Skin Care
-
మసాజ్ రోలర్: వయసు పైబడినట్లు కనిపడనివ్వదు..!
వయసు ప్రభావం చర్మంపై కనిపించకుండా ఉండాలంటే, మర్దనను మించినది లేదు. రకరకాల తైలాలతో శరీరాన్ని మర్దన చేసే పద్ధతులు పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఏ తైలాలను ఉపయోగించినా, ఇతర ద్రావణాలను ఉపయోగించినా, చర్మం లోలోతుల్లోకి చేరితేనే ఫలితం ఉంటుంది. ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకునేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చిన సాధనమే ఈ డెర్మా మసాజ్ రోలర్. మర్దనకు అవసరమైన తైలాలు లేదా సీరమ్‌లు నింపుకోవడానికి ప్రత్యేకమైన మినీకంటైనర్తో రూపొందిన ఈ పరికరం పైభాగంలో రోలర్ హెడ్‌కు అన్నివైపులా టిటానియం నీడిల్స్ ఉంటాయి. దీనిని చర్మానికి ఆనించి, మర్దన చేసుకునేటప్పుడు రోలర్ గుండ్రంగా తిరుగుతుంది. దాంతో దీనికి ఉన్న నీడిల్స్ చర్మాన్ని లోతుగా ఒత్తి, రక్తనాళాలను ఉత్తేజితం చేస్తాయి. ఈ రోలర్‌తో ఎవరికి వారే స్వయంగా మర్దన చేసుకోవచ్చు. ఇది ఎలాంటి నొప్పిని కలిగించదు. నుదురు, బుగ్గలు, ముక్కు, పెదవులు, గడ్డం, చేతులు, పొట్ట వంటి భాగాల్లో ఈ రోలర్‌తో కావలసిన నూనె లేదా సీరమ్ ఉపయోగించి, మర్దన చేసుకోవచ్చు. ఇది కేశసంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. తలపై కూడా దీనితో మర్దన చేసుకోవచ్చు. ఈ పరికరాన్ని వినియోగించిన తర్వాత రోలర్‌ను, కంటైనర్‌ను వేరుచేసి, శుభ్రం చేసుకున్న తర్వాత మెత్తని వస్త్రంతో తుడిచి, ఆరబెట్టుకోవాలి. ఈ రోలర్‌తో ట్రాన్స్పరెంట్ క్యాప్ లభిస్తుంది. వాడకం పూర్తయ్యాక రోలర్‌కు క్యాప్ పెట్టుకున్నట్లయితే, దీనిపై దుమ్ము, ధూళి చేరకుండా ఉంటాయి. (చదవండి: హెచ్ఐవీ-ఎయిడ్స్: టీకాకు దీటుగా సూదిమందు...) -
ముఖంలోని డల్‌నెస్‌ని తరిమేద్దామిలా..!
పర్యావరణ కాలుష్యం కారణంగా పెద్దవాళ్లకైన, యువతకి చర్మం డల్‌గా మారి అందవిహీనంగా కనిపిస్తోంది. దీంతోపాటు ముడతలు, కళ్లకింద నలుపు మరింత అసహ్యంగా మారిపోతుంది స్కిన్. అలాంటి డల్‌నెస్ చర్మాన్ని మిల మిల మెరిసేలా యవ్వనపు కాంతిని సంతరించుకోవాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి మరి...కొబ్బరి నీళ్లను వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి అప్లై చేస్తూ, మసాజ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. నిస్తేజంగా మారిన ముఖ చర్మం జీవకళతో తొణికిసలాడుతుంది. టీ స్పూన్ టొమాటో గుజ్జు, శనగపిండి, చిటికెడు పసుపు, అర టీ స్పూన్ నిమ్మరసం, కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కళ్లమీద గుండ్రంగా తరిగిన కీరా ముక్కలు ఉంచి ఇరవై నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే కళ్లకింద నల్లని వలయాలు తగ్గుముఖం పట్టి, ముఖం కాంతిమంతం అవుతుంది.రెండు టీ స్పూన్ల గోధుమ పిండిలో తగినన్ని పాలు పోసి, ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం లేని ముఖ చర్మం కళకళలాడుతుంది. ఉప్పు కంటెంట్ లేని టేబుల్ స్పూన్ బటర్ని బ్లెండ్ చేయాలి. అందులో స్ట్రాబెర్రీ గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముడతలను నివారిస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. (చదవండి: నటి షెహ్నాజ్ గిల్ డైట్ ప్లాన్ ఇదే..! ఆరు నెలల్లో 55 కిలోలు..) -
చర్మతత్వానికి సరిపోయే ఫేస్ ప్యాక్‌లు..!
ఇంట్లో మనం అనునిత్యం ఉపయోగించేవే చక్కటి సౌందర్య సాధనాలుగా పనికొస్తాయి. వాటితో చక్కటి మెరిసే చర్మాన్ని పొందొచ్చు కూడా. అయితే ఎలాంటి చర్మం కలవారికి ఏది బెటర్ అనేది చాలామంది సరైన అవగాహన ఉండదు. అలాంటివారు సౌందర్య నిపుణులు చెబుతున్న ఈ చిట్కాలు ఫాలో అయితే సరి. మరి అవేంటో చూద్దామా..!..పాది ద్రాక్షపండ్లు, ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు తీసుకోవాలి. ద్రాక్షపండ్లను, నిమ్మ రసాన్ని, కోడిగుడ్డు తెల్లసొనను బ్లెండ్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది జిడ్డు చర్మానికి వేయాల్సిన ప్యాక్. నిమ్మరసం నేచురల్ క్లెన్సర్. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ద్రాక్షరసం మృదుత్వాన్నిస్తుంది, కోడిగుడ్డు తెల్లసొన చర్మాన్ని వదులు కానీయకుండా రక్షిస్తుంది. దీనిని పొడి చర్మానికి కాని నార్మల్ స్కిన్‌కు కాని వాడితే మరింత పొడిబారే అవకాశం ఉంది.రకరకాల పండ్లను, సౌందర్య సాధనాలను కలిపి ప్యాక్ తయారు చేసుకోవడానికి సమయం, సహనం లేనప్పుడు నిమ్మకాయను సగానికి కోసి ఒక చెక్కతో ముఖాన్నంతటినీ రుద్ది పదిహేను నిమిషాల సేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితో శుభ్రంచేయాలి. ఇది జిడ్డును తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది కూడా పొడి చర్మానికి పనికిరాదు.ఒక టీ స్పూన్ తేనెలో అంతే మోతాదులో పాలు కలిపి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల సేపటికి కడగాలి. రెండు రోజులకొకసారి ఇలా చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.డ్రైస్కిన్ అయితే... ఒక టీ స్పూన్ తేనె, అంతే మోతాదులో నిమ్మరసం, వెజిటబుల్ ఆయిల్‌లను బాగా కలిపి ప్యాక్ వేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. కొబ్బరి, వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్, సోయా... ఇలా ఏదైనా సరే... అందుబాటులో ఉన్న ఆయిల్ వాడవచ్చు. (చదవండి: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..! సమస్యను బయటపెట్టిన ప్రియాంక చోప్రా -
గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో!
అందమైన, మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఇది వారి వారి జీవన శైలి, జెనెటిక్ ప్రభావాలు, పని పరిస్థితులు, మానసిక, శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉన్న రంగు, ప్రకాశవంతమైన చర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా శ్రమ, ఓర్పు అవసరం అనడంలో ఆశ్చర్యం లేదు. దీని కోసం సెలబ్రిటీలు చాలా కేర్ తీసుకుంటారు. వారిలో గ్లోబల్ పాప్ స్టార్, జెన్నీ కిమ్ ఒకరు. కిమ్ లాంటి షైనింగ్ స్కిన్ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందామా?గ్లోబల్ స్టార్, జెన్నీ కిమ్ ముఖం మచ్చలేని చంద్రబింబంలా మెరిసిపోతూ ఉంటుంది. బ్లాక్పింక్గా పేరొందిన జెన్సీ మచ్చలేని, మెరిసే చర్మానికి పాపులర్. అసలు ఆమె స్కిన్ టోన్ చూసిన సౌందర్య నిపుణులు, అభిమానులు ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన ముఖ సౌందర్యం ఆమె సొంతం.చర్మ సంరక్షణకోసం ఆమె ఏం చేస్తుంది?జెన్నీ సహజమైన మెరుపు కోసం, చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. స్కిన్కేర్కు ఆమె అనుసరించే పద్ధతులు చాలా సరళమైనవి, పైగా ప్రభావ వంతమైవి. ఏదైనా పెద్ద ఈవెంట్లకు ముందు ఆమె ముఖాన్ని ఐసింగ్ (ఐస్‌వాటర్‌లో ఫేస్‌ను ముంచడం) చేస్తుంది. డబుల్ క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్ వంటి ముఖ్యమైన పద్ధతులను పాటిస్తుంది. ప్రీ-ఈవెంట్ బ్యూటీ హ్యాక్ సందర్భంగా తన బ్యూటీ సీక్రెట్స్‌ను పంచుకుంది. ఖరీదైన ఉత్పత్తులే అవసరం లేదు, కేవలం ఐస్-కోల్డ్ వాటర్ లాంటివి కూడా సరిపోతాయని తెలిపింది.ఐస్ వాటర్ ట్రిక్ఏదైనా ప్రధాన కార్యక్రమానికి ముందు తన ముఖాన్ని ఐస్ వాటర్ గిన్నెలో కాసేపు ఉంచుతుంది. ఈ చర్మ సంరక్షణలో పురాతన ట్రిక్ తనకు చాలా ఇష్టమైనదనీ, ఇది చర్మాన్ని బిగుతుగా చేయడంతోపాటు, ఉబ్బును తగ్గించి, మెరుపును పెంచుతుందని తెలిపింది.ఈ టెక్నిక్‌ను స్కిన్‌కేర్ ప్రిపరేషన్ స్టెప్‌గా ఉపయోగిస్తున్నప్పటికీ, ప్రయోజనాలు మేకప్‌కు మించి అందంగా చేస్తాయని పేర్కొంది. అలాగే చల్లని నీరు రక్త నాళాలను టైట్ చేస్తుందనీ, చర్మాన్ని తాజాగా కనిపించేలా చేస్తుందని చెప్పింది. తద్వారా ముఖంలోని చర్మానికి తక్షణ బూస్ట్ ఇస్తుందని వివరించింది.హైడ్రేషన్ కోసం ఫేస్ మాస్క్జెన్నీ ఫేస్ మాస్క్‌లకు పెద్ద అభిమాని, హైడ్రేషన్ , పోషణను నిర్వహించడానికి ఈమాస్క్ వేసుకోవడం దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటుందట. ఫేస్ మాస్క్‌లు, ముఖ్యంగా షీట్ మాస్క్‌లు, కొరియన్ స్కిన్‌కేర్‌లో ప్రధానమైనవి. ఇవి చర్మం తాజాగా ఉండటానికి సహాయపడతాయి.డీప్ క్లీన్ స్కిన్ కోసం డబుల్ క్లెన్సింగ్జెన్నీ స్కిన్‌కేర్ రొటీన్లో మరో ముఖ్యమైన భాగం డబుల్ క్లెన్సింగ్. దీని కోసం ముందుగా మేకప్, సన్‌స్క్రీన్ అదనపు నూనెలను తొలగించడానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్‌ను ఉపయోగిస్తుందట. ఆ తరువాత మురికి మలినాలను తొలగించడానికి వాటర్ ఆధారిత క్లెన్సర్‌ను వాడుతుంది. డబుల్ క్లెన్సింగ్ చర్మం అవసరమైన తేమను తొలగించకుండా పూర్తిగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది.చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!స్మూత్ స్కిన్ కోసం రెగ్యులర్ ఎక్స్ఫోలియేషన్జెన్నీ తన చర్మాన్ని మృదువుగా , మృత చర్మ కణాలను తొలగించుకునేందుకు ఎక్స్ఫోలియేషన్ ( స్క్రబ్బింగ్) రొటీన్‌గా ఆచరిస్తుంది. ఎక్స్‌ఫోలియేటింగ్ పోర్స్‌ను ఓపెన్ చేసి, ఛాయను ప్రకాశవంతం చేస్తుంది. అలాగే మనం వాడే చర్మ సంరక్షణ ఉత్పత్తుల శోషణను మెరుగుపరుస్తుంది. అతిగా ఎక్స్ఫోలియేషన్ చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పరిమితంగా ఈ పద్థతిని పాటిస్తుంది. ఐ క్రీమ్‌లు , సీరమ్లుజెన్నీ స్కిన్‌కేర్ రొటీన్లో కీలకమైన భాగం ఐ క్రీమ్‌లు ,సీరమ్. ఐ క్రీమ్‌లు ద్వారా కంటికింద మచ్చలు, కళ్ల ఉబ్బులాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మరోవైపు, సీరమ్స్ ద్వారా స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుందని, హెల్తీగా ఉంటుందని తెలిపింది. వీటిన్నితోపాటు, పుష్కలంగా నీరు తాగుతుంది. ఇక కొరియన్ చర్మ సంరక్షణలో ముఖ్య భాగమైన ప్రతీరోజూ సన్‌స్క్రీన్‌ను వాడుతుంది. దీని ద్వారా అకాల వృద్ధాప్యాన్ని కాకుండా ఉంటుందనీ, అలాగే హానికరమైన UV కిరణాల నుండి చర్మానికి రక్షణఉంటుందని వివరించింది.ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! -
వయసును దాచేస్తుంది
వయసును దాచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసును దాచుకోవడం కుదరక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారి కోసం అందుబాటులోకి వచ్చింది ఈ హోమ్ స్కిన్‌కేర్ టూల్. దీని పేరు లక్సేన్ బ్యూటీ ఫర్మాగ్లో బాడీ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్. ఇది ఇట్టే వయసును దాచేస్తుంది. యాంటీ ఏజింగ్, స్కిన్ టైటెనింగ్ వంటి ప్రయోజనాలను అందించే ఈ పరికరం శరీరంలోని ప్రతిభాగాన్నీ యవ్వనం తొణికిసలాడేలా తీర్చిదిద్దుతుంది. ఇది కాళ్లు, చేతులు, తొడలు, నడుము, వీపు, పొట్ట తదితర భాగాలకు చక్కని మర్దన అందిస్తుంది.అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం చర్మాన్ని తేలికగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చర్మం బిగిని పునరుద్ధరిస్తుంది. మృతకణాలను తొలగించి, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ పరికరం ముఖం సహా శరీర భాగాల్లోని చర్మం పైపొరను సున్నితంగా తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై ముడతలు, వయసుతో వచ్చే మచ్చలు సహా చిన్నచిన్న సౌందర్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి స్క్రబర్‌లా, బ్రష్‌లా పనిచేసి చర్మానికి కొత్త మెరుపునిస్తుంది.ఇది మన్నికైన, సరసమైన, సులభమైన మాన్యువల్ సాధనం కావడంతో దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంది. వారానికి ఐదే ఐదు నిమిషాలు కేటాయించి.. పైనుంచి కింద వరకూ ఆయిల్ లేదా క్రీమ్ ఏదైనా అప్లై చేసుకుని, దీనిని రబ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని చాలా తేలికగా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఈ పరికరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. దీని ధర 149 డాలర్లు. అంటే 12,810 రూపాయలు. -
అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!
మెరిసే గ్లాస్స్కిన్ కోసం కే బ్యూటీ అంటూ రకరకలా బ్యూటీ ప్రొడక్ట్‌లు, సౌందర్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అవన్నీ ఎలా ఉన్నా పూర్వకాలంలో కొందరు ప్రసిద్ధ రాణుల అందాల గరించి కవులు వర్ణించి చెప్పినట్లు కథకథలగా విన్నాం. అయితే ఆ రాణులు(Queens) ఆ కాలంలోనే తమ అందం కోసం ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో వింటే విస్తుపోతారు. అందుకోసం ఎలాంటి వాటిని సౌందర్య సాధనాలు(Beauty Secret)గా ఉపయోగించారో వింటో వామ్మో..! అని నోరెళ్లబెడతారు.క్లియోపాత్రా గాడిద పాలతో స్నానం..ఈజిప్ట్ టోలెమిక రాజ్యం రాణి క్లియోపాత్రా(Cleopatra) చర్మ సంరక్షణ కోసం గాడిద పాలతో స్నానం చేసేదట. అందుకోసం రోజు సేవకులు బిందెల కొద్ది గాడిద పాలను పితికి రెడి చేసేవారట. అవి విరిగిపోయాక వాటితో స్నానం చేసేదట. అందుకోసం దాదాపు 700 గాడిద పాలను వినియోగించేవారట. రోజంతో గాడిద పాల బాత్‌తో మునిగిపోయేదట. ఎలిసబెత్..దూడ మాంసం మాస్క్.. 'సిసి' అని పిలిచే ఆస్ట్రియా సామ్రాజ్ఞి ఎలిసబెత్(Elisabeth) 19 శతాబ్దంలో అందానికి ప్రసిద్ధి చెందిన రాణి. ఆమె మచ్చలేని తెల్లటి పింగాణీలా మెరిసే చర్మం కోసం స్ట్రాబెర్రీల ప్యాక్ ముఖానికి రాసేదట. అలాగే చర్మ ఆరోగ్యం కోసం ఆలివ్ నూనెతో స్నానాలు చేసేదట. ముఖ్యం కాంతిగా కనిపించాలని దూడ చర్మాన్ని మాస్క్‌గా వేసుకుని నిద్రించేదట. ఇక ఆమె వొత్తైన జుట్టు గురించి కథలుకథలుగా చెప్పుకునేవారట. ప్రతి మూడు వారాలకొకసారి పచ్చి గుడ్లు, బ్రాందీల మిశ్రమాన్ని అప్లై చేసుకునేదట. అది ఆరిపోయే వరకు మారథాన్‌లా వాక్ చేస్తూ ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. మేరీ ఆంటోయినెట్: పావురాలు ఉడికించిన నీళ్లు..ఫ్రాన్స్ రాణి మేరీ ఆంటోయినెట్(Marie Antoinette) అందం కోసం ఎన్నో విలక్షణమైన సౌందర్య సాధనాలను ఉపయోగించేది. ఆమె ముఖాన్ని యూ కాస్మెటిక్ డి పిజియన్తో కడుక్కునేదట. ఇది పండ్ల రసం, పూల సారం, మూడు ఫ్రెంచ్ రోల్స్, బోరాక్స్, 17 రోజల పాటు ఉడికించి పులియబెట్టిన ఎనిమిది పావురాల మిశ్రమం అట.ఎలిజబెత్ I: అత్యంత విషపూరితమైన సీసం..క్వీన్ ఎలిజబెత్ I(Elizabeth I) పాలనలో "వెనీషియన్ సెరూస్" అనే సీసాన్ని సౌందర్య సాధనంగా ఉపయోగించేవారట. ఈ సీసం(Lead), వెనిగర్ల మిశ్రమాన్ని తెల్లటి కాంతి వంతమైన రంగు కోసం చర్మానికి పూసేవారట. ఇవి చికెన్‌పాక్స్(తట్టు, అమ్మవారు) వంటి చర్మవ్యాధుల తాలుకా మచ్చలను నివారించి మచ్చలేని చర్మంలా ప్రకాశవంతంగా చేస్తుందట. అయితే ఈ రాణి చిన్నవయసులోనే అకాల మరణం చెందింది. అందుకు ఆమె ఉపయోగించిన ఈ సీసమే కారణమని అంటుంటారు. ఎందుకంటే లెడ్ సల్ఫైడ్(సీసం) ఖనిజ రూపమైన బ్లాక్ పౌడరే ఈ వెనీషియన్ సెరూస్. ఇది ముఖానికి పూస్తే లేత గులాబీ రంగు ఛాయతో మెరుస్తుంటుందట. అంతేగాదు కళ్లు చక్కగా కనిపించేలా ఐలైనర్లాగా కూడా వాడేవరట. అయితే ఇందులో ఉండే సీసం అత్యంత హానికరమైనది. ఇది అనారోగ్యం బారినపడేలా చేసి మరణానికి కారణమవుతుందంటూ ప్రస్తుతం బ్యాన్ చేశారు అధికారులు. (చదవండి: ఆ థెరపీ పేరెంట్స్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!: ఇరాఖాన్) -
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో కొరియన్ స్కిన్‌కేర్ & మేకప్ బ్రాండ్ ఎంట్రీ
సౌందర్య ప్రియులు,బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ కొరియన్ చర్మ సంరక్షణ మేకప్ సంచలనం టిర్టిర్( TIRTIR) ఇండియాలో లాంచ్ అయింది. రిలయన్స్ రిటైల్‌కు చెందిన టిరాతో కలిసి ఇది ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. భారతీయ బ్యూటి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని రిలయన్స్ ప్రకటించింది. Tira స్టోర్లు, Tira యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్బంగా కొనుగోలుదారులకు ఆఫర్లను కూడా అందిస్తోంది.ముఖ్యంగా మాస్క్ ఫిట్ రెడ్ కుషన్ ఫౌండేషన్,ఆకట్టుకునే 30 షేడ్స్‌తో తీసుకొచ్చింది. మిల్క్ స్కిన్ టోనర్, సిరామిక్ మిల్క్ ఆంపౌల్, మాస్క్ ఫిట్ మేకప్ ఫిక్సర్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది.చర్మ సంరక్షణ-జాగ్రత్తలుఏ సీజన్లో అయినా చర్మ ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. తాజా పండ్లు, కూరగాయలతోపాటు సరిపడా నీళ్లు తాగాలి. చర్మ సంరక్షణకు హైడ్రేటింగా ఉండటం, రిఫ్రెషింగ్ చాలా కీలకం. చర్మం కాంతివంతంగా ప్రకాశించేలా ఉండాలంటే ఎండలో ఉన్నా, నీడలో ఉన్నా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. కెమికల్స్ వాడని సహజమైన సౌందర్య ఉత్పత్తులను వినియోగించాలి. నాణ్యమైన బ్రాండ్లను ఎంచుకోవాలి.ఒత్తిడికి, ఆందోళనకు దూరంగా ఉండాలి. మ్యాకప్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. బ్యూటీ నిపుణులు, స్కిన కేర్ వైద్య నిపుణుల సలహాల మేరకు ఉత్పత్తులను వాడాలి.ఎప్పటికపుడు మేకప్‌ను రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం -
వింటర్ ది డ్రాగన్: చలిపులి.. చర్మం వలుస్తోందా?
కొత్త ఏడాది తర్వాత క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయేమోగానీ... అందరూ బయటే ఎక్కువసేపు గడిపే సాయంత్రాలూ, పనులకు వెళ్లే ఉదయం వేళల్లో చలి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్లో వీచే కరకుగాలులు వాతావరణం నుంచి తేమను లాగేస్తాయి. అవి చర్మం నుంచి కూడా తేమను లాగేస్తుండం వల్ల మేను పొడిబారుతుంది. పొట్టుగా రాలుతుంది. ఇలాంటి సమస్యలన్నీ ఈ సీజన్లో అనివార్యంగా కనిపిస్తుంటాయి. ఒక్కొక్కరి చర్మ స్వభావం ఒక్కోలా ఉండటం వల్ల కొందరిలో చలికాలపు సమస్యలు ఎక్కువగానూ, మరికొందరిలో తక్కువగానూ కనిపిస్తుంటాయి. ఈ చలి సమస్యల తీవ్రత చర్మంపై చాలా ఎక్కువగా ఉన్నవారిలో... వారి మేనిపై పగుళ్లు, చర్మం పొట్టుగా రాలడం వంటి లక్షణాలతో ఎక్జిమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సీజన్లో కనిపించే సమస్యల నుంచి రక్షణ పొందడమెలాగో తెలుసుకుందాం.కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులతో చలికాలపు తీవ్రత నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. అవి తెలుసుకునే ముందర ఈ కాలంలో వచ్చే కొన్ని సాధారణ చర్మ సమస్యలేమిటో చూద్దాం...ఇవీ సాధారణంగా కనిపించే చర్మ సమస్యలు... ఎక్జిమా ఫ్లేర్స్ : తక్కువ ఉష్ణోగ్రతల వల్ల చర్మం ప్రభావితమై ఎగ్జిమాలాంటి పగుళ్లు. చర్మం పొడిబారడం, పొట్టుగా రాలడం : బయటి చల్లగాలి కారణంగా దేహంలోని వేడిమి చర్మం నుంచి బయటకు వెళ్లడంతో తేమ కూడా బయటకు వెళ్తుంది. దాంతో చర్మం బాగా పొడిబారిపోవడమే కాకుండా, పొట్టుగా రాలుతుంది. పగిలే పెదవులు : సున్నితమైన పెదవుల చర్మమూ పగుళ్లువారుతుంది. చిల్ బ్లెయిన్స్ : చేతులూ, పాదాల మీద చర్మం కొన్నిచోట్ల (పగుళ్లు రాబోయే చోట) ఉబ్బెత్తుగా మారుతుంది. ఇలాంటి ఉబ్బెత్తు ప్రదేశాల్లో నొప్పి ఉంటుంది. వీటిని చిల్ బ్లెయిన్స్ అంటారు. వింటర్ యాక్నె : జిడ్డు చర్మం వల్లనే మొటిమలు ఎక్కువగా వస్తాయన్న భావన చాలామందిలో ఉంటుంది. దీనికి భిన్నంగా వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడూ మొటిమలు వస్తాయి. వీటిని ‘వింటర్ యాక్నే’గా చెప్పవచ్చు.చర్మం ప్రభావితమైందని తెలిపే సూచనలివి... చలికాలపు చల్లగాలులకు చర్మం ప్రభావితమైనదనీ, దానికి ఇప్పుడు మరింత రక్షణాత్మక చర్యలు అవసరమని తెలియజేసేలక్షణాలివి... చర్మం ఎర్రబారడం, ఇలా ఎర్రబారిన చోట దురద రావడం ఏవైనా ఉపశమన చర్యలకోసం లేపనాల వంటివి రాసినప్పుడు ప్రభావితమైన చర్మభాగాలు మంటగా అనిపించడం చర్మం తీవ్రంగా పొడిబారినప్పుడు అక్కడ పొట్టులా రాలడం చర్మం నుంచి తేమ తొలగి΄ోవడంతో చర్మం బాగా బిగుతుగా ఉన్న ఫీలింగ్ ఏవైనా చర్మ సంరక్షణ లేపనాలు రాసినప్పుడు చర్మం ముట్టుకోనివ్వకపోవడం. చర్మంపై చలికాలపు దుష్ప్రభావాల నివారణ, రక్షణ చర్యలివి... తేమ పెరిగేలా చూసుకోవడం: చర్మం ఎప్పుడూ తేమ కోల్పోకుండా చూసుకునేందుకు క్రమం తప్పకుండా... హైలూరానిక్ యాసిడ్, షియా బటర్ లేదా సెరమైడ్స్ ఉండే మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మరవకూడని సన్ స్క్రీన్ : చలికాలపు ఎండవేడిమిలోనూ అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఎండలోకి వెళ్లేముందర 30 ప్లస్ ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను చర్మంపై రాసుకోవడం మంచిది. హ్యుమిడిఫైయర్ వాడటం : గదిలోపల ఉండే పొడిదనాన్ని ఎదుర్కోవడం కోసం (మరీ ముఖ్యంగా బెడ్రూమ్ వంటి చోట్ల) క్రమం తప్పకుండా హ్యుమిడిఫైయర్ వాడాలి. గోరువెచ్చటి నీటితో స్నానం : వెచ్చటి నీళ్లతో స్నానం చేయడమన్నది స్నానం వేళ బాగున్నప్పటికీ ఆ తర్వాత చర్మం తీవ్రంగా పొడిబారి పగుళ్లుబారినట్లుంటుంది. దీనికి బదులు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే... స్నానం తర్వాత చర్మం బాగుంటుంది. గాఢమైన సౌందర్యసాధనాలు వద్దు చర్మంపై రాసుకునే ఉత్పాదనల్లో ఆల్కహాల్, రెటినాల్, మెంథాల్ వంటివి ఎక్కువ మోతాదుల్లో ఉన్నవి గానీ లేదా ఇతరత్రా గాఢమైన వాసనలు వచ్చే సౌందర్యసాధనాలకు బదులు తేలికపాటి సువాసన వెదజల్లే మైల్డ్ సౌందర్యసాధనాలు వాడుకోవడమే మంచిది. నీళ్లు తాగుతుండటం: చర్మం కోల్పోయే నీటి మోతాదులను మళ్లీ మళ్లీ భర్తీ చేసుకునేందుకు వీలుగా ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. మేని నిగారింపును పెంచే ఆహారాలు తీసుకోవడం: మేని నిగారింపును మరింతగా పెంచే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన... అన్ని రకాల ΄ోషకాలూ పుష్కలంగా ఉండే సమతులాహారం తీసుకోవడం మేలు. వైద్యనిపుణులను సంప్రదించడం: పైన పేర్కొన్న అన్ని రకాల జాగ్రత్తలను తీసుకున్న తర్వాత కూడా చర్మంపై చలికాలపు దుష్ప్రభావాలు కనిపిస్తుంటే... తక్షణం చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది. డా. బాల నాగ సింధూర కంభంపాటి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ (చదవండి: టేస్టీ బర్గర్ వెనుకున్న సీక్రెట్ తెలిస్తే కంగుతినడం ఖాయం..! ) -
చర్మం పొడిబారుతోందా..?
చలికాలం చర్మం పొడిబారే సమస్య అధికంగా ఉంటుంది. పొడిచర్మం గలవారికి ఇది మరింత సమస్య. నూనె శాతం ఎక్కువ ఉండే క్రీములు, లోషన్లు ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అందుకు... ఇంట్లో చేసుకోదగిన సౌందర్యసాధనాలు..ఆలివ్ ఆయిల్‌తో... కోకోబటర్లో చర్మాన్ని మృదువుగా మార్చే మాయిశ్చరైజర్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. టేబుల్ స్పూన్ కోకోబటర్– ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది ముఖానికి, మెడకు రాసి 15–20 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.పాల మీగడమీగడలో ఉండే నూనె చర్మాన్ని పొడిబారనీయదు. తేనెలో చర్మసంరక్షణకు సహాయపడే ఔషధాలు ఉన్నాయి. మీగడ–తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. రోజూ పాల మీగడ–తేనె కలిపిన మిశ్రమాన్ని ఉపయోగిస్తే చర్మకాంతి పెరుగుతుంది.బొప్పాయివిటమిన్–ఇ అందితే చర్మం త్వరగా మృదుత్వాన్ని కోల్పోదు. బాగా పండిన బొప్పాయి ముక్కను గుజ్జు చేసి, దాంట్లో పచ్చిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి.బాదం నూనెకోకో బటర్, బాదం నరి సమపాళ్లలో తీసుకొని కలిపి, మిశ్రమం తయారు చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. చర్మం పొడిబారే సమస్య దరిచేరదు. (చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది) -
ఎర్ర కలబందతో ఎన్నో ప్రయోజనాలు : తెలిస్తే, అస్సలు వదలరు!
కలబంద ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పటివరకూ చాలా విన్నాం. తరతరాలుగా సౌందర్య పోషణలో,చర్మ సంరక్షణలో కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోవలోకి ఇపుడు మరో కొత్త రకం కలబంద వచ్చి చేరింది. అదే రెడ్ కలబంద. ఈ రెడ్ కలబంద ఇప్పుడు చర్మ సంరక్షణ మార్కెట్లోకి వేగంగా దూసుకొస్తోంది. ముదురు ఎరుపు రంగుకు ప్రసిద్ధి చెందిన ఈ రకంలో చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.రెడ్ కలబంద ప్రయోజనాలు:ఆకుపచ్చ కలబందతో పోలిస్తే ఎరుపు రంగు కలబంద ఎక్కువ ఔషధ గుణాలు, ప్రయోజనాలున్నాయి. అందుకే ‘కింగ్ ఆఫ్ అలోవెరా’గా పేరు తెచ్చుకుంది. రెడ్ కలబంద వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.పోషకాలు: రెడ్ కలబందలో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), విటమిన్ సి, ఇ, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది పెద్ద మొత్తంలో అమైనో ఆమ్లాలు, పాలిసాకరైడ్లను కలిగి ఉంటుంది. ఇది జుట్టు, చర్మం, కళ్ళకు ఒక వరంలాంటిదట.యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం: ఎరుపు కలబంద ఆంథోసైనిన్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా దాని రంగు ఎర్రగా ఉంటుందని ర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జుష్యా భాటియా సారిన్ చెప్పారు. పర్యావరణ ఒత్తిడి ప్రభావాలను తగ్గించడానికి ఎరుపు కలబంద ఫేస్ సీరం ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే కొల్లాజెన్ చర్మం యవ్వనాన్ని కాపాడుతుంది. ఈ సమ్మేళనాలు కాలుష్యం, ఒత్తిడి, వృద్ధాప్యం వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయని. ఎర్ర కలబంద యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేటింగ్ మూలకాల శక్తివంతమైన మిశ్రమమని ఆమె తెలిపారు.రోగనిరోధక శక్తికి: ఎర్ర కలబంద రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది బాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది.మేనికి మెరుపు : విటమిన్లు A, C , E చర్మాన్ని ప్రకాశవంతంగా, దృఢంగా మారుస్తుంది. దీని ఆధారిత మాయిశ్చరైజర్ చర్మం యొక్క సహజ మెరుపును కాపాడుతుంది. చర్మానికి చల్లదనాన్నిస్తుంది. ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. రెడ్ కలడంద జ్యూస్‌తో శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలిన గాయాలు, గాయాలు, సోరియాసిస్ నివారణలో మేలు చేస్తుంది.గుండెకు మేలు : ఎర్ర కలబంద జ్యూస్‌తో గుండె ఆరోగ్యం బలపడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌లో పరిమిత రూపంలో దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ జ్యూస్ తాగడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్‌గా మారడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది ఎర్ర కలబందను జుట్టు మీద అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. -
పిగ్మెంటేషన్ సమస్యా?!
చర్మంపై బ్లాక్ స్పాట్స్, మచ్చలు కనిపించడం అన్ని వయసుల వారిలోనూ వచ్చే సమస్యే. కానీ, ఇటీవల యువతలో ఈ సమస్యను ఎక్కువ చూస్తున్నాం. ఎవరిలో అధికం అంటే...అధిక బరువు ఉన్నవారిలో మెడపైన, వీపు పైన మచ్చలు కనిపిస్తుంటాయి. నేరుగా ఎండ బారిన పడేవారికి చేతులు, ముఖం, పాదాలపై ట్యాన్ ఏర్పడుతుంది. కొంతమందిలో విటమిన్ల లోపం వల్ల మంగు మచ్చలు కూడా వస్తున్నాయి. సాధారణంగా యుక్తవయసులో మొటిమలు వస్తుంటాయి. మొటిమలను గిల్లడం, వాటిలో ఉండే పస్ తీయడం.. వంటి వాటి వల్ల మచ్చలు, ఇంకొందరిలో చర్మంపై గుంటలు ఏర్పడవచ్చు. కొందరికి సరైన అవగాహన లేక బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతిని మచ్చలు ఏర్పడతాయి. ఇంకొందరిలో చర్మం రకరకాల ఇన్ఫెక్షన్లకు లోనవుతుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మచ్చలు ఏర్పడి, అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.త్వరగా గుర్తించి...ముందుగానే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే ఇబ్బంది ఉండదు. థైరాయిడ్, ఒబేసిటీ, పీసీఓడీ సమస్యలు ఉంటే వాటికి చికిత్స తీసుకోవాలి. ఎండ నేరుగా తాకకుండా సన్ స్క్రీన్ వాడటం ముఖ్యం. వీటిలో బ్లూ లైట్ కాంపొనెంట్ ఉండే సన్‌స్క్రీన్స్ బెటర్.మంగు మచ్చలు వస్తున్నాయనుకునేవారు వారి వంశంలో ఈ సమస్య ఉంటే, ముందే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మొటిమలు, యాక్నె వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని గిల్లకూడదు. పింపుల్స్ తగ్గే ఆయిట్మెంట్స్ను నిపుణుల సూచనల మేరకు వాడాలి. పింపుల్స్ ఉండేవారు పింపుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏజ్‌తోపాటు వస్తాయి అవే పోతాయి అనుకోకూడదు. ఒకసారి చెక్ చేసుకొని, చికిత్స తీసుకోవాలి. విటమిన్ బి12 లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. క్యారట్, టొమాటో, విటమిన్– సి ఉన్న పండ్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆన్లైన్లో చూసి, ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ వాడకూడదు. అవి మీ చర్మతత్త్వానికి సరిపడతాయా లేదా అని చూడాలి. ఇంట్లో సౌందర్య లేపనాలను ఉపయోగిస్తూ, పార్లర్ ఫేసియల్స్ చేయకూడదు. ఏదైనా ఒకదాని మీద మాత్రమే ఆధారపడాలి. (చదవండి: సక్సెస్‌ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!) -
వేడి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఏమవుతుందో తెలుసా?
వేడి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అలసట తీరుతుంది. ముఖ్యంగా చలికాలంలో వేడి నీటి (Hot water) స్నానం ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే దుమ్ము ధూళితో నిండిపోయిన ముఖాన్ని (Face) వేడినీళ్లతో కడుక్కుంటే ప్రశాంతంగా ఉంటుంది. అయితే వేడి వేడి నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందట. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందట. వేడి నీరు మీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.వేడి-నీరు అకాల వృద్ధాప్యం వేడి నీరు ప్రశాంతంగా అనిపించినప్పటికీ, ముఖ చర్మంపై తీరని ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఎలా అంటే.. మన శరీరంలోని మిగిలిన భాగాలతో పోలిస్తే ముఖం చర్మం భిన్నంగా ఉంటుంది. చాలా సున్నితంగా, చిన్న కేశనాళికలతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత వంటి బాహ్య కారకాలకు తొందరగా ప్రభావితయ్యే ఉండే రంధ్రాలతో నిండి ఉంటుంది. వేడి నీరు అప్పటికపుడు ఊరటనిచ్చినా ఆ తరువాత అనేక సమస్యలను కలిగిస్తుంది అంటున్నారు.వేడి నీళ్లు ముఖంపై ఉండే సూక్ష్మకేశనాళికలకు హాని కలిగిస్తుంది. ఇరిటేషన్, చర్మం ఎర్రబారడం లాంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన చర్మం లేదా రోసేసియా వంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.నేచురల్ ఆయిల్స్‌కు నష్టంవేడి నీటి వలన ముఖంపై ఉండే సహజ నూనెలకు హాని కలుగుతుంది. ఇవి సెబమ్‌ను ఉత్పత్తి చేసి, తేమను కాపాడుతుంది. మృదువుగా ఉంచుతుంది. కానీ వేడి నీరు ఈ నూనెలకు నష్టం కలిగించి మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ముఖం మీద చర్మం తొందరగా ముడతలు పడేలా చేస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీంతో చర్మం సహజత్వాన్ని కోల్పోయి, ముడతలు తొందరగా వస్తాయి. ఫలితంగా వయసుకుమించి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. వయసు పెరుగుతున్న కొద్దీ కొల్లాజెన్,ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అతినీలలోహిత (UV) కిరణాలు కొల్లాజెన్ ఎలాస్టిన్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులు వంటి సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాలలో, ఎండలేకపోయినా కూడా చర్మాన్ని రక్షించు కునేందుకు సన్ స్క్రీన్ వాడాలి. ముఖాన్ని ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. అలాగే మొహాన్ని పదే పదే కడగడం వల్ల మెరుపు తగ్గిపోతుంది.కెమికల్స్‌తో కూడిన సబ్బులు, హానికరమైన రసాయన బ్యూటీ ప్రాడక్ట్స్‌ను అస్సలు వాడకూడదు.అలాగే అధిక కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు ,చక్కెరలు, గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారితీయవచ్చు. కొల్లాజెన్‌ను దెబ్బతీసి, తొందరగా ముసలి తనం వచ్చేలా చేస్తుంది. అందుకే పిండి పదార్ధాలను తగ్గించి, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి.మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి.ఎలాంటి మచ్చలు లేకుండా, మెరిసిపోతూ, ప్రకాశవంతమైన కాంప్లెక్షన్ రావాలంటే శుభ్రంగా తినాలి. విటమిన్లు అధికంగా ఉండే ఆహారం, ముఖ్యంగా విటమిన్ సి, ఆకుకూరలు, సోయా, చిక్కుళ్ళు, చేపలు, చికెన్ తాజా పండ్లు తీసుకోవాలి. అవసరమైతే చర్మ ఆరోగ్యానికి, ముఖ్యంగా బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే సప్లిమెంట్లను తీసుకోవాలి. -
స్కిన్ గ్లో శాశ్వతంగా ఉండాలంటే..ఇలా చేయండి!
చర్మం నిగారింపును అందరూ కోరుకుంటారు. అందుకు సౌందర్య ఉత్పత్తుల వాడకం, ఫేషియల్స్, స్కిన్ ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. ఈ విషయాల్లో సరైన అవగాహన లేక ఉపయోగించే పద్ధతులు ఒక్కోసారి రివర్స్ అవుతుంటాయి. ముఖ్యంగా.. మొటిమలు/యాక్నే సమస్య ఉన్నవారు పార్లర్లో ఫేషియల్స్ చేయించుకుంటారు. మళ్లీ ఇంట్లో కొన్ని రకాల మసాజ్‌లు చేస్తుంటారు. వీటివల్ల సమస్య మరింత పెరుగుతుంది. నిపుణుల ఆధ్వర్యంలో కెమికల్ పీల్ చేయించుకుంటారు. కానీ, ట్రీట్మెంట్కి ముందు–తర్వాత వాడే ప్రొడక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల సాధారణంగా ఉండే సమస్య మరింత పెరిగి, చర్మం దెబ్బతింటుంది.మచ్చలు తగ్గాలంటే..నలుపు/తెలుపు మచ్చలు కనిపించినప్పుడు మొదట సొంతంగా హోమ్ రెమిడీస్ చేస్తుంటారు. వీటి వల్ల కొన్ని రివర్స్ అవుతుంటాయి. దీర్ఘకాలపు సమస్యగా కూడా మారుతుంటాయి. క్రీములు, మెడిసిన్స్.. సమస్య మొదట్లోనే గుర్తించి, వాడితే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.లేజర్ చికిత్సమచ్చలకు, కొన్ని రకాల చర్మ సమస్యలకు లేజర్ చికిత్స అవసరం అవుతుంటుంది. చికిత్స తర్వాత సరైన క్రీములను ఉపయోగించకపోతే చర్మం పొడిబారుతుంది. కొత్త మచ్చలు కూడా పుట్టుకు వస్తుంటాయి. ఇదీ చదవండి: ఫోర్బ్స్'అత్యంత శక్తివంతమైన మహిళల' జాబితా : మరోసారి నిర్మలా సీతారామన్ ప్రొడక్ట్స్ .. అలెర్జీలు ఆహారం పడకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో సరైనది ప్రొడక్ట్ ఉపయోగించక పోతే చర్మానికి అలాంటి అలెర్జీలు ఉత్పన్నం అవుతుంటాయి. అందుకే, ఏదైనా కొత్త ప్రొడక్ట్ వాడాలనుకున్నప్పుడు ముందుగా చర్మంపై టెస్ట్ ప్యాచ్ చేసుకోవాలి. చలికాలం పొడి చర్మం గలవారికి స్కిన్ అలెర్జీ ఎక్కువ ఉంటుంది. క్రీములు, నూనెల వాడకంలో మరికొంత జాగ్రత్త తీసుకోవాలి. చర్మం నిగారింపు, హెయిర్ సాఫ్ట్‌నెస్ కోసం పర్మనెంట్ గ్లో వంటి చికిత్సల వైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, శాశ్వత పరిష్కారం అంటూ ఉండదు. సమస్య ఉత్పన్నం కాకుండా తీసుకునే ఆహారం, పానీయాలు, తమ శరీర తత్త్వానికి ఉపయోగపడే క్రీములను వాడుతూ ఉండాలి. – డా.స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
కిడ్స్‌పై కోల్డ్ వార్! 'పొడి' చెయ్యనియ్యొద్దు
చలికాలంలో చిన్నారుల చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. వాళ్లు చిన్నపిల్లలు కావడంతో తమ చర్మం గురించి ఎరుక, శ్రద్ధ వాళ్లలో ఉండదు. కానీ పిల్లల్లో ముఖం, పెదవులు పగలడం, కాళ్ల దగ్గరా పగుళ్లు రావడం వంటి అంశాలతో తల్లిదండ్రులు వారికోసం ఆందోళన పడుతుంటారు. ఇది చలికాలం కావడంతో టీనేజీ లోపు చిన్నారులకు వచ్చే చర్మ సమస్యల గురించి అవగాహన కోసం ఈ కథనం.చలికాలంలో చర్మం పొడిబారడం, పగుళ్లూ పిల్లలందరిలోనూ... ఆ మాటకొస్తే చాలామంది పెద్దవాళ్లలోనూ కనిపించేదే. కొందరు పిల్లల్లో జన్యుపరంగానే కొన్ని ప్రోటీన్లలోపం వల్ల చర్మం పొడిబారడం, ఎర్రబారడమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. మామూలుగా చర్మం బయటి కాలుష్యాలూ, వాతావరణం ప్రభావం, రాపిడి వంటి వాటి నుంచి రక్షణ కల్పిస్తుందన్నది తెలిసిందే. అయితే ఇలా పొడిబారి, ఎర్రగా మారడంతో.. కల్పించాల్సినంత రక్షణ కల్పించలేదు. ఇలా జరగడాన్ని ‘అటోపిక్ డర్మటైటిస్’గా చెబుతారు. అయితే ఈ సమస్య తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండక... చిన్నారి చిన్నారికి మారుతుంది. పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ చర్మ సమస్య, పరిష్కారాలు తెలుసుకుందాం. ఇటీవల వాతావరణంలో కాలుష్యాలు బాగా పెరగడం, పిల్లలు గతంలోలా ఆరుబయట మట్టిలో ఆడక΄ోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, తల్లిపాలకు బదులు డబ్బాపాలపై ఆధారపడటం, పిల్లలు సిజేరియన్ ప్రక్రియతో పుట్టడం వంటి కారణాలతో చిన్నారుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సరైనవిధంగా నియంత్రితం కావడం లేదు. దాంతో డాక్టర్లు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్‌ను ఎక్కువగా చూస్తున్నారు.ఈ సమస్యలో మొదట చర్మం పొడిబారి, ఎర్రగా మారి దురద వస్తుంటుంది. పిల్లలు పదే పదే గీరుతుండటంతో చర్మం కాస్త మందంగా మారుతుంది. ఆ తర్వాత దురద మరింతగా పెరుగుతుంది. ఈ రెండు ప్రక్రియలూ ఒక సైకిల్ (ఇచ్–స్క్రాచ్ సైకిల్)లా నడుస్తుంటాయి. ఈ అటోపిక్ డర్మటైటిస్ అన్నది నెలల పిల్లలు మొదలుకొని, ఏడాది వయసు వారి వరకు కనిపించవచ్చుపిల్లల్లో 12 నెలల వయసు వరకు... ప్రభావితమయ్యే భాగాలుచర్మం ఎర్రబారడమన్నది ముఖంపై కనిపిస్తుంటుంది గాని నిజానికి చర్మంపై శరీరంలోని ఏ భాగంలోనైనా ఇలా జరగవచ్చు.΄పాకే పిల్లల్లో సాధారణంగా వాళ్ల మోకాళ్లు నేలతో ఒరుసుకు΄ోతుంటాయి కాబట్టి వీళ్లలో మోకాళ్ల వద్ద ఎటోపిక్ డర్మటైటిస్ కనిపిస్తుంటుంది.ఏడాదీ రెండేళ్ల పిల్లల్లో... ఈ వయసు పిల్లల్లో చర్మం ప్రభావితం కావడంమన్నది చర్మం ముడుతలు పడే ్ర΄ాంతాల్లో ఎక్కువ. రెండు నుంచి ఆరేళ్ల పిల్లల్లో...ఈ వయసు పొడిబారడం మోకాళ్ల కిందనున్న చర్మంలో చాలా ఎక్కువ. ముఖం మీద చర్మం పెద్దగా పగలదు. పెదవులు చీలినట్లుగా కావడం, కంటి చుట్టూ నల్లటి ముడతలు, మెడ మురికిపట్టినట్లుగా నల్లగా కనిపించడం, కాళ్ల వేళ్లకింద పగుళ్లు (ఫిషర్స్), చేతి గీతలు కాస్త ప్రస్ఫుటంగా కనిపించడం, వెంట్రుకలు ఉన్నచోట బొబ్బల్లా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఏడు నుంచి పద్నాలుగేళ్ల పిల్లల్లో...ఏడు కంటే తక్కువ వయసు పిల్లలతో పోలిస్తే ఏడు నుంచి పధ్నాలుగేళ్ల వారిలో అటోపిక్ డర్మటైటిస్ లక్షణాల తీవ్రత తగ్గే అవకాశముంది. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం పగిలి ఉండటంతో తరచూ వైరల్ ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ వంటివి; అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉదాహరణకు స్టెఫాలోకోకల్ వంటివి కనిపించవచ్చు. నివారణ / మేనేజ్మెంట్ అండ్ చికిత్స స్నానం చేయించే వ్యవధి ఎంత తక్కువైతే అంత మంచిది. గోరు వెచ్చని నీళ్లతోనే స్నానం చేయించాలిస్నానం చేసిన వెంటనే పూర్తిగా తుడవకుండా టవల్‌తో అద్దుతూ ఆ తేమ మీదనే మాయిశ్చరైజర్ పట్టించాలి కాళ్లూ, చేతులు ఎక్కువగా పొడిబారతాయి కాబట్టి మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండు మూడుసార్లయినా పట్టించడం మంచిది ఉలెన్ దుస్తుల వల్ల పిల్లలకు ఇరిటేషన్ ఎక్కువగా వస్తుంటుంది. అందుకే వాటికి బదులు కాటన్ దుస్తులు ధరింపజేయడం మేలు దోమల వల్ల కూడా పిల్లల చర్మంపై దుష్ప్రభావం పడే అవకాశముంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి స్కూలుకు వెళ్లే వయసు పిల్లలకు షూజ్తో కాటన్ సాక్స్ వాడటం, గట్టి చెప్పులకు బదులు కాస్త మెత్తటి పాదరక్షలు వాడితే కాళ్ల పగుళ్ల వల్ల కలిగే బాధలు తగ్గుతాయి సమస్య మరింత తీవ్రమైతే డర్మటాలజిస్టులను కలవాలి. సమస్య తీవ్రతను బట్టి వారు తగిన చికిత్స అందిస్తారు.(చదవండి: కంటికి ‘మంట’ పెట్టేస్తది.. సిగరెట్ అంటించకండి!) -
చలికాలంలో మీ స్కిన్ మృదువుగా ఉండాలంటే.!
చలికాలం చర్మం పొడిబారి, జీవం కోల్పోయినట్టు కనపడుతుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు సంబంధించి కొన్ని టిప్స్ మీకోసం. టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు రాసి మసాజ్ చేయాలి. స్నానం చేసేముందు నాలుగు చుక్కల బాదం నూనె బకెట్ నీటిలో కలపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది. స్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి చలికాలం నూనె శాతం అధికంగా ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి, మర్దనా చేయాలి. మృతకణాలు తొలగి పోయి చర్మం మృదువుగా మారుతుంది. -
ఈ డివైజ్‌తో మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం..!
మొటిమలు, వాటి వల్ల ఏర్పడే మచ్చలు ముఖ సౌందర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా టీనేజ్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. చిత్రంలోని ‘సోలావేవ్ లైట్ థెరపీ డివైస్’ ముఖంపై పేరుకున్న జిడ్డును, మొటిమలను, వాటి కారణంగా కలిగిన మచ్చలను ఇట్టే తొలగిస్తుంది. అంతేకాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.ఈ డివైస్.. చర్మానికి పూర్తిగా సురక్షితమైనది. బ్లూ కలర్ లేదా రెడ్ కలర్ అనే రెండు ఆప్షన్స్‌తో ఇది ఏమాత్రం నొప్పి లేకుండా చికిత్స అందిస్తుంది. దీన్ని సుమారు తొమ్మిదిసార్లు వినియోగిస్తే, 90 శాతం వరకు ఫలితం కనిపిస్తుంది. దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. పరికరాన్ని ఆఫ్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా ముందున్న బటన్ని ఒక సెకను పాటు ప్రెస్ చేసి ఉంచితే సరిపోతుంది. ఈ మెషిన్ని సుమారు 3 నిమిషాలు ఆన్ చేసి, ఆప్షన్ ఎంపిక చేసుకుని, సమస్య ఉన్న ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది. నిజానికి ఈ డివైస్ ప్రతి మూడు నిమిషాలకొకసారి ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఇది వేలెడంత పొడవుతో చేతిలో ఇమిడేంత చిన్నగా ఉంటుంది. దాంతో దీన్ని పట్టుకోవడం, ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం చాలా సులభం. ముందుగా క్లీనింగ్ జెల్‌ని అవసరం అయిన చోట అప్లై చేసుకుని, మొటిమలు లేదా మచ్చలున్న భాగంలో ఈ డివైస్ హెడ్‌ని ఆనించి ఉంచితే ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇది బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. దీని ధర 69 డాలర్లు (రూ.5,825). ఇలాంటి డివైస్‌లకు ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంది. ముందే వినియోగదారుల రివ్యూస్ ఫాలో అయ్యి ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం. (చదవండి: ఏంటిది.. చేపకు ఆపరేషన్ చేశారా..!) -
మాయిశ్చరైజర్లు వాడుతున్నారా..!
చలికాలంలో చర్మం పొడిబారే సమస్య దాదాపుగా అందరూ ఎదుర్కొనేదే. ఎన్ని క్రీములు రాసినా ఏమాత్రం ఉపయోగం లేదని చాలామంది వాపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే ముందు మన చర్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. కొందరికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. వీరికి సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఈ కాలంలో పొడి చర్మం గల వారికి పెద్ద సమస్యగా ఉంటుంది. వారి చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. గోరువెచ్చని నీళ్లుఫుల్క్రీమ్ లేదా అయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి. స్నానం చేశాక కనీసం పది నిమిషాల్లోపు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చలిని తట్టుకోవడానికి చాలామంది వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల చర్మంపై సహజ నూనెలను కోల్పోతాం. అందుకని, స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడాలి. నిమ్మ, చందనంతో తయారైనవి కాకుండా గ్లిజరిన్, అలోవెరా, ఓట్‌మిల్క్ బేస్డ్ సోప్స్ స్నానానికి ఎంచుకోవాలి. వింటర్లోనూ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి.రుద్దకూడదు..డ్రై స్కిన్ ఉన్నవాళ్లు క్లెన్సింగ్ మిల్క్‌ని రోజుకు ఒకసారైనా ఉపయోగించాలి. స్క్రబ్స్ వంటివి ఎక్కువ ఉపయోగించకూడదు. కొందరు స్నానానికి మైత్తటి కాయిర్‌ను వాడుతుంటారు. ఈ కాలం దానిని వాడక΄ోవడం ఉత్తమం. పాదాలను రాత్రివేళ శుభ్రపరుచుకొని, ఫుట్ క్రీమ్ లేదా పెట్రోలియమ్ జెల్లీ రాసుకోవాలి. కాలి పగుళ్ల సమస్య ఉన్నవారు సాక్సులు వేసుకోవాలి. కొందరు సీరమ్స్ వాడుతుంటారు. వీటిలో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి.ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు జెల్ లేదా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఉపయోగించుకోవాలి. సోరియాసిస్, వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి.మేకప్‌కి ముందు మాయిశ్చరైజర్ మేకప్ చే సుకోవడానికి ముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ తీసేసాక మళ్లీ క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగించాలి. డ్రైస్కిన్ వాళ్లు ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ వాడాలి. సూప్‌లు, జ్యూస్‌లు..ఆకుకూరలు, కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్, నువ్వులు వంటివి ఈ కాలంలో ఆహారంలో చేర్చుకోవడం, ఉపయోగించడం మంచిది. సాధారణంగా చలికాలంలో చాలామంది తక్కువ నీళ్లు తాగుతారు. కానీ, మన శరీరానికి 3–4 లీటర్ల నీళ్లు అవసరం. నీళ్లు తాగలేక΄ోయినా సూప్‌లు, జ్యూస్‌ల రూపంగా తీసుకోవచ్చు. – డా. స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
పెసర పిండితో బ్యూటీ ప్యాక్స్ : మెరిసే మోము
శీతాకాలంలో చర్మం, ముఖం సౌందర్య పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. రసాయనాలులేని సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్నిమెరుగు పర్చు కోవడానికి ప్రయత్నించాలి. చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడంలోనూ పెసలు చక్కగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో పెసర పిండితో కొన్ని చిట్కాలను ఇపుడు చూద్దాం! టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. -
శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?
శీతాకాలం అనంగానే అందరికి ఎందురయ్యే ప్రధాన సమస్య చర్య పొడిబారడం. దీని వల్ల దద్దుర్లు, ఒక విధమైన దురద మంట వస్తాయి. అలాగే చర్మం కూడా అసహ్యంగా మారిపోతుంది. తాకినప్పుడుల్లా గరుకుదనంతో మంటగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో దొరికే వాటితో ఈజీగా చెక్ పెట్టొచ్చు . అదెలాగో చూద్దామా..!.టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్‌లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. (చదవండి: పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ఆపిల్, అరటిపండ్లతో ఇలా చేయండి..!) -
అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందానికే ఐకానిక్‌గా ఉండే సౌందర్యం ఆమె సొంతం. ఎంతమంది అందగత్తలైన ఆమెకు సాటి రారు. అలాంటి అద్భుతమైన అందం ఆమెది. ఐదుపదుల వయసులో కూడా అంతే గ్లామర్‌గా ఉండటం విశేషం. ఎక్కడ ఐశ్వర్యరాయ కనిపించినా..అందాల రాణి వస్తుందని ఆత్రంగా చూస్తారు. అంతటి ఆకర్షణీయమైన అందాన్ని మెయింటైన్ చేసేందుకు ఐశ్వర్య ఏంచేస్తుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అంతేగాదు ప్రతి మహిళ చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో కూడా చెప్పారామె. ఇంతకీ అవేంటో చూద్దామా..!.మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ ఇప్పటికి అంతే ఫిట్‌గా అందంగా కనిపిస్తారు. ఎక్కడ మచ్చ్చుకైనా..వృద్ధాప్య ఛాయలు కానరావు. అంతలా మేని ఛాయ మెరుస్తూ ఉండేందుకు ఐశ్వర్య ఎంతో కేర్ తీసుకుంటానని చెప్పారు. ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యమని అంటోంది ఐశ్వర్య రాయ్. తాను కూడా ప్రతి భారతీయ మహిళ ఎలా ఉంటుందో తాను అలానే ఉంటానన్నారు. "అయితే ఆత్మగౌరవంతో, సరైన వ్యక్తిత్వంతో బతకాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి స్త్రీ తన ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించాల్సిన పనిలేదు. అదీగాక మహిళలు నిద్ర లేచిన దగ్గర నుంచి గడియారంలోని ముల్లుకంటే వేగంగా ఆగకుండా పనిచేస్తూనే ఉంటారని అన్నారు. అందువల్ల కనీసం కొద్దిసేపైనా మీ కోసం సమయం కేటాయించడం అత్యంత ముఖ్యం. హైడ్రేటెడ్‌గా పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ గౌరవాన్ని ఇనుమడింప చేసే అందంపై దృష్టి పెట్టండి. అందులో ఎలాంటి తప్పు లేదు. తప్పసరిగా మొటిమలు, అలెర్జీలు వంటి బారిన పడకుండా స్కిన్కేర్లు వాడలన్నారు. తప్పనసరిగా మాయిశ్చరైజర్లను వాడమని సూచించింది. వంటపనులతో సతమతమయ్యే మహిళలు తమ చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్లు వాడాలని అన్నారు." ఐశ్వర్యరాయ్.(చదవండి: 'తుప్పా దోస విత్ చమ్మంతి పొడి' గురించి విన్నారా?) -
మెరిసే మేని చాయను కాపాడుకోడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య మేని ఛాయను కాపాడుకోవడం చాలాకష్టం. కాలుష్యం, సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షణ పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో చూద్దామా! తక్షణ తాజాదనం కోసం రోజ్ వాటర్ లేదా దోసకాయ రసంతో మేనికి మర్దనా చేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పచ్చి పాలను కాటన్ బాల్‌తో అద్దుకొని, ముఖానికి రాయాలి. 10 నిమిషాలపాటు అలాగే ఉంచి కడిగేయాలి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని సున్నితంగా ఉంచడంతోపాటు శుభ్రపరుస్తుంది.చర్మంపై నుంచి సహజ నూనెలను ΄ోకుండా ఉండటానికి చర్మతత్వానికి సరి΄ోయే తేలిక΄ాటి, క్లెన్సర్‌ని ఉపయోగించాలి. ఓట్మీల్లో తేనె, కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ చేయాలి. మృత చర్మ కణాలను తొలగించడానికి, పోర్స్‌ను శుభ్రం చేయడానికి సున్నితంగా స్క్రబ్ చేయాలి.ప్రతిరోజూ కలబంద జెల్‌ను రాసి, మృదువుగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మం నునుపుగా, తేమగా ఉంటుంది. టేబుల్ స్పూన్ తేనెను, టేబుల్ స్పూన్ పెరుగుతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది.సగం అరటిపండును మెత్తగా చేసి, టీస్పూన్ తేనెతో కలపాలి. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.కొద్దిగా గ్రీన్ టీని కాచి, చల్లబరచాలి. ఈ నీటిని దూదితో అద్దుకుంటూ, మేనికి పట్టించాలి. ఎండకు కమిలిన చర్మం తాజాగా మారుతుంది. -
పండుగ వేళ ముఖం కాంతిగా, గ్లోగా కనిపించాలంటే..!
నవరాత్రులు, బతుకమ్మ సంబరాలతో కోలాహలంగా ఈ ఉండే ఈ సమయాన ముఖం డల్‌గా కాంతి విహీనంగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన ముఖంలో పండుగ కళ కనిపించేట్టుగా కాంతిగా కనిపించాలంటే ఈ చిన్ని టిప్స్ ఫాలో అయిపోండి. అందుకు పార్లర్ వెంట పరుగులు తీయాల్సిన పనిలేదు. ఇంట్లో దొరికే వాటితోనే ముఖం కాంతిమంతగా, గ్లోగా కనిపించేలా చెయ్యొచ్చు. అదె ఎలాగో సవిరంగా చూద్దాం..!పెరుగు మంచి ఎక్స్ఫోలియేటర్. ఇందులోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగిస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు టీ స్పూన్ పెరుగు తీసుకుని చర్మానికి పట్టించి వలయాకారంగా వేళ్లతో మర్దనా చేసి వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖం మీద చారలా పట్టిన మురికి వదులుతుంది. దుమ్ముతో మూసుకు΄ోయిన చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం పొడిబారినట్లనిపిస్తే టీ స్పూన్ పెరుగు రాసి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. వార్ధక్యం దగ్గరయ్యే కొద్దీ చర్మం సాగేగుణాన్ని కోల్పోవడంతో చర్మం జారి΄ోతుంటుంది. పెరుగు రాయడం వల్ల చర్మంలో సాగేగుణం బాగుటుంది. చర్మం బిగుతుగా, కాంతివంతంగా యవ్వనంగా ఉంటుంది. పెరుగులోని యాంటీబయాటిక్ సుగుణాలు యాక్నేను తగ్గిస్తాయి. డీ విటమిన్, ప్రోటీన్, ప్రో బయాటిక్‌లు చర్మానికి పోణనిస్తాయి. పెరుగులో ఇవి కూడా ఉండడం వల్ల పెరుగు మంచి బ్యూటీ ప్రొడక్ట్. మార్కెట్లో దొరికే అనేకరకాల సాధనాలకు బదులు పెరుగును వాడడం మంచిది. శనగపిండి, తేనె వంటి పదార్థాలతో వేసుకునే ఫేస్ ఫ్యాక్లలో కూడా పెరుగును చేర్చుకోవచ్చు. చర్మం పొడిబారి మంటగా అనిపిస్తే ఓ కప్పు పెరుగు తీసుకుని చర్మమంతటికీ పట్టించి ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయాలి. పిల్లలకు చర్మం మీద దద్దుర్లు వచ్చినప్పుడు క్రీమ్‌లు రాయడానికి ముందు ఒకసారి పెరుగు రాసి చూడండి. పెరుగు దేహ ఆరోగ్యానికి మంచి ఔషధం మాత్రమే కాదు, చర్మానికి మంచి పోషకం కూడా. రోజూ పెరుగుతో మర్దన చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు అందంగా మెరుస్తుంది. క్రమంగా తెల్లదనం సంతరించుకుంటుంది.చర్మం చాలాకాలం యౌవనంగా ఉండాటంటే... చక్కెర తక్కువగా తీసుకోవాలి. మిసమిసలాడే మేనికీ, చర్మానికీ సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్‌ను చక్కెర ఏం చేస్తుందో తెలియాలి. చక్కెరతో చేసిన తీపి పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో అది చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు సహాయపడే కొలాజెన్‌ను దెబ్బతీస్తుందనీ, దాంతో మితిమీరి తీపి తినేవాళ్ల చర్మం తన బిగువును కోల్పోవడం, దాంతో వయసుకంటే ముందరే సాగినట్లుగా అయిపోవడం జరుగుతుందని అమెరికాకు చెందిన డార్ట్మౌత్ మెడికల్ స్కూల్ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. అందుకే చాలాకాలం పాటు బిగువైన చర్మంతో యౌవనంగా కనిపించాలనుకునేవాళ్లు తీపి పదార్థాలు కాస్త తక్కువగా తీసుకోవడమే మేలు. (చదవండి: భరించలేని తలనొప్పా..నివారించండి ఇలా..!) -
ఆరెంజ్ గింజలతో లాభాల గురించి తెలిస్తే, అస్సలు వదలరు!
ఆరోగ్యం కోసం నారింజ పండ్లను తింటాం. తొందరగా శక్తి రావాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగుతాం. ఎందుకంటే ఇందులో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఏ విటమిన్, మినరల్, ఫైబర్ కూడా లభిస్తాయి. అలాగే నారింజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకొని సున్నిపిండిలో వాడతాం. హెర్బల్ టీలో కూడా వాడతామని మనకు తెలుసు. కానీ నారింజ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు న్నాయని మీకు తెలుసా? తెలుసుకుందాం రండి!ఆరెంజ్ పండ్ల మాదిరిగానే, దాని గింజలు కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి మన శరీరాన్ని హైడ్రేటెడ్, తాజాగా ఉంచుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని ఇవి మేలు చేస్తాయి. ఆరెంజ్ గింజల్లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. రోజుకు మనకు కావాల్సిన దాంట్లో 116.2శాతం వీటిల్లో లభిస్తాయట. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దప్రేగు కేన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్,అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యల నివారణలో ఉపయోగపడతాయి.ఎనర్జీ బూస్టర్ నారింజ గింజలలో పాల్మిటిక్, ఒలీక్, లినోలిక్ ఆమ్లాలు ఉండటం వల్ల మానవ కణాలలో ఎక్కువ కాలం శక్తిని నిల్వ ఉంచుతుంది. శరీరంలో శక్తి స్థాయిని వేగవంతం చేస్తాయి.గుండె ఆరోగ్యానికి మంచిది: ఆరెంజ్ గింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.జుట్టు: ఆరెంజ్ గింజల నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ నూనెను జుట్టుకు కండీషనర్గాపనిచేస్తుంది. నారింజ గింజలలో విటమిన్ సి, బయో-ఫ్లేవనాయిడ్స్‌కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. నారింజ గింజలలో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)చర్మానికి మెరుపు: వీటిల్లో పుష్కలంగా లభించే విటమిన్ సీ చర్మానికి మేలు చేస్తుంది. సహజమైన మెరుపునిస్తుంది. అంతేకాదు ముడతలు, మచ్చలు తగ్గుతాయి. కంటి ఆరోగ్యం: వీటిల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఎ కళ్లలోని శ్లేష్మ పొరలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వయస్సు-సంబంధిత కండరాల క్షీణతను నివారిస్తుంది. బీపీ నియంత్రణ: ఆరెంజ్ గింజల్లో విటమిన్ బి6 అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తపోటును అదుపు చేయడంలో కీలక ప్రాత పోషిస్తుంది. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)కేన్సర్: ఆరెంజ్ గింజలు ప్రతిరోజు తినడం వల్ల చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయ పడతాయి. ఇంట్లో చెడువాసన పోవాలంటేనారింజ గింజల నీటిని, కేక్ ఐసింగ్కు వాడతారు. అంతేకాదు సిట్రస్ సువాసన కోసం బాత్‌టబ్‌కు దీని ఆయిల్ వాడవచ్చు. ఇంట్లో అసహ్యకరమైన వాసనను పోగొట్టేందుకు డిఫ్యూజర్ నూనెగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.ఆరెంజ్ విత్తనాలను ఎలావాడాలి?చిరు చేదుగా ఉండే ఆరింజ గింజల నూనె, పొడి రూపంలో వాడుకోవచ్చు. ఇవి మార్కెట్లో లభిస్తాయి. -
వినాయక పందిళ్లలో సందడి చేసే మగువలూ.. మీకోసమే ఈ చిట్కాలు
వినాయక చవితి పండగ వచ్చేసింది. ఈ నవరాత్రులు గణనాథుని సేవలో మునిగిపోతారు..భక్తులు. గణేష్ మంటపాలలో మహిళల సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చాలా హౌసింగ్ సొసైటీలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కొలువుదీరే విఘ్ననాయకుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలతోపాటు అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. మగువలంతా శుభప్రదమైన ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు రంగు దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మరీసందర్భంలో ముఖంతోపాటు కాళ్లూ, చేతులపై కూడా శ్రద్ధ పెట్టాలి. మరి అదెలాగో చూసేద్దాం.ఇంట్లో దొరికే వస్తువులతో మాస్క్, స్క్రబ్‌లను ప్రయత్నించాలి.ఓట్స్- పెరుగుటీ స్పూన్ ఓట్స్‌ను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇందులో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లూ చేతులకు బాగా పట్టించాలి. ఆ తరువాత బాగా రుద్దుకని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. టొమాటో స్క్రబ్బాగా పండిన టొమాటో చక్కెర చల్లి, ముఖం, కాళ్లు, చేతులపై బాగా స్క్రబ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆర నిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలాగే చల్లని ఐస్ క్యూబ్‌తో మృదువుగా మసాజ్ చేసి, మాయిశ్చరైజర్ పూసుకోవాలి. టమాటో గుజ్జుని కాళ్ళకి, చేతులకి రాసి మసాజ్ చేయడం వలన కాళ్లు చేతుల మీద ఉండే నలుపు తగ్గుతుంది. టొమాట విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది.శనగపిండి, పెరుగు,పసుపు శనగపిండిలో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి పేస్టులా చేయాలి. ఈ పిండిని కాళ్లు, చేతులకు రాసి కాసేపు వదిలేయాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ లాగా పని చేస్తుంది.కీరదోసకాయ కీరదోసకాయ గుజ్జుని కాళ్ళకి చేతులకి అప్లై చేసి ఒక 15 నిమిషాల తరువాత వాష్ చేసుకోవాలి. కీర దోసకాయలలో ఉండే విటమిన్ ఏ చర్మం ముదురు రంగులోకి మార్చే మెననిన్ ని కంట్రోల్ చేస్తుంది. నిమ్మరసంలో కూడా సహజ బ్లీచింగ్ లక్షణాలు చర్మం మెరిసే లాగా చేస్తాయి. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.కాఫీ పౌడర్ఫిల్టర్ కాఫీ పౌడర్‌లో చక్కెర కలిపి మసాజ్ చేసుకొని పదినిమిషాల తరువాత కడిగేసుకుంటే, ముఖానికి చేతులకు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. చందమామలా మెరిసిపోతారు. -
పెరుగుతో అధిక బరువు చెక్, మేనికి మెరుపు
మారుతున్న జీవన శైలి రీత్యా అధిక బరువు, ఊబకాయం చాలామందిన వేధిస్తున్న సమస్య. అధిక బరువుతో బాధపడేవారికి ఏ ఆహారం తీసుకోవలన్నా భయంగానే ఉంటుంది. ఇది తింటే ఎన్ని కేలరీల బరువుపెరిగిపోతామో అని ఆందోళనపడుతూ ఉంటారు. అలాంటి వాటిల్లో ఒకటి పెరుగు. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కొవ్వును కరిగించే గుణాలుంటాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో వేగంగా బరువు తగ్గుతారుబరువు తగ్గాలని, ఆహారం తక్కువగా తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. పోషకాలు ఎక్కువగా అందే ఆహారంపై దృష్టి పెట్టాలి. అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినొచ్చు. పెరుగు తింటే బరువు బాధ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే క్యాల్షియం శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్ గా ఉండేలా చేస్తుంది. పెరుగులోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి. పెరుగులో డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ తినవచ్చు. దీంతో కడుపు నిండి ఉంటుందిన. పోషకాలు అందుతాయి. కీర, పుదీనా కలిపి తీసుకోవచ్చు. అలాగే కప్పు పెరుగుకు నల్ల మిరియాల పొడి కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. వేడి చేసినపుడు పెరుగు, చక్కెర కలుపుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పెరుగు డీహైడ్రేషన్నుంచి కాపాడుతుంది. చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.ఇలాంటి కొన్ని చిట్కాలతోపాటు రెగ్యులర్ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంఊ జంక్ ఫుడ్ ,ఆయిలీ ఫుడ్ జోలికి పోకూడదు. ఒత్తిడి లేని జీవనశైలికి అలవాటుపడాలి. సరిపడా నీళ్ళు నిద్రకూడా చాలా అవసరం అనేది గుర్తించాలి.