Dussehra 2024
-
పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు
సాక్షి, అమరావతి: ఈ పండుగల సీజన్లో అన్లైన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో దుమ్ము రేపాయి. దేశ చరిత్రలో తొలిసారిగా కేవలం నెల రోజుల్లో లక్ష కోట్లకు పైగా ఆన్లైన్ కొనుగోళ్లు జరిగాయి. దసరా దీపావళి పండుగలకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టిన భారీ డిస్కౌంట్ ఆఫర్లు సూపర్ హిట్ అయ్యాయి. ఈకామర్స్ కన్సల్టెన్సీ సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్ ఈ విషయాలు తెలిపింది. ఇదే సీజన్లో 2022లో రూ.69,000 కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా, 2023లో రూ.81,000 కోట్లుకు చేరాయని, ఈ ఏడాది రూ.లక్ష కోట్లు దాటినట్లు ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవలి దసరా సమయలో రూ.55,000 కోట్ల అమ్మకాలు జరిగితే దీపావళి సమయంలో మరో రూ.50,000 కోట్ల అమ్మకాలు జరిగినట్లు డాటమ్ పేర్కొంది.నాన్ మెట్రో అమ్మకాలే అధికం ఈసారి ఆన్లైన్ అమ్మకాల్లో నాన్ మెట్రో పట్టణాలు సత్తా చూపించాయి. మొత్తం అమ్మకాల్లో 85 శాతం చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచే జరిగినట్లు అమెజాన్ పేర్కొంది. మొత్తం అమ్మకాల్లో 65 శాతం స్మార్ట్ ఫోన్లే ఉన్నాయంటే ఏ స్థాయిలో మొబైల్ ఫోన్లను కొన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉన్న లగ్జరీ స్మార్ట్ ఫోన్లపై యువత అత్యంత ఆసక్తిని కనబర్చినట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే లగ్జరీ వస్తువుల అమ్మకాల్లో 30 శాతం వృద్ధి నమోదు కాగా, బ్రాండెడ్ లగ్జరీ ఫ్యాషన్ అమ్మకాల్లో 400 శాతం వృద్ధి నమోదైంది. లగ్జరీ వాచీలు, డియోడరెంట్లు, హ్యాండ్‌బాగ్స్, స్పోర్ట్స్ వేర్, కిడ్స్‌వేర్ రంగాల్లో అమ్మకాలు అత్యధికంగా జరిగినట్లు డాటమ్ నివేదిక పేర్కొంది. -
అమ్మానాన్నను విడిచి ఉండలేక.. జడ రిబ్బనతో చిన్నారి ఆత్మహత్య
శ్రీకాకుళం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి ఉండలేక ఏడవ తరగతి విద్యార్థిని తనువు చాలించింది. పాతపట్నం నియోజకవర్గంలోని మెలియపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో లావణ్య ఏడవ తరగతి చదువుతుంది.అయితే ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన లావణ్యను గురువారం ఆమె తల్లిదండ్రులు స్కూల్లో విడిచి పెట్టి ఇంటికి వెళ్లారు. దీంతో తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి దూరంగా ఉండలేక లావణ్య మనోవేధనకు గురైంది. తల్లిదండ్రులు వెళ్లిన గంట తర్వాత జడ రిబ్బన తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు టీచర్‌కు సమాచారం అందించారు. వెంటనే ఉపాధ్యాయులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు.ఈ విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
లండన్‌లో ఘనంగా దసరా అలాయి బలాయి
హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డపై అలాయి బలాయి సాంస్కృతికి నాంది పలికారు. ప్రతి దేశంలో ఇప్పుడు ఎన్నో కుల సంఘాలు మత సంఘాలు రాష్ట్ర సంఘాలు, జిల్లా సంఘాలు ఇలా తెలుగు వారందరూ ఏదో ఒక సంస్థ ద్వారా సంఘాల ద్వారా విడిపోయి ఉన్నారు అందరిని కులాలకు మతాలకు అతీతంగా అందరిని ఒక వేదికపై తీసుకువచ్చి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల వలే కలిసి ఉండాలని చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని సీక్క చంద్ర శేకర్ అన్నారు.ఈ కార్యక్రమానికి యూకే నలుముల నుండి వచ్చిన మిత్రులు వివిధ రాజకీయ పార్టీలకు, సంస్థలకు చెందిన ప్రముఖులు, డాక్టర్స్ ,ఇంజనీర్స్ వివిధ వ్యాపారాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు అందరూ ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇలానే ప్రతి ఏడాది ఇంకా అంగరంగ వైభవంగా చేసుకోవాలని కొనియాడారు. వివిధ తెలంగాణ రుచికరమైన వంటలు ఈ కార్యక్రమం లో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. సౌత్ఆల్ మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ,గారికి మొదటిగా అలయ్ బలై కండువా కప్పి ప్రారంభించడం జరిగింది. ఒక మంచి న్యూట్రల్ వేదిక (తటస్థ వేదిక)కు నాంది పలకడం కూడా ఎంతో ఆనంద దాయకం అన్ని అలై బలై సభ్యులు కొనియాడారు..ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ కూడా ఎంతో మంది మిత్రులను కలిసిన సందర్బాలు తక్కువ. దశాబ్దాల కిందటి మిత్రులను కూడా ఈ వేదిక ద్వారా కలుసుకోవడం అలాగే ఎటువంటి జెండా, అజెండా ఈ కార్యక్రమానికి లేదని ఇది కేవలం స్నేహపూర్వక కలయికే. జమ్మి ఆకు ఇచ్చి పుచ్చుకొని అందరూ అలైబలే చెప్పుకొని తారతమ్యాలను మరచి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమం చేసుకున్నారని ఈ సందర్భంగా సభ్యులు అతిధులు కొనియాడారు.(చదవండి: TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు) -
TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు
సౌతెండ్, యునైటెడ్ కింగ్డమ్లో TCUK ఆధ్వర్యంలొ ప్రప్రధముగా తెలంగాణ బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎస్సెక్స్ లోని సౌతెండ్, బాసిల్డ్న్ , చెల్మ్సఫోర్డ్ , తుర్రోక్ కౌన్సిల్ ఉంచి దాదాపు 450 మన తెలుగు వాళ్ళు అందరు ఒక్కదగ్గర చేరి బతుకమ్మ దసరా సంతోషంగా జరుపుకున్నారు. గుర్రం మల్లారెడ్డి, గుర్రం లావణ్య నేతృత్వంలో ఈ ఈవెంట్ స్వచ్చందంగా నిర్వహించారు.తెలంగాణ ఆడపడుచులు అందమైన బతుకమ్మ పేర్చికొని వచ్చారు. దసరా జమ్మి ఆకూ మొగవాళ్ళు ఇచ్చుకొని అలాయి బలయ్ చెప్పుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ కి సౌత్జెండ్ కౌన్సిలర్స్ క్రిస్ వెబ్‌స్టర్ , పమేలా కిన్సేల్ల, సామ్ అల్లెన్, షాహిద్ నదీమ్, జేమ్స్ మొరిషన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. చివరగా తెలంగాణ వంటకాలతో విందు ఆరగించి, దసరా, బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలాంటి వేడుకలు భవిష్యత్తులోమరెన్నో జరగాలని అందరూ ఆకాంక్షించారు. -
ఆఫర్లు పెట్టినా.. కార్ల అమ్మకాలు డౌన్!
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈ ఏడాది ఆటోమొబైల్ రంగాన్ని కొంతమేర నిరాశకు గురిచేసింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ద్విచక్ర వాహన విక్రయాలు ఆశాజనకంగానే ఉన్నా కార్ల అమ్మకాలు తగ్గాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం అమ్మకాలు పెరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పాటు అమ్మకాలు ఉన్నా, లేకున్నా అక్టోబర్‌పైనే ఆశలు పెంచుకొనే డీలర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మార్కెట్ కార్యకపాలు నెమ్మదించడం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడం వల్ల కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాల విక్రయాలు తగ్గినట్లు చెబుతున్నారు. గతేడాది కంటే ఈసారి 15 నుంచి 20 శాతం తగ్గుదల ఉన్నట్లు చెప్పారు. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ గతేడాదితో పోలిస్తే పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదని పేర్కొంటున్నారు. ఆదాయంలో బైక్‌లపైనే ఎక్కువ.. మొత్తంగా వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ జీవితకాలపన్ను రూపంలో ఆర్టీఏకు వచ్చే ఆదాయంలో బైక్‌లపైనే ఎక్కువగా వచ్చింది. కార్లపై దాదాపు స్థిరంగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లు ఉన్నాయి. వాటితో పాటు మరో 50కి పైగా అనుబంధ షోరూమ్‌లు ఉన్నాయి. సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతిరోజు 1500 నుంచి 2,000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలని భావించే ప్రతిఒక్కరూ దసరా రోజులను శుభప్రదంగా భావిస్తారు. మరోవైపు దసరా సందర్భంగా ప్రకటించే ఆఫర్లు కూడా వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కానీ ఈసారి కార్లపైన గరిష్టంగా రూ.లక్ష వరకు తగ్గింపు ఇచ్చినా ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని పలువురు డీలర్లు అన్నారు.బైక్ ఓకే.. బైక్‌ల అమ్మకాలు మాత్రం గతేడాది కంటే పెరిగాయి. గత సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ నుంచి 24 వరకు 32,306 ద్విచక్ర వాహనాలను విక్రయించగా, ఈ అక్టోబర్ 3వ తేదీ నుంచి 13 వరకు 35,475 బైక్‌లు అమ్ముడయ్యాయి. సుమారు 3,169 ద్విచక్రవాహనాలను అదనంగా విక్రయించారు. ‘ఆటోమొబైల్ రంగానికి దసరా లైఫ్ వంటిది. అలాంటి దసరా ఈ సారి తీవ్రంగా నిరాశపర్చింద’ని తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్కోటేశ్వర్రావు చెప్పారు.చదవండి: ఓలాపై ఫిర్యాదుల వెల్లువ.. తగ్గుతున్న ఈవీల విక్రయాలు..ఆటోమొబైల్‌పై ప్రభావం ఆటోమొబైల్‌పై కూడా ఈ ప్రభావం ఈసారి స్పష్టంగా ఉంది. గత సంవత్సరం దసరా సందర్భంగా 10 రోజుల్లో 10,878 కార్ల అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సరం అదే కాలానికి 10,139 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఏటేటా రెట్టింపు చొప్పున పెరగాల్సిన అమ్మకాలు ఈసారి తగ్గుముఖం పట్టాయి. పైగా ఒకేసారి స్టాక్ తెచ్చి పెట్టుకోవడం వల్ల నష్టంగానే భావిస్తున్నాం’ అని సికింద్రాబాద్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ షోరూమ్ డీలర్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ వాహనాల్లోనూ చాలా వరకు రూ.20 లక్షలలోపు వాహనాలే ఎక్కువ. హైఎండ్ కేటగిరికి చెందినవి తక్కువే. వివిధ రకాల బ్రాండ్లకు చెందిన కార్లపైన రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ప్రోత్సాహకాలను ఇచ్చారు. గరిష్టంగా కొన్నింటిపైన రూ.లక్ష వరకు రాయితీ లభించింది. అలాగే రెండేళ్ల బీమా డబ్బులను కూడా డీలర్లే భరించారు. అయినప్పటికీ అమ్మకాలు పెరగలేదు. -
పోర్ట్‌ల్యాండ్‌లో ఘనంగా TDF బతుకమ్మ సంబరాలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ , దసరా ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. క్వాటామా ఎలిమెంటరీ స్కూల్ లో జరిగిన ఈ వేడుకలని చాప్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పోర్ట్లాండ్ మెట్రో సిటీస్ నుండి పెద్ద ఎత్తున ప్రవాసులు పాల్గొని విజయవంతం చేసారు.తెలుగుదనం ఉట్టి పడేలా.. మహిళలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై రంగుల బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ ఆట పాటలతో సందడి చేసారు. ఈ సంబరాల్లో భాగంగా దుర్గా పూజ నిర్వహించారు. అనంతరం జమ్మి ఇచ్చి పుచ్చుకొని అలయ్ భలాయ్ చేసుకున్నారు. బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులని అందచేశారు.ఈ వేడుకలలో పాల్గొన్న వారందరికీ శ్రీని అనుమాండ్ల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలను వైభవోపేతంగా జరగడానికి సహకరించిన మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలు విజయవంతం అవటానికి కృషి చేసిన స్పానర్స్, పోర్ట్లాండ్ చాప్టర్ టీం, వాలంటీర్స్, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ వేడుకల్లో పాల్గొన్న పోర్ట్లాండ్ మెట్రో ఇండియన్ కమ్యూనిటికి, సహాయ సహాకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. TDFసంస్థ స్థాపించి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, శుభాకాంక్షలు తెలిపారు. -
మనవడితో దాండియా స్టెప్పులేసిన నీతా అంబానీ, ఆ స్టార్ కిడ్ కూడా!
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ నీతా అంబానీ దసరా వేడుకల్లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో పాటు, మనవడు పృథ్వీ, చదువుకుంటున్ నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్ (NMAJS)లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అతని క్లాస్‌మేట్స్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిలో బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా , సైఫ్ కుమారుడు జెహ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. దాదీ, మనవళ్ళ డ్యాన్స్ నెట్టింట సందడి చేస్తోంది.అంబానీ కుటుంబం ప్రతీ పండుగను వైభవంగా జరుపుకుంటుంది. తాజాగా నవరాత్రి సంబరాల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు చిన్న కుమారుడు అనంత్ అంబానీ భార్య, కొత్త కోడలు రాధికా మర్చంట్‌తో ఉత్సాహంగా పాల్గొన్నారు. నీతా కుమార్తె ఇషా అంబానీ కుమారుడు పృథ్వీ స్కూల్లో నిర్వహించిన వేడుకలో చిన్న పిల్లలతో దాండియా స్టెప్పులు వేశారు. మనవడు పృథ్వీరాజ్ అంబానీ కరీనా కపూర్ కొడుకు జెహ్, ఇతర పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. పింక్ టోన్ స్ట్రాపీ హీల్స్,అద్భుతమైన పింక్ కలర్ సల్వార్ సెట్‌ను ధరించి నీతా ఆనందంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అలాగే తల్లి పూనమ్ దలాల్‌తో కలిసి గర్భా ఆచారం, అమ్మవారికి హారతి ఇచ్చి దసరా వేడుకను జరుపుకున్నారు. నీతా అంబానీ తన మనవడు, పృథ్వీ ,అతని క్లాస్మేట్లను స్టోరీ సెషన్‌తో ఆశ్చర్యపరిచారు. పెప్పా పిగ్ పుస్తకంనుంచి ఒక కథను వివరించి పిల్లలతో ఉత్సాహంగా కనిపించడం పిల్లలు శ్రద్ధగా వినడం, లంచ్‌లో వారితో ముచ్చటించడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలను స్కూలు యాజమాన్యం తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. -
ట్రెడీషనల్ లుక్స్‌లో కుర్రకారు మనసు దోచేస్తున్న భాగ్యశ్రీ... (ఫొటోలు)
-
దసరా సంబరాల్లో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున (ఫొటోలు)
-
రక్తమోడిన దేవరగట్టు
హొళగుంద: మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవాల్లో ఈ ఏడాది కూడా రక్తం చిమ్మింది. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో విజయదశమి సందర్భంగా శనివారం అర్ధరాత్రి తర్వాత మొదలైన బన్ని ఉత్సవంలో సంప్రదాయ ఆచారమే గెలిచింది. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం విజయోత్సవంలో భాగంగా ఉత్కంఠ భరితంగా జరిగిన జైత్రయాత్ర (కర్రల సమరం)లో 95 మందికి గాయాలు కాగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.తలలు పగిలి, దివిటీలు తగిలి, కిందపడి చేతులు విరిగి.. ఇతర గాయాలతో పరిస్థితి విషమంగా ఉన్న వారికి స్థానిక హెల్త్ క్యాంప్‌లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఆదోని, ఆలూరు, గుంతకల్లు, కర్నూలు ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారికి హెల్త్ క్యాంప్‌లో చికిత్స అందించారు. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన మాళ మల్లేశ్వరస్వామి జైత్రయాత్ర ఆదివారం ఉదయం వరకు సాగింది. ఉత్సవాలు నిర్వహించే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట భక్తులు డోలు, మేళతాళాలతో ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి దివిటీలతో అర్ధరాత్రి 12.20 గంటలకు కొండపై ఉన్న స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం.. ఒంటి గంట వరకు నెరణికి పురోహితులు, ఆలయ పూజారులు మాత మాళమ్మ, మల్లేశ్వరునికి అత్యంత వైభవంగా కల్యాణోత్సవం జరిపించారు. అనంతరం మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలతో పాటు పల్లకిని ఊరేగింపుగా కొండ దిగువకు వచ్చి మల్లప్ప గుడిలోని సింహాసన కట్ట మీద అధిష్టింపచేశారు. ఆ సమయంలో వారితో పాటు నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తుల చేతుల్లో ఉన్న రింగు కర్రలు తగిలి చాలామంది గాయపడ్డారు.తలలు పగిలాయి. మొగలాయి ఆడుతున్న కొందరు కాగడాలతో దారి చేసుకుంటూ ముందుకు సాగారు. కొందరు అగ్గి కాగడాలను భక్తులపై విసిరి భయాందోళనకు గురి చేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన జెత్రయాత్ర ముళ్లబండ, పదాలగట్టు, రక్షనడి, శమీ వృక్షం, బసవన్న గుడి మీదుగా ఉత్కంఠంగా ముందుకు సాగింది. స్వామి విగ్రహాలు సింహాసన కట్టకు చేర్చి జైత్రయాత్రను విజయవంతం చేసి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరధ్వాజ, పత్తికొండ ఆర్డీఓ భరత్‌నాయక్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు నిర్వహించారు. సోమవారం సాయంత్రం మాళ మల్లేశ్వరస్వామి రథోత్సవం ఘనంగా జరగనుంది. ఉత్సవానికి వస్తూ ముగ్గురు దుర్మరణం ఆలూరు రూరల్: బన్ని ఉత్సవాలను తిలకించేందుకు బైక్‌పై వస్తుండగా బైక్ అదుపు తప్పడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా మోకా తాలూకా తగ్గిన బూదేహళ్లి గ్రామానికి చెందిన హరీ‹Ùరెడ్డి (26), మల్లికార్జున (26), రవి (22) శనివారం బైక్‌పై దేవరగట్టుకు బయలుదేరారు. ఆలూరు మండలం కరిడిగుడ్డం సమీపంలో రాత్రి 10 గంటలకు బైక్ అదుపుతప్పి ముగ్గురూ కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. హరీ‹Ùరెడ్డి, మల్లికార్జున అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవి (22)ని మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. -
నయన్ ఇంట ఆయుధపూజ... పిల్లలతో బహుమతులు ఇప్పించిన విఘ్నేష్ శివన్ (ఫోటోలు)
-
Tirumala : తిరుమలలో ఘనంగా చక్ర స్నానం..(ఫొటోలు)
-
మంచు విష్ణు కూతుళ్లు.. అప్పుడే ఇంత పెద్దోళ్లు అయిపోయారే! (ఫొటోలు)
-
#DussehraFestival : దేశ వ్యాప్తంగా రావణ దహనం (ఫోటోలు)
-
దేవర గట్టు కర్రల సమరం.. పగిలిన తలలు
సాక్షి, కర్నూలు: దేవరగట్టు ఉత్సవాల్లో మరోసారి తలలు పగిలాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి అర్ధరాత్రి 12 గంటలకు మాళమల్లేశ్వర స్వామి కల్యాణం నిర్వహించారు. అయితే ఉత్సవ మూర్తుల్ని దక్కించుకునేందుకు వందలాది భక్తులు పోటీ పడ్డారు. కర్రల సమయంలో 100మందికి పైగా గాయాలయ్యాయి. 100మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. నిప్పు రవ్వలు పడి మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ భక్తుల్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ‘బన్ని’ ఉత్సవం ప్రత్యేకత ఇదే..గట్టుపై కొలువైన మాత మాళమ్మ, మల్లేశ్వరుని కల్యాణోత్సవం అనంతరం ‘బన్ని’ ఉత్సవంగా జరిగే కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. దేవరగట్టు ఆలయ నిర్వాహణ బాధ్యత మోస్తున్న పరిసర గ్రామాలైన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు భారీ సంఖ్యలో దేవరగట్టుకు చేరుకుంటారు. అక్కడ చెరువుకట్ట (డొళ్లిన బండే) వద్దకు చేరి కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. అనంతరం గ్రామపెద్దలు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న కంట్రోల్ రూం వద్దకు వచ్చి కొండపై జరిగే కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా వారికి బండారాన్ని ఇచ్చి వెళ్తారు.అనంతరం బాణసంచా పేల్చి ఇనుప తొడుగులు తొడిగిన రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో కాడప్ప మఠంలో అప్పటికే అక్కడ ఉంచిన మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి తీసుకెళ్తారు. ఆలయంలో ఉన్న మాళమ్మ ఉత్సవ విగ్రహంతో వేదపండితుల భక్తులు జయ జయ ధ్వానాల మధ్య అర్ధరాత్రి వేళ కల్యాణోత్సవం జరిపిస్తారు.అనంతరం ఉత్సవమూర్తులను తీసుకుని జైత్రయాత్రను సాగించడానికి కొండ దిగే వేళ కర్రలు గాలిలోకి లేస్తాయి. దివిటీలు భగ్గుమంటాయి. ఈ సమయంలో కర్రలు భక్తుల తలలకు తగిలి గాయపడతారు. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెరతాండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు కల్యాణోత్సవం అనంతరం జరిగే ఈ మొగలాయిలో పాల్గొంటారు. మొగలాయిలో భక్తులు చేతుల్లో ఉన్న కర్రలు తగిలి చాలా మంది గాయపడతారు.ఈ సమయంలోనే చాలా మందిపై దివిటీలు మీద పడటం, భక్తుల తోపులాటలో కిందపడటంతో తీవ్రంగా గాయపడి గతంలో కొందరు మృత్యవాత పడ్డారు. ఉత్సవాల్లో గాయపడిన భక్తులకు స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర స్వామి వారి ఊరేగింపుతో ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది. ఉత్సవ వివరాలు ఇలా..12న శనివారం రాత్రి మాంగల్యధారణ–కల్యాణోత్సవం (బన్ని), అనంతరం జైత్రయాత్ర మొదలై రక్షపడి (రక్త తర్పణం చేయుట) మీదుగా శమీ వృక్షం చేరుతుంది 13న ఉదయం నెరణికి గ్రామ ఆలయ పూజారి భవిష్యవాణి (కార్ణీకం) వినిపిస్తాడు 14న నెరణికి గ్రామ పురోహితుల చేత స్వామి వారికి పంచామృతం, రథోత్సవం15న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, సాయంత్రం వసంతోత్సవం, కంకణ విసర్జన 16న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి -
దసరా సంబురాల్లో ప్రముఖుల సందడి
ఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రావణ దహనం కార్యక్రమాలు నిర్వసున్నారు. దసరా సంబరాల్లో ప్రముఖుల సందడి చేశారు. ఢిల్లీలోని మాధవ్ దాస్ పార్కులో నిర్వహించన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తదితరులు హాజరయ్యారు.#WATCH | Delhi: President Droupadi Murmu and Prime Minister Narendra Modi leave after attending the Dussehra programme organised by Shri Dharmik Leela Committee at Madhav Das Park, Red Fort (Source: DD News) pic.twitter.com/wjIwCIinuu— ANI (@ANI) October 12, 2024 అదేవిధంగా ఢిల్లీలోని నవ్‌శ్రీ ధార్మిక్ లీలా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు.#WATCH | Congress Parliamentary party chairperson Sonia Gandhi and Lok Sabha LoP Rahul Gandhi attend the #Dussehra2024 celebrations at Nav Shri Dharmik Leela Committee Red Fort, Delhi pic.twitter.com/Wszph85yeQ— ANI (@ANI) October 12, 2024 జార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్వహించిన రావణ దహనంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాల్గొన్నారు.#WATCH | Jharkhand: 'Ravan Dahan' being performed in Ranchi as part of #DussehraCelebrations, in the presence of Jharkhand CM Hemant Soren pic.twitter.com/YH02qKkjtB— ANI (@ANI) October 12, 2024 బిహార్‌లోని పట్నాలో దసరా సంబరాల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ పాల్గొన్నారు.#WATCH | Bihar CM Nitish Kumar and Dy CM Samrat Choudhary attend #DussehraCelebration at Gandhi Maidan in Patna pic.twitter.com/nqk833V4Wt— ANI (@ANI) October 12, 2024 అదేవిధంగా ముంబైలోని ఆజాద్ మైదానంలో శివసేన, శివాజీ పార్క్‌లో శివసేన (యూబీటీ) ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.#WATCH | Maharashtra CM Eknath Shinde addresses Shiv Sena's Dussehra rally at Azad Maidan in Mumbai. pic.twitter.com/5UkP8C7iYs— ANI (@ANI) October 12, 2024అమృత్సర్: దుర్గియానా టెంపుల్ గ్రౌండ్లో నిర్వహించిన దసరా వేడుకలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరయ్యారు.#WATCH | Amritsar: Punjab CM Bhagwant Mann attended Dussehra celebrations at Durgiana Temple Ground pic.twitter.com/gPhZOwnBrL— ANI (@ANI) October 12, 2024ఛత్తీస్‌గఢ్: దసరా వేడుకల్లో భాగంగా రాయ్‌పూర్‌లో సీఎం విష్ణు దేవ్ సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రావణ్ దహన్ ప్రదర్శించారు.#WATCH | 'Ravan Dahan' being performed in Raipur, as part of #DussehraCelebrations in the presence of Chhattisgarh CM Vishnu Deo Sai pic.twitter.com/pMSCJ645m8— ANI (@ANI) October 12, 2024జమ్ము కశ్మీర్: శ్రీనగర్‌లోని ఎస్కే స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకలకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఇతర నేతలు హాజరయ్యారు.#WATCH | Srinagar, J&K: National Conference President Farooq Abdullah attends #Dussehracelebrations at Srinagar's SK Stadium pic.twitter.com/tlDDni0dIW— ANI (@ANI) October 12, 2024 చదవండి: బంగ్లాలో మోదీ గిఫ్ట్ చోరీ.. భారత్ తీవ్ర స్పందన -
శమీ వృక్షానికీ, దసరా పండుగకు సంబంధం ఏంటి?
శమీ వృక్షానికీ, విజయదశమి పండుగకూ సన్నిహిత సంబంధం. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ‘శమీ’ అంటే అగ్ని అని కూడా అర్థం. అగ్ని అదృశ్యంగా శమీవృక్షంలో నిక్షిప్తమై ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి. యజ్ఞాల లాంటి పవిత్ర కార్యాలలో జమ్మి కర్రలు మథించి, అగ్ని పుట్టించి, హోమాలు చేస్తారు. శమీవృక్షం ప్రస్తావన రుగ్వేదంలో, అధర్వ వేదంలో కనిపిస్తుంది. ఇక పురాణ ఇతిహాసాలలో సరేసరి. అంటే, అతి ప్రాచీన కాలం నుంచి భారతీయులు శమీవృక్షాన్ని పవిత్రమైన వృక్షాలలో ఒకటిగా భావిస్తూ వస్తున్నారు.ఇక, ‘విజయ’ అంటే శ్రవణా నక్షత్రంలో కలిసివచ్చే దశమి తిథి. ఇలా కలవటం ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షంలో జరుగుతుంది. ఆ ‘విజయ’ దశమి రోజు సర్వదా శుభదినం. అంటే, మీనమేషాలూ, గోచార, గ్రహచారాలతో నిమిత్తం లేకుండా, ఎలాంటి శుభకార్యాలకైనా విజయదశమి మంచి రోజే!విజయదశమి దసరా నవరాత్రులలో ఆఖరి రోజు. చండముండులూ, మహిషాసురుడూ వంటి రాక్షసులందరినీ 9 రోజుల భీషణ యుద్ధంలో సంహరించిన దుర్గాదేవి, విజయదశమి నాడు విజయిగా, అపరాజితగా నిలిచింది. ఈ అపరాజిత రాజాధి రాజులను కూడా శాసించే శ్రీమహారాజ్ఞి కనుక, విజయదశమినాడు దుర్గాదేవిని రాజరాజేశ్వరిగా అలంకరించడం ఆనవాయితీ. విజయ దశమినాడు అపరాజితా పూజ చేయడం ఇక్ష్వాకుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. శ్రీరాముడు జమ్మి చెట్టును అపరాజితా దేవి ప్రత్యక్ష స్వరూపంగా భావించి, శమీపూజ ద్వారా దేవి అనుగ్రహం పొంది రావణ సంహారం చేశాడని దేవీ భాగవతం చెబుతోంది. రాజులకు యుద్ధ జయమూ, ఇతరులకు కార్య విజయమూ ఇవ్వగలదు గనక జమ్మి చెట్టు ‘విజయద–శమీ’ వృక్షం. అందుకే ఆబాలగోపాలం విజయదశమి నాడు శమీ పూజ చేసే ఆచారం కొనసాగుతూ వస్తున్నది.చదవండి: దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?పూజ తరవాత అపరాజితా ప్రసాదంగా జమ్మి ఆకులను కోసి తెచ్చుకొని, వాటిని ‘బంగారం’లా దాచుకోవటం, కొన్ని ఆకులను పెద్దల చేతిలో ఉంచి, నమస్కరించి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం, దసరా పూజల సందడిలో భాగం. పనిలో పనిగా, ఆ పరిసరాలలోనే ఎగురుతుండే పాలపిట్టను చూసి, దాని నిసర్గ సౌందర్యాన్ని మెచ్చుకోవటం కూడా శుభకరం అని ఆస్తికుల నమ్మకం. విజయదశమి సందర్భంగా అపరాజితా దేవి ఆశీస్సులు అందరికీ అంది, ఆనందం కలిగించాలని ఆకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
ఇంద్రకీలాద్రి.. సింధూర శోభితం (ఫోటోలు)
-
సరిగ్గా గమనించారా.. అమ్మవారి విగ్రహాలు కాదు.. మనుషులే అలా!
Live durga utsav: దసరా ఉత్సవాల్లో మండపాలలో దుర్గామాత విగ్రహాలు కనిపించడం సాధారణ దృశ్యమే. అయితే కోల్‌కతాలో బ్రహ్మ కుమారీస్ నిర్వహించే ‘లైవ్ దుర్గా ఉత్సవ్’లో 30 ఏళ్లు దాటిన మహిళలు కొన్ని గంటల పాటు కదలకుండా విగ్రహాల్లా కూర్చుంటారు!‘జీవకళ ఉట్టిపడుతుంది’ అనుకునే వాళ్లకు దగ్గరకు వచ్చి చూస్తేగానీ అసలు విషయం తెలియదు.‘ఇది సహనానికి పరీక్ష. కదలకుండా కూర్చోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. పెద్ద సవాలు. ఈ సవాలు కోసం ప్రతి సంవత్సరం ఇష్టంగా ఎదురు చూస్తుంటాను’ అంటుంది 32 ఏళ్ల సులేఖ.గత పదిహేను సంవత్సరాలుగా లక్ష్మి, సరస్వతితో సహా వివిధ దేవతల రూపంలో మండపంలో కూర్చుంటూ ఉంది సులేఖ. సందర్శకులు నాణేలు, పువ్వులు వేదికపై విసురుతుంటారు.‘ఒక్కో దేవతకు ఒక్కో రకమైన ముఖకవళికలు ఉండాలి. దుర్గ ముఖంలో కోపం, శక్తి, ప్రశాంతత మిళితమై ఉంటాయి. నేను వేదికపై ధ్యానముద్రలో ఉంటాను కాబట్టి ఏ విషయంపైనా నా దృష్టి మళ్లదు’ అంటుంది ‘లైవ్ దుర్గా’గా పేరుగాంచిన సులేఖ. చదవండి: దురితాలను పోగొట్టి.. మన చుట్టూ రక్షణకవచంలా నిలబడే దుర్గమ్మ -
Dussehra 2024: అమ్మలగన్న అమ్మ... మన రక్షణ దుర్గం
శివుడు స్థాణువు. కదలడు. అమ్మవారు కదలిక. సైన్సు పరిభాషలో అయితే అయ్య స్టాటిక్ ఎనర్జి. అమ్మ కైనెటిక్ ఎనర్జీ. జగతి గతికి రెండు శక్తులూ కావాలి. ఇద్దరూ కలిస్తేనే మన మనుగడ కు కావాల్సిన జడ శక్తి; చిత్ శక్తి దొరుకుతున్నాయి.శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపిం అని అంటాడు శంకరాచార్యులు సౌందర్యలహరిలో. శక్తితో కలిసి ఉంటేనే శివుడు ఏదైనా చేయగలుగుతాడు. శివుడు– శక్తి వేరు కాదని శంకరుడు సౌందర్యలహరి మొట్టమెదటి శ్లోకంలోనే సూత్రీకరించాడు.‘కలాభ్యాం చూడాలంకృత–శశి కలాభ్యాం నిజ తపః ఫలాభ్యాం’’ అంటూ శివుడిని పొందడానికి పార్వతి; పార్వతిని పొందడానికి శివుడు తపస్సు చేయడాన్ని అనన్యసామాన్యంగా ఆవిష్కరించాడు శంకరులు శివానందలహరి మొట్టమొదటి శ్లోకంలో. ఒకరినొకరు కలవడానికి, కొలవడానికి వారిది నిజమైన తపోఫలం. ఆధునిక జీవనంలో మన మనుగడ సుఖంగా ఉండడానికి ఈ రెండు శ్లోకాలను పట్టుకుంటే చాలు. వీటి అర్థాన్ని, అంతరార్థాన్ని ఆకళింపు చేసుకుని... ఆచరిస్తే చాలు– శోకాలన్నీ మాయమవుతాయి. ఆధ్యాత్మిక కోణంలో శక్తిగా మనం అమ్మవారిని కొలుచుకుంటాం. లౌకిక విషయాల్లో మహిళల శక్తిని కొలిచేప్పుడు చిన్నచూపు చూస్తాం. అమ్మవారి శక్తి లేకపోతే అంతటి శివుడే కనీసం అటు గడ్డి పోచను ఇటు జరపలేడని శంకరుడన్న మాటను నోరు నొవ్వంగ స్తోత్రం చేస్తూ ఉంటాం కానీ... ఆచరణలో ఎంతవరకు పాటిస్తున్నామన్నది ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం.‘సర్వతీర్థాత్మికే; సర్వమంత్రాత్మికే; సర్వయంత్రాత్మికే; సర్వతంత్రాత్మికే; సర్వచక్రాత్మికే; సర్వశక్త్యాత్మికే; సర్వపీఠాత్మికే; సర్వవేదాత్మికే; సర్వవిద్యాత్మికే; సర్వయోగాత్మికే; సర్వవర్ణాత్మికే; సర్వగీతాత్మికే; సర్వనాదాత్మికే; సర్వశబ్దాత్మికే; సర్వవిశ్వాత్మికే; సర్వవర్గాత్మికే...’ అంటూ శ్యామలాదండకం చివరిలో కాళిదాసు అందరిలో, అన్నిటిలో, విశ్వమంతా అమ్మవారినే దర్శించాడు.‘అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ...’ అన్నాడు బమ్మెర పోతన. లక్ష్మి, పార్వతి, సరస్వతి– ముగ్గురు అమ్మలు. ఈ ముగ్గురు అమ్మలను కన్నది ఆదిపరాశక్తి దుర్గ. దేవతల తల్లి అదితి. రాక్షసుల తల్లి దితి. ఆ దితికి కడుపు కోత కలిగించిన తల్లి. అంటే రాక్షసులను సర్వనాశనం చేసిన తల్లి. తనను నమ్మే దేవతల మనసులో కొలువై ఉండే తల్లి. అలాంటి తల్లి నాకు గొప్ప పటుత్వం ఉన్న కవిత్వం ప్రసాదించుగాక. ఇది పైకి ధ్వనించే అర్థం.ఇంతకుమించి ఇందులో ఇంకా లోతయిన అర్థం ఉంది. పద్యం మొదట ఉన్న అమ్మలగన్న అమ్మ... ముగ్గురమ్మలను మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను క్రమాలంకారంలో అన్వయించుకుంటే–మహత్వం – ఓం,కవిత్వం– ఐం,వశిత్వం– క్లీం పటుత్వం– హ్రీమ్,సంపద– శ్రీమ్ అవుతుంది. బీజాక్షరాలను ఎలాపడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు కాబట్టి– వాటి సంకేతాలను పోతన ఈ రూపంలో ఆవిష్కరించాడు. ‘చాల పెద్ద’ అద్భుతమయిన ప్రయోగం. సంస్కతంలో ‘మహా శక్తి’ అన్న మాటకు తెలుగు అనువాదం. చదవండి: లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే?దురితాలను పోగొట్టేది; దుర్గంలా మన చుట్టూ రక్షణకవచంలా నిలబడేది దుర్గ. మనలో, మన చుట్టూ ఉండి నడిపించే శక్తిని కాళిదాసు దర్శించినట్లు మనం కూడా సర్వవిశ్వాత్మికగా దర్శించగలిగితే మనకు కూడా దుర్గ కట్టని కోటగా నిలబడి రక్షణనిస్తుంది.– పమిడికాల్వ మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు -
రథోత్సవం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
ఖాన్లు చేస్తున్న రావణ బొమ్మ
ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లోని ఒక ముస్లిం కుటుంబానికి దసరా వస్తుందంటే చాలు... చేతి నిండా పని ఉంటుంది. తరతరాలుగా ఈ కుటుంబం దసరాకు రావణాసురుడి దిష్టి బొమ్మలను తయారు చేస్తోంది. ఈ ఏడాది ప్రత్యేకత విషయానికి వస్తే 80 అడుగుల ఎత్తులో రావణాసురుడి దిష్టి బొమ్మను తయారుచేశారు.‘తాతముత్తాతల కాలం నుంచి ఈ పనిలో ఉన్నాం. మా తాత చేసిన పనిని మా నాన్న చేశాడు. నాన్న చేసిన పనిని నేను చేస్తున్నాను. నేను చేసిన పనిని పిల్లలు చేస్తున్నారు. ఈ పనివల్ల పెద్దగా డబ్బు సం΄ాదించక΄ోయినా మా తాతలు చేసిన పనిని మేము కొనసాగించడం సంతృప్తిగా, సంతోషంగా ఉంది’ అంటున్నాడు ముంతాజ్ ఖాన్.ఖాన్ కుటుంబం తయారు చేసిన దిష్టి బొమ్మల కోసం మొరాదాబాద్, ఫతేపూర్, హపూర్...లాంటి ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ సంవత్సరం హరియాణా, పంజాబ్‌ల నుంచి కూడా దిష్టిబొమ్మల కోసం ఆర్డర్లు వస్తున్నాయి‘దిష్టిబొమ్మల తయారీలో మేము ఉపయోగించే గన్ ΄ûడర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలుష్య రహితంగా ఉంటుంది. పెద్ద అధికారులు ఈ దిష్టిబొమ్మలను తనిఖీ చేసిన తరువాతే విక్రయిస్తాం’ అంటున్నాడు ఖాన్.రావణుడి దిష్టి బొమ్మలను తయారు చేయడం అనేది ఒక ముస్లిం కుటుంబం చేసే పని అనుకోవడం కంటే మన దేశంలో మతసామరస్యానికి ఉదాహరణ అని సగర్వంగా చెప్పుకునే పని. -
Dasara Special 2024: అమ్మవారికి ఆరోగ్య నైవేద్యాలు
నవరాత్రులు పూర్తయ్యాయి. ఈ రోజే దసరా పండుగ. అమ్మవారికి ప్రసాదాలు ఏం వండాలి? ఆరోగ్యంగా రుచిగా సులువుగా ఉండాలి. ముందురోజు నానబోసే శనగ గుగ్గిళ్ల బదులు... అప్పటికప్పుడు స్వీట్ కార్న్ సుండలు చేయండి. చిటికెలో పూర్తయ్యే రవ్వ పోంగలి వండండి. తీపి లేకపోతే పండుగ ఫీల్ రాదంటే పాల పాయసం ఉంది. పాలపాయసంకావలసినవి: బియ్యం– కప్పు; వెన్న తీయని పాలు – లీటరు; చక్కెర – ఒకటిన్నర కప్పు; నెయ్యి– టేబుల్‌స్పూన్; యాలకుల పొడి– అర టీ స్పూన్; కుంకుమ పువ్వు – పది రేకలు.తయారీ: బియ్యం కడిగి నీరంతా పోయేటట్లు చిల్లుల పాత్రలో వేసి ఉంచాలి. ఒక పాత్రలో పాలను మరిగించి పక్కన పెట్టాలి. పెద్ద పాత్ర పెట్టి అందులో నెయ్యి వేడి చేసి అందులో బియ్యం వేసి సన్నమంట మీద వేయించాలి. బియ్యం ఒక మోస్తరుగా వేగిన తరవాత అందులో పాలను పోసి కలిపి ఉడికించాలి. సగం ఉడికిన మంట తగ్గించాలి.బియ్యం మొత్తగా ఉడికిన తరవాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి కలిపి మరికొంత సేపు ఉడకనివ్వాలి. చక్కెర కరిగి తిరిగి మిశ్రమం చిక్కబడిన తర్వాత దించే ముందు కుంకుమ పువ్వు రేకలు వేయాలి. పాల పాయసాన్ని గరిట జారుడుగా ఉండగానే దించేయాలి, పోంగలి వండినట్లు తేమ ఇంకిపోయే వరకు ఉడికించకూడదు. స్వీట్ కార్న్ సుండలుకావలసినవి: స్వీట్ కార్న్ – 2 కప్పులు; పచ్చి కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; నెయ్యి – టేబుల్ స్పూన్; ఆవాలు – టీ స్పూన్; మినప్పప్పు – టీ స్పూన్; ఎండుమిర్చి – 2; పచ్చిమిర్చి – 2 (తరగాలి); ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 8 రెమ్మలు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచినిబట్టి;తయారీ: స్వీట్ కార్న్ గింజలను కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి టేబుల్ స్పూన్ నీటిని చిలకరించి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించేయాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి వడపోసి పక్కన పెట్టాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ, పచ్చికొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. పోపు దినుసులు కొబ్బరికి సమంగా పట్టిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు, ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద రెండు నిమిషాల సేపు ఉంచి, మరోసారి బాగా కలిపి దించేయాలి. గోధుమ రవ్వ పోంగలికావలసినవి: గోధుమరవ్వ – 150 గ్రాములు; పెసరపప్పు – 100 గ్రాములు; నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – టీ స్పూన్; మిరియాలు లేదా మిరియాల΄÷డి – టీ స్పూన్; అల్లం తురుము – టీ స్పూన్; ఇంగువ – చిటికెడు; జీడిపప్పు– 15; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నీరు – అర లీటరు. తయారీ: మందపాటి బాణలిలో పెసరపప్పును దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత కడిగి ప్రెషర్ కుకర్‌లో వేసి పప్పు మునిగేవరకు నీటిని పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత మెదిపి పక్కన పెట్టాలి. అదే పెనంలో గోధుమపిండి వేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత అందులో మిగిలిన నీటిని పోయాలి. నీరు మరగడం మొదలైన తర్వాత ఉప్పు వేసి కలిపి అందులో రవ్వను వేయాలి. రవ్వ ఉండలు కట్టకుండా ఉండడానికి నీటిలో వేస్తున్న సేపు గరిటతో కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికి దగ్గరవుతున్న సమయంలో ముందుగా ఉడికించి, మెదిపి పక్కన పెట్టిన పెసరపప్పు వేసి కలిపితే రవ్వ పోంగలి రెడీ. -
ధూంధాం... దసరా.. ఐదు రోజుల్లో 25 శాతం పెరిగిన మద్యం అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ ఈసారి రాష్ట్రంలో ధూంధాంగా జరుగుతోందని మద్యం విక్రయ గణాంకాలు చెప్పకనే చెబుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే గత ఐదు రోజుల్లో 25 శాతం, అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది దసరాతో ఆయన పోలిస్తే.. ఈ ఐదు రోజుల్లో 15 శాతం మేర అమ్మ కాలు పెరగ్గా, ప్రతిరోజు రాష్ట్రంలో సగటున రూ.124 కోట్ల మద్యం అమ్ముడవుతోంది. రికార్డు విద్యుత్ స్థాయిలో ఈనెల 10వ తేదీన ఏకంగా రూ.139 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల నుంచి వైన్షావు లకు తరలించారు. అదే రోజున ఏకంగా 2.35 లక్షల కేసుల బీర్లు వైన్‌షాపులకు చేరడం గమనార్హం . ఈ స్థాయిలో బీర్ అమ్మకాలు ఏడాది కాలంలోనే రికార్డు అని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నా వాస్తవానికి, సాధారణ రోజుల్లో సగటున రోజు రూ.100 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. లక్ష కేసుల వరకు లిక్కర్ అమ్ముడవు తుంది. కానీ, దసరా సందర్భంగా ఈ అమ్మకాల జోరు పెరిగింది. ఐదు రోజుల సగటు చూస్తే రోజుకు 1.20 లక్షల కేసుల లిక్కర్, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఇక, ఈనెల 1వ తేదీ నుంచి గణాంకాలను పరిశీలిస్తే 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపో యింది. ఇందులో 8.37లక్షల కేసుల లిక్కర్ ఉం డగా, 14:53 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. అదే గత ఏడాది అక్టోబర్1 నుంచి 10వ తేదీ వరకు రూ.800 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే పది రోజుల్లో కూడా 6.55 శాతం మేర మందుబాబులు పుల్లుగా లాగించేశారని ఈ గణాంకాలు చెబుతున్నాయి. -
అంబరాన్నంటుతున్న దసరా సంబరాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు లంకాధిపతి రావణుని సంహరించాడు. అందుకే దసరా నాడు రావణుని దిష్టిబొమ్మను దహనం చేస్తారు.దేశరాజధాని ఢిల్లీలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. దసరా రోజున రావణ దహనంతో పాటు పలు చోట్ల మేళాలు నిర్వహిస్తారు. ఈ మేళాలలో రావణుడు, కుంభకరుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.రామ్‌లీలా మైదాన్ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే రావణ దహన కార్యక్రమాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలివస్తుంటారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుని భారీ దిష్టి బొమ్మలను తయారు చేసి, వాటిని దహనం చేస్తారు. ఇక్కడి జరిగే మేళాలో రకరకాల వంటకాలు, వినోదాల కోసం పలు స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే రావణ దహనాన్ని దూరదర్శన్‌లో ప్ర్యత్యక్ష ప్రసారం చేస్తారు. న్యూ ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి రామ్‌లీలా మైదాన్‌కు చేరుకోవచ్చు.ఎర్రకోటప్రతి సంవత్సరం ఎర్రకోటలో దసరా సందర్భంగా మేళా నిర్వహిస్తారు. అనేకమంది కుటుంబ సమేతంగా ఎర్రకోటకు తరలివచ్చి, దసరా వేడుకలను తిలకిస్తారు. మేళా సందర్భంగా ఇక్కడ పలు షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.గీతా కాలనీనవరాత్రులు మొదలైనప్పటి నుంచి ఇక్కడ పెద్దఎత్తున మేళా నిర్వహిస్తారు. చాలామంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడికి తరలివచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఫుడ్ స్టాల్స్‌లో ఆహరం తినడాన్ని చాలామంది ఇష్టపడతారు.రోహిణి- జనక్పురిఢిల్లీలోని రోహిణి- జనక్‌పురిలో జరిగే ఈ జాతరను సెక్టార్ 11 ఫెయిర్ అని అంటారు. ఇక్కడ దసరా మేళా భారీ స్థాయిలో జరుగుతుంది. పిల్లల కోసం ఇక్కడ లెక్కకు మించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.ఇది కూడా చదవండి: షిర్డీ సాయి ట్రస్టుకు పన్ను మినహాయింపు సబబే -
ప్రతి అమ్మా దుర్గమ్మే
విజయ దశమి సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు సాక్షి ఫ్యామిలీకి ప్రత్యేకంగా చెప్పిన ముఖ్య విశేషాలు...పదవరోజుతో ఎందుకు ముగించాలి...లోకంలోని ప్రతి అమ్మా ఆ లోకంలోని జగదంబకి ప్రతిరూపం. ఈమె కనిపిస్తుంది. ఆమె కన్పించదు. ఈమె ఎలాగైతే తొమ్మిది నెలలపాటు తనలో జరిగే వ్యాధులూ అలజడీ... తోపోరాడి 10వ నెలలో సంతాన విజయాన్ని సాధిస్తోందో– అలా అమ్మ ఈమెకి మార్గదర్శకురాలిగా తొమ్మిది రాత్రులపాటు (రాక్షసులకి రాత్రే బలం అధికం. నిశాచరులు కదా) పోరాడి పోరాడి 10వ నాడు దశమి విజయాన్ని సాధించింది కాబట్టి దేవీ నవరాత్రులంటే ప్రతి స్త్రీ విజయానికీ సాక్ష్యమన్నమాట. సంతానాన్ని కనగలగడమంటే అమ్మ అనుగ్రహంతో జయాన్ని సాధించి పండంటి బిడ్డని పొందడమన్నమాట. జయమంటే గెలుపు. అమ్మ అనుగ్రహం దానికి అండగా నిలిస్తే అది విజయం అన్నమాట!రోజూ అమ్మకి కొత్తకొత్తగా ముస్తాబు...అమ్మ అలంకారాల విషయానికి వద్దాం... స్థూలంగా చెప్తే– యోగసాధన చేయదలచిన సాధకుడు మొదటి రోజున బాల్య స్థితిలో ఉంటాడు. అదే బాలా త్రిపుర సుందరీ రూపం. అమ్మ తన సంతానాన్ని బడికి పంపేముందు కడుపునిండుగా అన్నం పెట్టి పంపుతుంది. అదుగో అదే అన్నపూర్ణా రూపం. సంతానం బడికెళ్లాక మూడవ కన్నయిన జ్ఞానాన్ని పొందుతారు. అదే గాయత్రీ రూపం. గాయత్రీ మంత్రానుష్ఠానం సాగగానే ఆ వ్యక్తికి ఓ వాక్ఛక్తి వచ్చి, అతడు ఏం చెప్తే అది జరగడం ప్రారంభమౌతుంది. ఆ శక్తిని ధనార్జనకి ఉపయోగిస్తాడా? లేక పై చదువుకోసం వినియోగిస్తాడా... అని పరీక్షించడం కోసం 4వ రోజున పరీక్ష కోసం మహాలక్ష్మీ రూపం వేస్తారు. ఆ ఆలోచనని జయిస్తే సరస్వతి లక్ష్మి ఇతర దేవతలూ... ఇలా అందర్నీ శాసించగల లలితారూపాన్ని దర్శించేలా 5వ రోజున లలితా రూపాన్ని వేస్తారు. ఆరవ రోజున షష్ఠి తిథి మూలా నక్షత్రం ఉండే కారణంగా సరస్వతీ రూపాన్ని వేయించి జ్ఞాన అజ్ఞానాలకీ, విరోధం విచక్షణం అనే రెంటికీ మూలమైన శక్తిని తెలుసుకునేలా చేస్తారు.7వ రోజున వివాహిత అయిన స్త్రీ తన భర్తతో కలిసి ఉన్నప్పుడే భోగాన్నీ (మానసికానందం) పొందగలదని ఉపదేశిస్తూ భవానీ రూపాన్ని వేస్తారు. 8వ రోజున ఎంతటి కష్టానికైనా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ దుర్గారూపాన్నీ– 9వ రోజున శత్రువుని ఎదుర్కొనే సాహసాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండాలనే దృష్టిని నేర్పుతూ మహానవమి నాడు క్రోధ రూపిణి అయిన కాలి రూపాన్నీ– 10వ రోజున మహిసాసుర మర్దినీ రూపాన్నీ (జాడ్యం బద్ధకం నిర్లక్ష్యం సిగ్గులేనితనం.. వంటి లక్షణాలని తొలగించగల) వేస్తారు. స్త్రీ అలా ఉన్న రోజున రాజరాజేశ్వరిగా సర్వులకీ అధిపత్ని గా ఉంటూ అ–పరాజిత (చేపట్టిన కార్యక్రమంలో ఓటమి లేనిది) గా అవుతుందని ఈ రూపాలతో నిరూపిస్తారు.అమ్మ చేతిలో మారణాయుధాలా?మనింట్లో ఉండే కూరగాయల్ని తరుక్కునే కత్తిపీట– వంటింట్లో ఉండే పొయ్యిమంటా... ఏవి కావు మారణాయుధాలు? వాటి ఉపయోగాన్ని బట్టి అవి ప్రయోజనాన్ని సాధించుకునే ఉపాయాలూ లేదా మారణాయుధాలూ ఔతాయి. అమ్మ చేతిలో పాశం అనురాగపాశం. అందుకే మనం ఈ ఉత్సవాలను చేసుకునేలా దాంతో బంధించింది. అమ్మ చేతిలోని అంకుశం మనం అహంకారం గర్వం హోదా ఉందనే దర్పంతో ఉన్నప్పుడు (తమోగుణం)– ఆ మదగజంలా ఉన్న మనని తోవలో పెట్టేందుకు ఉపయోగించే సాధనం. అలాగే ఆమె చేతిపుష్పబాణం మనని తన దగ్గరకి రప్పించుకునేందుకు చూపే ఆకర్షణా కుసుమం. మనని కోరికకి లొంగి΄ోకుండా నిలబడగల ధైర్యాన్ని పొందవలసిందిగా సూచించే పుష్పబాణం. పరిస్థితుల్ని దాటినట్లైతే మనని వధించడానికి లేదా శిక్షించి తోవలోకి తెచ్చేందుకు అమ్మ వాడే చాపం. అర్థం చేసుకోగలగాలి! అవి రక్షణాయుధాలు– వ్యతిరేకించిన పక్షంలో మారణాయుధాలు.దేవీ నవరాత్రుల ద్వారా తెలుసుకోవలసింది..?సంవత్సర చక్రంలో ఉగాది రాగానే అమ్మకి వసంత నవరాత్రోత్సవాలు పేరిట 9 రోజులపాటు ఉత్సవాలు, కొందరైతే పూర్ణిమ వరకూ పండుగ చేస్తారు. మళ్లీ శ్రావణ మాసంలో నాలుగు లేదా ఐదు మంగళవారాలు, మళ్లీ నాలుగు లేదా ఐదు శుక్రవారాలూ అమ్మ పండుగలే. ఇదుగో ఈ ఆశ్వయుజంలో పాడ్యమినుండి అమావాస్య వరకూ ఆమె పండుగలే 30 రోజులపాటు. కార్తికమాసం అంతటా శివునితో కలిపి పూజాఉత్సవాలే ఆమెకి. మొత్తం అమ్మకి పండుగరోజులెన్ని... అని ఆలోచిస్తే.. కనిష్ఠంగా 9+4+4+30+15=62 స్త్రీని ఓ దేవతగా ప్రతి సంవత్సరమూ ఆరాధించే ఉత్తమ సంస్కారం భారత దేశానిదే.లలితా సహస్ర నామాల్లో ఏముంటుందంటే...అమ్మకున్న వెయ్యి నామాల్లో అమ్మవారి భౌతిక రూప వర్ణనం– ఆమె ఏ మంత్ర రూపంలో ఉంటుందో ఆ మంత్ర స్వరూప విధానం– స్త్రీలలో చైతన్యాన్ని ఎలా అమ్మ నింపి ‘శక్తి సేన’ అనే ఓ దాన్ని సిద్ధం చేసిందో ఆ పద్ధతీ– ఆమెకి తన సాహస పరాక్రమాలతో దుర్మార్గులూ లోకకంటకులూ అయిన పురుష రాక్షసుల్ని ఎలా సహరించిందో తన సైన్య సహాయంతో ఆ దృశ్యం – గర్భవతి అయిన ఆమెలో ఎదుగుతున్న శిశువుకి ఏ నెలలో ఏ తీరు ఆహారసారాన్ని అందించాలో ఆ వైద్యక్రమం, శత్రువుల్ని ఎలా వధించాలో ఆ తీరుతెన్నులూ, భర్తతో ఎలా అన్యోన్యంగా ఉండాలో ఆ జీవన విధానం.. ఇలా వివరింపబడ్డాయి.దేవీ నవరాత్రాల ముఖ్యోద్దేశం అరాచకాలు చేసే పురుషుల్ని సాహస పరాక్రమాలని తోటి స్త్రీల సహాయంతో ఎదిరించి వాళ్లకి భయం కలిగేలా చేయడం– భర్తతో కలిసే ఉండే తీరుని నేర్పడం– కుటుంబ రహస్యాలని గోప్యంగా ఉంచుకుంటూ సత్త్వ గుణంతో పరిస్థితిని సానుకూలత ఉండేలా చేసుకోవడం– ఎవరో వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలనుకోవడం, ఎదురు చూడ్డం కాకుండా తమె కుటుంబాన్ని తామే రక్షించుకోగల నేర్పరితనాన్ని సధైర్యంగా సాధించుకోగల విధానాన్ని నేర్పడమనేవి వీటి ముఖ్యోద్దేశాలు. -
మహిషాసురమర్ధనిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ/వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చివరి దశకు చేరాయి. తొమ్మిదోరోజు శుక్రవారం మహిషాసురమర్ధని రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక ఈ ఉత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగియనున్నాయి. ఈ ఏడాది ఉత్సవాల్లో మూలానక్షత్రం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేసినప్పటికీ గత ఏడాదితో పోల్చుకుంటే భక్తుల సంఖ్య తగ్గింది. ఇప్పటికి దాదాపు 7 లక్షల నుంచి 7.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. మహర్నవమి సందర్భంగా తరలి వచ్చిన భక్తులు నగరోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని తరించారు. పట్టువ్రస్తాలు సమర్పించిన టీటీడీ కనకదుర్గమ్మకు టీటీడీ తరఫున శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ అధికారులకు, దుర్గమ్మ దేవస్థానం ఈవో కేఎస్ రామారావు, సిబ్బంది, అర్చకులు స్వాగతం పలికారు. మేళతాళాలతో సంప్రదాయ బద్ధంగా అమ్మవారి అంతరాలయానికి తోడ్కొని వెళ్లారు. మహిషాసురమర్థిని అలంకారంలో ఉన్న దుర్గమ్మకు పట్టు వ్రస్తాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ అధికారులకు ఈవో రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదం అందజేశారు. నేడు తెప్పోత్సవం దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయదశమి రోజు కనకదుర్గాదేవికి కృష్ణానదిలోని దుర్గాఘాట్‌లో సాయంత్రం 5 గంటలకు శ్రీగంగా, దుర్గ అమ్మవార్ల సమేత మల్లేశ్వరస్వామి తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కమనీయ దృశ్యాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా గుర్తించిన పది ప్రాంతాల్లో ఎల్ఈడీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చివరిరోజు అమ్మవారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. -
దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?
Vijayadashami: దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులూ, పదవ రోజు విజయ దశమినీ కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చేపండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికీ, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికీ, తరువాత మూడురోజులు సరస్వతీ దేవికీ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతు కమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలి చిన సందర్భమే కాక... పాండవులు అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టు మీద నుంచి తమ ఆయుధాలు తీసుకున్నరోజు కూడా! ఈ సందర్భంగా ‘రావణ వధ’, జమ్మి ఆకుల పూజ వంటివి చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందినందుకు 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకొంటారు.బ్రహ్మ దేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశ వంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ జన్మించింది. సర్వ దేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపం, సింహం రూపం, మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు మహిషం రూపంలో దేవి చేతిలో హతుడైనాడు.చదవండి: దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"తెలంగాణలో పాలపిట్టను చూసిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు పోయి పూజలు చేసి జమ్మి ఆకులు (బంగారం) పెద్ద వాళ్లకు ఇస్తూ వారి దీవెనలు తీసుకుంటారు. ఒకరినొకరు ‘అలాయ్ బలాయ్’ చేసుకుంటూ మురిసిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో దసరా ఒక మహోన్నతమైన పర్వదినం. – దండంరాజు రాంచందర్ రావు -
విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారం..!
శరన్నవరాత్రి మహౌత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మండాలకు రాజరాజేశ్వరీదేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. పలు చోట్ల ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భకుల్తకు వరాలూగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచ్తెతన్యాన్నిఈ రాజరాజేశ్వరి దేవి ఉద్దీపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈమె అధిష్టాన దేవత.ఆ పేరు ఎలా వచ్చిందంటే..దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం వచ్చింది ఈ విజయదశమి రోజే అని పురాణ కథనం. 'శ్రవణా' నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి 'విజయా' అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయదశమి' అనుపేరు వచ్చినది .ఈ విజయదశమి నాడు తిధి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మొదలైన వాటితో నిమిత్తం లేకుండా కార్యం చేపట్టొచ్చు. పైగా తప్పక విజయం వరిస్తుంది. ఈ పర్వదినాన చేసే 'శమీపూజ' చాలా విశేషమైనది. శమీవృక్షమంటే 'జమ్మిచెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్థించి.. తిరిగి ఆయుధాలను వస్త్రములను పొందారు. శమీవృక్ష రూపంలో ఉన్న 'అపరాజితా' దేవి ఆశీస్సులు పొంది, కురుక్షేత్రంలో కౌరవులపై విజయము సాధించినారు. శ్రీరాముడు కూడా ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి, రావణుని సహరించి, విజయాన్ని పొందాడు. ఇక తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని, విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు.“శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||"ఈ అపరాజితాదేవిని పసుపు పచ్చని పూలతో పూజించాలి. ఆ తర్వాత శక్త్యానుసారం సువాసినీ పూజ చేయాలి. ఈ రోజు జపించాల్సిన మంత్రం..."ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌ: సకల హ్రీం" అనే మంత్రం జపించాలి. వీలైతే లలిత సహస్రనామం పారాయణ చేసి కుంకుమార్చన చేయాలి. నైవేద్యం: లడ్దూలు, బూర్లు, భక్ష్య భోజ్యాలు నివేదించాలి.(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!) -
అంతిమ విజయం మంచినే వరిస్తుంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండగే విజయదశమి. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు.ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలి. ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఇదీ చదవండి: పగ ప్రతీకారాల ‘రెడ్ బుక్’ బదులుగా ప్రేమ, ఆప్యాయతల ‘గుడ్ బుక్’ -
దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"
‘‘నానమ్మా... అనవసరంగా స్ట్రెస్సు పెంచుకోకు. తగ్గే మార్గం చెబుతా విను గ్రానీ డ్యూడ్’’ అంది నా కూతురు. ‘‘ఏం చెబుతావో ఏమో... ఈమధ్య అంతా సైన్సు మాట్లాడుతున్నావ్. స్ట్రెస్సు ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు పిండిపైన ఉండే అప్పడాల కర్ర అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు కిందనుండే రౌండు పీట అండ్ బీటా టీటా అల్ఫా ఒమెగా అంటూ అదేదో అంటుంటావ్. నా పాట్లేవో నన్ను పడనీ మనవరాల్ డ్యూడ్’’ అంది మా అమ్మ. మా అమ్మకూ ఈమధ్యే బీటెక్‌లో చేరిన నా కూతురికీ మధ్య భలే ఫ్రెండ్షిప్. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇద్దరిమధ్యా ‘షోలే’ వీరూ, జైయంత చనువు. టైము దొరికినప్పుడల్లా ఇప్పటి సినిమాల్ని ఓటీటీలో మా అమ్మకు చూపిస్తూంటే, మా అమ్మ అప్పటి సినిమాల్ని టీవీలో నా బిడ్డకు చూపిస్తూ యమా టైంపాస్ చేసేస్తుంటారు ఇద్దరూ! ఈ వైభోగానికి తోడు సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్స్టీ, లోకల్ టాక్సెస్ ఎక్స్ట్రాల్లాగా నానమ్మా, మనవరాళ్లిద్దరి మధ్యా ఎక్స్ట్రా వాదులాటలూ, కీచులాటలూ, గొడవలూ... ఆ తర్వాత ఎదుటాళ్లను గెలిపించి తామోడిపోవడానికి పోటీలూ, పేచీలు! ఫరెగ్జాంపుల్... ‘‘హే యూ ఓల్డ్ లేడీ... చూస్తుండగానే అన్నపూర్ణవు కాస్తా నిర్మలమ్మ అయిపోతున్నావు నువ్వు’’ అంటూ నా కూతురంటే... ‘‘మీ అమ్మ మాత్రం అవ్వడం లేదా... రమ్యకృష్ణలాంటిది కాస్తా వదినమ్మ వేషాల సుధాలాగా’’ అంటుంది మా అమ్మ. ఇదెలా ఉంటుందంటే హీరోని పొడవలేని విలన్ అనుచరుడు కాస్తా చివరకు సెకండ్ హీరోయిన్ని పొడిచేసినంత చిత్రంగా. ఇలా ఎందుకంటే... తన మనవరాల్నేమీ అనలేకా... అందమైన హీరోయిన్లతోనే గాక... ఇంకెవ్వరితోనూ పోల్చలేక! ఆ కూతురితో పోల్చదగ్గది మరొకరుండరూ... ఉండకూడదనే అత్యాశకొద్దీ!!అసలీ సంభాషణకు కారణం... దసరా సెలవలు కదా. అమ్మమ్మ గారి ఇంటికంటూ మా అక్కవాళ్ల పిల్లలు మా ఇంటికి రావడమూ... పండక్కి మా అమ్మను కొన్ని కోర్కెలు కోరడమూనూ. మనవరాళ్లు కదా! వాళ్ల వరాలు తీర్చకుండా ఎలా ఉంటుంది మా అమ్మ. అవేమిటంటే... మా పిల్లలకేమో చిట్టిగారెల్లో మటన్ కూర కావాలట. అక్క పిల్లలేమో ‘గారెలు మేం మామూలుగానే తినేస్తాం. మటన్‌లో పూరీలు ముంచుకుతింటాం. కాబట్టి ఎక్స్ట్రాగా పూరీలు చేయమంటు’న్నారు. దాంతో రెండూ చేసే పనిలో బోల్డెంత ఒత్తిడికి లోనవుతోంది మా అమ్మ. ఆమెను అనునయిస్తూ స్ట్రెస్సును తగ్గించే పనిలో ఉంది నా బిడ్డ. ‘‘అయినా... పూరీలు టైముకు ప్రిపేర్ అవ్వాలంటే... అసలెంతో కొంత స్ట్రెస్ ఉండాల్సిందేలే నానమ్మా’’ అంది నా కూతురు. ‘‘అదేందోగానీ పిల్లా... ఈ స్ట్రెస్సొచ్చినప్పుడల్లా నా కిడ్నీల్లో హార్ట్ ఎటాక్ వచ్చినట్టుంటుంది బ్రో. ఈ ఒత్తిడి అనేది ఉంది చూశావూ... మొదట ‘అగ్నిపర్వతం’ ‘ఈగాలిలో...’పాటలోలాగా కృష్ణ పాస్‌పోర్టు ఫొటోంత సైజులో ఉంటుందా! కాసేపటికే విజయశాంతి పట్టుకున్న సూపర్‌స్టార్ కటౌటంతగా పెరుగుతుంది. అబ్బో... అలా పెరిగినప్పుడు నాకెంత దాహం వేస్తుంటుందో తెలుసా పిల్లా? ‘దేవత’లో శోభన్‌బాబు, శ్రీదేవీ పాటలోని అన్ని బిందెల్లోకీ ఎల్లువొచ్చిన గోదారి నీళ్లన్నీ తాగీ తాగీ ఇంకా తాగుతున్నా ఇంకా దాహమేస్తున్నట్టే అనిపిస్తుంటది’’ ‘‘నీకెందుకు నానమ్మా. నీ నర్వస్నెస్ను ‘రోబో–2’లో పావురమ్మీద స్వారీ చేసే రజినీకాంత్ సైజుకు తగ్గిస్తా’’ ‘‘ఓహో... భైరవద్వీపం ‘నరుడా ఓ నరుడా’ పాటలో మరుగుజ్జుల సైజుకా?’’ అంటూ తన పాత సినిమా ఎగ్జాంపుల్‌కు వెళ్తూనే... ‘‘అయినా పెద్ద చెప్పొచ్చావ్ గానీ... స్ట్రెస్సుంటే వంట వీజీగా ఎలా అవుతుందే అమ్మాయ్?’’ అడిగింది. ‘‘నా ఇంజనీరింగ్ మ్యాథ్స్లా కాకుండా మీ ΄ాతసినిమాల భాషలోనే చెబుతా విను. కొద్దిగా స్ట్రెస్సుంటే... అప్పట్లో మీ ఓల్డుమూవీసులో పోగరుమోతు హీరోయిన్ని ఒక్క టీజింగుసాంగుతోనే హీరో లొంగదీసినంత వీజీగా చేసేగలవు పూరీలన్నీ’’ అంటూ మా అమ్మకు తన ఉపదేశాన్ని మొదలుపెట్టింది నా కూతురు. ∙∙ ‘‘అన్నట్టు నానమ్మా... ఈ స్ట్రెస్సూతో హెల్త్ సమస్యలూ అవీ వస్తాయని దాన్ని ఆడిపోసుకుంటుంటారు గానీ... ఒక్క వంటే కాదు. ఏ పనైనా హాయిగా జరిగి΄ోవాలంటే కాస్త ప్రెషరో, గిషరో వర్కవుట్ అవుతూ ఉండాలి. అదెంతుండాలంటే... కడాయిలో పూరీని పొంగించడానికీ, కుక్కరులోని రైసును ఉడికించడానికీ ఎంత కావాలో... పని సజావుగా జరగడానికి అంతే స్ట్రెస్సుండాలి’’ ‘‘ఎందుకే పాపం ఒత్తిడితో ఆ పూరీల్ని అంతలా పొంగించడం? ఎంత పొంగినా చివరకు పూరీకి బొక్కెట్టే కదా తింటారు. విజిళ్లతో ఎంతగా మిడిసిపడ్డా ఆవిరి ΄ోయాకే కదా కుక్కర్లోంచి అన్నాన్ని దించుతారు!’’ ‘‘నువ్వన్నది కరెక్టేగానీ నానమ్మా... ఎలాగూ తొక్క వలిచే తింటాంగదా అని తొడిమ ఊడిన అరటిపండు తినగలమా? అలాగే పొంగని పూరీతో పూరీ చేయగలమా చెప్పు. పొంగినదానికీ, పొంగనిదానికీ టేస్టులో ఏమాత్రం తేడా లేక΄ోయినప్పటికీ పొంగినదాన్నే కదా ప్లేట్లో వేసుకోబుద్ధవుతుంది! అలా పూరీలోకి చేరి పొంగేలా చేయడమే గాలి గొప్ప. అండ్... వంటలో ఆయొక్క ఐడియల్ ఒత్తిడి ఎంతుండాలంటే... పూరీపొరను చీల్చకూడదూ – అన్నాన్ని మాడ్చకూడదు. సమ్ఝే నానమ్మా డ్యూడ్?!’’ ‘‘నువ్వు ఎన్నైనా చెప్పవే... ఒత్తిడిలో పని జరగదు గాక జరగదు. పైగా నువ్వుంటే ఇంకా డిస్ట్రబెన్సు. కాబట్టి.... రాకమ్మా మనవరాలా రాకమ్మా.... నీ కోవేలా కాలేజీ... కిచేనెందుకూ నీకూ కొలువై ఉండేందుకూ...’’ ‘‘నేనేమీ రాన్లేగానీ... నువ్వనుకునేది కరెక్ట్ కాదు. ఒత్తిడి ఎంతుండాలంటే... భోజనం విషయానికి వస్తే అన్నం మాడి ఆకలితో మనల్ని మాడ్చకూడదు... ఆబగా ఓ ముద్ద ఎక్కువ తినేస్తే ఒంటిని జ్వరంతో కాల్చకూడదు. తలనొప్పి రానీకుండా చూసే కాఫీ అనే అమృతానికీ... అమృతాంజనానికీ సరిగ్గా మధ్యన గీత గీసేంత ఒడుపు కలిగి ఉండటమే ఐడియల్ ఒత్తిడి. దాన్ని నువ్వు స్ట్రెస్సనూ, ప్రెషరను. ఆ నర్వస్నెస్సులో ఓ వైబ్రేషనుంది. ఓ ఎమోషనుంటది. అది ఉండి తీరాలి నానమ్మా. కాబట్టి చపాతీలా చతికిల పడకు. పూరీలా ΄ పొంగనీ ఉత్సాహం నీలో’’ ‘‘అమ్మో అమ్మో... పైకి చూడ్డానికి పూరీలోని పైపొరలా సాఫ్ట్‌గా కనిపిస్తదిగానీ... కింది పొరలా భయంకరమైన టఫ్రా నీ కూతురూ. ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ను ముందుకు తీస్కెళ్లడానికి అప్పుడప్పుడూ వంటగదిలోకి ఒకతొస్తుంది. ఆ పిల్లనే అప్పడాలకర్ర బేరర్ అంటార్రా’’ అపూరూపంగా మనవరాల్ని చూసుకుంటూ నాతో అబ్బురంగా అంది మా అమ్మ. – యాసీన్ -
దసరాలో ట్రెడిషనల్‌గా ఉండే స్టైలిష్ డిజైనర్ వేర్స్ ధరించండి ఇలా..!
తెలుగింటి సంప్రదాయం డ్రెస్సింగ్‌లో కనిపించాలి. స్టైల్ లో ఏ మాత్రం తగ్గకూడదు వెస్ట్రన్ వేర్ అనిపించకూడదు సౌకర్యం లో బెస్ట్ చాయిస్ అవ్వాలి... పండగ హంగులు ఔరా అనిపించాలి. ఇండియన్ వేర్ నే డిఫరెంట్‌గా ధరించాలి. దసరా వేడుకలో మరింత స్టైలిష్‌గా కనువిందు చేసే మోడ్రన్ హంగులివి. శారీ గౌన్కుట్టిన చీరలు, ధోతీ చీరలు, ప్యాంట్ తరహా చీరలు, కేప్ స్టైల్ డ్రేప్స్... వంటి వినూత్న పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఎన్నో విభిన్న డిజైన్లలో ఆకట్టుకుంటున్న శారీ గౌన్, షరారా శారీ ధరిస్తే చాలా స్టైలిష్‌గా, తేలికగా, రోజంతా సౌకర్యవంతంగా హుషారుగా ఉంచుతుంది. ఎంబ్రాయిడరీ బ్లేజర్బ్లేజర్లు కార్పొరేట్ రంగానికి మాత్రమే పరిమితం అనుకుంటారు చాలామంది. కానీ, ఎంబ్రాయిడరీ బ్లేజర్‌ను డ్రేప్డ్ స్కర్ట్ లేదా ధోతీ ప్యాంట్‌తో స్టైల్ చేయచ్చు. నడుము భాగాన్ని బెల్ట్‌తో అలంకరిస్తే ఈ డ్రెస్ బెస్ట్ మార్కులు కొట్టేస్తుంది. గవ్వల కుర్తీధోతీ ప్యాంట్ డ్రేప్డ్ స్కర్ట్‌లకు గవ్వలు, అద్దాలతో ఎంబ్రాయిడరీ చేసిన కేప్ లేదా షార్ట్ కుర్తీతో స్టైల్ చేయచ్చు. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ΄్యాటర్న్ ఉన్న లెహెంగా లేదా పలాజో సెట్ కూడా పండగ కళను తెప్పిస్తుంది.సౌకర్యంగా! సల్వార్ కమీజ్ అయితే ప్రకాశవంతమైన రంగులు ఉన్నవి ఎంచుకోవాలి. పిల్లలతో సరి΄ోలే దుస్తులను ధరించడం వల్ల ఒకే కుటుంబ రూ΄ాన్ని సృష్టించవచ్చు. పండగ కళ రావాలనే ఆలోచనతో పిల్లలకు గాడీ ఎంబ్రాయిడరీ దుస్తులు వేయకూడదు. వారి డ్రెస్సులు సౌకర్యంగా ఉండాలి. ఆభరణాలు మేనికి గుచ్చుకోకుండా ఉండేవి ఎంచుకోవాలి. భారీ ఆభరణాలను ఉపయోగించే బదులు బ్యాంగిల్స్, జూకాలు తక్కువ బరువున్న యాక్ససరీస్‌ను ఉపయోగించాలి. (చదవండి: ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..!) -
దసరా ఎఫెక్ట్: పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌జామ్
సాక్షి,యాదాద్రి భువనగిరిజిల్లా: దసరా పండుగ సొంతూళ్లలో జరుపుకునేందుకు హైదరాబాద్ వాసులు గ్రామాల బాట పట్టారు. చాలా మంది తమ సొంత కార్లలోనే ఊళ్లకు పయనమయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరోపక్క దసరాకు పల్లెబాట పట్టిన ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు -
శరన్నవరాత్రులు..తొమ్మిదో రోజు మహిషాసుర మర్దినిగా అలంకారం..!
అమ్మవారి ఆరాధనలతో సాగిన ఈ నవరాత్రులు అప్పుడే తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి అత్యంత మహిమాన్వితమైంది. ఈరోజు అమ్మవారి అలంకారం మహిమాన్వితమైన మహిషాసుర మర్ధినీ దేవి అవతారం. అమ్మవారు ఉగ్రరూపంతో, చేతిలో త్రిశూలంతో సింహవాహినియై దుష్టశిక్షణ గావిస్తున్నట్లుగా భక్తులకు దర్శనమిస్తుంది. మహిషాసుర మర్ధిని స్తోత్రం, లలితాసహస్రనామ స్తోత్రంతో షోడశోపచార పూజలు చేసి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందుతారు భక్తులు. మహిషాసురుడనే రాక్షసుడుతో అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా హోరాహోరీగా పోరు సలిపి.. ఆశ్వయుజ శుక్ల నవమి రోజున ఉగ్ర రూపంలో అంతమొందించిందని పురాణ కథనం. అందువల్లే దుర్గమ్మను మహిషాసుర మర్దినిగా కొలుచుకుంటున్నారు భక్తులుమరికొన్ని చోట్ల చివరి రోజున దుర్గమ్మను సిద్ధిధాత్రి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈమె సర్వసిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం. తామర పువ్వుపై కూర్చుని ఉంటుంది. ఈ మాతకు నాలుగు చేతులు ఉన్నాయి. కుడి చేతిలో శంఖం, చక్రం, ఎడమవైపున చేతిలో తామరపువ్వులు ఉంటాయి. గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రీ మాత అణిమ, ఇషిత్వ, వశిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అని పిలువబడే ఎనిమిది సిద్ధులకు దేవత. ఈ మాతను ఆరాధించడం వల్ల అష్ట సిద్ధులన్నీ లభిస్తాయని, పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతోనే పొందినట్లుగా దేవీ పురాణంలో ఉంది. అంతేగాదు ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.ఈరోజున త్రిరాత్ర వ్రతం కొనసాగిస్తారు. బొమ్మలకొలువు పేరంటం జరుపుతారు. కొన్ని ప్రాంతాలవారు వాహన పూజ మహానవమినాడు చేసుకుంటారు.నైవేద్యంగా..వడపప్పు, పానకం, చలిమిడి, పులిహోర, పులగాన్నం, గారెలు, నిమ్మరసం, చక్కెర పొంగలి నివేదిస్తారు.(చదవండి: ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!) -
ట్రెడిషనల్ డిజైనర్ వేర్లో రష్మిక స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
ఈసారి దసరా వెకేషన్‌కి కుట్రాలం టూర్..!
దసరా అనగానే నవరాత్రులు పండుగ హడావిడితో ప్రతి ఇల్లు ఆద్యాత్మకతకు నిలయంగా మారిపోతాయి. రోజుకో అమ్మవారి అలంకారంతో దేవాలయాల్లో భక్తుల సందడితో కిటకిటలాడగా..ఇళ్లన్ని అమ్మవారి ఆరాధనతో హోరెత్తిపోతుంటాయి. అయితే చాలామందికి ఈ సమయంలో అలా కాసేపు కొత్త ప్రదేశాలకి వెళ్లి.. అక్కడ పండుగ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఆధ్యాత్మిక ఆనందాన్ని, ప్రకృతి అద్భుతాలని తిలకించేలా చేసే ఈ కుట్రాలం టూర్‌కి వెళ్లాల్సిందే!.ఇది పర్యాటకులకు జాలువారే జలపాతాల అందాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించే ఈ గొప్ప పర్యాటక ప్రదేశం విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.కుట్రాలం లేదా కుట్రాళం అద్భుతమైన జలపాతాలకు ప్రసిద్ధి చెందింది. దీనిని తరచుగా "స్పా ఆఫ్ సౌత్ ఇండియా" అని పిలుస్తారు. ఈ ప్రాంతం జలపాతాల హోరు తోపాటు అక్కడ కొలువై ఉన్న కుట్రాల నాదర్ స్వామి ఆలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నటరాజు అవతారమైన పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి.ఈ కుర్తాలంలోని శివలింగాన్ని అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించారని పురాణ కథనం. ఇక ఈ ఆలయాన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పాండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ ఆలయం శిల్ప సంపద చూపురులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఈ కుట్రాల లేదా కుర్తాల నాదర్‌గా పిలవబడుతున్న పరమేశ్వరుడి తోపాటు అమ్మవారు వేణువాగ్వాదినీ దేవిగా పూజలందుకుంటోంది. ఆ అమ్మవారి తోపాటు పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ కొలువై ఉన్న పరాశక్తి అమ్మవారి పీఠం 51 శక్తి పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వెలిసినప్పటికీ ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే నిర్వహించడం విశేషం.కుట్రాలంలో కొలువైన జలపాతాలు..పేరరువి జలపాతం (పేరరువి)ఎత్తు: సుమారు 60 మీటర్లు.కుత్రాలంలో అత్యంత ప్రసిద్ధ, అతిపెద్ద జలపాతం. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు.చిత్తరువి జలపాతం ఎత్తు: పేరరువితో పోలిస్తే చిన్నది.పేరరువి జలపాతానికి దగ్గరగా ఉంది, త్వరగా స్నానం చేయడానికి అనువైనది.ఐదు జలపాతాలు (ఐంతరువి)విశేషం: నీరు ఐదు పాయలుగా విడిపోయి జాలువారుతుంది. టైగర్ ఫాల్స్ (పులియరువి)అత్యంత చిన్న జలపాతం కావడం వల్ల పిల్లలకు, పెద్దలకు సురక్షితమైనది. పాత కుర్తాళం జలపాతం (పజయ కుర్తాళం)ప్రధాన జలపాతం నుంచి సుమారు 8 కి.మీ.చుట్టూ పచ్చని చెట్లతో, నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తోంది.షెన్బాగా జలపాతం (శెనబగాదేవి జలపాతం)చేరుకోవడానికి కొంచెం ట్రెక్కింగ్ అవసరం. సమీపంలోని దేవాలయం ప్రత్యేక ఆకర్షణ.హనీ ఫాల్స్ (తేనరువి)మూడు వైపుల నుంచి నీటి ప్రవాహంతో చూడచక్కగా ఉంటుంది.కొత్త జలపాతం (పుత్తు అరువి)తక్కువ రద్దీ, ప్రశాంతమైన అనుభూతిని అందిస్తోంది.ఫ్రూట్ గార్డెన్ ఫాల్స్ (పజతోట్ట అరువి)పండ్ల తోటలో ఉంది, జలపాతం123 కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌ను అందిస్తుంది.ఇక ఈ జలపాతాలన్నీ చిత్తార్, మణిముత్తారు, పచైయార్ మరియు తామిరబరణి వంటి నదుల ద్వారా ప్రవహిస్తాయి. ఇవి ఏడాది పొడవునా స్థిరమైన నీటి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి. ఎలా చేరుకోవాలంటే..తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నగరం నుంచి కుట్రాలంకు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. కుట్రాలం ప్రాంతానికి సమీపంలోని రైల్వే స్టేషన్ పేరు తెన్కాశి. ఇక్కడినుంచి కుట్రాలం ప్రాంతానికి బస్సులు, ఆటోల సౌకర్యం ఉంది. ఇటు తెన్కాశి, కుట్రాలం ప్రాంతాల్లోనూ పర్యాటకులకు అన్ని సదుపాయాలు అందుబాటు ధరల్లోనే లభించడం విశేషం.(చదవండి: ఈసారి వెకేషన్‌కి పోర్బందర్ టూర్..బాపూజీ ఇంటిని చూద్దాం..!) -
తిరుమల : సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (ఫొటోలు)
-
ఆ 'ఆదిపరాశక్తి' పేరు మీదుగా వెలిసిన మహానగరాలివే..!
దేశమంతటా పెద్దఎత్తున జరుపుకొనే పండగల్లో ఒకటైన ‘దసరా’ను పదిరోజుల పాటు వేడుకగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఆ అమ్మను సేవించడం, ఆమె కొలువు తీరి ఉన్న ప్రాంతాలను దర్శించుకుని భక్తితో తన్మయులం కావడం సహజం. అందుకే ఈ పండుగ రోజులలో దేశవ్యాప్తంగా వెలసిన అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారి ఆలయాలు భక్తజన సంద్రాలుగా మారతాయి. అయితే ఇలా విభిన్న పేర్లతో, వేర్వేరు రూపాల్లో ఆయా ప్రాంతాల్లో కొలువైన ఆ ఆదిపరాశక్తి నామాల మీదుగా ఏకంగా కొన్ని నగరాలు... ఆ మాటకొస్తే మహానగరాలే వెలశాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు కానీ అది ముమ్మాటికీ నిజం. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పేర్ల మీద వెలసిన కొన్ని నగరాలు, వాటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం..కాళీ ఘాట్ పేరు... కోల్కతామామూలుగానే కోల్‌కతా పేరు చెప్పగానే కాళీమాత నిండైన విగ్రహమే మనో ఫలకంలో మెదులుతుంది. ఇక దసరా సందర్భంగా అయితే కోల్‌కతా మహా నగరంలో అమ్మవారి మండపాలే దర్శనమిస్తుంటాయి. ఇంతకూ కోల్‌కతాకు ఆ పేరు రావడానికి కారణమేమిటో తెలుసా? కోల్‌కతా అనేది బెంగాలీ భాషలోని కాలిక్ క్షేత్ర అనే పదం నుంచి ఉద్భవించింది. కాలిక్ క్షేత్ర అంటే.. కాళికా దేవి నిలయమైన ప్రాంతం అని అర్థం. ఎర్రటి కళ్లతో, నల్లటి రూపంతో, నాలుక బయటపెట్టి ఎంతో గంభీరంగా కనిపించే ఈ దేవి తనను భక్తి శ్రద్ధలతో పూజించే భక్తులను దయతో కా΄ాడుతుంది. అలాగే ‘కాళీఘాట్’ అనే పదం నుంచి ఈ నగరానికి కోల్‌కతా అనే పేరొచ్చినట్లు మరో కథనం ప్రచారంలో ఉంది. ఇక్కడ కాళీమాత కొలువైన ‘కాళీఘాట్ కాళీ దేవాలయా’నికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు స్థల పురాణం.ముంబయి – ముంబాదేవిముంబాయికి దక్షిణ ముంబయిలోని బులేశ్వర్ అనే ప్రాంతంలో కొలువైన ఆలయంలోని ముంబాదేవి పేరు మీదుగానే ఆ పేరు వచ్చిందని ప్రతీతి. వెండి కిరీటం, బంగారు కంఠసరి, ముక్కుపుడకతో అత్యంత శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది అమ్మవారు. పార్వతీమాత కాళికా దేవిగా అవతారమెత్తే క్రమంలో పరమ శివుని ఆదేశం మేరకు ఇప్పుడు ముంబయిగా పిలుస్తోన్న ప్రాంతంలో ఓ మత్స్యకారుల వంశంలో జన్మించిందట. మత్స్యాంబ అనే పేరుతో పుట్టిన అమ్మవారు అవతారం చాలించే సమయంలో మత్స్యకారుల కోరిక మేరకు ‘మహా అంబ’గా వెలిసిందని, కాలక్రమేణా ఆమె పేరు ‘ముంబా దేవి’గా మారినట్లు స్థల పురాణం చెబుతోంది.శ్యామలా దేవి పేరే సిమ్లాకుసిమ్లా.. సాక్షాత్తూ ఆ కాళీ మాతే శ్యామలా దేవిగా వెలసిన నగరం కాబట్టే సిమ్లాకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది. ఈ గుడిని 1845లో బ్రిటిష్ పరిపాలనా కాలంలో బెంగాలీ భక్తులు జకు అనే కొండపై నిర్మించారట! ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో శ్యామవర్ణంలో మెరిసే దుర్గామాత రూపం చూపరులను కట్టిపడేస్తుంది.చండీ మందిర్...చండీగఢ్చండీ అంటే పార్వతీ దేవి ఉగ్ర రూపమైన చండీ మాత అని, గఢ్ అంటే కొలువుండే చోటు అని అర్థం.. ఇలా ఈ నగరానికి చండీగఢ్ అని పేరు రావడానికి అక్కడ కొలువైన ‘చండీ మందిర్’ దేవాలయమే కారణం. చండీగఢ్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచకుల జిల్లాలో కల్క పట్టణంలో కొండపై వెలసిందీ దేవాలయం. ఈ చండీ గుడి, మాతా మానసి దేవి ఆలయం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుంచి కనుచూపు మేరలో గల శివాలిక్ కొండలు ఈ ఆలయానికి అదనపు సొబగులు.మంగళూరు... మంగళాదేవికర్ణాటకలోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన మంగళూరుకు ఇక్కడ కొలువైన మంగళాదేవి పేరు మీదే ఆ పేరొచ్చింది. పురాణాల ప్రకారం.. మంగళాదేవి ఆలయాన్ని పరశురాముడు నెలకొల్పినట్లు తెలుస్తుంది. నేపాల్ నుంచి వచ్చిన కొందరు సాధువుల సూచన మేరకు 9వ శతాబ్దంలో తులునాడును పరిపాలించిన అలుపారాజ వంశస్థుడు కుందవర్మన్ ఈ ఆలయాన్ని కేరళ శిల్పకళా రీతిలో కట్టించాడు. ప్రతిసారీ దసరా శరన్నవరాత్రుల సమయంలో మంగళాదేవికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దశమి రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించిన తర్వాత నిర్వహించే రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది.పటన్ దేవి పేరుతో పట్నాపట్నాకు ఆ పేరు రావడానికి శక్తి స్వరూపిణి అయిన ‘పతన్ దేవి’ అమ్మవారు కొలువైన ఆలయమే కారణం. ఈ ఆలయం 51 సిద్ధ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పురాణ గాథల ప్రకారం.. దక్షయజ్ఞం సమయంలో ఆత్మాహుతి చేసుకున్న సతీదేవి శరీరాన్ని మహావిష్ణువు ముక్కలుగా ఖండించగా, కుడి తొడభాగం ఈ ప్రాంతంలో పడిందట! అలా వెలసిన అమ్మవారిని మొదట్లో ‘సర్వానంద కారి పతనేశ్వరి’ అనే పేరుతో కొలిచేవారు. కాలక్రమంలో.. ఆ పేరు ‘పతనేశ్వరి’గా, ఇప్పుడు ‘పతన్ దేవి’గా రూపాంతరం చెందుతూ వచ్చింది.నైనాదేవి పేరుతో నైనితాల్ నగరందక్షయజ్ఞంలో దహనమైన సతీదేవి శరీరాన్ని ఖండించినప్పుడు ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడినట్లుగా స్థలపురాణం చెబుతోంది. మహిషాసురుడిని సంహరించిన కారణంగా నైనాదేవిని, మహిషపీత్ అని కూడా పిలుస్తారు. అలా మహిషుణ్ణి సంహరించిన సమయంలో దేవతలందరూ అమ్మవారిని ‘జై నైనా’ అంటూ నినదించడం వల్ల ఈ అమ్మవారు ‘‘నైనా దేవి’గా పూజలందుకుంటోందట. శక్తిపీఠాలలో ఒకటైన ఈ ఆలయంలో విజయదశమి ఉత్సవాలు మహాద్భుతంగా జరుగుతాయి.మరికొన్ని ప్రదేశాలుత్రిపుర – త్రిపుర సుందరి మైసూరు – మహిషాసుర మర్దిని కన్యాకుమారి – కన్యాకుమారి దేవి తుల్జాపుర్ – తుల్జా భవాని (మహారాష్ట్ర)హస్సాన్ – హసనాంబె (కర్ణాటక)అంబాలా – భవానీ అంబా దేవి (హరియాణా)– డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..) -
ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్..!
కొందరూ యువకులు వయసు ఎంతో కాకపోయినా వృద్ధులు మాదిరిగా ప్రవర్తిస్తుంటారు. అదీగాక చురుకుగా ఏ కార్యక్రమంలో పాల్గొనరు. కానీ కొందరు వృద్ధులను చూస్తే చూడముచ్చటేస్తుంది. అబ్బా ఏం ఎనర్జీ అనిపిస్తుంది. వాళ్లను ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనే ఫీల్ వస్తుంది. గర్వంగా కూడా అనిపిస్తుంది. అలాంటి వృద్ధ జంట దాండియా డ్యాన్స్ చేస్తూ అలరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఇద్దరు వృద్దులు చలాకీగా దాండియా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అందులో వారితో ఓ యువకుడి కూడా కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. ఏదో నీరసంగా అడుగులు కదపలేదు. యువకులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉషారుగా ఇరువురు దాండియా ఆడారు. ఇద్దరు ఎంత లయబ్ధంగా స్టెప్పులు కదిపారంటే..కనురెప్ప వాల్చ బుద్ధి కాదు. అంత అద్భుతంగా చేశారు ఇద్దరు. నవరాత్రి ఉత్సవాలతో దేశంలోని నలుమూలలు గార్బా, దాండియా వంటి నృత్యాలతో సందడిగా ఉంది. మరొకొన్ని చోట్ల మహిళలు ఇంధోని జ్వాలని మోస్తూ గార్బాని ప్రదర్శించారు. ఈ నృత్యం చేస్తున్న దృశ్యం ఎవ్వరినైనా మంత్రముగ్దుల్ని చేసి కట్టిపడేస్తుంది. View this post on Instagram A post shared by Tanish Shah (@theghotalaguy) (చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..) -
బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా..
ఇవాళ సద్దుల బతుకమ్మ. తెలంగాణ అంతటా స్త్రీలు పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తారు. ఈ సందర్భంగా స్థానిక సంస్కృతిలో బతుకమ్మ విశిష్ఠతను వివరిస్తున్నారు ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు జయధీర్ తిరుమలరావు.ఆదివాసీ సంస్కృతులలో అమ్మతల్లి ఆరాధన గురించి..?ఆదివాసీ సంస్కృతిలో, వారి జీవితంలో స్త్రీ దేవతారాధన విడదీయరానిది. ఆదివాసీలలోనే కాదు శ్రామిక జీవితంలో, జానపద సమాజంలో అమ్మదేవతలు విశిష్ట స్థానంలో ఉంటారు. ఆదిమ కాలంలో వ్యవసాయానికి స్త్రీలే పునాది వేశారు. బీజం, క్షేత్రం స్త్రీ అనుభవం. పునరుత్పత్తి భావనకి స్త్రీ ఆలంబన. విత్తనాలు నాటడం, కలుపు తీయడం, కోత కోయడం అంతా స్త్రీలే. పొలంలో పంట తీయడం, గర్భంలో శిశువుని మోయడం రెండూ స్త్రీల వంతే. అంతేకాదు, దానికి కావలసిన భాషని సృజించుకున్నదీ స్రీయే. భాషని సాహిత్యీకరించినదీ వారే. అనేక రకాల పాటలు పాడటం, పూజకు కావల్సిన కర్మకాండని తీర్చిదిద్దినదీ వారే. ఆ విధంగా స్త్రీ అనేక రంగాలలో, అనేక రూపాలతో తన శక్తి సామర్థ్యాలను వ్యక్తం చేసింది. మహత్తులను చూపి అమ్మదేవతారాధనకి ఆలంబన అయ్యింది. ఒక్కో అంశానికి ఒక్కో దేవతని ఏర్పరుచుకుని ఆయా రుతువులలో, పంటల కాలంలో దేవతారాధన చేశారు. ఆయా దేవతలను జ్ఞాపకం చేసుకోవడం, పూజించడం, రాబోయే తరాలకు వారిని జ్ఞాపకం చేయడం జరుగుతోంది. మాతృస్వామ్య వ్యవస్థ ప్రాధాన్యత అమ్మతల్లి ఆరాధనకు పట్టుగొమ్మ. అందులో భాగమే బతుకమ్మ. జన్మనిచ్చి, బతకడానికి అన్ని రకాలుగా చేయూతనిచ్చే ఆరాధన ఉంది. ప్రస్తుత కాలంలో ఆదివాసుల సమ్మక్క సారలమ్మలు, మైదాన ప్రాంతాల బతుకమ్మ పండగలు రోజు రోజుకూ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ పరంపరను ఎలా అర్థం చేసుకోవాలి?బతుకమ్మ పండగ ప్రధానంగా తెలంగాణ స్త్రీల పండగ. దీనినే పూల పండగ అంటారు. ఎలాంటి బలి తంతు లేకుండా జరిగే క్రతువు. ఆ రోజు శాకాహారమే. బతుకమ్మలో ఆహారం, నృత్యం, పాట, సంగీతం అన్నీ సమపాళ్లల్లో కలగలసి ఉంటాయి. చాలారకాల ఆదివాసుల నృత్యాలు వర్తులాకార నృత్యాలే. పాల్గొనే స్త్రీలు అందరూ గుండ్రంగా చేరతారు. గుండ్రంగా కదులుతూ వంగుతూ, లేస్తూ, చప్పట్లు కొడుతూ చక్కని సంగీతాన్ని సృష్టిస్తారు. వారు తమ శరీర లయకు అనుగుణంగా పాటల్ని పాడతారు. ఒకరు ప్రధాన గాయనిగా పాటని అందుకుంటే మిగతావారు సామూహికంగా లయాత్మకంగా పాడతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ వంటి ఆటపాటలలో, పండగలో స్త్రీలదే ప్రధాన పాత్ర. ఈ పండగలో స్త్రీలు అందరూ సమానమే. పాటల రాగం చేతులతో చప్పట్లు మోగించే శైలిలో పాడబడుతుంది. ఇదే విధానం తెలంగాణ అంతటా కనిపించడం విశేషం. ప్రతిరోజు కొత్త ధాన్యంతో రకరకాల పిండివంటలు చేసి అందరూ కలిసి పంచుకుని భుజించడం ఆనవాయితి. ఇక్కడ కులాల, అంతస్తుల ప్రమేయం కనిపించదు. కాని మారిన కాలంలో కులాలవారీగా కట్టుకున్న అపార్టమెంట్ల మాదిరిగా అక్కడక్కడా కులభావన కనిపించడం మరీ ఆధునికం. కాని బతుకమ్మ పండగలో స్త్రీల సంప్రదాయ బలం లోతు చాలా ఎక్కువ. అందుకే దేశంలోని వేరే రాష్ట్రాలలో జరిగే పూల పండగల కన్నా ఎంతో విలక్షణంగా, ప్రత్యేకంగా నేటికీ జరుగుతున్నది. ఈ పరంపర తెలంగాణకి ప్రత్యేకం. సుమారు వేయి సంవత్సరాల చరిత్ర దీనికి ఉందని చెప్పవచ్చు. పండగ సందర్భంగా సోదరిని పుట్టింటికి తీసుకురావడం అనే ఆచారం కూడా కొనసాగడం గమనించాలి. బతుకమ్మ ఆంధ్ర, రాయలసీమలో ఎందుకు కానరాదు?నిజానికి పూల పండగ మనదేశంలో కేరళ రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్ర్రాలలో జరుపుతారు. విదేశాలలో కూడా జరుపుతారు. అంటే పూలను ప్రేమించడం, సేకరించడం, ఊరేగించడం, తలమీద ఎత్తుకుని తీసుకు΄ోవడం అనే ఆచారం ఉంది. కానీ తెలంగాణాలో జరిగే రీతి రివాజు మరెక్కడా కనపడదు. బతుకమ్మ పండగ విధానం కాదు. అది స్వభావం. దాని లక్ష్యం కుటుంబ అభివృద్ధి. స్త్రీని అత్తవారింటికి పంపి ఊర్కోవడం కాదు. పెళ్లి తదితర ఫంక్షన్లకి రావడం కాదు. హక్కుగా తల్లిగారింటికి వచ్చి పూలతో ఇంటిని వెలిగించడం ముఖ్యం. అన్న లేదా తమ్ముడు సోదరిని తోలుకుని వచ్చి గౌరవించడం, కట్నకానుకలను పెట్టడం తప్పనిసరి. ఇలాంటి సంప్రదాయాలు వేరే చోట్ల బలంగా కనబడవు. కాని పూలను పేర్చి పండగ చేయడం కృష్ణానది కింద చూశాను. ప్రకృతి ఆరాధన కూడా ఈ పండగలో ఒక ముఖ్య భాగం. నిండిన చెరువుల దగ్గర, కుంటల దగ్గర, జలాశయాల దగ్గర ఆట ఆడి ఆ నీటిలోనే పూలను కలుపుతారు. ఏ జలం ఆధారంగా పూసిన పువ్వులు ఆ జలానికే అంకితం కావడం ఒక గొప్ప తాత్వికత. ఇక్కడ ఆడపిల్లలు బొడ్డెమ్మలు ఆడతారు. ఆంధ్రాప్రాంతంలో గొబ్బెమ్మలు ఆడతారు. తెలంగాణ గ్రామీణంలో దసరా ప్రత్యేకత ఏమిటి?దసరా మంచికి, చెడుకి మధ్య జరిగిన యుద్ధం. జమ్మిచెట్టు చిన్నదే. కాని పాండవులు తమ ఆయుధాలు దానిపై దాచి ఉంచారు. కాబట్టి జమ్మి ఆకుని ‘బంగారం’ అంటారు. ఆ ఆకుని ఇచ్చిపుచ్చుకుని అలాయి బలాయి తీసుకుంటారు. అదేరోజు సాయంకాలం చాలా చోట్ల రావణుడి బొమ్మని తయారుచేసి, దానిని కొలుస్తారు. అలా కాకుండా చాలా ఆదివాసీ ప్రాంతాలలో సమూహాలలో రావణుడిని పూజిస్తారు. అక్కడ మనలా దసరా పండగ జరపరు. తెలంగాణలో దసరా పండగ రోజున మద్యం, మాంసం తప్పనిసరి. బంధువులు, స్నేహితులతో కలిసి పేదలు సైతం పండగని ఘనంగా జరుపుకుంటారు. కుల భావన లేకుండా ఆలింగనం చేసుకుంటారు. కొన్ని తావులలో వైషమ్యాలు మరిచి కలసిపోతారు. బతుకమ్మ పండగకి ఇంటికి సోదరి వస్తుంది. దసరాకి అల్లుణ్ణి పిలుచుకుంటారు. లేదా సోదరిని దసరాకి అత్తగారింటికి పంపిస్తారు. ఆ విధంగా తెలంగాణ లో దసరా అతి పెద్ద పండగ. ఈ రెండు పండగలు ఒకే రుతువులో ఒకే వారంలో, ఒకదాని తరువాత మరొకటి జరగడం గమనించాలి. బతుకమ్మ స్త్రీల పండగ. దసరా ఒక రకంగా పురుష ప్రధానమైన పండగ. (చదవండి: పూల పండుగ..తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.. ) -
జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ 11వ బతుకమ్మ కార్యక్రమాన్ని బెర్లిన్‌లోని గణేష్ ఆలయంలో నిర్వహించింది. ఈ సందర్భంగా, బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి మంత్రి (పర్సనల్) డాక్టర్ మన్దీప్ సింగ్ తులి, అతని కుటుంబ సభ్యులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ తులి సంప్రదాయానికి గౌరవ సూచకంగా బతుకమ్మను తలపై ఎత్తుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్, డాక్టర్ రఘు చలిగంటి, రుచికరమైన తెలంగాణ ఆహారాన్ని తయారు చేసిన వాలంటీర్లకు, ముఖ్యంగా వంట టీమ్, క్లీనింగ్ అండ్ డెకరేషన్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీఏజీ కార్యవర్గానికి చెందిన రామ్ బోయినపల్లి, శరత్ రెడ్డి కమ్డి, నటేష్ చెట్టి గౌడ్ యోగానంద్ నాంపల్లి, బాల్‌రాజ్ అందె, శ్రీనాథ్ రమణి, అమూల్య పోతుమంచి, అవినాష్ రాజు పోతుమంచి, స్వేచ్ఛా రెడ్డి బీరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి బీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో పూజ చేసినందుకు ప్రశాంత్ గోలీకి, ఫోటోలు తీసినందుకు నిదాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు) -
బతుకమ్మ పుట్టినిల్లు!
సాక్షి, వరంగల్: బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ పూల వేడుక. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం. ఈ మేరకు పలు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ గుర్తింపునకు చిహ్నంగానే ఆ ప్రాంతంలో పదెకరాల విస్తీర్ణంలో బతుకమ్మ ఆలయం నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. శ్రీశాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ గ్రామం బతుకమ్మకు పుట్టినిల్లని పలు చారిత్రక పరిశోధనల్లో తేల్చారు. అటు రాష్ట్ర దేవాదాయ శాఖ, ఇటు కేంద్ర పర్యాటక శాఖను సమన్వయం చేసుకుంటూ, ఎన్ఆర్ఐలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించే బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతా అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించే దిశగా అడుగులు పడతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణమైతే ఓవైపు ఆధ్యాతి్మకంగా, మరోవైపు పర్యాటకంగా చౌటపల్లి విరాజిల్లనుంది. ఇప్పటికే చారిత్రక నగరంగా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో మరో చారిత్రక ప్రాంతం చేరనుంది. రూ.100 కోట్లతో ఆలయ నిర్మాణం గ్రామంలోని పదెకరాల్లో నిర్మించే బతుకమ్మ గుడికి రూ.100 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రూ.70 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనుండగా.. రూ.30 కోట్ల మేరకు భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే చౌటపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేసిన బెంగళూరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ దాఖోజు రవిశంకర్ దాదాపు రూ.15 కోట్లు బతుకమ్మ గుడి నిర్మాణానికి ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. బతుకునిచ్చిన అమ్మ!17వ శతాబ్దంలో తెలంగాణను నిజాం నవాబులు పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో ఓరుగల్లు పట్టణంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వంగాల రామయ్య 16వ ఏటనే నిజాం ప్రభువులకు చెందిన వెండి నాణేల ముద్రణ కర్మాగారంలో పనిచేస్తూ అనతికాలంలోనే పాలకులను ఆకట్టుకొని కొంత మాన్యం పొందారు. ఆ ప్రాంతమే ఇప్పటి పర్వతగిరి మండలంలోని చౌటపల్లి. రామయ్య ఆ స్థలంలో ప్రజల సౌకర్యార్థం చెరువు తవ్వించి వసతులు కల్పించారు. సౌటమట్టి కలిగిన ప్రాంతం కనుక సౌటపల్లిగా, కాలక్రమంలో చౌటపల్లిగా మారింది. కొంత కాలానికి చౌటపల్లి గ్రామ శివారు గ్రామాల ప్రజలు కలరా సోకి చనిపోతున్నారని తెలిసి గ్రామ ప్రజలు రామయ్యను సంప్రదించారు. సమస్య పరిష్కారానికి ఆయన గాయత్రిదేవిని ఉపాసించాడు. ఆ తల్లి నామస్మరణలో మూడు రోజులు గడిపాడు. దీంతో గాయత్రీమాత ఆయనకు స్వప్నంలో కనిపించింది. అశరీర వాణిగా గ్రామ సౌభాగ్యానికి తన సంతానాన్ని ఆర్పించాలని, ప్రత్యేక పూజా విధానం, పాత్ర కాని పాత్రలో ఎంగిలిపడని పూలను పేర్చి గౌరీమాత స్వయంగా వెలుగొందిన గుమ్మడి పూలను పేర్చాలి. పేర్చిన పూలపై పెట్టి గౌరీమాతను నవదినాలు గ్రామంలో అందరూ కలిసి పూజించాలని ప్రబోధించినట్లు ప్రచారంలో ఉంది. బతుకునీయమ్మా.. బతికించమ్మా అనే పదాల నుంచే బతుకమ్మ అవిర్భవించిందని చెబుతున్నారు. దీనిపై చారిత్రక పరిశోధన చేసిన డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య.. ఈ వివరాలన్నీ పుస్తక రూపంలోకి తెచ్చారు. యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడి.. 40 ఏళ్ల పాటు నేను చేసిన చారిత్రక పరిశోధనలతో చౌటపల్లి బతుకమ్మ పుట్టినిల్లుగా తేలింది. అందుకే ఇక్కడా యాదాద్రి తరహాలోనే బతుకమ్మ గుడిని నిర్మించాలనుకుంటున్నాం. ఈ గుడి నిర్మాణ నమూనాకు యాదాద్రి టెంపుల్ డిజైనర్ ఆనంద్‌సాయి, స్థపతిగా పద్మశ్రీ వేణు ఆనందాచార్య వ్యవహరిస్తారు. తెలంగాణ తల్లి రూపశిల్పి బైరోజు వెంకటరమణాచార్యులు (బీవీఆర్ చార్యులు) ఇప్పటికే బతుకమ్మ చిత్రపటాన్ని విడుదల చేశారు. 2019లోనే బతుకమ్మపై బృంద నృత్యం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించాం. బతుకమ్మ గుడి నిర్మాణం పూర్తయ్యే వరకు అకుంఠిత దీక్షతో పనిచేస్తా. – డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య, శ్రీ శాంతికృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు -
ఖాళీగా రిటర్న్.. స్పెషల్ బస్సుల్లో అధిక ఛార్జీలు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ 6300 బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఇదే సమయంలో స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయని బాంబు పేల్చారు.ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘దసరా రద్దీ దృష్ట్యా 6300 బస్సులు నడుపుతున్నాం. మహాలక్ష్మి స్కీమ్ కింద మరో 600 బస్సులు అదనంగా నడిపిస్తున్నాం. స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయి. ఇప్పటికే కొన్ని బస్సులు నడుస్తున్నాయి. రేపటి నుంచి మొత్తం బస్సులు నడిపిస్తాం. ఈనెల 14వరకు అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయి. దసరా పండుగ కాబట్టి రిటర్న్ జర్నీలో బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది.. కాబట్టి కొంత చార్జీలు పెంపు తప్పదు. మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి అని చెప్పారు.ఇక, దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి చాలా మంది తమ స్వగ్రామాలకు పయణమవుతున్నారు. విద్యాసంస్థలకు ఇప్పటికే సెలవులు ఇవ్వడంతో వారంతా ముందుగానే ఇళ్లకు చేరుకున్నారు. రేపు సద్దుల బతుకమ్మ కావడంతో స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
పూల పండుగ..తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా చేసుకునే పండుగే ఈ బతుకమ్మ. ఆడబిడ్డలంతా ఆట, పాటలతో జానపద గేయాలతో హుషారు తెప్పించే సంప్రదాయ పండుగ. చూస్తుండగానే ఎనిమిదిరోజుల వేడుకలు ముగిసి..తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా గౌరమ్మని కొలుస్తారు. ఈ రోజు అత్యంత పెద్దదిగా బతుకమ్మను తయారు చేసి ఆట పాటలతో సందడి చేస్తారు. ఈ చివరి రోజు వేడుకను ఊరు, వాడ దద్దరిల్లేలా పండుగను ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. సద్దుల బతుకమ్మ రోజున ఎన్ని రకాల పూలు దొరికితే, అన్ని రకాల పూలు అమర్చుకుని ఎత్తైన బతుకమ్మను తయారుచేస్తారు.ఈరోజు బతుకమ్మను నిమజ్జంన చేసిన అనంతరం.. పెరుగన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వులపొడి, పులిహోర, ఇలా పలు రకాల నైవేద్యాలను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. సద్దుల బతుకమ్మతో తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగిన బతుకమ్మ ఉత్సవాలు ముగుస్తాయి.(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!) -
శరన్నవరాత్రులు..ఎనిమిదో రోజు దుర్గాదేవి అలంకారం
దుర్గతులను నివారించే పరాశక్తి ఎనిమిదో రోజున దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.శ్లోకం: సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాదికే శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.రాహుగ్రహ దోషాలను నివారించి, భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం దుర్గ దుర్గాయ నమః అని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రు బాధలు తొలగి, సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం. అంతేగాదు. ఈ రోజు 'ఓం కాత్యానాయ విద్మహే కన్యకుమారి ధీమహి! తన్నో దుర్గ్ ప్రచోదయాత్!' అంటూ ప్రార్థన చేసి, ఆరాధిస్తే మనకున్న దుర్గతులు పోతాయని పురాణ వచనం.మరోవైపు ఎనిమిదోరోజు కొన్ని చోట్ల నవదుర్గల ప్రకారం గౌరి దేవిని పూజిస్తారు. ఈ తల్లి తెల్లటి ముత్యంలా మెరుస్తుంది. ఆమె శక్తి అత్యంత ఫలప్రదమైనది. ఈ రోజున మహాగౌరీ దేవిని తెలుపు లేదా ఊదా రంగు దుస్తులు ధరించి పూజించాలినైవేద్యం: బెల్లం పొంగలి, చెక్కెర పొంగలి, పాయసాన్నం వంటివి నివేదిస్తారు (చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!) -
కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు
కెనడా ప్రముఖ నగరం టొరంటోలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ స్థిరపడిన వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరై బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) కెనడా నేతృత్వంలో పనిచేసే తంగేడు సాంస్కృతిక సంస్థ ఈ వేడుకలను నిర్వహించింది.పుట్టి పెరిగిన తెలంగాణ నేలకు వేల మైళ్ల దూరంలో ఉన్నా, తమ సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగించాలని, కెనడాలో పుట్టిన పిల్లలకు పండగల ప్రాధాన్యతలను తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ యేటా బతుకమ్మతో సహా బోనాలు, ఇతర పండగలను నిర్వహిస్తున్నామని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ తెలిపింది.ప్రకృతి, పర్యావరణంతో అలరారే కెనడాలో లభించే రంగురంగుల పూలతో పేర్చన బతుకమ్మలు పండగ సంబరాలకు మరింత వన్నె తెచ్చాయి. టొరంటోలో బ్రాంప్టన్ వేదికగా విశాలమైన సెకండరీ స్కూల్ ఈ వేడుకలకు వేదిక అయింది. సుష్మ సాయి, అమితా రెడ్డిలు సమన్యయం చేసి పెద్ద సంఖ్యలో మహిళలు కుటుంబాలతో సహా పాల్గొనేలా చేశారు.పండగలో పాల్గొన్న అందరికీ కమిటీ పసందైన తెలంగాణ వంటలతో విందును ఏర్పాటు చేసింది. కెనడాలో స్థిరపడినా తమ మూలాలు, అస్థిత్వం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో గత ఇరవై ఏళ్లుగా తెలంగాణ ఉత్సవాలను, బతుకమ్మ పండగను ప్రతీ యేటా నిర్వహిస్తున్నామని టీడీఎఫ్ ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది అన్నారు. పండగ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన అందరికీ టీడీఎఫ్ (కెనడా) ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీకాంత్ నేరవేట్ల, వైస్ ప్రెసిడెంట్ ప్రమోద్ ధర్మపురి, వెంకట రమణా రెడ్డి మేద, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!) -
శ్రీశైలంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)
-
నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!
‘‘ఇది నవరాత్రుల పవిత్ర సమయం. ప్రజలు దుర్గాదేవి పట్ల భక్తితో వివిధ మార్గాల్లో కలిసి మెలిసి పూజలు జరుపుకుంటున్నారు. ఈ సంతోషంతో ఆమె దయకు పరవశుడనై రాసిన ‘ఆవతికలాయ్’ అనే గర్బా గేయాన్ని ఇక్కడ ఉంచాను. ఆమె ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలి’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గాయని పూర్వామంత్రి పాడిన ఈ గేయం గర్బా నృత్యానికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకునేలా చేయడంతోపాటు ప్రతి మదిని ఆధ్యాత్మిక సౌరభమై తాకుతోంది. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. గర్బా నృత్యం అనగానే సంప్రదాయదుస్తులు ధరించిన సమూహాలు, ఆనందంగా నృత్యం చేస్తున్న దృశ్యాలు మన కళ్లముందు మెదలుతాయి. ఆధ్యాత్మిక బలానికి మానసికోల్లాసాన్ని కలిపి జరుపుకునే ఈ వేడుక మొదట గుజరాతీ గ్రామాలలో పుట్టి, దేశ ఎల్లలు దాటి నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. చిల్లులు గల మట్టి కుండలో దీపం వెలిగించి, తలపైన పెట్టుకుని అమ్మవారి విగ్రహం చుట్టూ వలయాకారంగా తిరుగుతూ భక్తి పారవశ్యంలో నృత్యం చేస్తారు. మట్టికుండ తల్లి గర్భాన్ని, జ్యోతి నుండి వెలువడే కాంతి లోపల పెరుగుతున్న కొత్త జీవిని సూచిస్తుంది. భక్తుల కోసం రాక్షసుడితో పోరాడిన దేవత పట్ల తమ ప్రేమ, కృతజ్ఞతలను ఈ నృత్యం ద్వారా తెలియజేస్తారు. మనలో ఉన్న అన్ని చెడులను నాశనం చేయడానికి, లోపల ఉన్న శక్తిని మేల్కొలిపే విధానంగా కూడా గర్బా నృత్యాన్ని చెబుతారు. గర్బా నృత్య రూపం స్త్రీత్వం, సంతానోత్పత్తిని తెలియజేస్తుంది. ఇందులో భజనలు, కీర్తనలకు చోటు ఎక్కువ. ఎక్కువ భక్తి ఆకర్షణను కలిగి ఉండే గర్బాను అమ్మవారి హారతికి ముందు నిర్వహిస్తారు.కాలచక్రం .. పునరావృతందేవీ ఆరాధనలో భాగంగా చెప్పుకునే ఈ నృత్యాన్ని స్త్రీ–పురుషులు ఇద్దరూ తొమ్మిది రాత్రులు చేస్తారు. చాలా మంది ఈ తొమ్మిది రోజులూ కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు, ఉపవాసాలు పాటిస్తారు. కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూ పునరావృతం అవుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు, మరణం నుంచి పునర్జన్మ వరకు ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఈ అన్ని అంశాల్లోనూ కదలకుండా నిరంతరాయంగా ఉండేది దైవశక్తి ఒకటే. దానికి ప్రతీకగా నృత్య వలయం మధ్య దేవీ ప్రతిమ లేదా పెద్ద దీపపు సెమ్మెను పెడతారు. జీవన చక్రం దాని చుట్టూనే పరిభ్రమిస్తుంటుందని చెప్పేందుకు ఇదొక ప్రతీక.మహిషుని అంతం చేసిన మహిళా శక్తిఒక్క స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించకుండా ఉండాలన్న వరబలంతో మహిషాసురుడు తన శక్తులను చెడు కోసం ఉపయోగించడం ప్రారంభించాడు. అతడి దాడికి దేవతలు నిస్సహాయలైపోయారు. దుర్గాదేవి వద్దకు వెళ్లి, వేడుకున్నారు. దుర్గాదేవి ఒక్క కంటిచూపుతో ఆ రాక్షసుని అంతం చేయగలదు. కానీ, అసుర సంహారానికి ముందు తొమ్మిది పగళ్లు, తొమ్మిది రాత్రుల పాటు సాగిన సర్వోన్నతమైన యుద్ధం ద్వారా మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అసాంఘిక, అధార్మిక శక్తులు ఎంత బలంగా కనిపించినా, యుద్ధం ఎంతకాలం సాగినా, చివరికి ధర్మమే విజయం సాధిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథనాన్ని గర్బా నృత్యం ద్వారా ప్రదర్శించడం అంతర్లీనంగా కనిపిస్తుంది.బేతే గర్బాగుజరాత్లోని నాగర్ కమ్యూనిటీ ‘బేతే గర్బా’ అంటే కూర్చున్న గర్బా అని జరుపుకుంటారు. ఇక్కడ, భక్తులు ఒకరి ఇంటి వద్ద గుమిగూడి, గర్బా పాటలు పాడతారు. హిందువులు తమ పండుగలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిజాం నిషేధించినప్పుడు, ఇస్లామిక్ పాలనలో జునాగఢ్ లో బేతే గర్బా ప్రారంభమైంది. చాలామంది కఠినమైన ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ నృత్యం, సంగీతంతో ఉల్లాసంగా మారి΄ోతారు. ఉత్తర భారతదేశంలో గర్బాలో భక్తులు తబలా, మంజీరను ఉపయోగిస్తారు.సంప్రదాయ దుస్తులతో...ఈ నృత్యంలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, శక్తి దేవత ఆశీర్వాదాలు కోరుకుంటూ నృత్యం చేస్తారు. గర్బా, దాండియా ఒకే విధంగా కనిపించినా, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. గర్బాలో చేతులు, కాళ్లను సమన్వయంతో కదిలిస్తూ చేస్తారు. దాండియాలో కోలాటం కర్రలను ఉపయోగిస్తారు. గర్బా పాటలు దుర్గాదేవి, ఆమె అవతారాల చుట్టూ ఉంటే, దాండియాలో పాటలు కృష్ణుడి రాసలీలలపై ఉంటాయి.పాదరక్షలు లేకుండా..గర్బా దైవారాధనా రీతుల్లో చెప్పులు ధరించకపోవడం సకల జీవులకు ఆలవాలమైన భూదేవి పట్ల మనం చూపే గౌరవంగా భావిస్తారు. భూమిని నిరంతరం అంటి పెట్టుకుని ఉండే ఈ పాదాల ద్వారానే శరీరంలోకి శక్తి ప్రవాహం జరుగుతుందని నమ్మకం. ఆ దేవితో మనకు నేరుగా సంబంధాన్ని కల్పించేవి పాదాలే. అందుకే చెప్పులు లేకుండా చేసే ఈ నృత్యం పవిత్రమైన దైవారాధన వంటిది.గర్బా.. యునెస్కోనవరాత్రి ఉత్సవాలను గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహిస్తుంటారు. మన దేశానికే ప్రత్యేకమైన ఈ ప్రముఖ నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్) జాబితాలో కిందటేడాది చేర్చింది. అమ్మవారి ఎదుట భక్తిని నృత్య రూపంలో చాటే ఈ ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ ఎప్పటికీ సజీవమే అనడానికి ప్రతీకగా నిలుస్తోంది గర్బా.(చదవండి: ఏడో రోజు చదువుల తల్లి సరస్వతిగా .. త్రిరాత్ర వ్రతం..! ) -
కరీంనగర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
శ్రీనివాసుని గరుడ సేవ.. భక్తజనంతో కిక్కిరిసిన తిరుమల (ఫొటోలు)
-
పూల పండుగ..ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ
తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సందడి తెలంగాణలోని ప్రతి వీధిలోనూ కనిపిస్తూ ఉంటుంది. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై..అప్పుడే ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. ఇక ఈ రోజున తెలంగాణ ఆడబిడ్లలంతా బతుకమ్మను వెన్నముద్దల బతుకమ్మగా ఆరాధిస్తారు.ప్రత్యేకత..ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడుతారు. కొందరు వెన్న ముద్దలు అంటే..బియ్యపిండి, వెన్నతో చేసిన ముద్దలను డీప్ ఫ్రేచేసి చివరగా పానకంలో వేసి..నైవేద్యంగా సమర్పిస్తారు.(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!) -
ఏడో రోజు చదువుల తల్లి సరస్వతిగా .. త్రిరాత్ర వ్రతం..!
బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.మూలా నక్షత్రము రోజున అమ్మవారిని శ్వేతపద్మాన్ని అధిష్టించి, వీణ, కమండలం, అక్షరమాలను ధరించి, అభయముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదాదేవి అతి విశిష్టమైనది. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్దులకై సరస్వతీ పూజ తప్పకుండా చేయిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభాస్యం కూడా చేస్తారు. దేవీ నవరాత్రులలో చివరి మూడు రాత్రులూ చేసే త్రిరాత్ర వ్రతం ఈరోజే ప్రారంభిస్తారునైవేద్యం: దద్దోజనం, పరమాన్నం, చక్కెర పొంగలిమరోవైపు నవ దుర్గాలను పూజించే సంప్రదాయం ప్రకారం. ఏడవ రోజు కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజించడం ద్వారా భక్తులు ఆపదలు, అరిష్టాల నుంచి బయటపడతారు."ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరణీ వామ పాదోల్లిసల్లోహలితా కంటకా భూషణా వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ"ఎవరైనా శని దోషం వల్ల రకరకాల సమస్యలతో సతమతమవుతున్నట్లయితే.. ఈ రోజు ఆ దోషం నుంచి బయటపడటానికి చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి దేవి ని పూజించడం ద్వారా శని దోషం తొలగిపోతుంది.కాలరాత్రి మంత్రంఎవరి జాతకంలోనైనా శని దోషం ఉండి ఇబ్బంది పడుతూ.. ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే, మీ చింతలన్నీ తొలగిపోవడానికి.. ఈరోజు దుర్గాదేవి సప్తమ రూపం కాళరాత్రి దేవిని ‘ఓం ఐం హ్రీం క్లీం’ అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించండి. 108 సార్లు ‘కాలరాత్రియ నమః’ అని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సాధకుడు దేవతతో పాటు శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతాడని, అతని జాతకంలో శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు.నైవేద్యం: గారెలు, కిచిడి(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!) -
చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా మాత్ర విగ్రహాలు కొలువుదీరాయి. న్యూయార్క్ నగరంలో ఉండే ఎన్ఆరైలు ఈ దుర్గాపూజకు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఇదివరకటి మాదిరిగా వీడియో చాట్ల ద్వారా పూజలు జరుపుకోవాల్సిన పనిలేదు. ఈ దుర్గామాత విగ్రహాలను యూఎస్ఏ బెంగాలి క్లబ్ ఏర్పాటు చేసింది. ప్రారంభ పూజ అక్టోబర్ 5,6 తేదీల్లో ఘనంగా జరిగింది. 🚨 Durga Puja at Times Square, New York 🇺🇸 pic.twitter.com/dsTqktg14d— Indian Tech & Infra (@IndianTechGuide) October 7, 2024అందుకు సంబంధించిన ఫోటోలను పలువురు నెటిజన్లు "న్యూయార్క్ నగరం నడిబొడ్డున భారతీయ సంస్కృతి" అనే క్యాప్షన్‌తో సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అలాగే రుచికా జైన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా షేర్ చేసింది. అందులో రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాల గురించి వివరించింది. దశమి పూజతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ చారిత్రాత్మక ఘటన సిందూర్ ఖేలా టైమ్స్ స్క్వేర్ వద్ద కూడా చోటుచేసుకుంది. History has been Scripted !!!For the 1st time, Durga pujo was organized at the centre of Times Square, New York City, United States.Kudos to all the Bengalis living in New York who have made this possible!!! pic.twitter.com/n6iu4FGNp8— Sourav || সৌরভ (@Sourav_3294) October 6, 2024ఈ పండుగ ఆచారం ఐక్యత ఆవశక్యత గూర్చి చాటిచెబుతోంది. ఇలా ఈ నవరాత్రులను యునైటెడ్ కింగ్డమ్, లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో భారత సంతతి విదేశీయులు ఎంతో ఉత్సహాంగా జరపుకుంటున్నారు. ఆ వేడుకల్లో వివిధ సాంస్కృతిక బృందాలు ఈవెంట్లు, గర్బా పార్టీలు నిర్వహిస్తున్నాయి. నిజానికి ఈ చారిత్రాత్మక ఘటనలు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశంగా ఉపయోగపడతాయి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా భారతీయులంతా ఒకచోట చేరి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం విశేషం. View this post on Instagram A post shared by RUCHIKA JAIN FIREFLYDO (@fireflydo) (చదవండి: కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
దుర్గాపూజ: ఈ క్రెడిట్ ‘నేతాజీ’కే దక్కుతుంది..!
కోల్‌కతాలో దుర్గాపూజ వేడుకలు ఎంత ఆర్భాటంగా ఘనంగా జరుగుతాయో తెలిసిందే. అంతేగాదు అక్కడ చేసే దుర్గా వేడుకలు యునెస్కో గుర్తింపును కూడా అందుకున్నాయి. అంతలా చరిత్రలో పేరుగాంచడానికి కారణం స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ చంద్రబోస్. ఆయన విశాల దృక్పథం సరొకొత్త పూజా ఆవిష్కరణకు నాంది పలికింది. దేశభక్తిని పెంపొందించే వేదికలా.. బహింరంగంగా అంతా కలిసి చేసుకునే వేడుకగా మలిచారు. అలా కోల్‌కతాలో ఈ వేడుకలు బహిరంగంగా పెద్ద కోలాహలంగా జరగడం ప్రారంభమయ్యింది. సామాన్యుడు కూడా ఈ పండుగలో పాలుపంచుకోవాలనే సంకల్పం నెరవేరేలా మార్పులు తీసుకొచ్చారు. నవరాత్రుల సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్‌కతాలో జరిగే దుర్గాపూజ వేడుకను ఎలా మార్చారు..? అంతలా గుర్తింపు వచ్చేందుకు కారణమైనవి ఏంటి?..తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.పశ్చిమ బెంగాల్లో ఈ వేడుకలు మొదట్లో జమిందార్లు నిర్వహించేవారు. ఆ తర్వాత 1610లో బరిషాకు చెందిన సవర్ణ చౌదరి కుటుంబం చేసే వేడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలన్నీ ఘనంగా నిర్వహించినప్పటికీ ప్రజల్లోకి బలంగా వెళ్లేలా ప్రభావితం చేయలేకపోయాయి. అయితే నేతాజీ స్వాతంత్ర్యం కోసం రకరకాల ప్రణాళికతో ముందుకు పోతున్న ఆయనకు ఈ వేడుక ఎంతాగానో ఆకర్షించింది. ఈ వేడుకును అందర్ని కలుపుకునే నిర్వహించి దీంతో స్వాతంత్ర సమరయోధులను సంఘాన్ని ఏర్పరుచుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన పుట్టింది. ఆ క్రమంలో నేతాజి 'సర్బోజోనిస్' అనే పేరుతో 10 రోజుల వేడుకలు నిర్వహించారు. ఆయనే ఆ కమిటీ ఆధ్యక్షుడిగా ఉండి ఈ పండుగ జయప్రదమయ్యేలా ముందుండి నడిపించారు. ఇక్కడ సర్బోజోనిన్ అంటే సమాజంలోని అందరి పండుగ అని అర్థం. బెంగాల్ వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంలా అంగరంగ వైభవంగా ఈ వేడుకలు ఇప్పటికి కొనసాగడం విశేషం. ఖైదీలు పూజించే హక్కు..1920లో బోస్ మాండలే జైలులో ఉన్నప్పుడు తన రాజకీయ గురువు బసంతీ దేవికి దుర్గాపూజ గురించి వివరిస్తూ లేఖ రాశారు. ప్రతి ఏడాది ఒకసారి వచ్చే ఈ నవరాత్రుల పండుగలో జైలులో ఉన్న తన బిడ్డల సందర్శించి వారి బాధలను తొలగిస్తుంది. అందువల్ల తాము కూడా పూజించుకునే హక్కు ఉందంటూ ఓ నినాదం లేవనెత్తారు నేతాజీ. ఆ కాలంలో క్రిస్మస్ వంటి పండుగలకు ప్రభుత్వం తరుపున రూ. 1200 గ్రాంట్ వచ్చేది. అలానే మాకు కూడా కావలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ వంతుగా రూ. 140లు, ప్రభుత్వం తరుఫు నుంచి రూ. 660లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే దీన్ని ఖైదీల జీతం నుంచే మినహించమని బ్రిటిష్ అధికారులు ఆదేశించడం నచ్చక నేతాజీ బర్మాలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమోరాండం పంపారు. అయితే అది కూడా తిరస్కరింపబడింది. దీంతో ఆయన ఖైదీలకూ కూడా తమ మతపరమైన ఆచారాలను నిర్వహించుకునే హక్కు ఉందంటూ నిరాహార దీక్ష ప్రారంభించారు. అలాగే సరస్వతి పూజకు అదనంగా రూ. 60 ఇవ్వాలిన డిమాండ్ చేశారు. ఈ ఘటన దావనంలా వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ ప్రభుత్వం దిగి వచ్చి ఖైదీలు ఒక్కొక్కరికి పూజ నిమిత్తం రూ. 30 మంజూరు చేసింది. ఇది తక్కువ మొత్తమే అయినా ఖైదీల హక్కులను హైలెట్ చేసింది. పూజా సంప్రదాయంలో మార్పులు..ఎచ్చల విగ్రహ సంప్రదాయంలో దుర్గా దేవత ఆరాధన తీసుకొచ్చారు. అంటే ఒకే పైకప్పుకింద పూజించటం అని చెప్పొచ్చు. దుర్గమ్మ ఆమె పిల్లలు అంతా ఒకే వేదికపై పూజలు చేసుకునేలా చేయడం. అలాగే విగ్రహా తయారీ సంప్రదాయ పద్ధతిలో కూడా మార్పులు తీసుకొచ్చారు. దుర్గమ్మ ఆమె పిల్లిలిద్దర్ని వేర్వేరు ఫ్రేమ్‌లలో తయారు చేయమని కళాకారులను కోరారు. దీని వల్ల సమయం ఆదా కావడమే గాక, ఏకకాలంలో వివిధ విగ్రహాలు రూపుదిద్దుకునే వెసులబాటు ఏర్పడింది. ఈ పండుగతో చిన్నా చితక పనులు చేసుకునే వారందర్నీ ఒకతాటిపైకి తీసుకొచ్చి మనమంతా ఒక్కటే అని చాటిచెప్పేలా ఈ పూజలో అందరూ భాగమయ్యేలా చేశారు. అట్టడుగు, ధనిక వర్గం అనేది దేవుడి సమక్షంలో ఉండదనే గొప్ప విషయాన్ని నేతాజీ ఆనాడే ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేసి, ఆ సంప్రదాయం నేటికీ కొనసాగేలా చేశారు. యావత్తు ప్రపంచం కోల్‌కతా దుర్గా పూజ సంపద్రాయానికి ఫిదా అయ్యి నమస్కరించేలా చేశారు. (చదవండి: కరణ్ జోహార్ 'టై' అంత ఖరీదా..? దేనితో డిజైన్ చేశారంటే..) -
తిరుమల : మోహినీ అవతారంలో శ్రీనివాసుడు.. మంత్రముగ్ధులైన భక్తులు (ఫొటోలు)
-
బోరివలిలో అంబరాన్నంటిన సంబరాలు బతుకమ్మ సంబరాలు
తెలుగు కల్చరల్ అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు ముంబై పరిసర ప్రాంతాలనుంచి మూడు వేలమంది మహిళల హాజరు తీరొక్క పూలతో కనువిందుగా బతుకమ్మల కూర్పుడప్పుచప్పుళ్ల మధ్య ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు కాలుకదిపిన అతివలు ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు బోరివలి: బోరివలి తూర్పులోని సుకూర్వాడి, గోపాల్ హేమ్రాజ్ హైస్కూల్ లో సుమారు రెండెకరాల సువిశాల స్థలంలో ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో దాదాపు మూడు వేల మంది మహిళలు పాల్గొన్నారు. వేడుకల కోసం ఉత్తర ముంబై ప్రాంతాలైన దహిసర్, బోరివలి, కాందివలి, మలాడ్, గోరేగావ్, మాల్వా నీ, శివాజీ నగర్, దౌలత్ నగర్, నవగాం తదితర ప్రాంతాల నుంచి వేలాదిమంది కుటుంబ సమేతంగా తరలివచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి డప్పు చప్పుళ్ల మధ్య ఆటపాటలతో వాటి చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా గడిపారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన విందుభోజనాన్ని ఆరగించారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు... బతుకమ్మలను అందంగా పేర్చిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామని ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ కమిటీ ముందే ప్రకటించడంతో మహిళలు ఒకరికొకరు పోటీపడుతూ తమ బతుకమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మనీషా కొమ్ము న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ బతుకమ్మ పోటీల్లో మొదటి బహుమతి లాల్ జీ పాడ, కాందివలి ప్రాంత మహిళలు, ద్వితీయ బహుమతి సాయిబాబా నగర్, బోరివలికి చెందిన మహిళలకు అదేవిధంగా తృతీయ బహుమతి మలాడ్ పద్మశాలీ సంఘానికి చెందిన మహిళలకు లభించాయి. ఈ సందర్భంగా మైదానంలో వివిధ రకాల రంగవల్లులను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది తెలుగు సంస్కృతిని జ్ఞప్తికి తెచ్చిన శారదరెడ్డి అనే మహిళను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి, అతిధులు ఉత్తర ముంబై మాజీ లోక్‌సభ సభ్యుడు గోపాల్ శెట్టి, భాస్కర్ నాయుడు, స్థానిక కార్పోరేటర్ సంధ్య విపుల్ జోషి, బహుజన సాహిత్య అకాడమీ మహా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ నాగెల్ల తెలంగాణ ప్రభు త్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ బతుకమ్మ వేడుకలను గురించి ప్రసంగించారు. అనంతరం వీరందరినీ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముంబై తెలుగు కల్చరల్ అసోసియేషన్ కార్యవర్గం అధ్యక్షుడు సునీల్ అంకం, కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తెర శంకరయ్య, ప్రధాన కార్యదర్శి ఎలిజాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మదుసుదన్ రావు, మేకల హనుమంతు, కోశాధికారి గాజుల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మనగర్‌లో బతుకమ్మ, దాండియా వేడుకలు పద్మనగర్ మహిళ సాంస్కృతిక సేవ మండలి నిర్వహించిన బతుకమ్మ, దాండియా వేడుకలకు మహిళలనుంచి విశేష స్పందన లభించింది. అదివారం సాయంత్రం స్థానిక పార్లమెంటు సభ్యురాలు ప్రణతి శిందే, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపాలి కాలే లాంఛనంగా ఈ ఉత్సవాలను ప్రారంభించారు. స్థానిక తెలుగు మహిళలతో కలిసి వారు కూడా బతుకమ్మ పాటలకు కాలు కదిపి కార్యక్రమానికి మరింత శోభను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో భాగంగా ప్రథమ స్థానంలో నిలిచిన వారికి బంగారు, అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి వెండి వస్తువులను బహూకరించారు. అదేవిధంగా దాదాపు 50 మంది మహిళలకు చీరలు, ఇతర రకాల దుస్తులను బహుమతులుగా అందించారు. అలాగే ఉత్తమంగా దాండియా ఆడిన మహిళలకు నిర్వాకులు నగదు బహుమతులపే అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ మేయర్ శ్రీ కాంచన యన్నం, మాజీ కార్పొరేటర్ దేవేంద్ర కోటే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు మహిళా మండలి అధ్యక్షురాలు లీనా ఆకేన్, సెక్రటరీ మంజుశ్రీ వల్లకాటి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న రవ్వ, కోశాధికారి అర్చన వల్లకాటి, సహాయ కోశాధికారి పల్లవి కనకట్టి, స్వాతి అడం, వందన గంజి పాల్గొన్నారు. థానేలో ఉత్సాహంగా ‘బతుకమ్మ’ థానేలో స్థిరపడిన తెలంగాణకు చెందిన గౌడ సమాజం సభ్యులు ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. థానే లూయిస్వాడీలోని షెహనాయి హాల్లో జరిగిన ఈ బతుకమ్మ సంబరాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలంతా సంప్రదాయ వస్త్రధారణలో కార్యక్రమానికి విచ్చేసి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. తమను చల్లగా చూడాలని బతుకమ్మను వేడుకున్నారు.అనంతరం బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నవారందరికీ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. గౌడ సమాజానికి చెందిన మహిళలందరినీ ఐక్యం చేసేందుకు గత రెండేళ్ల నుంచి ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో సంఘ ప్రముఖులు, పదాధికారులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు -
నవరాత్రుల్లో ముద్దుగుమ్మల స్టన్నింగ్ ట్రెడిషనల్ లుక్స్..! (ఫొటోలు)
-
అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం బతుకమ్మ సంబరాలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల ఆడపడచులు, పిల్లలు, మరియు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను పేర్చి, జానపద పాటలు పాడుతూ, ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి సందడి చేశారు. సింగపూర్ స్థానికులు కూడా ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు. అనంతరం బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. తెలుగువారంతా మమేకమై ఈ సంబరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని ఆర్ ఆర్ హెచ్ సి , నార్పాణి టాంపినీస్ సిసి ఐఎఇసి వంటి స్ధానిక సంస్ధల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.అందంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రదానం చేశారు. కొత్త సుప్రియ సారధ్యంలో నడుస్తున్న ‘అమ్మ చారిటబుల్’ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని.. గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ పేర్కొన్నారు. కుంభకర్ణ, Mr.బిరియాని, ఫ్లేవర్స్, తందూర్ లాంజ్, ఆంధ్రకర్రీ, మరియు బంజార రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యం లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా సుమారు 6000 మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారని, 10 మంది లక్కీ విజేతలకు వెండి , ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు.సింగపూర్ లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ, వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. -
నవరాత్రి ఉత్సవాలు : అమృతవర్షంలో మధుర మీనాక్షి ఆలయ కోనేరు (ఫొటోలు)
-
బాలపిట్టలూ బయటికెగరండి
Dasara holidays: తెలిసిన ఊరే. దసరా సెలవుల్లో కొత్తగా హుషారుగా అనిపిస్తుంది. మేనమామ కొడుకు మనం ఎప్పుడొస్తామా... ఊరంతా తిప్పి ఎప్పుడు చూపుదామా అని ఉంటాడు. మేనత్త కూతురి దగ్గర బోలెడన్ని బొమ్మలు. ఒకరోజు అందరూ కూడి బొమ్మల పెళ్లి కూడా చేయొచ్చు. చిన్న ఊరే. కాని మిఠాయి కొట్టు దగ్గరకు వెళ్లి మిఠాయి కొనుక్కోవడం... పాత సినిమా హాల్లో ఆడే పాత సినిమాను చూడటం... వీధిలోని కుర్రాళ్లను పిలవనవసరం లేకుండా మన బంధుగణంలోని పిల్లలే సరిపోయే విధంగా క్రికెట్ ఆడటం... సరే... ఓటీటీలో సినిమాలు చూడటం.సెలవులొచ్చేది మనవాళ్లను కలవడానికి. కలిసి ఆటలు ఆడటానికి. పెద్దయ్యాక గుర్తు చేసుకోవడానికి. పూర్వం దసరా కోసం పిల్లలు కాచుకుని కూచునేవారు. ఇవాళ రేపు సెలవులొచ్చినా మంచి ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ‘ఎక్కడికీ కదిలేది లేదని’ అదిలిస్తున్నారు. మరికొందరికి పిల్లల్ని తీసుకొని బంధువుల ఇంటికి వెళ్లడానికి తీరికే ఉండటం లేదు. కొందరికసలు బంధువులే లేరు. అంటే లేరని కాదు. ఉన్నా లేనట్టుగా వీరుంటారు. లేదా వారుంటారు. నడుమ అనుబంధాలు తెగేది పిల్లల మధ్య.పెద్దయ్యాక జ్ఞాపకాలు ఏమీ ఉండవు. ఉన్నా అవి చెప్పుకోదగ్గవి కావు. జ్ఞాపకాలంటే బాల్యమే. బాల్యంలో ఇష్టంగా గడిపే రోజులు సెలవులు. పిన్ని ఇల్లు, పెద్దమ్మ ఊరు, బాబాయి మిద్దె, పెదనాన్న వాళ్ల తోట, తాతయ్య వాళ్ల చేను, సొంతపల్లెలోని చెరువు గట్టు... ఇవన్నీ కజిన్స్‌తో... దగ్గరి బంధువులతో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది.ఇటీవల వచ్చిన ‘సత్యం సుందరం’ ఈ బాల్యాన్నే చూపుతుంది. సత్యం అనే పేరుండే అరవింద స్వామి ఇంటికి సుందరం అనే కార్తీ చిన్నప్పుడు సెలవుల్లో వస్తాడు. ఆ సెలవుల్లో చిన్న అరవింద స్వామి, చిన్న కార్తీ కలిసి ఎన్నో ఆటలు ఆడతారు. సినిమాలు చూస్తారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. ఆ అభిమానమే కార్తీని పెద్దయ్యాక కూడా అరవింద స్వామి అంటే ప్రాణం ఇచ్చేలా చేస్తుంది. ప్రేమ పంచేలా చూస్తుంది. చిన్నప్పుడు వీళ్లు ఆడుకున్న ఆట ఏమిటో తెలుసా? చిన్న అరవింద స్వామిని కూరగాయలు తెమ్మని ఇంట్లో చెప్తే పిల్లలనందరినీ తీసుకొని బయలుదేరుతాడు. ఒకడి పేరు బెండకాయ అని పెడతాడు. ఎన్ని కిలోల బెండకాయలు తేవాలో పట్టిక అవసరం లేకుండా ఆ బెండకాయ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇంకొకడి పేరు వంకాయ అని పెడతాడు. ఒకమ్మాయి పేరు కాకర. మరి కార్తీకి ఏం పేరు పెడతాడు? సినిమా చూస్తే తెలుస్తుంది.‘చిన్నప్పుడు ఎంత బాగుండేది’ అని ఏ కాలంలో అయినా పిల్లలు అనుకునేలా వారి ఆటపాటలు సాగేలా పెద్దలు చూడాలి. ఆ ఆట΄ాటలన్నీ అయినవాళ్లతో జరగాలి. దసరా సెలవులు బంగారు గనులు. ఆ గనుల్లోకి పిల్లల్ని పంపండి. మర్చిపోవద్దు. -
శ్రీశైలంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం (ఫొటోలు)
-
పండక్కి ఊరెళుతున్నారా.. మీ ఇల్లు జరభద్రం
సాక్షి, హైదరాబాద్ : దసరా సెలవులు వచ్చేశాయి. క్రమంగా నగరవాసులు సొంతూర్లకు పయనమవుతున్నారు. ఇదే చోరులకు సరైన సమయం. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది దసరా పండుగ నేపథ్యంలో గ్రేటర్లో అధికంగా ఇళ్లలో చోరీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈసారి పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పోలీసులు నైట్ పెట్రోలింగ్ పెంచారు. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వ్యక్తిగత గృహాలపై నిరంతరం నిఘా పెట్టారు. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తులు, నేపాలీ పని మనుషుల కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.పండగ సమయాల్లో అధికంగా చోరీలు.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు, స్థానికంగా ఇతర జిల్లాల్లో ఉండే చోరులు పండుగ సమయాలను అనువుగా భావిస్తుంటారు. రైళ్లు, బస్సుల్లో నగరానికి చేరుకొని, శివారు ప్రాంతాల్లో తలదాచుకుంటారు. రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే పండగ వేళ చోరీలు అధికంగా నమోదవుతున్నాయి. ఎక్కువగా శివారు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలో సైకిల్, నైట్ పెట్రోలింగ్‌లతో గల్లీగల్లీలో నిఘా పెట్టాలని, నిరంతరం సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.సైబరాబాద్ పోలీసుల సూచనలివీ.. u బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. u సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ తాళం ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. u మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేయండి. నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డుగా నియమించుకోవాలి. u మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు వంటివి జమ కానివ్వకుండా చూడాలి. వాటిని గమనించి ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని దొంగలు చోరీలకు పాల్పడుతుంటారు. u ఇంటి లోపల మరియు బయట కొన్ని లైట్లు వేసివుంటే మంచిది. u సోషల్ మీడియాలో మీరు బయటికి వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు. -
ఇంద్రకీలాద్రి : మహాచండీ దేవి అలంకారంలో దుర్గమ్మ (ఫొటోలు)
-
TCSS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(TCSS)ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న(శనివారం) ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు సాంప్రదాయ పాటలు ఆటలతో ఎంతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో ఈ వేడుకలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో సింగపూర్ స్థానికులతో పాటు ఎంతో మంది ఎన్నారైలు సుమారు 4000 నుండి 5000 వరకు పాల్గొని బతుకమ్మ ఆడారు. సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు వారందరికీ , స్థానికులకు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తు దశాబ్దానికి పైగా సింగపూర్‌లో బతుకమ్మ పండుగకు విశేష ఆదరణ కలుగజేయడం ద్వారా టీసీఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందని సొసైటీ సభ్యులు అన్నారు. ఈ సంబురాల్లో అందంగా ముస్తాబైన బతుకమ్మలకు, ప్రత్యేక సాంప్రదాయ, ఉత్తమ వస్త్రధారణలో మహిళలకు గృహ ప్రవేశ్, సౌజన్య డెకార్స్, ఎల్ఐఎస్ జువెల్స్ , బీఎస్కే కలెక్షన్స్ వారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.ఇరు తెలుగు రాష్ట్రాల తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పడం ఎంతో సంతోషకరమని, బరాలు విజయవంతంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ టీసీఎస్ఎస్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. టీసీఎస్ఎస్తో ప్రేరణ పొంది ఇతర సంస్థలు కూడా బతుకమ్మ నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు.ఈ వేడుకల్లో టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా తయారు చేయించిన బతుకమ్మ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా విడుదల చేసిన సింగపూర్ బతుకమ్మ ప్రోమో పాట "సింగపూర్ కొచ్చే శివుని పెండ్లాము.. సిరులెన్నో తీసుకొచ్చే మా పువ్వుల కోసము.." యూట్యూబ్‌లో విడుదల చేసినప్పటి నుంచి వేల వీక్షణాలతో దూసుకుపోతుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికీ సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి , కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.వీరితో పాటు సొసైటీ మహిళా విభాగ సభ్యులు రోజా రమణి, గడప స్వాతి, బసిక అనిత రెడ్డి, జూలూరు పద్మజ, సునీత రెడ్డి, హేమ లత, దీప నల్ల,కాసర్ల వందన, బొందుగుల ఉమా రాణి, నంగునూరు సౌజన్య, నడికట్ల కళ్యాణి, హరిత విజాపుర్, ఆవుల సుష్మ, పులిగిల్ల హరిత, సౌజన్య మాదారపు, ఎర్రమ రెడ్డి దీప్తి, సృజన వెంగళ, హర్షిణి మామిడాల, సుధా రాణి పెసరు ఈ బతుకమ్మ పండుగ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. సింగపూర్ వేడుకలను సొసైటీ ఫేస్బుక్ ,యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన సంపంగి రియాలిటి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మై స్క్వేర్ ఫీట్ (గృహప్రవేశ్) ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బిస్ట్రో, జి.ఆర్.టి జ్యూవెల్లర్స్, మై హోమ్ గ్రూప్ కంస్ట్రక్షన్స్, అభిరామి జ్యూవెల్లర్స్, వీర ఫ్లేవర్స్ ఇండియన్ రెస్టారెంట్, ప్రద్ ఈవెంట్ మేనేజ్ మెంట్, జి.ఆర్.టి ఆర్ట్లాండ్, జోయాలుక్కాస్ జ్యూవెల్లర్స్, ఏ.ఎస్.బి.ఎల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ఎస్.వి.ఎస్ (శ్రీవసుధ) ట్రూ వెల్త్ ఇండియా, ది ఆంధ్ర కర్రీ క్లాసిక్ ఇండియన్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్, కుమార్ ప్రాప్ నెక్స్ , గారెంటో అకాడమీ, ఎస్ పి సిస్నెట్ సొల్యూషన్ దట్స్ పర్ఫెక్ట్ , సౌజన్య హోమ్ డెకార్స్ , ఎల్.వై.ఎస్ జెవెల్స్ మరియు బి.ఎస్.కె కలెక్షన్స్, లాలంగర్ వేణుగోపాల్, రాకేష్ రెడ్డి రజిది, సతీష్ శివనాథుని, కవిత ఆనంద్ అండ్ సంతోష్ ఆమద్యల, హేమ సుభాష్ రెడ్డి దుంతుల, మల్లేష్ బారేపటి, శ్రీధర్ కొల్లూరి,చంద్ర శేఖర్ రెడ్డి కోమటిరెడ్డి, విజయ రామ రావు పొలినేని , సునీల్ కేతమక్క ,రంజిత్ రెడ్డి మండల, నాగేశ్వర్ రావు టేకూరి , బండారు శ్రీధర్ మరియు పార్క్ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వేడుకలకు సహకారం అందజేసిన కల్వ రాజు, సుగుణాకర్ రెడ్డి రావుల, మల్లేశ్ బరపతి, చల్లా కృష్ణ, మల్లవేని సంతోష్ కుమార్, మల్లారెడ్డి కళ్లెం, బాదం నవీన్, భాను ప్రకాష్ , సాయికృష్ణ కొమాకుల , ముక్కా కిశోర్‌కు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కీ.శే. గోనె నరేందర్ రెడ్డి గారు సొసైటీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. -
పూల పండుగ..ఏడోరోజు వేపకాయల బతుకమ్మ..
తెలంగాణలో అమ్మవారిని పుష్పాలతో బతుకమ్మలా తయారు చేసుకుని ఆరాధిస్తారు. ఇది ప్రకృతి ఆరాధనకు చిహ్నంగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టేలా సాగే పండుగ బతుకమ్మ. ఈ వేడుకలు ఏడో రోజుకి చేరుకున్నాయి. ఏడో రోజు వేపకాయల బతుకమ్మగా గౌరమ్మను ఆరాధిస్తారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతరాలు పేర్చి ఆటపాటలతో సంబరంగా జరుపుకుంటారు. నిన్న అలిగిన బతుకమ్మతో మూగబోయిన ప్రతి ఇల్లు ఇవాళ పూల జాతరలా సందడిగా ఉంటుంది.ఈ బతుకమ్మకు బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లు ఆకారంగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వాటినే పేరంటాళ్లు వాయనంగా ఇచ్చుకుంటారు. లేదా పప్పు, బెల్లంలను కూడా బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు. తమ కష్టాలన్నీ తొలగిపోయి జీవితాలు పూల మకరందం వలె సుమనోహరంగా సాగిపోవాలని ప్రార్థిస్తారు.(చదవండి: బతుకమ్మ దశ దిశలా చాటే సంస్కృతి) -
శరన్నవరాత్రులు..ఆరో రోజు మహాలక్ష్మీగా అలంకారం..
శరన్నవరాత్రుల్లో ఊరు, వాడ, అమ్మవారి ఆరాధనలతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక ప్రదేశాలు మారిపోతాయి. అప్పుడే నవరాత్రుల వేడుకులు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఈ ఆరో రోజు అమ్మవారు 'శ్రీ మహాలక్ష్మీ దేవి'గా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి స్వరూపంలో ఇరువైపులా గజ రాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయ ముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, మరొక హస్తంతో కనకధార కురిపిస్తూ.. తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతులలో ఈమె మధ్య శక్తి.మంగళ ప్రదాయినిఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మీగా భక్తులు పూజిస్తారు.శ్లోకం: "యాదేవి సర్వ భూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా"! అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. అలాగే.."నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే! మహాలక్ష్మి నమోస్తుతే" అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. అలాగే ఈ రోజు అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.మరోవైపు ఆరోరోజు పలుచోట్ల దుర్గమ్మని కాత్యాయనీ దేవిగా ఆరాధిస్తారు. ఈమెను హృదయపూర్వకంగా ఆరాధిస్తే అన్ని రోగాలు, దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు కాత్యాయని దేవి ఆరాధన చేయడం వలన వివాహం కానీ యువతులు కోరుకున్న వరుడిని పొందుతారని పురాణ వచనం.దుర్గామాత ఆరో రూపమే కాత్యాయని. కాత్యాయన మహర్షి పార్వతీమాత తన కుమర్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చి కూతురుగా జన్మించింది. అందువల్లే దుర్గామాతకు కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. ఆమెనే ఈ కాత్యాయని దేవి. ఈమెను మొట్టమొదటగా కాత్యాయన మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.నైవేద్యం: పరమాన్నం, అప్పాలు, బూరెలు(చదవండి: దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్ ఇది..!) -
నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో
దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకొంటూ భక్తిపారవశ్యంలో భక్తులు మునిగి తేలుతున్నారు. మరోవైపు దాండియా, గార్బా నృత్యం, కోలాటాలతో ఈ ఉత్సవాలు మరింత శోభను సంతరించు కుంటున్నాయి. తాజాగా గుజరాత్లో నిర్వహించిన గార్బా డ్యాన్స్ కార్యక్రమం విశేషంగా నిలుస్తోంది. నెటిజన్ల ఫన్నీ కమెంట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ సందడి ఏంటో తెలుసుకుందాం పదండి! దసరా అంటే గార్బా సందడి ఉండాల్సిందే. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు,ఆఫీసులు, ఇతర ప్రదేశాలలో గర్బా ఈవెంట్లలో చిన్నా పెద్దా అంతా అందంగా ముస్తాబై నృత్యం చేస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో నవరాత్రి ఉత్సవాలకు దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గుజరాత్‌లోని ఒక గార్బా ఈవెంట్లో బ్రౌన్ కుర్తా, జీన్స్ ధరించిన యువకుడు తన చేతుల్లో పుస్తకాన్ని పట్టుకుని మరీ గార్బా స్టెప్పులేయడం విశేషంగా నిలుస్తోంది. తన తోటి డ్యాన్సర్లు నవ్వుతున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా, చక్కగా తన దారిన తాను నృత్యం చేస్తూ, పుస్తకంలో లీనమై పోయాడు. (అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?)చదువుకోవాలని అంటే ఎలా అయినా చదువుకోవచ్చు అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ఎక్స్ లో పోస్ట్ అయింది. దీనిపై నెటిజన్లు ఆ అబ్బాయి కమిట్మెంట్పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఇది మరీ విడ్డూరం.. చదువుకోవడానికి వేరే ప్రదేశమే దొరకలేదా? అంటూ మరికొందరు కమెంట్ చేశారు. ఈ వీడియో మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే అన్నట్టు ఇంకొక యూజర్ స్పందించారు. UPSC పరీక్షలకు సిద్ధమవుతున్నాడ నుకుంటా అని మరొక వినియోగదారు చమత్కరించారు. (సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్)'Padhne wale bacche kahi bhi padh lete hai' just got real 😭😭 pic.twitter.com/cieAIqUMmd— Ankita (@Memeswalimulagi) October 6, 2024 -
బంగరు నవ్వుల ఆట.. వాకిలయ్యే పువ్వుల తోట
సాక్షి,ముంబై: ముంబైలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వర్లీ, లోవర్‌పరెల్, బాంద్రా, అంధేరి, బోరివలి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పాటలతో సందడి నెలకొంది. ఒక్కేసి పువ్వేసి ఆడవే చెల్లి బతుకమ్మ పాట అంటూ మహిళలు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఓ వైపు బతుకమ్మ పాటలతోపాటు తెలుగు ప్రజలు కూడా దసరా నవరాత్రి ఉత్సవాల్లో దేవీమాతను అలంకరించే చీరల రంగుల ప్రకారమే చీరలు ధరించి బతుకమ్మలు ఆడుతూ కన్పిస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రతీరోజు ఒకే రంగు చీరలతో బతుకమ్మ ఆడుతూ సంబురాలు చేస్తున్నారు. తిరంగ వెల్ఫేర్ కమిటీ... బాంద్రాలోని తిరంగా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. తూర్పు బాంద్రా జ్ఞానేశ్వర్నగర్లో ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు ప్రతీ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలందరూ ఒకే రంగుల చీరలు ధరించి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెబుతున్నారు. తెలుగు రజక సంఘం... తెలుగు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. అంటప్హిల్ సీజిఎస్ కాలనీలోని గహ కల్యాణ్ కేంద్రహాల్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబురాలకు ముఖ్యఅతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కెపె్టన్ తమిళ సెల్వన్, స్థానిక కార్పొరేటర్ కృష్ణవేణిరెడ్డి, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎం.కొండారెడ్డి తోపాటు బీజేపీ ముంబై సౌత్ సెంట్రల్ ఉపాధ్యక్షుడు అనీల్ కనోజియాలు హాజరయ్యారు. ముఖ్యంగా కృష్ణవేణిరెడ్డి మహిళల బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలతో పరిసరాలన్నీ మార్మోగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ముంబై ఆంధ్ర ఎడ్యుకేషన్ హై స్కూల్ కాలేజీ పదాధికారి పురుషోత్తంరెడ్డి, ముంబై రజక సంఘం ఫౌండేషన్ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ముంబై ప్రజాగాయకుడు గాజుల నర్సారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరినీ సంఘం పదాధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు నడిగోటి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు మర్రిపల్లి మల్లేశ్, ప్రధాన కార్యదర్శి అవనిగంటి రామలింగయ్య, కోశాధికారి భూమ చిన్న నరసింహ, ఉపకోశాధికారి భూమ యాదయ్య, కమిటీ సలహాదారులు భూమ పెద్దనర్సింహ, చెరుకు కృష్ణ, తాందారి వెంకటేశ్, బసవాడ కృష్ణ, భూమ సురేశ్, కమిటీ సభ్యులు రెడ్డిపల్లి ఎల్లయ్య, అక్కనపల్లి నరసింహ, బసాని ఉపేందర్, ఐతరాజు మల్లయ్య, భూమ వెంకటేశ్, భూమ శంకర, పున్న సోమయ్య, బొడ్డుపల్లి రాజుతోపాటు తదితరులతోపాటు విజయనగర్, మోతిలాల్నెహ్రూనగర్, వాడాలా, సైన్కు చెందిన మహిళలు కూడా పాల్గొన్నారు. పద్మశాలి యువక సంఘం...తూర్పు దాదర్ నాయిగావ్‌లోని పద్మశాలి యువక సంఘం మహిళ మండలి ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. సంఘం హాల్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దాండి యా, కోలాటాలు ఆడి సందడి చేశారు. ముఖ్యంగా దసరా నవరాత్రులతోపాటు బతుకమ్మ సంబురాల నేపథ్యంలో ప్రతి ఏటా పద్మశాలి యువక సంఘం మహిళ మండలి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నవరాత్రి ఉత్స వాల తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడారు. అనంతరం స్థానిక సంప్రదాయాలమేరకు యువత దాండియా కోలాటాలు ఆడారు. ఇక అక్టోబరు 10వ తేదీన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా దాండియా, కోలాటాలు మంచిగా ఆడి విజేతలుగా నిలిచిన వారికి అక్టోబరు 22న సద్దుల బతుకమ్మ పండుగ రోజున బహమతులు అందించనున్నారని సంఘం అధ్యక్షుడు గంజి సీతారాములు వెల్లడించారు. అదేవిధంగా సద్దుల బతుకమ్మ రోజు అందంగా పేర్చిన బతుకమ్మలకు, బతుకమ్మలు బాగా ఆడినవారికి కూడా బహమతులు అందించనున్నారన్నారు. మరోవైపు శనివారం ఆడిన దాండియా, కోలాటాల పోటీలకు అతిథిగా హాజరైన తిలక్‌నగర్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యురాలు పారెపెల్లి లత, మహారాష్ట్ర తెలుగు మహిళ సంస్థ కార్యదర్శి గాజెంగి హారికలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అతిథులను న్యాయనిర్ణేతలను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సంఘం మహిళ మండలి ఉపాధ్యక్షురాలు జిల్లా శారద, కార్యదర్శి చెరిపెల్లి పరమేశ్వరి, సహ కార్యదర్శి బిట్ల సోని, కోశాధికారి పేర్ల గీతాంజలి, సభ్యులు అడ్డగట్ల ఐశ్వర్య, చెడుదుపు పద్మ, దొంత ప్రభావతి, ఇడం పద్మ, గుజ్జరి జాహ్నవీ, కైరంకొండ లక్షి్మ, కండ్లపెల్లి కవిత, మహేశ్వరం సాక్షి, పగుడాల రోహిణి, సీతారేఖ, ధర్మకర్తల మండలి చైర్మన్ కోడి చంద్రమౌళి, అనబత్తుల ప్రమోద్, పొన్న శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లక్సెట్టి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, కోశాధికారి దోర్నాల బాలరాజు, దుస్స అమరేంద్ర, దోమల శంకర్, కస్తూరి గణేశ్, పుట్ట గణేశ్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పద్మశాలి సంఘం... సిరిసిల్ల పద్మశాలి సంఘం ముంబై శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వర్లీ బీడీడీ చాల్స్‌లోని మార్కండేయ మందిరం ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిఫలించేలా ఆడపడచులు బతుకమ్మ పాటలు ఆలపిస్తూ పూలతో పేర్చిన బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల సంఘం మహిళలే కాకుండా స్థానిక, వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో పాల్గొన్న వివాహిత మహిళలకు లక్కీడిప్ ద్వారా 15 మందిని ఎంపికచేసి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ఉపాధ్యక్షుడు కొక్కుల రమేశ్, ప్రధాన కార్యదర్శి యేముల లక్ష్మీనారాయణ, సంయుక్త కోశాధికారి దూస మురళీధర్, కోశాధికారి సుంక ప్రభాకర్, సంయుక్త కోశాధికారులు ఆడెపు చంద్రశేఖర్, అడ్డగట్ల ముఖేశ్ సాంస్కృతిక అధికారి మార్గం శ్రీనివాస్, సోషల్ మీడియా అడ్మిన్ అడెపు అశోక్, కమిటీ సభ్యులు కోడం మనోహర్, ముదిగంటి అంజనేయులు, జిందం దశరథ్, జిందం నాగేశ్, కోడం గంగాధర్, వాసం నారాయణ, గాజుల సురేశ్, వాసా ల గంగాధర్, కట్టెకోల అశోక్, యంజాల్ భూమేశ్వర్, గాలిపెల్లి లక్ష్మణ్, వాసం అనిల్ కుమార్, రాపెల్లి సతీశ్, సలహాదారులు దూస నారాయణ, అడ్డగట్ల సుదర్శన్, ఆడెపు హనుమంతు పాల్గొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక, టూరిజం శాఖ, ఎఫ్–టామ్ సంయుక్త ఆధ్వర్యంలో..తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, ఎఫ్–టామ్ సంయుక్త ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని థానేలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన మహిళలు తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెబుతూ బతుకమ్మ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. బతు కమ్మ వేడుకలకు హాజరైన మహిళలు గోదావరి, కావేరి, గంగ వంటి దేశంలోని వివిధ నదుల పేర్లతో గ్రూపులుగా విడిపోయి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో గోదావరి మహిళా బృందానికి మొదటి బహుమతి రాగా, గంగా నది మహిళా గ్రూపునకు రెండవ బహుమతి, కావేరి నది మహిళా గ్రూపునకు మూడో బహుమతి లభించాయి. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు అంజలి మచ్చ ఆధ్వర్యంలో స్నేహ అంబ్రె, రమేశ్ అంబ్రె, ఎఫ్–టామ్ సంస్థ అధ్యక్షుడు గంజి జగన్ బాబు చేతులమీదుగా చీరలు అందజేశారు. కార్యక్రమంలో రాఘవరావు, కిరణ్మయి, సునీల్ బైరి, వాణి వేముల, విజయ, స్నేహ వంగ, స్నేహ బొమ్మకంటి, మహేశ్ గుజ్జ, రాధిక, రమేశ్, పద్మాకర్, అర్జున్, సుభాష్, మహేంద్ర, హరితరావు, సత్యనారాయణ కంచెర్ల పాల్గొన్నారు. -
బతుకమ్మ దశ దిశలా చాటే సంస్కృతి
చేతల్లోనూ, గొంతుల్లోనూ, ఊరువాడల్లోనూ విరాజిల్లుతూ వర్ధిల్లే బతుకమ్మ ఏనాడు పుట్టిందో, ఏనాడు పెరిగిందో నేటికీ తెలంగాణను ఒక్కతాటి మీదుగా నిలుపుతోంది. జాతి వైభవాన్ని చాటుతోంది. శీతాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం చివరి భాగంలో (ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు) జరిగే వేడుక బతుకమ్మ. రుతుపవనాల వర్షాలు మంచినీటి చెరువులలోకి పుష్కలంగా నీటిని తెస్తాయి. తెలంగాణ ్ర΄ాంతంలోని సాగు చేయని, బంజరు మైదానాలలో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించే సమయం కూడా ఇదే. వీటిలో అత్యధికంగా లభించేవి ‘గునుగు, తంగేడు పూలు.’ ఇక సీతజడ, బంతి, చెమంతి, గోరింట, గుమ్మడి, కట్లపూలు... పూల పేర్లు చెప్పుకుంటూపోవడం కన్నా అవన్నీ ఒక్క చోట చేర్చిన వారి శ్రమ, ఆ పూల అందం ఎంత చెప్పినా తనివి తీరదు. ప్రకృతి తన సౌందర్యాన్ని ఈ అనేక రకాల పువ్వుల రంగులతో తెలియజేస్తుంది. ఈ పూలన్నీ కలిస్తే ఉండే అందం స్త్రీలంతా ఒక్కచోట చేరి ఆట ΄ాటలతో శక్తి స్వరూపిణిని కొలవడంలో, వారి పాటల్లో తెలుస్తుంటుంది.స్వేచ్ఛకు ప్రతీకదసరాకు ముందు వచ్చే ’సద్దుల బతుకమ్మ’ కి ఆడబిడ్డలు అత్తవారింటి నుండి తల్లిగారింటికి తిరిగి వచ్చి, పువ్వుల రంగులను జరుపుకోవడానికి స్వేచ్ఛ, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటారు. సద్దుల బతుకమ్మ రోజున ఇంటి పెద్దతో పాటు బతుకమ్మ ను అందంగా పేర్చడానికి ఆ ఇంట్లో అందరూ ఒక చోట కూర్చుంటారు. పువ్వులు వృత్తాకార వరుసలలో, రంగులలో ఇత్తడి ప్లేట్లో జాగ్రత్తగా వరుస తర్వాత వరుసలో అమర్చుతారు. సాయంత్రం సంప్రదాయ వేష ధారణలో తమ ్ర΄ాంగణంలో అంతా చేరి, బతుకమ్మను ఉంచి, చుట్టుపక్కల మహిళలు పెద్ద వలయంలో గుమికూడుతారు. బతుకమ్మల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నట్టు తిరుగుతూ,పాటలు పాడటం మొదలు పెడతారు. ఐకమత్యం, ప్రేమ, సోదరీమణుల ఆనందానికి బతుకమ్మ ప్రతీక.సామూహిక సందడిబతుకమ్మ పాటలు పాడి, ఆడలు ఆడి, చివరకు వాటిని తలపై ఎత్తుకొని ఊరేగింపుగా పెద్ద నీటి ప్రదేశానికి చేరుకుంటారు. బతుకమ్మలను నెమ్మదిగా ఆ నీటిలో వదులుతారు. చేసిన ప్రసాదాలను పంచుకుని, బతుకమ్మను కీర్తిస్తూపాటలుపాడుతూ తిరిగి వస్తారు. కష్టం, సుఖం చెప్పుకోవడం, తీపిదనాన్ని పంచుకోవడం కూడా ఈ వేడుక మనసును తృప్తి పరుస్తుంది.నీటి స్వచ్ఛతబతుకమ్మ... భూమి, నీళ్లతో మానవుల మధ్య అంతర్గత సంబంధాన్ని చూపుతుంది. కొన్ని చోట్ల బతుకమ్మతో పాటు ’బొడ్డెమ్మ’ (గౌరీ దేవిని మట్టితో తయారు చేస్తారు)ను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ ప్రక్రియ చెరువులను బలోపేతం చేయడానికి, మరింత నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. బతుకమ్మలో ఉపయోగించే పువ్వులు నీటిని శుద్ధి చేసే గొప్ప నాణ్యతను కలిగి ఉంటాయి. వ్యవసాయ నేపథ్యం ఉన్న స్త్రీలు ప్రకృతి సౌందర్యాన్ని పండగలా జరుపుకోవడం ద్వారా చెరువులను ఎలా మెరుగుపరచాలో అంతర్లీనంగా వారికి తెలుసు. ఈ పండుగ ప్రకృతి, ప్రజల సామూహిక, మహిళా జనాదరణ పొందిన స్ఫూర్తి. అలాగే ప్రకృతి వనరులను వేడుకగా సంరక్షించడంలో వ్యవసాయదారుల శాస్త్రీయ దృక్పథాన్ని తెలియజేస్తుంది. అందుకే బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. మన దేశంలోబతుకమ్మ వేడుకను దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులలో స్థిరపడిన తెలంగాణ వాళ్లు ఇప్పటికీ జరుపుకుంటున్నారు ∙బతుకమ్మ పండగ వచ్చిందంటే బెంగళూరు, పుణె వీధుల్లోనూ ఊయ్యాల ఆటపాటల కళ కనపడుతుంది. పూణెలో కూడా బతుకమ్మ పండగ సందడి జోరుగానే ఉంది ∙ముంబైలో డీజీపాటల స్టెప్స్ వేస్తూ బతుకమ్మ ఆటలతో సందడి చేస్తుంటారు. భిన్న సంస్కృతుల ముంబై తెలంగాణ సంస్కృతినీ స్వీకరించింది. విదేశాలలోనూ... నేపాల్, అమెరికా, సింగపూర్, కెనడాలో, న్యూజిలాండ్.. మొదలైన దేశాలలో ఉన్న తెలంగాణీయులు బతుకమ్మ సంస్కృతికి జీవం పోస్తున్నారు. తమ కమ్యూనిటీలో అందరినీ ఒక చోట చేర్చి, సంబరం జరుపుకుంటున్నారు. భావి తరాలకు బతుకమ్మను మరింత వైభవంగా అందిస్తున్నారు. -
రూ.6,66,66,666.66 తో అమ్మవారికి అలంకరణ.. చూపు తిప్పుకోలేరు!
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం బ్రాహ్మణవాడి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రూ.6,66,66,666.66 కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు.మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆరు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని, పూజా మండపాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి విచ్చేశారు.యాదగిరిగుట్ట కిటకిటయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల భక్తులు శ్రీస్వామిని దర్శించుకునేందుకు అధికంగా తరలి వచ్చారు. ధర్మ దర్శనానికి సుమారు 3 గంటలు, వీఐపీ దర్శనానికి గంటకు పైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. శ్రీస్వామి వారిని సుమారు 35 వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీవారికి నిత్యాదాయం రూ.32,50,448 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు. -
దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్ ఇది..!
మైసూర్ అంటేనే దసరా ఉత్సవాలు. దసరా అంటేనే మైసూర్లో జరిగే ఉత్సవాలు. ఇదీ ఒక్కమాటలో చెప్పాలంటే మైసూర్ టూర్. వడయార్ రాజకుటుంబీకులు మైసూర్ ప్యాలెస్‌లో సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా పబ్లిక్‌ను ప్యాలెస్‌లోకి అనుమతిస్తారు. ప్యాలెస్ లోపల వడయార్ కుటుంబీకులు ఉపయోగించిన వస్తువులు, నాటి హస్తకళాఖండాలుంటాయి. దర్బార్ హాల్లో బంగారు సింహాసనాన్ని చూడవచ్చు. ఆ రోజుల్లో అందంగా అలంకరించిన ఏనుగులు ఈ వేడుకలో ప్రత్యేకాకర్షణ. పది రోజుల పాటు ప్యాలెస్ ఆవరణలో సంగీత, నాట్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. మైసూర్ ప్యాలెస్‌ని చూసిన తర్వాత కరంజి లేక్‌లో బోట్ షికారు చేసి, వన్యప్రాణుల మధ్య విహరించాలి. జయచామరేంద్ర ఆర్ట్ గ్యాలరీ, ఫిలోమినా చర్చ్ కోసం కూడా కొంత టైమ్ కేటాయించుకోవాలి. ఇక మైసూరు వంటలను రుచి చూడడంతోపాటు మైసూర్ సిల్క్ చీరలను కొనడంతో ట్రిప్ పరిపూర్ణమవుతుంది. పిల్లలతో వెళ్లిన వాళ్లు తప్పకుండా రైల్ మ్యూజియాన్ని కవర్ చేయాలి.ఉదయాన్నే చూడాలి..!మైసూర్ ప్యాలెస్‌లోకి పదిగంటలకు పర్యాటకులను అనుమతిస్తారు. ఆ సమయానికి పది నమిషాల ముందే చేరినట్లయితే జనం తక్కువగా ఉంటారు. పదిన్నర తర్వాత ప్రతి అరగంటకు జనసమ్మర్దం గణనీయంగా పెరుగుతుంది. తొమ్మిదింటికే చేరగలిగితే సూర్యకిరణాలకు మెరిసే ప్యాలెస్ సౌందర్యాన్ని కూడా వీక్షించవచ్చు. ప్యాలెస్ లోపల ఫొటోలు తీసుకోవడానికి అనుమతి ఉండదు. కెమెరాకు టికెట్ తీసుకున్నప్పటికీ కొన్నిచోట్ల మాత్రమే అనుమతిస్తారు పర్యాటకుల వస్త్రధారణ ప్యాలెస్ నియమాలకు లోబడి ఉండాలి. దుస్తులు భుజాలను కవర్ చేస్తూ, మోకాళ్ల కింద వరకు ఉండాలి ∙ ప్యాలెస్ లోపల కొన్ని చోట్లకు పాదరక్షలను అనుమతించరు. ఈ కాలం నేల చల్లగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు సాక్స్ వేయడం మంచిది పెద్దవాళ్లు ప్యాలెస్ మొత్తం నడుస్తూ చూడడం కష్టమే. సిద్ధంగా ఉంచిన వీల్ చైర్లను వాడుకోవచ్చు. గైడ్ చెప్పే ఆసక్తికరమైన, హాస్యపూరితమైన కథనాలను ఎంజాయ్ చేయవచ్చు ఆడియో గైడ్ సౌకర్యం ఉంది. దానికి చార్జ్ ఎక్కువనిపించినప్పటికీ తప్పకుండా ఆడియోలో ప్యాలెస్ గురించిన వివరాలను వింటూ తిలకించాలి రాత్రి లైట్ షో కూడా చూడాలి. ఆ షోకు కూడా ముందుగా వెళ్తే షో బాగా వీక్షించే అవకాశం ఉంటుంది. (చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!) -
స్కాట్ లాండ్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని స్థానిక తెలుగు సంఘం నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మ భూమి మాత లేదా భూమి దేవి మన పవిత్ర ప్రకృతి దేవత. ప్రకృతికి బతుకమ్మ ఒక ప్రతీక. ఆమెపై జీవించిన ప్రతి రూపానికి ఆమె తల్లి. మన హిందూ మతం శాశ్వతమైనది (సనాతన ధర్మం) అని నమ్ముతారు. దైవత్వం. ప్రకృతి తల్లి యొక్క విడదీయరాని స్వభావాన్ని గుర్తించి ఆరాధించే లోతైన పర్యావరణ విధానం కోసం ఆధ్యాత్మిక మరియు తాత్విక సాధనాలను అందిస్తుందన్నారు.గ్లాస్గో దక్షిణ భాగంలో, మనకు అధిక సంఖ్యలో హిందూ సమాజం ప్రకృతిలో పెరుగుతోంది. దీనికి సమీపంలో మందిరం లేదా సాంస్కృతిక కేంద్రం లేకపోవడంతో మదర్ ఎర్త్ హిందూ దేవాలయం ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన రెండు సంవత్సరాల తరువాత స్థలాన్ని గుర్తించారు. ఈ ఏడాది నవరాత్రి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా స్థానిక తెలుగు సంఘం డాక్టర్ పునీత్ బేడి, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల , వినీల బత్తుల నేతృత్వంలో ప్రతిరోజూ నవరాత్రి, బతుకమ్మలను జరుపుకుంటారు. చిరకాలం నిలిచిపోయే వేడుక జరగడంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
దేశంలోని ఐదు ప్రముఖ కాళీమాత మందిరాలు
కోల్‌కతా: దేశంలో దేవీ నవరాత్రుల వైభవం కొనసాగుతోంది. ఈ నవరాత్రులలో ఏడవ రోజున కాళికాదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. దుర్గాదేవి రూపం మహిళా సాధికారతకు చిహ్నంగా పరిగణిస్తారు. కాళికా రూపాన్ని పూజించడం ద్వారా శత్రుబాధ నివారణ అవుతుందని, దుఃఖాలు నశించిపోతాయని చెబుతుంటారు.దేశంలో పలు కాళీమాత ఆలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆసక్తికర చరిత్రలు ఉన్నాయి. వీటిలో ఐదు దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కాలిబడి(ఆగ్రా)ఆగ్రాలోని కాలిబడి కాళికా ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ ఉన్న అద్భుత ఘాట్‌లోని నీరు ఎప్పటికీ ఎండిపోదని, అందులో క్రిమికీటకాలు పెరగవని స్థానికులు చెబుతుంటారు.జై మా శ్యామసుందరి(కోల్‌కతా)మరో కాళీ దేవాలయం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉంది. దాని పేరు జై మా శ్యామసుందరి కాళీ మందిరం. ఈ ఆలయంలో కాళీదేవి సంచరిస్తుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతీరోజూ ఉదయం ఆలయ తలుపు తెరిచినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయని అంటారు.కాళీఘాట్(పశ్చిమ బెంగాల్)మూడవ కాళీ దేవాలయం కూడా పశ్చిమ బెంగాల్లో ఉంది. కాళీఘాట్‌లోని ఈ కాళీ దేవాలయం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయంలో కాళీదేవి నాలుక బంగారంతో తయారు చేశారు.కాళీ ఖో(ఉత్తరప్రదేశ్)నాల్గవ ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో వింధ్య పర్వతంపై కాళీ ఖో పేరిట ఉంది. ఈ ఆలయం ధ్యాన సాధనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారికి సమర్పించే ప్రసాదం మాయమవుతుండటం వెనక కారణం ఏమిటో నేటికీ వెల్లడి కాలేదని భక్తులు చెబుతుంటారు.మాతా బసయ్య(మొరెనా) ఐదవది ఉత్తరప్రదేశ్‌లోని మొరెనాలో ఉన్న మాతా బసయ్య ఆలయం. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నాటిది. నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ద్వారా భక్తుల తాము కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇది కూడా చదవండి: కైలాస్నాథ్... చరణాద్రి శిఖరం -
పూల పండుగ..ఆరో రోజు అలిగిన బతుకమ్మ..
తెలంగాణ ప్రకృతి పండుగ అయిన బతుకమ్మ సంబరాలు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఆరో రోజు బతుకమ్మ అత్యంత స్పెషల్. ఎందుకంటే పేరుకి తగిన విధంగా ఆరోజు ఆరాధన విలక్షణంగా ఉంటుంది. మరీ ఇంతకీ ఈ రోజు ఏం చేస్తారంటే..ఆ రోజు ఎవరూ బతుకమ్మను ఆడరు. అంటే.. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. దేవి భాగవతంలో అమ్మవారి మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాలలో రాక్షస సంహారం చేశారు. బండాసురుడు ని, చండ ముండల్ని సంహరించిన తర్వాత రాక్షస సంహారం చేసిన అమ్మవారు బాగా అలసిపోయారు. ఆరోజు ఆమెకు విశ్రాంతి ఇవ్వాలని భావించి మహిళలు ఆరో రోజు బతుకమ్మను పేర్చరు. ఎవరు బతుకమ్మను ఆడరు. దీనినే అర్రెం అని, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. ఆరోజు అలిగిన బతుకమ్మ వల్ల ఎవరు వేడుకలు జరపరు.మళ్లీ ఏడవ రోజు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.మరొక కథనం ప్రకారం..దేవీభాగవతంలో మహాకాళి, మహాసరస్వతితో పాటు మహాలక్ష్మి రూపాలలో అమ్మవారు రాక్షసుల్ని సంహరించడంతో అమ్మవార్లు బాగా అలసిపోయారట. అందుకే అమ్మకి విశ్రాంతి కల్పించాలన్న ఉద్దేశంతోనే భక్తులు బతుకమ్మను ఒకరోజు వాయిదా వేసినట్టు చెబుతున్నారు. మరుసటి రోజు నుంచి యథావిధిగా బతుకమ్మలు పేర్చి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అలానే ఎప్పటిలానే అమ్మవారికి పలు నైవేద్యాలు సమర్పిస్తారు.నైవేద్యం: స్త్రీలంతా ఉపవాసం ఉండి ఆమె అలక తీరాలని ప్రార్థిస్తారు. పైగా ఈ రోజు అమ్మవారు అలకతో ఉండటం వల్ల బతుకమ్మకు ఎలాంటి నైవేద్యం సమర్పించరు.(చదవండి: శరన్నవరాత్రులు..ఐదోరోజు మహాచండీ అలంకారం..!) -
శరన్నవరాత్రులు..ఐదో రోజు మహాచండీ అలంకారం..!
చండీ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే కోరికన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాతృదేవత అనుగ్రహంతో లక్ష్మీదేవి, పార్వతీ దేవి, సరస్వతి దేవి కలిసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారు. త్రిశక్తి స్వరూపిణి అయిన మహాచండీని ప్రార్థిస్తే సర్వదేవతలనూ కొలిచినట్లేనని భక్తుల విశ్వాసం. సింహ వాహనంపై కొలువుదీరిన మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్ధిస్తే విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారతారన్న ప్రతీతి ఉంది.మరోవైపు పలు పుణ్యక్షేత్రాల్లో ఈ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధిస్తారు. ఈ అవతారంలో బాల కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మవారు దర్శనమిస్తుంది. శివగణాలకు స్కందుడు సైన్యాధిపతి. పైగా జ్ఞానానికి కూడా అధిపతి. ఇక అమ్మవారేమో తన చల్లని చూపుతో సకల ఐశ్వర్యాలనూ అనుగ్రహించే తల్లి. అందుకే ఈ స్కందమాతని పూజిస్తే అమ్మవారితో పాటూ కుమార స్వామి ఆశీస్సులూ లభిస్తాయని పండితులు చెబుతారు.‘స్కందయతీతి శత్రూన్ శోషయతీతి స్కందః’శత్రువులను శోషింపచేయువాడు కనుక పార్వతీ తనయుడికి స్కందుడు అని పేరు. ఈయనకే కార్తికేయుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు అని పలు పేర్లు కలవు. స్కందుని తల్లికావడం వల్లే అమ్మవారికి ‘స్కంద మాత’ అని పేరు. నవదుర్గలలో ఇది ఐదో రూపం.సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయాశుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ॥స్కందమాత వాహనం సింహం. తెల్లని రంగుతో ప్రకాశిస్తూ నాలుగు చేతులు, మూడు నేత్రాలు కలిగి ఉంటుంది. తన కుమారుడైన బాలస్కందుడిని ఒక చేతితో ఎత్తుకుని, రెండు చేతుల్లో పద్మాలు ధరించి, మరో చేతితో అభయమిస్తూ కనిపిస్తుంది. స్కందమాత సకల శుభాలనూ అనుగ్రహిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంద్రియ నిగ్రహంతో, మానసిక ఏకాగ్రతతో, నిస్వార్థంగా ఆరాధించే భక్తులకు ఇహపర సుఖాలను, ముక్తిని ప్రసాదిస్తుంది. నైవేద్యం: పులిహోర, రవ్వకేసరి, గారెలు(చదవండి: శరదృతువులో అక్కడ పడవులతో పండుగ సందడి..ఏకంగా..!) -
ఐదో రోజు అట్ల బతుకమ్మ..!
తెలంగాణ పెద్ద పండుగగా పేరుగాంచిన పూల సంబురం సందడే వేరు. జీవితాన్ని ఎలా అద్బుతంగా మలుచుకోవాలో నేర్పించే కలర్‌ఫుల్ పండుగా ఈ బతుకమ్మ పండుగా. తొమ్మిది రోజుల పాటు సాగే పండుగను రోజుకో ప్రత్యేక పేరుతో అందంగా పూలను పేర్చుకుని ఆనందంగా ఆడిపాడి చేసుకునే పండుగా. బతుకమ్మ సంబరాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి (ఆదివారం) రోజున తెలంగాణ ఆడబిడ్డలంతా అట్ల బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈ బతుకమ్మ ప్రత్యేకతలేంటి, ఏం నైవేద్యం సమర్పిస్తారు వంటివి తెలుసుకుందామా..!. బతుకమ్మ వేడుకల్లో అయిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి (ఆదివారం) నాడు బియ్యాన్ని నానబెట్టి, దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదిస్తారు. కాబట్టి ‘అట్ల బతుకమ్మ’ అని పిలుస్తారు. ఈ రోజున గునుగు, చామంతి, మందార, బీర, తంగెడు, గునుగు, గుమ్మడి తదితర పూలతో అయిదు ఎత్తుల్లో లేదా ఐదు అంతరాల్లో బతుకమ్మను పేరుస్తారు. నానబెట్టిన బియ్యం దంచి లేదా మర పట్టించి పిండిగా చేసి అట్లు పోస్తారు. అట్లను ముందుగా గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత ముతైదువులు తాము దేవతకు సమర్పించిన అట్లను ఒకరికొకరు వాయినంగా ఇచ్చి పుచ్చుకుంటారు.(చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!) -
నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!
త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమె. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధిస్తారు. ఈ అమ్మవారినే త్రిపుర సుందరీ దేవి అని అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులై త్రిమూర్తల కన్నా పూర్వం నుంచి జగన్మాత ఉంది కాబట్టి త్రిపుర సుందరీ అనే నామంతో పూజలందుకుంటోందని పురాణాలు చెబుతున్నాయి.సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ:" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మాంగల్యభాగ్యం కోరుతూ సువాసినులకు పూజ చేయాలి.మరోవైపు శ్రీశైలం, అల్లంపురం వంటి పుణ్యక్షేత్రాల్లో నాలుగో రోజున కూష్మాండ అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. ఈమె సూర్యుడిలో దాగి ప్రపంచాన్ని వెలుగునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత ఈ నవరాత్రుల్లో కూష్మాండ అవతారంలో అమ్మని ఆరాధిస్తే అపూర్వ శక్తి లభిస్తుంది. ధైర్యం సిద్ధిస్తుంది. ఈతి బాధలు తొలగిపోతాయి. దేవీ సింహంపై ఆశీనురాలై వుంటుంది. ఎనిమిది చేతులను కలిగివుంటుంది కనుకనే ఈ మాతను అష్టభుజదేవి అని పిలుస్తారు. ఆమె చేతిలోని జపమాల ద్వారా ప్రపంచంలోని ప్రజలకు సిద్ధి, నిధిని ప్రసాదిస్తుంది. అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. కూష్మాండ అవతారాన్ని పూజిస్తారు. ఈ శక్తి అవతారమే విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం. భౌమ చతుర్థిని ఆచరించి కూష్మాండ శక్తి రూపాన్ని ఎర్ర రంగు చీరతో అలంకరిస్తారు. ఈరోజు భక్తులు నారింజ రంగు దుస్తులు ధరించాలి. లలితా దేవి వ్రతాన్ని ఈ రోజున ఆచరించాలి. ఉపవాసముండి, పండ్లు పాలు తీసుకుని, ఒంటి పూట ఆహారం తీసుకుని.. లలితాదేవి పూజించినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నైవేద్యం: అప్పాలు, పులిహోర నైవేద్యం పెట్టాలి. (చదవండి: దుర్గార్తిశమనీ దశదిశలా దసరా) -
దుర్గమాసుర సంహారం
పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశానికి చెందిన రురుడి కొడుకు అతడు. దుర్గముడు పరమనీచుడు, దుర్మార్గుడు, అతిక్రూరుడు, పరపీడనా పరాయణుడు. దేవతల బలమంతా వేదాలలోనే ఉన్నందున వేదాలను నాశనం చేస్తే చాలు, దేవతలందరినీ ఇట్టే నాశనం చేయవచ్చని తలచాడు. అదంత తేలికగా అయ్యే పనికాదు. అందువల్ల ముందుగా బ్రహ్మను ప్రసన్నుడిని చేసుకుని, అనుకున్న పని సాధించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా హిమాలయాలకు వెళ్లి, అక్కడ బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దుర్గముడి తపస్సు తీవ్రతకు ముల్లోకాలు గడగడలాడాయి. నక్షత్రాలు గతులు తప్పాయి. సూర్యచంద్రులు తేజోవిహీనులయ్యారు. దేవతలంతా హాహాకారాలు చేయడంతో బ్రహ్మదేవుడు హంసవాహనంపై బయలుదేరి, దుర్గముడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘దుర్గమా! నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను. వరం కోరుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘బ్రహ్మదేవా! వేదాలలోను, ఈ ముల్లోకాలలోను బ్రాహ్మణులకు తెలిసిన మంత్రాలన్నింటినీ నాకు స్వాధీనం చేయి. దేవతలను జయించే బలం ఇవ్వు’ అని కోరాడు దుర్గముడు.‘తథాస్తు’ అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. దుర్గముడికి బ్రహ్మదేవుడు ఈ వరమిచ్చిన తక్షణమే వేదమంత్రాలు విప్రులకు దూరమయ్యాయి. ఎవరికీ ఏ మంత్రమూ స్ఫురించని పరిస్థితి వాటిల్లింది. సంధ్యావందనాదుల వంటి నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానాలు, యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక వేదపండితులు పరస్పరం ప్రశ్నించుకోసాగారు. ఎవరికీ సమాధానం దొరకదాయె! ముల్లోకాల్లోనూ హాహాకారాలే తప్ప ఎక్కడా స్వాహాకారాలు వినిపించని పరిస్థితి దాపురించింది. హవిర్భాగాలు అందక దేవతలందరూ శక్తిహీనులుగా మారారు. దుర్గముడు ఇదే అదనుగా తలచి స్వర్గాన్ని ముట్టడించాడు.వజ్రదేహుడైన దుర్గముడిని ఎదిరించడం దేవతలకు శక్తికి మించిన పని అయింది. అతడి చేతిలో చావు దెబ్బలు తిని తలో దిక్కూ పారిపోయారు. దుర్గముడు అమరావతిలోని దేవేంద్ర భవనానికి చేరుకున్నాడు. అతడు అక్కడకు రాకముందే, సమాచారం తెలుసుకున్న దేవేంద్రుడు పలాయనం చిత్తగించాడు. స్వర్గాన్ని విడిచి పారిపోయిన దేవతలందరూ దేవేంద్రుడితో పాటు కొండల్లోను, కోనల్లోను ఎవరికీ కనిపించకుండా తలదాచుకోసాగారు. దిక్కుతోచక అడవులు పట్టిన దేవతలంతా ఆపద నుంచి బయటపడటానికి ఆదిపరాశక్తిని పూజించడం ప్రారంభించారు.మరోవైపు, హోమాలు లేక వర్షాలు కురవడం మానేశాయి. నేలంతా ఎండి బీటలు పడింది. చెరువులు, నూతులు ఎండిపోయాయి. నదీ నదాలలో కూడా నీటిజాడ కనుమరుగైంది. ఈ అనావృష్టి వందేళ్లు కొనసాగింది. కరవు కరాళ నృత్యానికి పశుపక్ష్యాదులు చాలా వరకు అంతరించాయి. మనుషులు అసంఖ్యాకంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంటింటా శవాలు, ఏ ఊళ్లో చూసినా కళేబరాల గుట్టలు పడి ఉన్న దృశ్యాలే కనిపించసాగాయి. ఈ దారుణ పరిస్థితికి విప్రులందరూ కలత చెందారు. ఏం చేయాలో దిక్కుతోచక వారందరూ హిమాలయాలకు చేరి, నిరాహారులై ఆదిపరాశక్తిని స్తుతించసాగారు. విప్రుల ప్రార్థనలకు ప్రసన్నురాలైన ఆదిపరాశక్తి వారి ఎదుట ప్రత్యక్షమైంది. మెడలో ఫలపుష్ప వనమూలికాదుల మాలలను, అనంత హస్తాలలో అశేష ఆయుధాలను ధరించి కరుణారస సాగరంలా వారి ముందు నిలిచింది. దుఃఖిస్తున్న ప్రజలను చూసి, జగజ్జనని అనంత నయనాలు ఏకధారగా వర్షించాయి. ఆ వర్షధారలకు భూమిపైనున్న వాపీ కూప తటాకాదులు నీటితో నిండాయి. ఓషధులు పులకించాయి. ఫలపుష్పాది వృక్షాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అప్పటి వరకు కొండ కోనల్లో దాక్కున్న దేవతలందరూ బయటకు తరలి వచ్చి, విప్రులతో కలసి గొంతు కలిపి దేవిని స్తుతించడం ప్రారంభించారు. జగన్మాత పరవశురాలైంది. తన చేతుల్లోని పండ్లు, కాయలు అందరికీ అందించింది. పశుపక్ష్యాదులకు కావలసిన ఆహారాన్ని వాటికి అందించింది. ఫల శాకాదులు అందించడంతో విప్రులు, దేవతలు జగజ్జననిని ‘శాకంబరి’ అంటూ శ్లాఘించారు. సురనరాది ప్రాణికోటి ఆహారాన్ని అందుకుంటున్న కోలాహలం దుర్గముడికి వినిపించింది. ఏం జరుగుతోందో తెలుసుకుని రమ్మని దూతలను పంపించాడు. వారు తిరిగి వచ్చి, తాము చూసినదంతా చెప్పారు. దుర్గముడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఆయుధాలు ధరించి, రథారూఢుడై సైన్య సమేతంగా హుటాహుటిన జగజ్జనని చుట్టూ ఉన్న దేవతల వద్దకు చేరుకున్నాడు. వస్తూనే శరపరంపర కురిపించాడు. దేవతలందరూ ఎదిరించి పోరాడు. విప్రులు కూడా శక్తి మేరకు యుద్ధం చేశారు. రాక్షస సేనల ధాటికి దేవ సేనలు, విప్రసమూహం తట్టుకోలేకపోవడంతో హాహాకారాలు మిన్నుముట్టాయి. ‘త్రాహి! త్రాహి!’ అంటూ వారంతా జగజ్జననిని శరణు కోరారు.జగజ్జనని దేవ మానవుల చుట్టూ తేజోమయ రక్షణవలయాన్ని ఏర్పరచింది. రాక్షసుల ఆయుధాలు ఆ వలయం అంచులను తాకి, గోడను తాకిన గులకరాళ్లలా రాలిపోతున్నాయి. జగన్మాత స్వయంగా యుద్ధరంగానికి వచ్చింది. దేవి శరీరం నుంచి అనంతంగా శక్తి స్వరూపిణులు ఆవిర్భవించారు. వారంతా చిత్ర విచిత్రమైన ఆయుధాలతో రాక్షస సేనలను ముట్టడించి, క్షణాల్లోనే తుదముట్టించారు.దుర్గముడు విచిత్రరథంపై రణరంగానికి వచ్చాడు. చండప్రచండంగా యుద్ధం చేశాడు. భూమ్యాకాశాలను కమ్మేసినట్లుగా శరపరంపరను కురిపించి, అనంతశక్తులను జయించాడు. జగన్మాత ఎదుట తన రథాన్ని నిలిపాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. చివరకు జగజ్జనని ప్రయోగించిన బాణాలకు దుర్గముడు నెత్తురు కక్కుకుంటూ రథం మీద నుంచి నేలమీద దొర్లిపడి మరణించాడు. దుర్గముడి చావుతో దేవతలు ఆనంద తాండవం చేశారు. ముల్లోకాలూ తిరిగి శాంతిని పొందాయి. -
దుర్గార్తిశమనీ దశదిశలా దసరా
జగన్మాత అయిన దుర్గాదేవి దుర్గతులను దూరం చేస్తుందని, ఆర్తత్రాణ పరాయణ అని భక్తుల నమ్మకం. ఆర్తితో పూజించే భక్తులకు ఆపదలు రాకుండా చూసుకుంటుందని, ఐహిక ఆముష్మిక సుఖశాంతులను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ద్వాత్రింశన్నామ స్తోత్రం దుర్గాదేవిని దుర్గార్తిశమనీ అని స్తుతిస్తోంది.ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాడ్యమి నుంచి దశమి వరకు దేవీ నవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో వచ్చే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులు అని, చివరి రోజైన దశమి రోజును విజయ దశమిగా, దసరా పండుగగా జరుపుకుంటారు గనుక వీటిని దసరా నవరాత్రులని కూడా అంటారు. ఈ నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవిని వివిధ రూపాలలో ఆరాధిస్తారు.‘భూతాని దుర్గా! భువనాని దుర్గా! స్త్రీయో నరాశ్చపి పశుశ్చ దుర్గా!యద్యద్ధి దృశ్యం ఖలు నైవ దుర్గా! దుర్గా స్వరూపాదపరం న కించిత్.’పై శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే, సమస్త ప్రాణికోటి దుర్గా స్వరూపమే! సమస్త లోకాలూ దుర్గా స్వరూపమే! స్త్రీలు పురుషులు పశువులు అన్నీ దుర్గా స్వరూపమే! లోకంలో కంటికి కనిపించేవన్నీ దుర్గా స్వరూపమే! దుర్గా స్వరూపం కానిదంటూ ఏదీ లేదు. దుర్గాదేవిని నమ్ముకున్న భక్తుల భావన ఇది.దేవీ నవరాత్రులను అష్టాదశ శక్తిపీఠాలు సహా అమ్మవారి ఆలయాలన్నింటిలోనూ అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో విశేషంగా జరుపుకొంటారు. నవరాత్రులలో కనకదుర్గ అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి, రోజుకో నైవేద్యాన్ని నివేదిస్తారు.నవరాత్రులలో కనకదుర్గాదేవి అలంకారాలు1 మొదటిరోజున శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా బంగారురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా తీపి బూందీ, సుండలు సమర్పిస్తారు.2 రెండో రోజున శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పెసరపప్పు పాయసాన్ని సమర్పిస్తారు.3 మూడో రోజున శ్రీ గాయత్రీదేవిగా కనకాంబరంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.4 నాలుగో రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా గంధంరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం, కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.5 ఐదో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవిగా బంగారు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులిహోర, పెసర బూరెలను సమర్పిస్తారు.6 ఆరో రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా గులాబిరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, క్షీరాన్నం సమర్పిస్తారు.7 ఏడో రోజున శ్రీ సరస్వతీదేవిగా తెలుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం, దధ్యోదనం, అటుకులు, బెల్లం, శనగ పప్పు సమర్పిస్తారు.8 ఎనిమిదో రోజున శ్రీ దుర్గాదేవిగా ఎరుపురంగు వస్త్రాలతో అలంకరిస్తారు. పులగం, పులిహోరలను నైవేద్యంగా సమర్పిస్తారు.9 తొమ్మిదో రోజున శ్రీ మహిషాసురమర్దనిగా ముదురు గోధుమరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా పులగం, పులిహోర, గారెలు, నిమ్మరసం, వడపప్పు, పానకం సమర్పిస్తారు.10 పదో రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా ఆకుపచ్చరంగు వస్త్రాలతో అలంకరిస్తారు. నైవేద్యంగా లడ్డూలను సమర్పిస్తారు.నవదుర్గల ఆరాధనదసరా నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల రూపాలలో కూడా పూజిస్తారు. శ్రీచక్రంలోని నవచక్రాలలో కొలువుండే దుర్గాదేవి నవరూపాల గురించి బ్రహ్మదేవుడు మార్కండేయునికి చెప్పినట్లుగా వరాహ పురాణం చెబుతోంది. వరాహ పురాణం చెప్పిన ప్రకారం–ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీతృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చసప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టకమ్నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాఃఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనాఈ నవరాత్రులలో దుర్గాదేవి భక్తులు అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనే నవదుర్గా రూపాలలో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.దుర్గా సప్తశతిలో అమ్మవారి తొమ్మిదిరూపాల ప్రస్తావన మరోవిధంగా ఉన్నా, వాటిని నవదుర్గలుగా పేర్కొనలేదు. దుర్గా సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ అనే రూపాల ప్రస్తావన ఉంది. కొన్నిచోట్ల నవరాత్రులలో అమ్మవారిని ఈ రూపాలలో కూడా ప్రత్యేక అలంకరణలు, నైవేద్యాలతో ఆరాధించే సంప్రదాయం ఉంది. శమీపూజనవరాత్రుల చివరి రోజైన విజయ దశమినాడు శమీపూజ చేయడం ఆనవాయితీ. పాండవులు అరణ్యవాసం ముగించుకుని, అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను, వస్త్రాలను ఎవరికీ కనిపించకుండా శమీవృక్షం– అంటే జమ్మిచెట్టు మీద దాచారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారు శమీవృక్షానికి పూజించి, దానిపై తాము దాచుకున్న ఆయుధాలను వస్త్రాలను తిరిగి తీసుకున్నారు. శమీవృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉంటుందని నమ్మకం. అపరాజితా దేవి ఆశీస్సులతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించినట్లు మహాభారతం చెబుతోంది. శ్రీరాముడు కూడా విజయదశమి రోజున అపరాజితా దేవిని పూజించి, రావణునిపై విజయం సాధించినట్లు రామాయణం చెబుతోంది. ఈ సందర్భంగా చాలాచోట్ల ఆయుధపూజలు కూడా జరుపుతారు. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకునే ఆచారం కూడా ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనమైన తర్వాత శమీవృక్షం వద్దకు చేరుకుని, అపరాజితా దేవిని పూజించిన తర్వాత– ‘శమీ శమయుతే పాపం శమీ శత్రు వినాశినీఅర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ’ అనే శ్లోకాన్ని పఠిస్తూ, శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు శమీ అష్టోత్తరాన్ని కూడా పఠించి, పూజ జరుపుతారు. శమీపూజ చేయడం వల్ల అపరాజితా దేవి ఆశీస్సులు లభించడమే కాకుండా, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరుపుకొంటారు. రకరకాల రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, మహిళలు బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ, పాటలు పాడుతూ సందడి చేస్తారు. ఈ నవరాత్రుల రోజులలో కొన్ని ప్రాంతాల్లోని మహిళలు ‘గ్రామ కుంకుమ నోము’, ‘కైలాసగౌరీ నోము’ వంటి నోములను నోచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపండుగగా నిర్వహిస్తోంది. బతుకమ్మ పండుగలోనూ రోజుకో తీరులో నైవేద్యాలను సమర్పిస్తారు.పూల వేడుక బతుకమ్మ పండుగఎంగిలిపూల బతుకమ్మ: మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. మహాలయ అమావాస్య రోజున ఈ పండుగ మొదలవుతుంది. ఈ రోజున బియ్యప్పిండి, నూకలు, నువ్వులు కలిపి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు చేస్తారు. రెండో రోజు జరిగే ఈ వేడుకను అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజున సప్పిడి పప్పు, అటుకులు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.ముద్దపప్పు బతుకమ్మ: మూడో రోజు వేడుకను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ఈ రోజున పాలు, బెల్లం, ముద్దపప్పుతో తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.నానేబియ్యం బతుకమ్మ: నాలుగో రోజు వేడుకను నానేబియ్యం బతుకమ్మ అంటారు.ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి తయారు చేసిన నైవేద్యం సమర్పిస్తారు.అట్ల బతుకమ్మ: ఐదో రోజు వేడుకను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున అమ్మవారికి అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు.అలిగిన బతుకమ్మ: ఆరో రోజు వేడుకను అలిగిన బతుకమ్మ అంటారు. ఈ రోజున నైవేద్యమేమీ సమర్పించరు.వేపపండ్ల బతుకమ్మ: ఏడో రోజు వేడుకను వేపపండ్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున బాగా వేపిన బియ్యప్పిండితో వేపపండ్లలా వంటకాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటారు. ఈ రోజున నువ్వులు, బెల్లం వెన్నముద్ద లేదా నెయ్యిలో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.సద్దుల బతుకమ్మ: తొమ్మిదో రోజు వేడుకను సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే రోజున దుర్గాష్టమి జరుపుకొంటారు. ఈ రోజున బతుకమ్మకు పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం– ఐదు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు.ఆడపడుచులందరూ అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో ఈ తొమ్మిదిరోజుల పూల పండుగను జరుపుకొంటారు. పండుగ ముగిసిన తర్వాత బతుకమ్మను దగ్గర్లో ఉన్న జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలనాడు ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల బతుకమ్మ పండుగను జరుపుకొంటారు. పన్యాల జగన్నాథదాసు