glowing skin
-
దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..
బాలీవుడ్ ప్రసిద్ధ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో వేలాది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవలే పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక గ్లామర్ పరంగా దీపికాకి సాటిలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మేని ఛాయ, కురులు కాంతిలీనుతూ ఉంటాయి. చూడగానే ముచ్చటగొలిపే తీరైన శరీరాకృతి చూస్తే..ఇంతలా ఎలా మెయింటెయిన్ చేస్తుందా? అనిపిస్తుంది కదూ. ఇంతకీ ఆమె బ్యూటీ రహస్యం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు దీన్ని రెగ్యులర్‌గా పాటిస్తే జస్ట్ మూడునెలల్లో దీపికాలాంటి మెరిసే చర్మం, జుట్టుని సొంతం చేసుకోవచ్చట. అదేంటో చూద్దామా..!.మనం తీసుకునే ఆహరమే చర్మం, జుట్టు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే తాజా పండ్లు, కూరగాయాలకు ప్రాధాన్యత ఇవ్వండని పదేపదే సూచిస్తుంటారు. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పూజ అనే మహిళ జ్యూస్ రెసిపీతో కూడిన వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇది బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు మూడు నెలల్లో మెరిసే చర్మం, మెరిసే జుట్టుని పొందడంలో సహయపడిందని పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. నిజానికి ఆ జ్యూస్ రెసిపీలో ఉపయోగించిన పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. ఆ జ్యూస్ ఏంటంటే..వేప, కరివేపాకు, బీట్రూట్, పుదీనాలతో చేసిన జ్యూస్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బయోస్కావెంజర్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉపయోగించినవన్నీ మంచి చర్మాన్ని, బలమైన జుట్టుని పొందడంలో ఉపయోగపడేవే. ప్రయోజనాలు..వేప ఆకులు: ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి వేప ఆకులు శరీర నిర్విషీకరణకు దోహదం చేస్తాయి. ఇది మొటిమలను నియంత్రించి చర్మ కాంతివంతంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. బీట్రూట్: ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ సీలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణకు, శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి ముఖ్యమైనవి. ఇది చర్మాన్ని మృదువుగానూ, ఆర్యోకరమైన రంగుని అందిస్తుంది. అలాగే జుట్టు స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులు: దీనిలో విటమిన్ ఏ, సీ కేలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్దీ చేసి మేని ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడమే గాక హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది.పుదీనా ఆకులు: పుదీనా యాంటీఆక్సిడెంట్ లక్షణాల తోపాటు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడిని తగ్గించి శరీరాన్ని లోపలి నుంచి పునరుజ్జీవింపజేపసి మొటిమలను నివారిస్తుంది. తయారీ విధానం..కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, కరివేపాకు, వేపాకులు, కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలన్ని మిక్కీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిప్పితో సహా తాగడం కష్టంగా ఉంటే..వడకట్టుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తాజాగా తీసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా కనీసం మూడు నెలలు ఈ జ్యూస్‌ని తీసుకుంటే కాంతివంతమైన మేని ఛాయ, ఒత్తైన జుట్టు మీ సొంతం.(చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
గ్లామరస్ క్వీన్ దీపిక బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ గ్లామరస్ క్వీన్ దీపిక పదుకునే తన నటన, అభినయంతో మంచి ఫ్యాన్ పాలోయింగ్‌ని సంపాదించుకుంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ 'ఓం శాంతి ఓం'తో ఒక్కసారిగా రాత్రికే రాత్రే స్టార్ అయిపోయింది. ఇక అక్కడ నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో విజయపథంలో దూసుకుపోతుంది. అంతేగాదు బాలీవుడ్లో అత్యధిక పారితోషం తీసుకుంటున్న హీరోయిన్ల సరసన నిలిచింది. ఇక దీపిక చందమామలాంటి ముఖంతో మంచి స్టన్నింగ్ లుక్‌తో ఇట్టే ప్రేకక్షులను కట్టిపడేస్తుంది. అందుకు ఆమె వన్నెతరగని అందమే కారణం. అసలు వాళ్లు అంతలా గ్లామర్‌ని ఎలా మెయింటెయిన్ చేస్తున్నారు? ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని కుతుహలంగా ఉంటుంది కదా!. మరీ దీపికా పదుకునే బ్యూటీ రహస్యం ఏంటో చూద్దామా..! దీపిక చర్మ సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తన తల్లి నుంచే నేర్చుకున్నానని చెబుతోంది. తప్పనిసరిగా మేకప్‌ని తొలగించే.. నిద్రకు ఉపక్రమించే ముందు మేకప్‌ని తొలగించే పడుకుంటానని చెబుతోంది దీపిక. ఎంతటి బిజీ షెడ్యూల్ అయినా సరే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోనిదే పడుకోనని అంటోంది. దీని వల్ల ముఖంపై మలినాలు, మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వంటివి ఉండవని చెబుతోంది. సన్‌స్క్రీన్ తప్పనిసరి.. బయటకు వెళ్తే తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లేకుండా వెళ్లనని అంటోంది. దీని వల్ల యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోగలం. అలాగే వృధాప్య ప్రమాదాన్ని నివారిస్తుంది. చర్మ క్యాన్సర్ సంభావ్యతను తగ్గిస్తుంది. ప్రకాశవంతమైనే మేని ఛాయను ప్రోత్సహిస్తుంది. వేసవి లేదా చలికాలంలో ఇంటి లోపల లేదా బయటతో సంబంధం లేకుండా తన దినచర్యలో భాగంగా ప్రతిరోజూ రెండుసార్లు తప్పనిసరి ముఖానికి సన్‌స్క్రీన్ రాసుకుంటానని చెబుతోంది. క్లోడ్ వాటర్ థెరపీ అలాగే ముఖానికి క్లోడ్ వాటర్ థెరఫీ కూడా ప్రతిరోజు తీసుకుంటానని అంటోంది. ఇది ముఖాన్ని ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుందని అంటోంది. అలాగే ముఖం అంతా రక్త ప్రసరణ సాఫీగా జరిగి చర్మం ప్రకాశవంతంగా ఉండటంలో తోడ్పడుతుంది. హైడ్రేటెడ్‌గా ఉంచడం.. తన దినచర్యలో భాగంగా నూనె లేదా మాయిశ్చరైజర్ తప్పనిసరిగా ముఖానికి రాయడం విస్మరించదు. ఇది చర్మాన్ని డీ హైడ్రేషన్‌కి గురికాకుండా చేస్తుంది. ఇలా ముఖం తేమగా ఉండటం వల్ల ముకం ప్రకాశవంతంగా ఉంటుంది. కొబ్బరి నూనె.. శిరోజాలకు తప్పనిసరిగా కొబ్బిర నూనెనే ప్రివర్ చేస్తానని చెబుతోంది. ఇది చుండ్రుని నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఫలితం జుట్టు మంచి షైనీగా మెరుస్తు ఉంటుంది. గ్లామర్ మెయింటెయిన్ చేయడంలో శిరోజాల అందం కూడా ముఖ్యమేనని అంటోంది. జీవనశైలి గ్లోయింగ్ స్కిన్ అనేది చర్మ సంరక్షణ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడి ఉండదని నొక్కి చెబుతోంది దీపిక. మంచి జీవనశైలి, చక్కటి వ్యాయామం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటం వంటి అలవాట్లే మనం అందాన్ని ఇనుమడింప చేస్తాయని చెబుతోంది. అవే మన ముఖాన్ని కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది. పైగా ఆర్యోగకరమైన జీవితాన్ని పొందగలమని అన్నారు. (చదవండి: జుట్టు మృదువుగా నిగనిగలాడాలంటే గంజితో ఇలా చేయండి!) -
సమస్యతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి..
ప్రతీరోజూ బిజీ బిజీగా గడుపుతున్న జీవితంలో మనం మన ఆరోగ్యాన్ని పట్టించుకోము. అందులో మన ముఖము, జుట్టుల గురించి అయితే అసలు ధ్యాసే ఉండదు. పలువురితో సాగుతున్న క్రమంలో వీటివలన ఎన్నో సమస్యలను ఎదుర్కుంటూ ఉంటాం. ఇతరులతో హేళనలను భరిస్తూ ఉంటాం. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఈ అద్భుతమైన బ్యూటీ టిప్స్ మీకోసమే..! పిగ్నెంటేషన్... కీరాతో కట్అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరదోస పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది. దీనివల్ల ముఖంపైన ముడతలు, సన్నని చారలు వంటి సమస్యలు దూరం అవుతాయి. బార్లీతో మేని మిలమిల ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. మిరియాలతో చుండ్రుకు చెక్! మిరియాలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు సైతం మిరియాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్యను చాలా సులువుగా పోగొట్టే సత్తా మిరియాలకు ఉంది. ఇందుకోసం ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మిక్సీజార్‌లో వేసి వీటితోపాటు టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌లో టేబుల్ స్పూన్ ఆవనూనె, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. దీంతో ఒక హెయిర్ టానిక్ రెడీ అవుతుంది. ఈ టానిక్‌ను మాడుకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత మైల్డ్‌షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న చుండ్రు అయినా మాయం అవడంతోపాటు తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇవి చదవండి: మార్చి వచ్చింది.. బోండాం కొట్టు... -
Glowing Skin నిగ నిగ లాడే చర్మ కాంతికి, పాలు, అలోవెరా ఇంకా..
శీతాకాలపు గాలులు,మండే ఎండలు మన చర్మ కాంతిని పాడు చేస్తాయి. జీవరహితంగా తయారు కావడం, పొడిబారడం, ముఖంపై మొటిమలు అబ్బో.. ఈ సమస్యలు లిస్ట్ చాంతాండంత. అందుకే మాయిశ్చరైజర్లు , క్రీమ్‌లను ఆశ్రయిస్తారు చాలామంది. అలా కాకుండా ఏ కాలంలో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా సహజంగా మెరిసే చర్మాన్ని పొందడం ఎలాగో తెలుసా? కొబ్బరి నూనె.. బ్రౌన్ షుగర్ పొడిబారిన, నిస్తేజంగా ఉన్న చర్మానికి కొబ్బరి నూనె ఔషధంలా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, మెడకు రాసి, వేళ్లతో వలయాకారంలో మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు నూనెలో కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసి, కలిపి, ముఖానికి అప్లై చేయాలి. దీని వల్ల నిస్తేజంగా ఉన్న చర్మం కాంతిమంతం అవుతుంది. అలోవెరా చర్మకాంతికి మహత్తరంగా పనిచేసే జాబితాలో మొదటి వరసలో ఉంటుంది అలోవెరా. ముడతల నివారణకు పనిచేస్తుంది. అలొవెరా ఆకునుంచి తీసిన జెల్‌ను ముఖానికి, మేనికి పట్టించి 20 నిమిషాల తర్వాత వేడినీటితో కడిగితే ΄÷డిబారడం సమస్య దరిచేరదు. పాలు నిస్తేజంగా ఉన్న చర్మానికి పాలు మెరుపును తీసుకువస్తాయి. దూదిని పాలలో ముంచి, ముఖానికి, మెడకు రాసి, ఆరిన తర్వాత కడిగేయాలి. ΄ాలు, తెనె, శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మకాంతి మెరగవుతుంది. తేనె తేనెలో ఔషధ గుణాలు ఎక్కువ. పొడి చర్మ సమస్యకు నివారిణిగా పనిచేస్తుంది. వేళ్లతో తేనెను అద్దుకొని, ముఖానికి రాసుకొని, మృదువుగా మసాజ్ చేసి ఐదు నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. బొప్పాయి మృతకణాలను తొలగించడంలో బొప్పాయి ఎంతగానో సహాపడుతుంది. బొప్పాయి పండు చిన్న ముక్కను గుజ్జు చేయాలి. దీంతో తేనె వేసి కలిపి, ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. నీళ్లు ప్రతి రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తాగుతుంటే చర్మంలో ఉండే హానికారకాలు తొలగిపోయి తాజాదనం లభిస్తుంది. -
కరీనాకపూర్ మేకప్ నేచురల్‌గా ఉండటానికి సీక్రేట్ ఇదే..!
చాలామంది సెలబ్రెటీలు వేసుకునే మేకప్ చాలా నేచరల్‌గా ఉంటుంది. ఎంతలా అంటే చూస్తే చాలా సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ల చర్మం అంత కాంతివంతంగా ఉంటుందేమో అన్నట్లుగా ఆకట్టుకుంటుంది. అదే మనం ట్రై చేస్తే..కచ్చితంగా మేకప్ వేసుకున్నట్లు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎంత డబ్బు వెచ్చించినా అంతలా నేచురల్‌గా అనిపించదు. అయితే దాని వెనుక ఉన్న సీక్రెట్‌ని బాలీవుడ్ భామ కరీనా కపూర్ బయపెట్టింది. అందేంటంటే..? కరీనా కపూర్ మేకప్ వేసుకుంటే ముఖంపై చిన్న మచ్చ కూడా లేనట్లు ప్రకాశంతంగా ఉంటుంది. నిజంగా ఆమె మేకప్ వేసుకుందా..! లేదా? అన్నట్లు ఆశ్చర్యంగా ఉంటుంది. అంతలా ముగ్ధమనోహరంగా ఉంటుంది ఆమె రూపు. అంతలా ఆకట్టుకునే కనపించడానికి వెనుక దాగున్న రహస్యం ఏంటంటే..మేకప్ లుక్ మంచిగా కనిపించేలా ముందు..ముఖంపైన చర్మం హైడ్రైట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ముందుగా మంచి మాస్క్ వేసుకుని ఉంటారు. ఆ తర్వాత మాయిశ్చరైజేషన్ ముఖానికి ఇంకిపోయాలా అప్లే చేస్తారు. ఆ తర్వాత మేకప్ వేయడం స్టార్ట్ అవుతుంది. ఆమె తదుపరి చిత్రం 'ది క్రూ' షూటింగ్లో భాగంగా ఫేస్ మేకప్‌కి ముందు జరిగే తతంగాన్ని మొత్తం ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. అందులో ఐలైనర్ దగ్గర నుంచి పెదవులకు వేసుకునే లిప్‌స్టిక్ వరకు ఎలా మేకప్ మ్యాన్లు వేస్తారో సవివరంగా ఉంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) (చదవండి: భారతీయ వంటకాలకు జపాన్ అంబాసిడర్ ఫిదా!) -
ఐస్‌వాటర్ ముఖ సౌందర్యాన్ని ఎలా రక్షిస్తుందో తెలుసా!
ఇంతవరకు ఎన్నో క్రీమ్‌లు, సౌందర్య లేపనాలు ట్రై చేసి ఉంటారు. కానీ అవన్నీ కూడా ఈ ఐస్ వాటర్ ట్రిక్ ముందు బలాదూర్ అంటున్నారు సౌందర్య నిపుణులు. సెలబ్రెటీలు నుంచి ప్రముఖులు వరకు ఈ ఐస్‌వాటర్ ట్రిక్ని ఫాలో అవుతుంటారట. అందువల్ల వాళ్లంతా నలభైలలో కూడా టీనేజ్‌లో ఉన్నట్లే కనిపించేందకు రీజన్ ఇదేనట. అసలు ఐస్‌వాటర్ చర్మ సౌందర్యాన్ని కాపాడటం ఏంటీ? కామెడీగా అని కొట్టిపారేయకండి. ఇది ఎంత మేలు చేస్తుందంటే.. ఉదయం లేచిన వెంటనే మీ ముఖాన్ని కొద్దిసేపు ఐస్‌వాటర్‌లో డిప్ చేసి ఉంచితే ఒక్కసారిగా నిద్రమత్తుతో ఉన్న ముఖం క్షణాల్లో ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అది ముఖంపై ఉండే రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చిన్న రంధ్రాలతో అసహ్యంగా కనిపిస్తున్న చర్మానికి ఇది చక్కటి రెమిడీ అని చెప్పొచ్చు. అయితే ఈ చల్లటి వాటర్‌తో ముఖాన్ని రుద్దకపోవడమే మంచిది. ఎందుకంటే పొడిగా అయ్యి ర్యాష్ వచ్చే ప్రమాదం ఉంది. ఓ రెండు నుంచి మూడు నిమిషాలు ముఖాన్ని చల్లటి నీటిలో ఉంచితే ముఖం గ్లాస్ స్కిన్‌లా మెరుస్తూ తాజాగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) అదీగాక అప్పటి దాక సాధారణ టెంపరేచర్లో ఉన్న ముఖం ఒక్కసారిగి ఇలా చల్లటి నీటిలో ఉంచితే..ముఖానికంతటికీ రక్తప్రసరణ జరిగి ఒక్కసారిగా తెలియని ఉత్సాహం వస్తుంది. మనం ఉపయోగించే స్క్రబ్‌లు, మాయిశ్చరైజర్ల కంటే ఈ ఐస్ వాటర్ ట్రిక్ అత్యుత్తమమైనది అని అంటున్నారు. ఇలా రోజులో కనీసం రెండు నుంచి మూడు సార్లు క్రమం తప్పకుండా చేస్తే మెరిసే ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుదంని చెబుతున్నారు. అంతేగాదు ముఖంపై వచ్చే వాపులను కూడా తగ్గిస్తుందట. వాపుగా ఉన్న ప్రాంతంలో... రక్త సరఫరా ఎక్కువ అవ్వడంతో కుచించుకుపోయిన నాళాలకు రక్తసరఫరా తగ్గి యథావిధికి రావడమే గాక నొప్పి కూడా తగ్గుతుందని చెబతున్నారు సౌందర్య నిపుణులు. అంతేగాదు ఇలా ఐస్‌వాటర్‌లో ముఖాన్ని డిప్ చేసి ఉంచే ట్రిక్‌తో తమ అందాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నామో వివరిస్తూ వీడియోలు షేర్ చేసిన కొందరూ సెలబ్రెటీల వీడియోలు నెట్టింట వైరల్ తెగ వైరల్ అవుతున్నాయి. చూసేయండి.. వెంటనే మీరు కూడా ట్రై చేయండి. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (చదవండి: ఈ చైర్లో కూర్చొంటే..దెబ్బకు బెల్లీ ఫ్యాట్ మాయం!) -
మెరిసే చర్మం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్‌లో ఏం కలుపుతున్నారో తెలుసా?
ఆరోగ్య వంతమైన మెరిసే చర్మం కోసం ఏ రకమైన ప్రోడక్ట్స్ బాగా పనిచేస్తాయనే దానిపై చాలా మంది ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో పరిశోధకులు కూడా అన్వేషణ ప్రారంభించారు. ఆ డిమాండ్‌ను గ్రహించిన సౌత్ కొరియా కాస్మెటిక్ తయారీ సంస్థలు బోలెడన్నీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్‌తో మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. ఆ ఉత్పత్తులకు అవి వాడుతున్న పదార్థం ఏంటో తెలుసా..? నత్త స్రావాలు. ముఖ్యంగా క్రిప్టోంఫాలస్ ఆస్పెర్సా జాతికి చెందిన నత్తల స్రావాలు. అవి బురద లాంటి జిగట పదార్థాన్ని స్రవిస్తుంటాయి. దాంతోనే తమ స్కిన్ కేర్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి సదరు సంస్థలు. ఆ స్రావం ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడంలో అద్భుతంగా పనిచేస్తుందట. అందుకే దీనిని ఫేస్ మాస్క్, సీరమ్, మాయిశ్చరైజర్లలో వాడుతున్నారు. పురాతన గ్రీకులు కూడా చర్మంపై వృద్ధాప్య ఛాయల నివారణకు నత్త స్రవించే ఈ బురద లాంటి జిగటనే ఉపయోగించేవారట. వీటి తోపాటు గ్లాస్ స్కిన్ కోసం దక్షిణ కొరియా ఒక టేబుల్ స్పూన్ కోకో బటర్‌కి రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్‌ని కలిపి.. పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ని ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకుని.. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకోవాలి. అంతే ముఖం చాలా కాంతిమంతంగా ఉంటుంది. (చదవండి: పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..) -
కొరియన్ గ్లాసీ స్కిన్ టోన్ కావాలా? సింపుల్‌గా ఈ ప్యాక్ వేసుకోండి
ఫర్ గ్లాస్ స్కిన్.. ఈ చిట్కాలు పాటించండి. ►ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్‌ని స్క్రబ్‌లా మొహానికి రుద్దుకోవాలి .. ఓ 10 మినట్స్ వరకు. తర్వాత కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుని టవెల్‌తో ఆ తడిని అద్ది.. మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి. ► శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయం చేస్తుంది. శెనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపండి. దీన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ఆరాక కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ► కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్‌ని రిమూవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్‌టోన్‌ని సాఫ్ట్‌గా చేస్తుంది. ► అవిసె గింజలు స్కిన్ టోన్‌ని గ్లాసీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవిసె గింజలను ఓ పాత్రలో వేడి చేసి అందులో నీళ్లు కలపాలి. జెల్ ఫార్మట్‌లో వచ్చాక స్టవ్ ఆపేసి వడగట్టాలి. మిగిలిన జెల్‌ను ముఖంపై అప్లై చేస్తే రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది. -
చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా కనిపించాలంటే..!
కొందరి చర్మం చూడగానే ఆరోగ్యవంతంగా కనిపించదు. చూడటానికి కూడా బాగుండదు. మరికొందరికి చర్మం పెళుసుగా ముడతలు పడినట్లు ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. ఎన్నో రకాల క్రీంలు ఉపయోగించినా ఫలితం అంతగా ఉండదు. అలాంటప్పుడూ ఇలా చేయండి. చర్మం ఆరోగ్యంగా కనిపించాలంటే... చర్మం ఆరోగ్యంగా నిగనిగలాడుతూ ఉండాలంటే కొబ్బరిపాలు మేలైన ఎంపిక. కొబ్బరి పాలను రాత్రిపూట పడుకునేముందు తలకు పట్టించి, షవర్ క్యాప్ వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. కొబ్బరి పాలు వెంట్రుకల కుదుళ్లకు చేరి, శిరోజాల మృదుత్వం దెబ్బతినదు. పచ్చి కొబ్బరిని తురిమి, మిక్సీలో గ్రైండ్ చేసి, పాలు తీయాలి. ఈ పాలను చర్మానికంతటా పట్టించి, అరగంట ఆగి, చల్లని నీటితో స్నానం చేయాలి. చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా పని చేసి, ముడతలు తగ్గి, మృదువుగా మారిపోతుంది. ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరి పాలను, దూదితో ఒళ్లంతా రాసుకొని, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. (చదవండి: క్లెన్సింగ్ నుంచి ఫేషియల్ వరకు.. ఇదొక్క బ్యూటీ ప్రొడక్ట్ ఉంటే చాలు) -
మీ ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండాలంటే..జీలకర్రతో..
ఇంటిపట్టున ఉంటే ముఖం బాగున్నట్లు బయటతిరుగుతుంటే కాస్త నల్లబడుతున్నట్లు అనిపిస్తుంది. పైగా అందరూ ఎందుక అలా నల్లపూస వైపుతున్నావు అని కామెంట్ చేసిన చాలా బాధనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలని, చదువులని బయటకు వెళ్లని తప్పని స్థితి అలాంటప్పుడు మన ఇంట్లో ఉండే ఈ చిట్కాలతో ముఖాన్ని కాంతివంతంగా చేసుకోవచ్చు అవేమిటో చూస్తేద్దామా టేబుల్ స్పూను పంచదార పొడిలో స్పూను వేడినీళ్లు పోసి కలపాలి. దీన్లో రెండు టీస్పూన్ల పచ్చిపాలు, స్పూను అలోవెరా జెల్ వేసి కలపాలి. శుభ్రంగా కడిగిన ముఖానికి ఈ మిశ్రమాన్ని రాసి మర్దన చేయాలి. పది నిమిషాలపాటు ఆరనిచ్చి కడిగేయాలి. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల తేమ అంది, చర్మం పట్టులా నిగారింపుతో మెరుపులీనుతూ కనిపిస్తుంది. మన కూరల్లో వాడే జీలకర్ర ముఖవర్ఛస్సుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. జీకర్ర రెండు కప్పుల నీళ్లో మరిగించి ఆ నీటితో ముఖం కడుక్కుంటే వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ 'ఈ' వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడానికి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంతే కాదు! జీలకర్ర గింజలు మొటిమలు, వాటి తాలుకా మచ్చలు, తామర, సోరియాసిస్ వంటి చర్మ రుగ్మతలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. టాక్సిన్స్‌ను కూడా తొలగిస్తుంది తద్వారా చందమామలాంటి ప్రకాశవంతమైన ముఖం మీ సొంతం అవుతుంది. మంచి ఫలితాల కోసం క్రమం తప్పకుండా చేయండి. అలాగే ముఖం అందంగా ఉన్న జుట్టు డల్‌గా ఊడిపోతున్న అందంగా కనిపించరు కదా వీటితో పాటు మీ మిమల్ని మరింత అందంగా కనిపించేలా చేసేందుకు మీ శిరోజాలను ఈ చిట్కాతో సంరక్షించుకోండి. జుట్టు రాలడాన్ని తగ్గించే డికాషన్ మరుగుతున్న రెండు గ్లాసుల నీటిలో మూడు టేబుల్ స్పూన్ల టీపొడి, పది గులాబీ పువ్వులు వేసి పదినిమిషాలపాటు మరిగించాలి. తరువాత చల్లారనిచ్చి వడగట్టి డికాషన్‌ను సీసాలో పోయాలి. తలస్నానం చేసిన జుట్టుకు ఈ డికాషన్‌ను పట్టించి, టవల్ చుట్టుకోవాలి. నీటితో కడగకూడదు. ఇది కండీషనర్‌లా పనిచేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. (చదవండి: సెలూన్‌కి వెళ్లే పనిలేకుండా..మీ హెయిర్‌ని స్ట్రైట్ చేసుకోండిలా!) -
Beauty: ఇలా చేశారంటే ముఖం కాంతులీనడం ఖాయం!
చర్మం నిగనిగలాడుతూ ఉండటం కోసం, ముఖం మెరుపులీనడం కోసం రకరకాల క్రీములు, మందులు వాడుతుంటారు చాలామంది. అయితే వాటితోపాటు ఒత్తిడి కూడా లేకుండా చూసుకోవడం అవసరం. ఎందుకంటే ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు శారీరక ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతాయి. ఫలితంగా ముఖం పీక్కుపోయినట్లు ఉండటం, జిడ్డు కారుతూ ఉండటం, చెమట ఎక్కువగా పట్టడం, చర్మంపై చిన్న చిన్న దద్దులు, పొక్కులు వంటివి రావడం వంటి సమస్యలు తీవ్రం అవుతాయి. ఈ పరిస్థితిలో యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒత్తిడి, మానసిక సమస్యలను అదుపులో ఉంచేందుకు కంటినిండా నిద్రపోవడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంటి చిట్కాలతో చర్మం మెరుస్తూ ఉండాలంటే చర్మ సంరక్షణ చాలా ముఖ్యం. చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రెగ్యులర్ ఫేషియల్స్, క్లీనప్‌లు చేయాలి. శనగ పిండి, పసుపు, పెరుగు, తేనె వంటి ఇంటి చిట్కాలు చర్మాన్ని తళతళ మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. పోషకాల ఆహారం ఆహారంలో అన్ని రకాల పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. శరీరానికి అన్ని ముఖ్యమైన పోషకాలు, విటమిన్లను పుష్కలంగా అందించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంబించాలి. ఆహారంలో కూరగాయలు, పండ్లను సమృద్ధిగా ఉండేలా చూసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. చదవండి: బొప్పాయి గింజలు పొడి చేసుకుని తిన్నారంటే! ఇందులోని కార్పైన్, పాలీఫెనాల్స్ వల్ల -
పానీయం
బత్తాయి, ఆపిల్, క్యారెట్, బీట్ రూట్, టమోటా, కీరా, సొరకాయ, పార్సీలే ఆకులను సమపాళ్లల్లో తీసుకుని చిటికెడు పసుపు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు కలుపుకోవాలి. వడగట్టి తాగాలి. ఈ జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల మంచి ఆరోగ్యంతోపాటు, మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. పరగడుపున తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. -
మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! డివైజ్ ధర?
స్కిన్‌కేర్‌లో స్త్రీలు పాటించే పద్ధతులు చాలా ప్రత్యేకం. తెలిసిన చిట్కాలు.. నిపుణుల సలహాలు.. పార్లర్స్‌లో ట్రీట్మెంట్లు.. ఇలా అన్నిటినీ అవలంబిస్తారు. అయినా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకు మంచి సొల్యూషన్.. ఈ హ్యాండ్‌హెల్డ్ ఫేషియల్ మసాజర్. బెస్ట్ స్కిన్ స్పెషలిస్ట్‌లా ఉపయోగపడుతుంది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఫేస్ అండ్ స్కిన్‌కేర్ థెరపీ టూల్.. సులభమైన ఎన్నో చికిత్సలను అందిస్తుంది. దీనిలోని ఎల్ఈడీ లైట్ థెరపీ హెడ్.. ముడతలను, మచ్చలను పోగొడుతుంది. చర్మం లోతుల్లోకి వెళ్లి శుభ్రపరుస్తుంది. ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు.. కొల్లాజెన్‌ను నిర్మించడానికి.. తగిన మోతాదులో వైబ్రేషన్‌ను అందిస్తుంది. కాంతిమంతమైన ముఖాన్ని తీర్చిదిద్దడంలో ఈ పర్సనల్ బ్యూటీ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుంది. హాట్ అండ్ కోల్డ్ రింగ్స్‌తో పాటు క్లీనింగ్ రింగ్నూ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ స్వయంగా ఎవరికి వారే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మైక్రోకరెంట్ టెక్నాలజీతో ఈ ఫేషియల్ మెషిన్.. కళ్ల చుట్టూ ఉండే నల్లటి మచ్చలను పోగొడుతుంది. అలాగే చర్మపు బిగువును కాపాడుతుంది. ముఖ కండరాల్లో రక్తప్రసరణను బాగా పెంచి.. స్కిన్ టోన్‌ను మెరిపిస్తుంది. చిగుళ్ల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను.. అలసట, ఒత్తిడినీ దూరం చేస్తుంది. ఈ మెషిన్‌ను భద్రపరచు కోవడానికి సాఫ్ట్ కేరింగ్ బ్యాగ్ లభిస్తుంది. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక యూఎస్బీ చార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇలాంటి డివైజెస్‌ను ఆన్లైన్లో కొనుక్కునే ముందు వినియోగదారుల రివ్యూస్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని ధర 395 డాలర్లు. అంటే రూ. 32 వేల పైనే. అయితే ఆప్షన్స్‌ని బట్టి.. అదనపు రింగ్స్ కొనుగోలుచేయడానికి అదనపు ధర ఉంటుంది. దీన్ని పురుషులు కూడా వినియోగించుకోవచ్చు. చదవండి: CWS: డ్రైవర్ బబ్లూ.. అమెరికా డాక్టర్ కోమలి! చాలా మంది ఎందుకు ఇలా పిచ్చిగా ఆరాధిస్తారు? -
Natural Beauty Tips: నిమ్మరసం, కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్‌తో ఇలా చేస్తే..
►తాజా నిమ్మరసం చర్మం రంగును మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూను తాజా నిమ్మరసం, రెండు టీ స్పూన్లు కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్ మూడు టీ స్పూన్లు తీసుకుని మూడింటినీ కలుపుకోవాలి. ముందుగా నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. వేళ్ళతో నెమ్మదిగా రబ్ చేయాలి. ఆ తర్వాత సబ్బుతో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికే కాకుండా శరీరమంతా కూడా అప్లై చేసుకోవచ్చు. స్నానానికి వెళ్ళే ముందు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ స్నానానికి ముందు చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది. అర టీస్పూన్ గంధపు పొడిలో తగినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా మూడు రోజులకోసారి చేస్తూ వుంటే ముడతలు తగ్గడంతో ΄ాటు ముఖ కాంతి మెరుగుపడుతుంది. నల్లమచ్చల నివారణకు... ► నాలుగు తులసి ఆకులు, పావు టీస్పూన్ పసుపు కలిపి పేస్ట్ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి15 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ► అరచేతిలో టీ స్పూన్ తేనె తీసుకుని రెండు రేకల కుంకుమ పువ్వుని వేసి రంగరించాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే క్రమంగా నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి. -
బొప్పాయి గుజ్జు, రోజ్ వాటర్.. పార్టీకి వెళ్లే ముందు ఇంట్లోనే ఇలా: హీరోయిన్
Athiya Shetty- Skin Care Tips: పార్టీలకు రెడీ అయ్యే క్రమంలో బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదంటోంది బాలీవుడ్ తార అథియా శెట్టి. ఈ చిట్కాలు పాటిస్తే మిలా మిలా మెరిసే మోముతో అందరిలో ప్రత్యేకంగా నిలవొచ్చని చెబుతోంది. ఈ స్టార్ కిడ్ చెప్పిన బ్యూటీ టిప్స్ ఆమె మాటల్లోనే.. ‘‘చర్మ సౌందర్యానికి మా అమ్మ నాకు చెప్పిన ఒకటే మంత్రం బొప్పాయి. రోజువారీ అలవాటుగా బొప్పాయి గుజ్జు, ఒక అర స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ఆరెంజ్ జ్యూస్ అన్నీ కలిపి ముఖం, మెడకు పట్టించి ఐదు నిమిషాల పాటు ఉంచి కడిగేస్తాను. ఆ తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటా. పార్టీకి, ఫంక్షన్‌కి వెళ్లేముందు బొప్పాయి గుజ్జు, కొన్నిచుక్కల రోజ్ వాటర్ కలిపి ఒక మాస్క్‌లాగా వేసుకుంటా. పదిహేను నిమిషాలు ఉంచుకుని చల్లటి నీటితో కడిగేస్తా. ఆ మెరుపుతో వెళ్లిన చోట నేను ప్రత్యేకంగా కనిపిస్తానని వేరే చెప్పాలా! ’’ అంటూ తన తల్లి చెప్పిన సౌందర్య చిట్కాలు పంచుకుంది. కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సునిల్ శెట్టి- మనా శెట్టి దంపతుల గారాల పట్టి అథియా. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించేందుకు 2015లో బీ-టౌన్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హీరో మూవీతో తెరంగేట్రం చేసిన ఆమె.. నవాబ్జాదే, మోతీచూర్ చక్నాచూర్ వంటి సినిమాల్లో నటించింది. ఇక త్వరలోనే... టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమవుతోంది ఈ అందాల తార. చదవండి: Beauty Tips: మొటిమలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఇలా చేస్తే సరి! -
Beauty: ఈ డివైజ్‌ను క్రమం తప్పకుండా 28 రోజుల పాటు వాడారంటే.. ముడతలు మాయం!
ఈ రోజుల్లో డ్రెస్‌కి తగ్గ మేకప్ కామన్ అయిపోయింది. మరి మేకప్ మెరుపులు సహజంగా ఉండాలంటే.. చర్మం మృదువుగా, ముడతల్లేకుండా ఉండాలి. అప్పుడే ఏ మేకప్ వేసినా చూడముచ్చటగా ఉంటుంది. వయసుతో వచ్చే ముడతలు పోగొట్టుకునేందుకు స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ పార్లర్స్, క్లినిక్స్‌కి తిరగాల్సిన పనిలేదంటోంది ఈ మసాజర్ (స్కిన్ లిఫ్టింగ్ మైక్రోకరెంట్ బ్యూటీ మెషిన్). న్యూ అప్‌గ్రేడ్ టెక్నాలజీతో రూపొందిన ఈ యాంటీ రింకిల్స్ డివైజ్.. 3.7 వోల్టేజ్‌తో పని చేస్తుంది. దీనికి 3 గంటల పాటు చార్జింగ్ పెడితే సరిపోతుంది. ఈఎమ్ఎస్ పల్స్ మోడ్, స్కిన్ టెండరింగ్ మోడ్, కొల్లాజెన్ మోడ్, లిఫ్టింగ్ ఫేస్ పర్మింగ్ మోడ్ అనే నాలుగు రకాల ఫంక్షన్స్‌తో పనిచేస్తుంది. ఈ డివైజ్‌ను క్రమం తప్పకుండా 28 రోజుల పాటు వాడితే మంచి ఫలితం ఉంటోందట. స్కిన్ మాయిశ్చరైజింగ్ కోసం, గ్లో (మెరుపు) కోసం, ఫిట్నెస్ కోసం కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాలి. ఇక చేతులు, కాళ్లు, తొడలు, పొట్ట, నడుము వంటి భాగాల్లో ముడతలు పోవాలంటే.. గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేసినప్పుడు ఆప్షన్స్‌ని బట్టి రెడ్ లేదా బ్లూ కలర్స్‌లో లైట్స్ వెలుగుతాయి. దీని ధర 65 డాలర్లు. అంటే 5,156 రూపాయలు. ఇలాంటి డివైజ్‌లు కొనేటప్పుడు ముందుగా వినియోగదారుల రివ్యూలతో పాటు ఆయా సైట్స్ క్రెడిబిలిటీలనూ పరిగణలోకి తీసుకోవాలి. చదవండి: Aishwarya Rai Bachchan: నాలుగైదు పూటలు తింటా.. నీళ్లు బాగా తాగుతా.. నా బ్యూటీ సీక్రెట్ అదే! -
నిగనిగలాడే కాంతివంతమైన చర్మం కోసం ఇలా చేయండి..!
ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ పాల పొడి, ఒక టీ స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. వీటితో పాటు పొడిచర్మం అయితే కొద్ది చుక్కల గ్లిజరిన్, ఆయిలీ స్కిన్ అయితే పన్నీరు తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లయ్ చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. -
Beauty: నిత్య యవ్వనంగా.. కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని వేగవంతం చేసి!
ముఖంపైన ముడతలు, మొండి మచ్చలు వయసుని రెట్టింపు చేసి చూపిస్తాయి. వాటితో పాటు కంటి చుట్టూ ఉండే వలయాలు.. ముఖాన్ని కాంతివిహీనంగా మార్చేస్తాయి. కళ్లు, పెదవులు, ముక్కు, నుదురు, బుగ్గల మీది చర్మం మృదువుగా మెరిస్తేనే ఆరోగ్యం.. అందమూనూ! అలాంటి ట్రీట్మెంట్నే అందిస్తుంది ఈ మాస్టర్ పీస్ (మోర్ ఎఫెక్టివ్ యాంటీ ఏజింగ్ డివైజ్). ఇది పాలిపోయిన చర్మాన్ని సరిచేస్తుంది. చర్మంపైనున్న ముడతలు, గీతలు తగ్గించడంతో పాటు.. కొలాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని వేగవంతం చేసి.. చర్మానికి లైట్ థెరపీని అందిస్తుంది. డివైజ్ ముందున్న బటన్ ఆన్ చేస్తే అది పని మొదలు పెడుతుంది. ప్రతి శరీరభాగంపైన 4 నుంచి 6 నిమిషాల పాటు ట్రీట్మెంట్ అందించొచ్చు. మొదటి నాలుగు వారాలు.. వారానికి మూడు సార్లు దీన్ని ఉపయోగిస్తే.. ఆ తర్వాత వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించాలి. ట్రీట్మెంట్ తర్వాత పొడి టవల్‌తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుబొమ్మల మధ్య, కంటి మూలల్లో, నుదుటిపై ఉండే ముడతల (క్రాస్ లైన్స్)ను తొలగిస్తుంది. రంగు మారిన చర్మాన్ని తిరిగి కాంతిమంతంగా చేస్తుంది. రంధ్రాలను పూడ్చి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. ఈ డివైజన్ని ఉపయోగించడం చాలా సులభం. దీనికి చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ప్రయాణాల్లో, ఆఫీస్‌లో, ఇంట్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ధర కేవలం 2 వేల రూపాయలు మాత్రమే. చదవండి: Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనెతో -
ముఖ నిగారింపు పెంచుకోవాలంటే.. చెంప చెళ్లుమనాల్సిందే!
ముఖ నిగారింపుని మరింతగా పెంచుకునేందుకు కొరియన్లు స్లాప్ థెరపీని వాడతారు. స్లాప్ థెరపీ అంటే చెంప మీద పెళ్లున కొట్టడం.రెండు చేతులతో ముఖానికి ఇరువైపులా కొట్టడం వల్ల ముఖచర్మం గ్లోగా కనిపిస్తుంది. ►ముందుగా ముఖాన్ని వేడినీటితో కడిగి, తడిలేకుండా శుభ్రంగా తుడవాలి. తరువాత మాయిశ్చరైజర్ రాయాలి. ఇప్పుడు మెల్లగా కొట్టడం ప్రాంభించి క్రమంగా పెద్దగా కొట్టాలి. ఇలా ఏడు నిమిషాలు పాటు చేస్తే స్లాప్ థెరపీ అయిపోయినట్లే. ►రోజూ క్రమం తప్పకుండా ఈ స్లాప్ థెరపీ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి, సహజసిద్ధంగానే చర్మం రేడియంట్ నిగారింపుని సంతరించుకుంటుంది. ►ఈ థెరపీతో నిగారింపే కాకుండా చర్మం మీద ముడతలు త్వరగా రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. అందుకే దీనిని యాంటీఏజింగ్ థెరపీ అని కూడా పిలుస్తారు. ►రక్తప్రసరణ పెరగడం వల్ల టాక్సిన్స్ బయటకు పోయి ముఖం మీద మొటిమలు కూడా రావు. ఇంకెందుకాలస్యం... ఏ మాత్రం శ్రమలేని స్లాప్ థెరపీతో మీ ముఖాన్ని మెరిపించండి. -
Beauty Tips: పసుపు రాసి.. ఇలా చేశారంటే ముఖం నల్లబడుతుంది!
వేసవిలో పసుపుని ముఖానికి గానీ, ఒంటికి గానీ పట్టించాలనుకుంటే నేరుగా కాకుండా పెరుగు, శనగపిండిలలో పసుపు కలిపి పట్టించాలి. ఇలాచేస్తే చర్మానికి చల్లదనం అందుతుంది. పసుపు రాసుకుంటే ముఖం రంగు వస్తుందని చాలామంది పసుపు రాసుకుంటూ ఉంటారు. అయితే పసుపు రాసిన తరువాత కడిగేటప్పుడు సాధారణ నీటితో మాత్రమే కడగాలి. సబ్బు, ఫేస్‌వాష్‌లతో కడగకూడదు. వీటితో కడిగితే ముఖం ఉన్నరంగుకంటే మరింత నల్లగా మారుతుంది. పసుపుని చర్మానికి రాసి ఎక్కువ సమయం ఉంచుకోకూడదు. ఆరిన వెంటనే నీటితో కడిగేయాలి. ఇలా చేయకపోతే మచ్చలు, చారలు ఏర్పడతాయి. ఇక చర్మంపై ఉండే అవాంచిత రోమాలను పసుపు తొలగించడంలో ఎంతో సహాయ పడుతుంది. శెనగపిండిని కొద్దిగా పసుపు, పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. సహజ నివారణలు వాడటం వలన దుష్ప్రభావాలు తక్కువ. చదవండి👉🏾 Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్.. ట్యాన్, మృతకణాలు ఇట్టే మాయం! చదవండి👉🏾 Beauty Tips: క్యారెట్, నిమ్మకాయ, ఆలుగడ్డ.. మచ్చల్ని తరిమికొట్టే హోంమేడ్ క్రీమ్! -
హ్యాండ్‌బ్యాగ్‌లో పట్టే ఈ ఫేషియల్ డివైజ్‌తో శాశ్వత మెరుపు.. ధర 2,476
Beauty Tips In Telugu: స్పెషల్ డేస్‌లో స్పెషల్‌గా రెడీ అయ్యేందుకు ఖరీదైన ఫేషియల్స్, ఫేస్ ప్యాక్స్, మేకప్ కోసం చూస్తుంటారు చాలా మంది. అయితే అవి తెచ్చే మెరుపు తాత్కాలికమనే నిజాన్ని మరచిపోతుంటారు. తాత్కాలిక అందం కోసం అలా వ్యయప్రయాసలు పడేకంటే శాశ్వతమైన కాంతి కోసం ఈ మల్టీ ఫంక్షనల్ ఎలక్ట్రిక్ మసాజర్ (2 ఇన్ 1 ఫేస్ మసాజర్ అండ్ వాషింగ్ బ్రష్)ను ఉపయోగించి చూడండి.. స్కిన్–ఫ్రెండ్లీ సిలికాన్‌తో రూపొందిన ఈ ఫేషియల్ డివైజ్.. ముఖాన్ని శుభ్రం చేయడంతో పాటు.. మసాజ్ చేస్తూ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిలోని గుండ్రటి డబుల్ సైడ్ బ్రష్‌ను(చిత్రంలో గమనించొచ్చు) తీసేసి.. మిగిలిన టూల్‌తో కళ్ల చుట్టూ మసాజ్ చేసుకోవడానికి ఉపయోగించొచ్చు. ఈ హ్యాండ్‌హెల్డ్ డిటాచబుల్ ఫేషియల్‌కి ఒక గంట పాటు చార్జింగ్ పెడితే సరిపోతుంది. ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్ ఇలా దేనితోనైనా సులభంగా చార్జర్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని రోజూ ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రయాణాల్లో ముఖం శుభ్రం చేసుకోవడానికి, మసాజ్ చేసుకోవడానికి ఈ డివైజ్ చాలా ఈజీగా ఉంటుంది. దీని ధర సుమారుగా 32 డాలర్లు. అంటే 2,476 రూపాయలు మాత్రమే. పైగా ఇది హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకునేంత చిన్నదిగా, కంఫర్టబుల్‌గా ఉంటుంది. చదవండి : Body Fit Jacket: ప్రసవానంతర రికవరీకి బాగా ఉపయోగపడుతుంది.. ధర వెయ్యి లోపే! -
Beauty Tips: ద్రాక్షపండ్లలో ఉండే ఆంథోసైయనిన్ వల్ల..
ప్రస్తుతం మార్కెట్లో పుష్కలంగా దొరుకుతున్న ద్రాక్షపండ్లలో విటమిన్ ఎ, సి, బీ 6, ఫోలేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి పోషణ అందించేవి. గ్రేప్స్‌ను ఆహారంగా లేదా ఫేస్ ప్యాక్ రూపంలో తీసుకోవడం వల్ల చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. వీటిలోని ఆంథోసైయనిన్(నీటిలో కరిగే కలర్ పిగ్మెంట్), యాంటీ ఆక్సిడెంట్లు ముఖం మీద మొటిమలు, వాటి తాలుకూ మచ్చలను తొగిస్తాయి. యాంటీ ఏజింగ్ మూలకంగా కూడా గ్రేప్స్ బాగా పనిచేస్తాయి. ఇన్ని పోషకాలు ఉన్న ద్రాక్షతో ఇంట్లోనే సులభంగా ఫేస్‌ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.... చిన్న టొమాటో తీసుకుని ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలకు ఆరు ద్రాక్షపండ్లను జోడించి మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులు, కళ్లకు అంటకుండా ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఆయిలీ స్కిన్.. జిడ్డుతత్వం ఉన్న చర్మానికి కూడా గ్రేప్స్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే అధికంగా ఉన్న జిడ్డుపోతుంది. పది నల్ల ద్రాక్షపండ్లను పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టులో టేబుల్ స్పూను ముల్తాని మట్టి, టీస్పూను రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంటపాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పొడి చర్మానికి.. మూడు స్ట్రాబెర్రీలు, ఐదు ద్రాక్షపండ్లను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని దూదితో తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖచర్మానికి ఇన్స్టంట్ మాయిశ్చర్‌ని అందించడంతోపాటు మృదువుగా మారుస్తుంది. చర్మతత్వాన్ని బట్టి వీటిలో ఏ ప్యాక్‌ను అయినా వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. చదవండి: Groundnuts Health Benefits: ఉడకబెట్టిన పల్లీలు తినడం ఇష్టమా? ఇవి విడుదల చేసే సెరోటోనిన్ వల్ల.. -
అందం మీ సొంతం!
కాంతిహీనంగా మారిన చర్మం మదువుగా మారాలంటే... ఎన్నో జాగ్రత్తలు అవసరం! మొటిమలు, మచ్చలు, కళ్ల కింద వలయాలు ఇలా అన్నింటినీ పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే క్రీమ్స్ కంటే... ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే మంచివంటున్నారు నిపుణులు. పండ్లు, కూరగాయలు, డ్రై ప్రూట్స్ ఇలా వంటింటిలో దొరికే పదార్థాలతోనే చక్కని ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. తళతళా మెరిసిపోవచ్చు. నల్లని మచ్చలనే కాదు జిడ్డు, మొటిమలు శాశ్వతంగా పోగొట్టుకోవచ్చు. ట్రై చేయండి. కావలసినవి: ఓట్స్ – పావు టేబుల్ స్పూన్ తేనె – ముప్పావు టేబుల్ స్పూన్ శనగ పిండి – 1 టేబుల్ స్పూన్ ఆలీవ్ ఆయిల్ – పావు టేబుల్ స్పూన్ పాలు – 2 టేబుల్ స్పూన్స్ తయారీ: ముందుగా ఓట్స్, తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో శనగ పిండి, పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఆలీవ్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మెరుపు మీ సొంతమవుతుంది. -
చర్మకాంతి కోసం సహజ పద్ధతులు..
న్యూఢిల్లీః మీ చర్మం కాంతివంతంగా ఉండాలనుకుంటున్నారా? ముఖంలో అందం మరింత ఇనుమడించాలనుకుంటున్నారా? అయితే నిపుణుల సూచనలు పాటించాల్సిందే. శరీరంలో ఆరోగ్యం నశించినప్పుడు.. చర్మంపై ఎంతటి ఖరీదైన క్రీములు పూసినా ప్రయోజనం ఉండదంటున్నారు కాస్మెటిక్ అండ్ ఈస్తటిక్ నిపుణులు. సరైన జీవనశైలికి తోడు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సహజసిద్ధమైన మార్గాలను పాటించడంతో ముఖంలో కాంతి పెరుగుతుందని చెప్తున్నారు. కాస్మెటిక్, ఈస్తటిక్ సర్జన్.. సీనియర్ కంన్సల్టెంట్ అనూప్ ధీర్.. చర్మసౌందర్యానికి కొన్ని సులభమైన చిట్కాలను అందించారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, ముఖంలో కాంతి కనిపించాలన్నా కేవలం ఈ చిన్నపాటి జాగ్రత్తలను ఫాలో అయిపోతే చాలంటున్నారు. ఎప్పుడూ బద్ధకంగా కూర్చోవడం, వ్యాయామానికి దూరంగా ఉండటం వంటివి చర్మం పొడిబారేందుకు, ముడుతలు, చారలు పడేందుకు దోహద పడతాయని, జీవన శైలిని నియమబద్ధంగా ఉంచుకోవడం ఎంతో అవసం అని అనూప్ చెప్తున్నారు. అలాగే రాత్రీ పగలూ తేడా లేకుండా చర్మానికి పూసే క్రీములను, నూనెతో వండిన, జంక్ ఫుడ్ తినడాన్నిమానుకుని.. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు తినడం వల్ల కాంతివంతమైన చర్మాన్ని పొందొచ్చని చెప్తున్నారు. అలాగే మెరిసే చర్మానికి హైడ్రేషన్ ఎంతో అవసరమని, అందుకు నీటిని కూడా అధిక మొత్తంలో తాగడం అవసరమంటున్నారు. నీరు శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించి, చర్మంలోపల ఉండే టాక్సిన్ ను బయటకు పంపి, పోషకాలను చేర్చేందుకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా చర్మకాంతికోసం వ్యాయామంలో తప్పనిసరిగా కార్డియోను చేర్చాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియో వర్కవుట్ ముఖానికి చేసే ఫేషియల్ వంటిదని, ఈ వ్యాయామంతో వచ్చే చెమట ద్వారా చర్మంలో చిక్కుకున్న నూనె, ధూళి వంటివి బయటకు వచ్చి, చర్మం కాంతివంతంగా మారుతుందని చెప్తున్నారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో టమోటా, ఆకుకూరలు, స్ట్రాబెర్రీ, చియా విత్తనాలతోపాటు పెరుగును జోడిస్తే మంచి ఫలితాలు పొందొచ్చన్నారు. అలాగే బ్యూటీపార్లర్లకు భారీగా డబ్బును వెచ్చించే బదులు.. ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వేసుకునే ప్రయత్నం చేయమంటున్నారు. ఖరీదైన బ్రాండ్లు, ఫేస్ వాష్ లకు బదులుగా రోజ్ వాటర్ తో ముఖాన్ని కడుక్కుంటే చర్మం మరింత కాంతివంతంగా తయారౌతుందని అనూప్ ధీర్ సూచిస్తున్నారు.