Dussehra Celebrations 2024
-
సొంతూరిలో సీఎం దసరా సంబరాలు
సాక్షి, నాగర్‌కర్నూల్/కొడంగల్: సీఎం రేవంత్‌రెడ్డి దసరా పండుగ సందర్భంగా శనివారం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చిన రేవంత్‌రెడ్డికి అడుగడుగునా పూలు, డప్పు వాయిద్యాలు, బతుకమ్మలు, కోలాటాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నడుమ దసరా వేడుకలు జరుపుకొన్న సీఎం రేవత్‌రెడ్డి అందరినీ పలకరిస్తూ గ్రామస్తుల్లో పండుగ సంబురాన్ని రెట్టింపు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్‌లో చేరుకున్నారు. కొండారెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, కలెక్టర్ సంతో‹Ù, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలినడకన శమీ పూజకు.. కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి తన ఇంటి నుంచి గ్రామంలోని మైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న జమ్మి చెట్టు వద్దకు గ్రామస్తులతో కలిసి కాలినడకన బయలుదేరారు. మార్గమధ్యలో గ్రామస్తులను పేరుపేరునా పలకరిస్తూ.. ఆప్యాయంగా ముచ్చటిస్తూ జమ్మిచెట్టు వద్దకు చేరుకొని శమీ పూజలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు, అభిమానులు సీఎంతో సెలీ్ఫలు, ఫొటోల కోసం పోటీ పడటంతో సుమారు 40 నిమిషాలపాటు వారితో ఫొటోలు దిగుతూ గ్రామస్తులను ఆనందంలో ముంచెత్తారు.పాలమూరు బిడ్డగా ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత తనదని, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతానని చెప్పారు. విద్య, వైద్యం, సాగునీరు, ఉపాధి కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వేగంగా నిర్ణయం తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఎమ్మెల్యేలు, అధికారులకు చెప్పారు. మరోసారి గ్రామానికి వచ్చి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానన్నారు. రాత్రి 8.30 గంటలకు రోడ్డు మార్గంలో కొడంగల్‌కు బయలుదేరారు. కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డికి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సు«దీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి స్వాగతం పలికారు.పూల మొక్కలు ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు సీఎంను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, యువజన కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ కృష్ణంరాజు తదితరులు సీఎంను కలిశారు. పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి కొడంగల్‌కు వచ్చి ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
దసరా సంబురాల్లో ప్రముఖుల సందడి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రావణ దహనం కార్యక్రమాలు నిర్వసున్నారు. దసరా సంబరాల్లో ప్రముఖుల సందడి చేశారు. ఢిల్లీలోని మాధవ్ దాస్ పార్కులో నిర్వహించన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తదితరులు హాజరయ్యారు.#WATCH | Delhi: President Droupadi Murmu and Prime Minister Narendra Modi leave after attending the Dussehra programme organised by Shri Dharmik Leela Committee at Madhav Das Park, Red Fort (Source: DD News) pic.twitter.com/wjIwCIinuu— ANI (@ANI) October 12, 2024 అదేవిధంగా ఢిల్లీలోని నవ్‌శ్రీ ధార్మిక్ లీలా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు.#WATCH | Congress Parliamentary party chairperson Sonia Gandhi and Lok Sabha LoP Rahul Gandhi attend the #Dussehra2024 celebrations at Nav Shri Dharmik Leela Committee Red Fort, Delhi pic.twitter.com/Wszph85yeQ— ANI (@ANI) October 12, 2024 జార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహించిన రావణ దహనంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాల్గొన్నారు.#WATCH | Jharkhand: 'Ravan Dahan' being performed in Ranchi as part of #DussehraCelebrations, in the presence of Jharkhand CM Hemant Soren pic.twitter.com/YH02qKkjtB— ANI (@ANI) October 12, 2024 బిహార్‌లోని పట్నాలో దసరా సంబరాల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ పాల్గొన్నారు.#WATCH | Bihar CM Nitish Kumar and Dy CM Samrat Choudhary attend #DussehraCelebration at Gandhi Maidan in Patna pic.twitter.com/nqk833V4Wt— ANI (@ANI) October 12, 2024 అదేవిధంగా ముంబైలోని ఆజాద్ మైదానంలో శివసేన, శివాజీ పార్క్‌లో శివసేన (యూబీటీ) ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.#WATCH | Maharashtra CM Eknath Shinde addresses Shiv Sena's Dussehra rally at Azad Maidan in Mumbai. pic.twitter.com/5UkP8C7iYs— ANI (@ANI) October 12, 2024అమృత్సర్: దుర్గియానా టెంపుల్ గ్రౌండ్లో నిర్వహించిన దసరా వేడుకలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరయ్యారు.#WATCH | Amritsar: Punjab CM Bhagwant Mann attended Dussehra celebrations at Durgiana Temple Ground pic.twitter.com/gPhZOwnBrL— ANI (@ANI) October 12, 2024ఛత్తీస్‌గఢ్: దసరా వేడుకల్లో భాగంగా రాయ్‌పూర్‌లో సీఎం విష్ణు దేవ్ సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావణ్ దహన్ ప్రదర్శించారు.#WATCH | 'Ravan Dahan' being performed in Raipur, as part of #DussehraCelebrations in the presence of Chhattisgarh CM Vishnu Deo Sai pic.twitter.com/pMSCJ645m8— ANI (@ANI) October 12, 2024జమ్ము కశ్మీర్: శ్రీనగర్‌లోని ఎస్కే స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకలకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఇతర నేతలు హాజరయ్యారు.#WATCH | Srinagar, J&K: National Conference President Farooq Abdullah attends #Dussehracelebrations at Srinagar's SK Stadium pic.twitter.com/tlDDni0dIW— ANI (@ANI) October 12, 2024 చదవండి: బంగ్లాలో మోదీ గిఫ్ట్ చోరీ.. భారత్ తీవ్ర స్పందన -
దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"
‘‘నానమ్మా... అనవసరంగా స్ట్రెస్సు పెంచుకోకు. తగ్గే మార్గం చెబుతా విను గ్రానీ డ్యూడ్’’ అంది నా కూతురు. ‘‘ఏం చెబుతావో ఏమో... ఈమధ్య అంతా సైన్సు మాట్లాడుతున్నావ్. స్ట్రెస్సు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు పిండిపైన ఉండే అప్పడాల కర్ర అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు కిందనుండే రౌండు పీట అండ్ బీటా టీటా అల్ఫా ఒమెగా అంటూ అదేదో అంటుంటావ్. నా పాట్లేవో నన్ను పడనీ మనవరాల్ డ్యూడ్’’ అంది మా అమ్మ. మా అమ్మకూ ఈమధ్యే బీటెక్‌లో చేరిన నా కూతురికీ మధ్య భలే ఫ్రెండ్షిప్. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇద్దరిమధ్యా ‘షోలే’ వీరూ, జైయంత చనువు. టైము దొరికినప్పుడల్లా ఇప్పటి సినిమాల్ని ఓటీటీలో మా అమ్మకు చూపిస్తూంటే, మా అమ్మ అప్పటి సినిమాల్ని టీవీలో నా బిడ్డకు చూపిస్తూ యమా టైంపాస్ చేసేస్తుంటారు ఇద్దరూ! ఈ వైభోగానికి తోడు సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్స్టీ, లోకల్ టాక్సెస్ ఎక్స్ట్రాల్లాగా నానమ్మా, మనవరాళ్లిద్దరి మధ్యా ఎక్స్ట్రా వాదులాటలూ, కీచులాటలూ, గొడవలూ... ఆ తర్వాత ఎదుటాళ్లను గెలిపించి తామోడిపోవడానికి పోటీలూ, పేచీలు! ఫరెగ్జాంపుల్... ‘‘హే యూ ఓల్డ్ లేడీ... చూస్తుండగానే అన్నపూర్ణవు కాస్తా నిర్మలమ్మ అయిపోతున్నావు నువ్వు’’ అంటూ నా కూతురంటే... ‘‘మీ అమ్మ మాత్రం అవ్వడం లేదా... రమ్యకృష్ణలాంటిది కాస్తా వదినమ్మ వేషాల సుధాలాగా’’ అంటుంది మా అమ్మ. ఇదెలా ఉంటుందంటే హీరోని పొడవలేని విలన్ అనుచరుడు కాస్తా చివరకు సెకండ్ హీరోయిన్ని పొడిచేసినంత చిత్రంగా. ఇలా ఎందుకంటే... తన మనవరాల్నేమీ అనలేకా... అందమైన హీరోయిన్లతోనే గాక... ఇంకెవ్వరితోనూ పోల్చలేక! ఆ కూతురితో పోల్చదగ్గది మరొకరుండరూ... ఉండకూడదనే అత్యాశకొద్దీ!!అసలీ సంభాషణకు కారణం... దసరా సెలవలు కదా. అమ్మమ్మ గారి ఇంటికంటూ మా అక్కవాళ్ల పిల్లలు మా ఇంటికి రావడమూ... పండక్కి మా అమ్మను కొన్ని కోర్కెలు కోరడమూనూ. మనవరాళ్లు కదా! వాళ్ల వరాలు తీర్చకుండా ఎలా ఉంటుంది మా అమ్మ. అవేమిటంటే... మా పిల్లలకేమో చిట్టిగారెల్లో మటన్ కూర కావాలట. అక్క పిల్లలేమో ‘గారెలు మేం మామూలుగానే తినేస్తాం. మటన్‌లో పూరీలు ముంచుకుతింటాం. కాబట్టి ఎక్స్ట్రాగా పూరీలు చేయమంటు’న్నారు. దాంతో రెండూ చేసే పనిలో బోల్డెంత ఒత్తిడికి లోనవుతోంది మా అమ్మ. ఆమెను అనునయిస్తూ స్ట్రెస్సును తగ్గించే పనిలో ఉంది నా బిడ్డ. ‘‘అయినా... పూరీలు టైముకు ప్రిపేర్ అవ్వాలంటే... అసలెంతో కొంత స్ట్రెస్ ఉండాల్సిందేలే నానమ్మా’’ అంది నా కూతురు. ‘‘అదేందోగానీ పిల్లా... ఈ స్ట్రెస్సొచ్చినప్పుడల్లా నా కిడ్నీల్లో హార్ట్ ఎటాక్ వచ్చినట్టుంటుంది బ్రో. ఈ ఒత్తిడి అనేది ఉంది చూశావూ... మొదట ‘అగ్నిపర్వతం’ ‘ఈగాలిలో...’పాటలోలాగా కృష్ణ పాస్‌పోర్టు ఫొటోంత సైజులో ఉంటుందా! కాసేపటికే విజయశాంతి పట్టుకున్న సూపర్‌స్టార్ కటౌటంతగా పెరుగుతుంది. అబ్బో... అలా పెరిగినప్పుడు నాకెంత దాహం వేస్తుంటుందో తెలుసా పిల్లా? ‘దేవత’లో శోభన్‌బాబు, శ్రీదేవీ పాటలోని అన్ని బిందెల్లోకీ ఎల్లువొచ్చిన గోదారి నీళ్లన్నీ తాగీ తాగీ ఇంకా తాగుతున్నా ఇంకా దాహమేస్తున్నట్టే అనిపిస్తుంటది’’ ‘‘నీకెందుకు నానమ్మా. నీ నర్వస్నెస్ను ‘రోబో–2’లో పావురమ్మీద స్వారీ చేసే రజినీకాంత్ సైజుకు తగ్గిస్తా’’ ‘‘ఓహో... భైరవద్వీపం ‘నరుడా ఓ నరుడా’ పాటలో మరుగుజ్జుల సైజుకా?’’ అంటూ తన పాత సినిమా ఎగ్జాంపుల్‌కు వెళ్తూనే... ‘‘అయినా పెద్ద చెప్పొచ్చావ్ గానీ... స్ట్రెస్సుంటే వంట వీజీగా ఎలా అవుతుందే అమ్మాయ్?’’ అడిగింది. ‘‘నా ఇంజనీరింగ్ మ్యాథ్స్లా కాకుండా మీ ΄ాతసినిమాల భాషలోనే చెబుతా విను. కొద్దిగా స్ట్రెస్సుంటే... అప్పట్లో మీ ఓల్డుమూవీసులో పోగరుమోతు హీరోయిన్ని ఒక్క టీజింగుసాంగుతోనే హీరో లొంగదీసినంత వీజీగా చేసేగలవు పూరీలన్నీ’’ అంటూ మా అమ్మకు తన ఉపదేశాన్ని మొదలుపెట్టింది నా కూతురు. ∙∙ ‘‘అన్నట్టు నానమ్మా... ఈ స్ట్రెస్సూతో హెల్త్ సమస్యలూ అవీ వస్తాయని దాన్ని ఆడిపోసుకుంటుంటారు గానీ... ఒక్క వంటే కాదు. ఏ పనైనా హాయిగా జరిగి΄ోవాలంటే కాస్త ప్రెషరో, గిషరో వర్కవుట్ అవుతూ ఉండాలి. అదెంతుండాలంటే... కడాయిలో పూరీని పొంగించడానికీ, కుక్కరులోని రైసును ఉడికించడానికీ ఎంత కావాలో... పని సజావుగా జరగడానికి అంతే స్ట్రెస్సుండాలి’’ ‘‘ఎందుకే పాపం ఒత్తిడితో ఆ పూరీల్ని అంతలా పొంగించడం? ఎంత పొంగినా చివరకు పూరీకి బొక్కెట్టే కదా తింటారు. విజిళ్లతో ఎంతగా మిడిసిపడ్డా ఆవిరి ΄ోయాకే కదా కుక్కర్లోంచి అన్నాన్ని దించుతారు!’’ ‘‘నువ్వన్నది కరెక్టేగానీ నానమ్మా... ఎలాగూ తొక్క వలిచే తింటాంగదా అని తొడిమ ఊడిన అరటిపండు తినగలమా? అలాగే పొంగని పూరీతో పూరీ చేయగలమా చెప్పు. పొంగినదానికీ, పొంగనిదానికీ టేస్టులో ఏమాత్రం తేడా లేక΄ోయినప్పటికీ పొంగినదాన్నే కదా ప్లేట్లో వేసుకోబుద్ధవుతుంది! అలా పూరీలోకి చేరి పొంగేలా చేయడమే గాలి గొప్ప. అండ్... వంటలో ఆయొక్క ఐడియల్ ఒత్తిడి ఎంతుండాలంటే... పూరీపొరను చీల్చకూడదూ – అన్నాన్ని మాడ్చకూడదు. సమ్ఝే నానమ్మా డ్యూడ్?!’’ ‘‘నువ్వు ఎన్నైనా చెప్పవే... ఒత్తిడిలో పని జరగదు గాక జరగదు. పైగా నువ్వుంటే ఇంకా డిస్ట్రబెన్సు. కాబట్టి.... రాకమ్మా మనవరాలా రాకమ్మా.... నీ కోవేలా కాలేజీ... కిచేనెందుకూ నీకూ కొలువై ఉండేందుకూ...’’ ‘‘నేనేమీ రాన్లేగానీ... నువ్వనుకునేది కరెక్ట్ కాదు. ఒత్తిడి ఎంతుండాలంటే... భోజనం విషయానికి వస్తే అన్నం మాడి ఆకలితో మనల్ని మాడ్చకూడదు... ఆబగా ఓ ముద్ద ఎక్కువ తినేస్తే ఒంటిని జ్వరంతో కాల్చకూడదు. తలనొప్పి రానీకుండా చూసే కాఫీ అనే అమృతానికీ... అమృతాంజనానికీ సరిగ్గా మధ్యన గీత గీసేంత ఒడుపు కలిగి ఉండటమే ఐడియల్ ఒత్తిడి. దాన్ని నువ్వు స్ట్రెస్సనూ, ప్రెషరను. ఆ నర్వస్నెస్సులో ఓ వైబ్రేషనుంది. ఓ ఎమోషనుంటది. అది ఉండి తీరాలి నానమ్మా. కాబట్టి చపాతీలా చతికిల పడకు. పూరీలా ΄ పొంగనీ ఉత్సాహం నీలో’’ ‘‘అమ్మో అమ్మో... పైకి చూడ్డానికి పూరీలోని పైపొరలా సాఫ్ట్‌గా కనిపిస్తదిగానీ... కింది పొరలా భయంకరమైన టఫ్రా నీ కూతురూ. ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ను ముందుకు తీస్కెళ్లడానికి అప్పుడప్పుడూ వంటగదిలోకి ఒకతొస్తుంది. ఆ పిల్లనే అప్పడాలకర్ర బేరర్ అంటార్రా’’ అపూరూపంగా మనవరాల్ని చూసుకుంటూ నాతో అబ్బురంగా అంది మా అమ్మ. – యాసీన్ -
శరన్నవరాత్రులు..తొమ్మిదో రోజు మహిషాసుర మర్దినిగా అలంకారం..!
అమ్మవారి ఆరాధనలతో సాగిన ఈ నవరాత్రులు అప్పుడే తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి అత్యంత మహిమాన్వితమైంది. ఈరోజు అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసుర మర్ధినీ దేవి అవతారం. అమ్మవారు ఉగ్రరూపంతో, చేతిలో త్రిశూలంతో సింహవాహినియై దుష్టశిక్షణ గావిస్తున్నట్లుగా భక్తులకు దర్శనమిస్తుంది. మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితాసహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందుతారు భక్తులు. మహిషాసురుడనే రాక్షసుడుతో అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా హోరాహోరీగా పోరు సలిపి.. ఆశ్వయుజ శుక్ల నవమి రోజున ఉగ్ర రూపంలో అంతమొందించిందని పురాణ కథనం. అందువల్లే దుర్గమ్మను మహిషాసుర మర్దినిగా కొలుచుకుంటున్నారు భక్తులుమరికొన్ని చోట్ల చివరి రోజున దుర్గమ్మను సిద్ధిధాత్రి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. తామర పువ్వుపై కూర్చుని ఉంటుంది. ఈ మాతకు నాలుగు చేతులు ఉన్నాయి. కుడి చేతిలో శంఖం, చక్రం, ఎడమవైపున చేతిలో తామరపువ్వులు ఉంటాయి. గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రీ మాత అణిమ, ఇషిత్వ, వశిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అని పిలువబడే ఎనిమిది సిద్ధులకు దేవత. ఈ మాతను ఆరాధించడం వల్ల అష్ట సిద్ధులన్నీ లభిస్తాయని, పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవీ పురాణంలో ఉంది. అంతేగాదు ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.ఈరోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పూజ మహానవమినాడు చేసుకుంటారు.నైవేద్యంగా..వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, పులగాన్నం, గారెలు, నిమ్మరసం, చక్కెర పొంగలి నివేదిస్తారు.(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!) -
తిరుమల : సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (ఫొటోలు)
-
శరన్నవరాత్రులు..ఎనిమిదో రోజు దుర్గాదేవి అలంకారం
దుర్గతులను నివారించే పరాశక్తి ఎనిమిదో రోజున దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.శ్లోకం: సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాదికే శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.రాహుగ్రహ దోషాలను నివారించి, భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం దుర్గ దుర్గాయ నమః అని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రు బాధలు తొలగి, సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం. అంతేగాదు. ఈ రోజు 'ఓం కాత్యానాయ విద్మహే కన్యకుమారి ధీమహి! తన్నో దుర్గ్ ప్రచోదయాత్!' అంటూ ప్రార్థన చేసి, ఆరాధిస్తే మనకున్న దుర్గతులు పోతాయని పురాణ వచనం.మరోవైపు ఎనిమిదోరోజు కొన్ని చోట్ల నవదుర్గల ప్రకారం గౌరి దేవిని పూజిస్తారు. ఈ తల్లి తెల్లటి ముత్యంలా మెరుస్తుంది. ఆమె శక్తి అత్యంత ఫలప్రదమైనది. ఈ రోజున మహాగౌరీ దేవిని తెలుపు లేదా ఊదా రంగు దుస్తులు ధరించి పూజించాలినైవేద్యం: బెల్లం పొంగలి, చెక్కెర పొంగలి, పాయసాన్నం వంటివి నివేదిస్తారు (చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!) -
శ్రీశైలంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!
‘‘ఇది నవరాత్రుల పవిత్ర సమయం. ప్రజలు దుర్గాదేవి పట్ల భక్తితో వివిధ మార్గాల్లో కలిసి మెలిసి పూజలు జరుపుకుంటున్నారు. ఈ సంతోషంతో ఆమె దయకు పరవశుడనై రాసిన ‘ఆవతికలాయ్’ అనే గర్బా గేయాన్ని ఇక్కడ ఉంచాను. ఆమె ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలి’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గాయని పూర్వామంత్రి పాడిన ఈ గేయం గర్బా నృత్యానికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకునేలా చేయడంతోపాటు ప్రతి మదిని ఆధ్యాత్మిక సౌరభమై తాకుతోంది. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. గర్బా నృత్యం అనగానే సంప్రదాయదుస్తులు ధరించిన సమూహాలు, ఆనందంగా నృత్యం చేస్తున్న దృశ్యాలు మన కళ్లముందు మెదలుతాయి. ఆధ్యాత్మిక బలానికి మానసికోల్లాసాన్ని కలిపి జరుపుకునే ఈ వేడుక మొదట గుజరాతీ గ్రామాలలో పుట్టి, దేశ ఎల్లలు దాటి నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. చిల్లులు గల మట్టి కుండలో దీపం వెలిగించి, తలపైన పెట్టుకుని అమ్మవారి విగ్రహం చుట్టూ వలయాకారంగా తిరుగుతూ భక్తి పారవశ్యంలో నృత్యం చేస్తారు. మట్టికుండ తల్లి గర్భాన్ని, జ్యోతి నుండి వెలువడే కాంతి లోపల పెరుగుతున్న కొత్త జీవిని సూచిస్తుంది. భక్తుల కోసం రాక్షసుడితో పోరాడిన దేవత పట్ల తమ ప్రేమ, కృతజ్ఞతలను ఈ నృత్యం ద్వారా తెలియజేస్తారు. మనలో ఉన్న అన్ని చెడులను నాశనం చేయడానికి, లోపల ఉన్న శక్తిని మేల్కొలిపే విధానంగా కూడా గర్బా నృత్యాన్ని చెబుతారు. గర్బా నృత్య రూపం స్త్రీత్వం, సంతానోత్పత్తిని తెలియజేస్తుంది. ఇందులో భజనలు, కీర్తనలకు చోటు ఎక్కువ. ఎక్కువ భక్తి ఆకర్షణను కలిగి ఉండే గర్బాను అమ్మవారి హారతికి ముందు నిర్వహిస్తారు.కాలచక్రం .. పునరావృతందేవీ ఆరాధనలో భాగంగా చెప్పుకునే ఈ నృత్యాన్ని స్త్రీ–పురుషులు ఇద్దరూ తొమ్మిది రాత్రులు చేస్తారు. చాలా మంది ఈ తొమ్మిది రోజులూ కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు, ఉపవాసాలు పాటిస్తారు. కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూ పునరావృతం అవుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు, మరణం నుంచి పునర్జన్మ వరకు ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఈ అన్ని అంశాల్లోనూ కదలకుండా నిరంతరాయంగా ఉండేది దైవశక్తి ఒకటే. దానికి ప్రతీకగా నృత్య వలయం మధ్య దేవీ ప్రతిమ లేదా పెద్ద దీపపు సెమ్మెను పెడతారు. జీవన చక్రం దాని చుట్టూనే పరిభ్రమిస్తుంటుందని చెప్పేందుకు ఇదొక ప్రతీక.మహిషుని అంతం చేసిన మహిళా శక్తిఒక్క స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించకుండా ఉండాలన్న వరబలంతో మహిషాసురుడు తన శక్తులను చెడు కోసం ఉపయోగించడం ప్రారంభించాడు. అతడి దాడికి దేవతలు నిస్సహాయలైపోయారు. దుర్గాదేవి వద్దకు వెళ్లి, వేడుకున్నారు. దుర్గాదేవి ఒక్క కంటిచూపుతో ఆ రాక్షసుని అంతం చేయగలదు. కానీ, అసుర సంహారానికి ముందు తొమ్మిది పగళ్లు, తొమ్మిది రాత్రుల పాటు సాగిన సర్వోన్నతమైన యుద్ధం ద్వారా మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అసాంఘిక, అధార్మిక శక్తులు ఎంత బలంగా కనిపించినా, యుద్ధం ఎంతకాలం సాగినా, చివరికి ధర్మమే విజయం సాధిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథనాన్ని గర్బా నృత్యం ద్వారా ప్రదర్శించడం అంతర్లీనంగా కనిపిస్తుంది.బేతే గర్బాగుజరాత్లోని నాగర్ కమ్యూనిటీ ‘బేతే గర్బా’ అంటే కూర్చున్న గర్బా అని జరుపుకుంటారు. ఇక్కడ, భక్తులు ఒకరి ఇంటి వద్ద గుమిగూడి, గర్బా పాటలు పాడతారు. హిందువులు తమ పండుగలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిజాం నిషేధించినప్పుడు, ఇస్లామిక్ పాలనలో జునాగఢ్ లో బేతే గర్బా ప్రారంభమైంది. చాలామంది కఠినమైన ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ నృత్యం, సంగీతంతో ఉల్లాసంగా మారి΄ోతారు. ఉత్తర భారతదేశంలో గర్బాలో భక్తులు తబలా, మంజీరను ఉపయోగిస్తారు.సంప్రదాయ దుస్తులతో...ఈ నృత్యంలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, శక్తి దేవత ఆశీర్వాదాలు కోరుకుంటూ నృత్యం చేస్తారు. గర్బా, దాండియా ఒకే విధంగా కనిపించినా, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. గర్బాలో చేతులు, కాళ్లను సమన్వయంతో కదిలిస్తూ చేస్తారు. దాండియాలో కోలాటం కర్రలను ఉపయోగిస్తారు. గర్బా పాటలు దుర్గాదేవి, ఆమె అవతారాల చుట్టూ ఉంటే, దాండియాలో పాటలు కృష్ణుడి రాసలీలలపై ఉంటాయి.పాదరక్షలు లేకుండా..గర్బా దైవారాధనా రీతుల్లో చెప్పులు ధరించకపోవడం సకల జీవులకు ఆలవాలమైన భూదేవి పట్ల మనం చూపే గౌరవంగా భావిస్తారు. భూమిని నిరంతరం అంటి పెట్టుకుని ఉండే ఈ పాదాల ద్వారానే శరీరంలోకి శక్తి ప్రవాహం జరుగుతుందని నమ్మకం. ఆ దేవితో మనకు నేరుగా సంబంధాన్ని కల్పించేవి పాదాలే. అందుకే చెప్పులు లేకుండా చేసే ఈ నృత్యం పవిత్రమైన దైవారాధన వంటిది.గర్బా.. యునెస్కోనవరాత్రి ఉత్సవాలను గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహిస్తుంటారు. మన దేశానికే ప్రత్యేకమైన ఈ ప్రముఖ నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్) జాబితాలో కిందటేడాది చేర్చింది. అమ్మవారి ఎదుట భక్తిని నృత్య రూపంలో చాటే ఈ ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ ఎప్పటికీ సజీవమే అనడానికి ప్రతీకగా నిలుస్తోంది గర్బా.(చదవండి: ఏడో రోజు చదువుల తల్లి సరస్వతిగా .. త్రిరాత్ర వ్రతం..! ) -
శ్రీనివాసుని గరుడ సేవ.. భక్తజనంతో కిక్కిరిసిన తిరుమల (ఫొటోలు)
-
ఏడో రోజు చదువుల తల్లి సరస్వతిగా .. త్రిరాత్ర వ్రతం..!
బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.మూలా నక్షత్రము రోజున అమ్మవారిని శ్వేతపద్మాన్ని అధిష్టించి, వీణ, కమండలం, అక్షరమాలను ధరించి, అభయముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదాదేవి అతి విశిష్టమైనది. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్దులకై సరస్వతీ పూజ తప్పకుండా చేయిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభాస్యం కూడా చేస్తారు. దేవీ నవరాత్రులలో చివరి మూడు రాత్రులూ చేసే త్రిరాత్ర వ్రతం ఈరోజే ప్రారంభిస్తారునైవేద్యం: దద్దోజనం, పరమాన్నం, చక్కెర పొంగలిమరోవైపు నవ దుర్గాలను పూజించే సంప్రదాయం ప్రకారం. ఏడవ రోజు కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజించడం ద్వారా భక్తులు ఆపదలు, అరిష్టాల నుంచి బయటపడతారు."ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరణీ వామ పాదోల్లిసల్లోహలితా కంటకా భూషణా వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ"ఎవరైనా శని దోషం వల్ల రకరకాల సమస్యలతో సతమతమవుతున్నట్లయితే.. ఈ రోజు ఆ దోషం నుంచి బయటపడటానికి చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి దేవి ని పూజించడం ద్వారా శని దోషం తొలగిపోతుంది.కాలరాత్రి మంత్రంఎవరి జాతకంలోనైనా శని దోషం ఉండి ఇబ్బంది పడుతూ.. ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే, మీ చింతలన్నీ తొలగిపోవడానికి.. ఈరోజు దుర్గాదేవి సప్తమ రూపం కాళరాత్రి దేవిని ‘ఓం ఐం హ్రీం క్లీం’ అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించండి. 108 సార్లు ‘కాలరాత్రియ నమః’ అని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సాధకుడు దేవతతో పాటు శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతాడని, అతని జాతకంలో శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు.నైవేద్యం: గారెలు, కిచిడి(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!) -
చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా మాత్ర విగ్రహాలు కొలువుదీరాయి. న్యూయార్క్ నగరంలో ఉండే ఎన్ఆరైలు ఈ దుర్గాపూజకు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఇదివరకటి మాదిరిగా వీడియో చాట్ల ద్వారా పూజలు జరుపుకోవాల్సిన పనిలేదు. ఈ దుర్గామాత విగ్రహాలను యూఎస్ఏ బెంగాలి క్లబ్ ఏర్పాటు చేసింది. ప్రారంభ పూజ అక్టోబర్ 5,6 తేదీల్లో ఘనంగా జరిగింది. 🚨 Durga Puja at Times Square, New York 🇺🇸 pic.twitter.com/dsTqktg14d— Indian Tech & Infra (@IndianTechGuide) October 7, 2024అందుకు సంబంధించిన ఫోటోలను పలువురు నెటిజన్లు "న్యూయార్క్ నగరం నడిబొడ్డున భారతీయ సంస్కృతి" అనే క్యాప్షన్‌తో సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అలాగే రుచికా జైన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా షేర్ చేసింది. అందులో రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాల గురించి వివరించింది. దశమి పూజతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ చారిత్రాత్మక ఘటన సిందూర్ ఖేలా టైమ్స్ స్క్వేర్ వద్ద కూడా చోటుచేసుకుంది. History has been Scripted !!!For the 1st time, Durga pujo was organized at the centre of Times Square, New York City, United States.Kudos to all the Bengalis living in New York who have made this possible!!! pic.twitter.com/n6iu4FGNp8— Sourav || সৌরভ (@Sourav_3294) October 6, 2024ఈ పండుగ ఆచారం ఐక్యత ఆవశక్యత గూర్చి చాటిచెబుతోంది. ఇలా ఈ నవరాత్రులను యునైటెడ్ కింగ్డమ్, లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో భారత సంతతి విదేశీయులు ఎంతో ఉత్సహాంగా జరపుకుంటున్నారు. ఆ వేడుకల్లో వివిధ సాంస్కృతిక బృందాలు ఈవెంట్లు, గర్బా పార్టీలు నిర్వహిస్తున్నాయి. నిజానికి ఈ చారిత్రాత్మక ఘటనలు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశంగా ఉపయోగపడతాయి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా భారతీయులంతా ఒకచోట చేరి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం విశేషం. View this post on Instagram A post shared by RUCHIKA JAIN FIREFLYDO (@fireflydo) (చదవండి: కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
తిరుమల : మోహినీ అవతారంలో శ్రీనివాసుడు.. మంత్రముగ్ధులైన భక్తులు (ఫొటోలు)
-
నవరాత్రుల్లో ముద్దుగుమ్మల స్టన్నింగ్ ట్రెడిషనల్ లుక్స్..! (ఫొటోలు)
-
నవరాత్రి ఉత్సవాలు : అమృతవర్షంలో మధుర మీనాక్షి ఆలయ కోనేరు (ఫొటోలు)
-
బాలపిట్టలూ బయటికెగరండి
Dasara holidays: తెలిసిన ఊరే. దసరా సెలవుల్లో కొత్తగా హుషారుగా అనిపిస్తుంది. మేనమామ కొడుకు మనం ఎప్పుడొస్తామా... ఊరంతా తిప్పి ఎప్పుడు చూపుదామా అని ఉంటాడు. మేనత్త కూతురి దగ్గర బోలెడన్ని బొమ్మలు. ఒకరోజు అందరూ కూడి బొమ్మల పెళ్లి కూడా చేయొచ్చు. చిన్న ఊరే. కాని మిఠాయి కొట్టు దగ్గరకు వెళ్లి మిఠాయి కొనుక్కోవడం... పాత సినిమా హాల్లో ఆడే పాత సినిమాను చూడటం... వీధిలోని కుర్రాళ్లను పిలవనవసరం లేకుండా మన బంధుగణంలోని పిల్లలే సరిపోయే విధంగా క్రికెట్ ఆడటం... సరే... ఓటీటీలో సినిమాలు చూడటం.సెలవులొచ్చేది మనవాళ్లను కలవడానికి. కలిసి ఆటలు ఆడటానికి. పెద్దయ్యాక గుర్తు చేసుకోవడానికి. పూర్వం దసరా కోసం పిల్లలు కాచుకుని కూచునేవారు. ఇవాళ రేపు సెలవులొచ్చినా మంచి ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ‘ఎక్కడికీ కదిలేది లేదని’ అదిలిస్తున్నారు. మరికొందరికి పిల్లల్ని తీసుకొని బంధువుల ఇంటికి వెళ్లడానికి తీరికే ఉండటం లేదు. కొందరికసలు బంధువులే లేరు. అంటే లేరని కాదు. ఉన్నా లేనట్టుగా వీరుంటారు. లేదా వారుంటారు. నడుమ అనుబంధాలు తెగేది పిల్లల మధ్య.పెద్దయ్యాక జ్ఞాపకాలు ఏమీ ఉండవు. ఉన్నా అవి చెప్పుకోదగ్గవి కావు. జ్ఞాపకాలంటే బాల్యమే. బాల్యంలో ఇష్టంగా గడిపే రోజులు సెలవులు. పిన్ని ఇల్లు, పెద్దమ్మ ఊరు, బాబాయి మిద్దె, పెదనాన్న వాళ్ల తోట, తాతయ్య వాళ్ల చేను, సొంతపల్లెలోని చెరువు గట్టు... ఇవన్నీ కజిన్స్‌తో... దగ్గరి బంధువులతో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది.ఇటీవల వచ్చిన ‘సత్యం సుందరం’ ఈ బాల్యాన్నే చూపుతుంది. సత్యం అనే పేరుండే అరవింద స్వామి ఇంటికి సుందరం అనే కార్తీ చిన్నప్పుడు సెలవుల్లో వస్తాడు. ఆ సెలవుల్లో చిన్న అరవింద స్వామి, చిన్న కార్తీ కలిసి ఎన్నో ఆటలు ఆడతారు. సినిమాలు చూస్తారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. ఆ అభిమానమే కార్తీని పెద్దయ్యాక కూడా అరవింద స్వామి అంటే ప్రాణం ఇచ్చేలా చేస్తుంది. ప్రేమ పంచేలా చూస్తుంది. చిన్నప్పుడు వీళ్లు ఆడుకున్న ఆట ఏమిటో తెలుసా? చిన్న అరవింద స్వామిని కూరగాయలు తెమ్మని ఇంట్లో చెప్తే పిల్లలనందరినీ తీసుకొని బయలుదేరుతాడు. ఒకడి పేరు బెండకాయ అని పెడతాడు. ఎన్ని కిలోల బెండకాయలు తేవాలో పట్టిక అవసరం లేకుండా ఆ బెండకాయ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇంకొకడి పేరు వంకాయ అని పెడతాడు. ఒకమ్మాయి పేరు కాకర. మరి కార్తీకి ఏం పేరు పెడతాడు? సినిమా చూస్తే తెలుస్తుంది.‘చిన్నప్పుడు ఎంత బాగుండేది’ అని ఏ కాలంలో అయినా పిల్లలు అనుకునేలా వారి ఆటపాటలు సాగేలా పెద్దలు చూడాలి. ఆ ఆట΄ాటలన్నీ అయినవాళ్లతో జరగాలి. దసరా సెలవులు బంగారు గనులు. ఆ గనుల్లోకి పిల్లల్ని పంపండి. మర్చిపోవద్దు. -
శ్రీశైలంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం (ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రి : మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ (ఫొటోలు)
-
పూల పండుగ..ఏడోరోజు వేపకాయల బతుకమ్మ..
తెలంగాణలో అమ్మవారిని పుష్పాలతో బతుకమ్మలా తయారు చేసుకుని ఆరాధిస్తారు. ఇది ప్రకృతి ఆరాధనకు చిహ్నంగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టేలా సాగే పండుగ బతుకమ్మ. ఈ వేడుకలు ఏడో రోజుకి చేరుకున్నాయి. ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఆటపాటలతో సంబరంగా జరుపుకుంటారు. నిన్న అలిగిన బతుకమ్మతో మూగబోయిన ప్రతి ఇల్లు ఇవాళ పూల జాతరలా సందడిగా ఉంటుంది.ఈ బతుకమ్మకు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లు ఆకారంగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వాటినే పేరంటాళ్లు వాయనంగా ఇచ్చుకుంటారు. లేదా పప్పు, బెల్లంలను కూడా బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. తమ కష్టాలన్నీ తొలగిపోయి జీవితాలు పూల మకరందం వలె సుమనోహరంగా సాగిపోవాలని ప్రార్థిస్తారు.(చదవండి: బతుకమ్మ దశ దిశలా చాటే సంస్కృతి) -
భక్తిశ్రద్ధలతో ఇంద్రకీలాద్రిపై కుంకుమ పూజలు (ఫొటోలు)
-
దసరాకు ఆ పేరు ఎలా వచ్చింది?
దసరా పండగకు కొత్త బట్టలు కొనుక్కోవడం, అమ్మ చేసిన రకరకాల పిండివంటలు తినడం, సెలవలకు ఊళ్లకెళ్లడం అందరికీ తెలుసు. అయితే అంతకన్నా ముందు అసలు దసరా పండగకు ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా... అక్కడికే వద్దాం... దశ అహః అంటే పది రోజులు అని అర్థం. దశ అహః అనే పదమే దశహర అయింది. దశహర, పది రోజులు అనే పదం కాలక్రమంలో ‘దసరా’ గా మారింది. దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది.దుష్టరాక్షసులయిన రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను తయారు చేసి టపాసులతో పేల్చేయడమో లేదా దహనం చేయడమో ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు దసరా అంటే దక్షిణాదిన అమ్మవారి పూజకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, ఉత్తరాదిన రాముని లీలలను గానం చేసేందుకు అంతే ఉత్సాహం చూపుతారు. వారి దృష్టిలో దసరా అంటే అమ్మవారు మహిషాసురుని సంహరించిన రోజు మాత్రమే కాదు, రాముడు, రావణుని చంపిన రోజు కూడా. అందుకే ఈ పది రోజుల పాటు అక్కడ రామాయణంలో ఘట్టాలను వర్ణిస్తూ.. చివరి రోజున ‘రావణ దహన్’ పేరుతో రావణుడి భారీ దిష్టిబొమ్మను దహనం చేస్తారు. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏటా ఈ వేడుకలు అట్టహాసంగా సాగుతాయి. ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడటానికి వేలాది భక్తులతో పాటు రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా తరలివస్తారు.సమయం, వ్యక్తిగత కారణాల రీత్యా కొంత మందికి రామ్‌లీలా మైదానంలో జరిగే వేడుకలను వీక్షించడం కుదరదు. చాలా మందికి ఈ వేడుకల విశిష్టత కూడా తెలియదు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధ రెలీజియస్ యాప్ ‘హౌస్ ఆఫ్ గాడ్’ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. రామ్‌లీలా మైదానంలో వేడుకలను ఈ యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అందించనుంది. -
చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ సంబురాలు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలులో ఆకట్టుకుంటున్న ప్రదర్శన శాల (ఫొటోలు)
-
పూలు పేర్చి.. బతుకమ్మ ఆడి : బతుకమ్మ వేడుకలు ఘనంగా
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పసుపుతో తయారు చేసిన గౌరమ్మకు బియ్యం పిండి, నువ్వులు, నూకలతో తయారు చేసిన ప్రసాదంగా నివేదించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, యువతలు బతుకమ్మలను ఒక చోట పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. – కుత్బుల్లాపూర్ -
శ్రీవారి బొమ్మల కొలువు
దేవీశరన్నవరాత్రి, దసరా ఉత్సవాల్లో భాగంగా.. కూరత్తాళ్వార్ వంశానికి చెందిన వేదవ్యాస భట్టార్లు గురువారం తమ ఇళ్లల్లో తమిళ సంస్కృతిలో శ్రీవారి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని శ్రీరంగం, తిరుచురాపల్లికి చెందిన కూరత్తాళ్వార్ వంశానికి చెందిన వేదవ్యాస భట్టార్లు ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. తమ ఇళ్లల్లో వివిధ రూపాల్లో విష్ణుమూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి నవరాత్రి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీ అని వారు తెలిపారు. – కేసముద్రం