శాతం తగ్గొచ్చని తాజాగా అంచనా వేసింది. ఐడీసీ అనే సంస్థ ఈ ఏడాది మొత్తం మీద స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లలో వృద్ధి ఉండకపోవచ్చని.. ఉన్నా ఒక్క శాతం వరకే ఉంటుందన్న తాజా అంచనాలను ప్రకటించింది. వాస్తవానికి 16% మేర షిప్మెంట్లు పెరుగుతాయని ఇదే సంస్థ లోగడ అంచనా వేయడం గమనార్హం. తాజా పరిణామాలతో ఫోన్ల ధరలను పెంచాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కొరత కారణంగా పండుగల సీజన్లో విక్రయాలపైనా ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నాయి. ‘‘2021లో 15.2–15.5 కోట్ల స్మార్ట్ఫోన్ల విక్రయాలను అంచనా వేస్తున్నాం. సరఫరాలో సమస్యల వల్ల ఈ ఏడాదికి సంబంధించి కంపెనీల అంచనాలు 5–15 శాతం మేర తగ్గొచ్చు’’ అని టెక్ఆర్క్ సంస్థ వ్యవస్థాపకుడు ఫైసల్కవూస తెలిపారు. ధరలు 3–5% వరకు పెరగొచ్చని చెప్పారు. చైనా నుంచి భారత్‌కు విడిభాగాల సరఫరాకు పట్టే సమయం రెట్టింపై 50–60 రోజులకు చేరుకుంది. పండుగల సీజన్లో భారీ విక్రయాల ఆకాంక్షలపై తాజా పరిస్థితులు నీళ్లు చల్లుతున్నాయి. -
ఆపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సోమవారం ఆపిల్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఆపిల్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. కొనుగోలుదారులకు ఆపిల్ డేస్ సేల్ జూలై 17 శనివారం వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11, ఇతర ఆపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అమెజాన్ అందించనుంది. ఆపిల్ డేస్ సేల్‌లో ఐఫోన్ 12 బేసిక్ ఫోన్‌ను రూ. 9,000 తగ్గింపుతో రూ .70,900 వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. వినియోగదారులు ఇతర ఆపిల్ ఉత్పత్తులపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే లావాదేవీలపై సుమారు రూ. 6,000 అదనపు తగ్గింపును పొందవచ్చును. ఆపిల్ ఐప్యాడ్ మినీ, మాక్‌బుక్ ప్రో, ఇతర ఉత్పత్తులపై ఆఫర్లను కూడా తీసుకురాబోతోంది. ఆపిల్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ ఎక్స్ మాక్స్ నుంచి ఐఫోన్ 6 ఎస్ వరకు ఐఫోన్ మోడళ్లపై డిస్కౌంట్ పొందవచ్చునని అమెజాన్ పేర్కొంది. ఆపిల్ ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 8, ఐఫోన్ 7, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ ఇతర ఆపిల్ మోడళ్లకు ఆన్లైన్లో తగ్గింపు ధరలకు అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ తన కస్టమర్లకు ‘ప్రైమ్ డే సేల్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమ్ డే సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు సేల్ జరగనుంది. -
Amazon:ఆ సైట్లో కొన్న ఎలక్ట్రానిక్ వస్తువులు మండిపోతున్నాయట
న్యూయార్క్ : ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ డాట్ కామ్‌లో కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులు కాగడాల్లా మారుతున్నాయి. ఉన్నట్టుండి పొగలు కక్కుతూ కాలి బూడిదవుతున్నాయి. గత రెండేళ్లుగా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అమెరికన్లు చెబుతున్నారు. అమెజాన్ బ్రాండ్ వస్తువులు అకస్మాత్తుగా కాలిపోతుండటంపై అమెరికాలోని కన్సుమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిటీ (CPSC) చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు CPSC ఇచ్చిన నివేదికల ఆధారంగా సీఎన్ఎన్ పలు కథనాలు ప్రచురించింది. కాలిపోతున్నవి ఇవే వరల్డ్‌లోనే నంబర్ వన్ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ కేటగిరిలలో కొనుగోలు చేసిన సర్జ్ ప్రొటెక్టర్, ఫోన్ ఛార్జింగ్ కార్డ్స్, పాటియో హీటర్, బ్యాటరీ ఛార్జర్, వాయిస్ యాక్టివేటెడ్ మైక్రో ఓవెన్లుపై CPSCకి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఆయా వస్తువులను వాడుతున్నప్పుడు ఉన్నట్టుండి మధ్యలోనే కాలిపోతున్నట్టు వినయోగదారులు పేర్కొన్నారు. ఈ వస్తువలన్నీ అమెజాన్ బ్రాండ్‌కి సంబంధించినే కావడం గమనార్హం. బాధితులు అమెజాన్ సైట్ నుంచి 2018లో సర్జ్ ప్రొటెక్టర్‌ను ఓ వ్యక్తి కొనుగోలు చేయగా..అది ఇంట్లో కాలిపోయింది. ఫలితంగా ఇంటికి డ్యామేజ్ జగిరింది. దీనిపై CPSCని ఆశ్రయించగా 1500 డాలర్ల నష్టపరిహారం ఆ బాధితుడు సీఎన్ఎన్ పేర్కొంది. ఆ తర్వాత మరో 40 మంది ఇదే ప్రొడక్టు కొని నష్టపోయినట్టు రివ్యూ ఇచ్చారు. దీంతో 2019లో తన సైట్ నుంచి ఆ ప్రొడక్టును అమెజాన్ తొలగించినట్టు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. స్పందించని అమెజాన్ CPSC విచారణపై స్పందించేందుకు అమెజాన్ నిరాకరించింది. తమ కస్టమర్ల భద్రత తమకు ఎంతో ముఖ్యమని, నాణ్యత విషయంలో రాజీపడేది లేదంటూ అమెజాన్ డాట్‌కామ్ చెబుతోంది. సీఎన్ఎన్ రిపోర్టులో పేర్కొన్నట్టు ఏ వస్తువును సేఫ్టీ రీజన్స్‌తో తమ సైట్ నుంచి తొలగించలేదంది. -
రెండు గంటల్లో డెలివరీ: బిగ్ బజార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న బిగ్ బజార్ ఇన్స్టాంట్ హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన రెండు గంటల్లోనే ఉత్పత్తులను కస్టమర్ ఇంటికి చేరుస్తారు. ఫ్యాషన్, ఫుడ్, ఎఫ్ఎంసీజీ, హోం విభాగాల్లో ఉత్పత్తులను సమీపంలోని బిగ్ బజార్ స్టోర్ నుంచి సరఫరా చేస్తారు. మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా వినియోగదార్లు కనీసం రూ.500 విలువ చేసే వస్తువులను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ విలువ రూ.1,000 దాటితే డెలివరీ చార్జీలు ఉచితం. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా ఇతర నగరాలకూ విస్తరిస్తామని ఫ్యూచర్ గ్రూప్ ఫుడ్, ఎఫ్ఎంసీజీ ప్రెసిడెంట్ కమల్‌దీప్ సింగ్ తెలిపారు. 45 రోజుల్లో 21 నగరాలకు, ఆరు నెలల్లో అన్ని బిగ్ బజార్ స్టోర్ల నుంచి ఈ సేవలు ఉంటాయని చెప్పారు. కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ ప్రమోట్ చేస్తున్న బిగ్ బజార్ దేశవ్యాప్తంగా 150 నగరాలు, పట్టణాల్లో 285 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఫ్యూచర్ రిటైల్ ఖాతాలో హైపర్సిటీ, ఫుడ్‌హాల్, ఎఫ్‌బీబీ, ఫుడ్ బజార్, ఈజీడే క్లబ్, హెరిటేజ్ ఫ్రెష్ సైతం ఉన్నాయి. -
2024కల్లా 36 వేల కోట్ల లక్ష్యం!
సాక్షి, హైదరాబాద్: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో దేశ రక్షణ రంగంలో కొత్త శకం మొదలైంది. ‘మేడిన్ ఇండియా’ రక్షణ ఉత్పత్తులు విదేశాలకు విస్తరించనున్నాయి.. ఆకాశ్ ఎగుమతులు సరే.. కానీ ఎగుమతుల జాబితాలో తర్వాత ఉన్నవేమిటి? ఏయే దేశాలు భారత రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నాయి? ఆత్మనిర్భర్ భారత్ సాకారంలో డీఆర్డీవో భాగస్వామ్యమెంత..? తదితర ఆసక్తికర ప్రశ్నలన్నింటికీ సమాధానాలను డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ప్రశ్న: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఏయే దేశాలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి? జవాబు: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులు దేశ రక్షణ రంగ చరిత్రలో ఓ కీలక మలుపనే చెప్పాలి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని భారత్ ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి.. రక్షణ పరిశ్రమ రంగానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చే పరిణామం. వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి చాలా ఆసియా దేశాలు ఆకాశ్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యూఏఈ కూడా ఆసక్తి కనబరిచింది. ఆకాశ్ ఎగుమతులు మొదలైతే అందులోని ఉప వ్యవస్థల గురించి కూడా అంతర్జాతీయ సమాజానికి తెలుస్తుంది. తద్వారా ఆ ఉప వ్యవస్థల అమ్మకాలు, నిర్వహణల్లోనూ దేశానికి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఎగుమతులు ఎప్పుడు ప్రారంభం కావచ్చు? వీటి విలువపై మీ అంచనా? మిలటరీ ఉత్పత్తులను వీలైనంత వేగంగా ఎగుమతి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఆయా దేశాల అవసరాల ఆధారంగా ఎగుమతి ప్రక్రియ ప్రారంభిస్తాం.. 2024 నాటికల్లా భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.36,566 కోట్ల వరకు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో డీఆర్డీవో భాగస్వామ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. ఆకాశ్ తర్వాత ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఇతర క్షిపణి, రక్షణ వ్యవస్థలేవి? తీరప్రాంత నిఘా వ్యవస్థపై చాలాదేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ధ్వని కంటే వేగంగా ప్రయాణించగల క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, అత్యాధునిక ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి వ్యవస్థల్లోని పలు రకాలపై, సోనార్లు, యుద్ధభూమిలో ఉపయోగించే రాడార్ల కోసం దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్య, ఆసియా దేశాలు సమాచారం కోరుతున్నాయి. కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి కూడా.. కొన్ని దేశాలు భారత్ సొంతంగా తయారు చేసుకున్న దృశ్య కాంతికి ఆవల కూడా పని చేయగల ‘అస్త్ర’కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. వేర్వేరు యుద్ధ విమానాలతో అనుసంధానించగలగడం ఈ అస్త్ర ప్రత్యేకత.. క్షిపణి వ్యవస్థల ఎగుమతుల కారణంగా భారత్‌కు వ్యూహాత్మకంగా ఏమైనా నష్టం జరుగుతుందా? అలాంటిదేమీ ఉండదు.. ఎందుకంటే ఈ క్షిపణి వ్యవస్థల్లోని సాంకేతిక పరిజ్ఞానాలు అన్నింటినీ డీఆర్డీవో శాస్త్రవేత్తలు సున్నా నుంచి మొదలుపెట్టి పూర్తి చేశారు కాబట్టి. ఈ టెక్నాలజీలను ఎలా ఒక రూపంలోకి చేర్చాలన్నది మనకు మాత్రమే తెలిసిన విషయం.. కమాండ్ కంట్రోల్ సిస్టమ్, సాఫ్ట్వేర్, అల్గారిథమ్స్ వంటివి పూర్తిగా దేశీయంగానే తయారు చేసుకున్నాం.. ఈ కారణంగానే అతితక్కువ ఖర్చుతో, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రక్షణ ఉత్పత్తులను తయారు చేయగలుగుతున్నాం.. మన టెక్నాలజీలు అంతర్జాతీయ మార్కెట్లోకి చేరితే మనకు లాభమే తప్ప నష్టమంటూ ఏదీ లేదు. భారత్ తన మిత్ర దేశాలకు మాత్రమే రక్షణ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తుండటం వల్ల భవిష్యత్తులో ఆయా దేశాలతో సహకారానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.. ఆత్మనిర్భర్ భారత్ కోసం డీఆర్డీవో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ఎప్పటివరకు పూర్తవుతాయి? ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో రక్షణ రంగం ఓ కీలకమైన అంశం. రానున్న ఐదు, పదేళ్లలో భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించనుంది. కీలకమైన టెక్నాలజీలను దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. రాడార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రులు, టోర్పెడోలు, సమాచార వ్యవస్థల విషయంలో మనం ఇప్పటికే స్వావలంబన సాధించాం. భారత్‌కు తనదైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. ట్యాంకులను కూడా సొంతంగా తయారు చేసుకోగలుగుతున్నాం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ఎంత శాతం రక్షణ అవసరాలను తీర్చుకోగలుగుతున్నాం? రక్షణ అవసరాలకు సంబంధించి 2020 డిసెంబర్లో దిగుమతులపై నిషేధం విధించారు. మన అవసరాల్లో చాలావాటిని దేశీయ పారిశ్రామిక వర్గాల ద్వారా తీర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న ఆరు, ఏడేళ్లలో ఇది అవుతుంది. రక్షణ అవసరాలు ఎంతమేరకు తగ్గించుకోగలుగుతామన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే దేశీయంగా తయారుచేసుకుంటున్న పలు వ్యవస్థలు త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. డిజైన్, డెవలప్మెంట్తో పాటు తయారీ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఐదేళ్లలో పూర్తిస్థాయి స్వదేశీకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నాం. 2020 నాటికి మన రక్షణ అవసరాల్లో దిగుమతుల శాతమెంత? అవి ఏయే రంగాల్లో ఉన్నాయి? దిగుమతులపై ఆధారపడటం క్రమేపీ తగ్గుతోంది. ఇప్పటికే సుమారు 4,700 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిల్లో చాలావాటిని సొంతంగా తయారు చేసుకునే ప్రక్రియలో డీఆర్డీవో ఉంది. రాడార్లు, సోనార్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, టొర్పెడోలు, మందుపాతరల వంటి వాటిని దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. హోవిట్జర్ ఏటీఏజీఎస్, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించల క్షిపణుల్లోనూ భారత్ తన సామర్థ్యాన్ని చాటుకుంది. కార్బైన్ల పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి. ఈ కార్బైన్లతోపాటు అనేక ఇతర చిన్న ఆయుధాలను కూడా దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. -
శాంసంగ్ మేకిన్ ఇండియా ఉత్పత్తులు
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియాలోని పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్అండ్డీ) మీద దృష్టి సారించాలని, కొత్త ఉత్పత్తులను చేపట్టాలని దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ నిర్ణయించింది. మేకిన్ ఇండియా ఉత్పత్తులనే అభివృద్ధి చేస్తామని.. ఇక్కడి నుంచి ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామని.. ఇందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేశామని శాంసంగ్ తెలిపింది. (ఫేస్బుక్ ఇండియా లాభం రెట్టింపు) దేశంలో 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్త డిజిటల్ కార్యక్రమాలను బుధవారం ఆవిష్కరించింది. ఇందులో భాగంగా పవరింగ్ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ఆర్అండ్డీ స్థానిక టెక్ టాలెంట్ పీపుల్, స్టార్టప్స్‌లను ఎంపిక చేసుకుంటుంది. 5జీ, ఏఐ, ఐఓటీ, క్లౌడ్ టెక్నాలజీల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామని శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కెన్ కాంగ్ తెలిపారు. విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో టెక్ ఇన్నోవేషన్‌ను మరింత పరిపుష్టం చేసేందుకు ఓపెన్ ఇన్నోవేషన్‌ను మరింత విస్తరిస్తామని చెప్పారు. డిసెంబర్ ముగింపుతో సామ్‌సంగ్‌కు ఇండియాలో పాతికేళ్లు పూర్తవుతాయి. ప్రస్తుతం శాంసంగ్‌కు దేశంలో మొబైల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కేంద్రాలు 2, ఆర్అండ్డీ సెంటర్లు 5, డిజైన్ సెంటర్ ఒకటి ఉంది. సుమారు 2 లక్షల ఔట్లెట్లు, 70 వేల మంది ఉద్యోగులున్నారు. -
వాట్సాప్‌లో ‘షాపింగ్ బటన్’.. ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ మరో కీలక ఫీచర్‌ను లాంచ్ చేసింది.ఇటీవల పేమెంట్ సేవలను విజయవంతంగా ప్రారంభించిన వాట్సాప్ తాజాగా ఈ-కామర్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తూ యూజర్లకు శుభవార్త చెప్పింది. తమ ప్లాట్‌ఫాంపై షాపింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు ప్రత్యేకంగా షాపింగ్ బటన్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించింది. బిజినెస్ అకౌంట్స్ ఉన్న వాట్సాప్ యూజర్లు కేటలాగ్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని ఓపెన్ చేసి నచ్చితే వెంటనే వాట్సప్‌లోనే కొనుగోలుచేయవచ్చని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఉత్పత్తులను కనుగొనడం సులభతరం చేస్తుందనీ, అలాగే అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుందని పేర్కొంది. ఇప్పటివరకు బిజినెస్ ప్రొపైల్ ఓపెన్ చేసి తమకు నచ్చిన వస్తువు కేటలాగ్ లిస్ట్‌లో చెక్ చేసుకోవాల్సి వచ్చేంది. తాజాగా షాపింగ్ బటన్‌ను విడుదల చేసింది. ఈ షాపింగ్ బటన్ వాయిస్ కాల్ బటన్ స్థానంలో ఉంటుంది. అయితే వినియోగదారులు వాయిస్ లేదా వీడియో కాల్‌ను ఎంచుకోవడానికి కాల్ బటన్‌ను నొక్కాలి. తద్వారా వ్యాపారులు తమ సేల్స్ పెంచుకోవడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ సమాచారం ప్రకారం ప్రస్తుతం రోజూ వాట్సప్ బిజినెస్ అకౌంట్లో 17.5 కోట్ల మంది మెసేజెస్ పంపిస్తున్నారు. దేశంలో 30 లక్షల మందితో సహా, ప్రతీ నెలలో 4 కోట్ల మంది బిజినెస్ క్యాటలాగ్ చూస్తున్నారు. -
ఆ ఘటనలు పునరావృతం కాకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, సన్నద్ధతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, ఎట్టి పరిస్ధితుల్లో ఏ సమస్యలు రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ పంట కూడా ఆర్బీకే నుంచి ప్రొక్యూర్ చేయాలని, పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా రావాలని పేర్కొన్నారు. (చదవండి: ఎస్పీ బాలు మృతికి సీఎం జగన్ సంతాపం) ‘‘ప్రతీ ఆర్బీకే వద్ద పంటలన కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై పెద్ద డిస్ప్లే బోర్డు ఉండాలి. భవిష్యత్తులో ఆర్బీకేలు ధాన్యం సేకరణకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రాలుగా నిలవాలి. రైతులు ఎక్కడ ఏ పంట వేయకూడదో అది పక్కగా చూసుకోవాలి. దీన్ని సీరియస్‌గా ఎన్ఫోర్స్ చేయాలి. ఆ మేరకు వారికి సలహా ఇవ్వాలి. ఏ పంట వేస్తే లాభం? దేనికి ధర ఉంది? వంటి అన్ని అంశాలపై రైతులకు చెప్పడంతో పాటు, ఆ తర్వాత వారికి అంతే డబ్బు వచ్చే మార్గం చూపాలి. పంటలు పండిన తర్వాత మార్కెటింగ్ ఇబ్బందులు రాకుండా చూడాలి. వీటన్నింటినీ జాయింట్ కలెక్టర్లు చూడాలి. వారు రైతులకు అన్ని విషయాలు క్లియర్‌గా చెప్పాలి. వాటర్ రియాలిటీ, మార్కెట్ రియాలిటీ ఆధారంగా జేసీలు రైతులకు అవగాహన కల్పించాలి. ఆ తర్వాత పంటల అమ్మకాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందని చెప్పాలి. ఈ ప్రక్రియలో స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. సార్టెక్స్ వెరైటీని ప్రమోట్ చేయాలి. బ్రొకెన్ రైస్‌ను కూడా వాల్యూ ఎడిషన్ చేయాలని’’ సీఎం సూచించారు. కాటన్ కొనుగోళ్ళలో స్కామ్‌లు జరగకూడదని, కొత్తగా మనం ఎలా కొనుగోలు చేస్తున్నాం అనేది ఈసారి చూపాలని సీఎం అన్నారు. పత్తి రైతులకు న్యాయం జరగాలని, మన ప్రభుత్వ హయాంలో రెప్యుటేషన్ పోగొట్టుకోకూడదని సీఎం స్పష్టం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు పెంచి రైతుకు మరింత మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందో చూసి ఏర్పాటు చేయాలని కోరారు. ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ మీద మరింత ఫోకస్ పెట్టడంతో పాటు బహిరంగ మార్కెట్లో ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారుల వివరాల డేటాను ఆ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా రైతుల ఉత్పత్తులకు మరింత మార్కెట్ సదుపాయం కలిగేలా చేసి రైతులకు మేలు చేయాలన్నారు. ఈ సీజన్లో కూడా దాదాపు రూ.3300 కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు జరగాలని, ఆ మేరకు ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేశామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు పెంచాలి
సాక్షి, ఢిల్లీ : దేశంలో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులతో పోలిస్తే ఎగుమతి సగటున 1 శాతం కూడా ఉండటం లేదని వాణిజ్యానికి సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో వెల్లడైంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించాల్సిన తక్షణ అవసరం ఉన్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అందుకోసం తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ స్థాయీ సంఘం 154వ నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నివేదికను స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయి రెడ్డి.. రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడుకు అందించారు. రైతులు యాంటిబయాటిక్స్‌ను నియంత్రిత రీతిలో వినియోగించేందుకు అవసరమైన ఎక్స్టెన్షన్ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ సిఫార్సు చేసింది. మత్స్య ఉత్పాదనల నాణ్యత, దిగుబడులే లక్ష్యంగా పరిశోధన, అభివృద్ధి చేపట్టాల్సిందిగా పేర్కొంది. దేశంలో ఏటా 800 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక పొగాకు సాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. పొగాకు ఉత్పాదనల ద్వారా ఏటా (2018-19 గణాంకాల ప్రకారం) సుమారు 6 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడం జరుగుతోంది. కానీ పొగాకు సాగుకు మాత్రం తగినంత ప్రోత్సాహం అందడం లేదని కమిటీ అభిప్రాయపడింది. (ఆర్బీఐ పేరుతో కాలయాపన : సుప్రీం ఆగ్రహం) పొగాకు సాగులో ఎఫ్‌డీఐని అనుమతించాలి 2017లో ప్రకటించిన ఎఫ్‌డీఏ విధానం ద్వారా కాఫీ, టీ, రబ్బర్, యాలకులు వంటి ప్లాంటేషన్ పంటల సాగులో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు. కానీ పొగాకు పంటకు ఆ వెసులుబాటు లేదు. కాబట్టి పొగాకు సాగులో కూడా ఎఫ్‌డీఐకి అనుమతించాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే ఎఫ్‌డీఐ ద్వారా సాగు చేసే పొగాకును ఆక్షన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా మాత్రమే మార్కెట్ చేయాలన్న నిబంధన ఉండాలని సిఫార్సుల్లో పేర్కొంది. సిగరెట్ల అమ్మకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ 1 శాతం సుంకం విధించి ఆ మొత్తాన్ని పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం వినియోగించాలన్న టుబాకో బోర్డు సూచనను కమిటీ ప్రశంసిస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవలసిందిగా వాణిజ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. దీని వలన మార్కెట్ సంక్షోభ పరిస్థితులలో రైతుల ఉత్పత్తులకు న్యాయమైన ధర లభిస్తుందని ఆయన చెప్పారు. (నా జీవితంలో మర్చిపోలేని ఘటన..) -
ఫెయిర్‌లో ఏముంది?
నలుపు.. తెలుపు.. రంగులే.. కాని మనిషి పుట్టుకనే పరిహసిస్తూ సైన్స్‌నే సవాలు చేశాయి జీవితాలను తలకిందులు చేశాయి.. సమాజాలను శాసించాయి ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ అనే ఒక్క మాట చాలదా? పైనవన్నీ నిజం అని నమ్మడానికి! తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు కాకుండా నలుపు,తెలుపులే మన సక్సెస్‌ను నిర్దేశిస్తాయి, నిర్ధారిస్తాయి అని చెబితే మెదడు వంచి ‘తెలుపు’ను ఒంటబట్టించుకునే ప్రయత్నం మొదలుపెట్టాం. ఈ క్రీమ్ మార్కెట్లో (కాస్మొటిక్స్‌కు సంబంధించి) 70 శాతం వాటాను కలిగి ఉందంటే నలుపును చీదరించుకునే ప్రక్రియ అమలవుతున్నట్టే కదా! వ్యాపారం క్రియేట్ చేసిన వివక్ష కాదిది. మన బలహీనత వ్యాపారంగా మారిన విజయం. చాలా యేళ్ల తర్వాత అమెరికాలో అడుగున ఉన్న బ్లాక్ డిస్క్రిమినేషన్ బయటకు కనపడింది జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో. ఉలిక్కిపడ్డ ఆ సమాజపు ఆవేశం ఉవ్వెత్తున లేచింది ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ కదలికగా. రంగుపేరు మీద జరిగే మానసిక హత్యలు మన దగ్గరా నిత్యకృత్యమే. సాహిత్యం, సినిమాలు, ప్రకటనలు తెలుపు మీద మోహాన్ని రగిలించాయి. ఆ రంగుకు డిమాండ్ సృష్టించాయి. మిల్కీ, వీటిష్, డస్కీ, బ్లాక్ బ్యూటీ అంటూ విశేషణాలు చేరుస్తూ కలర్‌ను ఒక అబ్సెషన్‌గా మార్చాయి. (ఇక నుంచి ‘గ్లో అండ్ లవ్లీ’) అందుకే పురిట్లో పిల్ల ఒంటి రంగు ఇంట్లో చర్చనీయాంశమవుతుంది. కొత్త ప్రాణి వచ్చిందన్న ఆనందం కన్నా! ఆ క్షణం నుంచే ఆ వర్ణాన్ని తూచే కట్నం కాసులను జమ చేసేందుకు సిద్ధపడతారు తల్లిదండ్రులు. మ్యాట్రిమోనీలూ రిక్వైర్డ్ కాలమ్‌లో ‘కాంప్లెక్షన్’ను చేరుస్తాయి.ఫ్రెండ్షిప్ చేయడానికి, ఆటల్లో గెలుపుకి, కాంపిటీటివ్ స్పిరిట్‌కి, ఉద్యోగానికి, బస్సులో సీట్ ఆఫర్ చేయడానికి, ప్రేమ చిగురించడానికి.. అన్నిటికీ కలరే ఇంపార్టెంట్ అవుతుంది. కలర్ లేకపోవడం కాంప్లికేషన్‌గా కనపడుతుంది. (నల్లజాతి లేడీ జస్టిస్) ఇవన్నీ మానసికంగా మనుషులను చంపేసేవే. అందం ఆత్మ విశ్వాసాన్ని ఇనుమడింప చేస్తుంది అన్నది ఎంత అబద్ధమో తెలుపే అందం అన్న అభిప్రాయమూ అంతే అసంబద్ధమైనది. కమర్షియల్ యాడ్స్లలో చూపించినట్టు తెల్లగా ఉన్న అమ్మాయి ప్రపంచాన్ని జయించదు. అంతెందుకు బ్యూటీనే క్వాలిటీ అయిన గ్లామర్ వరల్డ్‌లోనూ తెలుపు ప్రధాన అర్హత కాదు. ఇందుకు స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, నందితా దాస్, బిపాసా బసు వంటి ఉత్తరాది తారలతోపాటు దక్షిణాది తరాలు ఎంతో మంది ఉదాహరణలు. వీళ్లంతా నటనతోనే అభిమాన తారలయ్యారు. అలాగని వర్ణ వివక్షకు గురికాలేదని కాదు. కాని తెలుపును ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మలచుకోలేదు. ‘బీయింగ్ మై సెల్ఫ్’గానే నిలబడ్డారు. దాన్నే సెల్ఫ్కాన్ఫిడెన్స్గా డెవలప్ చేసుకున్నారు. ‘డస్కీ అనే మాట నాకు విశేషణంగా మారిపోయింది. డస్కీ చైల్డ్, డస్కీ మోడల్, డస్కీ హీరోయిన్ ఇలా. దాన్ని నేనెప్పుడూ పట్టించుకోలేదు’ అంటుంది బిపాసా. నందితా దాస్‌దీ ఇలాంటి అనుభవమే. ‘మీడియా డార్క్ అండ్ డస్కీగానే వర్ణిస్తుంది. ఆ వర్ణనలకు నేనంత విలువివ్వను. కాలేజ్‌గర్ల్స్ చాలామంది నన్ను అడిగారు.. నల్లగా ఉన్నా అంత కాన్ఫిడెంట్‌గా ఎలా ఉండగలుగుతున్నారు అని. అంటే ఫెయిర్ కలర్ అనేది వాళ్లనెలా కుంగదీస్తుందో అర్థమవుతోంది కదా’ అని చెప్తుంది నందితా. ఈ వివక్ష మీద 2009లోనే ఒక క్యాంపెయిన్ మొదలైంది ‘బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్’ పేరుతో.దానికి నందితా దాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు 2013 నుంచి. ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా ఎందుకు? మన దగ్గరా బ్లాక్ లైవ్స్ మ్యాటరే. తెల్లరంగును ప్రమోట్ చేసుకుంటూ ఫెయిర్‌నెస్ క్రీములు అమ్ముకుంటున్న కంపెనీలకు ఆ సెగ తాకింది. ఆమెరికా బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌తో స్ఫూర్తి పొందిన 22 ఏళ్ల ముంబై యువతి చందనా హిరణ్ ‘చేంజ్ డాట్ ఓఆర్జీ’లో ఓ పిటిషన్ పెట్టింది. ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ క్రీమ్ పేరు మార్చాలని. ఆ పిటిషన్‌ను సపోర్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా 15 వేలమంది సంతకాలు చేశారు. సోషల్‌మీడియాలోనూ నిరసన వెల్లువెత్తింది. దాంతో రెండువారాల్లోనే హిందుస్తాన్ యూనిలీవర్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. తన ప్రొడక్ట్‌లోని ‘ఫెయిర్’ను తొలగిస్తున్నట్టు. అంతకుముందే జాన్సన్ అండ్ జాన్సన్ తన ఫెయిర్ నెస్ క్రీములనే ఉపసంహరించేసుకుంది. రంగు అభిజాత్యం నాగరికత వెల్లివిరిసిన నాటి నుంచీ ఉంది. అది జెనెటికల్ డిఫెక్ట్‌గా మారింది. కాబట్టి ‘ఫెయిర్ అండ్ లవ్లీ’లోంచి ఫెయిర్‌ను తీసేసినంత మాత్రాన ఒరిగేదేముంది? ఫెయిర్‌నెస్ క్రీముల పుట్టుపూర్వపు సంగతి వదిలేసినా అవి పుట్టినప్పటి నుంచి వాటి వ్యాపార ప్రకటనలు నాటిన తెలుపు రంగు బీజాలైతే మహా వృక్షాలై నిలబడ్డాయి కదా మన మెదళ్లలో! గ్లో అనో, గ్లో అండ్ లవ్లీ అనో.. ఇంకోటో ఆ వృక్షాలను కూకటి వేళ్లతో పెకిలించగలదా? అందానికి రంగుకి, ఆత్మవిశ్వాసానికి అందానికి ఏమాత్రం సంబంధం లేదని తన వ్యాపార ప్రకటనలతో ప్రచారం చేయగలదా!! ఇమామి మూల్యం చెల్లించింది ఇది 2015 నాటి ముచ్చట. ‘ఇమామి’ వాళ్ల బ్యూటీ ప్రొడక్ట్ ‘ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్’ క్రీమ్ వాడాలనే ఆశ పుట్టింది ఢిల్లీకి చెందిన నిఖిల్ జైన్ అనే యువకుడికి. ‘మా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్ వాడితే కేవలం నాలుగు వారాల్లో మీ మొహం రంగు తేలి.. కాంతులీనుతుంది’ అనే వ్యాపార ప్రకటనలు చూసి చూసి. క్రమం తప్పకుండా నాలుగు వారాలు మొహానికి అప్లయ్ చేసుకున్నాడు. అంతకు ముందు ఎలా ఉందో వాడిన తర్వాతా అలాగే ఉంది తన మొహం. పిసరంతైనా తెల్లబడలేదు. మెరుపూ లేదు. డీలా పడిపోయాడు గురుడు. ఆత్మన్యూనత పెరిగింది. తమ్ముడి పరిస్థితి చూసి చలించిపోయాడు లా స్టూడెంట్ అయిన అన్న పారస్ జైన్. ఢిల్లీ స్టేట్ కన్సూ్యమర్ కోర్టులో కేసు వేశాడు ఇమామీ పెద్ద అబద్ధాల కోరు అంటూ. ‘అబద్ధాల కోరును కాదు’ అని నిరూపించుకోలేకపోయింది ఇమామి. దాంతో ఆ కంపెనీ నిఖిల్ జైన్‌కు పదివేల రూపాయల పరిహారం చెల్లించాలని కన్సూ్యమర్ కోర్ట్ తీర్పునిచ్చింది. అబద్ధాలతో నిఖిల్ జైన్‌ను మభ్య పెట్టి, అతని మానసిక ఆందోళనకు ఆ కంపెనీ ప్రకటన కారణమైందున. పదిహేను లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అక్కడితో ఆగలేదు.. అలాంటి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ప్రకటన మీద నిషేధమూ పెట్టింది. -
ఈ తరం, ఈ చైతన్యం కావాలి
మార్కులు, ర్యాంకుల పరుగులో ఉన్న యువత సమాజ మార్పు గురించి ఆలోచిస్తున్నదా? సామాజిక చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నదా? పాలనా విధానాలలో పాలు పంచుకుని వాటిని ప్రభావితం చేసేలా ముందుకు వస్తున్నదా? అలా ముందుకు వచ్చే యువతను ఎంపిక చేసే ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం ‘యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివ్ సిటిజన్‌షిప్’ (వై.ఎల్.సి.ఏ)కు తెలుగు తేజం, హైదరాబాద్ విద్యార్థిని ఇష్వి మథాయి ఎంపిక కావడం ప్రశంసకు కారణమవుతోంది. ఈ ప్రోగ్రామ్‌కు శశి థరూర్ (పార్లమెంట్ సభ్యులు), బైజయంత్ పండా (మాజీ పార్లమెంట్ సభ్యులు), ప్రొ. మైఖేల్ వాల్టన్ (హార్వర్డ్ యూనివర్సిటీ) సలహాదారులుగా ఉంటారు. హైదరాబాద్‌లోని బాచుపల్లి ఓక్రిడ్జ్‌లో క్లాస్ 11 చదువుతున్న ఇష్వి చదువులో టాపర్‌గా నిలవడమే కాక స్విమ్మింగ్‌లో జాతీయస్థాయి ప్రతిభ చూపుతోంది. తాజాగా ఆమె వై.ఎల్.సి.ఏ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. లాక్డౌన్ సమయంలో ఆమె ప్రదర్శించిన సామాజిక చైతన్యం, ప్రతిస్పందనకు ఈ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల ప్రధాన నగరాల నుంచి విద్యార్థినీ విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌లో ఎంపిక కోసం పాల్గొనగా అనేక అంచెల వడపోతల తర్వాత ఇష్వికి ఈ గౌరవం దక్కింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించాక ఇష్వి వలస కార్మికుల సహాయానికి తన వంతు ప్రయత్నం చేయాలనుకుంది. అందుకు తనకు ప్రావీణ్యం ఉన్న బేకింగ్‌ను ఒక మార్గంగా ఎంచుకుంది. తాను చేసిన బేకింగ్ ఉత్పత్తులతో తన రెసిడెన్షియల్ కమ్యూనిటీలో నిధులు సేకరించింది. వాటిని వలస కార్మికులకు ఆహార పదార్థాలు అందించడానికి, వాకింగ్ కిట్లకు, వైద్య సహాయానికి వినియోగించింది. అయితే వై.ఎల్.సి.ఏ ప్రోగ్రామ్ నిర్వాహకులకు ఇష్విలో ఆకర్షించిన అంశం ఆమె తన బేకింగ్ ఉత్పత్తులను సామాజిక సందేశానికి కూడా ఉపయోగించడం. ఇటీవలి ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ ఉద్యమానికి మద్దతుగా ఆ సందేశాన్ని ఇమిడ్చిన బేకింగ్ ఉత్పత్తులను ఇష్వి చేయడం నిర్వాహకులు ప్రశంసనీయంగా భావించారు. వై.ఎల్.సి.ఏ ప్రోగ్రామ్ రెండు నెలల పాటు సాగుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో అలవర్చుకోవాల్సిన దృష్టికోణం గురించి, సామాజిక–రాజకీయ నిర్మాణం పట్ల ఉండవలసిన విమర్శనాలోచన గురించి, నాయకత్వ శక్తిని సమకూర్చుకోవడం గురించి, సామర్థ్యాలు దీర్ఘకాలం నిలిచేలా నైపుణ్యాలు పెంచుకోవడం గురించి దర్శనీయత ఇస్తారు. ఇంత విశేష కార్యక్రమంలో స్థానం పొందడం ఇష్వి ప్రతిభకు ఒక మెచ్చుతునక. ఇష్వి ద్వారా సహాయం పొందుతున్న వలస కార్మికులు -
డిజిటల్ ప్రకటనల్లోకి ‘డిజిటల్ కైట్స్’
సాక్షి, హైదరాబాద్ : డిజిటల్ ప్రకటన రంగంలోకి కొత్త సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ‘డిజిటల్ కైట్స్’ పేరుతో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టమ్‌లోకి అడుగు పెట్టింది. తద్వారా వెబ్సైట్లకు, బ్రాండ్లు లేదా ఏజెన్సీలకు తన సేవలను ఉచితంగా అందించనుంది. వివిధ బ్రాండ్లు, ప్రచురుణకర్తలు ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఒక కొత్త ఎకో సిస్టంను సృష్టిస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ప్లాట్‌పాంలో ముఖ్యంగా గోప్యతకు బలమైన ప్రాధాన్యత ఇచ్చినట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆడియన్స్ ప్రైమ్ , ఆడియన్స్ ప్లే అనే రెండు ప్రధాన ఉత్పత్తులను డిజిటల్ కైట్స్ లాంచ్ చేసింది. 'ఆఫ్‌లైన్ కస్టమర్లు,' లేదా 'మల్టీ-ఛానల్ మార్కెటింగ్' తమ లక్ష్యమని పేర్కొంది. ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, రీటైల్ అండ్ కన్సూయర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ట్రావెల్ అండ్ టూరిజం తదితర రంగాలకు తన సేవలను అందించనుంది. డిజిటల్‌కైట్స్‌పై పనిచేయడం ప్రారంభించినప్పుడు, డిజిటల్ అడ్వర్టైజింగ్ ఎకోసిస్టంలో చాలామంది వాటాదారులను గమనించామనీ, ఆయా కంపెనీలు, వాటి రోడ్‌బ్లాక్ సమస్యలను పరిష్కరించడం ద్వారా వారి వ్యాపారాలకు గణనీమైన విలువను ఎలా అందించాలో పరిశీలించామని డిజిటల్ కైట్స్ సీఈవో దినేష్ గంటి తెలిపారు. గూగుల్ , ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వాల్స్ వెలుపల బ్రాండ్లు తమ మొదటి పార్టీ సీఆర్ఎం డేటాను ప్రభావితం చేయలేవు. ఇందుకు చాలా సాంకేతిక పరిష్కారాలు ఉన్నప్పటికీ, బహిరంగ గుర్తింపు తీర్మానం లేకపోవడం వల్ల అవి భారతదేశంలో పనిచేయవని తెలిపిన ఆయన తాము అతిపెద్ద యూజర్ రిజల్యూషన్ పరిష్కారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ టెక్నాలజీని డిజిటల్ కైట్స్ ఉత్పత్తులతో మిళితం చేసి, తద్వారా బ్రాండ్లు, ప్రచురణకర్తలు అన్ని మార్కెటింగ్ ఛానెళ్లలో మొదటిసారిగా కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. చాలా పెద్ద ప్రచురణకర్త సంస్థలతో మాట్లాడుతున్నామనీ అతి త్వరలో కొన్ని పెద్ద భాగస్వామ్య ప్రకటనలు చేయబోతున్నామని డిజిటల్ కైట్స్ సీవోవో రఘు తెలిపారు. తమకు హైదరాబాద్, ముంబై , న్యూఢిల్లీలో కార్యాలయాలు ఉన్నాయన్నారు. యాభై మంది ఉద్యోగులు వివిధ ఉత్పత్తులు, కార్యక్రమాలపై పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే తమకు వే 2 ఆన్లైన్ ఇంటరాక్టివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మద్దతు ఉన్నట్టు ప్రకటించారు. ఆడియన్స్ ప్లే : యాప్స్, వెబ్సైట్లకు ఉద్దేశించింది. ఇది ఆయా ఆఫ్‌లైన్. ఆన్లైన్ యూజర్ టచ్ పాయింట్స్, సెగ్మెంట్ నుండి డేటాను ఏకీకృతం చేయడానికి, వారి ప్రేక్షకులను బ్రాండ్లతో మెరుగుపరచడానికి, ప్రైవేట్‌గా భాగస్వామ్యానికి అనుమతిస్తుంది. ఆడియన్స్ ప్రైమ్ : బ్రాండ్లు, ఏజెన్సీలకుద్దేశించింది. మొదటి సీఆర్ఎం డేటాను ఆన్‌బోర్డ్ చేయడానికి, ప్రఖ్యాత ప్రచురణకర్తల నుండి సముచిత ప్రేక్షకుల విభాగాలతో పాటు ప్రోగ్రామాటిక్, సోషల్, ఇమెయిల్ మొదలైన బహుళ ఛానెల్‌లలో అనుమతికి వీలు కల్పిస్తుంది. ఇవి రెండూ డిజిటల్ కైట్స్ యూజర్ రిజల్యూషన్ టెక్నాలజీ ఆధారితంగా పనిచేస్తాయి. ఇవి ఆఫ్‌లైన్, ఆన్లైన్ ఐడెంటిఫైయర్‌లైన ఇమెయిల్, కుకీలు, అడ్వర్టైజింగ్ ఐడిలు, మొబైల్ నంబర్లు మొదలైన వాటి ద్వారా వినియోగదారులను గుర్తిస్తుంది. అందువల్ల బ్రాండ్లు, ప్రచురణకర్తలు తమ వినియోగదారులతో వివిధ డివైస్‌లు, ఛానెళ్లలో కమ్యూనికేట్ చేయడానికి అనుమతి లభిస్తుంది. -
పతంజలి భారీ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై : ఎఫ్ఎంసీజీ సెక్టార్లో దూసుకొచ్చిన దేశీయ సంస్థ బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ పలు ఉత్పత్తులపై పరిమిత కాలానికి ప్రత్యేక డిస్కౌంట్లను, కాంబో ఆఫర్లను అందిస్తోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా విక్రయాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో వినియోగ దారులను ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా భారీగా విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా అయిదారు రకాల ఆహారోత్పత్తులు, ఆయిల్స్, డ్రింక్స్, ఆటా, ఓట్స్, రడీ టూ ఈట్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా మూడు వస్తువులు కొంటే మూడు వస్తులను ఉచితంగా అందిస్తోంది. అలాగే కొన్ని ఆహార ఉత్పతులను ధరలను సగానికిపైగా తగ్గించి వినియోదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇంకా షాంపూలు, ఫేస్‌వాష్, ఇతర సౌందర్య సాధనాలపై కాంబో ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకునేందుకు, వినియోగదారులకు భారీగా ఆకట్టుకునేందుకు తొలిసారిగా పతంజలి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా రసాయన రహిత, సహజసిద్ద ఉత్పత్తులంటూ దేశీయ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో ప్రవేశించిన పతంజలి ఆయుర్వేద సంస్థ అతి తక్కువ కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్ సాధించిన భారతీయ రంగ సంస్థగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ బాలకృష్ణ సీఈవోగా హరిద్వార్ కేంద్రంగా నడుస్తున్న పతంజలి లాభాలను ఎన్డీయే సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ దెబ్బ కొట్టింది. అలాగే విదేశీ కంపెనీలు పోటీగా నిలవడంతో అమ్మకాల్లో, లాభాల్లోనూ వెనకబడింది. సీఏఆర్ఈ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018లో వెయ్యికోట్ల రూపాయలు కోల్పోయింది. కంపెనీ 2016-17లో రూ.9030 కోట్లు అమ్మకాలు సాధించగా.. 2017-18లో రూ.8135కోట్లకు పడిపోయింది. -
గ్రీన్ ప్రొడక్ట్స్ రూ.18 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్, నీటి బిల్లుల ఆదా, నిర్వహణ వ్యయం తగ్గింపు, ఆరోగ్యకరమైన వాతావరణ వంటి కారణాలతో హరిత భవనాలకు డిమాండ్ పెరిగింది. గతంలో పర్యావరణహితమైన ఇల్లు కొనాలంటే కాలుష్యం, జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలకో లేక శివారు ప్రాంతాలకో వెళ్లాల్సిన పరిస్థితి. కానీ, నేడు నగరంలో, హాట్‌సిటీలో ఉంటూ కూడా హరిత భవనాలు కావాలంటున్నారు కొనుగోలుదారులు. దీంతో నిర్మాణ సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన గృహాలనే కాదు.. ఐజీబీసీ గుర్తింపు పొందిన నిర్మాణ సామాగ్రిని, ఉత్పత్తులను వినియోగిస్తున్నాయి. విపణిలోకి 350 రకాల ఉత్పత్తులు.. నివాసాలకు, వాణిజ్య, కార్యాలయాల సముదాయాలకూ హరిత భవనాల గుర్తింపునివ్వటం మనకు తెలిసిందే. కానీ, దేశంలో తొలిసారిగా నిర్మాణ సామగ్రి ఉత్పత్తులకూ గుర్తింపు ప్రారంభించింది సీఐఐ. దీంతో కొనుగోలుదారులకు గృహాల్లోనే కాకుండా నిర్మాణ సామగ్రిలోనూ గ్రీన్ ప్రొ సర్టిఫికెట్ పొందిన ఉత్పత్తులను ఎంపిక చేసుకునే వీలుందన్నమాట. ఇప్పటివరకు 350 ఉత్పత్తులు గ్రీన్ సర్టిఫికెట్ పొందాయి. ఏసీసీ సిమెంట్, నిప్పన్ పెయింట్స్, సెయింట్ గోబియన్ గ్లాస్, అసాహి ఇండియన్ గ్లాస్, గోద్రెజ్ ఫర్నిచర్, విశాఖ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. దేశంలో గ్రీన్ బిల్డింగ్స్ ఉత్పత్తుల మార్కెట్ రూ.18 లక్షల కోట్లుగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 1044 మిలియన్ చ.అ.ల్లో: ప్రస్తుతం దేశంలో 4,396 ప్రాజెక్ట్‌లు ఐజీబీసీ గుర్తింపు కోసం నమోదు కాగా.. ఇందులో 1,258 ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందాయి. ఇవి 1,044.66 మిలియన్ చ.అ.ల్లో విస్తరించి ఉన్నాయి. తెలంగాణలో 296 ప్రాజెక్ట్‌లు నమోదు కాగా 106 ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందాయి. ఇవి 30 మిలియన్ చ.అ.ల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 57 ప్రాజెక్ట్‌లు నమోదు కాగా.. 25 ప్రాజెక్ట్‌లు గుర్తింపు పొందాయి. ఇవి 4 మిలియన్ చ.అ.ల్లో ఉన్నాయి. నిర్మాణ వ్యయం ఎక్కువే, కానీ.. సాధారణ భవనాలతో పోలిస్తే హరిత భవనాల నిర్మాణానికి 3–5 శాతం ధర ఎక్కువ అవుతుంది. కానీ, భవనంలోని విద్యుత్, నీటి వంటి నిర్వహణ వ్యయం ఆదాతో దీని 2–3 ఏళ్లలో తిరిగి పొందవచ్చని ఐజీబీసీ హై దరాబాద్ చాప్టర్ సీ శేఖర్ రెడ్డి చెప్పారు. గ్రీన్ బిల్డింగ్స్‌లో 30–40 శాతం విద్యుత్, 20–30 శాతం నీరు అదా అవుతుందన్నారు. -
సండే బజార్లో కొనద్దురో !
బెంగళూరు : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు నగర ప్రజలు చవకగా వస్తాయని బెంగళూరు నగరంలోని సండే బజార్లో కొనుగోలు చేస్తున్న సెల్ఫోన్లు వారి మెడకు చుట్టుకుంటున్నాయి. తక్కువ ధరకే బ్రాండెడ్ మొబైళ్లు లభిస్తాయన్న ఆశతో సండేబజార్‌లో మొబైళ్లు కొనుగోలు చేసిన వారు పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైన్‌స్నాచింగ్‌లతో పాటు మొబైళ్ల చోరీలపై కూడా రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండడంతో దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. చోరీ, దోపిడీ ఘటనల్లో దోచుకున్న మొబైళ్లను దొంగలు సండేబజార్‌లో మొబైల్ దుకాణాలకు విక్రయిస్తుండడాన్ని పసిగట్టిన పోలీసులు కొద్ది రోజుల క్రితం సండేబజార్‌లోని మొబైళ్ల దుకాణాలపై మెరుపుదాడులు చేసి వందల సంఖ్యలో మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల యజమానుల వెల్లడించిన సమాచారంతో దుకాణాలకు మొబైళ్లు విక్రయించిన నిందితులు, దుకాణాల నుంచి మొబైళ్లు కొనుగోలు చేసిన వ్యక్తుల కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు.. రెండు ముఠాలు రెండు ముఠాలు సండేబజార్‌లోని దుకాణాలకు మొబైళ్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు పసిగట్టారు. అందులో ఒక ముఠా రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులను, పాదచారులను మారణాయుధాలతో బెదిరించి ఖరీదైన మొబైళ్లు దోచుకొని సండేబజార్‌లో విక్రయిస్తారు. రెండవ ముఠా పాదచారులను నుంచి మొబైళ్లు లాక్కెళ్లడం అదేవిధంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, చిత్రమందిరాలు, మార్కెట్లు తదితర రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైళ్లు చోరీ చేసి సండేబజార్‌లో విక్రయిస్తారు. కాగా రెండు ముఠాల్లోని సభ్యులు పాతికేళ్లలోపు యువకులే ఉంటుండడం గమనార్హం. జల్సాలకు అలవాటు పడే యువకులు చోరీల బాటపడుతున్నారని పోలీసులు తెలుపుతున్నారు.. నకిలీ పత్రాలు సృష్టించి చోరీ చేసిన మొబైళ్లను నిందితులు అతితక్కువ ధరలకు సండేబజార్‌లోని దుకాణాలకు విక్రయిస్తారు. అనంతరం దుకాణాల యజమానులు మొబైళ్లకు నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తుండగా మరికొంత మంది ఐఎంఈఐ నంబర్లు మార్చి విక్రయిస్తున్నారు. ఈ రెండు విధానాల్లో కాకుండా మరికొంతమంది ఫోన్లలోని విడిభాగాలను విక్రయించి సొమ్ము చేసుకుంటారు. కొనుగోలు చేసిన వ్యక్తుల కోసం వేట... దుకాణాల నుంచి వందల సంఖ్యలో మొబైళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు మొబైళ్లు విక్రయించిన నిందితులతో పాటు కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు కూడా చెప్పాలంటూ దుకాణాల యజమానులకు నోటీసులు అందించారు. దీంతో పాటు ఇప్పటివరకు ఐఈఎంఐ నంబర్లు మార్చేసి విక్రయించిన మొబైళ్ల సమాచారం కూడా అందించాలంటూ నోటీసులు సూచించారు. దీంతో తక్కువ ధరలకే బ్రాండెడ్ మొబైళ్లు వస్తున్నాయంటూ ఎగబడి కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. తక్కువ ధరలకే మొబైళ్లు వస్తున్నాయనే ఆశతో ప్రజలు ఎవరు కూడా సండేబజార్‌లో మొబైళ్లు కొనుగోలు చేయరాదంటూ పోలీసులు సూచిస్తున్నారు. ప్రత్యేక వెబ్సైట్... చోరీ, దోపిడీ ఘటనల్లో పోగొట్టుకున్న మొబైల్, ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్ తదితర వస్తువులను తిరిగి పొందడానికి పోలీసులు ‘ఈ లాస్ట్ అండ్ ఫౌండ్’ పేరుతో ప్రత్యేక మొబైల్యాప్ రూపొందించారు.ఈ యాప్ ద్వారా స్టేషన్‌కు వెళ్లకుండానే తాము పోగొట్టుకున్న వస్తువుల వివరాలను యాప్‌లో పొందుపరచి ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు సుమారు 300 వస్తువులు వాటి యజమానులకు అప్పగించినట్లు పోలీసులు తెలుపుతున్నారు. -
గూగుల్ షాపింగ్ పోర్టల్ వచ్చేసింది
భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్‌నకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో గూగుల్ కూడా ఆన్లైన్ షాపింగ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలో ‘గూగుల్ షాపింగ్’ పేరుతో కొత్త షాపింగ్ ప్లాట్‌ఫాంను గురువారం (డిసెంబరు 13) లాంచ్ చేసింది.. ఈ రోజు నుంచే గూగుల్ షాపింగ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని గూగుల్ ప్రకటించింది. ఇందులో దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు సహా వివిధ విభాగాలలో ఉత్పత్తులను వికయిస్తుంది. వివిధ కంపెనీల, బ్రాండ్ల ఉత్పత్తులను గూగుల్ షాపింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. వినియోగదారులు సరైన ఉత్పత్తులు, విక్రయించే రిటైలర్ల సమాచారాన్ని తెలుసుకోవడంలోసహాయపడేలా గూగుల్ షాపింగ్ పోర్టల్ల్ను డిజైన్ చేసినట్టు తెలిపింది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ భాషలోలో ధరలు, బెస్ట్‌డీల్స్ తదితర సమాచారాన్నితెలుసుకునే వీలు కల్పించామని పేర్కొంది. లక్షలాదిమంది ఆన్లైన్ వినియోగదారులకు ఉత్పత్తులను విక్రయించుకునేందుకు రీటైల్ వ్యాపారులకు ఇది గొప్ప అవకాశమని గూగుల్ షాపింగ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ సురోజిత్ చటర్జీ బ్లాగ్ పోస్ట్ లో రాశారు. అలాగే డెస్క్‌టాప్‌తోపాటు ఎంట్రీ లెవల్ మొబైల్స్‌లో కూడా పనిచేసేలా ఒక ప్రోగ్రెసివ్ వెబ్‌యాప్‌ను త్వరలోనే లాంచ్ చేస్తామన్నారు. కాగా దేశంలో 400 మిలియన్లమంది ఇంటర్నెట్ యూజర్లు ఉండగా వీరిలో కేవలం మూడవ వంతు వినియోగదారులు అసలు ఆన్లైన్ షాపింగ్ చేయడం లేదనిగూగుల్ పేర్కొంది. తమ గూగుల్ షాపింగ్ ద్వారా ఆన్లైన్ షాపింగ్‌కు ప్రోత్సాహం అందించడంతోపాటు చిన్నమధ్యతరహా వ్యాపారస్తులను ఆన్లైన్ బిజినెస్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
ప్రకృతి సాగు.. విదేశాలకేగు
మన దేశంలో పండిన వ్యవసాయ ఉత్పత్తుల్లో, క్రిమి సంహారక మందుల అవశేషాలు ఉంటున్నాయనే నెపంతో, అమెరికా వంటి దేశాలు, మన ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదు. ఈ క్రమంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయం చేయాలని రైతులకు సలహా ఇచ్చారు. ఆ సలహాలను పాటించిన కొరిశపాడు మండల రైతులు కొందరు, తాము పండించిన ఉత్పత్తులను యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. హాని లేని ఆహారోత్పత్తులకు విదేశాల్లో గిరాకీ ఉండటంతో ఆదిశగా అడుగులేస్తూ లాభాలు గడిస్తున్నారు. మేదరమెట్ల: ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారోత్పత్తులు, మనిషికి హాని చేయవు, మంచి చేస్తాయి. అదే విధంగా నేలకు మేలు చేస్తాయి. ప్రస్తుతం రైతులు విచ్చలవిడిగా వాడుతున్న క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువుల వల్ల, భవిష్యత్తులో నేల ఆరోగ్యంతో పాటు మానవాళి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అలా పాడవకుండా ఉండడం కోసం, భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించాలంటే, ప్రకృతి వ్యవసాయమే ప్రత్యామ్నాయం అని వ్యవసాయాధికారులు చెపుతున్నారు. పురుగు మందుల వల్ల కలిగే నష్టాలు.. పంటలపై విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాలతో, ఆహారోత్పత్తుల వ్యయం, పెరిగి రైతులకు సేద్యం మోయలేని భారంగా మారుతోంది. మరో వైపు భూసారం క్షీణిస్తుంది. ఉత్పాదకత పడిపోతుంది. ఆహార పదార్థాల్లో రసాయనాలు, పురుగుమందుల అవశేషాలు అధిక మొత్తంలో నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారు. హాని లేని ఉత్పత్తులకు యూరప్‌లో గిరాకీ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు యూరప్ దేశాల్లో ఎక్కువ గిరాకీ ఉందని రైతులు వరి, మినుము, కొర్రలు, వరిగ, కంది, శనగ, మునగ, కరివేపాకు, బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరలతో పాటు యాపిల్‌రేగి, జామ పంటలను పూర్తిగా గోఆధారిత ప్రకృతి సేద్యం పద్ధతుల్లో పండించడం వల్ల ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించడం జరిగిందని వ్యవసాయాధికారి తెలిపారు. సేంద్రియ పద్ధతిలో సాగు బాగుండడంతో, గత ఏడాది కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో 1100 ఎకరాల్లో ప్రకృతి వ్యసాయం చేశారు. ఈ సంవత్సరం 2 వేల ఎకరాల్లో ఈ పద్ధతి ద్వారా పలు రకాల పంటలను పండించేందుకు రైతులను సిద్ధం చేస్తున్నట్లు ఏఓ ప్రసాదరావు చెప్తున్నారు. షేడ్నెట్లలో ఉత్పత్తులకు గిరాకీ..... ఎనిమిది అడుగుల ఎత్తు కలిగిన షేడ్నెట్లలో పండించిన ప్రకృతి ఉత్పత్తులకు విదేశీమార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. వీటిలో మిరప, ఉల్లి పంటలకు గిరాకీ అధికంగా ఉందని, పంటను కోసిన 24 గంటల లోపు విమానసర్వీసులు ఉన్న ప్రదేశాలకు తరలిస్తే వాటిని యురోపియన్ దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుంటుంది. కనుక రైతులు షేడ్నెట్లలో పంటలను పండించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారి సూచిస్తున్నారు.అంతే కాకుండా మునగ ఆకును కూరగానూ, ఔషధాల తయారీలోనూ ఎక్కువగా వినియోగించడం వల్ల మునగ ఆకును కూడా విదేశాలకు తరలించేందుకు రైతులు ముందుకు రావాలని, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన అల్లం, పసుపుకు కూడా మంచి గిరాకీ ఉండటంతో రైతులు విదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను ప్రకృతి సాగు ద్వారా పండించాలని వ్యవసాయాధికారి సూచిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో లాభదాయకం.. పురుగుమందులు, రసాయన ఎరువులు విచ్చలవిడిగా వినియోగించి వ్యవసాయం చేయడం వల్ల పండించే పంట పూర్తిగా నాశిరకంగానూ, విషతుల్యమైన ఆహార పదార్థాలుగా ఉండేందుకు అవకాశం ఉంది. కానీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలను పండించడం ద్వారా రైతులకు అధిక దిగుబడులతో పాటు పంట ఉత్పత్తులను వినియోగించుకునేవారికి ఆరోగ్యం లబిస్తుంది. అందుచేత ఒక ఎకరా 20 సెంట్ల భూమిలో జామతోటను వేయడం జరిగింది. కేవలం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగు చేయడం జరుగుతుంది.కామిరెడ్డి, రైతు బొడ్డువానిపాలెం