దసరా సంబురాల్లో ప్రముఖుల సందడి | pm modi and president murmu attend Dussehra celebrations at Red Fort | Sakshi
Sakshi News home page

దసరా సంబురాల్లో ప్రముఖుల సందడి

Published Sat, Oct 12 2024 8:19 PM | Last Updated on Sat, Oct 12 2024 9:58 PM

pm modi and president murmu attend Dussehra celebrations at Red Fort

ఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రావణ దహనం కార్యక్రమాలు నిర్వసున్నారు. దసరా సంబరాల్లో ప్రముఖుల సందడి చేశారు. ఢిల్లీలోని మాధవ్‌ దాస్‌ పార్కులో నిర్వహించన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తదితరులు హాజరయ్యారు.

 

అదేవిధంగా ఢిల్లీలోని నవ్‌శ్రీ ధార్మిక్‌ లీలా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు.

 

 జార్ఖండ్‌ రాజధాని రాంచీలో నిర్వహించిన రావణ దహనంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ పాల్గొన్నారు.

 

బిహార్‌లోని పట్నాలో దసరా సంబరాల్లో ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరీ పాల్గొన్నారు.

 

అదేవిధంగా ముంబైలోని ఆజాద్‌ మైదానంలో శివసేన, శివాజీ పార్క్‌లో శివసేన (యూబీటీ) ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

అమృత్‌సర్: దుర్గియానా టెంపుల్ గ్రౌండ్‌లో నిర్వహించిన దసరా వేడుకలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరయ్యారు.

ఛత్తీస్‌గఢ్: దసరా వేడుకల్లో భాగంగా రాయ్‌పూర్‌లో  సీఎం విష్ణు దేవ్ సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావణ్ దహన్ ప్రదర్శించారు.

జమ్ము కశ్మీర్‌: శ్రీనగర్‌లోని  ఎస్‌కే స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకలకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఇతర నేతలు హాజరయ్యారు.



 చదవండి: బంగ్లాలో మోదీ గిఫ్ట్ చోరీ.. భారత్‌ తీవ్ర స్పందన

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement