మెరిసే చర్మం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఏం కలుపుతున్నారో తెలుసా? | Do You Know What Is Added To Beauty Products For Glowing Skin | Sakshi
Sakshi News home page

మెరిసే చర్మం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఏం కలుపుతున్నారో తెలుసా?

Published Sun, Nov 19 2023 12:02 PM | Last Updated on Sun, Nov 19 2023 12:25 PM

Do You Know What Is Added To Beauty Products For Glowing Skin - Sakshi

ఆరోగ్య వంతమైన మెరిసే చర్మం కోసం ఏ రకమైన ప్రోడక్ట్స్‌ బాగా పనిచేస్తాయనే దానిపై చాలా మంది ఫోకస్‌ చేస్తున్న నేపథ్యంలో పరిశోధకులు కూడా అన్వేషణ ప్రారంభించారు. ఆ డిమాండ్‌ను గ్రహించిన సౌత్‌ కొరియా కాస్మెటిక్‌ తయారీ సంస్థలు బోలెడన్నీ స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌తో మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. ఆ ఉత్పత్తులకు అవి వాడుతున్న పదార్థం ఏంటో తెలుసా..? 

నత్త స్రావాలు. ముఖ్యంగా క్రిప్టోంఫాలస్‌ ఆస్పెర్సా జాతికి చెందిన నత్తల స్రావాలు. అవి బురద లాంటి జిగట పదార్థాన్ని స్రవిస్తుంటాయి. దాంతోనే తమ స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి సదరు సంస్థలు. ఆ స్రావం ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడంలో అద్భుతంగా పనిచేస్తుందట. అందుకే దీనిని ఫేస్‌ మాస్క్, సీరమ్, మాయిశ్చరైజర్లలో వాడుతున్నారు. పురాతన గ్రీకులు కూడా చర్మంపై వృద్ధాప్య ఛాయల నివారణకు నత్త స్రవించే ఈ బురద లాంటి జిగటనే ఉపయోగించేవారట.
 

వీటి తోపాటు గ్లాస్‌ స్కిన్‌ కోసం దక్షిణ కొరియా ఒక టేబుల్‌ స్పూన్‌ కోకో బటర్‌కి రెండు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌ని కలిపి.. పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ని ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకుని.. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ఫేస్‌ వాష్‌ చేసుకోవాలి. అంతే ముఖం చాలా కాంతిమంతంగా ఉంటుంది. 

(చదవండి: పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement