Black scars
-
మచ్చలు మాయం, చర్మ నిగారింపు.. ఎన్నో ఉపయోగాలు! డివైజ్ ధర?
స్కిన్‌కేర్‌లో స్త్రీలు పాటించే పద్ధతులు చాలా ప్రత్యేకం. తెలిసిన చిట్కాలు.. నిపుణుల సలహాలు.. పార్లర్స్‌లో ట్రీట్మెంట్లు.. ఇలా అన్నిటినీ అవలంబిస్తారు. అయినా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకు మంచి సొల్యూషన్.. ఈ హ్యాండ్‌హెల్డ్ ఫేషియల్ మసాజర్. బెస్ట్ స్కిన్ స్పెషలిస్ట్‌లా ఉపయోగపడుతుంది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఫేస్ అండ్ స్కిన్‌కేర్ థెరపీ టూల్.. సులభమైన ఎన్నో చికిత్సలను అందిస్తుంది. దీనిలోని ఎల్ఈడీ లైట్ థెరపీ హెడ్.. ముడతలను, మచ్చలను పోగొడుతుంది. చర్మం లోతుల్లోకి వెళ్లి శుభ్రపరుస్తుంది. ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు.. కొల్లాజెన్‌ను నిర్మించడానికి.. తగిన మోతాదులో వైబ్రేషన్‌ను అందిస్తుంది. కాంతిమంతమైన ముఖాన్ని తీర్చిదిద్దడంలో ఈ పర్సనల్ బ్యూటీ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుంది. హాట్ అండ్ కోల్డ్ రింగ్స్‌తో పాటు క్లీనింగ్ రింగ్నూ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ స్వయంగా ఎవరికి వారే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మైక్రోకరెంట్ టెక్నాలజీతో ఈ ఫేషియల్ మెషిన్.. కళ్ల చుట్టూ ఉండే నల్లటి మచ్చలను పోగొడుతుంది. అలాగే చర్మపు బిగువును కాపాడుతుంది. ముఖ కండరాల్లో రక్తప్రసరణను బాగా పెంచి.. స్కిన్ టోన్‌ను మెరిపిస్తుంది. చిగుళ్ల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను.. అలసట, ఒత్తిడినీ దూరం చేస్తుంది. ఈ మెషిన్‌ను భద్రపరచు కోవడానికి సాఫ్ట్ కేరింగ్ బ్యాగ్ లభిస్తుంది. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక యూఎస్బీ చార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇలాంటి డివైజెస్‌ను ఆన్లైన్లో కొనుక్కునే ముందు వినియోగదారుల రివ్యూస్‌ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని ధర 395 డాలర్లు. అంటే రూ. 32 వేల పైనే. అయితే ఆప్షన్స్‌ని బట్టి.. అదనపు రింగ్స్ కొనుగోలుచేయడానికి అదనపు ధర ఉంటుంది. దీన్ని పురుషులు కూడా వినియోగించుకోవచ్చు. చదవండి: CWS: డ్రైవర్ బబ్లూ.. అమెరికా డాక్టర్ కోమలి! చాలా మంది ఎందుకు ఇలా పిచ్చిగా ఆరాధిస్తారు? -
తులసీదళం... ముఖ సౌందర్యం...
* గులాబి రేకుల్లా మృదువుగా ఉండాల్సిన ముఖం మొటిమలు, దద్దుర్లు, నల్ల మచ్చలతో నిండిపోయిందా? అయితే వాటిని దూరం చేసే ఔషధం మీ పెరట్లోనే ఉంది. 10-15 తులసి ఆకులను పేస్ట్‌లా చేసి, దాన్ని టమాటో గుజ్జుతో కలిపి ముఖానికి రాసుకోవాలి. అలా ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. *ఈ వర్షాకాలంలో వానకు తడిసీ తడిసీ జుట్టు తన సౌందర్యాన్ని కోల్పోతుంది. అలా కాకుండా కురులు నిగనిగలాడాలంటే తలంటు స్నానం చేసిన ప్రతిసారి రెండు టీ స్పూన్ల (శనగ పిండి), ఒక గుడ్డు తెల్ల సొన, ఒక టీ స్పూన్ పెరుగు, అర టీస్పూన్ నిమ్మరసం తీసుకొని వాటన్నింటిని కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి. రెండు వారాల్లో కనీసం ఇలా నాలుగుసార్లు చేస్తే మేనితో సమానంగా మెరిసే కురులు మీ సొంతం. * చేతులు, పాదాల చర్మకాంతి పెరగాలంటే... మూడు స్పూన్ల బోరాక్స్ పౌడర్, రెండు స్పూన్ల గ్లిజరిన్, రెండు కప్పుల రోజ్ వాటర్‌ను బాగా కలిపాలి. దాన్ని కాళ్లకు, చేతులకు రాసుకొని ఓ 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే అది మంచి స్క్రబ్‌లా పని చేస్తుంది. * ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు అల్లం రసాన్ని తాగితే అది ముఖంపై మొటిమలను దూరం చేస్తుంది. అంతేకాదు ఆ రసాన్ని మాడుకు రాసుకుంటే రక్త ప్రసరణ బాగా జరగడంతో చుండ్రు మాయమవుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.