
ఈ రోజుల్లో డ్రెస్‌కి తగ్గ మేకప్ కామన్ అయిపోయింది. మరి మేకప్ మెరుపులు సహజంగా ఉండాలంటే.. చర్మం మృదువుగా, ముడతల్లేకుండా ఉండాలి. అప్పుడే ఏ మేకప్ వేసినా చూడముచ్చటగా ఉంటుంది. వయసుతో వచ్చే ముడతలు పోగొట్టుకునేందుకు స్పెషల్ ట్రీట్మెంట్ అంటూ పార్లర్స్, క్లినిక్స్‌కి తిరగాల్సిన పనిలేదంటోంది ఈ మసాజర్ (స్కిన్ లిఫ్టింగ్ మైక్రోకరెంట్ బ్యూటీ మెషిన్).
న్యూ అప్‌గ్రేడ్ టెక్నాలజీతో రూపొందిన ఈ యాంటీ రింకిల్స్ డివైజ్.. 3.7 వోల్టేజ్‌తో పని చేస్తుంది. దీనికి 3 గంటల పాటు చార్జింగ్ పెడితే సరిపోతుంది. ఈఎమ్‌ఎస్ పల్స్ మోడ్, స్కిన్ టెండరింగ్ మోడ్, కొల్లాజెన్ మోడ్, లిఫ్టింగ్ ఫేస్ పర్మింగ్ మోడ్ అనే నాలుగు రకాల ఫంక్షన్స్‌తో పనిచేస్తుంది. ఈ డివైజ్‌ను క్రమం తప్పకుండా 28 రోజుల పాటు వాడితే మంచి ఫలితం ఉంటోందట.
స్కిన్ మాయిశ్చరైజింగ్ కోసం, గ్లో (మెరుపు) కోసం, ఫిట్‌నెస్ కోసం కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాలి. ఇక చేతులు, కాళ్లు, తొడలు, పొట్ట, నడుము వంటి భాగాల్లో ముడతలు పోవాలంటే.. గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. దీన్ని ఆన్ చేసినప్పుడు ఆప్షన్స్‌ని బట్టి రెడ్ లేదా బ్లూ కలర్స్‌లో లైట్స్ వెలుగుతాయి. దీని ధర 65 డాలర్లు. అంటే 5,156 రూపాయలు. ఇలాంటి డివైజ్‌లు కొనేటప్పుడు ముందుగా వినియోగదారుల రివ్యూలతో పాటు ఆయా సైట్స్ క్రెడిబిలిటీలనూ పరిగణలోకి తీసుకోవాలి.
చదవండి: Aishwarya Rai Bachchan: నాలుగైదు పూటలు తింటా.. నీళ్లు బాగా తాగుతా.. నా బ్యూటీ సీక్రెట్ అదే!
Comments
Please login to add a commentAdd a comment