ఫ్లీ అఫైర్
ట్రీ హగ్గర్స్ క్లబ్ నిర్వహించే న్యూ కాన్సెప్ట్ ఫెయిర్ ఇది. ట్యాలెంటెడ్, క్రియేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు చక్కని వేదిక. ప్రదర్శనే కాదు... వాటిని అమ్ముకొనే సౌకర్యం కూడా కల్పిస్తుంది ఈ అ‘ఫెయిర్’. ఉత్పత్తిదారులు, చిల్లర వ్యాపారులు, కొనుగోలుదారులను ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం ఇది. ఫర్నీషింగ్ ప్రొడక్ట్స్ నుంచి బ్యాగ్స్, యాక్ససరీస్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు గేమ్స్... అన్నీ ఇక్కడే. ఆదివారం ఉదయం 10.30 గంటలకు బంజారాహిల్స్ లామకాన్‌లో.