మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! డివైజ్‌ ధర? | Beauty Care: Handheld Facial Massager Benefits Price Details | Sakshi
Sakshi News home page

Skin Care: నల్లటి మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! ఈ డివైజ్‌ ధర?

Published Wed, Jan 18 2023 2:20 PM | Last Updated on Wed, Jan 18 2023 2:30 PM

Beauty Care: Handheld Facial Massager Benefits Price Details - Sakshi

స్కిన్‌కేర్‌లో స్త్రీలు పాటించే పద్ధతులు చాలా ప్రత్యేకం. తెలిసిన చిట్కాలు.. నిపుణుల సలహాలు.. పార్లర్స్‌లో  ట్రీట్మెంట్‌లు.. ఇలా అన్నిటినీ అవలంబిస్తారు. అయినా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకు మంచి సొల్యూషన్‌.. ఈ హ్యాండ్‌హెల్డ్‌ ఫేషియల్‌ మసాజర్‌. బెస్ట్‌ స్కిన్‌ స్పెషలిస్ట్‌లా ఉపయోగపడుతుంది.

ఈ కాంపాక్ట్‌ ఎలక్ట్రిక్‌ ఫేస్‌ అండ్‌ స్కిన్‌కేర్‌ థెరపీ టూల్‌.. సులభమైన ఎన్నో చికిత్సలను అందిస్తుంది. దీనిలోని ఎల్‌ఈడీ  లైట్‌ థెరపీ హెడ్‌.. ముడతలను, మచ్చలను పోగొడుతుంది. చర్మం లోతుల్లోకి వెళ్లి శుభ్రపరుస్తుంది. ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు.. కొల్లాజెన్‌ను నిర్మించడానికి.. తగిన మోతాదులో వైబ్రేషన్‌ను అందిస్తుంది. కాంతిమంతమైన ముఖాన్ని తీర్చిదిద్దడంలో ఈ పర్సనల్‌ బ్యూటీ మెషిన్‌  చక్కగా ఉపయోగపడుతుంది.

హాట్‌ అండ్‌ కోల్డ్‌ రింగ్స్‌తో పాటు క్లీనింగ్‌ రింగ్‌నూ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ స్వయంగా ఎవరికి వారే ట్రీట్మెంట్‌ చేసుకోవచ్చు. మైక్రోకరెంట్‌ టెక్నాలజీతో ఈ ఫేషియల్‌ మెషిన్‌..  కళ్ల చుట్టూ ఉండే నల్లటి మచ్చలను పోగొడుతుంది. అలాగే చర్మపు బిగువును కాపాడుతుంది.

ముఖ కండరాల్లో రక్తప్రసరణను బాగా పెంచి..  స్కిన్‌ టోన్‌ను మెరిపిస్తుంది. చిగుళ్ల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్‌ వంటి సమస్యలను.. అలసట, ఒత్తిడినీ దూరం చేస్తుంది.
ఈ మెషిన్‌ను భద్రపరచు కోవడానికి సాఫ్ట్‌ కేరింగ్‌ బ్యాగ్‌ లభిస్తుంది. అలాగే చార్జింగ్‌ పెట్టుకోవడానికి ఒక యూఎస్‌బీ చార్జింగ్‌ కేబుల్‌ ఉంటుంది.

ఇలాంటి డివైజెస్‌ను ఆన్‌లైన్లో కొనుక్కునే ముందు వినియోగదారుల రివ్యూస్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని ధర 395 డాలర్లు. అంటే రూ. 32 వేల పైనే. అయితే ఆప్షన్స్‌ని బట్టి.. అదనపు రింగ్స్‌ కొనుగోలుచేయడానికి అదనపు ధర ఉంటుంది. దీన్ని పురుషులు కూడా వినియోగించుకోవచ్చు.

చదవండి: CWS: డ్రైవర్‌ బబ్లూ.. అమెరికా డాక్టర్‌ కోమలి! చాలా మంది ఎందుకు ఇలా పిచ్చిగా ఆరాధిస్తారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement