నవరాత్రులు, బతుకమ్మ సంబరాలతో కోలాహలంగా ఈ ఉండే ఈ సమయాన ముఖం డల్‌గా కాంతి విహీనంగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన ముఖంలో పండుగ కళ కనిపించేట్టుగా కాంతిగా కనిపించాలంటే ఈ చిన్ని టిప్స్ ఫాలో అయిపోండి. అందుకు పార్లర్ వెంట పరుగులు తీయాల్సిన పనిలేదు. ఇంట్లో దొరికే వాటితోనే ముఖం కాంతిమంతగా, గ్లోగా కనిపించేలా చెయ్యొచ్చు. అదె ఎలాగో సవిరంగా చూద్దాం..!
పెరుగు మంచి ఎక్స్‌ఫోలియేటర్. ఇందులోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగిస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు టీ స్పూన్ పెరుగు తీసుకుని చర్మానికి పట్టించి వలయాకారంగా వేళ్లతో మర్దనా చేసి వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖం మీద చారలా పట్టిన మురికి వదులుతుంది. దుమ్ముతో మూసుకు΄ోయిన చర్మరంధ్రాలు శుభ్రపడతాయి.
చర్మం పొడిబారినట్లనిపిస్తే టీ స్పూన్ పెరుగు రాసి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.
వార్ధక్యం దగ్గరయ్యే కొద్దీ చర్మం సాగేగుణాన్ని కోల్పోవడంతో చర్మం జారి΄ోతుంటుంది. పెరుగు రాయడం వల్ల చర్మంలో సాగేగుణం బాగుటుంది. చర్మం బిగుతుగా, కాంతివంతంగా యవ్వనంగా ఉంటుంది.
పెరుగులోని యాంటీబయాటిక్ సుగుణాలు యాక్నేను తగ్గిస్తాయి. డీ విటమిన్, ప్రోటీన్, ప్రో బయాటిక్‌లు చర్మానికి పోణనిస్తాయి. పెరుగులో ఇవి కూడా ఉండడం వల్ల పెరుగు మంచి బ్యూటీ ప్రొడక్ట్. మార్కెట్‌లో దొరికే అనేకరకాల సాధనాలకు బదులు పెరుగును వాడడం మంచిది. శనగపిండి, తేనె వంటి పదార్థాలతో వేసుకునే ఫేస్ ఫ్యాక్‌లలో కూడా పెరుగును చేర్చుకోవచ్చు.
చర్మం పొడిబారి మంటగా అనిపిస్తే ఓ కప్పు పెరుగు తీసుకుని చర్మమంతటికీ పట్టించి ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయాలి.
పిల్లలకు చర్మం మీద దద్దుర్లు వచ్చినప్పుడు క్రీమ్‌లు రాయడానికి ముందు ఒకసారి పెరుగు రాసి చూడండి.
పెరుగు దేహ ఆరోగ్యానికి మంచి ఔషధం మాత్రమే కాదు, చర్మానికి మంచి పోషకం కూడా. రోజూ పెరుగుతో మర్దన చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు అందంగా మెరుస్తుంది. క్రమంగా తెల్లదనం సంతరించుకుంటుంది.
చర్మం చాలాకాలం యౌవనంగా ఉండాటంటే... చక్కెర తక్కువగా తీసుకోవాలి. మిసమిసలాడే మేనికీ, చర్మానికీ సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్‌ను చక్కెర ఏం చేస్తుందో తెలియాలి.
చక్కెరతో చేసిన తీపి పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో అది చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు సహాయపడే కొలాజెన్‌ను దెబ్బతీస్తుందనీ, దాంతో మితిమీరి తీపి తినేవాళ్ల చర్మం తన బిగువును కోల్పోవడం, దాంతో వయసుకంటే ముందరే సాగినట్లుగా అయిపోవడం జరుగుతుందని అమెరికాకు చెందిన డార్ట్‌మౌత్ మెడికల్ స్కూల్ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. అందుకే చాలాకాలం పాటు బిగువైన చర్మంతో యౌవనంగా కనిపించాలనుకునేవాళ్లు తీపి పదార్థాలు కాస్త తక్కువగా తీసుకోవడమే మేలు.
(చదవండి: భరించలేని తలనొప్పా..నివారించండి ఇలా..!)
Comments
Please login to add a commentAdd a comment