Udaipur
-
జేఈఈ మెయిన్‌లో రికార్డు రేంజ్ మార్కులు! కానీ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు..
ఐఐటీ జేఈఈ లాంటి కఠినతరమైన పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అలాగే ఉత్తీర్ణత సాధించి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో రికార్డు స్థాయి జీతాలతో అందరినీ విస్తుపరుస్తుంటారు కూడా. అలాంటిది ఈ యువకుడు జేఈఈ మెయిన్‌లో ఎవ్వరూ బ్రేక్ చేయని విధంగా రికార్డు స్థాయిలో మార్కులు తెచ్చుకున్నాడు. మంచి కాలేజ్‌లో సీటు పొందాడు. పైగా ఇంజీనీరింగ్ విద్యను అకడమిక్ సంవత్సరం కంటే ముందే పూర్తి చేశాడు. అయినా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లలేదు. మరీ లక్షల ప్యాకేజ్‌ల ఉద్యోగాన్ని వద్దనుకుని ఏం చేస్తున్నాడో తెలిస్తే..విస్తుపోతారు. అంతేగాదు అతడి స్టోరీ వింటే గెలుపంటే ఇది కదా అని అనుకుండా ఉండలేరు.ఉదయపూర్‌లోని మహారాణా భూపాల్‌కి చెందిన వ్యక్తి కల్పిత్ వీర్వాల్. లక్షలాది మంది డ్రీమ్ ఐఐటీ జేఈఈ2017లో ఉత్తీర్ణత సాధించాడు. దాన్ని కల్పిత్ అత్యంత అలవొకగా సాధించేశాడు. ఇక్కడ కల్పితేమి ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. పెద్ద బ్యాగ్రౌండ్ ఏమి లేదు కూడా. తల్లి ఓ ప్రైవేటు టీచర్ కాగా, తండ్రి కాంపౌడర్. అలాగే కల్పిత్ జేఈఈ ప్రిపరేషన్ కోసం అందరిలా ఏకంగా 16 గంటలు చదివిన వ్యక్తి కూడా కాదు. అలాగే కోచింగ్ సెంటర్లలోనే ఉండిపోయి ప్రిపేరయ్యేలా పలు సంస్థలు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ముందుక వచ్చినా.. వాటిని కూడా ఇష్టపడకుండా తన ఇంటి నుంచి ప్రిపేరయ్యేందుకే మొగ్గు చూపాడు. ఇక జేఈఈ మెయిన్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ బ్రేక్ చేయని రేంజ్లో 360/360 మార్కులు సంపాదించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకున్నాడు. అంతేగాదు అతనికి కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY) స్కాలర్, నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ (NTSE) వంటి ఎన్నో ప్రోత్సాహక స్కాలర్షిప్లను సొంతం చేసుకున్నాడు. అయితే అందరిలా IIT బాంబే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో చేరినా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఐఐటీ రెండో సంవత్సరంలోనే ఒక YouTube ఛానెల్‌ను ప్రారంభించాడు. అక్కడ తన అధ్యయన వ్యూహాలను , JEE ప్రిపరేషన్ చిట్కాలను పంచుకున్నాడు. దీనికి అనతికాలంలోనే అనూహ్యస్పందన వచ్చింది. అతడిచ్చే సలహాలు ఆచరణాత్మకంగా ఉండేవి. విద్యార్థులంతా సాధారణ కోచింగ్ సెంటర్లు బోధించే దానికి భిన్నంగా ఉందంటూ ఇంప్రెస్ అయ్యేవారు. అలా అతని యూట్యూబ్ ఛానెల్‌కి లక్షకు పైగా సబ్స్క్రైబర్లు, ఫాలోయింగ్ ఉండేది. తన ఛానెల్‌కి ఉన్న డిమాండ్ దృష్ట్యా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు. అలా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడే ఆన్లైన్ విద్యా వేదిక అయిన AcadBoostను కల్పిట్ ప్రారంభించాడు. మరసుటి ఏడాదే తన తొలి ఆన్లైన్ కోర్సుని డెవలప్ చేశాడు. అది విజయవంతమైంది. అలా అతను తన ఐఐటీ క్యాంపెస్ ప్లేస్మెంట్లలో వచ్చే ప్యాకేజ్‌లకు మంచి ఆదాయాన్ని ఈ ఆన్లైన్ వేదిక AcadBoostతో ఆర్జించాడు. అలాగే తన ఐఐటీ బాంబే ప్రోగ్రామ్‌లో ఒక సెమిస్టర్ ముందుగానే ముగించాడు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో అకాడ్బూస్ట్ టెక్నాలజీస్‌లో పనిచేసేవాడు. దీంతో 2021 నాటికి, లింక్డ్ఇన్ 'టాప్ వాయిసెస్'లో కల్పిత్‌కి స్థానం ఇచ్చింది. అలా 20 మంది అత్యుత్తమ యువ నిపుణుల జాబితాలో కల్పిత్ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేగాకుండా టెడ్ఎక్స్లో తన జేఈఈ మంచిస్కోర్కి సంబంధించిన సక్సస్ జర్నీని షేర్ చేసుకున్నాడు. ఇక్కడ కల్పిత్ కేవలం విద్యా విషయాలకే కట్టుబడి ఉండలేదు. అతను సీనియర్ NCC క్యాడెట్ అయ్యాడు, కఠినమైన తుపాకీ కసరత్తులు, శిబిరాలు శిక్షణ తర్వాత ఎన్సీసీ ఏ సర్టిఫికేట్‌ని కూడా సంపాదించాడు. అలాగే JEEకి సిద్ధమవుతున్నప్పుడు కూడా, అతను క్రికెట్, టీవీ, బ్యాడ్మింటన్, సంగీతం కోసం సమయం కేటాయించేవాడు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ఎడ్టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినా..నిరాకరించాడు. తన కంటూ ఓ అచంచలమైన లక్ష్యంతో విభ్నింగా ఉండాలనుకున్నాడు, అలానే జీవించి ఎందరికో ప్రేరణగా నిలిచాడు. ఇక్కడ విజయం అంటే కేవలం మార్కులు కాదని, దృష్టి, వ్యూహాలకు సంబంధించినదని ప్రూవ్ చేశాడు. ఎన్ని గంటలు చదివామన్నది కాదు..ఎంత బాగా చదువుతున్నాం, ఎంత నాలెడ్జ్‌ని పొందుతున్నాం అన్నదే ముఖ్యం అని చాటిచెప్పాడు.(చదవండి: ఆరోగ్యకరమైన ఆహారమే అయినా బరువు తగ్గడం లేదు ఎందుకు..?) -
హైదరాబాద్ వచ్చిన పీవీ సింధు..నేడు వివాహ రిసెప్షన్ (ఫొటోలు)
-
PV Sindhu Wedding : అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఫొటోలు వైరల్
-
ఉదయపూర్ యువరాజు వాహన ప్రపంచం - తప్పకుండా చూడాల్సిందే (ఫోటోలు)
-
పెళ్లి పీటలెక్కనున్న సింధు
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ మహారాణి పూసర్ల వెంకట (పీవీ) సింధు త్వరలో పారాణితో ముస్తాబుకానుంది. ఆమె పెళ్లి బాజాకు మూహూర్తం కూడా ఖారారైంది. ఈ నెల 22న ఉదయ్‌పూర్ (రాజస్తాన్)లో అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరుగనుంది. రెండేళ్ల తర్వాత సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ట్రోఫీతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన ఆమె నవ వధువుగా పెళ్లి పీటలెక్కబోతోంది. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరుడు వెంకట దత్తసాయి ‘పొసిడెక్స్ టెక్నాలజీస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. వధూవరుల కుటుంబాలకు ఇదివరకే పరిచయముంది. తాజా పరిణయంతో ఇరు కుటుంబాలు బంధువులు కానున్నారు. పెళ్లి వార్తను సింధు తండ్రి పీవీ రమణ ధ్రువీకరించారు. ‘ఇరు కుటుంబాలు కలసి నెల క్రితమే పెళ్లి ముహూర్తాన్ని ఖాయం చేశాం. వచ్చే జనవరి నుంచి సింధుకు బిజీ షెడ్యూల్ ఉండటంతో అందుబాటులో ఉన్న ఈ నెలలోనే వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాం. పెళ్లి వేడుకను ఉదయ్‌పూర్‌లో నిర్వహిస్తాం. ఈనెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తాం. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు ఈ నెల 20 నుంచి జరుగుతాయి’ అని రమణ వెల్లడించారు. భారత బ్యాడ్మింటన్‌లో తారాస్థాయి చేరుకున్న సింధు ఖాతాలో ఐదు ప్రపంచ చాంపియన్íÙప్ పతకాలు, రెండు వరుస ఒలింపిక్స్ పతకాలు ఉన్నాయి. సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన సింధు... 2017, 2018లలో రజతం, 2013, 2014లలో కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో మరో ఐదు పతకాలు గెలుచుకుంది. -
ఈ యువరాజు దగ్గర లేని కారు లేదు!
విలాసవంతమైన జీవనశైలితో తరచూ వార్తల్లో ఉండే ఉదయపూర్ యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ (Lakshyaraj Singh Mewar) ఖరీదైన కార్ల భారీ కలెక్షన్‌కు కూడా ప్రసిద్ధి చెందారు. వింటేజ్ కార్ల దగ్గర నుంచి లేటెస్ట్ రోల్స్ రాయిస్ కార్ల వరకూ ఆయన దగ్గర లేని కారు అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో..లేటెస్ట్ లగ్జరీ కార్లను ఇష్టపడే లక్ష్యరాజ్ సింగ్‌కు పాతకాలపు కార్ల పట్ల కూడా మక్కువ ఎక్కువే. తన విస్తారమైన కార్ల కలెక్షన్‌ను చూస్తే ఇది తెలుస్తుంది. ఇంకా తన కార్ల కలెక్షన్లో వలసరాజ్యాల కాలం నాటి క్లాసిక్ కార్లతోపాటు అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లు కూడా ఉన్నాయి.ఆనంద్ మహీంద్రా నుంచి..విదేశీ లగ్జరీ కార్ల పట్ల అభిమానంతోపాటు లక్ష్యరాజ్ సింగ్‌కు కొన్ని మేడ్ ఇన్ ఇండియా వాహనాలు ముఖ్యంగా మహీంద్రా థార్ ఎస్యూవీ అంటే అమితమైన ఇష్టం. 2019లో మహీంద్రా థార్ 700 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ అయినప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా వాహనాన్ని యువరాజుకు అందించారు. ఈ పరిమిత ఎడిషన్ ఈ వాహనాలు 700 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి.విస్తృతమైన కార్ల సేకరణతో పాటు లక్ష్యరాజ్ సింగ్ మోటార్ సైకిళ్లను కూడా ఇష్టపడతారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్‌ని కొన్న తొలి వ్యక్తి ఆయనే. భారత్‌లో ఈ క్రూయిజర్ మోటార్‌బైక్ ధర సుమారు రూ. 3.37 లక్షలు.లక్ష్యరాజ్ సింగ్ మేవార్ ఉదయ్‌పూర్ యువరాజుగా పట్టాభిషిక్తుడైనప్పటికీ, రాజ సింహాసనానికి సరైన వారసుడి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో ఇటీవల రాజకుటుంబీకుల మధ్య మళ్లీ ఘర్షణలు జరిగాయి. రాజస్థాన్‌లోని మేవార్ల సంపద దాదాపు రూ. 10,000 కోట్లని మీడియా నివేదికల అంచనా. -
ఉదయ్‌పూర్‌లో ఫ్యామిలీ డ్రామా.. ఆ వీలునామాలో అసలేముంది?
జైపూర్: మొఘలులుపై పోరాడిన మహారాణా ప్రతాప్ వారసులు ఆస్తుల కోసం, అధికారం కోసం వీధిన పడ్డారు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ కోట వద్ద కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులను ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండా రాజ కుటుంబంలోని సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి.. పలువురు గాయపడ్డారు.ఏంటి ఈ మహరాణా ప్రతాప్ వారసుల గొడవమహారాణా ప్రతాప్ ప్రసిద్ధ రాజపుత్ర యోధుడు. రాజస్థాన్‌లోని మేవార్ రాజు. భారతదేశ స్వాంతంత్య్ర ఉద్యమంలో మహారాణా భూపాల్ సింగ్ మేవార్ రాజు. ఈయన 1955లో శ్రీ ఎక్లింగ్జీ ( Shri Eklingji Trust) ట్రస్ట్‌ను స్థాపించారు. ఆ ట్రస్ట్ బాధ్యతల్ని ఆయన వారసులు కొనసాగిస్తూ వచ్చారు. అయితే క్రమేపీ ఈ ట్రస్ట్ వ్యవహారాలు పాలన విషయంలో కుటుంబసభ్యుల మధ్య పొరపచ్చాలు వచ్చాయి.75వ మహారాణా విశ్వరాజ్ సింగ్ తాత భగవత్ సింగ్‌కు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు మహేంద్ర సింగ్ కాగా మరొకరు అరవింద్ సింగ్. తన మరణానికి ముందు ట్రస్ట్ నిర్వాహక బాధ్యతల నుంచి తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను తప్పించి తన చిన్న కుమారుడు అరవింద్ సింగ్‌కు అప్పగించారు భగవంత్ సింగ్.వీలునామాలో ఉంది ఇదే..తండ్రి నిర్ణయంతో కలత చెందిన మహేంద్ర సింగ్ కోర్టును ఆశ్రయించారు. మే 15, 1984 నాటి తన చివరి వీలునామాలో భగవత్ సింగ్ తన పెద్ద కుమారుడు మహేంద్ర సింగ్‌ను కుటుంబం నుంచి వెలివేస్తున్నట్లు పేర్కొన్నారు. తన చిన్న కుమారుడే ట్రస్ట్ కార్యనిర్వహకుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అదే ఏడాది నవంబర్‌లో తండ్రి భగవత్ సింగ్ మరణించడంతో ట్రస్ట్ ఛైర్మన్‌గా అరవింద్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే..ఈ ఏడాదిలో మహేంద్ర సింగ్ మరణానంతరం.. ఆయన కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషేకం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం, సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంటుంది.అయితే, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్ మేవార్ .. తన కుమారుడు లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ తమ బలగాన్ని ఉపయోగించి విశ్వరాజ్ సింగ్ మేవాడ్‌ను రాజభవనంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో విశ్వరాజ్ మద్దతుదారులు రాళ్లదాడికి దిగారు. లక్షయ్ రాజ్ సింగ్ మేవార్ అనుచరులు సైతం ప్రతి దాడులకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపై పోలీసుల ఎంట్రీతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
ఉదయ్ పూర్ ప్యాలెస్ 'మహారాజు కు నో ఎంట్రీ..
-
ఉదయ్పూర్ప్యాలెస్లో ఉద్రిక్తతలు.. మహారాజుకు నో ఎంట్రీ
జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో సోమవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్‌సమంద్ బీజేపీ ఎమ్మెల్యే, విశ్వరాజ్ సింగ్ మేవార్ను.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని పలువురు గాయపడ్డారు. ఈ పరిణామంతో మేవార్ రాజ కుటుంబంలో ఉన్న విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాడ్ రాజ్య 77వ మహారాజుగా విశ్వరాజ్ సింగ్ సోమవారం పట్టాభిషికం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టాభిషేకం అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్.. కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఉదయ్‌పుర్‌లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు.ఉదయ్‌పూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం ఈయన నియంత్రణలోనే నడుతుస్తున్నాయి. దీంతో మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు వెళ్లిన మహారాజును , అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది. విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకొని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే విశ్వరాజ్ తన మద్దతుదారులతో కలిసి ప్యాలెస్ ముందు గత రాత్రి 5 గంటల పాటు నిలుచున్నారు. అనంతరం ఆయన అభిమానులు, మద్దుతుదారులు ప్యాలెస్‌పై రాళ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్యాలెస్ లోపల ఉన్న వ్యక్తులు కూడా రాళ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. మంగళవారం ఉదయపూర్ ప్యాలెస్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. అయిదుగురు మృత్యువాత
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయపూర్ జిల్లాలో ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. అయిదుగురు వ్యక్తులు కారులో అంబేరి నుంచి దేవరీ వైపు వెళుతుండగా వారి వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రెండు వాహనాలను అదుపులోకి తీసుకొని, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు ఉదయపూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి హిమాన్షు సింగ్ రాజావత్ తెలిపారు. -
అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ!
ఇవాళ నుంచే శరన్నవరాత్రులు ప్రారంభం. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ అలంకారాలతో, స్తోత్ర పారాయణాలతో అమ్మవారిని భక్తులు కొలుచుకుంటారు. ఈ పర్వదనాల్లో పలువురు అమ్మవారి శక్తి పీఠాలను దర్శించి తరిస్తారు. ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆలవలం అయిన ఈ పుణ్యభూమిలో స్వయంగా అమ్మవారే వచ్చి కొలువై భక్తులను రక్షిస్తున్న అద్భుత ఆలయాలు కూడా ఉన్నాయి. వాటి వైభవం అంత ఇంత కాదు. అలాంటి అద్భుత పుణ్యక్షేత్రాల్లో ఒకటి రాజస్థాన్‌కి చెందిన ఇడాన మాత ఆలయం. ఈ ఆలయంలో జరిగే అద్భుతం సైన్సుకే అంతు చిక్కని మిస్టరిగా చెప్పొచ్చు. ఈ నవరాత్రులు పురస్కరించుకుని ఆ ఆలయ విశిష్టత గురించి సవివరంగా తెలుసుకుందామా..!. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాయత్రి శక్తి పీఠ్ ఆలయంలో దుర్గమ్మ ఇడాన మాతగా పూజలందుకుంటోంది. ఈ అమ్మవారికి చైత్రమాసంలో నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో జరిగే అద్భతం తిలకించేందుకు భక్తులు బారులు తీరి ఉంటారు. ఆ నవరాత్రుల్లో తొలిరోజు అమ్మవారు అగ్నిస్నాన మాచరిస్తుందట. ఉన్నట్టుండి సడెన్‌గా దానంతట అవే అగ్నికీలలపు పుట్టి అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్లుగా సర్వత్రా మంటలు వ్యాపిస్తాయి. అయితే ఇక్కడ అమ్మవారి ఆలయం చత్రుస్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. దాదాపు 10 నుంచి 20 అడుగులు మేర అగ్నికీలలు దానంతట అవిగా ఉద్భవిస్తాయట. ఆ సమయంలో అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు, వస్త్రాలు బూడిద అవుతాయే తప్ప అమ్మవారి విగ్రహం చెక్కు చెదరదట. అంతేగాదు ఈ విగ్రహం వేల ఏళ్ల నాటిదని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఏటా ఈ నవరాత్రుల ప్రారంభమయ్యే తొలి రోజునే అగ్ని స్నానమాచరిస్తారట. అప్పటి దాక ఆలయంలో పూజల జరుగుతూ కోలహాలంగా ఉంటుందట. ఎప్పుడు సంభవిస్తుందో.. ఎలా జరుగుతుందో.. తెలయదు గానీ, ఉన్నట్టుండి హఠాత్తుగా ఆలయం చుట్టూ అగ్నికీలలు వ్యాపిస్తాయని చెబుతున్నారు స్థానికులు. ఇలా ఎందుకు జరుగుతుందనేది సైన్సుకే అంతు చిక్కని మిస్టరీలా మిగిలింది. దీనిపై ఎన్నో ఏళ్లుగా పరిశోదనలు చేస్తున్న శాస్త్రవేత్తలు సైతం కారణం ఏంటనేది నిర్థారించలేకపోయారు. విచిత్రం ఏంటంటే అక్కడ మంటలు అంటుకునేలా అగరబత్తులు వంటివి ఏం వెలిగించరట. ఇక పురాణల ప్రకారం..వనవాస సమయంలో పాండవులు ఈ అమ్మవారిని దర్శించి పూజించారని కథనం. అలాగే మరో కథనం ప్రకారం ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు "జైసమంద్"ను నిర్మించే క్రమంలో రాజస్తాన్ రాజు జై సింగ్ ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేశారని అప్పటి నుంచే ఈ అమ్మవారు "ఇడానా మాత"గా పూజలు అందుకుంటోందని చెబుతుంటారు. చాలామంది భక్తులు ఈ వింత చేసేందుకు ఈ ఆలయానికి తరలివస్తుంటారని చెబుతున్నారు.త్రిశూలం విశిష్టత..పక్షవాత రోగులు, మానసిక విలాంగులు ఈ ఆలయాన్ని దర్శిస్తే రోగం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో అనేక త్రిశూలాలు దర్శనమిస్తాయి. అవి ఆ అద్భుతం జరిగినప్పుడూ..మంటలు పూర్తయిన తర్వాత భక్తులు అమ్మవారికి త్రిశూలాన్ని సమర్పిస్తారట. అయితే ఈ త్రిశూలాన్ని సంతానం లేని మహిళలు పూజిస్తే.. సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.उदयपुर शहर से 60 किलोमीटर दूर स्थित ईडाणा माता ने नवरात्रि के पहले दिन अंग स्नान किया है. माता ने अपना अग्नि स्वरूप दिखाया. हजारों साल से यहां प्रतिमा है. यहां माता ईडाणा अग्नि स्नान करतीं है. पिछला अग्नि स्नान पिछले वर्ष इन्ही दिनों में किया था.@abplive #idanamatamandir pic.twitter.com/nMx9sfKTC4— vipin solanki (@vipins_abp) April 9, 2024 (చదవండి: మహిమాన్వితమైన శక్తిపీఠం..కామాఖ్యాలయం..!) -
హడలెత్తిస్తున్న చిరుత.. 11 రోజుల్లో ఏడుగురిపై దాడి, మృతి
రాజస్థాన్‌లో ఓ చిరుత ప్రజలను హడలెత్తిస్తోంది. స్థానికులను వేటాడి చంపి తింటూ.. వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. తాజాగా ఉదయ్‌పూర్‌లోని ఓ గ్రామంలో పూజారి ప్రాణాన్ని బలిగొంది. సోమవారం తెల్లవారుజామున పూజారి విష్ణుగిరి(65) మృతదేహాన్ని స్థానిక అడివిలో గుర్తించారు. చిరుత అతనిపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.మృతదేహాన్ని ఆలయానికి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.అయితే చిరుత దాడిలో గత 11 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. చిరుత దాడులు ఎక్కువవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా పలు చిరుతలు చిక్కాయని చెబుతున్న అధికారులు.. మరోవైపు వాటి దాడులు మాత్రం ఆగడం లేదని పేర్కొంటున్నారు.చిరుతపులి భయంతో పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో ఉచ్చులు బిగించారు. గత కొన్ని రోజులుగా కొన్ని పాంథర్లు పట్టుబడుతుండగా, చిరుతపులి దాడి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతోంది. చిరుత దాడులు క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఆ ప్రాంతంలో పాఠశాలలు మూతపడ్డాయి. సాయంత్రం దాటిన తర్వాత ప్రజలు బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బయటకు వస్తే ఒంటరిగా రావొద్దని.. గుంపులుగా రావాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు ర్రలు లేదా ఇతర ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాలని గ్రామస్థులను అధికారులు కోరారు. అయితే అందరిపై దాడి చేసింది ఒకే చిరుతనా అనేది తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అయిఏ అన్ని ఘటనల్లో జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని.. దాడి స్వభావం కూడా ఒకే విధంగా ఉన్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనిస్తున్నట్లు చెప్పారు. -
ఇక వ్యక్తిగత జీవితంపై ఫోకస్
వ్యక్తిగత జీవితానికి తాను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకోవాల్సిన తరుణం వచ్చిందన్నట్లుగా మాట్లాడుతున్నారు హీరోయిన్ తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ వివాహం గత నెల 23న ఉదయ్‌పూర్‌లో జరిగిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాప్సీ, మథియాస్ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ వధూవరులుగా తాప్సీ, మథియాస్ ఉన్న వీడియోలు వైరల్ అవుతుండటంతో వీరిద్దరికీ వివాహం జరిగిందని స్పష్టమైంది. కాగా పెళ్లి తర్వాత తాప్సీ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నేళ్లు గడిచిన తర్వాత నేను నటించిన సినిమాల జాబితాను ఓ సారి చూసుకున్నప్పుడు ఆ జాబితా నాకు సంతోషాన్నివ్వాలి. ఎందుకుంటే నా జీవితంలోని ఎక్కువ సమయాన్ని సినిమాలకే కేటాయించాను. 24 గంటల్లో నేను పన్నెండు గంటలు పని చేసిన రోజులూ ఉన్నాయి. అయితే ఇకపై నేను నా వృత్తి జీవితంపైకన్నా, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా వదులుకోకూడదు అనిపించేంత మంచి స్క్రిప్ట్ అయితేనే చేయాలనుకుంటున్నాను. కెరీర్‌కి మించిన జీవితం ఒకటి ఉంటుంది. ఆ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సమయం గడపాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు తాప్సీ. -
కాంగ్రెస్‌లో కొత్త ట్విస్ట్.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఉత్తిదేనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ టికెట్ల విషయంలో వివాదం ముదురుతోంది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించిన ఉదయ్‌పూర్ డిక్లరేషన్ రాష్ట్ర ఎన్నికల్లో అమలు కావడం లేదన్న విమర్శలు కాంగ్రెస్ బీసీ నేతల నుంచి వస్తున్నాయి. తెలంగాణ శాసన సభకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికే రెండు విడతలుగా 100మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు నియోజకవర్గాల చొప్పున 4 స్థానాలను కేటాయించాల్సి ఉంది. అంటే మిగిలేది ఇక 15 స్థానాలు. వీటిలో తుంగతుర్తి వంటి ఎస్సీ రిజర్వుడు స్థానాలు కూడా ఉన్నాయి. ఈ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే.. కాంగ్రెస్‌లో బీసీలకు ఇచ్చిన, ఇవ్వనున్న స్థానాలు సహా ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు దూరంలోనే ఉండిపోతున్నాయి. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఏం చెబుతోంది? జాతీయ కాంగ్రెస్ నాయకత్వం గత ఏడాది మే నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనైనా.. సామాజిక న్యాయం పాటిస్తూ టికెట్ల కేటాయింపు ఉండాలి. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌లో వివిధ అంశాలు ఉన్నా.. ఇపుడు ప్రధానమైన చర్చ బీసీ వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లపైనే జరుగుతోంది. ఈ డిక్లరేషన్ ప్రకారం, ప్రతీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కనీసం రెండు టికెట్లు బీసీలకు ఇవ్వాలి. తెలంగాణలో 17 లోక్ సభా స్థానాలు ఉన్నాయి. ఈ లెక్కన 34 టికెట్లు బీసీలకు కేటాయించాల్సి ఉంది. జనాభా దామాషా మేరకు 60శాతానికి పైగా ఉన్న బీసీలకు సముచిత న్యాయం కల్పించాల్సిందే అన్నది కాంగ్రెస్‌లోని బీసీ వర్గ నేతల వాదన. వారికెందుకు రెండు సీట్లు.. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు కావడం లేదని, చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి విన్నించినా ఫలితం లేకుండా పోయిందన్నది ఆ వర్గ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి టికెట్లు ఇవ్వడానికి లేదు. కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ, 2019 ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పద్మావతిరెడ్డికి, ఆమె భర్త టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి టికెట్లు దక్కాయి. అదే మాదిరిగా ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే హన్మంతరావుకు ఆయన తనయుడికి కూడా టికెట్లిచ్చారు. వరంగల్ జిల్లాలో కొండా దంపతులు సైతం రెండు టికెట్లు ఆశించారు. కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి, కొండా మురళీ పరకాల నియోజకవర్గం నుంచి టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ మేరకు కుదరదని, కొండా సురేఖకు మాత్రమే టికెట్ ఇచ్చి, పరకాలలో ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇప్పటికి ఇచ్చింది 20 సీట్లే.. ఎన్నో వడపోతలు, చర్చల తర్వాత ఏఐసీసీ నాయకత్వం తెలంగాణలో రెండు విడతల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తంగా ఇప్పటికే 100 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 నియోజకవర్గాలు రిజర్వు అయ్యాయి. అంటే 31 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు పోగా మిగిలినవి 88 సీట్లు. ప్రతీ లోక్ సభా నియోజకవర్గం పరిధిలో రెండు సీట్ల చొప్పున కేటాయించాల్సింది 34 సీట్లు. అంటే 88 స్థానాల్లో 34 టికెట్లు బీసీలకు కేటాయిస్తే.. 54 నియోజకవర్గాలు మాత్రమే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంది. బీజేపీ భయం.. కానీ, రెండు జాబితాల్లో 100 మంది అభ్యర్థుల్లో బీసీలు కేవలం 20 మంది మాత్రమే ఇవ్వడాన్ని కాంగ్రెస్ బీసీ నాయకులు నిలదీస్తున్నారు. ఇంకా ప్రకటించాల్సిన 19 సీట్లలో వామపక్షాలకు నాలుగు సీట్లు ఇవ్వాల్సి ఉంది. అంటే ఇక మిగిలేది కేవలం 15 నియోజకవర్గాలు. వీటిలో కొన్ని తుంగతుర్తి వంటి ఎస్సీ, పినపాక వంటి ఎస్టీ రిజర్వుడు స్థానాలు కూడా ఉన్నాయి. మిగిలిన మొత్తానికి మొత్తం బీసీలకు కేటాయించినా.. వారి కోటా పూర్తి కాదు. ఒక వైపు బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుని తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే.. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను కూడా వీరు ప్రస్తావిస్తున్నారు. సీనియర్లకు హ్యాండ్! మరో వైపు తెలంగాణ కోసం ముందు వరసలో ఉండి కొట్లాడిన అప్పటి ఎంపీలైన బీసీ నాయకులు మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్ వంటి వారికి టికెట్లు కేటాయిండంలోనూ రెండో జాబితా వరకు తాత్సారం చేయడంపై విమర్శలు ఉన్నాయి. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ టికెట్ల చిచ్చు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్‌కు టికెట్ దక్కక పోవడం, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వంటి నాయకులు పార్టీని వీడటం, మరో మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు (వీహెచ్), పార్టీ సీనియర్ నాయకుడు నిరంజన్ వంటి వారు నిరసన గళం వినిపిస్తుండటాన్ని బీసీ నాయకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. -
వందే భారత్ రైలుకు తప్పిన పెనుప్రమాదం
జైపూర్: ఉదయపూర్ జైపూర్ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాల వెంబడి ఇటుక సైజులో ఉన్న రాళ్లను గమనించిన లోకోపైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రాళ్లు అమర్చి ఉన్న చోటుకు ముందే రైలు ఆగింది. రైల్వే సిబ్బంది ఈ రాళ్లను తొలగిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం ఉదయం సుమారు 7.50 ప్రాంతంలో ఉదయపూర్ నుంచి జైపూర్ వెళ్తున్న వందే భారత్ రైలు లోకో పైలట్ చాలా దూరం నుంచే ప్రమాదాన్ని పసిగట్టారు. చిట్టోగఢ్ వద్ద గాంగ్రార్ సోనియానా స్టేషన్ల మధ్య పట్టాలపై రాళ్లు ఉండటాన్ని గమనించి వెంటనే ఎమర్జెన్సి బ్రేకులు వేయడంతో రైలు అక్కడి వరకు వెళ్లకుండానే ఆగింది. లోకోపైలట్ సహా కొంతమంది రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి ఆ రాళ్లను, జాయింట్ వద్ద ఉన్న రాడ్డును తొలగించారు. వాటితో పాటు పట్టాలను వదులు చేసే పరికరం ఉండటాన్ని గమనించి దాన్ని కూడా తొలగించారు. నిందితులెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. అనంతరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం యధాతధంగా కొనసాగింది. రైల్వే సిబ్బంది రాళ్లను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో సంచలనంగా మారింది. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైలు 435 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 గంటల 15 నిముషాల్లో చేరుకుంటుంది. గతంలో ఇదే దూరం ప్రయాణించడానికి కనీసం 7 గంటల సమయం పట్టేది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యమున్న ఈ రైలును సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. Alert train drivers stop #VandeBharatExpress in time. Stones and clips to derail Udaipur-Jaipur #VandeBharat near Bhilwara. pic.twitter.com/vftHAtZpMw — Rajendra B. Aklekar (@rajtoday) October 2, 2023 ఇది కూడా చదవండి: కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఇద్దరు డాక్టర్లు మృతి -
పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా పెళ్లి ఫోటో వైరల్
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరిగిన వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. (ఇదీ చదవండి: 'విశ్వగానగంధర్వుడు' బాలసుబ్రహ్మణ్యం తొలి గురువు ఎవరు..?) ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే వివాహం అనంతరం పరిణీతి-రాఘవ్ జంటగా దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పరిణీతి పింక్ చీరలో భర్త రాఘవ్ చద్దాతో కలిసి పోజులిచ్చారు. పరిణీతి నుదుటిపై సిందూరం ఉంది. దీంతో ఈ ఫోటోలను వారిద్దరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలో వారి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలను కూడా షేర్ చేయనున్నారు. ఈ వేడుకకి ఇరు కుటుంబాలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దిల్లీ, పంజాబ్‌ల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు కొత్త జంట రాగ్నీతీ (రాఘవ్, పరిణీతి)లను ఆశీర్వదించారు. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. -
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమజంట.. హాజరైన ప్రముఖులు!
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మూడు రోజుల పాటు వేడుకలు జరుపుకున్న ఈ జంట.. ముచ్చటగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లీలా ప్యాలెస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మూడు రోజులుగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుక అత్యంత వైభవంగా కొనసాగింది. ఈ పెళ్లి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే అధికారికంగా పెళ్లి ఫోటోలను రిలీజ్ చేయనున్నారు. (ఇది చదవండి: చెల్లి పెళ్లికి హాజరుకాని ప్రియాంక చోప్రా.. అదే ముఖ్యమా!!) పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. మనీష్ మల్హోత్రా, సానియా మీర్జా, హర్భజన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే ఈ పెళ్లికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మాత్రం హాజరు కాలేదు. ఈ వేడుకకు ఆమె తల్లి, డాక్టర్ మధు చోప్రా హాజరయ్యారు. కాగా.. ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిణీతికి శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా.. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆకట్టే కనికట్టు: మెంటలిస్ట్ సుహానీ షా
సుహానీ షాను ఇండియాలో ఏకైక ఫిమేల్ మెంటలిస్ట్ అంటారు. ఇప్పటికి 5000 ప్రదర్శనలు ఇచ్చిన సుహానీ స్టేజ్ మీద ప్రేక్షకులను దిగ్భ్రమ పరిచే చమత్కారాలు చేస్తుంది. సంప్రదాయ మేజీషియన్ల వేషంలో కాకుండా ఆధునికమైన ఆహార్యంలో ఆమె భ్రాంతిని, విభ్రాంతిని, కనికట్టును ప్రదర్శిస్తుంది. అందుకే దేశంలోని ఏదో ఒక నగరంలో ఆమె ప్రదర్శనకు సంబంధించిన ప్రకటన కనపడుతూనే ఉంటుంది. సుహానీ సక్సెస్ స్టోరీ. సుహానీ షా తన షోలో మిమ్మల్ని స్టేజ్ మీదకు పిలుస్తుంది. మీరెవరో ఆమెకు తెలియదు. ఆమెతో మీరు ఎప్పుడూ మాట్లాడి ఉండరు. ‘మీకు ఇష్టమైన పాట తలుచుకుని మనసులో పాడుకోండి’ అంటుంది. మీరు ఒక నిమిషం మనసులో పాడుకుంటారు. అప్పుడు సుహానీ షా తన చేతిలోని సెల్ఫోన్లో ఒక పాట మ్యూట్‌లో ప్లే చేసి పక్కన పెట్టి, మీరు ఏ పాట అనుకున్నారో మైక్‌లో చెప్పండి అంటుంది. ‘మౌనంగానే ఎదగమని’ అని మీరు అంటారు. ఆ ఫోన్లో చూడండి అంటుంది. ఆశ్చర్యం. అందులో అదే పాట అప్పటికే ప్లే అవుతూ ఉంటుంది. మీరు మనసులో అనుకున్న పాట ఆమెకు ఎలా తెలిసింది? అదే మైండ్ రీడింగ్. మళ్లీ ఇంకొకరిని పిలుస్తుంది. ‘ఎవరినైనా మీకు పరిచయమున్న వ్యక్తిని తలుచుకోండి’ అంటుంది. అతను తలుచుకుంటాడు. ఫ్రెండా? అడుగుతుంది. బంధువు అంటాడు. మీరు కళ్లు మూసుకుని ఆ మనిషిని మీ ఎదురుగా ఊహించుకోండి అంటుంది. ఆ తర్వాత తన చేతిలో ఉన్న పలక మీద ఒక పేరు రాసి పక్కన పెడుతుంది. కళ్లు తెరిచి మీరు తలుచుకున్న వ్యక్తి పేరు చెప్పండి అంటుంది. అతను చెప్తాడు. పలక చూపిస్తుంది. ఆశ్చర్యం. ఆ పలక మీద అప్పటికే ఆమె ఆ పేరు రాసి ఉంది. అదీ మైండ్ రీడింగే. ఇలాంటివి చేసే మహిళ మన దేశంలో సుహానీ షా ఒక్కర్తే ఉంది. అందుకే ఆమె భారతదేశ ఏకైక ఉమన్ మెంటలిస్ట్. చిన్నప్పటి నుంచి సుహానీ షాది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. ఏడేళ్ల నుంచే మేజిక్ చేయడం మొదలెట్టింది. ఆ మేజిక్‌లు పెద్ద హిట్ అయ్యేసరికి స్కూల్‌కు వెళ్లే వీలే కలగలేదు. దేశ విదేశాలు మేజిక్‌లు చేస్తూ వెళ్లింది. దాంతో 14 ఏళ్ల వరకు ఆమెకు రాయడం రాదు. 16 ఏళ్ల వరకు ఇంగ్లిష్ మాట్లాడటం రాదు. కాని ఇప్పుడు నాలుగైదు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. ‘సాకులు చెప్పొద్దు’ అంటుంది ఎవరైనా ఏదైనా రాదు అంటే. ‘నేర్చుకోవాలనే సంకల్పం ముఖ్యం’ అంటుంది. సుహానీ షా మొదట మేజిక్‌లు చేస్తూ, తర్వాత ఇల్యూషన్స్ చేస్తూ, ఆ తర్వాత మైండ్ రీడర్‌గా మారింది. మెంటలిస్ట్ అంటే? మెజీషియన్లాగా సంగీతం, ఎక్విప్మెంట్, హంగామా ఏమీ ఉండదు. సరికొత్త ఆహార్యంలో ఒక్కరే వచ్చి స్టేజ్ మీద నుంచి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఎదురుగా కూచున్న వారిలో ఒకరి పెళ్లిరోజు ఏదో చెప్పడం, ఒకరి ఫోన్ తీసుకుని అన్‌లాక్ చేయడం, ఒకరి గతాన్ని చెప్పడం, మరొకరి భవిష్యత్తును చెప్పడం, మనసులో అనుకున్న అంకెలు తెలియచేయడం... ఇవన్నీ మెంటలిస్ట్ చేస్తారు. సుహానీ షా తాను ఒక్కతే స్టేజ్ మీద నిలబడి ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. ‘ఇందుకు దివ్యశక్తులు ఏమీ అక్కర్లేదు. సాధనతో సాధించిన స్కిల్ ఇది’ అంటుంది సుహానీ షా. ‘మామూలు మేజిక్‌లు చాలా కాలం చేశాక దీనికంటే పై స్థాయికి వెళ్లాలని ఎదుటివాళ్ల మైండ్ రీడింగ్ చేయాలని కొన్నాళ్ల పాటు హిమాలయాలకు వెళ్లి షో డిజైన్ చేస్తూ కూచున్నాను. మూడు నాలుగేళ్లుగా మెంటలిస్ట్‌గా షోలు చేస్తున్నాను’ అంటుంది సుహానీ. మోటివేషనల్ స్పీకర్ సుహానీ కేవలం షోస్ మాత్రమే చేయదు. యూట్యూబ్‌లో పర్సనాల్టీ డెవలప్మెంట్ మీద వీడియోలు చేస్తుంది. ఆమెకు గోవాలో హిప్నో క్లినిక్ ఉంది. దురవాట్లను మాన్పించడంలో ఆమె వ్యక్తులకు సాయ పడుతుంటుంది. ‘జీవితంలో ఏ పనీ చేయనివారు ఏదో ఒకటి సాధించాలని అనుకోని వారు తమ జీవితాలను వృథా చేసుకుంటున్నట్టు లెక్క’ అంటుందామె. సుహానీకి లక్షల కొద్ది అభిమానులు ఉన్నారు. ఆమె షోస్ నగరాల్లో జరుగుతూనే ఉంటాయి. ఈసారి మీ దృష్టికి వస్తే వెళ్లి చూడండి. -
పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో కుమార్తె.. డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లాడనుంది. గతేడాది సెప్టెంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. రెండేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2020లో తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాలో ఇద్దరు కలిసి ఉన్న రొమాంటిక్ పిక్స్ షేర్ చేశారు. (ఇది చదవండి: 7 రోజులు.. రూ.600 కోట్లు.. ‘జవాన్’ సరికొత్త రికార్డు) ఉదయ్‌పూర్‌లో పెళ్లిసందడి ఈ ప్రేమ జంట రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో మూడు రోజుల పాటు జరిగే వేడుక కోసం ఇప్పటికే ప్లాన్ చేసినట్లు సమాచారం. అమీర్ ఖాన్ సైతం తన కుమార్తె వివాహా వేడుక కోసం ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం జరిగి ఇప్పటికే ఏడాది పూర్తి కావడంతో పెళ్లి డేట్‌ను ఫిక్స్ చేశారు. 26 ఏళ్ల ఐరా తన పెళ్లి ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. జనవరి 3వ తేదీన పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు వివరించింది. ఐరా మాట్లాడుతూ..'మేం జనవరి 3న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఏ సంవత్సరం అనేది మేము నిర్ణయించుకోలేదు. జనవరి 3 మాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు మేమిద్దరం మొదటిసారి ముద్దుపెట్టుకున్న రోజు' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఓ సైక్లింగ్ ఈవెంట్ సందర్భంగా నుపుర్.. ఆమెకు ప్రపోజ్ చేశారు. అతను వృత్తిరీత్యా ఫిట్నెస్ కోచ్ కాగా.. అమీర్ ఖాన్, సుస్మితా సేన్ లాంటి ప్రముఖులకు శిక్షణ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఐరా.. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమార్తె. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత, డిసెంబర్ 2005లో కిరణ్ రావును అమీర్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 2022లో విడిపోయారు. అమీర్ ఖాన్ కుమార్తె 2019లో 'యూరిపిడెస్' మెడియా నాటకం ద్వారా దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. అయితే తనకు నటిగా మారడం ఇష్టం లేదని ఐరా స్పష్టం చేసింది. (ఇది చదవండి: అర డజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీ.. తాజాగా మరో సినిమా..) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
ప్రియాంక చోప్రా సోదరి పెళ్లి.. ఆ మాత్రం రేంజ్ ఉండాల్సిందే!
బాలీవుడ్ భామ, ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాతో కొన్నేళ్లపాటు డేటింగ్ కొనసాగించిన భామ.. ఆ తర్వాత అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఈనెలలోనే వివాహా బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వీరిపెళ్లి వేదికపై బీటౌన్‌లో తెగ చర్చనడుస్తోంది. తారల డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వేదిక ముస్తాబవుతోంది. వీరి పెళ్లి కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఓ లుక్కేద్దాం. ఇద్దరు ప్రముఖ రంగాలకు చెందిన వారు కావడంతో అతిథులు సైతం అదేస్థాయిలో రానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!) బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఈనెల 24న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తేదీలను ఇంకా ధృవీకరించనప్పటికీ వారి సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్ వీరి పెళ్లికి వేదికగా నిలవనుంది. మూడు రోజుల పాటు జరిగే మెహందీ, సంగీత్, హల్దీ వేడుకల కోసం లీలా ప్యాలెస్ ముస్తాబవుతోంది. అత్యంత ఖరీదైన హోటల్ ఈ ప్యాలెస్‌లోని హోటల్ గది ఒక్కరోజుకు అత్యధికంగా రూ. 9 లక్షలకు పైగా ధర ఉన్నట్లు సమాచారం. వీరి పెళ్లికి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా హాజరు కానున్నారు. అయితే పెళ్లి తర్వాత గురుగ్రామ్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ బాష్‌ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మే 13న దిల్లీలోనిపరిణీతి, రాఘవ్‌ల నిశ్చితార్థ వేడుకకు కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ప్రియాంక చోప్రా హాజరయ్యారు. (ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్) View this post on Instagram A post shared by 𝐓𝐡𝐞 𝐋𝐞𝐞𝐥𝐚 𝐏𝐚𝐥𝐚𝐜𝐞 𝐔𝐝𝐚𝐢𝐩𝐮𝐫 (@theleelapalaceudaipur) -
సమయాన్ని చాక్లెట్‌గా మార్చుకున్నాడు! కోటీశ్వరుడయ్యాడు
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సామాన్యులు సైతం కోటీశ్వరులు కావచ్చని నిరూపించి చూపిస్తున్నాడు పదహారేళ్ల యువకుడు దిగ్విజయ్ సింగ్. అతడు సమయాన్ని చాక్లెట్‌గా మార్చుకున్నాడు! కరోనా కారణంగా ఇళ్లలోనే జైల్లోలా కష్టంగా గడిపిన రోజులవి. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా హఠాత్తుగా దొరికిన బోలెడంత సమయాన్ని ఏం చేయాలో అర్థంకాని అయోమయ పరిస్థితులు. ఉదయపూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దిగ్విజయ్ సింగ్ కూడా ఏమి తోచుబాటుగాని ఆ సమయంలో.. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నాడు. అనుకున్న వెంటనే యూట్యూబ్‌లో చాక్లెట్స్ తయారీ గురించి చూశాడు. చాక్లెట్స్ తయారీ సులభంగా ఉండడంతో ఇంట్లో తయారు చేశాడు. దిగ్విజయ్ చేసిన చాక్లెట్లు రుచిగా ఉన్నాయని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెప్పడంతో మరిన్ని చాక్లెట్స్ తయారు చేసి అమ్మాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడు మహవీర్ సింగ్‌కు చెప్పడం, అతనికి ఆసక్తి ఉండడంతో ఇద్దరూ కలిసి చాక్లెట్లు తయారు చేద్దామని నిర్ణయించుకున్నారు. గిఫ్ట్‌బాక్స్‌ను చూసి... పదహారేళ్ల తన స్నేహితుడితో కలిసి యూట్యూబ్ సాయంతో చాక్లెట్స్, వివిధ రకాల డిజర్ట్లు తయారు చేసి స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంచేవాళ్లు. దీపావళికి దిగ్విజయ్ తండ్రి కారు కొన్నాడు. కారు షోరూం వాళ్లు కారుతోపాటు చాక్లెట్ బాక్స్‌ను గిప్ట్గా ఇచ్చారు. షోరూంలో కారు కొనే కస్టమర్లందరికీ చాక్లెట్ బాక్స్‌లు గిప్ట్గా ఇస్తున్నారని దిగ్విజయ్‌కి తెలిసింది. వెంటనే హోటల్, కార్షోరూం యజమానులను కలిసి కాంప్లిమెంటరీగా ఇచ్చేందుకు తాను ఇంట్లో తయారు చేసిన చాక్లెట్స్ ఇస్తానని చెప్పాడు. అందుకు వారు ఒప్పుకోవడంతో చాక్లెట్స్ తయారీ మొదలుపెట్టాడు. రెండేళ్లలో రెండుకోట్లు ఒక కార్ షోరూం వాళ్లు వెయ్యి చాక్లెట్స్ కావాలని 2021లో తొలి ఆర్డర్ ఇచ్చారు. అప్పుడే ‘సరామ్’అనే పేరుతో చాక్లెట్ విక్రయాలు ప్రారంభించాడు. చాక్లెట్స్ రుచిగా ఉండడంతో .. విక్రయాలు క్రమంగా పెరిగి ఏడాదిలోనే మంచి ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా రెండు టన్నులకు పైగా చాక్లెట్ విక్రయాలు జరిగాయి. దీంతో రెండేళ్లలోనే ‘సరామ్’ రెండు కోట్లను ఆర్జించింది. సరికొత్తగా... సాదా సీదాగా కాకుండా దేశంలో దొరికే రకరకాల పండ్లు, మసాలాలను ఉపయోగించి చాక్లెట్స్‌ను సరికొత్తగా తయారు చేసి విక్రయిస్తున్నాడు దిగ్విజయ్. కేరళ, తమిళనాడునుంచి కోకోపొడి, చాక్లెట్స్‌లో వాడే పండ్లను బాగా పండే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని నాణ్యమైన రుచికరమైన చాక్లెట్స్‌ను తయారు చేస్తున్నాడు. ఢిల్లీ, బెంగళూరు, ఉదయ్‌పూర్, జైపూర్లలో సరామ్ కస్టమర్లు చాలామంది ఉన్నారు. ఉదయ్‌పూర్, జైపూర్లలో స్టోర్లు, ఆఫ్లైనేగాక, ఆన్లైన్లో చాక్లెట్ విక్రయాలు జరుగుతున్నాయి. సమయాన్ని సక్రమంగా వినియోగిస్తే కోట్లు సంపాదించవచ్చుననడానికి దిగ్విజయ్ ఉదాహరణగా నిలుస్తున్నాడు. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే ) -
కిచెన్ క్వీన్ శశికళ.. ఈమె వంటలకు విదేశీయులు కూడా ఫిదా
ఉదయ్‌పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు. పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది. రాజస్థాన్‌కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది. ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్‌పూర్ వస్తుంటారు. -
ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా.. ఫ్లాట్‌లో
జైపూర్: ఓ ఇంటి యజమాని పాడు పని చేశాడు. అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్‌లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్రూం, బాత్రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు. ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ పోవడంతో అమ్మాయిలు ఎలక్ట్రిషన్‌ను పిలిపించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను వైర్లు పరిశీలిస్తుండగా ఐదారు సీక్రెట్ కెమెరాలు కన్పించాయి. దీంతో కంగుతిన్న ముగ్గురు అమ్మాయిలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు యజమానిని ఏఫ్రిల్ 27న అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం నిందితుడికి మే 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చదవండి: నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్.. ధూమ్ సినిమాను తలపించిన దొంగతనం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని పేరు రాజేంద్ర సోని. సీసీటీవీల వ్యాపారం చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంటెక్ చేసిన ఇతడు ఐటీ నిపుణుడు. స్పై కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలో బాగా తెలుసు. అందుకే అమ్మాయిలు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు డూప్లికేట్ కీ ఉపయోగించి ఫ్లాట్‌లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఉచిత వైఫై అందిస్తానని చెప్పి రూటర్ కూడా ఇన్స్టాల్ చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. ఇలా సీక్రెట్‌గా వీడియోలూ చూడటం తన బలహీనత అని చెప్పుకొచ్చాడు యజమాని. చాలా కాలంగా ఇలా చేస్తున్నట్లు తెలిపాడు. కాగా.. ఈ ముగ్గురు అమ్మాయిలు 8 నెలల క్రితం ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను ఇన్ని రోజులు గమనించలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. పాపం ప్యాంటు ఊడి ఇబ్బందిగా.. -
‘రాజ కుటుంబాలు ఆకాశం దిగి నేలకు రావు’.. అదేమీ కాదు!
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మొదలైన ప్రాంతాల్లో రాజులకు సంబంధించి ఎన్నో విషయాలు వినిపిస్తుంటాయి. ఆ ముచ్చట్లు ‘రాజ కుటుంబాలు ఆకాశం దిగి నేలకు రావు’ అన్నట్లుగా ఉండేవి. అదేమీ కాదని నిరూపించింది ఉదయ్‌పూర్ రాకుమారి పద్మజ కుమారి మేవార్. ఆమెకు పల్లె గుండె తెలుసు. పక్షులను, పచ్చదనాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు... రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ రాజకుటుంబంలో పుట్టింది పద్మజ కుమారి మేవార్. అమ్మ, నాన్నమ్మల నుంచి ఎన్నో జానపదకథలు విన్నది. ఆ కథల్లో ఎన్నో అందమైన అడవులు, అపురూపమైన జంతుజాలం ఉండేవి. కాల్పనిక ప్రపంచం దాటి బయటికి వస్తే పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అడవులు కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాల గురించి నాన్న మాటల్లో ఎన్నోసార్లు విన్నది. హైస్కూల్ చదువు నుంచి డిగ్రీ వరకు అమెరికాలో చదువుకున్న పద్మజ కుమారి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో హోటల్ మేనేజ్మెంట్ చేసింది. చదువు పూర్తయిందో లేదో ఆమె ‘భగీర’ క్యాంపులోకి అడుగుపెట్టింది. సామాజిక సేవా కార్యక్రమాల కోసం తల్లిదండ్రులు రాణి దుర్గేష్ నందిని, మహారాజా రాజేంద్రసింగ్ ఈ క్యాంపుకు శ్రీకారం చుట్టారు. ఈ క్యాంప్‌లోని గదులను స్థానికులే, స్థానికంగా దొరికే వనరులతో నిర్మించారు. గోద్వారీ ప్రాంతంలో ఉన్న ఈ క్యాంపు కేంద్రంగా వనసంరక్షణ, స్త్రీ సాధికారత, ఆరోగ్యం, జలసంరక్షణ... మొదలైన కార్యక్రమాలు చేపట్టారు. పద్మజ కుమారి ఈ క్యాంప్‌లోకి అడుగు పెట్టిన తరువాత క్యాంపుకు కొత్త శక్తి వచ్చి చేరింది. ఆమెకు ఆ ప్రాంతంలో ప్రతి ఊరూ కొట్టిన పిండే. గోద్వారీ ప్రాంతం 235 రకాల పక్షులకు, 35 రకాల ఔషధ మొక్కలకు నిలయం. ‘మన దగ్గర అపూర్వమైన సంపద ఉంది. వాటిని పరిరక్షించుకోవాలి’ అంటూ ఊరువాడా తిరిగింది. గిరిజన ప్రాంతాల్లో స్కూల్స్ మొదలుపెట్డడం ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకువచ్చింది. సామాజిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలే కాదు స్థానికులకు ఉపాధి కల్పించే పనులకు శ్రీకారం చుట్టింది. ‘ఈ క్యాంపులోకి అడుగు పెడితే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఎంతో ధైర్యం వస్తుంది’ అంటారు స్థానికులు. ఇప్పుడు వారికి రకరకాల పక్షుల పేర్లు, వాటి పుట్టు పూర్వోత్తరాలు, ఔషధ మొక్కల పేర్లు, వాటి ఉపయోగాలు తెలియడం మాత్రమే కాదు వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా బాగా తెలుసు. ‘పెద్ద చదువులు చదువుకున్నావు. ఇక్కడికి ఎందుకు తల్లీ’అని తల్లిదండ్రులు అనలేదు. అదే తనకు మహాబలం అయింది. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాలు తిరిగిన పద్మజ కుమారికి, సామాజికసేవలో కొత్త ప్రపంచం కనిపించింది. ఎన్నో లక్ష్యాలు ఏర్పడ్డాయి. అందులో ఒకటి వైల్డ్‌లైఫ్ టూరిజం కేంద్రంగా గోద్వారీ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని. స్థానికుల స్పందన, చైతన్యం పద్మజ కుమారి సంకల్పబలం చూస్తుంటే అదేమీ కష్టం కాదు అనిపిస్తుంది. -
ఎంత అందంగా ఉన్నారో! హార్దిక్ పాండ్యా- నటాషా మెహందీ ఫొటోలు వైరల్
Hardik Pandya Natasa Stankovic Viral Pics: అందమైన ఫొటోలతో మరోసారి అభిమానుల ముందుకు వచ్చాడు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ‘‘పెయింటెడ్ ఇన్’’ లవ్ అంటూ భార్య, కుమారుడితో ఉన్న దృశ్యాలు పంచుకున్నాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ నేపథ్యంలో విశ్రాంతి తీసుకున్న ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్టు.. వాలంటైన్స్ డే సందర్భంగా సతీమణి నటాషా స్టాంకోవిక్‌కు మర్చిపోలేని బహుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో రెండేసి సంప్రదాయ పద్ధతుల్లో మరోసారి భార్యను వివాహమాడాడు హార్దిక్. తమ మూడేళ్ల కుమారుడు అగస్త్య సహా బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆమెతో మరోసారి పెళ్లి ప్రమాణాలు చదివాడు. ఈ క్రమంలో ఇప్పటికే వైట్వెడ్డింగ్ థీమ్ సహా నటాషాతో కలిసి ఏడడుగులు నడిచిన ఫొటోలను పంచుకున్నాడు ఈ స్టార్ ఆల్‌రౌండర్. తాజాగా మెహందీ, హల్దీ(పసుపు) ఫంక్షన్ ఫొటోలు షేర్ చేయగా అవి కూడా వైరల్ అవుతున్నాయి. గులాబీ, తెలుపు రంగుల మేళవింపుతో కూడిన కుర్తా పైజామాలో హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్యతో కలిసి ట్విన్నింగ్ చేయగా.. నటాషా పసుపు వర్ణం ప్రధానంగా ఉన్న మల్టీకలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఈ ఫొటోలకు గంటలోపే మిలియన్‌కు పైగా లైకులు వచ్చాయి. అందమైన జంట అంటూ తోటి క్రీడాకారులు, అభిమానులు హార్దిక్ పాండ్యా దంపతులను మరోసారి విష్ చేస్తున్నారు. అమ్మానాన్నలతో క్యూట్ అగస్త్య.. కలకాలం వర్థిల్లు అంటూ వీరి కుమారుడిని ఆశీర్వదిస్తున్నారు. ముచ్చటైన కుటుంబం అని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కాగా సెర్బియా మోడల్, నటి నటాషాను ప్రేమించిన హార్దిక్ పాండ్యా 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి కుమారుడు జన్మించాడు. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో నిరాడంబరంగా వీరి వివాహం జరగడంతో మూడేళ్ల తర్వాత ఇలా గ్రాండ్‌గా ప్లాన్ చేశాడు హార్దిక్. గతేడాది కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకున్న ఈ ఆల్‌రౌండర్ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా తన భార్య కలను నెరవేర్చాడు. ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో తిరిగి జట్టుతో కలవనున్న హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత ఐపీఎల్-2023తో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా మరింత బిజీ కానున్నాడు. చదవండి: ind Vs Aus: స్వదేశానికి పయనం.. అవమానించారు కాబట్టే అంటున్న గిల్‌క్రిస్ట్!! Ind Vs Aus: చెత్త బ్యాటింగ్.. వాళ్లు టీమిండియాను ఓడించలేరు: పాక్ మాజీ క్రికెటర్ -
భార్య నుదుటిన సింధూరం దిద్దిన హార్దిక్.. ముచ్చటగా మూడోసారి! పెళ్లి ఫొటోలు వైరల్
Hardik Pandya- Natasa Stankovic Hindu Wedding New Images: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిక్ దంపతులు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. మూడేళ్ల క్రితం అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్న ఈ ప్రేమజంట.. ఈ వాలంటైన్స్ డేన రెండోసారి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో హార్దిక్- నటాషా పెళ్లి కన్నులపండువగా జరిగింది. తమ కుమారుడు అగస్త్యతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరు మరోసారి పెళ్లి చేసుకున్నారు. తొలుత భార్య విశ్వాసాలకు అనుగుణంగా ‘వైట్ థీమ్ వెడ్డింగ్’ ఏర్పాటు చేసిన హార్దిక్ పాండ్యా.. తర్వాత హిందూ సంప్రదాయ పద్ధతిలోనూ ఆమెను వివాహమాడాడు. క్రిస్టియన్ వివాహ పద్ధతిలో నటాషా పొడవాటి అందమైన తెల్లటి గౌన్ ధరించగా.. రెండో పద్ధతిలో బంగారు- ఎరుపు వర్ణాలు కలగలసిన లెహాంగాలో మెరిసిపోయింది. ఇక పెళ్లికి ఎరుపు రంగు చీరకట్టుకుని అందమైన ఆభరణాలు ధరించి అచ్చమైన భారతీయ వనితలా కనిపించింది. PC: Hardik Pandya Instagram తొలుత ఉంగరాలు మార్చుకుని మరోసారి పెళ్లి ప్రమాణాలు చదివిన ఈ జంట.. తర్వాత అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడిచి ముచ్చటగా మూడోసారి పెళ్లాడారు. హార్దిక్ పాండ్యా తన భార్య నుదుటిన సింధూరం దిద్ది మురిసిపోయాడు. PC: Hardik Pandya Instagram ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు హార్దిక్- నటాషా దంపతులు. ‘‘ఇప్పుడు.. ఎల్లప్పుడూ’’ అంటూ హార్ట్ సింబల్ ఎమోజీతో తమ ప్రేమబంధం శాశ్వతం అంటూ క్యాప్షన్ జతచేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. PC: Hardik Pandya Instagram (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా గుజరాత్‌కు చెందిన క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు.. సెర్బియా మోడల్, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిక్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో 2020లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. నటాషా గర్భం దాల్చిన తర్వాత అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు. PC: Hardik Pandya Instagram వీరికి కుమారుడు అగస్త్య జన్మించాడు. ప్రస్తుతం టీమిండియా టీ20 తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా.. త్వరలోనే పూర్తిస్థాయిలో భారత జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో అతడు గుజరాత్ టైటాన్స్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..! IND Vs AUS 2nd Test Prediction: సూర్య స్థానంలో అయ్యర్.. గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఖరారు -
ఉదయ్‌పూర్ యువరాజు మనసు దోచిన వెహికల్ ఇదే! నెట్టింట్లో వీడియో వైరల్
సాక్షి, ముంబై: గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు లగ్జరీ వాహనాలను కొనుగోలు చేసినట్లు చదువుకున్నాం. అయితే ఇటీవల మన దేశంలో రాజవంశానికి చెందిన యువరాజు లగ్జరీ వ్యాన్లను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజానికి సాధారణ ప్రజల మాదిరిగానే ఉదయ్‌పూర్ యువరాజు 'లక్ష్యరాజ్ సింగ్ మేవార్' పెద్ద ఆటోమొబైల్ ఔత్సాహికుడు. మేవార్ కుటుంబం భారతదేశంలో అరుదైన పాతకాలపు కార్లను, విదేశాల లగ్జరీ కార్లను సొతం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు వీరి గ్యారేజిలో రెండు 'ఫోర్స్ అర్బేనియా' లగ్జరీ వ్యాన్లు చేరాయి. ఫోర్స్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే ప్రీమియం అర్బేనియా పరిచయం చేసింది. సిటీ ప్యాలెస్ కాంపౌండ్ లోపల ఈ వాహనాలను లక్ష్యరాజ్ సింగ్ మేవార్ స్వయంగా డెలివరీ తీసుకున్నారు. ఈ వ్యాన్లు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సీల్డ్ గ్లాస్ ప్యానెల్లు, ఇండియూజువల్ AC వెంట్లు , ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి ఫీచర్లున్నాయి. ఫోర్స్ అర్బేనియా వ్యాన్స్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ లగ్జరీ వ్యాన్స్ ధరల గురించి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ వ్యాన్స్ గురించి స్వయంగా యువరాజు మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. లక్ష్యరాజ్ 2012లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ డెలివరీ చేసుకున్నారు. వీరి కుటుంబం తమ మొదటి రోల్స్ రాయిస్‌ను 1911లోనే కొనుగోలు చేసింది. 2020లో లక్ష్యరాజ్ మహీంద్రా థార్ కొనుగోలు చేశారు. -
నటితో హార్దిక్ పాండ్యా పెళ్లి.. మూడేళ్ల తర్వాత!
హార్దిక్ పాండ్యా క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. తక్కువ కాలంలోనే టీమిండియాకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అయితే హార్దిక్ పాండ్యా ఇప్పటికే నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈ జంట మరోసారి పెళ్లికి సిద్ధమైంది. అదేంటి ఇప్పటికే పెళ్లయిన జంటకు మరోసారి పెళ్లేంటీ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేసేయండి. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఫిబ్రవరి 13 నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం హార్దిక్, నటాషా ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఈ ఏడాది ప్రేమికుల రోజున ఉదయపూర్‌లో ఈ జంట మరోసారి వివాహం చేసుకోనుంది. ఈనెల 13 నుంచి 16 వరకు హల్దీ, మెహెందీ, సంగీత్ లాంటి కార్యక్రమాలతో వెడ్డింగ్ వైభవంగా జరగనుంది. పెళ్లయిన మూడేళ్లకు మరోసారి ఈ జంట వివాహం చేసుకోవడం విశేషం. కాగా.. జనవరి 1, 2020న దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్, నటాషా.. మే 31, 2020న సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జూలై 2020లో వారి బాబు జన్మించారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తమ కుమారుడి ఫోటోలు, వీడియోలను పంచుకుంటారు. నటాషా 2013 చిత్రం సత్యాగ్రహ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత యాక్షన్ జాక్సన్ (2014), ఫుక్రే రిటర్న్స్ (2017) వంటి చిత్రాలలో నటించింది. ఆమె బిగ్ బాస్ ఎనిమిదో సీజన్లో కూడా కనిపించింది. ఆ తర్వాత బాద్షా బ్లాక్ బస్టర్ ట్రాక్ డీజే వాలీ బాబు సినిమాలోనూ కనిపించింది. View this post on Instagram A post shared by Nataša Stanković Pandya 🧡 (@natasastankovic__) -
ప్రయాణికుడిని పాట్నాకు బదులు ఉదయ్‌పూర్ తీసుకెళ్లిన ఇండిగో..
న్యూఢిల్లీ: బిహార్ రాజధాని పాట్నా వెళ్లాల్సిన ప్రయాణికుడ్ని రాజస్థాన్ ఉదయ్‌పూర్‌కు తీసుకెళ్లింది ఇండిగో విమానం. సిబ్బంది నిర్లక్ష్యంతో అతని వద్ద సరైన టికెట్, బోర్డింగ్ పాస్ ఉన్నప్పటికీ.. పాట్నా విమానానికి బదులు ఉదయ్‌పూర్ విమానంలో ఎక్కించారు. తీరా ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక పాట్నాలో ఉండాల్సిన తాను ఉదయ్‌పూర్‌లో ఉండటం చూసి ప్రయాణికుడు షాక్ అయ్యాడు. జనవరి 30న జరిగిన ఈ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టనుంది. ఈ ప్రయాణికుడి పేరు అఫ్తార్ హుస్సేన్. జనవరి 30న పాట్నా వెళ్లేందుకు ఇండిగో విమానం 6E-214లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే పొరపాటున అతడ్ని 6E-319 ఇండిగో విమానంలో ఎక్కించారు సిబ్బంది. తీరా ఉదయ్‌పూర్‌లో దిగాక అతనికి అసలు విషయం తెలిసింది. ఈ విషయాన్ని ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు హుస్సేన్. వెంటనే ఆయన ఇండిగో సంస్థను అప్రమత్తం చేశారు. దీంతో సదరు సంస్థ హుస్సేన్‌ను మళ్లీ ఢిల్లీకి తీసుకెళ్లింది. ఆ మరునాడు అంటే జనవరి 31న అక్కడినుంచి పాట్నాకు తీసుకెళ్లింది. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎక్కడ జరిగిందని డీజీసీఏ దర్యాప్తు జరపనుంది. ప్రయాణికుడి బోర్డింగ్ పాసు స్కాన్ చేయకుండా విమానం ఎలా ఎక్కించారు? బోర్డింగ్‌కు ముందే రెండుసార్లు బోర్డింగ్ పాసులను స్కాన్ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అతను వేరే విమానంలో ఎలా ఎక్కాడు? అని విచారణ జరపనున్నారు. అనంతరం విమాన సంస్థపై చర్యలు తీసుకోనున్నారు. చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగికి షాక్! అటు ఉద్యోగం, ఇటు పెళ్లి చేసుకునే పిల్లా? ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు! -
Captain Shiva Chouhan: సియాచిన్ పై వీర వనిత
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్‌లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ దళాధిపతిగా నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన కెప్టెన్ శివ చౌహాన్ ఈపోస్ట్ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రయినింగ్‌ను పూర్తి చేశారు. శివ చౌహాన్ వివరాలు. గతంలో సియాచిన్‌కు విధి నిర్వహణకు పంపే సైనికులతో అధికారులు ‘మీరు ముగ్గురు వెళితే ఇద్దరే తిరిగి వస్తారు’ అని హెచ్చరించి పంపేవారు. ‘ఇద్దరే తిరిగి వచ్చినా దేశం కోసంపోరాడతాం’ అని సైనికులు సమరోత్సాహంతో వెళ్లేవారు. అయితే వారి ప్రథమ శత్రువు పాకిస్తాన్ కాదు. ప్రతికూలమైన ప్రకృతే. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, తీవ్రమైన చలి గాలులు, హిమపాతం, కాలు జారితే ఆచూకీ తెలియని మంచులోయలు... సియాచిన్‌లో 35 అడుగుల ఎత్తు మేరకు కూడా మంచు పడుతుందంటే ఊహించండి. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధస్థావరమైన సియాచిన్ అటు పాకిస్తాన్ నుంచి ఇటు చైనా నుంచి రక్షణ ΄పొందడానికి ఉపయోగపడే కీలక్రపాంతం. అక్కడ ఇన్నాళ్లు మగవారే విధులు నిర్వహించారు. మొదటిసారి ఒక మహిళా ఆఫీసర్ అడుగు పెట్టింది ఆమె పేరే శివ చౌహాన్. 1984 నుంచి దేశ విభజన సమయంలో వాస్తవాధీన రేఖకు అంచున మానవ మనుగడకు ఏమాత్రం వీలు లేని సియాచిన్ ్రపాంతాన్ని అటు పాకిస్తాన్ కాని ఇటు ఇండియాగాని పట్టించుకోలేదు. కాని 1984లో దాని మీద ఆధిపత్యం కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని తెలుసుకున్న భారత్ సియాచిన్ అధీనం కోసం హుటాహుటిన రంగంలో దిగి ‘ఆపరేషన్ మేఘదూత్’ పేరుతో విజయవంతమైన సైనిక చర్య చేయగలిగింది. ఆ తర్వాత 1999 వరకూ ఇరు పక్షాల మధ్య చర్యలు, ప్రతిచర్యలు సాగాయి. ‘వాస్తవ మైదాన స్థానరేఖ’ను ఇరుపక్షాలు అంగీకరించి అక్కడ సైనిక స్థావరాలు నిర్మించుకున్నా మంచు ఖండం వంటి సియాచిన్ మీద భారత్ గాని, పాకిస్తాన్‌గాని తన స్థావరాలను తీసేయలేదు. ఇప్పటివరకూ ఇరువైపులా అక్కడ 2000 మంది సైనికులు మరణించారని అంచనా. వారిలో ఎక్కువ మంది కేవలం ప్రతికూల వాతావరణానికే మరణించారు. సైనిక కాల్పుల్లో కాదు. అడుగు పెట్టిన ఆఫీసర్ సంప్రదాయిక విధానాలతోనే నడిచే ఇండియన్ ఆర్మీ మహిళల ప్రవేశాన్ని అన్నిచోట్ల అంగీకరించరు. ఇంతవరకూ 9000 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంప్ వరకే మహిళా ఆఫీసర్లను అనుమతించింది ఆర్మీ. కాని 15000 అడుగుల నుంచి 20 వేల అడుగుల (బాణాసింగ్ బంకర్) ఎత్తు వరకూ సియాచిన్‌లో వివిధ స్థానాలలో ఉండే స్థావరాలకు మహిళా ఆఫీసర్లను పంపలేదు. మొదటిసారిగా శివ చౌహాన్‌కు ఆర్మీ సియాచిన్ హెడ్క్వార్టర్స్లోపోస్టింగ్ ఇచ్చింది. రాజస్థాన్ సాహసి శివ చౌహాన్‌ది రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్. 11వ ఏట తండ్రి మరణిస్తే గృహిణి అయిన తల్లి శివ చౌహాన్‌ను పెంచింది. ‘మా అమ్మే నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ మీద ఆసక్తి కలిగించింది’ అంటుంది శివ. ఉదయ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శివ 2020 సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు రాసి ఆలిండియా మొదటి ర్యాంకు సాధించింది. చెన్నైలో ట్రైనింగ్ అయ్యాక 2021లో లెఫ్టినెంట్‌గా ఇంజనీర్ రెజిమెంట్‌లో బాధ్యత తీసుకుంది. ఆ వెంటనే కెప్టెన్ హోదా ΄పొందింది. 2022 కార్గిల్ దివస్ సందర్భంగా సియాచిన్ వార్ మెమోరియల్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు 508 కిలోమీటర్ల సైకిల్ యాత్రను శివ చౌహాన్ తన నాయకత్వంలో పూర్తి చేయడంతో ఆమె అధికారుల దృష్టిలో పడింది. దాంతో ఆమెను సియాచిన్‌లో టీమ్ లీడర్గాపోస్ట్ వరించింది. త్రివిధ దళాలలో చరిత్ర సృష్టిస్తున్న స్త్రీల సరసన ఇప్పుడు శివ చౌహాన్ నిలిచింది. కఠిన శిక్షణ సియాచిన్‌లో ఏ స్థావరంలో విధులు నిర్వహించాలన్నా సియాచిన్ హెడ్‌క్వార్టర్స్‌లోని బేటిల్ స్కూల్లో మూడు నెలల శిక్షణ పూర్తి చేయాలి. మిగిలిన మగ ఆఫీసర్లతో పాటు శివ ఈ శిక్షణను పూర్తి చేసింది. ఇందులో కఠినమైన మంచు గోడలను అధిరోహించడం, మంచులోయల్లో పడినవారిని రక్షించడం, శారీరక ఆరోగ్యం కోసం డ్రిల్ పూర్తి చేయగలగడం వంటి అనేక ట్రయినింగ్లు ఉంటాయి. ‘ఆమె శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. మూసను బద్దలు కొట్టింది’ అని ఆర్మీ అధికారులు అన్నారు. -
రైల్వే ట్రాక్ ప్రారంభించిన 15 రోజుల్లోనే భారీ పేలుడు..!
జైపూర్: ఉదయ్‌పుర్- అహ్మదాబాద్ రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లాలో శనివారం రాత్రి కలకలం సృష్టించింది. ఓడ బ్రిడ్జ్ నుంచి ఈ పేలుడు శబ్దం వచ్చినట్లు గమనించిన స్థానికులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దీంతో ట్రాక్ దెబ్బతిన్నట్లు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఉదయ్‌పుర్ జిల్లా కెవ్డాలో ఉన్న ఓడ రైల్వే బ్రిడ్జ్‌ను జిల్లా కలెక్టర్ తారాచంద్ మీనా ఆదివారం తనిఖీ చేశారు. పోలీసు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ పేలుడు సంఘటన కలకలం సృష్టించిన క్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ట్వీట్ చేశారు. ఓడ రైల్వే వంతెనపై పేలుడుతో రైల్వే ట్రాక్ పాడవటం ఆందోళనకర విషయమని, సీనియర్ అధికారులు స్పాట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. వంతెన పునఃనిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. ఈ రైల్వే లైన్‌ను ఈ ఏడాది అక్టోబర్ 31నే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: అమ్మకానికి గ్రామం.. ధర రూ.2.1 కోట్లు.. మరి అంత తక్కువా? -
‘నేను అధ్యక్షునిగా నెగ్గితే సీడబ్ల్యూసీకి ఎన్నికలు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైతే పార్టీని సంస్కరణల బాట పట్టిస్తానని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ప్రకటించారు. ‘పార్టీ నియమావళిలోని ప్రతి నిబంధననూ అమలుచేస్తా. కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహిస్తా. పాతికేళ్లకుపైగా చేష్టలుడిగిన పార్లమెంటరీ బోర్డ్‌కు పునర్వైభవాన్ని తీసుకొస్తా. నిర్ణయాధికారాన్ని వికేంద్రీకరిస్తా. పార్టీకి క్షేత్రస్థాయిలో మూలస్తంభాలైన పధాధికారులకు మరిన్ని అధికారాలు కట్టబెడతా. ఉదయ్‌పూర్ తీర్మానాలను అమల్లోకి తెస్తా’ అని బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను సంస్కరణవాదిని. పార్టీని నడిపే విధానంలో వైవిధ్యం చూపిస్తా. 2024లో బీజేపీని ఢీకొట్టి ఓడించేలా కాంగ్రెస్‌ను పటిష్టపరుస్తా’ అన్నారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అన్నాచెల్లెళ్ల పార్టీ -
రాథోడ్ సాబ్.. నీ కొడుక్కి ధైర్యం ఎక్కువే!
భోపాల్: రైలు పట్టాలపై బీటెక్ కుర్రాడి మృతదేహం పడి ఉండడం, ఈ ఘటనకు ఉదయ్‌పూర్ టైలర్ హత్యోదంతంతో ముడిపడి ఉందన్న కుర్రాడి తండ్రి అనుమానాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ సియోని-మాల్వాకు చెందిన నిషాంక్ రాథోడ్(20).. రాయ్‌సెన్ ఒబయ్‌దుల్లాగంజ్ పట్టణంలో హాస్టల్లో ఉంటూ బీటెక్ మూడో ఏడాది చదువుతున్నాడు. సోదరిని కలుస్తానని చెప్పి హాస్టల్ నుంచి శనివారం బయలుదేరాడు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆమెను కలిసి.. ఆపై తిరిగి హాస్టల్‌కు చేరుకోలేదు. అయితే కాసేపటికే అతని తండ్రికి, ఇతర స్నేహితులు, బంధువులకు అతని ఫోన్ నుంచి ఓ బెదిరింపు మెసేజ్ వెళ్లింది. దీంతో అప్రమత్తమైన నిషాంక్ కుటుంబ సభ్యులు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. అయితే ఆ మరుసటి రోజే సమీపంలోని ఓ రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించాడు నిషాంక్. రైలు మీది నుంచి వెళ్లడంతో అతని శరీరం ఛిద్రమైపోయింది. నిషాంక్ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ తరుణంలో తొలుత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావించారు. Dead body of Nishank Rathore, an engineering student, found on railway track in Bhopal, Madhya Pradesh. A WhatsApp message of "Sar Tan Se Juda" was sent from his mobile to his father & his friends. A story of "Sar Tan Se Juda" was uploaded from his Instagram account. pic.twitter.com/CZOowSw6dr — Anshul Saxena (@AskAnshul) July 25, 2022 అయితే నిషాంక్ తండ్రి ఉమా శంకర్ రాథోడ్.. తన కొడుకు ఫోన్ నుంచి తన ఫోన్‌కు వచ్చిన సందేశాల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు వ్యవహారం మొదలైంది. ‘.. తల వేరు చేయబడింది’ అంటూ ఉంది ఆ సందేశంలో. అంతేకాదు.. ‘రాథోడ్ సార్.. మీ అబ్బాయి చాలా ధైర్యశాలి’ అంటూ ఆ సంభాషణ నడిచింది. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నాడు. Guztakh-e-Nabi ki Ek hi Saja, Sar Tan se Juda అనే మాటల్ని.. ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యలాల్ హత్య టైంలో హంతకులు ఉపయోగించారు. దీంతో తన కొడుకును చంపేసి ఉంటారని మృతుడి కుటుంబం అనుమానిస్తోంది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద ఒంటరిగా కనిపించాడని, అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. చదవండి: హారన్ కొడితే తప్పుకోలేదని.. చెవిటి వ్యక్తిని చంపేసింది -
బీజేపీపై సీఎం గహ్లోత్ సంచలన ఆరోపణలు
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీతో సంబంధాలున్నాయన్నారు. ఈ విషయంపై ఆ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీకి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసు. నిందితుడు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న విషయం ఇటీవలే తెలిసింది. అతను అద్దె కట్టడం లేదని ఆ ఇంటి యజమాని చెప్పారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణ మొదలుపెట్టకముందే బీజేపీ కార్యకర్తలు నిందితుడు తమ వాడని పోలీసులకు చెప్పారు. పార్టీ కార్యకర్త అయినందున అతనికి ఎలాంటి ఇబ్బంది కల్గించవద్దన్నారు' అని గహ్లోత్ అన్నారు. హత్య కేసు నిందితుడిపై పోలీసు కేసు నమోదు కాకుండా ఆపేందుకు కూడా బీజేపీ ప్రయత్నించిందని గహ్లోత్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తే అని పోలీసులకు చెప్పి అతనికి సాయం చేయాలని చూసిందని పేర్కొన్నారు. వీటిపై కమలం పార్టీ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన రియాజ్ అఖ్తారీ.. బీజేపీ నేతలతో దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ఇందులో రాజస్థాన్ ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా కూడా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కమలం పార్టీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తమపై వస్తున్న ఆరోపణలను బీజేపీ ఖండించింది. కాగా, జూన్ 28న జరిగిన ఉదయ్‌పూర్ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మరునాడే కేసు దర్యాప్తును ఎన్ఐఏ తమ చేతుల్లోకి తీసుకుంది. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. చదవండి: Goa: గోవాలో కాంగ్రెస్ ఖాళీ.. బీజేపీతో టచ్‌లో 11 మంది ఎమ్మెల్యేలు! -
Viral Video: ఉదయ్‌పూర్ హత్య కేసు నిందితులపై దాడి
జైపూర్: ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసులో నిందితుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీ విచారిస్తోంది. నిందితులను విచారణలో భాగంగా జైపూర్‌లోని ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. పోలీసులు కోర్టు ప్రాంగణం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది జనాలు పోలీసులను దాటుకొని కోర్టు వెలుపల నిందితులపై దాడికి దిగారు. నిందితులను పట్టుకొని పక్కకు లాగి దాడికి యత్నించారు. ఈ దాడిలో వారి బట్టలు చిరిగిపోయాయి. అయితే వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు అతికష్టం మీద నిందితులను వ్యాన్‌లోకి ఎక్కించి జైలుకు తరలించారు. మరోవైపు కోర్టు నిందితులకు జులై 12 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. కాగా బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన టైలర్ కన్హయ్యను పట్టపగలే ఇద్దరు వ్యక్తులు కత్తితో పొడిచిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి.ఈ కేసులోని ఇద్దరు నిందితులు రియాజ్ అక్తారీ, గౌస్ మొహమ్మద్‌లను 24 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ దావత్ ఎ ఇస్లామీ గ్రూపుతో నిందితులకు సంబంధం ఉన్నట్లు రాజస్థాన్ పోలీసులు అనిమానిస్తున్నారు. చదవండి: కుప్పకూలిన ప్రభుత్వం.. బోసిపోయిన శివసేన కార్యాలయాలు #WATCH | Udaipur murder incident: Accused attacked by an angry crowd of people while being escorted by police outside the premises of NIA court in Jaipur All the four accused were sent to 10-day remand to NIA by the NIA court, today pic.twitter.com/1TRWRWO53Z — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 2, 2022 -
ఉదయ్‌పూర్ ఘటన:.. కన్హయ్యలాల్ కొడుకు ఆవేదన
జైపూర్: ప్రాణ హాని ఉందన్న ఫిర్యాదుపై సకాలంలో అధికారులు స్పందించి ఉంటే.. ఇవాళ తన తండ్రి బతికే ఉండేవాడని కన్హయ్యలాల్ తేలీ కొడుకు యశ్ తేలీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన తండ్రిని చంపిన నరరూప రాక్షసులను ప్రాణాలతో ఉంచకూడదని రాజస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు అతను. ఆ రాక్షసులను జైళ్లో కూర్చోబెట్టి జనాలు పన్నుల రూపంలో చెల్లించే సొమ్ముతో మేపాల్సిన అవసరం లేదు. అలాంటి మృగాలకు ఈ భూమ్మీద బతికే హక్కే లేదు. సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నా కూడా ఇంకా ఎందుకు న్యాయం జరగడంలో ఆలస్యం చేయడం?. వాళ్లను చంపినప్పుడే మాకు మనశ్శాంతి అని యశ్ ఓ ఇంటర్వ్యూలో కామెంట్లు చేశాడు. తన తండ్రి కన్హయ్య, నూపుర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు తెలిపాడన్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియదని, ఏనాడూ తన తండ్రి ఆ విషయం తమ వద్ద ప్రస్తావించలేదని యశ్ తెలిపాడు. కేవలం ప్రాణహాని ఉందన్న విషయం మేరకే ఆయన పోలీసులను ఆశ్రయించాడన్న విషయం మాత్రమే తమకు తెలుసని, ఆ అభ్యర్థనలో ఆయన ఏం పేర్కొన్నాడో తెలియదని యశ్ చెప్తున్నాడు. పోలీసులు సకాలంలో స్పందించి భద్రత కల్పించి ఉంటే.. తన తండ్రి బతికి ఉండేవాడేమో అనే ఆశను వ్యక్తం చేశాడు యశ్. యశ్.. కన్హయ్యలాల్ పెద్ద కొడుకు. పరిహారంగా అతనికి ప్రభుత్వం ఉద్యోగం ప్రకటించింది. ఇప్పుడు ఆ కుటుంబానికి అతనే ఆధారం. ఇదిలా ఉండగా.. రాజస్థాన్ ఉదయ్‌పూర్ భూత్ మహల్ ఏరియాలో టైలర్ కన్హయ్యలాల్.. రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్‌లు పైశాచికతంగా చంపేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నూపుర్‌కు ప్రవక్త వ్యాఖ్యలకు మద్ధతు తెలిపినందుకే చంపామంటూ ఆపై నిందితులు ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఉగ్ర కోణం వెలుగు చూడడంతో ఎన్ఐఏ వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. చదవండి: ఉదయ్‌పూర్ హత్యోదంతం: ఎక్స్ట్రా డబ్బులుచ్చి మరీ.. -
దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే
దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్యత వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి – సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు నోటిపై ఆదుపు లేకపోవడం వల్ల దేశం మొత్తం అగ్ని గోళంగా మారే పరిస్థితి వచ్చిందని సుప్రీంకోర్టు మండిపడింది. దేశంలో జరిగిన పరిణామాలకు ఆమె ఒక్కరే బాధ్యురాలని తేల్చిచెప్పింది. నిరసనలు, హింసాత్మక ఘటనలు, అల్లర్లకు దారితీసేలా మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. చీఫ్ పబ్లిసిటీ, రాజకీయ అజెండా లేదా నీచమైన ఎత్తుగడల కోసమే ఇలాంటి మాటలు మాట్లాడినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై, హైదరాబాద్, శ్రీనగర్ తదితర నగరాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఒక్కటిగా కలిపేసి, ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నిరాకరించింది. జాతీయ పార్టీకి అధికార ప్రతినిధి అయినంత మాత్రాన దేశంలో అశాంతికి కారణమయ్యేలా మాట్లాడే అధికారం ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు మతాలను గౌరవించరని, రెచ్చగొట్టేలా ప్రకటనలు మాత్రమే చేస్తారని ఆక్షేపించింది. ‘‘దేశమంతటా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా నూపుర్ శర్మ మాట్లాడారు. అందుకు ఆమెనే బాధ్య త వహించాలి. ఆమెకు ముప్పా? లేక ఆమె దేశ భద్రతకు ముప్పుగా మారారా? టీవీలో జరిగిన చర్చను చూశాం. న్యాయవాది అని ఆమె చెప్పుకోవడం సిగ్గుచేటు. దేశానికి నూపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి’’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది. నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల చర్చను హోస్ట్ చేసిన టీవీ ఛానల్‌పైనా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘టీవీ చర్చ దేనికి? కేవలం ఒక అజెండాను ప్రమోట్ చేయడం కోసమేనా? కోర్టు పరిధిలోని అంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు?’’అని నిలదీసింది. అధికారం ఉంది కదా! అని ఏదైనా మాట్లాడొచ్చని ఆమె అనుకుంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నలకే నూపుర్ సమాధానం ఇచ్చారని ఆమె తరఫు న్యాయవాది మణీందర్ సింగ్ చెప్పారు. అలాగైతే యాంకర్‌పై నూపుర్ శర్మ ఫిర్యాదు చేసి ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. టీవీల్లో వివాదాస్పద ప్రకటనలు చేస్తూ దేశవ్యాప్తంగా భావోద్వేగాలు రగిలించే రాజకీయ ప్రతినిధి స్వేచ్ఛతో జర్నలిస్టు స్వేచ్ఛను పోల్చలేమని వ్యాఖ్యానించింది. ఉదయ్‌పూర్‌లో జరిగిన టైలర్ హత్యను ధర్మాసనం ప్రస్తావించింది. తదుపరి పరిణామాల గురించి ఆలోచించకుండా నూపుర్ శర్మ నోటి దురుసుతో బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టింది. ఆమెలోని అహంకారం పిటిషన్లో కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. క్షమాపణలు చెబుతూ నూపుర్ రాసిన లేఖను న్యాయవాది మణీందర్ సింగ్ ప్రస్తావించారు. ధర్మాసనం స్పందిస్తూ.. టీవీ ఛానల్‌కు వెళ్లి ఆమె క్షమాపణలు చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంలో చాలా జాప్యం జరిగిందని, ప్రజల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో షరతులతో వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని సూచించింది. ‘‘నూపుర్ కేసులు పెట్టిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేశారు. కానీ, నూపుర్‌పై నమోదైన కేసుల్లో ఆమెను అరెస్టు చేయలేదు. అదే ఆమె పలుకుబడిని సూచిస్తోంది’’అని ధర్మాసనం తెలిపింది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ ఆరెస్టు చేయకపోవడంతో బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని వెల్లడించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు తన పిటిషన్‌ను నూపుర్ ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. బీజేపీ సిగ్గుతో ఉరేసుకోవాలి .. ప్రతిపక్షాల ఆగ్రహం నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో ద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు నూపుర్‌శర్మ ఒక్కరే కాదు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కారణమని దుయ్యబట్టారు. సర్కారు తీరు దేశ ప్రయోజనాలకు, ప్రజా ప్రయోజనాలు విరుద్ధంగా ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక సిగ్గుతో ఉరేసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సరైన విధంగా స్పందించిందని చెప్పారు. నూపర్ శర్మపై చట్టప్రకారం చర్యలు తీసుకోకపోతే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌నుంచి అలాంటి వారు మరికొందరు పుట్టకొచ్చే ప్రమాదం ఉందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. నూపర్పై వ్యాఖ్యలను ధర్మాసనం ఉపసంహరించుకోవాలి : సీజేఐకి అజయ్ గౌతమ్ లెటర్ పిటిషన్ బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త అజయ్ గౌతమ్ కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఒక లెటర్ పిటిషన్ సమర్పించారు. నూపర్ విషయంలో చేసిన వ్యాఖ్యలను వెకేషన్ బెంచ్ ఉపసహరించుకొనేలా తగిన ఆదేశాలుల లేదా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆమెపై పారదర్శకంగా విచారణ జరిగే అవకాశం ఉంటుందని అభ్యర్థించారు. తన లెటర్ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాలని విన్నవించారు. నూపర్పై వెకేషన్ బెంచ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అవాంఛనీయమని అజయ్ గౌతమ్ పేర్కొన్నారు. చదవండి: ఉదయ్‌పూర్ ఘటనను ఖండించిన దీదీ.. నూపుర్‌కు పరోక్ష హెచ్చరికలు -
ఉదయ్‌పూర్ హత్య నిందితులకు పాక్ ఉగ్ర సంస్థతో సంబంధాలు!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ హత్య వెనక పాక్ ఉగ్ర ముఠా హస్తం ఉందనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రకోణం నేపథ్యంలో కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించింది. తాజాగా ఈ కేసులోని ఇద్దరు నిందితుల్లో ఒకరికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేసే సున్నీ ఇస్లామిస్ట్ సంస్థ అయిన దావత్-ఎ-ఇస్లామి అనే సంస్థతో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉగ్ర సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలకు బలం చేకూరేలా.. ఇద్దరు నిందితుల్లో ఒకరు 2014 కరాచీలోని పాక్ తీవ్రవాద సంస్థ దావత్-ఎ- ఇస్లామీకి వెళ్లినట్లు రాజస్థాన్ డీజీపీ ఎంఎల్ లాథర్ పేర్కొన్నారు. ఈ గ్రూప్ వ్యక్తులు కాన్పూర్‌లో చూరుకుగా ఉన్నారని, ఢిల్లీ, ముంబైలలో ఈ సంస్థ కార్యాలయాలు ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా నిందితులిద్దరు మహ్మద్ రియాజ్, గౌస్ మహ్మద్లపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డిజిటల్ ఆధారాలను కూడా తనిఖీ చేస్తున్నామని డీజీపీ లాథర్ వెల్లడించారు. చదవండి: ఉదయ్‌పూర్ ఘటన; భయపడినట్టుగానే జరిగింది కాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్‌ను ఇద్దరు దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకు ఉదయ్‌పూర్‌లో ఒక టైలర్‌ను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. హత్యను కెమెరాలో రికార్డ్ చేసి.. తామే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు హంతకులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కన్హయ్య లాల్‌ను హత్య చేసిన హంతకులు గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు. మొత్తం ఉదయ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించడంతోపాటు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కాగా మృతుడు కన్హయ్య కుటుంబానికి రూ.31 లక్షల పరిహారంతోపాటు ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయ్‌పూర్‌లో పరిస్థితి అదుపులో ఉన్నట్లు వెల్లడించింది. చదవండి: ఉదయ్‌పూర్ ఘటన: ఖబడ్దార్.. కన్హయ్యను చంపినట్లే చంపుతాం! -
ఉదయ్‌పూర్ ఘటన; భయపడినట్టుగానే జరిగింది
ఉదయ్‌పూర్: తన భర్త భయపడినట్టుగానే జరిగిందని రాజస్థాన్ టైలర్ కన్హయ్యా లాల్ తెలి భార్య జశోద తెలిపారు. ప్రాణభయంతో గత వారం రోజుల నుంచి తన భర్త దుకాణానికి వెళ్లడం లేదని వెల్లడించారు. అంత్యక్రియలకు ముందు బుధవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏడు రోజుల తర్వాత తిరిగి షాపునకు వెళ్లిన తన భర్తను దుండగులు దారుణంగా హత్యచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 18, 21 వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి భవిష్యత్‌పై బెంగగా ఉందని జశోద వాపోయారు. 48 ఏళ్ల కన్హయ్యా లాల్ మంగళవారం ఉదయ్‌పూర్‌లోని తన దుకాణంలో దారుణ హత్యకు గురయ్యారు. కస్టమర్లలా వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిని చంపేశారు. మహ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించినందుకు కన్హయ్యా లాల్‌ను హత్య చేశారు. అయితే ఈ వివాదంలో కన్హయ్యా లాల్‌ను జూన్ 10న అరెస్ట్ చేసినట్టు రాజస్థాన్ పోలీసులు తెలిపారు. చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని అతడు జూన్ 15న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, కన్హయ్యా లాల్‌పై ఫిర్యాదుచేసిన వారితో పోలీసులు చర్చలు జరపడంతో పరిస్థితి సద్దుమణిగినట్టు కనబడింది. దీంతో తనకు పోలీసుల సహాయం అవసరం లేదని కన్హయ్యా లాల్ రాతపూర్వకంగా పేర్కొన్నాడు. నాకూ బెదింపులు వస్తున్నాయి: జిందాల్ తనకు కూడా దుండగుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని బీజేపీ బహిష్కృత నాయకుడు నవీన్ కుమార్ జిందాల్ బుధవారం వెల్లడించారు. ‘ఈ ఉదయం 6.43 గంటలకు నాకు మూడు ఈమెయిల్స్ వచ్చాయి. కన్హయ్య లాల్ గొంతు కోసిన వీడియో కూడా అందులో జతచేశారు. నన్ను, నా కుటుంబాన్ని బెదిరించారు. పోలీసులకు సమాచారమిచ్చాన’ని నవీన్ కుమార్ జిందాల్ హిందీలో ట్వీట్ చేశారు. (క్లిక్: ఉదయ్‌పూర్ టైలర్ హత్యలో ఉగ్రకోణం?) -
ఆమెను వదిలే ప్రసక్తే లేదు.. దీదీ ఆగ్రహం
కోల్‌కతా: ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్ర వాదం ఎంతైనా ఆమోదయోగ్యం కాదు! ఉదయ్‌పూర్‌లో జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం తన పని చేసుకుని పోతుంది. కాబట్టి, శాంతిని కాపాడాలంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారామె. ఇదిలా ఉంటే.. మంగళవారం అసన్సోల్లో జరిగిన పార్టీ సమావేశంలో పేరు ప్రస్తావించకుండానే బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై దీదీ మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీది మొత్తం తప్పుడు, ఫేక్ ప్రచారం నడిపిస్తోందంటూ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘నేను సోషల్ నెట్‌వర్క్‌లకు అనుకూలం. నిజాలు మాట్లాడే వారి పక్షాన నేను ఉంటా. కానీ, బీజేపీ సోషల్ నెట్వర్క్ మొత్తం ఫేక్‌మయం. మోసం చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ సోషల్ మీడియా దిట్ట. వాళ్ల దగ్గర చాలా డబ్బు ఉంది. అందుకే సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ లోనూ అబద్ధాలాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. మతపరంగా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన ఓ నేతను(నూపుర్‌ను ఉద్దేశించి).. కనీసం అరెస్ట్ కూడా చేయనివ్వడం లేదు. ఈ వ్యవహారంలో బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటోంది. వాళ్లు చంపితే.. ఎవరూ మాట్లాడొద్దు. అదే వేరే ఎవరైనా మాట్లాడితే చాలూ.. హంతకులైపోతారా?. జుబేర్(ఆల్ట్ న్యూస్) ఏం చేశాడు? తీస్తా ఏం చేశారు?.. మీ దగ్గర ఉన్న వ్యక్తుల పేర్లు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ, వాళ్లు మతాన్ని కించపరుస్తున్నా.. గట్టి భద్రత ఇస్తున్నారు. మేం అలా కాదు. ఆమెకు సమన్లు ఇచ్చాం. అసలు వదిలే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుని తీరతాం అంటూ మండిపడ్డారు ఆమె. మొహమ్మద్ ప్రవక్త గురించి వ్యాఖ్యలతో నూపుర్ శర్మ.. విమర్శలు, కేసులు ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి కూడా. జూన్ 20వ తేదీన ఆమె కోల్‌కతా పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే దాడులు జరుగుతాయేమోననే భయంతో ఆమె బయటకు రావడం లేదు. ఇప్పటికే ముంబై పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టగా.. కోల్‌కతా పోలీసుల సమన్లకు మెయిల్ ద్వారా స్పందించారు ఆమె. తనకు ప్రాణ భయం ఉందంటూ నాలుగు వారాల గడువు కోరింది నూపుర్ శర్మ. Violence and extremism are UNACCEPTABLE, no matter what! I STRONGLY CONDEMN what happened in Udaipur. As law takes its own course of action, I urge everyone to maintain peace. — Mamata Banerjee (@MamataOfficial) June 29, 2022 -
ఉదయ్‌పూర్ ఘటన: ఖబడ్దార్.. కన్హయ్యను చంపినట్లే చంపుతాం!
ఢిల్లీ: రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యల కలకలం.. ఆమెకు మద్దతుగా కన్హయ్య చేసిన పోస్ట్... చివరికి అతని దారుణ హత్యకు దారి తీసింది. ఈ తరుణంలో.. బీజేపీ సస్పెండెడ్ నేత నవీన్ కుమార్ జిందాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ మేరకు ఈ ఉదయం మూడు బెదిరింపు ఈ-మెయిల్స్‌తో పాటు కన్హయ్యను చంపిన ఘటన తాలుకా వీడియోను ఎటాచ్ చేసి మరీ ఆయనకు పంపించారు దుండగులు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసిన నవీన్‌కుమార్ జిందాల్.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తూ ట్వీట్లో ట్యాగ్ చేశారు. నూపుర్ వ్యాఖ్యల టైంలోనే మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ నవీన్‌కుమార్ జిందాల్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. అది దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత నవీన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు సైతం నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా.. కన్హయ్య లాల్‌ను చంపుతూ ఈ వీడియోను షూట్ చేసిన అక్తర్, గౌస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం మరో సెల్ఫీ వీడియోలో కత్తులో ప్రధాని మోదీని సైతం చంపుతామంటూ వాళ్లు బెదిరించారు నిందితులు. అయితే హత్య వీడియోతో పాటు సదరు బెదిరింపుల వీడియో వైరల్ అవుతుండగా.. వాటిని సర్క్యులేట్ చేయొద్దంటూ రాజస్థాన్ పోలీసులు, ఆ రాష్ట్ర సీఎం విజ్ఞప్తి చేస్తున్నారు. आज सुबह क़रीब 6:43 बजे मुझको तीन ईमेल आयी है, जिसमें #उदयपुर में भाई कन्हैया लाल की गर्दन काटने का विडियो अटैच करते हुए मेरी और मेरे परिवार की भी ऐसी गर्दन काटने की धमकी दी गई है मैंने PCR को सूचना दे दी है।@DCPEastDelhi @CellDelhi @CPDelhi तुरंत संज्ञान ले। pic.twitter.com/rhzyLbbdNg — Naveen Kumar Jindal 🇮🇳 (@naveenjindalbjp) June 29, 2022 చదవండి: అచ్చం ఐసిస్ తరహాలో గొంతు కోసి.. -
ఉదయ్‌పూర్ హత్య: రాజస్థాన్‌లో నెలపాటు 144 సెక్షన్
జైపూర్: మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కన్హయ్య లాల్ అనే వ్యక్తిపై.. అతని దుకాణంలోనే ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మాల్దాస్‌లో మంగళవారం జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్‌గా గుర్తించారు. రియాజ్ గొంతు కోయగా.. గౌస్ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. మరోవైపు సీఎం అశోక్‌గెహ్లాట్ సహా పోలీస్ శాఖ నిందితుల వీడియోలను వైరల్ చేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కోరుతున్నారు. ఈ ఉదంతంపై నిరసనలు, మతపరమైన ఉద్రిక్తతలతో ఉదయ్‌పూర్‌తో పాటు రాజస్తాన్ అంతా అట్టుడికింది. పలు ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించడం లాంటి ఘటనలు జరిగాయి. ఉద్రిక్తతలు పెరగడంతో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. బుధవారం మొత్తం ఇంటర్నెట్ పని చేయదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెలపాటు 144 సెక్షన్ విధించారు. ఘటనకు సంబంధించిన వీడియో సర్క్యులేట్ కాకుండా చూస్తున్నారు. సంయమనం పాటించాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్‌కు కేంద్ర హోం శాఖ హుటాహుటిన ఎన్ఐఏ బృందాన్ని పంపింది. కస్టమర్లలా వచ్చి... మృతుడు కన్హయ్యా లాల్ ఉదయ్‌పూర్‌లో టైలర్. హంతకులు రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్ బట్టలు కుట్టించుకునే సాకుతో మంగళవారం మధ్యాహ్నం మాల్దాస్‌లోని దాన్ మండీలో ఉన్న అతని దుకాణంలోకి ప్రవేశించారు. కొలతలు తీసుకుంటుండగా రియాజ్ కత్తి తీసి కన్హయ్య మెడపై వేట్లు వేశాడు. దీన్నంతా గౌస్ తన మొబైల్లో వీడియో తీశాడు. వెంటనే ఇద్దరూ అక్కణ్నుంచి పారిపోయారు. ఈ దారుణంపై స్థానిక దుకాణదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా వారంతా దుకాణాలు మూసేశారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే యూఐటీ ప్రకారం.. కన్హయ్య లాల్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఐదు లక్షల నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్తున్నారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా కన్హయ్య ఎనిమిదేళ్ల కుమారుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా దాన్ని కన్హయ్య సమర్థించినట్టు చెబుతున్నారు. ఈ ఉదంతంలో ఆయనను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. కన్హయ్యను చంపుతామంటూ జూన్ 17న తీసిన వీడియోను కూడా హంతకులు మంగళవారమే సోషల్ మీడియాలో పెట్టారు. తమ వర్గం వారు ఇలాంటి దాడులను ఉధృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. అక్తర్ స్థానిక మసీదులో పని చేస్తుండగా.. గౌస్ కిరాణా దుకాణం నడుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్యేనని ఉదయ్‌పూర్ ఎస్పీ మనోజ్‌కుమార్ చెప్పారు. రక్షణ కోరినా పట్టించుకోలేదు.. మృతుడు పోలీసు రక్షణ కోరినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని బీజేపీ ఆరోపించింది. రాజస్తాన్‌లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీశ్ పునియా ఆరోపించారు. ‘‘హంతకులు కత్తులు చేతబట్టి నేరుగా ప్రధానినే చంపుతామని బెదిరిస్తూ వీడియోలు పోస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పెను సవాలు’’ అని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్‌కుమార్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మొదలుకుని పలువురు నేతలు హత్యను ఖండించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంబంధిత వార్త: షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే.. -
నూపుర్ శర్మ ఫొటో షేర్ చేసినందుకు షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే
Udaipur Gruesome Murder: జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బహిష్కృత బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన కన్హయ్య లాల్ అనే టైలర్ హత్యకు గురయ్యాడు. టైలర్ తన దుకాణంలో పనిలో ఉండగా లోనికి ప్రవేశించిన ఇద్దరు దుండగులు బుధవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే తల్వార్లతో దాడి చేసి హతమార్చారు. అంతేకాకుండా ప్రధాని మోదీ, నూపుర్ శర్మ ప్రాణాలు కూడా తీస్తామంటూ కత్తులు చూపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా బెదిరించారు. టైలర్ హత్యోదంతంతో ఉదయ్‌పూర్‌లోని మల్డాస్ ప్రాంతంలో ఉద్రిక్తలు చెలరేగాయి. స్థానికులు దుకాణాలను మూసేశారు. హత్య ఘటనను నిరసిస్తూ వందలాది మంది రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు. ఈఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు. టైలర్ హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో పోలీసులు మోహరించారు. 24 గంటలపాటు నగరంలో ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేశారు. నూపుర్ శర్మకు మద్దతుగా టైలర్ ఎనిమిదేళ్ల కొడుకు గతంతో ఆమె ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. మరోవైపు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పారిపోతున్న నిందితులను రాజ్‌సమంద్ జిల్లాలోని భీం ప్రాంతంలో పట్టుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. చదవండి👇 వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే? ఉపాధ్యాయుడి హత్య: భార్యే హంతకురాలు.. వివాహేతర సంబంధంతో.. -
Congress Chintan Shivir: సోషల్ ఇంజనీరింగ్
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అంతర్గత ప్రక్షాళన దిశగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై కాంగ్రెస్ లోతుగా మల్లగుల్లాలు పడుతోంది. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న చింతన్ శిబిర్‌లో శనివారం రెండో రోజు పార్టీ మథనం సుదీర్ఘంగా కొనసాగింది. అంశాలవారీగా అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేసిన ఆరు కమిటీలు రోజంతా చర్చలు జరిపాయి. సమాజంలో అన్ని వర్గాలకూ మళ్లీ చేరువ కావాలంటే పార్టీలో సోషల్ ఇంజనీరింగ్‌కు తెర తీయడమే మార్గమని సామాజిక, న్యాయ కమిటీ అభిప్రాయపడింది. ఇందుకోసం పార్టీ విభాగాల్లో అన్ని స్థాయిల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం కేటాయించాలని దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ఒక నేతను రాజ్యసభకు గరిష్టంగా రెండుసార్లు మాత్రమే నామినేట్ చేయాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. కొన్నేళ్లుగా అసమ్మతి గళం విన్పిస్తున్న సీనియర్ నేతల ప్రధాన డిమాండ్ అయిన కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీని రద్దుకు, దాని స్థానంలో పార్లమెంటరీ బోర్డు ఏర్పాటుకు కూడా అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతుండటం మరో కీలక పరిణామం. సామాజిక న్యాయంపై మథనం కాంగ్రెస్‌లో సామాజిక న్యాయ సలహా మండలి ఏర్పాటు చేయాలని సామాజిక న్యాయ కమిటీ అధిష్టానానికి సిఫార్సు చేసింది. పార్టీలో బూత్ స్థాయి నుంచి డీసీసీ, పీసీసీ, ఏఐసీసీ, సీడబ్ల్యూసీ దాకా అన్ని విభాగాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు ప్రస్తుతమున్న 20 శాతం రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళా రిజర్వేషన్‌కు పట్టుబట్టడంతో పాటు ఆ కేటగిరీకి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నైష్పత్తికంగా రిజర్వేషన్లను వర్తింపజేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించింది. కులాలవారీ జనగణన జరపాలని కూడా కోరాలని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పునరుద్ధరించడంతో పాటు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించింది. కమిటీ చర్చల వివరాలు, సిఫార్సులను కన్వీనర్ సల్మాన్ ఖుర్షీద్, సభ్యుడు కొప్పుల రాజు శనివారం సాయంత్రం మీడియాకు వివరించారు. సామాజిక న్యాయ వ్యవహారాలపై రూపొందించాల్సిన విధానాలను సూచించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల నమ్మకాన్ని చూరగొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై పార్టీ చీఫ్‌కు మండలి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీల్లో ఇప్పటిదాకా సరైన ప్రాతినిధ్యం దక్కని పలు ఉప కులాలను గుర్తించే ప్రక్రయను పార్టీపరంగా చేపట్టనున్నట్టు రాజు చెప్పారు. చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయనున్నామన్నారు. జీఎస్టీ పరిహారం మరో మూడేళ్లు కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జీఎస్టీ పరిహారాన్ని మరో మూడేళ్లు పొడిగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంబంధాలపై సమగ్ర సమీక్షకు సమయం ఆసన్నమైందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రస్ ఆర్థిక రంగ ప్యానల్ కన్వీనర్ చిదంబరం అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. ‘‘మోదీ సర్కారు పాలనలో ఎనిమిదేళ్లుగా వృద్ధి రేటు కింది చూపే చేస్తోంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మరింతగా పెరిగాయి. పెట్రో ధరల పెరుగుదల తదితరాలు సమస్యలకు ఆజ్యం పోస్తున్నాయి. జీఎస్టీ చట్టాలను మోదీ స్కరారు పేలవంగా రూపొందించి, అన్యాయంగా అమలు చేయడమే ఇందుకు కారణం. రాష్ట్రాల ఆర్థిక స్థితి మునుపెన్నడూ లేనంత బలహీనంగా మారింది. తక్షణ పరిష్కార చర్యలు అవసరం’’ అని డిమాండ్ చేశారు. అన్ని అంశాల పైనా ఆర్థిక ప్యానల్ చర్చించినట్టు చెప్పారు. ‘‘అంతర్జాతీయ పరిణామాలూ దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచాయి.వాటిని ఎదుర్కొనే మార్గాలపై కేంద్ర ప్రభుత్వానికి అవగాహన లేక సమస్య మరింత తీవ్రతరమవుతోంది. కేవలం గత 7 నెలల్లో 22 బిలియన్ డాలర్లు దేశం నుండి బయటికి వెళ్లిపోయాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు 36 బిలియన్ డాలర్ల మేర క్షీణించాయి. రూపాయి విలువ ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది’’ అంటూ దుయ్యబట్టారు. వీటిపై అంశాలవారీగా కేంద్రాన్ని కాంగ్రెస్ నిలదీస్తుందన్నారు. ఆటోమేషన్, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరిశ్రమ, వ్యాపారం, వాణిజ్య రంగాలకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ, శ్రామిక శక్తిని సిద్ధం చేయాలని కాంగ్రెస్ విశ్వసిస్తోందని చెప్పారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రియాంక? కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపనున్నట్టు సమాచారం. మరోవైపు, రాహుల్ ఇష్టపడని పక్షంలో ప్రియాంకను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించాలని చింతన్ శిబిర్ వద్ద పలువురు నేతలు కోరారు. శనివారమంతా నేతలు దీనిపై జోరుగా చర్చించుకున్నారు. త్వరలో జన్ అభియాన్2 ఏఐసీసీ నేతలతో సోనియా చర్చలు కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు జన్ జాగరణ్ అభియాన్ రెండో దశ నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. చింతన్ శిబిర్‌లో భాగంగా పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీలతో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జన్ జాగరణ్ అభియాన్‌తో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై నేతల అభిప్రాయాలు కోరారు. ఈ భేటీలో వచ్చిన ప్రతిపాదనలపై ఆదివారం చింతన్ శిబిర్ మూడో రోజు సీడబ్ల్యూసీ కీలక భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. జన్ జాగరణ్ అభియాన్ తొలి దశను 2021 నవంబర్ 14–29 మధ్య దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టడం తెలిసిందే. -
Congress Chintan Shivir: ఒక కుటుంబం.. ఒకే టికెట్
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: భవిష్యత్ ఎన్నికల్లో ‘ఒక కుటుంబం, ఒకే టిక్కెట్’ నిబంధనను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఒక కుటుంబం నుంచి రెండో టికెట్ ఆశించే వ్యక్తి కనీసం ఐదేళ్లపాటు పార్టీ కోసం అంకితభావంతో పనిచేసి ఉండాలి. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ శుక్రవారం ప్రారంభమైంది. పార్టీలో మార్పు తీసుకొచ్చే దిశగా నేతలు మథనం సాగిస్తున్నారు. ‘ఒక కుటుంబం.. ఒకే టిక్కెట్’ సహా అనేక నియమాలను ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో ఆమోదించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ నిబంధన, మినహాయింపు ఫార్ములా గాంధీ కుటుంబంతో సహా పార్టీ శ్రేణులందరికీ వర్తిస్తుందని రాజస్తాన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తెలిపారు. ఈ నిబంధనపై పార్టీలో దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. ఐదేళ్ల తర్వాత ఎవరినీ పార్టీ పదవి కొనసాగించకూడదని, మళ్లీ అదే పోస్టు కోరితే కనీసం మూడేళ్లు కూలింగ్ పీరియడ్‌లో ఉంచాలన్న అంశాలపై చింతన్ శిబిర్‌లో చర్చ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అన్ని స్థాయిల్లో పరివర్తనాత్మక మార్పు కాంగ్రెస్‌లో ప్రతి స్థాయిలో ఉన్న పార్టీ కమిటీల్లో 50 ఏళ్లలోపు వారికి 50 శాతం (ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ) పదవులు కేటాయించాలనే ప్రతిపాదన సైతం పార్టీ పెద్దల పరిశీలనలో ఉంది. పార్టీలో ఎలాంటి పని చేయనివారి పిల్లలు, బంధువులకు టికెట్లు ఇవ్వొద్దన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ రాజకీయ ప్యానెల్ సభ్యుల మధ్య దాదాపు పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తమయ్యింది. పార్టీ ఆఫీస్ బేరర్ల పనితీరును పర్యవేక్షించేందుకు ‘అసెస్మెంట్ వింగ్’ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు, ఎన్నికలకు సమాయత్తం కావడానికి సర్వేలు చేసేందుకు ‘ప్రజా అంతర్దృష్టి విభాగం’ ఏర్పాటుపై సమాలోచనలు జరుగుతున్నాయి. పార్టీలో బూత్, బ్లాక్ స్థాయిల మధ్య మండల కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒక్కో మండల కమిటీలో 15–20 బూత్‌లు ఉంటాయి. బ్లాక్ కాంగ్రెస్ కమిటీలో 3–4 మండలాలు ఉంటాయి. చింతన్ శిబిర్ కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్స్ చేసిన సూచనలను ఆమోదించిన తర్వాత పార్టీలో అన్ని స్థాయిల్లో పరివర్తనాత్మక మార్పు కనిపించనుందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. చింతన్ శిబిర్‌లో మొదటి రెండు రోజులు చర్చలు సాగుతాయి. చివరి రోజు తీర్మానం చేస్తారు. ఈ తీర్మానం ముసాయిదాపై అదే రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చిస్తారు. సెల్ ఫోన్లకు అనుమతి లేదు! ఉదయ్‌పూర్‌లోని తాజ్ ఆరావళి రిసార్ట్‌లో జరుగుతున్న నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో దాదాపు 450 మంది నేతలు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి రైలులో ఉదయ్‌పూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి నేతలు, కార్యకర్తలు రాజస్థానీ సంప్రదాయ స్వాగతం పలికారు. చర్చల వివరాలు బయటికి పొక్కకుండా మొబైల్ ఫోన్లను హాల్ బయట డిపాజిట్ చేసిన తర్వాతే నేతలను లోపలికి అనుమతించారు. వేదిక వద్ద మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సహా కాంగ్రెస్ దిగ్గజాల పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తెలుగు నేతల సందడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు కాంగ్రెస్ నేతలు చింతన్ శిబిర్కు హాజరయ్యారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తదితరులు పాల్గొన్నారు. -
Nav Sankalp Chintan Shivir: తక్షణ ప్రక్షాళన
ఉదయ్‌పూర్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: నాయకులకు కాంగ్రెస్ ఎంతో చేసిందని, అలాంటి వారంతా రుణం తీర్చుకొనే సమయం అసన్నమైందని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులంతా అవసరమైతే త్యాగాలు చేసి, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో ఆమె స్వాగతోపన్యాసం చేవారు. నాయకులు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తీకరించడం చాలా అవసరమని అన్నారు. అయితే సంస్థ బలం, దృఢ సంకల్పం, ఐక్యతలకు సంబంధించి కేవలం ఒక సందేశం మాత్రమే బయటకు వెళ్లాలని ఆదేశించారు. ప్రస్తుతం పార్టీ ముందు ఉన్న అసాధారణ పరిస్థితులను అసాధారణ మార్గాల్లో మాత్రమే పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌లో సంస్కరణల అవసరం చాలా ఉందని స్పష్టం చేశారు. పార్టీని సంస్కరించక తప్పదని ఉద్ఘాటించారు. వ్యూహాత్మక మార్పు, నిర్మాణాత్మక సంస్కరణలు, రోజువారీ పని చేసే విధానంలో మార్పు వంటివి ఇప్పుడు అవసరమైన అత్యంత ప్రాథమిక అంశాలు అని తెలిపారు. సమష్టి కృషితోనే పార్టీ అభ్యున్నతి సాధ్యమవుతుందని, ఇకపై ఈ ప్రయత్నాలను వాయిదా వేయలేమని సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఆత్మపరిశీలన చేసుకుంటున్నాం.. గత కొంతకాలంగా ఎదురవుతున్న వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకుంటోందని, అలాగే పార్టీ ఎదుర్కోవాల్సిన పోరాటాలు, సవాళ్లు తమకు గుర్తున్నాయని సోనియా తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తమకు పూర్తిగా తెలుసని అన్నారు. దేశ రాజకీయాల్లో గతంలో పోషించిన కీలక పాత్రలోకి కాంగ్రెస్‌ను తీసుకొచ్చేందుకు, పార్టీని దేశ ప్రజలు ఆశిస్తున్న పాత్రలోకి మార్చేందుకు అవసరమైన ప్రతిజ్ఞ చేయడానికి నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపై చింతన్ శిబిర్‌లో ఆత్మపరిశీలన చేసుకుంటున్నామని వివరించారు. ఇక్కడి నుంచి బయలుదేరే సమయానికి ప్రతి ఒక్కరూ నూతన విశ్వాసం, నిబద్ధతతో స్ఫూర్తిని పొందేలా సిద్ధం కావాలని కోరారు. రాజకీయ ప్రత్యర్థులే బీజేపీ టార్గెట్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దేశంలో భయం, అభద్రతా వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని సోనియా గాంధీ ఆరోపించారు. మైనార్టీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మతం పేరుతో ఏకీకరణ జరుగుతోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా మార్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను తిరగరాయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ చేసిన కృషిని, త్యాగాన్ని క్రమపద్ధతిలో తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మహాత్మా గాంధీని పొట్టనపెట్టుకున్న హంతకుడిని కీర్తిస్తూ గాంధీ సిద్ధాంతాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో సాంప్రదాయ విలువలు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసీలు, మహిళల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. దేశవ్యాప్తంగా భయానక వాతావరణం ఏర్పడుతోందని సోనియా గాంధీ వాపోయారు. ఇల్లు చక్కదిద్దుకున్నాకే పొత్తులపై చర్చ: ఖర్గే ‘‘మేం ముందు సొంతింటిని చక్కదిద్దుకోవాల్సి ఉంది. పొత్తులు తదితరాలపై ఆ తర్వాతే దృష్టి సారిస్తాం’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేకుంటే చేతులు కలిపేందుకు ఎవరు ముందుకొస్తారు? అందుకే పార్టీపరంగా లోపాలను సరిదిద్దుకుని బలోపేతం కావడంపైనే ముందుగా దృష్టి పెడతాం. మా నాయకులు మరింత చురుగ్గా, శక్తిమంతులుగా తయారవాలి’’ అన్నారు. శుక్రవారం ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న పార్టీ చింతన్ శిబిర్‌లో ఆయన మాట్లాడారు. -
Congress Chintan Shivir: ప్రారంభమైన కాంగ్రెస్ చింతన్ శిబిర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ చింతన్ శిబిర్ (కాంగ్రెస్ నవ సంకల్ప్ శిబిర్) ప్రారంభమైంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మేధోమథన సదస్సు జరగనుంది. కాంగ్రెస్‌లో భారీ మార్పులను తేనున్నట్లు ఆశిస్తున్న ఈ శిబిర్.. రాజస్థాన్ ఉదయ్‌పూర్ వేదికగా జరుగుతోంది. కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలనే దానిపై నేతల మేధోమథనం చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేయనుండగా, 15వ తేదీన రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. ఈ శిబిర్‌లో మిషన్ 2024 కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. వరుస ఎన్నికల పరాజయాలతో నిరాసక్తతతో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తేవడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నిర్వహిస్తోంది. వివిధ విభాగాల అధిపతులు, ఆఫీస్ బేరర్లు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు కలిపి మొత్తం 422 మంది సభ్యులు పాల్గొననున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సంస్థాగత, వ్యవసాయ సమస్యలు, అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై రోడ్‌మ్యాప్ సిధ్దం చేయనున్నారు. అంతేకాదు యాభై ఏళ్లలోబడిన వాళ్లకు సీడబ్ల్యూసీ సహా అన్నింటా ప్రాధాన్యంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చే అంశంపైనా ప్రధానంగా చర్చ జరగనుంది. ఒక కుటుంబం-ఒక్కటే టికెట్ చింతన్ శిబిర్ వేదికగా కాంగ్రెస్ కీలక సంస్కరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబం-ఒక్కటే టికెట్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒక కుటుంబంలో రెండో వ్యక్తికి టికెట్ రావాలంటే ఐదేళ్లకు పైగా పార్టీలో యాక్టివ్‌గా ఉండాలని రూల్. అంతేకాదు పార్టీ పదవిలో ఐదేళ్లకు మించి కొనసాగరాదని నిబంధనపై సంకేతాలు ఇచ్చారు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అజయ్ మాకెన్. నిబంధనల నుంచి గాంధీ కుటుంబానికి వెసులు బాటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
Congress Party: ‘హస్త’ వాసి మారేనా?
సాక్షి, న్యూఢిల్లీ: వరుస ఎన్నికల పరాజయాలతో నిరాసక్తతతో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తేవడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న చింతన్ శిబిర్ శుక్రవారం నుంచి మొదలు కానుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో పాటు వివిధ విభాగాల అధిపతులు, ఆఫీస్ బేరర్లు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు కలిపి మొత్తం 422 మంది సభ్యులు పాల్గొననున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సంస్థాగత, వ్యవసాయ సమస్యలు, అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై రోడ్‌మ్యాప్ సిధ్దం చేయనున్నారు. మే 13న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేయనుండగా, 15న రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండో సారి ఓటమి, ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయ భారంతో కుంగిపోయిన కాంగ్రెస్‌కు భవిష్యత్తు వ్యూహాన్ని నిర్ణయించడంలో చింతన్ శిబిర్ చాలా కీలకంగా మారింది. 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జైపూర్‌లో చివరిసారిగా చింతన్ శిబిర్‌ను నిర్వహించగా, అనంతరం ఇప్పుడే మళ్లీ పార్టీ ఈ తరహా భేటీని నిర్వహిస్తోంది. నిర్మాణాత్మక మార్పుల కోసం కాలానుగుణ కార్యాచరణ ప్రణాళికను, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపిక చేసిన సమస్యలపై సుదీర్ఘ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం లక్ష్యంగా ఈ శిబిర్‌ను నిర్వహిస్తోంది. రాహుల్ కేంద్రంగా రాజకీయం ఈ సమావేశం వేదికగా రాహుల్‌గాంధీని పార్టీ అధ్యక్షునిగా నియమించాలనే డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ పగ్గాలు చేపట్టాలంటూ పార్టీ సీఎంలు అశోక్ గహ్లోత్ (రాజస్తాన్), భూపేష్ బఘేల్ (ఛత్తీస్‌గఢ్)లు బహిరంగంగానే మాట్లాడుతుండగా, రణదీప్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ వంటి నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. అయితే జీ–23 నేతల డిమాండ్ నేపథ్యంలో ఆగస్టు–సెప్టెంబర్ మధ్యలో పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు మరికొందరు తెలిపారు. -
యూత్ హాస్టల్స్: ఆమెను నమ్ముకొని దేశం తిరగొచ్చు
‘మనకో ఫ్లాట్ ఉండాలి’ అనుకోకుండా ‘తిరిగేవాళ్లకు ఒక స్పాట్ ఉండాలి’ అనుకుందామె. యూరప్‌కు వెళ్లినప్పుడు చూసింది– అక్కడి యూత్ హాస్టల్స్‌ను. అంత క్రియేటివ్‌గా, కాలక్షేపంగా, చీప్‌గా ఉండే యూత్ హాస్టల్స్‌ను 2014 నుంచి మొదలెట్టింది. సోలో ట్రావెలర్లు, దిమ్మరి పర్యాటకులు, విద్యార్థులు తక్కువ ఖర్చులో ఆగి ముందుకు సాగేలా ‘గోస్టాప్స్’ పేరుతో యూత్ హాస్టల్చైన్ను విస్తరించింది. వారణాసితో మొదలుపెట్టి ఉదయ్‌పూర్ వరకు ఇప్పటికి 33 హాస్టల్స్ ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో 1500 హాస్టళ్లు అందుబాటులో తేవాలంటున్న పల్లవి అగర్వాల్ పరిచయం. పూర్వం ‘అతిథి దేవోభవ’ అని దారిన పోయేవాళ్లు ఎవరొచ్చినా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు. యాత్రికులకు, పర్యాటకులకు ఇల్లే విడిది. ఆ తర్వాత పూటకూళ్లమ్మ ఇళ్లు చాలా కాలం ఏలాయి. ఆ తర్వాత సత్రాలు వచ్చాయి. మార్గమధ్యంలో సత్రంలో ఆగి సేదతీరి వెళ్లేవారు. మరి ఇప్పుడు? హోటల్సు ఖరీదు. గెస్ట్‌హౌస్‌లు దొరకవు. మరి మార్గం? 1946లో దేశంలో ‘యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో యూత్ హాస్టల్స్ ఏర్పాడ్డాయి. కాని వాటి నిర్వహణ సంప్రదాయపద్ధతిలో ఉంటుంది. అందుకే యువతను ఆకర్షించేలా ప్రయివేటు యూత్ హాస్టల్స్ వచ్చాయి. జోస్టల్, ది మాడ్ప్యాకర్స్, బంక్యార్డ్స్లాంటి ప్రయివేటు హాస్టల్స్‌తో పాటు అన్ని విధాలుగా ఆకర్షణీయంగా ఉండే ‘గోస్టాప్స్’ హాస్టల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒక రాత్రికి 400 రూపాయల నుంచి 800 ఖర్చుతో ఉండేలా వీటిని తీర్చిదిద్దింది పల్లవి అగర్వాల్. యూరప్ పర్యటన స్ఫూర్తి పల్లవి అగర్వాల్‌ది ఢిల్లీ. టాటా కాపిటల్‌లో ఉద్యోగం. భర్త పంకజ్ పర్వాండా ఇంజనీరింగ్ చదివాడు. ఇద్దరూ 2013లో బ్యాక్ప్యాకర్స్గా యూరప్ యాత్రకు వెళ్లారు. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దేశాలు తిరగడానికి ప్లాన్ చేసుకున్నారు. తక్కువ ఖర్చుతో తిరగాలంటే అక్కడి యూత్ హాస్టల్స్‌లో దిగక తప్పదు. యూరప్‌లోని యూత్ హాస్టల్స్ పల్లవికి చాలా నచ్చాయి. వాటి మెయింటెనెన్స్ బాగుంది. ఎవరూ లేని చోట ఏకాంతంగా ఉండే ప్రాంతాలలో కూడా యూత్ హాస్టల్స్ అక్కడ అందుబాటులో ఉన్నాయి. ‘మన దేశంలో యూత్ హాస్టల్స్ కొరత ఉంది. సరిగ్గా నడిపితే మనం హిట్ కొడతాము’ అంది పల్లవి. పంకజ్ అందుకు అంగీకరించాడు. ఇండియా తిరిగి వచ్చాక స్టార్టప్‌గా ‘గోస్టాప్స్’ హాస్టల్స్ మొదలుపెట్టింది పల్లవి. విదేశీయులే టార్గెట్ యూత్ హాస్టల్స్‌ను ప్రారంభించే ముందు పల్లవి తన టార్గెట్‌గా విదేశీయులను పెట్టుకుంది. విదేశీయులకు ఆకర్షణీయంగా ఉండేలా, వారు ఎక్కువ రోజులు స్టే చేసేలా మొదట వారణాసిలో గోస్టాప్స్ హాస్టల్ మొదలు పెట్టింది. ఎందుకంటే యూరప్ నుంచి, సౌత్ ఏసియా నుంచి వచ్చే పర్యాటకులకు యూత్ హాస్టల్స్ కాన్సెప్ట్ తెలుసు. వారు వాటినే ఇష్టపడతారు. కాని మార్కెట్లో ఉన్న పోటీదారులు చాలా సౌకర్యాలు ఏర్పాటు చేసి 3 స్టార్ హోటల్స్లాగా వాటిని సిద్ధం చేశారు. పన్నెండు మందితో రూమ్ షేరు చేసుకుంటే వారి దగ్గర స్టే తక్కువ పడుతుంది. కాని పల్లవి ఈ అదనపు సౌకర్యాలను తగ్గించి, నివసించే చోటును ఆకర్షణీయం చేసింది. బెడ్స్, డైనింగ్ హాల్, లాంజ్... యాత్రికులు ఆడొచ్చు పాడొచ్చు... ఎక్కడైనా కూచోవచ్చు... ఎన్నిరోజులైనా ఉండొచ్చు. దాంతో విదేశీయులతో పాటు భారతీయులు కూడా వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. ‘కరోనాకు ముందు మేము 13 హాస్టల్స్ రన్ చేశాం. ఇపుడు 33 అయ్యాయి’ అంటుంది పల్లవి. కొత్తపద్ధతిలో పల్లవి స్టార్టప్ ఇన్వెస్టర్లను ఆకర్షించి వారి సపోర్ట్ అందింది. అయితే హాస్టల్స్‌కు సొంత భవనాలు ఉండాలనే నియమం పల్లవి పెట్టుకోలేదు. వివిధ నగరాల్లో సరైన చోట భవనం దొరికితే లీజ్‌కు తీసుకునో, ఫ్రాంచైజ్ ఇచ్చో, కొనుగోలు చేసో తమ పద్ధతిలో ఆధునికమైన హాస్టల్స్ గా తయారు చేసి అందుబాటులోకి తెస్తుంది. కాని హాస్టల్ ఉండటం ముఖ్యం అని భావిస్తుంది. ‘గత సంవత్సరం వరకు మన దేశంలో 1000 యూత్ హాస్టల్స్ ఉండేవి. ఇప్పుడు ఎన్ని నడుస్తున్నాయో కరోనా వల్ల ఎన్ని మూత పడ్డాయో తెలియదు. కాని దేశంలో కోటిన్నర మంది యాత్రికులు, పర్యాటకులు, ప్రయాణాలు చేసే విద్యార్థులు యూత్ హాస్టల్స్ అవసరంలో ఉన్నారు. వారి కోసమని రాబోయే ఐదేళ్లలో 1500 హాస్టల్స్ స్థాపించడమే మా లక్ష్యం’ అంటుంది పల్లవి. ఆ విధంగా ఆధునిక పూటకూళ్లమ్మ పల్లవి. -
‘గైడ్’ సినిమాను తలపించే ప్రేమ కథ.. ఫ్రెంచ్ అమ్మాయి మనసు దోచిన బిహారీ
ఢిల్లీ చూడటానికి వచ్చింది పారిస్ నుంచి ఆమె. అతడు గైడ్. అతడు కబుర్లు చెప్పి తిప్పాడు. ఆమె పదే పదే నవ్వింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకున్నారు. మూడు నెలల తర్వాత ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఆమె అతణ్ణి గైడ్ నుంచి బిజినెస్‌మేన్‌గా మార్చడానికి పారిస్ పిలిపించింది. ఎదిగేలా చేసింది. ఆరేళ్ల తర్వాత ఇదిగో ఇలా బిహార్‌కు వచ్చి మరీ వివాహం చేసుకుంది. ఒక కుతూహలం రేపే రాకుమారి తోటరాముడు కథ. గైడ్ సినిమాలో దేవ్ఆనంద్ కథ. ఈ ప్రేమకథ వింటే పాత తరం వారికి ‘గైడ్’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆర్.కె.నారాయణ్ రాసిన నవల ఆధారంగా దేవ్ ఆనంద్, వహీదా రహెమాన్ నటించిన ‘గైడ్’ సినిమాకు ఈ ప్రేమ కథ కొంతమేర పోలి ఉంది. ‘గైడ్’లో ఉదయ్‌పూర్ దగ్గర గైడ్‌గా పని చేస్తున్న దేవ్ ఆనంద్‌ను ఆ ప్రాంతాన్ని చూడటానికి వచ్చిన వహీదా ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కథలో కూడా భారత్‌ను చూడటానికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన యువతి ఢిల్లీలో గైడ్‌గా పని చేస్తున్న కుర్రాణ్ణి ప్రేమించింది. అయితే మనదేశంలో కొన్నిసార్లు కనిపించే కుల, మత, జాతి అడ్డంకులు ఈ ప్రేమకథలో రాలేదు. ప్రేమ ఫలించింది. మొన్నటి ఆదివారం వీరి పెళ్లి జరగగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం పారిస్ నుంచి మేరీ లోరి హెరెల్ అనే యువతి ఇండియా చూడటానికి ఢిల్లీ వచ్చింది. అక్కడ బిహార్‌లోని బేగుసరాయి జిల్లాకు చెందిన రాకేష్ గైడ్‌గా పని చేస్తున్నాడు. మేరీకి ఢిల్లీ చూపించే బాధ్యత వృత్తిలో భాగంగా అతనిపై పడింది. చురుగ్గా ఉంటూ విసుగు చూపించకుండా నవ్విస్తూ ఢిల్లీలో రెండు మూడు రోజుల పాటు గైడ్‌గా వ్యవహరించిన రాకే మేరీకి నచ్చాడు. నిజానికి పారిస్‌లో మేరీ టెక్స్టైల్ రంగంలో ఉంది. వ్యాపారవేత్త. రాకుమారి కిందే లెక్క. రాకేష్ బేగుసరాయ్‌లో ఒక దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులకు పుట్టిన కుర్రవాడు. ఒక దేశం కాదు. ఒక భాష కాదు. ఒక సంస్కృతి కాదు. అయినా సరే ‘మనిషి మంచివాడు... ఈమె హృదయం మంచిది’ అని స్త్రీ, పురుషులకు అనిపించడానికి అవి అడ్డు నిలవలేకపోయాయి. వారు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అసలైన ప్రేమ ఆ తర్వాత మొదలైంది. ఫోన్ ప్రేమ టూరిస్ట్‌లు టూర్ ముగిసిన వెంటనే గైడ్లను మర్చిపోతారు. వారికి చూసిన ప్రాంతాలు గుర్తుంటాయి కాని చూపించిన మనుషులు గుర్తుండరు. కాని భారత్ చూసి పారిస్ వెళ్లిపోయిన మేరీ రాకేష్‌కు తరచూ ఫోన్ చేసేది. రాకేష్ కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడేవారు. సరిగ్గా మూడు నెలలు గడిచాక ఇద్దరికీ అర్థమైంది తాము ప్రేమలో ఉన్నామని. ఇద్దరూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు. కాని ప్రపంచాన్ని చూసిన మేరీకి రాకేష్ చేస్తున్న ఉద్యోగం, పని భవిష్యత్తులో ముందుకు పోవడానికి సహకరించవని మేరీకి అర్థమైంది. ‘నువు పారిస్ వచ్చి ఏదైనా మంచి పని చేయి’ అంది. ‘నాకు ఎవరు ఇస్తారు పని’ అన్నాడు రాకేష్. ‘నా వ్యాపారంలోనే పార్టనర్‌గా మారు’ అంది మేరీ. అంతే కాదు వీసా, టికెట్ రెండూ పంపింది. మూడేళ్ల క్రితం రాకేష్ పారిస్ వెళ్లాడు. అంతవరకూ మధ్యలో సంవత్సరానికి ఒకటి రెండుసార్లు మేరీ ఇండియా వచ్చి రాకేష్‌ను కలిసి వెళ్లేది. అప్పటికి వారిది ప్రేమే తప్ప పెళ్లి ఆలోచన లేదు. తండ్రి పాదాలకు నమస్కరిస్తున్న నూతన వధువు ప్రేమతో పని చేస్తుంటే పారిస్ వెళ్లిన రాకేష్ మేరీ వ్యాపారంలో పార్టనర్‌గా మారి పని చేయడం మొదలెట్టాడు. ఢిల్లీలో చూసిన రాకేష్‌లో ఏమాత్రం మార్పు లేదని అతను తన పనిని మనసు పెట్టి చేస్తాడని, జీవితం పట్ల, మనుషుల పట్ల అతనికి విశ్వాసం ఉందని మేరీ అర్థం చేసుకుంది. జీవితాంతం అతనితో కలిసి జీవించవచ్చని మరో మూడేళ్లకు ఆమె నిర్థారణ చేసుకుంది ‘మనం పెళ్లి చేసుకుందాం’ అంది. సరే చేసుకుందాం అని రాకేష్ అంటే ‘ఇక్కడ కాదు... ఇండియాలో. మీ పద్ధతిలో. మీ తల్లిదండ్రుల సమక్షంలో’ అని చెప్పింది. రాకేష్ పారిస్ నుంచి తల్లిదండ్రులతో బంధువులతో మాట్లాడారు. ‘నువ్వు చేసుకుంటే మేము అడ్డు చెప్పేదేముంది’ అన్నారు వారు. రాకేష్‌ను మూడేళ్లుగా చూస్తున్నారు కనుక మేరీ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పెళ్లి ఖాయమైంది. నవంబర్ 19, ఆదివారం రాత్రి, బేగుసరాయ్‌లో పెళ్లి. వియ్యంకులయ్యారు రాకేష్ తండ్రి రామచంద్ర షా, మేరీ తండ్రి వేస్ హెరెల్ వియ్యంకులయ్యారు. పారిస్ నుంచి తల్లిదండ్రులతో బేగుసరాయ్ వచ్చిన మేరీ వధువుగా మారి రాకేష్‌ను పతిగా పొందింది. దానికి ముందు వియ్యంకులు ‘జప్మాలా’ అనే తంతులో పాల్గొన్నారు. బాలీవుడ్, భోజ్‌పురి పాటలకు నృత్యాలు చేశారు. విదేశీ అమ్మాయిని మన ఊరి కుర్రాడు పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త విని ఊరి జనాలు విరగపడ్డారు. పెళ్లి బాగా జరిగింది. మరి కొన్ని రోజుల్లో ఆ జంట పారిస్‌కు వెళ్లనుంది. కొన్ని ప్రేమకథలు కలతను కలిగిస్తాయి. కొన్ని సంతోషాన్నిస్తాయి. ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో అందరికీ నచ్చింది. మేరీ, రాకేష్‌లను అందరూ అభినందిస్తున్నారు. ప్రేమ పండించుకున్న అదృష్టవంతులు వీరు. త్వరలో ఇదంతా సినిమాగా వచ్చినా ఆశ్చర్యం లేదు. -
కోచింగ్ సెంటర్ యజమానిపై కన్నేసిన ప్రొఫెసర్.. ఇంటికి ఆహ్వనించి
జైపూర్: ఉదయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వనించి.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. కాగా, బాధిత యువతి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, తాజాగా (సోమవారం) జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన బాధిత మహిళ స్థానికంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్‌ను నడుపుతుంది. దీంట్లో ఎందరో విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో.. నీరజ్‌కుమార్ అనే వ్యక్తి.. సదరు ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను తీసుకునేవాడు.కాగా, ఇతను ఉదయ్‌పూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేసేవాడు. అయితే, కోచింగ్ సెంటర్ లో క్లాసులు తీసుకోవడం వలన వీరిద్దరికి కొంత పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా నీరజ్ .. కోచింగ్ సెంటర్ యజమానిపై కన్నేశాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను లోంగదీసుకోవాలనుకున్నాడు. అదును కోసం చూడసాగాడు. దీంట్లో భాగంగానే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ యువతిని ఉదయ్‌పూర్‌లోని తన ఇంటికి రావల్సిందిగా ఆహ్వనించాడు. అయితే, బాధిత యువతి తెలిసినవాడే కదా.. అని ఉదయ్‌పూర్ వెళ్లింది. కానీ, ప్రొఫెసర్ మనసులో ఉన్న దుర్భుద్ధిని మాత్రం గుర్తించలేకపోయింది. ఈ క్రమంలో అతగాడు..యువతి.. ఉదయ్‌పూర్ వచ్చాక ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత , ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. దాని ప్రభావంతో ఆమె మత్తులోకి జారుకుంది. దీంతో.. అతగాడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి మత్తు నుంచి తేరుకున్నాక.. సదరు యువతి ఆందోళనకు లోనైంది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నీరజ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న గోడుండా పోలీసులు నీరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పాలు తక్కువ ఇస్తోందని ఇంటిముందే నరికి పూడ్చి
జైపూర్: మూఢనమ్మకంతో ఒంటెను దారుణంగా హత్య చేశాడో ఓ వ్యక్తి. ఒంటెను చంపేసి తన ఇంటి ముందే గుంతలో పూడ్చిపెట్టాడు. కొన్నాళ్లకు పూడ్చిపెట్టిన ఒంటె తల బయటకు రావడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది. అయితే అతడి చంపింది రాష్ట్ర జంతువుగా ఉన్న ఉంటెను కావడంతో ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒంటెను హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా..) సూరజ్‌పోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోవర్ధన్ విలాస్ ప్రాంతంలో రాజేశ్ అహిర్ డెయిరీ నిర్వహిస్తున్నాడు. అతడికి 24కు పైగా ఆవులు ఉన్నాయి. అయితే డెయిరీలోని ఆక ఆవు అనారోగ్యం పాలైంది. పాలు తక్కువగా ఇస్తుండడంతో ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని అతడికి తెలిసిన వ్యక్తి చేతన్‌ను ఆశ్రయించాడు. చేతన్ తన తండ్రి శోభాలాల్‌కు పరిచయం చేశాడు. శోభాలాల్ మూఢనమ్మకాలు వదిలిస్తానని మంత్రతంత్రాలు చేస్తుంటాడు. ఒంటె తల నరికి ఇంటి వెలుపల పాతిపెడితే సమస్య పరిష్కారమవుతుందని శోభాలాల్ రాజేశ్ అహీర్‌కు చెప్పాడు. మంత్రగాడు చెప్పినట్టు రాజేశ్ ఒంటెను తీసుకువచ్చి తన స్నేహితుల సహాయంతో ఒంటె మెడను నరికి చంపేశాడు. అనంతరం ఒంటె మొండాన్ని ఇంటి ముందు పాతిపెట్టాడు. కొన్ని రోజులకు ఒంటె మొండెం పోలీసులకు చిక్కింది. విచారణ చేపట్టగా ఓ వ్యక్తి రాజేశ్ పేరు చెప్పాడు. అనంతరం పోలీసులు రాజేశ్‌ను విచారించగా నేరం అంగీకరించాడు. అక్కడ ఒంటెను చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీంతో రాజేశ్‌తో పాటు అతడి స్నేహితుడు చేతన్, అతడి తండ్రి శోభాలాల్‌తో పాటు అతడి స్నేహితుడు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. మూఢ నమ్మకాలతో ఒంటెను రాజేశ్ హత్య చేశాడని సూరజ్‌పోల్ పోలీస్ అధికారి డాక్టర్ హనుమంత్ సింగ్‌రాజ్ పురోహిత్ తెలిపారు. రాష్ట్ర జంతువుగా ఉన్న ఒంటెను హతమార్చడంతో ఈ కేసును తీవ్రంగా పరిగణించినట్లు చెప్పారు. దీనిపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం రేపింది. చదవండి: రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. వైరల్ -
ఉదయ్‌పూర్ టూర్: క్రిస్టల్ గ్యాలరీ ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఉదయ్‌పూర్ టూర్లో... జగ్మోహన్ ప్యాలెస్... సిటీ ప్యాలెస్... జగ్మందిర్... దర్బార్ మహల్... పిచోలా సరస్సు... రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలే. ఒక రోజు సరిపోదని తెలుస్తుంది. చూసేవి కొన్ని టైమ్ సరిపోక వదిలేవి కొన్ని వాటిలో ఫతే ప్రకాశ్ ప్యాలెస్ ఉంటుంది. ఇందులోని క్రిస్టల్ గ్యాలరీని ఆసాంతం చూడాలంటే మూడు గంటలు పడుతుంది. అందుకే వదిలేసి వాటిలో తొలిస్థానంలో ఉంటుంది. కానీ చూడాల్సిన వాటిలో తొలి స్థానం దీనిది. ఉదయ్‌పూర్‌లో ఉన్న ప్రదేశాలు ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఏ రెండింటినీ సరిపోల్చి... ఇది ఎక్కువ, ఇది మధ్యమం, ఇది తక్కువ అని వర్గీకరించలేం. దేనికదే వైవిధ్యం. వైవిధ్యానికి, నైపుణ్యానికి పరాకాష్ట ఫతేప్రకాశ్ ప్యాలెస్‌లోని క్రిస్టల్ గ్యాలరీ. ఇక్కడ ఫొటోలకు అనుమతి ఉండదు. టికెట్ కౌంటర్ దగ్గర పర్యాటకుల కెమెరాలు, స్మార్ట్ ఫోన్లను తీసుకుంటారు. ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక ఫొటో ఐడీ కార్డు, ఒక ఫొటోకాపీ కౌంటర్లో ఇవ్వాలి. టికెట్‌తోపాటు పర్యాటకులకు ఒక ఆడియో డివైజ్ ఇస్తారు. చిన్న కాలిక్యులేటర్‌లా ఉంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజియంలో ఒక్కొక్క గదిలోకి వెళ్లినప్పుడు ఆ డివైజ్‌లో ఆ నంబర్ నొక్కాలి. ఆ గదిలో మనం చూస్తున్న కళాఖండాల గురించిన వివరాలు వినిపిస్తాయి. షాండ్లియర్ ప్రత్యేకం ఈ ప్యాలెస్‌లో పెద్ద షాండ్లియర్ ఉంది. అది మన దేశంలో ఉండే షాండ్లియర్లలో రెండవ అతిపెద్ద షాండ్లియర్, మొదటిది మన హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉంది. ఫతే ప్రకాశ్ ప్యాలెస్ నుంచి చూస్తే లేక్ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే క్రిస్టల్ గ్యాలరీ ఓ కొత్త లోకంలో విహరించిన అనుభూతినిస్తుంది. ఈ ఒక్క ప్యాలెస్‌కే ఏడు వందల రూపాయలు పెట్టి టికెట్ తీసుకునేటప్పుడు టికెట్ ధర మరీ ఎక్కువ అనిపిస్తుంది. కానీ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వర్త్ సీయింగ్ అనే సంతృప్తితో బయటకు వస్తాం. కంచాలు... మంచాలు క్రిస్టల్‌లోనే క్రిస్టల్ గ్యాలరీలో ఒక్కో గదిని చూస్తూ పదిహేనవ గదిలో రాగానే ఒక మూలగా మెరూన్ కలర్ ముఖమల్ క్లాత్‌తో కుట్టిన కుషన్ చెయిర్ కనిపించింది. హమ్మయ్య కూర్చోవడానికి వెసులుబాటు ఉందని కూర్చోబోయేంతలో బారికేడ్ రిబ్బన్ అడ్డు తగిలింది. అది మామూలు కుర్చీ కాదు, క్రిస్టల్ కుర్చీ. క్రిస్టల్‌తో గ్యాలరీ అంటే ప్రదర్శనలో చిన్న చిన్న వస్తువులు ఉంటాయనుకుంటాం. కానీ లోపలికి వెళ్తే కప్పులు, సాసర్లు, స్పూన్లు, గాజు ప్లేట్ల నుంచి సోఫాలు, కుర్చీలు, మంచాలు వరకు ఉన్నాయి. ఇవన్నీ మోజు కొద్దీ తయారు చేసి షో పీస్‌లలాగ అలంకరించుకున్నారా లేక ఉపయోగించారా అనే సందేహం కూడా కలుగుతుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ఈ గ్యాలరీలోకి గైడ్‌కు అనుమతి ఉండదు. గ్యాలరీ విజిట్ పూర్తయిన తర్వాత ఆడియో డివైజ్ కౌంటర్లో వెనక్కి ఇచ్చేటప్పుడు అడుగుదామంటే వాళ్ల దగ్గర సమాధానం ఉండదు. ఆడియో డివైజ్ వెనక్కి ఇచ్చిన తర్వాత మన ఐడీకార్డు ఇస్తారు. ఆరావళి కొండల్లో సూర్యోదయం ఉదయ్‌పూర్‌లో ఎయిర్‌పోర్టు ఉంది. కానీ ఒక వైపు జర్నీ అయినా రైల్లో చేస్తే బాగుంటుంది. ఆరావళి పర్వత సానువుల మధ్య కొండలను చుడుతూ సాగుతుంది ప్రయాణం. సూర్యుడితో దోబూచులాడాలంటే ఉదయానికి ఉదయ్‌పూర్ చేరే ట్రైన్ అయితే మంచిది. కొండల మధ్య ప్రయాణిస్తూన్నప్పుడు కొండ వాలులో నుంచి ఉదయిస్తున్న సూర్యుడు పలకరిస్తాడు. మనకున్న అనుభవంలో ఒకసారి ఉదయించిన సూర్యుడు సాయంత్రం వరకు కనిపిస్తూనే ఉంటాడు కదా అన్నట్లు పరాకుగా ఉంటాం. చూస్తున్నంతలోనే సూర్యుడు చటుక్కున మాయమైపోతాడు. మరో కొండ అడ్డు వచ్చిందన్నమాట. అలా రైలు కొండల మధ్య మలుపులు తిరుగుతున్నంత సేపూ ఈ ప్రకృతి అద్భుతాన్ని ఆస్వాదించవచ్చు. కొండల మధ్య సూర్యోదయాన్ని చూడడం కుదరకపోతే ఉదయ్‌పూర్ పర్యటనలో సూర్యాస్తమయం సమయంలో రోడ్డు జర్నీ అయినా ప్లాన్ చేసుకుని తీరాలి. సూర్యుడు ఒకసారి మనకు కుడివైపు కనిపిస్తాడు. వెంటనే మాయమై పోయి మరో ఐదు నిమిషాల్లో ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. ఈ విన్యాసాలకు ఆలవాలం ఆరావళి పర్వతశ్రేణులు. ఉదయ్‌పూర్ పర్యటనలో మిస్ కాకూడని ప్రకృతి సౌందర్యం. చదవండి: Jodeghat Museum: జోడెన్‌ఘాట్ వీరభూమి -
ఉదయ్‌పూర్‌లో తాండవ్ నటి హనీమూన్
ఉదయ్‌పూర్: బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్- కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్ ఇటీవలే పెళ్లి చేసుకుని వివాహ బంధానికి ఆరంభం పలికారు. డిసెంబర్ 25న షాదీ జరపుకున్న ఈ జంట తాజాగా హనీమూన్‌కు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ వెళ్లింది. తొలిసారి భర్తతో కలిసి ప్రయాణం చేసినందుకు గౌహర్‌కు గాల్లో తేలినట్లుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంటూ 'నేను నా భర్తతో కలిసి వెళ్తున్న ఫస్ట్ హాలీడే ఇది. చాలా హ్యాపీగా ఉంది' అంటూ వీడియోను షేర్ చేశారు. ఇందులో గౌహర్ ఎక్కడలేని ఆనందంతో స్టెప్పులేస్తున్నారు. భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సైతం పోస్ట్ చేశారు. కాగా మాజీ మోడల్ అయిన గౌహర్ అనేక టీవీ షోలలో కనిపించారు. హిందీ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొని విజేతగా అవతరించిన ఆమె 14వ సీజన్లోనూ హౌస్‌లోకి వెళ్లి వచ్చారు. ఇటీవలే ఆమె తాండవ్ వెబ్ సిరీస్‌లో నటించగా దానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. (చదవండి: ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నటి) ఇక జైద్ దర్బార్ విషయానికి వస్తే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు అయిన జైద్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. కాగా గౌహర్‌కు, జైద్‌కు ఎనిమిదేళ్ల వ్యత్యాసం ఉంది. కానీ ప్రేమకు వయసుతో పని లేదని, ఇద్దరం పరిణతి చెందినవారమని, ఒకరికొకరం బాగా అర్థం చేసుకోగలమంటూ పెళ్లి చేసుకుని నిరూపించారు. (చదవండి: అలనాటి స్టార్ హీరో బ్రేకప్ స్టోరీ) View this post on Instagram A post shared by GAUAHAR KHAN (@gauaharkhan) View this post on Instagram A post shared by Zaid Darbar (@zaid_darbar) View this post on Instagram A post shared by GAUAHAR KHAN (@gauaharkhan) -
వధువుగా నిహారిక.. ఫోటో వైరల్
మెగా బ్రదర్, నటుడు నాగబాబు గారాలపట్టి నిహారిక పెళ్లికుమార్తెగా ముస్తాబయ్యారు. మెరూన్ కలర్ చీరకు ఆకుపచ్చ రంగు బ్లౌజ్‌ను మ్యాచ్ చేసి సంప్రదాయ వస్త్రధారణలో అందంగా మెరిసిపోతున్నారు. చీరకు తగ్గ ఆభరణాలు ధరించిన నిహారిక ముఖంలో పెళ్లికళ ఉట్టిపడుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ‘‘కొణిదెల వారి ముద్దుల తనయ నేటితో జొన్నలగడ్డ ఇంటి కోడలు కాబోతుంది. ఈ వేడుకను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు’’ అంటూ మెగా ఫ్యామిలీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈరోజు రాత్రి 7.15 నిమిషాలకు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక ఏడడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. జైపూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో జరుగనున్న వీరి వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. పెళ్లికి కొన్ని గంటల ముందు నిహారికకు సంబంధించిన ఫోటోను కాబోయే భర్త చైతన్య సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో నిహారిక పెళ్లి కుమారుడికి సంబంధించిన వస్త్రాలను పట్టుకొని ఉండగా, దానిపై ‘నా వధువు సిద్ధంగా ఉంది’ అని రాసి ఉంది. నిహారిక చేతిలో చేయి వేసి ఏడడుగులు నడిచేందుకు చైతన్య ఎంత ఉత్సహంగా ఉన్నాడో ఈ ఫోటో చూస్తే తెలుస్తోంది. (పెళ్లి కూతురుగా ముస్తాబైన నిహారిక గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (నిహారిక మెహందీ ఫంక్షన్ గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (ఘనంగా నిహారిక-చైతన్యల సంగీత్ గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిహారిక హల్దీ వేడుక: వీడియో వైరల్
మెగా బ్రదర్, నటుడు నాగబాబు ముద్దుల కుమార్తె కొణిదెల నిహారిక మరికొన్ని గంటల్లో జొన్నలగడ్డ నిహారికగా మారనున్నారు. ఈ రోజు రాత్రి 7.15 నిమిషాలకు గుంటూరు ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనున్నారు. రాజస్తాన్ ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్ ఈ వేడుకకు వేదిక కానుంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉదయ్‌పూర్‌కు చేరుకొని ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న పవన్ కల్యాణ్ కూడా కొడుకు అకిరా నందన్‌తో కలిసి ఉదయ్‌పూర్ చేరుకున్నారు. నిహారిక పెళ్లి వేడుకలో మెగా హీరోలు అందరూ సందడి చేస్తున్నారు. ఒక్కొక్కరుగా కనిపించే హీరోలంతా ఒక్కచోట చేరడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. చదవండి: నిహారిక మెహందీ.. చిరు, బన్నీ డ్యాన్స్ వీడియో వైరల్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నేడు మెహందీ, హల్దీ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాబోయే వధువరులిద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ వేడుకలకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటితో పాటు హైదరాబాద్‌లోని నివాసంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోను నాగబాబు తన య్యూట్యూబ్ ఛానల్లో షేర్చేశారు. ఇదిలా ఉండగా సోమవారం నాటి సంగీత్ కార్యక్రమంలో వధూవరులు, మెగా హీరోలు డ్యాన్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన మెహందీ ఫంక్షన్లోనూ ఆ జోష్ కొనసాగించారు. ఇక మెహందీ ఫంక్షన్ సందర్భంగా మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ ‘ఘరానా మొగుడు’ చిత్రంలోని ‘బంగారు కోడి పెట్ట’ పాటకు చిరు, అల్లు అర్జున్‌ల స్టెప్పులు వేశారు. అదే పాటకు చిరు భార్య సురేఖ, అల్లు అరవింద్ కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చదవండి: నిహారిక మెహందీ.. పవన్ కళ్యాణ్ సందడి View this post on Instagram A post shared by Celebrities adda (@celebritieadda) -
నిహారిక సంగీత్ వేడుక.. డ్యాన్స్ ఇరగదీశారు
మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. కొణిదెల నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక ఈ నెల 9న జొన్నలగడ్డ చైతన్యను మనువాడనున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఈ వేడుకకు సందరంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఒక్క పవన్ కల్యాణ్ మినహా మెగా కుటుంబ సభ్యులంతా సోమవారమే రాజస్తాన్ చేరుకున్నారు. ఇక ఈ రోజు పవన్ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్ తన స్టైలిష్ లుక్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. చదవండి: నిహారిక పెళ్లి వేడుకల్లో చెర్రీ, బన్నీ.. పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి రాజస్తాన్‌లో సంగీత్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొణిదెల, అల్లు వారి ఫ్యామిలీ సభ్యులు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా నిహారిక, చైతన్యతో కలిసి మెగాస్టార్ పాటకు డ్యాన్స్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక రాజస్థాన్‌లోని హోటల్లో దిగిన సమయంలో హారిక, చైతూలకి అక్కడి బ్యాండ్ మేళం బృందం ఘన స్వాగతం పలకగా జోష్‌లో నిహరిక తన కాబోయే భర్త చైతన్యతో కలిసి చిందులేశారు. చదవండి: చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా కోమటిరెడ్డి కుమార్తె వివాహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్తె శ్రీనిధి- ప్రణవ్‌ల వివాహం బుధవారం ఘనంగా జరిగింది. కోవిడ్ కారణంగా ఈ వేడుకలో ఇరుకుటుంబాల దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొన్నారు. కర్నూలుకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్ రెడ్డి కుమారుడైన ప్రణవ్ రెడ్డి వరుడు. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లోని లీలాప్యాలెస్ వేదికగా కల్యాణం జరుగుతోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఫ్యామిలీలోకి వెల్కమ్ రీతూ: కంగనా
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం రాజస్తాన్‌లో ఉన్నారు. ఉదయ్‌పూర్‌లో ఆమె సోదరుడు అక్షత్ రనౌత్ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను కంగనా దగ్గరుండి జరిపిస్తున్నారు. గురువారం అక్షత్, రీతూ వివాహం బంధంతో ఒకటయ్యారు. కంగనా, ఆమె తల్లిదండ్రులు, సోదరి రంగోలీ చద్దేలి, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా సోదరుడికి ట్విటర్ వేదికగా కంగనా శుభాకాంక్షలు తెలిపారు. స్నేహితులందరూ నూతన దంపతులైన అక్షత్, రీతూలను ఆశీర్వదించాలని, వారి జీవితంలోని ఈ కొత్త జీవితం గొప్పగా ఉండాలని దీవించాలని కోరారు. మెహెందీ ఫంక్షన్, సంగీత్, ఇలా పెళ్లి వేడకకు చెందిన అన్ని ఫోటోలను కంగనా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చదవండి: ‘జో బైడెన్ ఏడాదికి మించి ఉండరు’ Welcome to our family Ritu .... 🌹 pic.twitter.com/yvNCHCuTx5 — Kangana Ranaut (@KanganaTeam) November 12, 2020 Dear friends, bless my brother Aksht and his new bride Ritu, hope they find great companionship in this new phase of their lives 🌹 pic.twitter.com/50gECg5TOy — Kangana Ranaut (@KanganaTeam) November 12, 2020 Bhai ki shaadi 🌹 pic.twitter.com/SJGf3mKQWf — Kangana Ranaut (@KanganaTeam) November 12, 2020 Yes it’s a big day for our family but just got to know ki #arnabisback So here we go ... Welcome back dear friend ... pic.twitter.com/TYPPVHQsCz — Kangana Ranaut (@KanganaTeam) November 11, 2020 Bhai ki shaadi ❤️ pic.twitter.com/EFCDp9PyEV — Kangana Ranaut (@KanganaTeam) November 11, 2020 Little galaxy on my bholu’s hand is by me ❤️❤️❤️ pic.twitter.com/56Clt1zssL — Kangana Ranaut (@KanganaTeam) November 11, 2020 Pre festivities of Aksht’s wedding 🤎 pic.twitter.com/lgnm67oX2g — Kangana Ranaut (@KanganaTeam) November 10, 2020 -
వధువు కాళ్లకు నమస్కరించిన భర్త
జైపూర్: హిందూ వివాహ సంప్రదాయంలో కొన్ని తంతులు చాలా విచిత్రంగా ఉంటాయి. మాంగళ్యధారణ కాగానే అమ్మాయి భర్త కాళ్లకు దండం పెడుతుంది.. పెళ్లైన వెంటనే తన ఇంటి పేరును మార్చుకుంటుంది. మరి రివర్స్‌లో జరగదు ఎందుకు. పెళ్లి కుమారుడు అంటే శ్రీ మహా విష్ణువు అంటారు.. మరి భార్య అంటే లక్ష్మీ దేవినే కదా. కాళ్లు కడిగితే తప్పేంటి.. పాదాలకు ఎందుకు నమస్కరించకూడదు. ఆడపిల్లకు తొలుత పుట్టింటి నుంచే ఓ గుర్తింపు వస్తుంది.. మరి అలాంటప్పుడు దాన్ని మార్చుకోవడం ఎందుకు. ఇదిగో ఇలాంటి ప్రశ్నలు అడిగేతే మనకు వేరే పేర్లు పెట్టేస్తారు. మన పితృస్వామ్య సమాజంలో ఇలాంటివి మహా పాపం. వదిలేద్దాం. కానీ కొందరు మాత్రం ఈ అభిప్రాయాలతో ఏకీభవించడమే కాక ఆచరిస్తారు. అలాంటి వ్యక్తికి సంబంధించినదే ఈ కథనం. భారతీయ యువతిని ప్రేమించి.. మన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని.. ఏళ్లుగా ఆడ పిల్లలు మాత్రమే పాటిస్తున్న సంప్రదాయాలను తాను పాటించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ ప్రత్యేక కథనాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే ప్రచురించింది. (చదవండి: ప్యాంట్ సూట్లో షాకిచ్చిన వధువు!) వివరాలు.. ఉదయ్‌పూర్‌కు చెందిన దీపా ఖోస్లా ఉన్నత చదువుల నిమిత్తం ఆమ్స్టర్డామ్లోని ఓ విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడే ఆమెకు ఒలేగ్ బుల్లర్‌తో పరిచయం ఏర్పడింది. అతడు విద్యార్థి నాయకుడు. మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఇద్దరి మనసులో మాత్రం ఒకరికోసం ఒకరం అనే భావన కలిగింది. అయితే వారి పరిచయం ముందుకు వెళ్లలేదు. ఎందుకంటే ఒలేగ్‌కి అది లాస్ట్ అకడామిక్ ఇయర్. దీపా యూనివర్సిటీలో చేరిన 6 నెలలకే అతడు క్యాంపస్ నుంచి వెళ్లి పోయాడు. ఆ తర్వాత కూడా కేవలం పుట్టిన రోజు నాడు మాత్రమే మెసేజ్‌లు చేసుకునే వారు. ఇలా ఓ పుట్టిన రోజు నాడు ఆమ్‌స్టర్‌డామ్‌లో డిన్నర్‌కి మీట్ అవుదామని అడిగాడు ఒలేగ్. అప్పుడు దీప లండన్‌లో ఉంది. దాంతో ఆరు నెలల తర్వాత డిన్నర్‌కి కలిశారు. ఆ తర్వాత స్కైప్‌లో మాట్లాడుకునే వారు. ఆ తర్వాత కొన్ని రోజులకు దీపకు ఓగ్ నుంచి డిన్నర్‌కు రావాల్సిందిగా ఆహ్వానం వచ్చింది. ఈ కార్యక్రమం ఉదయపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో జరిగింది. దీప ఒక్కతే వెళ్లింది. అయితే అక్కడ ఆమెకు అనుకోని సర్ప్రైజ్ ఎదురయ్యింది. అక్కడ ఒలేగ్ ఉన్నాడు. (చదవండి: ఏడడుగులు వేసిన వేళ) పైగా అతడి చేతిలో ఉంగరం. దీప రాగానే మోకాలి మీద నిలబడి పెళ్లి చేసుకోమని కోరాడు ఒలేగ్. ఆనందభాష్పాల మధ్య దీప ఎస్ చెప్పింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల ఆమోదంతో వీరి వివాహం నిశ్చయమయ్యింది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. ‘మా వివాహం యూరోపియన్, భారతీయ సంస్కృతుల సంపూర్ణ కలయికగా నిలిచింది. ఇక వివాహ తంతులో నన్ను ఒలేగ్ పాదాలకు నమస్కరించమని చెప్పారు. అప్పుడు ఇద్దరం కేవలం ఆడవారు మాత్రమే ఎందుకు అలా చెయ్యాలి అని ప్రశ్నించాము. వెంటనే ఒలేగ్ నా పాదాలను తాకాడు. అంతేకాదు మేం ఒకరి ఇంటి పేరు ఒకరం మార్చుకున్నాం. నేను దీప బుల్లర్ ఖోస్లా... తను ఒలేగ్ బుల్లర్ ఖోస్లా. చాలా గర్వంగా ఉంది’ అన్నారు దీప. ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ కొత్త కాన్సెప్ట్ చాలా మందికి నచ్చింది. ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ప్రేయసిని వివాహమాడిన టీమిండియా క్రికెటర్
జైపూర్ : టీమిండియా క్రికెటర్ కరుణ్ నాయర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి సనయ టాంకరివాలాతో కరుణ్ వివాహం ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శనివారం రాత్రి వివాహబంధంతో ఒకటైయ్యారు. వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను కరుణ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. ఈ నూతన జంటకు టీమిండియా ఆటగాళ్లు శ్రేయస్ అయ్యార్, అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్‌తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ ఆరోన్ వీరి విహహానికి హాజరయ్యాడు. కాగా కెరీర్లో కేవలం ఆరు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం వచ్చిన కరుణ్.. ట్రిపుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఫాం కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా తన ప్రేయసిని వివాహం చేసుకుని రెండో ఇన్సింగ్స్‌ను ప్రారంభించాడు. -
‘గాడిదతో కారును లాగించాడు’
ముంబై : ఎంజీ మోటార్ ఇండియాకు ఓ కస్టమర్ షాకిచ్చాడు. ఈ కంపెనీ మార్కెట్లో ఇటీవల లాంఛ్ చేసిన ప్రీమియం ఎస్యూవీ హెక్టార్ వాహనాన్ని గాడిదతో లాగించి ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఈ వాహనంపై డాంకీ వెహికల్ అని రాసి ఉన్న బ్యానర్‌ను అమర్చి యూట్యూబ్ చానెల్లో ఉదయ్‌పూర్‌కు చెందిన విశాల్ పంచోలి అప్లోడ్ చేయగా ఇప్పటికీ 2.74 లక్షల వ్యూస్ లభించాయి. వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఎంజీ మోటార్ మండిపడుతోంది. పంచోలి కొనుగోలు చేసిన హెక్టర్‌లో క్లచ్ సంబంధిత సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ లోపాన్ని కంపెనీ అధికారులు సరిదిద్దకపోగా తనను బెదిరించారని ఈ వీడియోలో కస్టమర్ వాపోయారు. అయితే పంచోలి ఆరోపణలను ఎంజీ మోటార్ ఇండియా తోసిపుచ్చింది. కస్టమర్ సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని స్పష్టం చేసింది. కస్టమర్ సమస్యను పూర్తిగా పరిష్కరించినా తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించాడని ఆరోపించింది. తమ బ్రాండ్ ప్రతిష్టకు విఘాతం కలిగిస్తున్న విశాల్ పంచోలిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎంజీ మోటార్ ఇండియా పేర్కొంది. -
‘దిశ’పై సందేశం... ఒంటరిగా 3,200 కి.మీ.
జోధ్‌పూర్: హైదరాబాద్‌లో ‘దిశ’ ఉదంతంపై ఉదయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల నీతూ చోప్రా స్పందించారు. ‘దిశ’ హంతకులను తీవ్రవాదులుగా ఆమె వర్ణించారు. హత్యాచార ఘటనలను కారణంగా చూపించి, మహిళలను ఇంటికే పరిమితం చేయడం సరికాదని ఈ రాజస్తాన్ యువతి అంటోంది. మహిళలకు ధైర్యాన్నిస్తూ రాజస్తాన్‌లోని బలోత్రా నుంచి కన్యాకుమారికి 3,200 కిలోమీటర్లు ఆమె ఒంటరిగా స్కూటర్ ప్రయాణం చేయనున్నారు. ఇందుకోసం జైపూర్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కలవనున్నట్లు ఆమె చెప్పారు. ఆదివారం జోధ్‌పూర్‌లో కేబినెట్ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసి తన మిషన్ గురించి తెలియజేశారు. తనను తాను సైనికురాలిగా భావిస్తున్నానని, ఒంటరిగా ప్రయాణించడానికి భయపడనని అన్నారు. తాను ఒంటరిగా వెళ్లడానికి నిర్ణయించుకున్నానని, మధ్యలో వెనుకడుగు వేయబోనని నీతూ చోప్రా స్పష్టం చేశారు. ‘దిశ’ హంతకులను వ్యతిరేకంగా పోరాడటమే తన మిషన్ లక్ష్యమన్నారు. -
ఇషా అంబానీ పెళ్లి సందడి ఫోటోలు
-
అంబానీ దంపతుల అన్నదాన కార్యక్రమం
-
మోదీజీ మీరెలాంటి హిందువు
జైపూర్: రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో నేతల మాటల వాడి పెరిగింది. శనివారం ఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ..‘తను హిందూనంటూ ప్రధాని మోదీ చెబుతుంటారు. కానీ, ఆయనకు హిందూయిజం మూలాలు అర్థం కావు. ఆయన ఎలాంటి హిందువు?’ అని ప్రశ్నించారు. ‘హిందూయిజం సారం ఏమిటి? ప్రతి ఒక్కరిలోనూ విజ్ఞానం ఉంటుంది. మన చుట్టూతా విజ్ఞానం ఉంది. ప్రతి జీవికీ విజ్ఞానం ఉంటుంది. ఇదే కదా భగవద్గీత చెబుతోంది?’ అని అన్నారు. 2016లో భారత్ బలగాలు పాక్ భూభాగంపై చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌ను కూడా ప్రధాని మోదీ అప్పటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడుకున్నారని రాహుల్ ఆరోపించారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉండగా ఇలాంటి సైనిక చర్యలు మూడు జరిగినా అవి బయటకు వెల్లడికాలేదని తెలిపారు. యూపీఏ హయాంలో నిరర్ధక ఆస్తులు రూ.2 లక్షల కోట్ల మేర ఉండగా బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.12 లక్షల కోట్లకు పెరిగిపోయాయని విమర్శించారు. ఆ అగత్యం రాకూడదు?: సుష్మ మంత్రి సుష్మా స్వరాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘హిందూయిజం గురించి రాహుల్ గాంధీ ద్వారా తెలుసుకోవాల్సిన ఆగత్యం ప్రజలకు రాకూడదని కోరుకుంటున్నా. ఆయన మతం, కులం ఏమిటో తెలియక రాహుల్‌తోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా అయోమయంలో ఉన్నాయి’ అని ఎద్దేవా చేశారు. -
లేటు వయసులో బడికి వెళ్తున్న ఎమ్మెల్యే
ఉదయ్‌పూర్/రాజస్తాన్ : పెద్దయిన తర్వాత చదువు కొనసాగించడం అందరూ అసాధ్యమనుకుంటారు. రాజకీయ నాయకులైతే అది అసలు కుదరని పని అనుకుంటారు. కానీ చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించారు ఓ సీనియర్ ఎమ్మెల్యే. చదువుకోవాలనే దృఢ సంకల్పంతో మళ్లీ బడి బాట పట్టాడు. ఏడో తరగతితోనే ఆగిపోయిన తన చదువును గ్రాడ్యుయేషన్ వరకూ తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ రూరల్ ఎమ్మెల్యే , బీజేపీ నేత ఫూల్సింగ్ మీనా (59)కు నలుగురు కూతుళ్లు. చిన్న తనంలోనే తండ్రి చనిపోవడంతో మీనా పాఠశాల చదువును మధ్యలోనే ఆపేశారు. కుటుంబ పోషణ కోసం వ్యవసాయం పనులను చేసుకుంటూ చదువును కొనసాగించలేకపోయారు. అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు. కానీ చదువు మాత్రం పాఠశాల స్థాయికే పరిమితమైంది. ఎమ్మెల్యే అయ్యాక పదో తరగతి చదివారు. ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ‘మా నాన్న చనిపోవడంతో చదువు మానేశాను. ఎమ్మెల్యే అయ్యాక ప్రధాన మంత్రి ‘బేటి బచావో బేటి పడావో’ ప్రచారంలో భాగంగా గిరిజన బాలికల్ని విద్యావంతులు చేయడం కోసం కృషి చేయాలకున్నాను. దీని కంటే ముందు నేను విద్యావంతున్ని కావాలనుకున్నాను. నా కూతుళ్లు కూడా ప్రోత్సాహకాన్ని అందించారు. దీంతో 2013లో ఓపెన్ టెన్త్‌లో చేరాను. కానీ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో పరీక్షకు హాజరు కాలేకపోయాను. 2016లో పదో తరగతి పాసయ్యాను. 2017లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ప్రస్తుతం బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాను. విద్య అందరికి అవసరం. అందరూ చదువుకోవాలి’ అని ఎమ్మెల్యే ఫూల్ సింగ్ మీనా తెలిపారు. అంతే కాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘బేటి బచావో బేటి పడావో’ స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ బాలికలు చదువుకోవాలని ప్రచారం చేస్తున్నారు. సెంకడరీ విద్యలో 80శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఉచితంగా విమానయాన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా 2016లో ఇద్దరు విద్యార్థులు, 2017లో ఆరుగురు విద్యార్థులు విమానంలో ప్రయాణించారు. ఇక నుంచి జనరల్ విద్యార్థులు కూడా 80 శాతం మార్కులు సాధిస్తే ఉచిత విమానయాన సదుపాయం కల్పిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఏదేమైనా అటు పేద విద్యార్థుల చదువుకు ప్రోత్సహిస్తూ.. ఇటు తను చదువుకుంటూ విద్యకు వయసు అడ్డురాదని నిరూపించారు ఎమ్మెల్యే ఫూల్సింగ్ మీనా. -
నెట్ సర్వీసులను నిలిపివేయడం నేరమే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, జైపూర్, జోద్పూర్ నగరాల్లో మూడు రోజుల క్రితం అంటే, 14, 15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులను సంపూర్ణంగా షట్‌డౌన్ చేసింది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవడం వల్లనో, పిల్లలను ఎత్తుకుపోయే కిడ్నాపర్లు తచ్చాడుతున్నారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయన్న కారణంగానో, మత విద్వేషాల కారణంగానో ఇంటర్నెట్ను షట్‌డౌన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం పరీక్షల పేరిట, అందులోను పోలీసు కానిస్టేబుళ్ల నియామక పరీక్షల కోసం నెట్ సర్వీసులను నిలిపి వేశారంటే ఆశ్ఛర్యం కలుగుతోంది. రాష్ట్రంలో 13000 వేల పోలీసు ఉద్యోగాల కోసం 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో మూడు నగరాల్లో పరీక్షా కేంద్రాల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక పద్ధతుల్లో కాపీ కొట్టకుండా అభ్యర్థులను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు వివరించారు. ఇంటర్నెట్ సర్వీసులను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవడం అన్నది ప్రజల స్వేచ్ఛ. పరీక్షల పేరిట ప్రజల స్వేచ్ఛను హరించడం అన్యాయమని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. పరీక్షలకు ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారన్నది ఇక్కడ ముఖ్యంకాదని ఆ సంఘాలు పేర్కొన్నాయి. ఆ మాటకొస్తే ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ విషయంలో ఘోరంగా విఫలమవడమే అధిక పోటీకి కారణమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాపీ కొడతారన్న కారణంగా పరీక్షల సందర్భంగా ఇంటర్నెట్ సౌకర్యాలను పూర్తిగా నిలిపివేయడం అంటే నీటిని తస్కరిస్తున్నారనో, వృధా చేస్తున్నారన్న కారణంగా ప్రజలందరికి నీటి సరఫరాను నిలిపివేయడంలా ఉందని ఆ సంఘాలు ఆరోపించాయి. ప్రజల స్వేచ్ఛను హరించే ఏ నిర్ణయమైన అది నేరమే అవుతుందని విమర్శించాయి. -
మొదటి భర్త దాష్టీకం.. వీడియో క్లిప్ వైరల్
-
మొదటి భర్త దాష్టీకం.. వీడియో క్లిప్ వైరల్
తనకు విడాకులివ్వకుండానే మరో వ్యక్తితో తాళి కట్టించుకుందన్న కోపంతో రగిలిపోయిన ఓ భర్త.. దాష్టీకానికి పాల్పడ్డాడు. భార్యను, ఆమె రెండో భర్తలపై దాడి చేసి.. నగ్నంగా ఊరేగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ కావటంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. జైపూర్: ఉదయ్‌పూర్‌లోని సరేఖూర్ద్ గ్రామంలో గమేటీ కులానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయి, వేరే వ్యక్తితో కలిసి ఉంటోంది. అయితే కుల పెద్దల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావటంతో అతనితో తాళి కట్టించుకుని జీవిస్తోంది. ఈ క్రమంలో తనకు విడాకులు ఇవ్వకుండానే మరో వ్యక్తితో భార్య నివసిస్తుండటాన్ని ఆమె మొదటి భర్త సహించలేకపోయాడు. శుక్రవారం ఉదయం ఆ జంటపై దాడి చేసి వారిని నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. స్థానికులు వారిని నిలువరించకపోగా.. వీడియోలు తీస్తూ ఆనందించారు. ఘటన తర్వాత పరువు పోతుందన్న ఉద్దేశంతో బాధితురాలు కూడా గప్‌చుప్‌గా ఉండిపోయింది. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సుఖేర్ టౌన్ పోలీసులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. కేసు నమోదు చేసుకుని నలుగురు నిందితుల్లో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. -
విదేశీ జంట ప్రైవేట్ వీడియో కలకలం!
సాక్షి, ఉదయ్‌పూర్: విదేశీ జంట ఏకాంత వీడియోపై దుమారం రేగుతోంది. పోలీస్ స్టేషన్‌పై వీరు ఏకాంతంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఒక్క వీడియోతో స్థానిక పోలీసులు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు అయి ఉండి ఇలాంటి పనులకు చోటు ఇస్తారా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గోయల్ కథనం ప్రకారం.. ఉదయ్‌పూర్ పరిధిలోని ఘంటానగర్ పోలీస్ స్టేషన్ మీద కొన్ని రోజుల కిందట విదేశానికి చెందిన ఓ జంట శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట నిజమేనని, అయితే ఇది ఎక్కడ జరిగింది? ఎవరైనా మార్ఫింగ్ చేసి లీక్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. పీఎస్ మీద ఇలాంటి పనులు జరిగినట్లు తాను నమ్మడం లేదన్నారు. పోలీస్ స్టేషన్‌పైనే ఈ అసాంఘీక కార్యకలాపాలు జరిగాయని, స్థానికులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ లోపలి నుంచే టెర్రస్ మీదకు ఎక్కేందుకు వీలుండటం గమనార్హం. అంటే.. పోలీసుల సహకారంతోనే విదేశీ జంట పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద ఏకాంతంగా గడిపారని, వీడియో ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఘంటానగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
లవ్‌లో ఫేలయ్యి... జైలు పాలయ్యాడు
సాక్షి, జైపూర్ : ప్రేమ మైకంలో తప్పు చేయటం ప్రారంభించిన ఆ యువకుడికి.. తాను మోసపోయానన్న విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే చేసిన నిర్వాకానికి మూల్యం చెల్లించేందుకు ఆ తప్పును కొనగించిన ఆ భగ్న ప్రేమికుడు చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్లే... రమేష్(22) అనే యువకుడు ఏడాది అదే గ్రామంలో ఉంటున్న ఓ వివాహితతో ప్రేమలో పడ్డాడు. చివరకు ఆమెను ఒప్పించి ఇంట్లోంచి పారిపోయి పొరుగురిలో సహజీవనం చెయ్యటం ప్రారంభించాడు. దీనిని అవమానంగా మహిళ భర్త భావించి గ్రామ పంచాయితీలో ఫిర్యాదు చేశాడు. దీంతో పెద్దలు రమేష్‌కు 40,000 రూ. అపరాధ రుసుమును విధించారు. అయితే అదే డబ్బును చెల్లిస్తే... వారిద్దరూ కలిసి జీవించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె భర్త చెప్పటంతో అందుకు రమేష్ అంగీకరించాడు. ప్రేమ కోసమై... తమ సంబంధాన్ని కొనసాగించేందుకు అడ్డు తొలగిపోవటంతో ఎలాగైనా ఆ డబ్బు కోసం రమేష్ తీవ్రంగా యత్నించాడు. అయితే ఎక్కడా డబ్బు లభించకపోవటంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైకులు దొంగతనం చెయ్యటం ప్రారంభించాడు. ఇలా డబ్బును కూడబెడుతున్న సమయంలో అతనికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. లేఖ రాసి మరీ ఆ మహిళ మరో వ్యక్తితో వెళ్లిపోయింది. ‘రమేష్ కంటే ముందు నుంచే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నానని.. అతనిని విడిచి ఉండటం ఇష్టం లేదంటూ’ ఆమె లేఖలో పేర్కొంది. ఈ కథ ఇక్కడితోనే ఆగిపోలేదు. పంచాయితీ పెద్దలు ఆదేశించిన రుసుమును చెల్లించాలి కాబట్టి.. దొంగిలించిన బైకులను అమ్మేయత్నంలో రమేష్ పోలీసులకు చిక్కాడు. గత కొన్ని నెలలుగా ఆ ముగ్గురు మొత్తం 50 బైకులను దొంగిలించారని.. 38 బైకులను ఇప్పటికే అమ్మేశారని ఉదయ్‌పూర్ పోలీసులు వెల్లడించారు. అయితే వచ్చిన డబ్బుల్లో మెజార్టీ వాటాను మిగిలిన ఇద్దరే తీసుకోవటంతో తాను దొంగతనాలు కొనసాగించాల్సి వచ్చిందని రమేష్ చెబుతున్నాడు. స్టేషన్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ తన లవ్ ‘ఫెయిల్యూర్’ స్టోరీ చెబుతూ సాంత్వన పొందుతున్నాడు. -
‘పద్మావతి’ని ఆపాల్సిందే!?
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందించిన ’పద్మావతి‘ చిత్ర వివాదాలు అనూహ్య మలుపులు తిరిగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో చరిత్రలను వక్రీకరించారని ఉదయ్‌పూర్ మేవార్ రాజవంశస్థులు ఆరోపిస్తున్నారు. తమ రాజపుత్రలు చరిత్రలను వక్రీకరించిన.. ఈ చిత్ర విడుదలను నిలిపివేయాలంటూ.. ప్రధాని నరేంద్ర మోదీకి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్మన్ ప్రసూన్ జోషికి మేవార్ రాజవంశస్థుడు ఎంకే విశ్వరాజ్ సింగ్ లేఖ రాశారు. వారితో పాటు సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ, మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియాలకు కూడా లేఖ రాశారు. పద్మావతి చిత్రంలో రాజపుత్రలు చరిత్రను పూర్తిగా వక్రీకరించారని విశ్వరాజ్ సింగ్ ఆరోపించారు. హిందువుల చరిత్రను, భారతదేశ చరిత్రను కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందని సింగ్లేఖలో పేర్కొన్నారు. రాణీ పద్మావతి చరిత్రకు గురించి పరిశోధనలు చేసి చిత్రాన్ని రూపొందించానన్న భన్సాలీ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాణీ పద్మావతి గురించి భన్సాలీ.. నన్ను కానీ, మా రాజపుత్రులను కానీ సంప్రదించలేదని సింగ్ స్పష్టం చేశారు. చరిత్రను వక్రీకరించే ఇటువంటి చిత్రాలతో దేశానికి ప్రమాదమని ఆయన తెలిపారు. -
ఉదయ్‌పూర్‌లో పట్టపగలే కిడ్నాప్
-
ఉదయ్‌పూర్‌లో వ్యాపారి కిడ్నాప్ కలకలం
-
ప్రధాని మోదీకి బాసటగా నిలిచిన భార్య
ఉదయ్‌పూర్: పాత పెద్ద నోట్ల చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది విమర్శిస్తున్నప్పటికీ ఆయన సతీమణి జశోదాబెన్ మాత్రం సమర్థించారు. నల్లధనం వెలికితీయడానికి డీమోనిటైజేషన్ ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయురాలిగా రిటైరైన 64 ఏళ్ల జశోదాబెన్ బుధవారం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఒక ప్రైవేటు స్కూల్ స్వర్ణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పాత పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీజీ తీసుకున్న నిర్ణయం సరైనదే. పాత రూ. 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయడంతో దేశంలోని నల్లధనం బహిర్గతమవుతుంద’ని పేర్కొన్నారు. ‘వందేమాతరం’ తో ప్రసంగం ప్రారంభించిన జశోదాబెన్.. మహిళలు స్వశక్తితో రాణించాలని అన్నారు. సుష్మాస్వరాజ్, మాయావతి, ఇందిరాగాంధీలా మహిళలు ఆయా రంగాల్లో దూసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్యాస్ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో పేద కుటుంబాల్లోని మహిళలకు మేలు జరిగిందని తెలిపారు. చాలా మంది స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవడంతో దారిద్ర్యరేఖ దిగువనున్న కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం సాధ్యమయిందని వివరించారు. -
ఉదయ్‌పూర్ స్కూల్లో విద్యార్థులకు కఠిన శిక్షలు
-
గుజరాత్‌ను వీడిన హార్దిక్‌పటేల్
పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ (22) సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు బయలుదేరారు. ఆరు నెలల పాటు రాష్ట్రంలో ఉండకూడదన్న షరతుతో గుజరాత్ హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆదివారం ఉదయం 7.30 గంటలకు విరమ్గ్రామ్ నుంచి ఉదయ్‌పూర్‌కు హార్దిక్ బయలుదేరి వెళ్లారని ఆయన సన్నిహితుడు దినేశ్ బంభనియా చెప్పారు. అక్కడి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే, పటేళ్ల నాయకుడు పుష్కర్‌లాల్ పటేల్‌కు చెందిన ఓ ఇంట్లో హార్దిక్ ఆరు నెలల పాటు ఉండనున్నారు. దేశద్రోహం, విస్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన హింసకు సంబంధించిన కేసులో అరెస్టయిన పటేల్ కు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా, పటేళ్ల వర్గ ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వెళ్తానని హార్దిక్ పటేల్ సంకేతాలివ్వడంతో 2017 లో జరగనున్న ఎన్నికల దష్ట్యా అనేక ప్రతిపక్ష పార్టీలు హార్దిక్‌ను చేర్చుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 18 శాతమున్న పటేళ్లను ఓబీసీ కోటాలో చేర్చాలని హార్దిక్ డిమాండ్ చేస్తున్నారు. -
గుజరాత్‌ను వీడిన హార్దిక్‌పటేల్
-
బురదతో మహిళల హోలీ!
హోలీ అంటే రంగుల పండుగ. పసుపు, గులాబి, ఎరుపు, ఆకుపచ్చ.. ఇలా సప్తవర్ణాలు ముఖాల మీద పులుముకొని ఆడుకోవడం మనకందరికీ తెలుసు. కానీ ఒకే ఒక్క రంగుతో హోలీ ఆడటం ఎప్పుడైనా చూశారా? అది కూడా బురదతో!! అవును.. రాజస్థానీ మహిళలు హోలీని చాలా విభిన్నంగా చేసుకున్నారు. కెమికల్ రంగులతో పాటు ఆర్గానిక్ రంగులు కూడా అక్కర్లేదని చెబుతూ.. ప్రకృతి వైద్య చికిత్సగా భావించే మడ్ బాత్‌ను తలపించేలా బురద మట్టితో స్నానాలు చేస్తూ హోలీ పండుగను నిర్వహించారు. అందరికీ భిన్నంగా మట్టిని స్విమ్మింగ్ పూల్ గా మార్చుకొని హోలీ సంబరాలు జరుపుకున్నారు. ప్రకృతి చికిత్సా విధానంలో చర్మవ్యాధులు, చుండ్రు వంటి వ్యాధులను తగ్గించేందుకు, శరీరంలోని మలినాలను తొలగించేందుకు బురదతో చికిత్స అందిస్తుంటారు. రేగడి మట్టిని మెత్తగా బురదలా చేసి తలనుంచి పాదాల వరకూ పట్టించి, ఆరిన తర్వాత స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా వేసవిలో శరీరంలోని ఉష్ణతాపం వల్ల వచ్చే చెమట, మలినాలు బయటకు వచ్చి, చర్మవ్యాధులుంటే నశిస్తాయి. ప్రస్తుతం ఉదయపూర్ మహిళలు ఇదే పద్ధతిని హోలీతో రంగరించారు. చిన్నా పెద్దా కేరింతల మధ్య బురదలో మునిగితేలారు.