అ‍గ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ! | Dussehra 2024: Rajasthan Idana Matas Fire Bath On The First Day | Sakshi
Sakshi News home page

అ‍గ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ!

Published Thu, Oct 3 2024 1:23 PM | Last Updated on Thu, Oct 3 2024 3:00 PM

Dussehra 2024: Rajasthan Idana Matas Fire Bath On The First Day

ఇవాళ నుంచే శరన్నవరాత్రులు ప్రారంభం. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ అలంకారాలతో, స్తోత్ర పారాయణాలతో అమ్మవారిని భక్తులు కొలుచుకుంటారు. ఈ పర్వదనాల్లో పలువురు అమ్మవారి శక్తి పీఠాలను దర్శించి తరిస్తారు. ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆలవలం అయిన ఈ పుణ్యభూమిలో స్వయంగా అమ్మవారే వచ్చి కొలువై భక్తులను రక్షిస్తున్న అద్భుత ఆలయాలు కూడా ఉన్నాయి. వాటి వైభవం అంత ఇంత కాదు. అలాంటి అద్భుత పుణ్యక్షేత్రాల్లో ఒకటి రాజస్థాన్‌కి చెందిన ఇడాన మాత ఆలయం. ఈ ఆలయంలో జరిగే అద్భుతం సైన్సుకే అంతు చిక్కని మిస్టరిగా చెప్పొచ్చు. ఈ నవరాత్రులు పురస్కరించుకుని ఆ ఆలయ విశిష్టత గురించి సవివరంగా తెలుసుకుందామా..!.  

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాయత్రి శక్తి పీఠ్ ఆలయంలో దుర్గమ్మ ఇడాన మాతగా పూజలందుకుంటోంది. ఈ అమ్మవారికి చైత్రమాసంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో జరిగే అద్భతం తిలకించేందుకు భక్తులు బారులు తీరి ఉంటారు. ఆ నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారు అగ్నిస్నాన మాచరిస్తుందట. 

ఉన్నట్టుండి సడెన్‌గా దానంతట అవే అగ్నికీలలపు పుట్టి అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్లుగా సర్వత్రా మంటలు వ్యాపిస్తాయి. అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం చత్రుస్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు.  దాదాపు 10 నుంచి 20 అడుగులు  మేర అగ్నికీలలు దానంతట అవిగా ఉద్భవిస్తాయట. ఆ సమయంలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు, వస్త్రాలు బూడిద అవుతాయే తప్ప అమ్మవారి విగ్రహం చెక్కు చెదరదట. 

అంతేగాదు ఈ విగ్రహం వేల ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఏటా ఈ నవరాత్రుల ప్రారంభమయ్యే తొలి రోజునే అగ్ని స్నానమాచరిస్తారట. అప్పటి దాక ఆలయంలో పూజల జరుగుతూ కోలహాలంగా ఉంటుందట. ఎప్పుడు సంభవిస్తుందో.. ఎలా జరుగుతుందో.. తెలయదు గానీ, ఉన్నట్టుండి హఠాత్తుగా ఆలయం చుట్టూ అగ్నికీలలు ‍‍వ్యాపిస్తాయని చెబుతున్నారు స్థానికులు. ఇలా ఎందుకు జరుగుతుందనేది సైన్సుకే అంతు చిక్కని మిస్టరీలా మిగిలింది. దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోదనలు చేస్తున్న శాస్త్రవేత్తలు సైతం కారణం ఏంటనేది నిర్థారించలేకపోయారు. 

విచిత్రం ఏంటంటే అక్కడ మంటలు అంటుకునేలా అగరబత్తులు వంటివి ఏం వెలిగించరట. ఇక పురాణల ప్రకారం..వనవాస సమయంలో పాండవులు ఈ అమ్మవారిని దర్శించి పూజించారని కథనం. అలాగే మరో కథనం ప్రకారం ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు "జైసమంద్‌"ను నిర్మించే క్రమంలో రాజస్తాన్‌ రాజు జై సింగ్ ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారని అప్పటి నుంచే ఈ అమ్మవారు "ఇడానా మాత"గా పూజలు అందుకుంటోందని చెబుతుంటారు. చాలామంది భక్తులు ఈ వింత చేసేందుకు ఈ ఆలయానికి తరలివస్తుంటారని చెబుతున్నారు.

త్రిశూలం విశిష్టత..
పక్షవాత రోగులు, మానసిక విలాంగులు ఈ ఆలయాన్ని దర్శిస్తే రోగం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో అనేక త్రిశూలాలు దర్శనమిస్తాయి. అవి ఆ అద్భుతం జరిగినప్పుడూ..మంటలు పూర్తయిన తర్వాత భక్తులు అమ్మవారికి త్రిశూలాన్ని సమర్పిస్తారట. అయితే ఈ త్రిశూలాన్ని సంతానం లేని మహిళలు పూజిస్తే.. సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

 

(చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement